నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
48శివ లీలార్ణవ రచయిత-కలువే నంజరాజు
కలువే వీర్రాజు అనే క్షచంద్ర వంశ క్షత్రియుని కుమారుడు నంజరాజు .భారద్వాజస గోత్రం .తండ్రి సైన్యాధ్యక్షుడై తర్వాత 18వ శతాబ్దం లో మైసూరురాజుఅయ్యాడు .తండ్రిలాగానే కొడుకు నంజరాజుతెలుగు కన్నడ సంస్కృతాలలో కవి. ఎందరో కవిపండితులకు ఆశ్రయమిచ్చి ‘’నవ భోజ రాజు ‘’అని పించుకొన్నాడు .ఇతని ఆస్థానకవి నవ కాళిదాసు ‘’నంజరాజ యశో భూషణం ‘’కావ్యం రాసి అంకితమిచ్చాడు . . నంజరాజకవి ‘’హాలస్య మహాత్మ్యం ‘’’’కాశీ మహిమార్ధ దర్పణం ‘’అనే రెండు తెలుగు కావ్యాలు రాశాడు .
సంస్కృతం లో నంజరాజు ‘’శివపాద కమల రేణు సహస్రం ‘’అనే వెయ్యి శ్లోకాల కావ్యాన్ని శివునిపై రచించాడు .దీనినే శివ లీలార్ణవం అంటారు ఇది వేదాంత దేశికుల పాదుకా సహస్రం కు అనుకరణ .ఇది 25 పద్దతులుగా విభజింప బడింది .ప్రతిదానికీ .ప్రస్తావన ,ప్రభావ ,భావన ,రూప ,ప్రసాదాన ,శృంగార ,కుసుమ ,ప్రణామ ,స్తుతి ,సంచార ,నియమ ,స్వాతంత్ర్య ,తాండవ ,రత్న ,అర్చన ,నక్షత్ర ,విడంబన ,భక్తీ ,శాస్త్ర ,యోగ ,విశ్రాణన ,దయా ,లక్ష్మి ,శైశవ ,చిత్ర అని పేర్లు పెట్టాడు .మొదటి శ్లోకం –
‘’ఈశం శైల సుతా నిభాస్య రారజో చండీశ్వరం నందినం –నత్వా భ్రుంగి రిటింత్రిషస్టమహితాశ్చభక్త్యున్నతాం క్త౦ ‘’
చివరి శ్లోకం
భద్రాకారం వహతు సదా నః స్వాన్తోమూర్తిం శివ పాద రేణోభవ్యే-భవ్యేదాసేమయి కరుణా ర్ద్రే భంగే స్తాపం శమయ సుధా దృష్టీనాం’’
ఆశ్వాశాంత గద్యలో –‘’ఇతి శ్రీ చంద్ర కుల జలధి కౌస్తుభ శ్రీ కలువే శ్రీ వీర రాజ గర్భ పయః పారావార తనూభవాభి నవ భోజ రాజ బిరుదాంకిత నంజ రాజ విరచితే శివ లీలార్ణవ నామ్నిశివ పాద కమల రేణుకా సహస్రే చిత్ర పద్ధతిః సమాప్తా ‘’.నంజ రాజు రాసిన రెండవ గ్రంధం ‘’గీతాగంగాధరం ‘’ఇదీ శివ స్తుతియే .గీత గోవింద పద్ధతిలో ఉంటుంది .నాలుగు కాండల కావ్యం .దీనికి అదే ఆస్థాన పండితుడైన కాశీ పండితుడు రాసిన శ్రవణానందిని అనే వ్యాఖ్యానం ఉంది .మొదటి శ్లోకం
‘’శ్రీ శైలజా చరణా పరసక్తి చిత్తః శ్రీ కంఠ పాద సరసీ రుహ చంచరీకః –శ్రీ వీర రాజ నృప శేఖర సత్కుమారఃశ్రీ నంజరాజ సుకవిఃకురుతెప్రబంధం ‘’.తరువాత శ్లోకాలలో వంశ చరిత్ర చెప్పుకొన్నాడు .చివరగా –‘’
వీర నృపాల నందన న౦జమహీపతివిరచిత గీతం –ధీరజనాయ తనోతు శుభాని సదా శివ వర్ణన పూతం ‘’అని పూర్తీ చేశాడు
