గుజరాత్ దిగుడుబావుల చరిత్ర
గుజరాత్ రాష్ట్రం సోమనాద్ ,ద్వారక వంటి పుణ్యక్షేత్రాలు, గాంధీ పటేల్ మొరార్జీ వంటి రాజకీయనాయకులకు ,జౌళి పరిశ్రమకే కాక దిగుడుబావులకూ ప్రసిద్ధి చెందింది .ఇటువంటివి 120 దాకా ఉన్నాయి .సి౦ధునాగరకత కాలానికే ఇవి బహుళ వ్యాప్తమైనాయి .దోలావీర్ మొహంజదారో లలో ఇవి కనిపించాయి .ఇవి గుజరాత్ వాయవ్య భాగాన ఉన్నాయి.ఇక్కడినుండి ఉత్తరానున్న రాజస్థాన్ కు వ్యాపించాయి .చాళుక్య ,వాఘేల వంశారాజుల పాలనలో 10 నుంచి 13 వ శతాబ్దం వరకు. ,.కాని వీటి నిర్మాణం 11 నుండి 16 వ శతాబ్దాలకుమహోత్క్రుస్ట దశకు చేరింది .13 నుండి 16 శతాబ్దం వరకు పాలించిన మహమ్మదీయులు ఈ నిర్మాణాలను యధాతధంగానే ఉంచటమేకాక ప్రోత్సహించారుకూడా.
దిగుడుబావుల నీరు పవిత్రమైనదని అనాదికాలం నుండీ విశ్వసిస్తున్నారు .అతి ప్రాచీనమైన దిగుడుబావి జునాగడ్ లోని ఊపర్ కోట్ గుహలలో ఉన్నాయి .ఇవి నాలుగవ శతాబ్దికి చెందినవి .నవ ఘాన్ కువో అనే బావి మెట్లు గుండ్రంగా ఉండటం ప్రత్యేకత .బహుశా ఇవి పశ్చిమ సాత్రపుల కాలం 200-400 లో లేక మిత్రకార పాలన 600-700 కాలం లో నిర్మింపబడి ఉండవచ్చునని ఊహిస్తున్నారు .బావి ని గుజరాతీ లో’’వావి ‘’అంటారు .వకు బా కు భేదం లేదని మనకు తెలిసిందే .దీని ప్రక్కనే ఉన్న’’ ఆది కాదిని బావి ‘’10 వశతాబ్ది పూర్వార్ధం లో కట్టారని భావిస్తారు చాళుక్యరాజులపాలనకు పూర్వమే రాజ్ కోట్ జిల్లా’’ధంక్’’లో లో దిగుడుబావులనిర్మాణ౦ జరిగి, అవే అతి పురాతనమైనవిగా గుర్తింపు పొందాయి .దీనికి దగ్గరలో అలేక్ కొండలపై’’ బొచావ్డి నెస్’’ వద్ద ఉన్న బావి పై వాటికంటే ప్రాచీనమైనది.600 ప్రాంతం లో నిర్మించబడిన ఝిలాని ,మంజుశ్రీ దిగుడుబావులు సౌరాష్ట్ర శిల్పకళతో ఉండటంవలన 7 వశతాబ్దికి చెందినవని తేల్చారు .
చాలుక్యులపాలనలో నిర్మింపబడిన దిగుడుబావులు కళాత్మకంగా ఉన్నాయి .మొధేరా సూర్య దేవాలయానికి పడమరగా ఉన్న నీటి కుండం 11 వ శతాబ్ది ది.భూమిపైకి ఉన్నమండపం 10 వశతాబ్ది ది. 1050 లో పఠాన్ లో ‘’రాణీగారి బావి’’ నిర్మించారు .దావడ్ లోని అంకోల్ మాత బావి , అహ్మదాబాద్ లోని భవానీమాత బావి 11 వశతాబ్ది చివరలో ఏర్పడినవి .చాళుక్యరాజు జయసింహ సిద్ధ రాజు తల్లి మినాల్ దేవి జ్ఞాపకార్ధం వీరగావ్ తటాకం ,నాదియాడ్ లో దిగుడుబావి నిర్మాణం జరిగాయి .సబర్కాంత జిల్లా బలేజ్ గ్రామం లో ఉన్న మినాల్ దిగుడుబావి 1095 లో నిర్మించారు .రాజ్ కోట్ జిల్లా విర్పూర్ లో ఉన్న మినాల్ దేవి బావి చాళుక్య కళాత్మికంగా నిర్మించారు.అహమ్మదాబాద్ లోని అసపూరి వద్దా ,ఝింజువాడా లోని దిగుడుబావులు 12 వ శతాబ్దికి చెందినవి .సురేంద్రనగర్ జిల్లా చోబారి లోను ,ధన్దాల్ పూర్ లోని బావి జయసింహ సిద్ధరాజ్ నిర్మించాడు .12 శతాబ్దిపాలకుడు కుమారపాల కాలం లో చాలా దిగుడు బావులు నిర్మించాడు .పఠాన్ దగ్గర వాయడిబావీ ఇప్పటిదే .వద్వాన్ వద్ద ఉన్న గంగా దిగుడుబావి 1169 లో కట్టబడింది .చాళుక్యరాజుల పాలన చివరి రోజులలో రాకీయ అనిశ్చిత పరిస్థితులవలన బావుల నిర్మాణం మందగించింది.నవ్లఖా దేవాలయం దగ్గరున్న వీకియా, జీతా బావులు ,బరోడా కొండలపైఉన్న ఘూమ్లి బావి 13 వ శతాబ్ది వి .బరోడాకొండలదగ్గర విసవాడ గ్రామం లోని జ్ఞాన బావి రెండవ భీమరాజు కాలం లో కట్టబడినవి .
