దైవ చిత్తం -17
శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం
పేజి -165,చివరి పేరా
కానీ అసలు అలాంటి ఏకీకృత సిద్ధాంతం ఉంటుందా ?లేక మనం ఎండమావుల వెంట పరిగెడుతున్నమా?3 రకాల అవకాశాలున్నాయి 1-పూర్తి సంపూర్ణ ఏకీకృత సిద్ధాంతం ఉంది మనదగ్గర దమ్ము శక్తి ఉంటె ఏదో ఒక రోజు దాన్ని కనిపెట్ట గలం.2-ఈ విశ్వానికి అంతిమ సిద్ధాంతం లేనే లేదు కానీ అనంతమైనసిద్ధాంత క్రమం ఉండి.విశ్వాన్ని మరింతగా ఖచ్చితంగా వివరించ గలుగుతుంది .3-అసలు విశ్వానికి సిద్ధాంతమే లేదు ,సంఘటనలను ఒక కొంతపరిమితి దాటి ముందస్తు అంచనా వేయలేము ,ఒకోసారి అవి యాదృచ్చికంగా ,ఏక పక్షంగా ఏర్పడచ్చు .
శాస్త్రి గారి వ్యాఖ్యానం –ఈ మూడి టిలో వేద జ్ఞానం చివరిదాన్ని నిర్ణయించుకొని అందులో రెండవది ఒక భాగం అని చెప్పినట్లనిపిస్తుంది .ఈ కింది విధంగా దాన్ని విస్తరించి చెప్పచ్చు .
ప్రపంచం 7 లయల కు లోబడి నడుస్తుంది అని ప్రవచించింది .అవే సంస్కృతం లో గాయత్రీ ,త్రిష్టుప్ ,జగతి ,అనుష్టుప్ ,ఉష్ణిక్ మొదలైన ఛందస్సులు .అని ఇదివరకే తెలుసుకొన్నాం కనుక విశ్వం ఈ ఏడు ఛందస్సుల అధీనం లో పాలింప బడుతోంది. ఇందులో గాయత్రి ,త్రిష్టుప్,జగతి అనే మూడు ఛందస్సులు సమస్త విశ్వాన్ని పాలిస్తున్నాయి . వీటినే అలంకార యుతంగా వసు, రుద్ర ,ఆదిత్య గా ,8,11,12 సంఖ్యలుగా చెప్పారు .ఇవి వేదసాహిత్యం లో ముఖ్యంగా భగవద్గీతలో పదే పదే చెప్ప బడినాయి .వీటిని విష్ణు (వసు ),రుద్రా (త్రిష్టుప్ ),ఆదిత్య (గాయత్రి )గా గుర్తించి చెప్పారు .ఇందులో విష్ణువు సృష్టి కర్త ,రక్షకుడు. రుద్రుడు నాశన లేక లయ కారకుడు .ఆదిత్యుడు కొనసాగించేవాడు .వీరి రాజ్యాలు స్వతంత్రమైనవి(ఇండి పెండేంట్) ,వేరోకదాని ఆధారం లేనివి(ఒవెర్లాప్ ) ,,రద్దు అయ్యేవికావు(సూపర్ సీడ్).ఈ ముగ్గురు దేవతలు’’ శక్తి దేవి’’కిలేక ఆమె కుమారుడు గణపతి కి అధీనమై ఉంటారు.గణేశుడు గేలాక్సీలు ,నక్షత్ర మండలాలతో కూడిన సకల విశ్వానికి ప్రతినిధి .ఆయన శక్తి సామర్ధ్యాలు అగణితమైనవి -అపరిమేయమైనవి .
పేజి -166,పేరా -2
దేవుడు మనసు మార్చుకొని ఉండచ్చు అని దేవుని ఊహిస్తూ సెయింట్ అగస్టీన్ చెప్పింది అవాస్తవం( ఫాలసి )కు ఉదాహరణ .ఆయన దేవుడు కూడా ఒక ప్రాణి అని ,కాలం తో పాటు ఉంటాడని దేవుడు సృష్టించిన విశ్వం లో కాలం ఆయన ఆస్తి ,అనీ ఆయన సృష్టించినపుడు దేనికోసం సృస్టిం చాడో ఆయనకు తెలుసుననీ చెప్పాడు .
