ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -68
29 మానసిక విశ్లేషణ పిత -సిగ్మండ్ ఫ్రాయిడ్-2-(చివరి భాగం )
ఫ్రాయడ్ సాధించిన విజయాలను కొందరు తక్కువగా అంచనా వేసినప్పటికీ వియన్నా యూనివర్సిటీ పదవీ గౌరవం కల్పించ్నప్పటికీ ఫ్రాయడ్ రాసిన పుస్తకాలు వేలాదిమందినీ స్పెషలిస్టులను ఆకర్షించి ఉత్తేజం కలిగించాయి. నలఫై ఏళ్ల నడి వయస్సులో ఫ్రాయడ్ ఒక తుఫాన్ కేంద్రమయ్యాడు. ఆయన దగ్గర చదువుకోటానికి కార్ల్ జంగ్, ఆల్ఫ్రెడ్ ఆడ్లర్, ఆటో రాంక్, థియోడార్ రీగ్, ఎ. ఎ. బ్రిల్, ఎర్నెస్ట్ జోన్స్, విల్హే౦ స్టేకేన్, ఆన్నస్ స్టాచ్ మొదలగు ప్రసిద్ధులు వచ్చ్చారు. వీరిలో అందరూ ఎవరి స్థాయిలో వారు గొప్పవారే. ఇందులో చాలామంది ఆయనతో విభేదించి వాదానికి దిగినా ఆయనను తండ్రిగా, దేవునిగా భావించి ఆరాధించారు. ఫ్రాయడ్ సిద్ధాంతాలను మెరుగుపరచడానికి తోడ్పడ్డారు. ముఖ్యంగా జంగ్ ఫ్రాయడ్ చెప్పిన సెక్షవల్ సైకలాజికల్ ఇన్స్పి రేషన్ ను అంగీకరించలేదు. ఇతను సామూహిక అంతరంగాన్ని గురించి కొత్తగా చెప్పారు. ఇవి మనిషి ప్రాథమిక దశ లోని జ్ఞాపకాలు, వ్యక్తిత్వంలోని భాగాలు. ఎడ్లర్ సెన్స్ అఫ్ ఇనాడిక్వసీ డెవలప్ మెంట్ ప్రమాదంగా భావించాడు. రాంక్ పుట్టుకలోని గాయాలపై దృష్టి పెట్టాడు. దీని వలన జరిగే షాక్ జీవితంలో తర్వాత ఆందోళనలు గా మారతాయని రక్షణ నుండి విడిపోతారని పోరాటానికి దూరమైపోతారని అన్నాడు. ఎవరు ఏరకంగా చెప్పినా ఫ్రాయడ్ మూల సిద్ధాంతాన్ని కాదనలేదు.
50 వ ఏట ఫ్రాయడ్ సంప్రదాయ అసూయగల టీచరు లాగా కన్పించేవాడు. బలహీనమైన శరీరం, చిన్న గడ్డం, తీక్షణమైన కళ్ళు ఇందులో ధ్యాన మగ్నత కన్పించేవి. అతని భార్య పిల్లలు ఇంటిని చక్కగా దిద్దుకునేవారు. పిల్లరు జ్యూస్ లాగా పెరిగారు. యాంటి సేమిటిజం కాలంలో ఇలా పెంచటం కష్టంగా ఉండేది. దీనిపై స్పందిస్తూ ఫ్రాయడ్ ” life is a problem for everybody. Besides you can’t expect to be a Jew for nothing” అన్నాడు. అరవై పడిలో ఈ జ్యూయిష్ సైంటిస్ట్ శారీరక, మానసిక క్షోభను అనుభవించాడు. మొదటి ప్రపంచ యుద్ధం మానసికంగా ఎదురు దెబ్బ తగిలించింది . హేతువుపై పిచ్చితనం విజయం సాధించి నాశనం చేసింది. దానితో పాటు స్వయంగా కూడా నష్టపోయాడు. ఇద్దరు కొడుకులు జర్మనీ తరపున యుద్ధం చేసారు. స్నేహితులు, శిష్యులు ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు పోరాడారు. చలి, ఆకలి పరిస్థితులను మరింత కష్టతరం చేసి విషాద వేదాంతిగా మారి పోయాడు. మోసగించక, మోసగి౦పబడక జీవితానికి ఎదురీదాడు. అరవై ఏడావ ఏట మరింత లోతుగా అధ్యయనం చేసాడు. మొదటి ఆపరేషన్ దవడ ఎముక కాన్సర్ కు చేయించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత అనేక ఆపరేషన్స్ జరిగాయి. మనిషి మానసిక స్థితిని గురించి అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. సాంస్కృతిక పరాక్రమానికి అతని సృజనాత్మకతలపి దృష్టి సారించాడు. తన జీవిత ధ్యేయం “Making life long detour through the natural sciences medicines and psycho therapy” అని చెప్పాడు. 19 25 లో స్వీయ జీవిత చరిత్ర రాస్తూ తనను యవ్వనంలో ఆకర్షించిన సాంస్కృతిక సమస్యలపై దృష్టి పెట్టాను అన్నాడు. ముసలి సైంటిస్ట్ యువ దార్శినికుడు కలిసి పోయారు.
