´వరద ´లో తేలి (రి )న తేట ఊట -3
13-విశ్వ నాథ -విశాఖ హై స్కూ ల్ లో వరద కోరిక పై విశ్వనాధ కొన్ని పద్యాలు చదివారు -అందులో రెండు –
”ఓయి నృపాల!ఈ బుడుత -యొక్కడు నాదు కులంబు తేవ నీ -ఓ అతి ధర్మరాజువయ-యో !ఇది వినుటయా !గతానువై -ఈయను గేగె బో తినుట -కేమిక నున్నది నాకు నేమి నే-డే యిదె !వీని వెంటబడి -యేగెద కోడలి కేమికా వలెన్ ?అనే పద్యాలను వయో వృద్ధురాలైన ఒక స్త్రీ స్వరాన్ని అనుకరిస్తూ రుద్ద కంఠం తో చదివితే మేష్టారు విద్యార్థులూ అందరూ కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఆయన వంక అలానే చూస్తుండి పోయారట ..
వర్షం కురుస్తున్న తీరును వర్ణించే -”నట శివ సాయం సంధ్యా -చ్ఛటా ఘటా నూపురమణి సంభవ కాంతి -స్ఫట ‘చిట చిట చిట ”నినాదో -ద్భట కనకము విజయవాటి వర్షము కురిసెన్ ”పద్యం చదువుతుంటే అసలు వర్షం కురుస్తున్నదే మో నన్నంత భావన కలిగిందట ..
బయటికి వస్తూ ”బాగుందా ”అని అడిగితె ”బలే ఏడిపించారండీ ”అన్నాడు వరద .”ఇదా ఆఖరికి ”అన్నారట విశ్వనాథ ..
విశ్వనాధ దాసు శ్రీరాములు కవిని బాగా మెచ్చేవారట ..ఆయన రాసిన ”తెలుగునాడు ”లోని పద్యాలన్నీ విశ్వనాథకు తమ్ముడు వెంకటేశ్వర్లుకు కంఠతా వచ్చు . శ్రీరాములుగారు పాండిత్యాన్ని తమగురువు వెంకట శాస్త్రిగారే తెగ మెచ్చుకొని వారట . రాములుగారు తెలుగు సంసారాన్ని అతి కూలంకషంగా పరిశీలించి రాసిన కావ్యం అది విభిన్న శాఖలు ,వర్ణాలు పరిశీలించి మన సమాజం ఎలా విచ్చిన్నమైందో వివరించారు
— ”తెలుగు నాట ఈ వైదీకి ,నియోగి గోల ఏమిటో ?అన్నారు మల్లాది రామ కృష్ణ శాస్త్రి .వెంటనే విశ్వనాధ ”ఆదో చమత్కారం .పోటీ పడి రాస్తారని ”అని -”తొ లి నియోగులే కవులు తెలుగునాట -నేటికిని వారె సాహితీ నేత లైరి ”అన్నారు ఆశువుగా .,కొప్పరపు సోదరులు బెజవాడలో అవధానం చేయగా మెచ్చి -”తొ లి నియోగులు సిసలైన తెలుగు కవులు -తెలియ పలనాడు చిక్కని తెలుగుగడ్డ -ఆశుకవనంబులో మీ ఇంటి ఆడు బిడ్డ -యే ను దీవన లిత్తు నెన్నే ని మీకు ”అని ఆశీర్వ దించారు .
ఒక రోజు రైలు ప్రయాణం లో ఇద్దరు విద్యార్థులు విశ్వనాధ కవితా మహత్వాన్ని వారిలో వారు చెప్పుకుంటూ మెచ్చుకోవటం పై బెర్త్ పై పడుకున్న విశ్వనాధ విని వరద జరుక్ లతో ”నాకు దుఃఖం కూడా వచ్చింది .నన్ను మెచ్చుకునే వాళ్ళు ఈ దేశం లో ఉన్నారు -ఒక్క తిట్టే వాళ్ళే కాక ”అన్నారట ఆనందంగా ..