వంతాలి జునాగడ్ ల మధ్య ఉన్న రాకేంఘర్ బావి తేజపాల్ ,వాస్తుపాల్ – అనే వాఘెలాఆస్థాన మంత్రి సోదరులు కట్టించారు .వాఘేల రాజు విలాస దేవ్ 1225 లో దభోయ్ వద్ద దిగుడుబావికట్టించి గేట్లూ,దేవాలయాలు నిర్మించాడు.దభోయ్ లోని సత్ముఖి బావి పైన దేవాలయం ఉంది .ఇవికాక 7 బావులుకూడా నిర్మించాడు .వాద్వాన్ లోని మాధవవ్ బావి 12 94 లోమహారాజ కర్ణ ఆస్థానం లోని మాధవ ,కేశవ అనే బ్రాహ్మణులు కట్టించారు .కపాద్ వంజ్ లోని బతీష్ కోట బావి 13 వ శతాబ్ది ది.
14 వ శతాబ్దం దిగుడుబవులకుస్వ ర్ణయుగం .మంగ్రోల్ లో సోదాలి బావిని 1319 లో మోధా కులస్తుడు వాలి సోధాల కట్టించాడు .ఖేడ్ బ్రహ్మలోదేవాలయం దగ్గర లోని బ్రహ్మ దిగుడుబావి14 వ శతాబ్దికి చెందింది .1381 నాటి మధువ లోని సూదా బావి , దందుసార్ లోని హని , ధోల్కా లోని సిద్ధాంత మహాదేవ బావులు తుఘ్లక్ పాలనలో కట్టబడినవి .అహమ్మదాబాద్ దగ్గర సంపా ,రాజ్ పురాదగ్గర రాజ్ బా బావులు ,1328 నాటివి . 1499 లో హరేం మహిళ మహమ్మద్ బెగడ దాదా హరీర్ బావి నిర్మించింది .లూనావాల దగ్గర కాలేశ్వరి, నీ నాల్ అనే రెండుబావులు 14 -15 శతాబ్దులలో కట్టారు .వడోదర దగ్గరున్న రెండూ 15 శతాబ్దం లో కట్టినవే .1499 లో రుడాబాయ్ అదలాజ్ బావి ,చత్రాల్ బావి నిర్మించింది
ధ్రన్గ్ధరలోని నాగబావ , మొర్బిలోని జీవమేహతా బావులు 1525లో ఒకే శైలిలో నిర్మించ బడినాయి .1560 లో రాజా శ్రీనానాజీ భార్య చంపా రోహోఅనేదాన్నినిర్మించింది .15- 17 శాతాబ్దు లమధ్య చాలా బావులు వచ్చాయికాని చాలా సాధారణంగా నిర్మించారు .హంపూర్ ,ఇడార్ లలో వీటిని చూడచ్చు 1633 లో సి౦ధవి మాతబావి ని పఠాన్ లో కట్టారు .17 వశతాబ్దిలో రవి బావి ,1628 లో లిమ్బోయిలో చాళుక్య శైలిలో బావి కట్టారు .అహమ్మదాబాద్ లో అమృత వాహిని బావి ని’’ L ఆకారం’’గా నిర్మించారు
19 ,20 శతాబ్దపు బ్రిటిష్ పాలనలో దిగుడుబావినీరు ఆరోగ్యానికి మంచిదికాదని గొట్టాలు దింపి పైపులద్వారా నీటి సరఫరా చేయటం మొదలుపెట్టారు .1860 లో అహమ్మదాబాద్ లోనిఇసాన్పూర్ లోజీతాభాయి దిగుడుబాయి నిర్మాణం పూర్తి చేసి వ్యవసాయానికి ఉపయోగించారు .వంకనీర్ పాలెస్ దిగుడుబావిని 1930 నాటిపాలకులు తెల్లమార్బుల్ రాయితో కట్టించి అందాలు చిమ్మించి ఆకర్షణ తెచ్చారు .చల్లని ప్రదేశం కనుక ఇది వేసవి విడిదిగా యాత్రికులను బాగా ఆకర్షిస్తుంది .
ఇదండీ గుజరాత్ దిగుడు బావుల వంశ చరిత్ర .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-18 –ఉయ్యూరు ,