ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -72
30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన -జార్జి బెర్నార్డ్ షా -4(చివరి భాగం )
మాన్ అండ్ సూపర్ మాన్ లో ఒక భాగం ప్రదర్శన యోగ్యం కాదు ,అర్ధ శతాబ్ది కాలం అది ప్రదర్శింప బడలేదు .నాటక రంగ చరిత్రలో డాన్ జువాన్ నరకం లో ఉన్న మూడవ అంకం చాలా సుదీర్ఘం గా ఉండటం వలన పక్కన పెట్టేశారు .షా మరణం తర్వాతా పాతిక మంది నటులు అమెరికా వెళ్లి ఒక మిలియన్ జనాలకు రెండు గంటలు సైన్స్ ,సెక్స్ యుద్ధం ,మతం ,సంగీతం ,రాజకీయం ,విముక్తి మున్నగు అంశాలపై అవగాహన కల్పించారు .డాన్ జువాన్ అనేపాత్ర పలికిన అనేక విషయాలు షా మాత్రమె రాయగలడు అవి ‘’they are not dignified ,they are only fashionably dressed ,.They are not moral ,they are only conventional .They are not virtuous ,they are only cowardly .They are not prosperous ,they are only rich ..They are not loyal ,they are only servile ,,not dutiful ,only sheepish ,not public spirited ,only patriotic ,not courageous ,only quarrelsome ,not determined ,only obstinate not masterful ,only domineering ‘’అని రాక్షసుల స్నేహితులగురించి అనిపిస్తాడు .వీరంతా ఆనాటి ఆయన సమకాలీనులే
‘’మేజర్ బార్బర మరియు డాక్టర్స్ డైలమా నాటకాలు షాలో ఉన్న అమిత శక్తిని ఆవిష్కరించాయి .మొదటిది సాల్వేషన్ ఆర్మీ కి సంబంధించింది .మతానికి వ్యతిరేకం గా రాసిన కామెడి .మానవులకు ఉండాల్సిన మంచితనం గురించి బోధించింది .రెండవది ఫార్స్ తో ఉన్న ట్రాజేడి.సుదీర్ఘ సంభాషణలు ఇబ్బంది పెడతాయి .ఆర్టిస్ట్ ను చంపి అస్తిత్వ రాహిత్యాన్ని బతికిస్తాడు (Shaw allowed the non entity to live and the artist to die ).యాభై ఏళ్ళనాటికి షా 18నాటకాలు రాశాడు .ఇందులో ‘’Misalliance’’’’అనే కామెడీ కూడా ఉంది .కుటుంబం లో తలిదండ్రులకు సంతానానికి మధ్య ఉన్న సంతోష రహిత సంబంధాలను వివరించాడు .షా రాసిన ‘’పిగ్మాలియన్ ‘’నాటకం అనూహ్యం విజయం సాధించింది .షా అంటే ‘’పిగ్మాలియన్ ‘’అనే పేరొచ్చింది .దీన్ని సినిమాగా తీశారు .బాగా మాట్లాడటానికి ఫోనేటిక్స్ ను దట్టించాడు .ఇంగ్లీష్ లోని 42అక్షరాలకు దేనికి దానికి ఒక నిర్దుష్ట నాదం ఉంది అని తీవ్రంగా వాదించేవాడు .కాని మాటలు అడ్డు గోడలుగా స్థాయి లమధ్య (క్లాస్ ) నిలిచి మంచి కామెడీని దేశం లో పండించాయి
వయసు పెరిగిన కొద్దీ షా మరింత ఆలోచనా పరుడయ్యాడు మరింత విచారణ చేశాడు .సహనం పెరిగింది .సువ్యవస్థితమైన ప్రతి దానిపై తిరుగుబాటు బావుటా ఎగరేశాడు .అరవై ఏళ్ళ వయసులో చాలా సంపన్న జీవితం అనుభవించాడు .’’హార్ట్ బ్రేక్ హౌస్ ‘’నాటకం రాశాడు .ఇది షా నాటకాలలో అత్యుత్తమమైనదని విమర్శకాభిప్రాయం .ఇది యుద్ధం ముందు స్తితిగతులకు దర్పణం అన్నారు .ఐరోపా నావ అంతూ దరీ లేని సముద్రం లో చుక్కాని లేని నావగా కొట్టు మిట్టాడుతున్నట్లు చిత్రించాడు . దీనిని సెంటిమెంటల్ డ్రామా అనాలి. నాటక కర్త సాంకేతిక నైపుణ్యానికి పరాకాష్ట. చెకోవ్ ఆవహించిన షా లాగా రాశాడన్నారు. ఆ తర్వాత ఐదేళ్ళు రెండు నాటకాలపై దృష్టి పెట్టాడు. అందులో ఒకటి’’ back to Methuselah’’- ఒక గొప్ప నీతి కథ- రెండవ సృష్టి పరిణామం గురించిన కథ. మనుషులు కలకాలం జీవించే కథ. ఇది ఒక ఫాంటసీ. మార్మికతను జోడించి రాసాడు. షా దృష్టిలో లైఫ్ ఫోర్స్ లేక దేవుడు మనిషి లాంటి వాడే. అనంపూర్ణ మనిషి సంపూర్ణత కోసం ప్రయతినించే వాడే. ఈ నాటకం బృహత్తరమై షా కన్న కలలన్నీ నెరవేర్చిందని భావిస్తారు. అరవై ఏడవ ఏట “సెయింట్ జోన్” అనే కదలించే కవితాత్మకమైన నాటకం రాసాడు. మనిషి ఆధ్యాత్మికతను జయించటం ఇందులో కథ. ఇంతకు ముందు చెప్పిన నాటకం వేదాంత సౌందర్యంగా ఉంటే ఈ నాటకం సాధారణంగా సహజంగా మానవ ఆత్మకు చాంపియన్ గా నిలిచింది. రెండేళ్ళ తర్వాత షాకు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.
