ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -100
43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్ సేన్
.తన పరిపక్వతను, భర్తగానూ రుజూ చేసుకొటానికి సన్యట్ సేన్ కు 18 ఏళ్ళు వచ్చాయి .ప్రక్క ఊరిలోని రైతుకూతురిని ఆయనకు వధువుగా వారి ఆచారం ప్రకారం నిర్ణయించారు .దేవుడి విగ్రహం వేలు విరిచేసిన విషయ౦ మర్చిపోయారు .ముచ్చటగా పెళ్లి జరిగి పెళ్ళికొడుకు హాంగ్ కాంగ్ వెళ్ళాడు .పెళ్ళికూతురు కోడలిగా అత్తవారింట్లో విధులు నిర్వర్తిస్తోంది .19వ ఏట యువ బృందం సేన్ ను మిషనరీ అని ముద్ర వేసింది .అప్పటికే సేన్ మరో విషయం పై తీవ్రం గా దృష్టి పెట్టాడు .అప్పటికి అమలు లోఉన్నకుటుంబాలలో కొడుకుల్ని బానిసలుగా అమ్మట౦ , కూతుళ్ళను ,వేశ్యలుగా మార్చటం వంటి అనాగరక చర్యలపై తిరుగు బాటు చేశాడు .ఈ నిర్బంధం లో ఉన్న వారితో తానూ ఒకడై పోరాడాడు .దేశం లోని అవినీతి ,పాలకుల బలహీనతలు ,ఇతర దేశాల దాడులను ఎదుర్కోలేని పిరికితనం చూసి ఉద్రేక పడ్డాడు .వీటి పరిష్కారానికి సంస్కరణలు రావాలని కోరుకొన్నాడు. షిప్ యార్డ్ వర్కర్లు సమ్మె చేస్తుంటే వారికి అండగా నిలిచి ,సామ్రాజ్యవాదులను పారద్రోలవచ్చని ఆశించాడు ప్రజలకు సూటిగా సేవచేయాలనే తలంపుతో మోడరన్ మెడిసిన్ లో చేరాడు ,.1887లో కాంటన్లోని పోక్ సి హాస్పిటల్ లో అసిస్టంట్ గా చేరాడు .డాక్టర్ జేమ్స్ కాన్ ట్లీహాస్పిటల్ ప్రారంభించాక చేరిన మొదటి విద్యార్ధి సన్ యట్ సేన్ .అయిదేళ్ళ తరువాత గ్రాడ్యుయేట్ అయిన మొదటి బాచ్ లో వాడూ ఆయనే .ఈ కాలం లో రహస్య కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రాపగాండా తో పాటు సర్జరీ లోనూ నైపుణ్యం సాధించాడు .వయసు 29లో కన్ఫ్యూసియాస్ వేదాంతి చెప్పిన ప్రముఖ సూక్తిని ప్రకటించి దానినే జీవితం లో నినాదం గా తీసుకొని ఉద్యమించాడు .’’ఈభూమి ,విశ్వం ,అందరిదీ ‘’ అన్నదే కన్ ఫ్యూసియాస్ సూత్రం అదే సేన్ కు నినాద మంత్రమైంది .’’చావుకు సిద్ధపడే ‘( డేర్ టు డై)అనే పటిస్ట బృందాన్ని తయారు చేసి మొట్టమొదటి విప్లవ వ్యూహం పన్నాడు .దాన్ని కనిపెట్టి అతని అనుచరుల్ని అరెస్స్ట్ చేసి ఉరితీశారు .వారికి దొరకకుండా తప్పించుకోన్నవాడు సన్యట్ సేన్ ఒక్కడే .
చార్లీ సూంగ్ (యావో జు )అనే అమెరికాలో చదివిన ,మెధడిస్ట్ పారిశ్రామిక వేత్తతో సేన్ కు బాగా పరిచయమైంది .అతని రెండవ కూతురుచింగ్లింగ్ సేన్ కు రెండవ భార్య అయింది సూంగ్ గారి మిగిలిన కూతుర్లకూ ప్రసిద్ధ వ్యక్తులతో వివాహాలు జరిగాయి .ఇందులో పెద్దకూతురు ఎలింగ్ హెచ్ హెచ్ కుంగ్ అనే చైనీస్ మోర్గాన్ అని పిలువ బడే బాంకర్ భార్య .చిన్నమ్మాయి మీ లింగ్ జనరలిస్మో చాగ్ కై షేక్ కు భార్య అయింది .సేన్ వయసు సూంగ్ వయసు ఒకటే . ,ప్రగతిశీల రాజకీయ భావ వ్యాప్తి ,సాధన కోసం ఆయన కూడా యవ్వనం లో మిషనరీజీవితానికి స్వస్తి చెప్పాడు .ఆయన సన్యట్ సేన్ కు సెక్రెటరి అసిస్టెంట్ మిత్రుడు అయ్యాడు .ఆయనకున్న ముద్రణా వ్యవస్థ పైకి మత సాహిత్యముద్రణయే కాని చివరికి రెచ్చగొట్టే ఆశ్చర్యకర పత్రాలను ముద్రించేది .ఇలాంటిది ఎవరూ అచ్చు వేయటానికి సాహసించి ముందుకు రాలేదు అని ‘’సూంగ్ సిస్టర్స్ ‘’పుస్తకం లో ఎమిలి హాహన్ రాశాడు .ఇంపీరియల్ కోర్ట్ వీటిని గమనిస్తూ ,ఇవి రక్తపాత ధోరణిగా ఉన్నాయని భావించింది .అందుకనే సేన్ ఈయనపైనే ఆధారపడ్డాడు .ఆయనకూడా తన కుటుంబ సంక్షేమానికి తాన జీవితానికి ముప్పుగా భావించినా ,సేన్ కొత్త లోకా విష్కారానికి సహాయ సహకారాలు అంద జేశాడు సూంగ్ గారు సవ్య సాచిలాబైబిల్ను దాని సూక్తులను ఒక చేత్తో, విప్లవ సాహిత్యాన్ని రెండో చేత్తో ప్రింట్ చేసి వదులుతున్నాడు .చివరికి బైబిల్ ను బజారులో విసిరేసి ప్రభుత్వాన్ని పడగొట్టటం యెట్లా అని చర్చించాడు .