కొంతకాలం తర్వాత ఆటో బయోగ్రఫీ రాస్తూ అజ్ఞాత మానసిక స్థితి (id), అహంపై అధ్యయనం చేస్తూ అస్వాధీనమైన శక్తులు యదార్థాన్ని సాధించడం అహం పెరిగి విపరీత అహం ఏర్పడి హింసాత్మక చర్యకు పాల్పడుతుందని చెప్పాడు. ఇక తాను సైకో అనాలసిస్ పై నిర్ణయాత్మక విదానాలేమీ చెప్పకర్లేదు అని చెప్పాడు. ఇప్పటిదాకా చెప్పినదానిపై అనవసరమైనది కూడా ఉండి ఉండవచ్చని దీనిపై ఎవరో ఒకరు కొత్త విషయాలు చేర్చవచ్చని అన్నాడు. ఇది కొంచెం తనను తాను తక్కువ చేసి చెప్పుకున్నట్లు ఉన్నప్పటికీ 71 వ ఏట ‘’The Future of an illusion ‘’ను రాసి ప్రచురించాడు. 74 వ ఏట ‘’సివిలైజేషన్ అండ్ ఇట్స్ డిస కన్టేన్త్స్(నాగరికత- అసంతృప్తి) పై విచారించాడు. తనకు తెలిసిన ప్రపంచం కూలిపోతో౦దదేమో అని భయపడ్డాడు. జంగ్ మొదలైన సైంటిస్టులు మానవతకు పూర్తీ వ్యతిరేకులయ్యారు. కానీ నిజానికి ఫ్రాయడ్ వియన్నాలో అతి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాడు. మొదటి సారిగా జనం మధ్య అనార్యులకు చెందిన పుస్తకాలను తగలపెడుతూ ఫ్రాయడ్ పుస్తకాలను 1933 లో అగ్నికి ఆహుతి చేసారు. దీనిపై “Atleast I have been burnt in good company. “అని స్పందించాడు. 77 వ ఏట ఆకస్మిక ఆపద మీదపడింది. అయినా తట్టుకుని ఉన్నాడు. 81 వ ఏళ్ళు వచ్చాక హిట్లర్ ఆస్త్రియాను ఆక్రమించాడు. జర్మన్ సామ్రాజ్యంలో కలిపాడు. ఫ్రాయడ్ పాస పోర్ట్ ను నాజీలు లాగేసుకున్నారు. డబ్బును దోచుకుని అతని ప్రచురణ సంస్థను నాశనం చేసారు. స్నేహితులు ఫ్రాయడ్ లండన్ పారిపోవటానికి సహకరించారు. 82 వ ఏట తన సైకో అనాలసిస్ పై రాస్తూ దాని ఉద్దేశ్యం “Naturally not compel belief or to establish conviction”అని వివరణ ఇచ్చాడు. 83 వ ఏట ప్రవాసంలోనూ బాధలు ఎక్కువయ్యాయి. క్రమం గా బలహీనుడై 83 వ పుట్టినరోజు జరిగిన నాలుగు నెలల తర్వాత హామ్ స్స్టెడ్ లోని సొంత ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. 23-9-19 39న మానసిక విశ్లేషణ పితామహుడు మరణించాడు.
ఫ్రాయడ్ మరణం తర్వాత అతని సిద్దాంతాలు ప్రతి మానవ ఆలోచనను ప్రభావితం చేశాయని భావించారు. ఫ్రాయడ్ తర్వాత మానవాళిని ప్రభావితం చేసిన ఇద్దరు మహా వ్యక్తులు కార్ల్ మార్క్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాత్రమే అని చెప్పవచ్చును. వీరు ముగ్గురు తమ జీవితకాలంలోనే మరియు తర్వాత ప్రభావం చూపగలిగారు. 1950 నాటికి ఫ్రాయడ్ సైకో అనాలసిస్ మీద నాలుగు వేల ఏడూ వందల ముప్పై తొమ్మిది రచనలు చేసినట్లుగా గుర్తించారు. 1950 కి ఈ సంఖ్య రెట్టింపైంది. ఇంగ్లాండ్ అమెరికా మొదలగు దేశాలలో సైకో అనలటికల్ జర్నల్స్ వచ్చాయి. మానవ ప్రయత్నంపై అనేక రంగాలలో ఫ్రాయడ్ ప్రభావం ఉందని కను గోన్నారు న. మొదట వ్యతిరేకించినా అందరూ అంగీకరించారు. ఫ్రాయడ్ రాసిన ‘’Totem and Taboo’’ గ్రంథం కొత్త సైకో అనలటికల్ ఆన్త్రోపాలజీలో ఏర్పరచింది. అతని ‘’Civilisation and discontent”లో మనిషి నైతిక శిక్షణకు లోపలి అనైతికతకు మధ్య పోరాటాన్ని తెలియచేసింది. ఆయన రాసిన ‘’The future of an illusion ‘’మరియు ‘’Moses and Monothisms లు “Opened one of the most passionate and revealing and instructive debates on the problem of religious faith “ అని విశ్లేషించారు. మనిషిని అతని ప్రేరణను వేరుచేసి శక్తివంతుడిని చేసి అతని బాధ్యతలను పరిపూర్ణంగా గుర్తించప జేసి పనిచేయించటమే ఫ్రాయిడ్ చేసిన ఆలోచన. ఈ విషయాలపై అనేక నాటకాలు, గ్రంథాలు వచ్చాయి. ఫ్రాయడ్ ప్రభావం జేమ్స్ జాయిస్ పై పడి అతని’’ స్త్రీం అఫ్ కాన్షస్ నెస్’’ (చైతన్య స్రవంతి)కు కారణమైంది. అలాగే డి .