దైవ చిత్తం -16
శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం
పదవ అధ్యాయం –భౌతిక శాస్త్ర ఏకీకరణ
పేజి -155,పేరా -1
మొదటి అధ్యాయం లో వివరించినట్లుగా ,విశ్వం లోని అన్ని విషయాలకు కలిపి ఒకే విధమైన సిద్ధాంతం నిర్మించటం చాలా కష్టం .దీనికి బదులు కొంత పరిమితి తో జరిగే విషయాలను ,మిగిలిన ప్రభావాలను వదిలేసి లేక ఉజ్జాయింపుగాకొన్నిటికే చేసి పాక్షిక సిద్ధాంతాలను తయారు చేయటానికి ముందడుగు వేశాం.
శాస్త్రీజీ కామెంట్ –ఈ కష్టం హిందూ పురాణాల లోనూ ఉంది .వివిధ పురాణాలు వేర్వేరు సందర్భాలలో రచింప బడినాయి .వీటినన్నిటినీ సమీకృతం చేయటం కష్టమే కాని అసాధ్యం మాత్రం కాదు .కొన్ని పురాణాలు శివుడే విశ్వానికి సృష్టి కర్త ఆయనే శాశ్వతం అని ప్రకటించాయి . ప్రధానంగా శివుడు అగ్ని రూపుడు. వేదం అగ్ని సృష్టికి కారణమని చెప్పింది .కొన్ని పురాబాలు విష్ణువే సృష్టికర్త అని చెప్పాయి ఆయనను నారాయణుడు అన్నాయి. అంటే జ్ఞానానికి నీటికి నివాసం అని అర్ధం .పురాణాలు నీరే అని భావించి సృష్టికి నీరే కారణమన్నాయి ,ఋగ్వేదం ఇతర దేవతలకంటే వరుణదేవుడికిపై స్థాయి నిచ్చి ప్రాధాన్యమిచ్చింది .పురాణాలు వివిధ సందర్భాలలో రాయబడినాయని ముందే చెప్పుకొన్నాం .ఋగ్వేదం ఈ దేవతలందరికి మహర్షులు వేరు వేరు పేర్లు పెట్టారని .వీరంతా సత్యం కు ప్రతి రూపాలని సత్యం ఒక్కటే నని చెప్పింది .అదే ‘’ఏకం సత్ విప్రా బహుదా వదంతి ‘’అంటే సత్యం ఒక్కటే .ప్రవక్తలు వివిధ నామాలు పెట్టారు .
పేజి -157,పేరా -1
ఏడవ అధ్యాయం లో చెప్పినట్లు అనిశ్చిత సూత్రం లేక సిద్ధాంతం (అన్ సర్టే నిటి ప్రిన్సిపుల్)అంటే అర్ధం ఖాళీ స్థలం కూడా వాస్తవిక ,అవాస్తవిక అంటేకణాలు ,ప్రతికణాల జంటలతో నిండి ఉంటుంది అనటం లో ఇబ్బంది వస్తోంది .ఈ కణాలకు అనంత శక్తి ఉండి ఉండాలని ,అందువలన అయిన స్టీన్ ప్రసిద్ధ సిద్ధాంతం E=mc2 ప్రకారం వాటికి అనంత ద్రవ్య రాశి ఉండి ఉండాలి .గురుత్వాకర్షణ బలంవిశ్వాన్ని వక్రత చెంది౦చి అనంత చిన్న విశ్వాలుగా మార్చి ఉండచ్చు
వ్యాఖ్య –ఇదే శక్తి సిద్ధాంతం .అంటే శక్తియే జగత్ సృస్టి కారణం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-1-16-ఉయ్యూరు

