గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
226- తర్క చూడామణి- ఆనంద చరణ్
కాళీ కింకర ఠాకూర్ కుమారుడైన ఆనంద్ చరణ్ బెంగాల్ కు చెందిన రాదియా శ్రేణి బ్రాహ్మణుడు. బెంగాల్ లోని నౌ ఖాళీ జిల్లా సోమ్పాద గ్రామంలో 1862 లో జన్మించాడు. ఆ కుటుంబంలో తాంత్రిక స్వామి’’ సర్వానంద సర్వ విద్య’’ గొప్ప పేరున్నవాడు. కలకత్తా, బెనారస్ లలో విద్య నేర్చి తర్క చూడామణి మహా మహోపాధ్యాయ బిరుదులు పొందాడు. నౌ ఖాలీలోని సంస్కృత కళాశాలలో మీమాంస , సాంఖ్య శాస్త్రాలలో ఆచార్యునిగా పని చేసి యోగ శాస్త్రాచార్యులుగా బెనారస్ విశ్వ విద్యాలయంలో ఉన్నాడు. ‘’సుప్రభాత,’’,’’ బెనారస్’’ పత్రికలకు సంపాదకునిగా పని చేసినాడు. యవ్వనంలోనే రచనలను చేయటం ప్రారంభించాడు. వివిధ శాస్త్రాలపై బహు గ్రంథ రచయిత. “రామాభ్యుదయం”,”మహాప్రస్థానం”, “సుమనోంజలి”, “కావ్య చంద్రిక” వంటి అలంకార గ్రంథాలను రచియించాడు. ఇంతటి ప్రతిభావంతుడు అలనాడు అరుదు. పదవీ విరమణ తర్వాత సరస్వతీ సేవలో జీవితం ధన్యం చేసుకున్నాడు.
227- భామినీ విలాస కర్త –గురూపాసనా భట్టాచార్య
1882 లో రాకాలీ దాస భట్టాచార్య, క్రుష్ణసఖీ దేవి దంపతులకు జన్మించాడు. మౌద్గల్య గోత్రానికి చెందిన బెంగాలీ భాహ్మణుడు. కాశీ రామ వాచస్పతికి వారసుడు. స్మ్రుతులపై సాధికారత కలవాడు. విద్యకు కేంద్రమైన భాత్ పారా చదివి కలకత్తా విశ్వవిద్యాలయంలో, బెనారస్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చేసి 1921 నుండి ఢక్క యౌనివర్సిటీలో సంస్కృత ఆచార్యునిగా పని చేసాడు. బహు గ్రంథ కర్త. “శ్రీ రాస మహా కావ్యం”, “మధురం”, “వరూధినీ చ౦పు” రాసాడు. ఆరు అంకాల “నా భాగ చరిత్ర” నాటకం, ఏడూ అంకాల ‘’మదాలస కువలయాస్వ ‘’నాటకం, ఆరు అంకాల’’ భామినీ విలాసం’’ నాటకం రచించాడు. వీటిల్లోని కవిత్వం పరమోన్నతంగా, ప్రాశాస్త్యంగా ఉంటుంది.
228- వేదాంతాచార్యులు -ప్రమథ నాథ తర్క భూషణుడు
మహామహోపాధ్యాయులైన ప్రమథ నాధుడు తారాచంద్ర రామ రంగినీ దేవిల పుత్రుడు. బెంగాల్ లోని భాట్పారాలో 1866 లో పాశ్చాత్య వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. వశిష్ట గోత్రీకులు. న్యాయ రత్న రాఖాలదాసు, శిలాచంద్ర, సార్వభౌమ, కైలాస చంద్ర శర్మ వంటి ఉద్దండ పండితుల వద్ద శాస్త్రాలు నేర్చాడు. కలకత్తా సంస్కృత కళాశాలలో వేదాన్తాచార్యునిగా పని చేసాడు. తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రాక్ విద్య విభాగంలో పని చేసాడు. వివిధ శాస్త్రాలపై గొప్ప రచనలు చేసాడు. “కోకిల దూత”, “రస రసోదయం”, “ విజయ ప్రకాశం” కావ్యాలు రచించాడు. ఇతని తండ్రి తారాచంద్రుడు కాశీ రాజ్య ఆస్థాన పండితుడు. “కానన శతకం”, “రామ జన్మ భాణం”, “శృంగార రత్నాకరం” ఈ కవి ఇతర రచనలు.
229- భారత దేశ గ్రంథాలయ ఉద్యమ పితామహుడ రాజా క్షితేంద్ర దేవ్
బెంగాల్ కు చెందిన బాన్స్ బెరియా రాజు రాయ్ మహాశాయుడైన రాజా క్షితేంద్ర దేవుడు 1876 లో జన్మించాడు. రాజా పురేంద్ర దేవ్ కు పెద్ద కొడుకు. తల్లి సకలాదేవి. కాశ్యపస గోత్రం. బెంగాల్ ఉన్నత వర్గాలలో పేరు పొందిన వాడు క్షితేంద్ర దేవ్. ఈ రాజు లు సమాజ సేవలో ధన్యమైనారు. ఈ వంశంలో మొదటి వాడైన దేవాదిత్య హూలినిసం సిద్దాంతంలో ప్రసిద్ధుడైన బల్లల దేవుని సమకాలికుడు. 1680 లో పాతూలీ నుండి బన్స్ బెరియాకు రామేశ్వర్ దేవ్ రాజ పీఠాన్ని మార్చాడు. ఇతని ఆస్థానంలో గొప్ప విద్వాంసులు ఉండేవారు. సంస్కృతంలో నిష్ణాతులైన వారిని ఉపాధ్యాయులుగా నియమించి టోల్స్ అనబడే సంస్కృత కళాశాలను ఏర్పరచారు. బెంగాల్ ఉన్నత విద్యావంతుడు అయిన జగన్నాధ పంచానన్ మొదలైన వారు ఇతని మొదటి శిష్యులు. క్రిస్తీంద్ర తండ్రి అయిన పూర్నేన్దుడు అనేక సంస్కృత కళాశాలల ను ఏర్పరచి ఆనాటి ప్రసిద్ధ ఆస్థాన కవులచేత ‘’కాళి అర్చన విధి ‘’ అనీ కాళీ దేవి పూజా విధానాన్ని రూపొందించాడు. సురేంద్ర మోహన దేవ శర్మ, ధర్మాదిత్య, ధర్మా చార్యాలు ఈ రాజవంశ చరిత్రపై మొఘలాయీ రాజులు కూడా వీరిని మెచ్చు కున్నారు.