ఆధునిక కవుల చాటు పద్యాలన్నీ సేకరించి అచ్చు వేయాలని శ్రీ శ్రీ ,వరద కలలు కన్నారు .అప్పటికి వాళ్ళు రాసింది పదే .విశ్వనాధ ను అడిగితె తనవి అయిదారు వందలు ఉంటాయన్నారు .
వరద మేనత్తకు విశ్వనాధ రాసిన దయాంబుధి పద్యాలు నోటికి బాగావచ్చి ఎప్పుడూ చదువుకొంటూ ఉంటుంది .అవి వరాద కూ ఇష్టమే –
1-నా కనుల యెట్టయెదటన నా జనకుని -నా జనని కుత్తుకలను కోసి నన్నడిగె న-తండు ”నే దయాంబుధిని కాదా ”యటంచు -ఓ ప్రభూ !యగునంటి నే నొదిగి యుండి ”
2-నా కనుల ఎట్ట యెదుటన నా లతాంగి – ప్రాణములు నిల్వునం దీసి యడిగె నను న -తండు ”నే దయాంబుధిని కాదా ”యటంచు -ఓప్రభూ!యగు నటి నే నొదిగి యుండి ”
3-కన్నుల ఎట్ట ఎదుట నా యనుంగు -తనుజు కుత్తుక నులిమి తా నను నడిగె ,న -తండు ”నే దయాంబుధి ని కాదా ”యటంచు -ఓ ప్రభూ !నీవ య0టి నే నొదిగి పోయి ”. విశ్వనాథ అతి సామాన్యమైన ,సార్వ జనీనమైన లోక వృత్తాన్ని ,మానవ హృదయం విహ్వ లించేట్టు తన పద్యాలలో దర్శనం చేయించారని వరద విశ్లేషించాడు .. అలాగే ఆయన ”అంధ భిక్షువు ”కూడా .
14-దువ్వూరి రామి రెడ్డి -భాష మీద అధికారం ,భావ శబలత,ఛందస్సుసౌందర్యం లో ప్రావీణ్యం సమపాళ్లలో ఉంటె శ్రవణ యోగ్యమైన హృదయ స్పందన కవిత్వం వస్తుంది అని రెడ్డి గారి నమ్మకం . నిజంగానే ఆయన పద్య నిర్మాణం లో సౌందర్యాన్ని సాధించారు అన్నాడు వరద..ఫిరదౌసి కి ఫిట్జరాల్డ్ చేసిన ఆంగ్ల అనువాదం దోష భూయిష్టంగా ఉందని దానికి కారణం అతనికి పారసీక భాషాజ్ఞానం తక్కువని రెడ్డిగారి నిశ్చితాభిప్రాయం . మరో పారసీక భాషా వేత్తతోను ,ప్రసిద్ధ ఆంగ్లకవి రాబర్ట్ గ్రేవ్స్ చేత అనువాదం చేయించి లండన్ లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ఉమర్ ఖయ్యామ్ రుబాయిలను ప్రచురించింది .కానీ ఫిటీజెరాల్డ్ అనువాదమే గీటు రాయిగా నిలిచింది .
