గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 213-మహా పండితకవి- వాసుదేవుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

213-మహా పండితకవి- వాసుదేవుడు

మహర్షి ,గోపాలి ల పుత్రుడు వాసుదేవుడు .పయ్యూరు భట్ట మన   బ్రాహ్మణ మహా విద్వాంసుడు .పదిహేనవ శతాబ్ది చివరి కవులలో సుప్రసిద్ధుడు .మహర్షికి తొమ్మిది మంది కొడుకులు .అందరూ అందరే మహా శాస్త్రాలలో నిపుణులు .కుమార్తె కొడుకు పేరు వాసుదేవుడు .మహా వ్యాకరణ వేత్త .

వాసుదేవుడు ఉద్దండుని మిత్రుడు కనుక 1423కు చెందినవాడు .కాలికట్ రాజు మన విక్రమ జమోరి అతని కి ఆస్థానం లో పదవినిచ్చాడు ఉద్దండుని కోకిల సందేశానికి దీటుగా’’ భ్రమర సందేశం’’ లేక భ్రమర దూతం రాశాడు .తర్వాత రవి వర్మ గోదావర్మల ఆస్థానం లో ఉన్నాడు .పాణిని వ్యాకరణం పై విపులమైన వ్యాఖ్యానంగా ఉదాహరణలతో  ‘’వాసుదేవ విజయం ‘’రచించాడు .పూర్తీ చేయలేక పొతే సోదరి కుమారుడు మేనల్లుడైన  నారాయణ కవి పూర్తీ చేసి ‘’దాతుకావ్యం ‘’అని పేరు పెట్టాడు.

ఆరు  ఆశ్వాసాల ‘’దేవీ చరిత ‘’రాశాడు .ఇది వేదారణ్యం లో పూజింపబడే గోపాలీ దేవి చరిత్ర .ఈమె కృష్ణుని సోదరి. దేవకీ దేవికి ఎనిమిదవ సంతానం .’’సత్య తాప కదా ‘’కావ్యం లో మూడు ఆశ్వాసాలలో సత్య తాప లేక మహర్షి జీవిత చరిత్రను వర్ణించాడు .తన పూర్వీకుడైన మహర్షి వేదారణ్యం లో నీలా నది ఒడ్డున  తపస్సు చేసి మోక్షం పొందిన కద ఇది .నీల నదినే ఇప్పుడు భారతప్పోల నది అంటారు .’’శివోదయమ ‘’కావ్యం లో తన చరిత్ర తన ఎనిమిది మంది సోదరుల చరిత్ర  రాసుకొన్నాడు వాసుదేవుడు .యమకం లో రాసిన ‘’అచ్యుత లీల ‘’లో వేదారణ్యం లో అర్చింపబడే అచ్యుత దేవుని గురించి ఉంది .’’గజేంద్ర మోక్షం ‘’కూడా రాశాడు ..పదమూడు కాండల ‘’పాండవ చరిత్ర ‘’దొరికింది .కాని కవిపేరు మాత్రం లేదు .అందులో వాసుదేవకవి ‘’పార్ధ కద ‘’అనే యమక కావ్యం రాసినట్లు ఉన్నది .ఇది అర్జునునికద .అలాగే ‘’అర్జున రావణీయం ‘’అనే పదిహేడు కాండల కావ్యం లో రావణ కార్తవీర్యార్జున యుద్ధం వర్ణింప బడింది .ఇది పాణిని అస్టాధ్యాయికి ఉదాహరణ కావ్యం .వాసుదేవుడు వ్యాఖ్యానమూ రాశాడు .దీని వ్రాత ప్రతి మలబారు లో దొరికింది .మహర్షి కుటుంబ సభ్యులు ఈ రెండుకావ్యాలనూ పూర్తీ చేశారని భావించారు .

214-రెండవ వాసు దేవకవి

‘’రామకధ’’అనే గద్య కావ్యం రాసిన వాసుదేవ కవి ఉమా ,నారాయణుల కొడుకు .ఆదిత్య వర్మ రాజు ఆస్థానం లో 1472-1484కాలం లో ఉన్నాడు .రాజా రవి వర్మ ఆస్థానం లో ఉండి ‘’గోవిన్దచరిత్ర ‘’,’’సంక్షేప భారతం ‘’,సంక్షేప రామాయణం ‘’రాశాడు .ఈ నారాయణుడు మహర్షికి ఎనిమిదవ కుమారుడు అయిఉంటాడు లేక మహర్షి కుమార్తె కొడుకు అయి ఉండచ్చు .

