ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -99
43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్ సేన్
సన్ వెన్ అని చైనా వాళ్ళు ఆప్యాయం గా పిలుచుకొనే సన్యట్ సేన్22-11-1866న చైనా దేశం అవినీతి ,కుట్రా కుతంత్రాలతో కుది౦చుకుపోతూ పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉన్నప్పుడు చైనాలోని ‘’టౌన్ ఆఫ్ బ్లూ వాలీ ‘’అని పిలువబడే చోయ్ హాంగ్ లో జన్మించాడు .అద్భుత చియాంగ్ వంశ రాజురికం విచ్చిన్నమైపోతోంది .విదేశేయులు ద్వారాల దగ్గర నిలబడటమే కాక వారిని ఊది పారేస్తున్నారు .అన్నాం ఫ్రెంచ్ సంరక్షణలో ,హాంగ్ కాంగ్ బ్రిటిష్ వారికి దక్కి ,మరో అయిదు ఓడరేవులుప్రారంభమై పాశ్చాత్య వర్తకులను ఆహ్వానించాయి .టైపింగ్ తిరుగు బాటు దారులను ఓడించినా ,వారింకా సామ్రాజ్య సైనికులను వేధిస్తూనే ఉన్నారు .
చైనాలో కుటుంబం లేక వంశం పేరుముందు ఉంటుంది .’’సన్’’ అంటే వారసుడు అని అర్ధం .’’యట్ ‘’అంటే విశ్రాంతి అని అర్ధం .తల్లి తనకొడుకు విలాసంగా జీవి౦చరాదని కోరుకొంటుందనే భావానికి సూచన ‘’.సేన్ ‘’అంటే తల్లికి ఉండే మరో కోరిక ‘’చిరంజీవి ‘’గా వర్ధిల్లాలని తెలుపుతుంది .ఈ కుర్రాడి స్కూల్ లో పేరు ‘’వెన్ ‘’అంటే విద్యావంతుడు అని అర్ధం .చైనీయులుతమ పేర్లను ఆషామాషీగా భావించరు.దానికొక పరమార్ధం ఉందని పేర్లు పెడతారు . సేన్ తండ్రి ‘’సన్ తట్ సంగ్’’చదువురాని వరి పండించే రైతు .కౌలుకు భూమిని తీసుకొని వ్యవసాయం చేసేవాడు .ఇంటిని మట్టి ,గానుగ సున్నం తో కట్టుకొన్నాడు .ఇంట్లో నేల నెర్రెలు విచ్చి ఉండేది .ముగ్గురు కొడుకులలో సేన్ చివరివాడు .ఇతను పుట్టే సరికి తండ్రికి54,తల్లికి40 వయసు .ఇద్దరాడపిల్లలు ,విధవలైన ఇద్దరు ఆంటీలు .ఇంతమంది ఇరుకిరుకుగా ఆ ఇంట్లోనే గడిపేవారు .కస్టపడ్డప్పటికీ సేన్ బాల్యం సంతోషంగానే గడిచింది .గాలిపటాలు చేపలవేట ,సెలవల్లో మందుగుండు సామగ్రి తయారు చేయటం తో కాలక్షేపం .మిగిలిన ఊరి పిల్లలకంటే ఒక విషయం లో వేరుగా ఉండేవాడు .నాగలి దున్నటం ఆచారం ఇస్టము౦ డేకాదు .స్వేచ్చగా స్వాతంత్ర గీతం పాడుతూ దేశ దేశాలు తిరిగే పక్షిలా ఉండాలనుకోనేవాడు .ఆవిషయాన్ని బహిరంగం గా చెప్పలేదు కాని అతని మనసులోని కోరిక మాత్రం అదే .పక్షి చేసే కిలకిలా రావం వింటే ఈభావామే పొటమరించేది..తెలియని సుదూర దేశాల గురించి కలలు కనేవాడు .ఒక ముసలి సైనికుడు గ్రామీణ మాండలికం లో అసాదారణమైన టైపింగ్ ల యుద్ధాలు ,వాళ్ళు యుద్ధ వీరులను ఎదిరించటాలు ,బానిసత్వం పై ద్వేషం ,అందరికీ సమానంగా భూమిని పంపిణీ చేయటం ,శిలువకు తప్ప దేనికీ వంగని ధైర్య సాహసాల గురించి చెప్పిన కదలు విని ఊగిపోఎవాడు .
