గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
352-రాహులకుడు (400b.c.)
రాహా లకుడు లేక రాహులకుడు క్రీ .పూ. నాలుగవ శతాబ్దం కంటే పూర్వం వాడు .అతని వ్యాఖ్యానాలన్నీ కవిత్వం గా నే ఉన్నాయి తమిళ గ్రంధం’’ మణిమేఖల ‘’లో ఈ కవి గరించి ఉంది. అభినవ గుప్తుడు ఇతనిని శాక్యాచార్య రాహులకుడు అన్నాడు .బౌద్ధమతాను యాయి అని అందుకే భరతుని వ్యాఖ్యలను ఇస్టపడలేదని చెప్పాడు .ముఖ్యంగా అలంకార విషయం లో .హేమచంద్రుడూ కావ్యానుశాసనం లో ఉటంకించాడు .సారంగ ధరుడు రాహులకుని ఒక శ్లోకం ఉదాహరించాడు .
‘’ఉన్నిద్ర కంద లలాట లాంతర లీయమాన గ్రుష్యంద్ర న్మదాంధ మధుపాంచిత మేవ కాలే –సప్నోతి యఃప్రవ సాతి ప్రవిహాయ కాంతాం తస్మై విషాపార హితాయ నమో వృషాయ ‘’
వార్తిక వ్రాత ప్రతి మధ్య భారతానికి చెందిన ఏం ఆర్ కవి కి దొరికింది .అందులో మొదలు చివర లేదు .రెండు వందల గ్రందాలున్నట్లు తెలుస్తోంది .రచయిత పేరు లేదు .ఇది నాట్య శాస్త్రానికి అనుబంధం అని బరోడా నుండి ప్రచురణ జరిగిందని భావిస్తున్నారు .
353-అదృష్టం వల్ల రాజైన -మాత్రు గుప్తకవి (100ఏడి)
క్రీస్తు శకం ప్రారంభం లోకాని అంతకు ముందు కాని మాత్రుగుప్తుడు ఉండేవాడు .రాజ తరంగిణి లో కల్హణుడు ఇతని గూర్చి చాలా రాశాడు .కాశ్మీర్ రాజుహర్ష వర్ధనున ,విక్రమాదిత్యుని తో ఈ కవికి మంచి సంబంధాలుండేవి .హర్ష వర్ధనుడు అనే విక్రమాదిత్యుని కొలువులో మాత్రు గుప్తుడు ఉన్నాడని ,రాజు ఉదారంగా ఉన్దేవాడుకాదని అందువల్ల ఈ కవిని పట్టించుకోలేదని అతని ప్రతిభను గుర్తించ లేదని ఆయన తాహతుకు సరిపడా గౌరవం ఇవ్వలేదణి తెలుస్తోంది .దాదాపు అతన్ని నిర్లక్ష్యం చేశాడు అందువల్ల కవి గర్భ దరిద్రం తో బతికాడు .తినటానికి తిండి కంటి నిద్రా నిద్ర ఉండటానికి గూడు కూడా లేవు .కొంతకాలానికి అదృష్టం పండింది సుడి తిరిగింది .క్రమగా సోపానాలు అధిరోహించటం ప్రారంభ మైంది .
ఒక రోజు అర్ధ రాత్రి కాపలా వారంతా హాయిగా నిద్రిస్తుండగా విపరీతమైనగాలి వీచి దీపాలుఆరిపోయాయి .రాజు కాపలా వారిని యెంత గట్టిగా పిలిచినా ఎవరూ రాలేదు అప్పుడు మాత్రుగుప్తుడు ద్వారాలు తెరుచుకొని లోపలి వచ్చి రాజుగారి దగ్గరున్న దీపాన్ని వెలిగించాడు . .అతనెవరో తెలుసుకోవాలని పించింది రాజుకు .ఇంత అర్ధ రాత్రి నిద్రపోకుండా ఆగతకుడు ఎందుకు మెలకువ గా ఉన్నాడో కారణం తెలుసుకొనే ప్రయత్నం చేశాడు . ఆ సంఘటనపై మాత్రుగుప్తుడు రెండు శ్లోకాలు రాశాడు .విన్న రాజు తప్పు తెలుసుకొని కవిని నిర్లక్షయం చేసినందుకు బాధ పడ్డాడు .కవికి ఏదో రకం గా గొప్ప సాయం చేయాలనుకొన్నాడు .మర్నాడు సభకు పిలిపించి ఒక లేఖ చేతి కిచ్చి ఏమీ చెప్పకుండా కాశ్మీర్ వెళ్లి అక్కడి రాజోద్యోగికి ఇవ్వమన్నాడు .మాత్రు గుప్తుడు కాశ్మీర్ వెళ్ళాడు .అక్కడ రాజోద్యోగికి లేఖ అందించాడు .ఆసమయం లో కాశ్మీర్ కు రాజు లేడు.లేఖలో రాజు రాసిన దాన్ని బట్టి కాశ్మీర్ రాజ్యానికి మాత్రు గుప్తుడిని రాజు చేయమని ఉంది. అలాగే చేసి రాజుగా పట్టాభి షేకం జరిపించారు .మెంథ కవి మాత్రు గుప్తుని సమక్షం లో తన ‘’హయ గ్రీవ వధ ‘’నాటకాన్ని ప్రదర్శించి మెప్పు పొందాడు ..
