గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 316- జంబూద్వీప చిత్రపటం తయారు చేసిన -మూల శంకర మాణిక్ లాల్ యాజ్ఞిక్ –(1886

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

316- జంబూద్వీప చిత్రపటం తయారు చేసిన -మూల శంకర మాణిక్ లాల్ యాజ్ఞిక్ –(1886

31-1-1886 జన్మించిన మూల శంకర మాణిక్ లాల్ యాజ్ఞిక్ గుజరాతీ  వాదనగరం లోని నాదియాడ్ గ్రామ బ్రాహ్మణుడు .ఈ కుటుంబం లో లబ్ధ ప్రతిష్టులైన  కవులెందరో జన్మించారు .వీరిలో కొందరు గుజరాతు ,కదియవ వాడ సంస్థానాలలోదివాన్ గిరీ చేశారు. యాజ్ఞిక్ బరోడా కాలేజి లో చదివి గ్రాడ్యుయేట్ అయ్యాడు .ఇండియన్ స్పెసీ బాంక్ లో కొంతకాలం పని చేసి బరోడాలోని రాజకీయ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు . .1916శివ గంగ పీతాదిపతి శ్రీ సచ్చిదానంద స్వామి ఇతనికి దీక్ష నిచ్చారు .సంస్కృత నాటకాలు గేయాలు రాసి సంగీతం కూర్చాడు .’’విజయ లహరి ‘’అనే చిన్న కావ్యం రాశాడు .సూర్య ,చంద్ర రాజుల వంశం లోని రాజులపాలనా కాలాలను నిర్దుష్టంగా గుణించి చెప్పాడు .’’జంబూద్వీపం మాప్’’ తయారు చేశాడు .విష్ణు పురాణాన్ని చక్కని సరళ సంస్కృత వచనం లో రాశాడు .’’చత్రపతి సామ్రాజ్యం ‘’అనే పది అంకాల నాటకం రాసి శివాజీ పరిపాలనపై వెలుగులు ప్రసరింప జేశాడు .తొమ్మిది అ౦కా లలో ‘’ప్రతాప విజయం ‘’నాటకం రాసి మేవార్ రాజు మహా రాణా ప్రతాప్ సింగ్ వీర విక్రమ గంభీరధీరోదాత్త   చరిత్రను వివరించాడు .పృధ్వీరాజ్ చౌహాన్ –రాణి సంయుక్త వివాహాన్ని ‘’సంయోగిత స్వయం వరం ‘’గా రాశాడు .కావ్య నాటక గేయ పదాలలో మృదు మధుర మంజుల నాదం చేస్తుంది యాజ్ఞిక్ కవిత్వం .

317-తర్క వాగీశ –పంచానన (1273

1273లో బెంగాల్ లోని ఇరవై నాలుగు పరగణాలలో జన్మించిన పంచానన కవి గౌతమ గోత్రీకుడైన నందాలత విద్యారదుల  కుమారుడు .బెంగాల్ సంస్క్రుత పండితులలో మహోత్క్రుస్టూడు అని పేరొందిన వాడు బెనారస్ లో నివసించాడు .’’పార్దాశ్వ మేధ’’కావ్యం రాశాడు .రాణా అమర సి౦హు ని పై ‘’అమర మంగళ నాటకం ‘’రాశాడు .కన్యా కుబ్జానికి చెందిన అల్లా భట్టు అనే గొప్ప విద్వాంసుడు యీతని పూర్వీకుడు .ఇతనికి ‘’తర్క వాగీశ’’బిరుదం ఉంది .

