గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 273-భూవరాహ విజయం రాసిన శ్రీనివాస కవి (17 వ శతాబ్దం)

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

273-భూవరాహ విజయం రాసిన శ్రీనివాస కవి (17 వ శతాబ్దం)

కౌండిన్య గోత్రీకుడు శ్రీ ముస్నం గ్రామ కాపురస్తుడు వీరవల్లి కుటుంబానికి చెందినవాడు 17 వ శతాబ్దికి చెందిన వాడు. వరద అని పిలవబడే శ్రీనివాస కవి 8 కాండలలో ‘’భూవరాహ విజయం’’ కావ్యం రాసాడు. వరాహ అవతారం దాల్చిన  ప విష్ణువు శ్రీ ముస్నంలో దండకుని తండ్రిని సంహరించి భూవరాహ రూప విష్ణువు లక్ష్మిని వివాహమాడటం కథ. చాలా రచనలు చేసినట్లు ఉన్నప్పటికీ అ౦బు జవల్లి దండకం, శ్రీ వరాహ చూర్నిక, ధ్యాన చూర్నిక శ్రీ రంగ దండకం వచనాలలో రాసాడు. అ౦బుజవల్లీ పరిణయం, వరాహ విజయం  వరాహ చంపు  ,వకుళ మాలినీ గీతా పరిణయం, సీతా దివ్య చరిత్ర మొదలైన కావ్యాలు రాసాడు. మాఘ కావ్యాల మీద రఘువంశ నైషద  అమరుకాల మీద మంచి వ్యాఖ్యానాలు రచించాడు.

ఇతని కుమారుడు వరద దేశికుడు కూడా గొప్ప కవి. ‘’లక్ష్మీ నారాయణ చరిత్ర ,రఘువర విజయం ,రామాయణ సంగ్రహం, అ౦బుజవల్లీ శతకం, శ్రీ వరాహ శతకం’’ తో పాటు’’ గద్య రామాయణము’’ రచించాడు. ఇతని కొడుకు, మనమడు గొప్ప కవులే.

  1. అభినవ రామానుజాచార్య (19 వ శతాబ్దం)

‘’మాయావాది మదగజ కంఠీరవ ఆచార్య’’ అనే బిరుదు పొందిన అభినవ రామానుజాచార్య వేంకటాచార్య కుమారుడు. నైద్రువ కాస్యపస గోత్రం. వాదిభ కేసరి కుటుంబం వాడు. 19 వ శతాబ్దికి చెందిన తిమ్మ గజపతికి సమకాలికుడు. ఈయన రాసిన ఏడు కాండల ‘’శ్రీనివాస గుణాకరం ‘’   తిరపతి వెంకటేశ్వర స్వామి గురించిన కథ. దీనిపై తాను వ్యాఖ్యానం రాసుకున్నాడు. మిగిలిన వ్యాఖ్యానాన్ని కొడుకు వరదరాజు పూర్తీ చేసాడు.

  1. క్రాణ రామ కవి (19 వ శతాబ్దం)

19 వ శతాబ్దికి చెందిన జైపూర్ సంస్థాన ఆయుర్వేదాచార్యుడు క్రాణ రామ కవి. ఆయన రాసిన “కచ్చ వంశ ‘’జయాపుర విలాస కావ్యాలలో” జైపూర్  ను పాలించిన రాజుల ఘన చరిత్ర ఉంది. చాలా కావ్యాలు రాసాడు. అందులో ‘’ఆర్యాలంకార శతకం, పలాండు శతకం ముక్తకం ముక్తావల్లి’’ ముఖ్యమైనవి.’’ పోలంబోత్సవం, సారస టీక, సంస్కృత సాహిత్యంలో గొప్ప పేరు పొందాయి. ‘’చందాశ్చతమర్దన’’ కావ్యానికి మంచి ప్రశస్తి ఉంది.