సెయింట్ జోన్ రాసిన తర్వాత నాటక కర్త షా లోని జీనియస్ క్రమంగా తగ్గింది. కానీ కరపత్ర రచయితగా విజ్రుమ్భిస్తున్నాడు. కొంతమంది దృష్టిలో పుస్తకాలకు షా రాసిన ఉపోద్ఘాతాలు ఆయన నాటకాల కంటే గొప్పవి. ఆ నాటకాలు థియేటర్ మోజు ఉన్నవాళ్లకే పరిమితం అంటారు. ఈ విమర్శలను లెక్క చేయకుండా అతి ముఖ్యమైన “ది యాపిల్ కార్ట్” నాటకాన్ని డెబ్భై మూడవ ఏట రాసాడు. ఆ తర్వాత డజను నాటకాలు రాసినా తళుకు, బెళుకు తక్కువ. అయితే వైవిధ్యం మాత్ర కనిపిస్తుంది. 1952 లో సినీ నటి కాతరిన్ హెప్ బర్న్ షా ఎనబై ఏళ్ల వయసులో రాసిన “The Millionairess”లో నటించి గొప్ప విజయాన్ని చేకూర్చింది.
రెండు ప్రపంచ యుద్ధాలు షాలో పాత భావాల స్థానంలో కొత్త భావాలకు ఆస్కారం కలిగించాయి. ఆయనలోని పాసిఫిజం గట్టిబడింది. పాట్రిక్ కాంప్ బెల్ అనే ఆమె తన ఒకానొక కొడుకు నటనలో చనిపోయాడని మత ప్రచారకుడు అభినందిస్తూ పెద్ద ఉత్తరం రాసాడని షాకు ఉత్తరం రాసింది. దీనికి కోపం సాను భూతికలగలిపి షా “It is no use. I cant be sympathetic. These things simply make me furious. I want to swear. I do swear. Killed just because people blasted fools. A Chaplain too to say nice things about it. It is not his business to say nice things about it but to shout that ‘the voice of thy son’s blood crieth unto God from the ground” అని జవాబు రాసాడు. 75 వ ఏట సోషలిస్టు కాని సోషలిస్టు అయిన షా రష్యా సందర్శించాడు. రెండేళ్ళ తర్వాత ప్రపంచ పర్యటన చేసాడు. ఎప్పుడు అమెరికాకు ఆహ్వానించినా తిరస్కరించే షా రెండు సార్లు అక్కడ ఆగాడు. మొదటి సారి పసిఫిక్ తీరంలో సాన్ సిమ్యాన్ రాంచ్ అఫ్ విలియన్ రండాల్ఫ్ హర్స్స్ట్ ను చూసినప్పుడు. ఈయన షాకు రచనలను కొన్ని సిండికేట్ చేసాడు. రెండవ సారి న్యూయార్క్ లో ఒక రోజు ఉండి మెట్రోపాలిటన్ ఒపేరా హౌస్ లో ఉపన్యసించాడు. అప్పుడు మాట్లాడుతూఅమెరికా బ్యాంకులను జాతీయం చేయాలని పెట్టుబడిదారులను దూరం చేయాలని యుద్ధపు అప్పులన్నీ రద్దు చేయాలని కోరాడు. అక్కడి నుండి తన స్వగ్రామం హయాత్ సెయింట్ లారెన్స్కు తిరిగి వచ్చాడు. ప్రజాస్వామ్య విధానాలపై తనకున్న నమ్మకాలను ప్రకటించాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో షా తనను “General consultant to man kind “గా చెప్పుకున్నాడు.