హెచ్ .లారెన్స్ పై కూడా ప్రభావం చూపింది. ప్రముఖ నాటక కర్త యూజీన్ ఓ నీల్ పై ప్రభావం కల్గించి అతని “ఇంటీరియర్ మోనోలోగ్” నాటకాల సృష్టికి కారణమయ్యాడు. థామస్ మాన్ కూడా ‘’పవర్ ఆఫ్ అన్ కాన్షస్ ‘’ పై అనేక రచనలు చేసాడు. సైకాలజీని అవాస్తవికతను కవిత్వాన్ని, విశ్లేషణను కలిపి రాసానని మాన్ చెప్పాడు. “We shall one day recognize in Freud’s life work the corner stone for the building of new anthropology.” అని ఘంటాపధంగా చెప్పాడు మాన్. స్వేచ్చ గల అంతరాత్మతో మానవాళి జీవించాలని ఫ్రాయడ్ ఉద్దేశ్యం. ఆధునిక శాస్త్ర జ్ఞానం మనిషి తనపై ఉన్న విశ్వసాన్ని పెంచింది. డార్విన్ సిద్ధాంతానికి ఫ్రాయడ్ సిద్ధాంతం అదనపు ఆకర్షణ అయ్యింది. “It was Freud who replaced Locke’s essentially blank aesthetically and emotionally empty soul and Darwin’s merely biological behavioristic man with an emotional being a being of whom passion is the essence. This is the kind of scientifically conceived person with whom the arts and their emotional and vivid esthetic material can best function”.
ఇంత గొప్ప పని చేసినా ఫ్రాయడ్ పై పొగడ్తల కంటే తెగడ్తలే ఎక్కువ. అతని సైకో అనాలసిస్ ను కమ్యూనిస్ట్ లు బూర్జువా తత్వంగా భావించి రష్యాలో అనుమతించలేదు. కాథలిక్ చర్చ్ విషపు బోధనలగా భావించి ఫ్రాయడ్ సిద్ధాంతం నమ్మిన వారు పాపాల పాలౌతారని హెచ్చరించింది. మానసిక శాస్త్రవేత్తలు ఏకమై ఆయన పూర్వ శిష్యులతో కలిసి ఫ్రాయడ్ నిర్ణయాలపై దాడి చేసారు. “The case against psycho analysis”అనే పుస్తకంలో అండ్రూ సాల్టర్ర్ ‘’ఫ్రాయడ్ మానసిక పాఠం తప్పుల తడక అని చిత్రమైనదని అవి కొల౦బస్ ముందున్న న్యూ వరల్డ్ మేపుల వంటివి ‘’ అన్నాడు. ఫ్రాయడ్ స్థితిని హాస్యాస్పదమైనదని పూర్తీ అశాస్త్రీయమైనదని అవివేకమైనదని అన్నాడు. ఎమిల్ లుడ్విగ్ తీవ్రంగా స్పందిస్తూ “Humanity has been robbed of all decency by the sexual pre-occupations of a man who ‘groping in unknown regions has set himself as dictator’”అని ఘాటైన విమర్శలు చేసాడు. ఇవన్నీ ఫ్రాయడ్ ముందు ఊహించినవే. ఆయనది శాస్త్రీయ దార్శనికత ప్రయోగం పరీక్ష పునరాలోచన. ఫ్రాయడ్ “ The trouble with psycho analysis is the psycho analyst” అని ముందే ఊహించి చెప్పాడు. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు, ఆక్షేపణలు ఉన్నా ఫ్రాయడ్ సిద్ధాంతం అనేక రంగాలలో పరిశోధనలను చేయించింది. మేదోచర్యలను ప్రేరేపించింది . విజ్ఞానాన్ని బంధించకుండా స్వేచ్చగా ఎదగాలని భావి౦చినవాడు ఫ్రాయడ్. అతని కృషి అనితర సాధ్యమైనది. ‘’Freud’s contribution the extension of the imaginative recognition of a human being of himself and his sympathetic understanding of the another”అని రచయిత లూయి అంటర్ మేయర్ అంటాడు.

మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-8-15-ఉయ్యూరు
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-8-15-ఉయ్యూరు