15-బలిజే పల్లి లక్ష్మీ కాంతం -సత్య హరిశ్చంద్రీయ నాటక కర్త . సినిమా వేషాలకు మద్రాస్ వెళ్లారు .తానూ అబ్బూరివారి నటాలి లో వేషాలు వేయాలని ఉబలాటం .అప్పుడు అబ్బూరి సీనియర్ మద్రాస్ లో కన్యా శుల్కం నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు .బలిజేపల్లికి అగ్ని హోత్రావధాన్లు పాత్ర ఇచ్చారు .మధుర వాణి పాత్రకోసం వెదుకుతున్నారు .రాజమండ్రి లో ఒకమ్మాయి ఉందని ఆమె పోలీస్ ఇన్స్పెక్టర్” ఇలాకా ”అని ఆయనకు ఆమెను నటిని చేయాలనే ఉబలాటం ఉందని తెలిసి వెళ్లారు .ఆమె లావుగా బొద్దుగా మొహం మీద అద్దకం తో కొంచెం కృత్రిమంగా ఉంది .ప్రశ్న అడిగితె జవాబు ఇన్స్పెక్టర్ చెబుతున్నాడు . ఆమె సమాధానం లేదు .’పాడగలదా అని అడిగితె ఆమెకు వినిపించకపోతే ఇన్స్పెక్టర్ ఇల్లు దద్దరిల్లేట్లు ఆవిడ చెవి దగ్గర అరచి చెప్పాడు .ఆవిడ నవ్వింది అంతే .ఇక చాలుబాబోయ్ అనుకోని నెత్తిన గుడ్డ వేసుకొని చెన్నై చెక్కేశారు
దీనిపై కాంతంగారు ఆశువుగా -”మధురవాణి కాదు మంచి బధిరవాణి -కామ కృతికి తగ్గ కాంత యిద్ది -రంగతల మనంగ రంగ స్థలము కాదు -మరి తిరోగమనమె మనకు దిక్కు ”
15-రాయప్రోలు సుబ్బారావు -”వేగాతి వేగోక్తి దుర్వ్యసనం ”లో నుంచి బయట పడ్డారు ..ఆశుకవిత్వం అవధానాలు స్వస్తి చెప్పారు . జన్మ స్థానం వెదుళ్లపల్లి .ఆయనతో వంశీగానం తెలుగు కవిత్వం లో ప్రారంభమైందని పెద్ద అబ్బూరి అన్నారు -దానికి దీటుగా తెలుగు గొప్పదనాన్ని రాయప్రోలు –
”వంశీన్ వంచి ,మృణాలమున్ మెలిచి ,పక్వ ద్రాక్ష నెండించి ,వా -గ0శల్ మార్దవ మాధురీ ,సుభగ విన్యాసంబు జిల్కన్ ,దశ -త్రి0శ ల్లక్ష జన ప్రసన్న రసనా దేవాలయా భ్యంతర -ప్రాంశు ప్రార్ధన గీతమైన తెలుగు బల్కున్ ప్రసంశించెదన్ ”అన్నారు జోరు చప్పట్ల మధ్య ..
శివ శంకర శాస్త్రి రాయప్రోలు వారి తృణకంకణం ఆధునిక కవిత్వానికి ఆది గ్రంధం అన్నారు . కాదు వెంకట పార్వతీశ్వరకవుల ”ఏకాంత సేవ ”అన్నారు కొందరు .
వెంకట శాస్త్రిగారు ”అందమైన పద్యమ్ము నల్లు నతడు-నునుపు బోగుల పట్టు నేసిన విధాన ”అని రాయప్రోలుకవిత్వాన్ని మెచ్చారు ..
వరదతో రాయప్రోలు ”ఆధునిక ఆంద్ర కవిత్వానికి నేను ఆద్యుడిని అని నేను ఎప్పుడూ చెప్పుకోలేదు .ఒకే ముహూర్తాన కొంచెం అటూ ఇటూగా గురజాడ నేనూ ,మీనాన్న రామ కృష్ణారావు తెలుగు కవిత్వం లో రాచబాట వేసాం .ఆధునిక కవిత్వ శకారంభానికి ఎందరో మహానుభావులు రాచబాట వేశారు .అందరూ చిరస్మరణీయులు . పూజ్యులే సభాపతి తృణకంకణం ఆధునిక కవిత్వానికి ఆది గ్రంధమన్నాడు . భావకవిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అతడు అలా అని ఉంటాడు అదీ కొంతవరకే నిజం .కవిత్వం గురించే మాట్లాడుకోవాలికాని ఎవరాద్యులు అనేది అనవసరం ”అని వినయంగా చెప్పారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా