|
పరవళ్లు తొక్కుతూ కిందకు దూకే జలపాతం.. రుతువు రుతువుకు రంగులు మార్చే జలపాతం.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నయాగరా జలపాతాన్ని పోలి ఉండే జలపాతం..దేశంలోనే అతి వెడల్పైన జలపాతం..ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆ జలపాతమే ఛత్తీ్‌సఘడ్‌లోని ‘చిత్రకూట్ వాటర్‌ఫాల్స్’…
చుట్టూ కొండలు..దట్టమైన అరణ్య ప్రాంతం..ప్రకృతి ఒడిలో గలగల పారుతున్న నదిలో పడవ ప్రయాణం..కనువిందు చేసే జలపాత అందాలు… ఎంతో రమణీయం ఆ ప్రదేశం. ఛత్తీ్‌సఘడ్‌లోని జగ్దాల్‌పూర్‌కి 50 కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్ జలపాతం ఉంది. వింధ్య పర్వత శ్రేణుల్లో పరుగులు పెట్టే ఇంద్రావతి నది నుంచి ఈ జలపాతం ఏర్పడింది. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి నీటి ధారలు పడుతుంటాయి.
– జలపాతాలు చూడటానికి గుర్రపు డెక్క ఆకారంలోనే ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. – వేసవి కాలంలో నీరు ఎక్కువగా ఉండకపోయినప్పటికి వర్షాకాలంలో జలపాతం హోరున శబ్దం చేస్తుంటుంది. వర్షం వెలిశాక నీటి ధారలపై ఇంద్రధనుస్సు రంగులు పడడంతో జలపాతం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వర్ష రుతువులో ఈ జలపాతం దాదాపు 1000 అడుగుల వెడల్పుతో పరవళ్లు తొక్కుతుంది. ఈ జలపాత అందాలు చూడటానికి సరైన సమయం వర్షాకాలం. జోరుగా వానలు కురవడంతో చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతం కొత్త చివుళ్లు తొడుక్కొని పచ్చ రంగు పులుముకుంటుంది. ఆహ్లాదకర వాతావరణానికి తోడు రకరకాల పక్షులు జలపాత పరిసరాల్లో సందడి చేస్తుంటాయి. వర్షపు నీళ్లు మట్టితో కలవడం వల్ల జలపాతం ఎర్ర రంగులోకి మారుతుంది.
– చిత్రకూట్ జలపాతానికి ఏ రుతువులోనైన వెళ్లవచ్చు. కానీ జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఎక్కువ నీటితో జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది.
– సూర్యుడు మనకు గుడ్ మార్నింగ్, బై బై చెప్పే సమయాల్లో అంటే ఉదయించే, అస్తమించే సమయాల్లో జలపాతం అందాలు చూడడం నయన మనోహరం. ఇంకా చెప్పాలంటే అద్భుతమనే చెప్పాలి.
– వర్ష రుతువులో ఎర్రగా మారిన నీళ్లు శీతాకాలం వచ్చే సరికి పాలలాంటి తెలుపుతో కిందకు దూకుతుంటాయి.
– ఈ జలపాతానికి సమీపంలో శివాలయం, పార్వతి గుహలు కూడా ఉన్నాయి. జలపాతం తీరంలో అనేక చిన్న చిన్న శివలింగాలు, త్రిశూలం, వినాయక, శివ విగ్రహాలున్నాయి.
– సహజ సిద్ధమైన ఈ జలపాతాన్ని ప్రభుత్వ పర్యాటక శాఖ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దింది. పర్యాటక శాఖనే ప్రత్యేకంగా ఓ హోటల్‌ని ఏర్పాటు చేయడంతో పాటు, పిల్లల కోసం పార్కులు కట్టించింది. రాకపోకల కోసం రోడ్లు బాగు చేయించింది. సందర్శకుల కోసం చిన్న చిన్న కుటీరాలను ఏర్పాటు చేసింది.
– చిత్రకూట్ వాటర్‌ఫాల్స్‌ని చూడటానికి మన దేశంతో పాటు, విదేశీ సందర్శకులు కూడా వేల మంది |