శాస్త్రి గారి వ్యాఖ్య –ఈ విషయం లో మనం పాశ్చాత్య ఆలోచనా పరులను అభి నందించాలి .వేదం ‘’కాలం అనేది దేవుని పీఠంఅనీ దానిపై నుండే లోకాలను పరిపాలిస్తాడని చెప్పింది .కాలం శేషం .సృష్టి మొత్తం వినాశానమైనా కాలం మిగిలి ఉంటుంది కనుక శేషం అన్నారు .కనుక దేవుని సృష్టిలో మొదటిది కాలమే అని నిర్ణయమైంది .అందుకే మహర్షి వేద వ్యాసుడు విష్ణుమూర్తి కల్పాల(సృస్టుల ) ) మధ్య విరామ కాలం లో ముడతలుగా ముడుచుకొన్నఆది శేషునిపై పవళించినట్లు వర్ణించాడు .ఇదే కాల చక్ర భ్రమణం అని ,శేషుడు అంటే కాలం విష్ణువు ను సేవిస్తున్నాడని ,ఆయన పడగలనీడలో హరి నిద్రిస్తున్నాడని అంతరార్ధం .సృష్టి ప్రారంభించాలి అని ఆయన అనుకోన్నప్పడల్లా కుమారుడైన బ్రహ్మను సృష్టి చేయమని ఆదేశిస్తాడు .విష్ణుమూర్తి మాత్రం’’ పాము పడక’’ దిగకుండా కాల సింహాసనం పై దర్జాగా విశ్రాంతి పొందుతూ ఉంటాడు .ఆయన అక్కడే ఉన్నాడు ఉంటాడు .ఆయనకు ఆది అంతాలు లేవు .బ్రహ్మ సృష్టి ప్రక్రియ ప్రారంభించగానే కాలం ప్రారంభమవుతుంది .సృష్టి నశిస్తే దానితో పాటు కాలమూ సమాప్తమౌతుందని ఇదివరకు అధ్యాయాలలోనే వివరంగా చెప్పుకొన్నాం .కనుక కాలం సృష్టికి ఆస్తి.
సమాప్తి –పేజి -168,పేరా 1
నువ్వొక స్పెషలిస్ట్ అయితే ,అప్పటికీ ,సైంటిఫిక్ సిద్ధాంతాలలో కొన్ని విషయాలు మాత్రమె నీకు తెలిసి అర్ధం చేసుకోగల్గుతావు .సైన్స్ అభివృద్ధి యెంత వేగం గా ఉందంటే స్కూళ్ళలో కాలేజీ యూని వర్సిటీలలో నేర్చింది అంతా ‘’కొంచెం ‘’అవుట్ ఆఫ్ డేట్ ‘’అయి పోతుంది .అంటే కాలానికి తగినది కాదని పిస్తుంది .అతి కొద్దిమంది మాత్రమె వేగంగా పురోగమించే జ్ఞాన సరిహద్దు (నాలెడ్జ్ ఫ్రాంటియర్)అందుకోగలరు .వారు తమ కాలాన్నంతటినీ వెచ్చించి ఇందులో కొద్ది జాగా లోమాత్రమె ప్రత్యెక నైపుణ్యాన్ని చూపగలరు .మిగిలిన జనాభా కు ఈ పురోగమనం విషయం , అది కలిపించే ఉత్సాహం భావోద్రేకం అసలేమీ తెలియదు .
శాస్త్రీ జీ మహా భాష్యం –నిజానికి ‘’’ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’(కాలం సంక్షిప్త చరిత్ర )అనే స్టీఫెన్ హాకింగ్ శాస్త్ర వేత్త రాసిన గ్రంధం లో ని పదవ అధ్యాయం లో ఉన్న మూడు పేజీలలోని ప్రతి మాటను ‘’యూని ఫైడ్ దీరీ ఆఫ్ ఫిజిక్స్ (యూని ఫైడ్ దీరీ ఆఫ్ యూని వర్స్) ను అన్వేషించే వారందరూ బట్టీ పట్టి జ్ఞాపకం ఉంచుకో దగినదే . దీనినే సాధారణ భాషలో’’ సత్యం ‘’అంటారు .వేదందీన్ని గుర్తించింది . నిత్య జీవిత సంగ్రామం లో సతమతమయ్యే ప్రజల దృష్టిని దీనికోసం మళ్ళించవద్దని ,జీవితాన్ని సత్యాన్వేషణలో త్యాగం చేయాలను కొన్నవారి కి మాత్రమె దీనిపై శిక్షణ నివ్వాలని నిష్కర్ష గా చెప్పింది .భగవంతుని సర్వ సమర్పణ చేసినవారు అవగాహన చేసుకొన్న వారు సత్య స్వభావాన్ని చేరటానికి అవగాహన సమర్ధం కాదని అనుభవించటం ద్వారానే సాధ్యమని చెప్పారు .దీనికి కఠినమైన ,శీలం, నైతికత ,ఆధ్యాత్మిక నియమావళి కావాలి .ఈ విషయాలనన్నిటినీ కేనోపనిషత్ ఒక్క వాక్యం లో చెప్పింది –
‘’మానవులారా –నమ్మండి –ఆత్మ తెలుసుకొన్నాను అన్నవాడికి తలియ బడదు ,నాకు తెలియదు అన్నవారికి ఆత్మతెలియ బడుతుంది .-
‘’అవిజ్ఞాతం విజానతాం-విజ్ఞానాతం అవిజ్ఞానతం’’
వారిలో రెండవ వర్గంలోని జ్ఞాని- స్టీఫెన్ హాకింగ్ – భగవంతుడు ఆయన్ను ఆశీర్వ దించుగాక .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-16-ఉయ్యూరు