క్షితేంద్ర దేవుడు రాజు మాత్రమే కాక గొప్ప కవి కూడా. లఘు కావ్యాలు చాలా రాశాడు. ఇతను అనేక గ్రంథాలయాలు స్థాపించటం చేత “భారత దేశ గ్రంథాలయోద్యమ పితామహుడు” అని బిరుదు పొందాడు. బెంగాలీ భాషలో మొదటి పత్రిక “పూర్ణిమ” ను నిర్వహించాడు. ఇతడు కాళీ మాతకు మహా భక్తుడు. కలకత్తాలోని కాళీ ఘాట్లో అమ్మవారి ఆలయం దగ్గర నివసించేవాడు. బెగాల్ లో ప్రసిద్ధ శిల్పకళకు ప్రసిద్ధి చెందిన హంసే శ్వరీ దేవాలయాన్ని రాణీ శంకరీ 1814 లో నిర్మించింది.
230- గద్య భారత చరిత్ర కర్త విదు శేఖర భట్టా చార్య
త్రైలోక్య నాధుని కుమారుడైన విదు శేఖరుడు బెంగాల్ లో మాల్దా జిలాలో హరిశ్చంద్ర పురంలో 1879 లో జన్మించాడు. శాంతినికేతన్ లో కొంత కాలం చదివి కలకత్తా వర్సిటీలో సంస్కృతాచార్యులుగా పని చేసేవాడు. అతని విద్వత్తు అనేక గౌరవాలు, బిరుదులూ పొందాడు. ఆయన రాసిన “మిలింద ప్రశ్న” కావ్యాన్ని ఆయన నోట వింటుంటే లోకాన్ని మరచిపోతాము. “మాతృ ఘోషి” అనే జర్నల్ ను నడిపాడు. “సంక్షిప్త చంద్రిక” పత్రికలో అనేక పద్యాలు, పాటలు రాశాడు. వివిధ పత్రికలలో సంస్కృత రచనలపై వచనాలు చేశాడు. “నాగిలా”, బద్ధ విహంగ, క్షత్ర కథ –(బుద్ధ కథలు), భారత చరిత్ర అనే గ్రంథాలు రాశాడు. కాళీ దేవిని స్తుతిస్తూ దుర్గా సప్త శతి రాసాడు.
231- బెంగాల్ కవయిత్రులు
13 ఏళ్ల రత్నీ దేవి రఘు వంశాన్ని వచన కావ్యంగా రాసింది. రమేశ్చంద్ర కుమార్తె అయిన శాంతసేన 1910 లో జన్మించంది. కలకత్తాలోని ఆశుతోష్ కాలేజీలో సంస్కృతా చార్యునిగా పనిచేసింది.
జ్యోతీ చంద్ర సేన్ భార్య మాలతీ సేన్ 19౦౩ లో జన్మించి కలకత్తా వర్సిటీలో డిగ్రీ సాధించింది. సాహిత్య అలంకార శాస్త్రాలపై అనేక వ్యాసాలూ రాసింది. వామనుడి “కావ్యాలంకార సూత్రాలకు” గొప్ప వ్యాఖ్యానం చేసింది. సతీంద్ర దేవుని భార్య ఉమాదేవి ‘’ఆభానక మాల’’ అనే కావ్యం రాసింది.
232- ఉపాఖ్యాన రత్నమాల కర్త అనంగారాచార్య
అన్న రంగాచార్య అనే ప్రతివాద భాయంకరాచార్య కుటుంబంలో తమిళనాడుకు చెందిన కంచిలో అనంగారాచార్య 1891 లో జన్మించాడు. రామానాజుడు స్థాపించిన 74మతాదికారులలో ఉడుమ్బై నమ్బికి చెందిన వారసుల కుటుంబం ఇది. విశిష్టాద్వైత మతస్తులు. వీరి వంశపు అనంతాచార్య్డుడు పుష్కర దేవాలయ పూజా విధానాన్ని సమూలంగా మార్చాడు. దీనినే ఇప్పుడు అందరూ ఆచరిస్తున్నారు. అనంగారాచార్య కంచి లోని వేదవేదాంత వైజయంతీ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేసాడు. మత గ్రంథాలపై ఆయన రాసిన గ్రంథాలు, ఉపన్యాసాలు బహుళ ప్రచారం పొందాయి. అనేక శాస్త్రాలపై చాలా గ్రంథాలు రాసాడు. ఈయన గ్రంథాలలో ముఖ్యమైనవి “ఉపన్యాస రత్న మాల”, “ఉపాఖ్యాన రత్న మాల”, “ రామాయణ దండకం”, “యదునందన చరితామృతం” గొప్ప వచన రచనలు. కోకిల సందేశ కావ్యం ప్రసిద్ధి చెందినది. తమిళ దివ్య ప్రబంధాలపై సాధికారత కలవాడు.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-15-ఉయ్యూరు