 

318-సిద్ధాంత వాగీశ –హరిదాసు(1876

విద్యాముఖి ,గంగాధర విద్యాలంకారుల కుమారుడు హరిదాసు .1876 జననం .పశ్చిమ బెంగాల్ లోని ఫరీద్ పూర్ జిల్లా కొత్వాలిపారాలోని ఉనాశియా నివాసి .కాశ్యప గోత్రం .ఈ గ్రామం లో ఒకప్పుడుబ్రాహ్మణులు  లక్ష శివలింగాలను అర్చించారని చారిత్రిక కధనం .అందుకే దీనికి రెండవ కాశి అనే పేరొచ్చింది .గంగాధరుని తండ్రి కాశీ చంద్ర వాచస్పతి’’ యాదవానంద నయా చారం ‘’లో తొమ్మిదవ పీఠాది పతి .వీరి పూర్వీకులలో ముఖ్యుడు మధు సూదన సరస్వతి అనే మహా విద్వా౦శు డున్నాడు .

హరనాధుడు చిన్నప్పటి నుంచి చాలా నిష్టగా జీవించాడు .పదమూడవ ఏటనే సంస్కృత సాహిత్యం లో అమోఘ పండితుడని పించుకొన్నాడు .పద్నాలుగవ ఏట ‘’కంస వధ ‘’అనే నాటకాన్ని ,కంసవధ చంపు ను రాశాడు .పదహారవ ఏట ‘’శంకర సంభవం ‘’అనే అయిదు కాండలకావ్యం రాసేశాడు .వయసు పద్దెనిమిది లో ‘’జానకీ విక్రమం ‘’ఇరవై వ ఏట ‘’వియోగ వైభవం ;;కావ్యం సంత రించాడు .

హరిదాసు జీవానంద విద్యా సాగరుని శిష్యుడు .’’విరాజ సరోజిని‘’,’’వంగీయ ప్రతాపం ‘’కావ్య రచన చేశాడు ‘’రుక్మిణీ హరణం ‘’తో బాటు శృంగార కావ్యంగా ‘’సరళ ‘’రాశాడు .నైషధం ,మాఘం కాదంబరి ,దశ కుమార చరిత్ర ,సాహిత్య దర్పణాలకు విలువైన ఉపోద్ఘాతాలు రాశాడు .నాకీపూర్ జమీందార్ గారి టోల్ కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్ గా ఉన్నాడు .మహా భారతాన్ని బెంగాలీ భాషలోకి అనువదించే కార్యక్రమం లో ఎడిటర్ గా పని చేశాడు .ఇందులో ఈయన కృషి చిరస్మరణీయం అని బెంగాలీ ప్రజల ప్రగాఢ విశ్వాసం .ఆదిపర్వం వనపర్వం లో కొంతభాగం ముద్రింప బడ్డాయి .ఇతనికి ఉన్న సిద్ధాంత వాగీశ బిరుదు సర్వదా సమర్ధనీయం .

319-హైకోర్ట్ ఆడ్వోకేట్ –మకలింగ శాస్త్రి (!897

మద్రాస్ హై కోర్ట్ లో అడ్వొకేట్ అయిన మక లింగ శాస్త్రి యజ్న స్వామి కుమారుడు ,.రాజు శాస్త్రి అని పిలువ బడే త్యాగ రాజు ఈతని ముత్తాత .అప్పయ్య దీక్షితులకు పన్నెండవ తరం వాడు .1897లో పుట్టుక .చిన్నప్పటి నుండి గీర్వాణం వంట బట్టి కవిత లో గీర్వాణం చూపాడు .’’వనలత ,నదీపూరం ,వ్యాజోక్తి రత్నావళి  ,అర్దాన్తరన్యాస  పంచాశత్ ,భారతి విషాదం ,భ్రమర సందేశం ,దుర్జన హృదయం మొదలైన లఘుకావ్యాలు రాశాడు .’’కలి ప్రభావం ‘’అనే కదా సంపుటి ,వెలువరించాడు .భాస నాటకాలను ‘’భాస కదా సారం ‘’గా వచనం లో రాశాడు .ఉద్గాత్రిదశానన ‘’’’ప్రతి రాజ సూయం ‘’అనే నాటకాలు రచించాడు .దేశం లోని విశ్వ విద్యాలయాలు ఈయన ప్రతిభా విశేషాలకు ముచ్చటపడి ఆహ్వానించి సన్మా నించాయి .