మాత్రు గుప్తుడు నాట్య శాస్త్రం పై వ్యాఖ్యానం రాసి ఉండవచ్చు .సంగీత ,నాట్య అలంకార శాస్త్రాలపై మాత్రు గుప్తుని అభిప్రాయాలను విశేషం గా అభినవ గుప్తుడు ,కుంతకుడు ,బహురూప మిశ్రుడు ,శారదానందుడు ,మెచ్చుకొన్నారు .తమ వ్యాఖ్యానాలలో వాసుదేవుడు ,రంగ నాధుడు ,శర్వానందుడు క్షేమేంద్ర ,వల్లభ దేవులు కూడా మాత్రు గుప్తుని పై రాశారు .
354-ప్రయోగ స్తబకం రాసిన -దత్తిలుడు
భరత ముని తో దగ్గర సంబంధం ఉన్న వందమంది శిష్యులలో దత్తిలుడు .కూడా ఉన్నాడనిభరతుని నాట్య శాస్త్రం లో రాశాడు .దత్తిల ,కోహలులు దీనిపై వేర్వేరు వ్యాఖ్యానాలు రాశారు. భరతుని తు చ గా అనుసరించిన వాడు దత్తిలుడు .అందుకే భరతుని సిద్ధాంతాలను తరువాతి వారు బాగా ఆదరించారు .దత్తిలునికి నాట్య సంగీతాలపై అపార పాండిత్యం ఉన్నది .భరతుని నాట్య శాస్త్రం పై దత్తిలుని ‘’ప్రయోగ స్తబక’’వ్యాఖ్యానం చాలా ప్రసిద్ధి పొందింది .భరతుని పూర్తిగా అర్ధం చేసుకొని ఆయన సిద్ధాంతాలను దత్తిలుడు చక్కగా ఆవిష్కరించాడు .
355-కోహలుడు
భరత ముని అంతటి పాండితీ గరిమ ఉంది .ఆయనకు అత్యంత విదేయుడనిపించుకోన్నవాడు కోహలుడు .నాట్య శాస్త్రం లో పద కొండు విషయాలుంటే కోహలుడు దాన్ని పదమూడు విషయాలకు పెంచాడు నాట్యశాస్త్రం ప్రకారం కోహలుడు ‘’ప్రస్తాన త్రయం ‘’కు భాష్యం రాయ వలసి ఉంది .తరువాతి ఆలంకారికుడైన అభినవ గుప్తుడు, సారంగ దేవుడు .కోహలుని బహుదా ప్రశంసించారు .కాని దురదృష్ట వశాత్తు కోహలుడు రాసినది కాల గర్భం లో కలిసి పోయి లభించలేదు .కాని ‘’తాళాధ్యాయం ‘’ఒక్కటి మాత్రమే లభించింది .భరతుని అనుసరించినా కోహలుడు దానికి మెరుగులు దిద్దాడు .’’అభిన్యాస శాస్త్రం ‘’కర్త కోహలుడే నంటారు .’’దత్తిల –కోహలీయం ‘’కోహలుని నుంచి దత్తిలుని వరకు గురించిన వివరణ .’’కోహలా రహస్యం ‘’ లో కోహలుడు కోహలుని నుండి మాతంగుని వరకు చరిత్ర రాశాడు .కోహల రచనలు కోహలుని నుండి శార్దూలుని వరకు ఉన్న వర్ణనకల్లినాధుడు రాసిన సుదీర్ఘ ఉక్తి .
356-బృహద్దేశి కర్త –మాతంగుడు(400bc)
‘’బృహద్దేశి ‘’రచించిన మాతంగుడు దేశీ సంగీతానికే ప్రాముఖ్యమిచ్చాడు .ఆరు అధ్యాయాలున్న గ్రంధం .శృతి స్వరాలపై విస్తృత చర్చ .భరతుని గురించి చెబుతూనే చాలా విషయాలలో విభేదించాడు .ముఖ్యంగా ‘’మూర్చన’’లో పన్నెండు స్వరాలపై బాగా భేదించాడు .అందుకే తర్వాత’’మతంగ మతం’’ అనేది ఏర్పడింది .ఈ మతాన్ని అభినవ గుప్త ,సారంగ దరులు ఉటంకించారు .’’హరి విలాసం ‘’అనే ప్రబంధాన్ని ,’’జక్కిణి’’ అనే నాట్య విశేషాన్ని రాశాడు .జక్కిణి లో కాళి కా దేవి తనను మతంగ ముని అని సంబోధించి నూతన మార్గాన్ని సృష్టించమని కోరింది .తమిళ ‘సిలప్పాదికారం ‘’లో మాతంగుడు సంగీత నాట్య శాస్త్ర వేత్త అని ఉంది .ఈ గ్రంధం క్రీపూ నాల్గవ శతాబ్దం పూర్వం ది.దీన్ని బట్టి మాతంగుడు కాళికి తండ్రి .అందుకే ఆమెను ‘’మాతంగి ‘’అని పిలుస్తారు .ఆయన రాసిన దానికి గొప్ప విలువ నిచ్చారు .కోహల , శార్దూల కవులను మాతంగుడు పేర్కొన్నాడు .
సశేషం
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-15-ఉయ్యూరు