విప్లవ కుట్ర విఫలమైన తరువాత సన్యట్ సేన్ ను బలవంతంగా చైనానుంచి బయటికి పంపించేశారు .ప్రవాస జీఇతం లో ఎన్నో కష్టాలుపడి హవాయి అమెరికా ఇంగ్లాండ్ దేశాలు తిరిగి సామ్రాజ్య వాదుల నెదిరించటానికిమద్దతునూ ధనాన్నికూడగట్టాడు .అతని తలపై యాభై వేల డాలర్లునజరు పెట్టి ప్రభుత్వం ప్రకటన చేసింది .అత్యంత ప్రమాదకర పరిస్తితులనుండి అతి చాక చక్యం గా బందీ కాకుండాకొద్దిలో తప్పించుకొన్నాడు .ఇంగ్లాండ్ లో ఆయన్ను కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి చైనీస్ లేగేషణన్ లో ఉంచింది .తల తీయటానికి చైనాకు పంపించేముందు ,అందరి కళ్ళుగప్పి తన మెడికల్ సహా ధ్యాయి ,పాతమిత్రుడు సర్ జేమ్స్ కాన్ ట్లీ కి తనసంగతి రహస్యంగా తెలియజేశాడు .ఆయన దీనిపై ప్రజలను ,బ్రిటిష్ ప్రభుత్వాన్ని తనకున్న పలుకు బడితో కదిలించి సేన్ విడుదలకు మార్గం సుగమం చేశాడు .ఈ సంఘటన తో మన చైనా డాక్టర్ పేరు ప్రపంచమంతా మారు మోగిపోయింది .సన్యట్ సేన్ పేరు నిర్భీతికి ,నిశ్చల నిర్ణయానికి మారు పేరై నిలిచింది .’’ఇంతవరకు తయారైన ఏ తుపాకీకంటే వేగమైన వాడు సేన్ ‘’అన్నాడు ఆయన అనుచరుడొకడు .’’ఆయన పరిస్థితిని బట్టి మెరుపు వేగంగా అనువర్తించే వేగం ,తుపాకి గుండు వేగం కన్నా ఎక్కువ ‘’ఆయనేఅన్నాడు ముక్తాయింపుగా .కొద్దికాలం జపాన్ లో శరణార్ధి గా ఉన్నాడు .ఆయన్ను పట్టిస్తే చెల్లించే ధర పెంచింది ప్రభుత్వం .భయ సంకోచాలేమాత్రం లేకుండా మిలిటరీ తోనూ ,అండర్ గ్రౌండ్ అనుచరులతోనూ సంబంధాలను రహస్యంగా కొన సాగిస్తూనే ఉన్నాడు .జెనరల్ హ్వాంగ్ తో కలిసి ‘’పేట్రియట్స్ అసోసియేషన్ ‘’(దేశభక్త సంఘం )ఏర్పరచాడు .1910లో సౌత్ సి ఐలాండ్స్ లో విఫల నాయకుడిగా ప్రవక్తగా ,వేటాడ బడేవ్యక్తిలా గడిపాడు. అయినా నిరాశ చెందలేదు .సమాచారాలు అందటం ఆలస్యమఔతున్నాయె తప్ప అయన ప్రయత్నాలేవీ ఆగిపోలేదు. ఒకోసారి వార్తలు అడ్డ గించబడేవి,కాని పవిత్ర యుద్ధం కొన సాగుతూనే ఉంది .
అమెరికా వెళ్లాక విప్లవం అనే దాన్ని సన్యట్సేన్ ఆచరణలో పెట్టాడు .,అది 1911 సెప్టెంబర్ లో హాన్ కౌమీద బాంబు దాడితో ప్రారంభమైంది .తర్వాత డజన్ జిల్లాలో జరిగింది .దీన్ని చూసి ప్రభుత్వసైన్యం తీవ్ర దిగ్భ్రాంతి చెందింది .జపాన్ లో షాంగ్ కై షేక్ సన్యట్ సేన్ ప్రభావం లో పడిపోయాడు .అప్పుడే ఆతను మిలిటరీ స్కూల్ నుండి బయటికొచ్చాడు .వెంటనే అతన్ని హాన్చౌ లో ఆర్మీ చీఫ్ గా నియమించారు .కొలరాడో లో ఉన్న సన్ కు ఈ వార్త చేరింది .తూర్పు వైపుకు వెళ్లి సెయింట్ లూయీ వార్తా ప్పత్రిక ద్వారా తనను చైనాకొత్త రిపబ్లిక్ కు మొదటి అధ్యక్షుడిగా నియమించ బడినట్లు వార్తచదివి తెలుసుకొన్నాడు సంతోష పడ్డాడు .లండన్ వెళ్లి ,1912జనవరి మొదట్లో చైనా చేరాడు .నాంకింగ్ లోని జాతీయ సమావేశం లో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు సన్యట్ సేన్ ..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-1-16-ఉయ్యూరు