49-తట్టిపల్లి నర కంఠీరవ శాస్త్రి ‘(19వ శతాబ్ది చివరి కాలం )
వట్టిపల్లి వెంకట లక్ష్మి ,సాంబ శివల పుత్రుడే కాశ్యప గోత్రీకుడైన నర కంఠీరవ శాస్త్రి ‘.తిరుపతి సంస్కృత కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్.19వశతాబ్ది చివరికాలం వాడు .20వ శతాబ్ది ప్రధమ భాగం లో మరణించాడు .ఎన్నోకావ్యాలు రాసినా కొద్ది లఘుకావ్యాలే దొరికాయి .అందులో శ్రీ వెంకటేశ్వరస్తోత్రం ,శ్రీ జ్ఞాన ప్రసూనా౦బి కా స్తోత్రం మాత్రమె మిగిలాయి .మిగిలినవన్నీ వ్రాతప్రతులుగా ఉండి పోయాయి .16ఏళ్ళ వయసులోనే ఆర్యా ఛందస్సులో 296శ్లోకాలాలో అభినవ వాసవ దత్తరాశాడు శివునిపై శ్లోకం తో మొదలు పెట్టాడు
వందామహే మహేశం వందారు జనాభి లాషిత మందారం –బృందారక మణి మకుటీసుందానిత సూన .మురభితా ౦ఘ్రి యుగం ‘’
తర్వాత పార్వతి గణేశ సరస్వతిలను వాల్మీకిని స్తుతించాడు .వివరంగా వంశ చరిత్ర చెప్పాడు .
జ్ఞాన ప్రసూనామ్బికా నవ రత్న మాల లో 9అశ్వధాటి శ్లోకాలున్నాయి .అమ్మవారు కాళహస్తిలోని దేవత ‘
’కంఠారవో దధుప కంఠారిదుర్విహకంఠీర వేంద్రా గమనో –త్కంఠానికామ సహితి కంఠాను కర్షికలక కంఠామలాప లలితా
శృంఠీభవ హనుజ క౦ఠీరవ ప్రకర కుంఠీకృతిక్షమ బలా –కుంఠీ కరోతు నర కంఠీరవాఖ్య కవి క౦ఠీరవస్య దురితం ‘’.ఈకవి కొన్ని గ్రంధాలకు సంపాదకత్వం వహించాడు అవి –వెలు వెంటి గరుడా చాల యజ్వ రాసిన తప్త చక్రాంక విధ్వంసనం , ,అయ్యాన విద్వత్ రాసిన వ్యాస తాప్తర్యా నిర్ణయం.
50-నారాయణప్ప మంత్రి
ఈ కవి కాలాదులేమీ తెలియ రాకపోయినా ‘’అభినవ భారతం ‘అనే 24సర్గల మహా కావ్యం రాసినట్లు తెలుస్తోంది .మొదటిదానిలో ప్రారంభం చివరిదానిలో సమాప్తం దొరకలేదు .దేవయాని శర్మిష్ట ల కద ఇది .మొదటి సర్గలో శంతనుని వివాహ వర్ణన ఉన్నది
‘’విజ్ఞాప్య మాత్రే సుర సిద్ధ సూను రంబాలికా౦బికయా సహాంబం –పాణిగ్రహం కార యితుం చ తాసాం విచిత్ర వీర్యేణ సముదాతో భూత్’’
చివరలో యుదిస్టిరుని పరిపాలన ఉంది
‘తస్మిన్ మహీం శతాని ధర్మ సూనౌ ప్రజాః స్వధర్మే నిరతాఃసమస్తా –కలిస్తదానీంన భూమౌ ప్రవర్తితః కర్తాయుగశ్చధర్మః ‘’ఆశ్వాసాంత గద్యలో –‘’ఇతి నరసప్ప మంత్రి కృతాభినవ భారతే మహాకావ్యే త్రయో వింశతి సర్గః ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-1-16-ఉయ్యూరు