బాల్యం లో అందరిలాగానే కస్టపడి స్కూల్ కు వెళ్లి చదివాడు .ముఖం దేవాలయ బడి , గోడకు పెట్టి ,పంతులగారి వెదురు బెత్తం దెబ్బలకు అటూ ఇటూ కదుల్తూ చైనావారి ఒకటో తరగతికిచెందిన మూడక్షరాల క్లాసిక్ బట్టీ పడుతూ ఉండేవాడు .ఇతని కుగ్రామం చాలా వెనుక బడినదే. ఎదిగే వయసులోనే ఈ ఊరు వదిలి వెళ్లి పోవాలని అనుకొనేవాడు . ఈ చాన్స్ 15ఏళ్ళ వయసులో వచ్చింది .ఇతనికంటే పదిహేనేళ్ళ పెద్దవాడైన అన్న ‘’ఆ మీ ‘’ హవాయి ద్వీపానికి వెళ్లి సంపన్నుడయ్యాడు .ఒక సారి ఇంటికొచ్చి తమ్ముడిని తనకు సహాయం గా తీసుకొని వెళ్ళటానికి తలిదండ్రుల అనుమతి కోరాడు .హానాలూలు చేరే టప్పటికి సేన్ బలమైన గడ్డం ,సున్నితమైన నోరు ఉన్న 14 ఏళ్ళ కుర్రాడే . అన్నకు అక్కడ ఒక ఫారం తో బాటు జెనరల్ స్టోర్స్ కూడా ఉంది .అక్కడ స్టోర్స్ లో పని చేస్తూ హవాయ్ ,జపాన్ మూలాలను గ్రహించి ,జ్ఞాన సంపాదనకోసం ఆరాట పడ్డాడు .అన్న తమ్ముడిని చర్చ్ ఆఫ్ ఇంగ్లీష్ స్కూల్ లో చేర్పించాడు .ఇక్కడ లెక్కలు బైబిల్ ,చరిత్ర నేర్చాడు .తండ్రి క్రైస్తవానికి మారాడు .కనుక ఈ చిన్నకొడుకు తాను కూడా క్రిస్టియన్ అనే అనుకొన్నాడు .ఇంగ్లీష్ భాషలోనే క్లాసులు జరిగేవి .తమ్ముడు ప్రజ్ఞావంతుడై ,పాశ్చాత్యులకంటే మరీ వేస్త్రెన్ గా మారిపోతున్నాడని అన్న అనుకొనే వాడు .17ఏళ్ళ వయసులో ఇంగ్లీష్ గ్రామర్ పరీక్షలో సేన్ బహుమతి పొందాడు .కుర్రాడు ముదిరాడు అని గ్రహించి సమాజం లో తన స్థానానికి ప్రమాదమని అన్న తమ్ముడిని చైనాకు తిరిగి పంపించేశాడు .
యువ సన్యట్ సేన్ చదువు తో తిరిగి వచ్చి ఇబ్బందిపెట్టాడు .సంప్రదాయాన్ని అనుసరించటానికి ఒప్పుకోలేదు విగ్రహారాధన ,పూర్వీకుల ఆరాధన ,పూజ లపై తిరగ బడ్డాడు .ఇంట్లో ఉన్న దేవతా విగ్రహాలలో ఒక దాని వేలు విరగ్గొట్టాడు .ఊరంతా ఆశ్చర్యపోయింది ఇతని ప్రవర్తనకు.బహిష్కరించి హాంగ్ కాంగ్ కు పంపేసింది .కొన్ని నెలల తర్వాత్ క్వీన్స్ కాలేజిలో చేరి బైబిల్ చదివి అత్యుత్సాహంగా క్రైస్తవం గురించి దిమ్మ తిరిగేట్లు మాట్లాడటమేకాక ఇద్దరు విద్యార్ధుల్ని మతం పుచ్చుకోనేట్లు చేశాడు .ఇంతలో యెంత మార్పో ?
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-1-16-ఉయ్యూరు