నాన్ స్టాప్ గా రాస్తూనే 8 2 వ ఏట 50 వ నాటకం’’ జెనీవా’’ రాసాడు. 91 లో “Beoyanat Billions “నాటకాన్ని పూర్తిచేసి మరొక కామెడీని ప్రారంభించాడు. ఆయన రచనా వర్క్ షాప్ పేరు’’ ది షెల్టర్’’. 93 వ ఏట “Rhyming picture guide to Ayot Saint Lawrence “తయారు చేసాడు. షా గొప్ప ఫోటోగ్రాఫర్. ఇందులో ఫోటోలన్నీ తానే తీసిపెట్టాడు. ఇందులోని ప్రాసలు ‘’స్కైలార్కింగ్ రైమ్స్’’ గా పేరు తెచ్చుకున్నాయి. వందేళ్ళకు పైగా బతుకుతానని అనుకున్నాడు. కానీ ఒక పండ్ల చెట్టుకు కుదురు చేస్తూ 1950 సెప్టెంబరు 10 న పడిపోయాడు. తుంటి ఎముక విరగటం కారణంగా మరణం రాలేదు కానీ 94 ఏళ్ల ముసలి తనంలో ఎముకలు చక్కగా అతుక్కున్నాయి. ఆ షాక్ కు మాత్రం ఆయనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ తెచ్చింది. రెండు ఆపరేషన్స్ జరిగినా ఫలితం లేకపోయింది. 2-11- 50 న మహా నాటక రచయిత బెర్నార్డ్ షా మరణించాడు. చనిపోయే నాటికి చాలా గొప్ప సంపన్నుడుగా ఉన్నాడు. అయన ఎస్టేట్ విలువ మిలియన్ డాలర్ల పైనే ఉంటుందని అంచానా వేసారు.
షా చనిపోయిన తర్వాత కూడా ఆయన ప్రేతాత్మ మాట్లాడుతూనే ఉంది. తనను వెస్ట్ మినిస్టర్ అబే లో ఖననం చేయొద్దని కోరుకున్నాడు. తనది ,తన భార్య చితాభస్మాన్ని తమ గార్డెన్ లో వెదజల్లమని కోరాడు. తన బ్రతుకు ఎంత సత్యమో తన మరణం కూడా అంతే అన్నాడు. షా’’ క్రియేటివ్ ఇవల్యూషన్’’ –సృజనాత్మక పరిణామం ను నమ్మాడు. తనకు ఏ స్మృతి చిహ్నం నెలకొల్పవద్దని కోరాడు. తనపై రక్తతర్పణానికి చిహ్నమైన క్రాస్-శిలువను ఉంచవద్దని చెప్పాడు. కానీ నాటి ప్రధాని అట్లీ మాట్లాడుతూ “shaw was not only our greatest entertrainer but our greatest teacher”అని శ్రద్ధాంజలి ఘటించాడు. షాను’’ ఫైటింగ్ ఐడియలిస్ట్’’అంటారు. షా నాటకాలు ‘’అధిక ప్రాసంగిక సంభాషణలు’’.. ఇందులో ‘’ వెంట్రి లోక్విజం ‘’ఎక్కువ. సంప్రదాయాన్ని అస్తిరపరచిన దార్శనికుడు షా. ప్రతి దానిని లోతుగా తరచి అభిప్రాయం చెప్పేవాడు. ప్రశ్నలకొంటే ఆయన సమాధానాలు ఇబ్బందికరంగా ఉండేవి. ఆయన భావనలు అరిస్స్తో ఫేనస్ కు దగ్గరలో ఉంటాయి. “ది అకార్నియాస్ “ నాటకం లోని కోరస్ ఇరవై శతాబ్దపు ప్రేక్షకులనుద్దేసించి చెప్పబడింది.అదే “As for you never loose him. We will always fight for the cause of justice in his comedies. He promises you that his precepts will lead you to happiness though he uses neither flattery not intrigue nor bribery nor deceit. Instead of loading you with praise he will point you to the better way”.