215-స్తోత్రకావ్య మణిపూస –‘’నారాయణీయం’’ రచించిన -భట్టాహిరి లేక భట్ట పాద నారాయణ కవి

దేవికా క్షేత్రమైన చంద్రనక్కావు లో నారాయణకవి జన్మించాడు .ఇదిమలబారులో ఉంది .అక్కడి దేవి కి నారాయణ మహా భక్తుడు .తండ్రి మాత్రు దత్తుడు గొప్ప విద్వాంసుడు .తల్లి పయ్యూరు పట్టేరి కుటుంబానికి చెందినది .1560-1646 కాలం వాడు .వయసు చాలాగాడిచి పోయేదాకా చదువు అబ్బలేదు  తిక్కనిత్యూర్ కు  చెందినా పిసరోటి కుటుంబానికి చెందిన ఆమెను వివాహం చేసుకొన్న తర్వాత అచ్యుత పిసరోట్టి దగ్గర చదువు నేర్చాడు .కాని పిసరోట్టి వేదాలు బోధించే అర్హత కలవాడుకాడు .కాని నారాయణకు తప్పులతోనే వేదాలు నేర్పి ఫలితంగా’’ వాత రోగానికి’’ గురైనాడు .తాను  నేర్చిన తంత్ర విద్య తో గురువు రోగాన్ని  తనకు వచ్చేట్లు చేసుకొన్నాడు శిష్యనారాయణ  .గురువాయూర్ శ్రీ కృష్ణునిపై ‘’నారాయణీయం ‘’గానం చేయగా వ్యాధి పూర్తిగా నయమై పోయింది .ఆయురారోగ్యాలతో దీర్ఘ జీవితం సిద్ధించింది .నారాయణీయం ను లక్షా డెబ్బై ఒక్క వేల రెండు వందల పది రోజుల్లో 1585లో పూర్తీ చేశాడు .ఆధ్యాత్మిక గ్రంధాలలో నారాయణీయం కు విశిష్ట స్థానం ఉంది .

జీవిత కాలం లోనే నారాయణ పేరు ప్రఖ్యాతులు దేశమంతా వ్యాపించాయి .కాశీలోనిసిద్ధాంత కౌముది మొదలన వ్యాకరణ గ్రంధాలు రాసిన  భట్తోజీ దీక్షితుల చెవిన పడింది .సంబర పడి పోయాడు .దక్షిణ దేశమంతా పర్యటింఛి నారాయణ ను చూడటానికి వచ్చాడు .అప్పటికే నారాయణ పరమ పదించాడని తెలిసి విచారించి  ఇక మరెవ్వరినీ చూడక్కరలేదని బెనారస్ చేరుకొన్నాడు .రఘునాధ నాయకుని ఆస్థాన కవి పండితులకు భట్తోజీ ప్రతిభ తెలుసు .ముఖ్యం గా మంత్రి ,సాహిత్య రత్నాకరం రాసిన యజ్ఞనారాయణ దీక్షితులు భట్టాహిరి  తో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవాడు .కొచ్చిన్ రాజు ఆస్థానం ను భట్టాహరి సందర్శించాడు .వీరకేరళ రాజుపై ప్రశంసలు చేశాడు .తన మత్స్యావ తార చంపు ‘లో రాజా రవి వర్మను పొగిడాడు .

స్తోత్ర కావ్యాలలో భట్టాహిరి రాసిన ‘’నారాయణీయం ‘’కు విశిష్టమైన గౌరవం ఉంది .ఇది వెయ్యిశ్లోకాలపైన ఉన్న గ్రంధం.భాగవత హృదయాన్ని ఆవిష్కరించిన కావ్యం .ప్రతి శ్లోకం గురువాయూర్ శ్రీకృష్ణ ను ఉద్దేశించే చెప్పాడు .కేరళలోని ప్రతి ఆస్తిక మహాశయుడు నారాయణీయం లోని శ్లోకాలలో కొన్నిటినైనా రోజూ పఠిస్తారు  .అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్య స్వామికి దీటుగా అభి వర్ణించాడని భావిస్తారు .ఒక రకం గా విష్ణు సహస్రనామ స్తోత్రానికి మహా భాష్యం అనచ్చు .

నారాయణ కవి బహు ప్రబంధాలు రాశాడు. విచిత్ర చంపువులను సృష్టించాడు .ఆయన రాసిన వాటిలో కొన్ని –రాజ సూయ ,దూత వాక్య ,పాంచాలీ స్వయం వరం ,ద్రౌపదీ పరిణయం ,సుభాద్రాహరణం ,కిరాత,భారతయ్యుద్ధం ,స్వర్గా రోహణం ,మత్స్యావతారం ,శ్యమంతకం మొదలైనవి .సుమధుర కవిత్వం తో మానసికోల్లసం చేశాడు’’ నారాయణీయకవి ‘’నారాయణ భట్టాహిరినారాయణ .నారాయణీయం తో చిరస్మరణీయుడయ్యాడు  .ఈయన కుమారుడు క్రుపాకవి ‘’తారాశశాంకం ‘’రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-15 ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.