276.’’ ధిల్లీ సామ్రాజ్యం’’ నాటక కర్త–  లక్ష్మణ సూరి (1859- 1919)

తమిళనాడు రామ్నాడు జిల్లలో శ్రీవిల్లి పుత్తూరు దగ్గర పూనల్వేలిలో ఉన్న ముత్తు సుబ్బ అయ్యర్ కుమారుడు లక్ష్మణ సూరి. కాలం 1859- 1919.    అన్ని శాస్త్రాలలో మహాపండితుడైనందున “మహా మహోపాధ్యాయ” బిరుదు పొందాడు.  మద్రాస్ పచ్చయప్ప కళాశాలలో సంస్కృతాతాచార్యునిగా పని చేసాడు. ఆయన రాసిన’’ క్రుష్ణలీలామృతం ‘’బృహద్గ్రంధం. లఘు కావ్యాలుగా ‘’విప్ర సందేశం, మానస సందేశం, వేంకటేశ స్తవం ముఖ్యమైనవి. “ధిల్లీ సామ్రాజ్యం “ అనే నాటకం రాసాడు.  ఈ నాటకంలో ఐదవ జార్జి చక్రవర్తి ధిల్లీ లో రాజదర్బార్ నిర్వహించిన కథ ఉన్నది. రామాయణం ఆధారంగా ‘’పౌలస్త్య వధ’’ రాసాడు.’’ అనర్ఘ రాఘవం, ఉత్తర రామ చరిత్ర మహావీర చరిత్ర  వేణీ సంహారం, బాల రామాయణం రాత్నావళి’’లపై ఈయన రాసిన వ్యాఖ్యానాలు బహు ప్రశస్తమైనవి. ‘’మదన పారిజాత మంజరి’’ లో శేష భాగాలను పూరించాడు. సరళమైన సంస్కృత రచనలను రాయటం ఆయన ప్రతేకత. భీష్మ పితామహుని జీవితంపై’’ భీష్మ విజయం’’ రాసి భీష్ముని న్నత్యాన్ని శతధా ,సహస్రధా శ్లాఘించాడు. ఈయన రాసిన ‘’ సంగ్రహం, రామాయణ సంగ్రహం’’ చాలా ప్రచారం పొందినవి.

  1. భాస నాటకాలను వెలికి తీసిన–  గణపతి శాస్త్రి (1860)

రామ సుబ్బ అయ్యర్ కుమారుడైన గణపతి శాస్త్రి  కేరళ లోని తిన్నేవెల్లి జిల్లాలో తరువలిలో 1860 లో జన్మించాడు.  సంస్కృతంలో మహా నిష్ణాతుడై 17 వ “ఏటనే “మాధవీ వసంతం” నాటకం రాసాడు.  త్రిరువనంతపురంలోని సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గానూ, సంస్కృత ప్రచురణలకు క్యురేటర్ గానూ, త్రివాన్కూర్ మహారాజ సంస్తానంలోనూ పనిచేసాడు. ‘’మహామహోపాధ్యాయ’’ బిరుదాంకితుదు. కాల గర్భంలో కలసిపోయిన భాస నాటకాలను వెలికి తీసి ప్రచురించిన మహానుభావుడు గణపతి శాస్త్రి. దీనికి ప్రపంచ ప్రఖ్యాత కీర్తిని పొందాడు. సంస్కృత సాహిత్యంలో లోతైన అధ్యయనం ,పరిశోధన శాస్త్రి చేసాడు. మహా గ్రంథాలు  ఎన్నో రాసాడు. భాస నాటకాలను సంకలనం చేసి విపులమైన వ్యాఖ్యానాలు రాసి ప్రచురించాడు.

గణపతి శాస్త్రి’’ శ్రీమూల చరిత్ర ‘’అనే చారిత్రక గ్రంధాన్ని తిరువాన్కూర్ మహారాజుల వంశ చరిత్రగా రాసాడు. ‘’భారత వర్ణన’’ అనే గ్రంథంలో భారతదేశాన్ని వర్ణించాడు. ‘’తులా పురుష దండ ‘’కావ్యంలో తులాభార ఉత్సవాన్ని గురించి వర్ణించాడు. పార్వతీ దేవిపై అపర్ణాస్తవం, విక్టోరియా మహారాణిపై ‘’చక్రవర్తిని గుణమణిమాల ‘’రచించాడు. తిరువాన్కూర్ మహారాజు రాజా విశాఖ రామునిపై’’ అర్థ చిత్ర మణి మాల ‘’అనే సాహిత్య శాస్త్రాన్ని రచించాడు. ఆయన రచనలలో అతి ప్రశస్తి పొందింది “సేతు యాత్రాను వర్ణనం”. దీనిలో సరళ సుందరమైన సంస్కృత రచనం అందరినీ ఆకర్షిస్తుంది. ఇది రామేశ్వర యాత్రకు సంబధించిన యాత్రా సాహిత్యం. హిందూ దేవతల పవిత్రత, గొప్పతనమంతా వర్ణించాడు.