జీవితకాలం లో షా అరవైమూడు నాటకాలు రాశాడు కదా,నవలా రచయిత .వ్యాసాలూ కరపత్రాలు పుంఖాను పుంఖంగా రాశాడు గొప్ప విమర్శకుడు .సాంఘిక సమస్యలకు కామెడీజోడించి రాశాడు .పనివారల శ్రమ దోపిడీని వ్యతిరేకించాడు .స్త్రీపురుషులకు సమాన హక్కులకు ఉద్యమించాడు .ప్రైవేట్ ఓనర్ షిప్ కు వ్యతిరేకి .అందరికి ఆరోగ్యవంతమైన సుఖ జీవనం అందించటం ప్రభుత్వ లక్ష్యం గా ఉండాలని చెప్పాడు .కొంతకాలం స్థానిక రాజకీయాలలో పాల్గొన్నాడు .మానవ జాతి అభి వృద్ధికి తనదైన యుజేనిక్స్ రాశాడు .నియంతృత్వ వ్యవస్థను వ్యతిరేకించి ప్రజాస్వామ్య విలువలను ఆరాదించాడు .1925లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ ను ,1938అకాడెమి అవార్డ్ ను పొందినఏకైక సాహిత్య కారుడు షా .నోబెల్ అందజేస్తూ ఆయన్ను ‘’marked by both idealism ,humanity .its stimulating satire often being infused with a singular poetic beauty .’’ అని శ్లాఘించారు .నైట్ హుడ్ఇస్తానంటే వద్దన్నాడు షా .ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇస్తానంటే తిరస్కరించాడు.1938పిగ్మాలియన్ కు ఆస్కార్ అవార్డ్ లభించింది
షేక్స్ పియర్ నాటక నిర్మాణ లోపాలను ఎలుగెత్తి చాటాడు షా వాటిలో ఎడిటింగ్ ఉండకూదదన్నాడు ‘లండన్ లోని రాయల్ కోర్ట్ దియేటర్ లో షా రాసిన ‘’జాన్ బుల్స్ అదర్ ఐలాండ్ ‘’నాటకం 1904లో ప్రదర్శించినపుడు ఏడవ ఎడ్వర్ రాజు చూసి పగల బడి నవ్వుతూ కుర్చీ విరగ్గోట్టాడట .అంతగా ఆయన ఎంజాయ్ చేశాడన్నమాట .పిగ్మాలియన్ నాటకం వేలాది ప్రదర్శనలతో విజయం పొందింది .1998 మొదటిసారి షా కేమేరాకొని అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకొన్నాడు .ఫోటోగ్రఫీ ని’’ సీరియస్ ఆర్ట్ ఫారం ‘’గా ప్రచారం చేశాడు .ఎన్నో ఫొటోగ్రాఫిక్ ప్రదర్శనలపై రివ్యూలు రాశాడు .
రష్యావెళ్లినప్పుడు స్టాలిన్ ను చూసి ఆయన విధానాలకు జేజేలు పలికాడు షా .’’ఆన్ దిరాక్స్ ‘’నాటకం లో స్టాలిన్ భావాలను పోదిగాడు .యూజేనిక్(సుజన విజ్ఞాన శాస్త్రం ) సిద్ధాంతకర్త అయిన షా దాన్నిఉద్యమంగా బాగా ప్రచారం చేశాడు .మాన్ అండ్ సూపర్ మాన్ నాటకం లో యుజేనిక్స్ సిద్ధాంతాన్నే ఆవిష్కరించాడు .సోషలిజం తో యుజేనిక్స్ ను మిశ్రితం చేసి వ్యాప్తి చెందించాడు షా .షా కీర్తి ఖండాంతర వ్యాప్తి చెందింది ఆయన వ్యంగ్యానికి ‘’షావియన్ ‘’అనే పేరు సార్ధకమైంది .ఇంగ్లీష్ స్పెల్లింగ్ లలోని విరుద్ధతలపై జనానికి అవగాహన కల్పించాడు .తన సంపాదన లో కొంత భాగాన్ని ఆంగ్ల సాహిత్యం లో కొత్త ఫోనేమిక్ ఆల్ఫబేట్ తయారు చేయటానికి కేటాయించాడు ఆ ధనంచాలలేదు .కొంతకాలం దానిపై ఉపేక్ష వహించారు .పిగ్మాలియన్ మొదలైన వాటివలన రాయల్టీ బాగా పెరిగింది .కోర్టు లో దావా జరిగి చివరికి షా తలబెట్టిన కార్యానికి కోర్టు 860పౌండ్ల ధనాన్ని ఇవ్వాలని తీర్పు నిచ్చింది .దీనితోషా కన్న కల ‘’షావియన్ ఆల్ఫబెట్’’తయారు చేశారు .
షా నివసించిన గృహం ‘’షా కార్నర్ ‘’గా ప్రసిద్ధి చెందింది .కెనడాలోని ఒంటారియో లో నయాగర సరస్సు పై’’ షా ఫెస్టివల్ ‘’ నిర్వహిస్తున్నారు .లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు వ్యవస్తాపకులలొ షా ఒకడు. షా అయిదునవలలు రెండు కదా సంపుటాలు ,అరవైమూడు నాటకాలు రాశాడు .ఇక కరపత్రాలు ,విమర్శలు ,వ్యాసాలూ లెక్క లేనన్ని .సంగీతవిమర్శపై పది ఉద్గ్రంధాలు రాశాడు జార్జి బెర్నార్డ్ షా .
మరో ప్రముఖునితోకలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-15-ఉయ్యూరు
