అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-5
18-18 పురాణాలూ చెప్పగల సమర్ధులు
ఒకదాని లోంచి ఇంకోదానిలోకి దూకే మహనీయులు
ఏది మొదలెట్టి ఏమి చెబుతున్నారో అర్ధంకాని అసహాయులు
ఈ మధ్యే ‘డ్రాయర్ పురాణం ‘’అరగంట సుమారు చెప్పారట
అసలు విషయం కంటే ఏదైనా చెప్పగల సమర్ధులు
భర్త స్నానం చేసి వదిలేసిన డ్రాయర్ని భర్త ఝాడించి ఆరేయ రాదట
ఆరేస్తే ఆయుక్షీణమట భార్య ఉతికి ఆరేస్తేనే మోక్షమట
మరి భార్య బాల్చీ తన్నేస్తే ఏం చేయాలి మహానుభావా !
డ్రాయర్ ఉతుక్కోసం మళ్ళీ పెళ్ళాడమని ఏ శాస్త్రం లోనైనా ఉందా ?
విషయపు లోతులు తరచి విశేషాలు చేబుతారనుకొంటే
మీ లోతు డ్రాయర్ దాకా వెళ్ళిందన్నమాట
ఆహా ఏమి పురాణం ? ఏ కాలం లో మనమున్నాం ?
ఆధునిక సాంకేతిక కాలం లో ఉన్నమనం ఎలా
సమస్యల సుడిగుండాలనుంచి బయట పడి
జీవితం సార్ధకం చేసుకోవాలో వివరించండి స్వామీ !
అర్ధం పర్ధం లేని ఈ పిడకల వేట ,డ్రాయర్ పురాణం ఎందుకు ?
మనుషుల్ని సంస్కరించటమంటే డ్రాయర్లూ గోచీలు లుంగీలు లంగాల
మురికి వదిలించటం కాదు –మానసిక మాలిన్యాన్ని వదిలించాలని నేర్పండి
అప్పుడే మీ ఆధ్యాత్మిక ఉన్నతి పెరుగుతుంది,ఎకుంటే అధోగతి
అని ,నేనన్నా నంటే ఏమీ అనుకోకండి .
19-చానెళ్ళు పోషిస్తున్నాయని ఒక్కోరూ ఒక్కో చానెల్ కు
అతుక్కుపోయి తాము చెప్పిందే వేదం అంటున్నారు
షిర్డీ ప్రచారకుడూ ,వేద వేదాగ సారీ ఈమధ్య సినీ ప్రచారకులూ అయిన
ఒకాయనా ఒకరు నమ్మిన వారిని రెండోవారు ఈ మధ్యే దూషిస్తే
రెండు గ్రూపుల అనుయాయులు ఒకరినొకరు బండ బూతులతో భూషించుకొన్నారట
వేరే ఒకాయన పల్లీలు బటానీలు తింటూ తినిపిస్తూ
డొల్లు కబుర్ల తో చానెల్ ను నడిపిస్తున్నారట
ఇదేం పోయే కాలం గురూ అని బుర్రలు బద్దలు కొట్టుకొంటున్నారట
బుల్లి పెట్టెను బద్దలు కొట్టుకొనే ధైర్యం లేక వీక్షకులు .
చానెళ్ళు మంచిని పెంచి మమతను పంచి మనసుల్ని చల్లబరచాలికాని
ఈ వింత వికృత విరోధ చేష్టలు చేటుకాలపు ధోరణులకు
ఫుల్ స్టాప్ పెట్టకుంటే మన ధ్యేయానికి ,మానవత్వానికీ మాయని మచ్చ
అందరి ధ్యేయం సర్వోన్నత మానవ పరిమాణమే కావాలి కాని
నికృష్ట నీచ మానవ స్వభావ దిగ జారుడు తనం కాదు
అందరూ పెద్దలే, పెద్ద మనుషులే మధ్యలో ఉన్న బంగారుపళ్లెం మాయం ట
తీరు మార్చు కో౦డి చానెళ్ళ గురు బ్రాహ్మలు గార్లూ !
అతి వికటించి ,పైత్యం ప్రకోపించి మీ భరతమే ప్రేక్షకులు పడతారేమో జాగ్రత్త
అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-16 –ఉయ్యూరు