  1.  సంస్కృత కళాశాల స్థాపకుడు నీలకంఠ శర్మ (1858)

పున్నసేరి నంబి నారాయణ శర్మ కుమారుడైన నీలకంఠ వర్మ 1858 లో జన్మించాడు. కేరళలోని సంస్కృత విద్వాంసులలో, సంస్కృత గ్రంథ కర్తలలో ప్రముఖ మైనవాడు. పట్టంబిలలో సంస్కృత కళాశాల స్థాపించాడు. సంస్కృత పత్రిక ‘’విజ్ఞాన చి౦తా మణి’’ని నిర్వహించాడు. ఖగోళశాస్త్రంపై అనేక విలువైన గ్రంధాలు రాసాడు. ‘’పట్టాభిషేక ప్రబంధం, శైలాబ్ది శతకం, ఆర్యా శతకం’’ మొదలైన గొప్ప రచనలు సంస్కృతంలో చేసాడు.

  1. పాళీ భాషలో గ్రంధాలు రాసిన ఆధునిక కవి– విదుశేఖర

బెంగాల్లోని శాంతినికేతన్ కు చెందిన విధుశేఖర భట్టాచార్య బెంగాలీ సంస్కృత భాషాలలో గొప్ప పండితుడు. పాళీ భాషలో కూడా గొప్ప గ్రంథాలు రాసాడు. సంస్కృతంలో’’ యవ్వన విలాసం, ఉమా పరిణయం హరిశ్చంద్ర చరిత్ర, చిత్త  విలాసం’’ లతో పాటు’’ చంద్ర ప్రభ’’ అనే శృంగార కావ్యం కూడా రాసాడు. బనారస్ లో “మిత్ర గోష్టి” అనే సంస్కృత పత్రికను నిర్వహిస్తున్నాడు.

280-లిపి శాస్త్రజ్ఞుడు విజయ రాఘవాచార్య (1884)

కౌండిన్య గోత్రానికి చెందిన వరద రాయ కుమారుడు విజయ రాఘవాచార్య తమిళనాడులోని కంచి దగ్గర మయూర్ గ్రామంలో 1884 లో జన్మించాడు. కంచిలో చదివి అలంకార, సాహిత్య శాస్త్రాలలో ఉన్నత శ్రేణి విద్వాంసుడయ్యాడు. లిపి శాస్త్రం(ఎపిగ్రఫీ)లో ప్రత్యేక శిక్షణ పొంది తిరుపతి వెంకటేశ్వర దేవస్థానంలో ఎపిగ్రఫిస్ట్ గా  పనిచేసాడు. అనేక సంస్కృత గ్రంధాలు రాసాడు. అందులో’’ చిత్రకూటం’’ అనే నాటకం’’ శ్రీనివాస బాలాజీపై’’ వైభవ విలాసం’’ వేదాంత దేశికులపై ‘’ఘంటావతారం’’ గురుపరంపర ప్రభావం నీతి నవరత్న మాల, అభినవ హితోపదేశం, కవనేందు మండలి, వాసంతవ సార, దాన ప్రశంశ దివ్యక్షేత్ర యాత్రా మాహాత్మ్యం, ఆత్మ సమర్పణం, నవగ్రహ స్తోత్రం, దశావతార స్తవం, లక్ష్మీ స్తుతి మొదలైనవి చాలా ప్రసిద్ధమైనవి. ధనలక్ష్మి  ధాన్య లక్ష్మి, జయలక్ష్మి, గృహ లక్ష్మి అనే పంచ లక్ష్మీ దేవీలపై ఒక్కొక్కరిపై రెండు  వందల శ్లోకాల వంతున ఐదు రాసాడు. వీటికే ‘’పంచలక్ష్మీ విలాసం’’ అని పేరు. ‘’సురభి సందేశం’’లో ఆధునిక మాహా నగరాల వర్ణన చేసాడు. ‘’గాంధీ మహాత్మ్యం తిలక వైదుర్యం , నెహ్రూ విజయం ‘’మొదలయినవి ఆధునిక భారత జాతీయ నాయకులపై రాసిన గొప్ప గ్రంథాలు. అలాగే , బాల గంగాధర తిలక్, మోతీలాల్ నెహ్రూలపై కూడా రాసాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-15 –ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.