320-ప్రబోధ చంద్రోదయ కర్త -కృష్ణ మిశ్ర (1072

పరమహంస కృష్ణ మిశ్రుడు శంకరాద్వైత  వేదాంత వ్యాప్తి చేశాడు శిష్యులనేకులు .  .అందులో ఒకడికి వేదాంతం చదవటం బోర్ అని పించింది .అతని దారి మరల్చటానికి కృష్ణ మిశ్రుడు ‘’ప్రబోధ చంద్రోదయం ‘’నాటకం రాశాడు .అందులో పరమ సత్యాన్ని ఆవిష్కరించాడు .గుణాలను పాత్రలుగా మలచాడు.వివేచన విముక్తికి దారి చూపుతుంది అని సారాంశం గా చెప్పాడు . వివేకం రాజు గా ఉపనిషత్ దేవిగా భావన చేసి గూఢంగా సత్యజ్ఞానం కలిగించిన నాటకం .మంచి రాజు వివేకుడు దుస్టరాజు మహా మాయ  ముఖ్య పాత్రలు .భ్రాంతికి సత్యానికి జరిగే పోరాటమే ఇందులో కద. చివరికి వివేకం చంద్రోదయం లాగా   ప్రకాశించటం తో సమాప్తం .

ఆనాడు వ్యాప్తిలో ఉన్న బుద్ధ ,జైన పశుపతి మతాల వలన ధర్మ గ్లాని కలుగుతోందని కృష్ణ మిశ్రుడు భావించి శంకరాద్వైత ప్రచారం చేసి వేదసంస్క్రుతికి పునర్వైభవం సంత రించాడు.సరిదిద్దాల్సిన ఆనాటి బ్రాహ్మణులు చిలక పలుకుల్లా వేదాలను వల్లే వేయటం తోనే సరి పుచ్చారు . అందులోని అర్ధ భావాలను తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు .తెలియ జెప్పే ప్రయత్నం జరగ లేదు .పై పెచ్చు వేదోపనిషత్ లను తమ ఇష్టం వచ్చినట్లు వక్ర భాష్యం చెప్పి దారి తప్పారు, తప్పించారు .ఇవన్నీ గమనించిన కృష్ణ మిశ్రుడు సమాజాన్ని వేదాంత మార్గం లోకి  మళ్ళించ టానికే ఈ నాటకం రాశాడు .

1092లో దీన్ని రాశాడు. ఆనాటి రాజు గోపాలుడు ఎప్పుడూ యుద్ధాలు అంటూ కాలక్షేపం చేస్తూ ప్రజల గోడు పట్టించుకోలేదు .ఆ రాజ్యం లో మునిగా ఉన్న కృష్ణ మిశ్రుడు రాజుకు వివేకం కలిగించటానికే యుద్ధాన్ని నేపధ్యం గా తీసుకొని ప్రబోధ చంద్రోదయ నాటకం రాసి కను విప్పు కలిగించాడు .కృష్ణ మిశ్రుడు తాను గౌడ దేశానికి చెందిన వాడినని చెప్పుకొన్నాడు. కనుక ఈయన బీహార్ ప్రాంతం వాడుగా భావించారు .ఈ నాటకాన్ని రాజు గోపాలుడు అతని మిత్ర రాజు కీర్తి వర్మతో  కర్ణ రాజు అనే శత్రువును జయించి రాజధానికి తిరిగి వచ్చి ‘’ప్రబోధ చంద్రోదయం ‘’నాటకాన్ని ప్రదర్శింప జేసి చూశాడు .’’వివేకం అనే చంద్రుని యొక్క ఉదయం ‘’అని ఈ నాటక శీర్షికకు అర్ధం. చక్కని శైలి ,సంభాషణలు అంతరంగాల ప్రదర్శన లతో నాటకం రక్తి కట్టి౦ది . వేదాంత ధోరణి నాటకాలకు కృష్ణ మిశ్రుడు తెర తీశాడు .ఆ తర్వాత ఇలాంటివి చాలా వచ్చాయి .

సశేషం

మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-15- ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.