గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4
329-పవన దూత కావ్య కర్త –పవన దోయి –(12వ శతాబ్దం )
12 వ శతాబ్ద బెంగాల్ సంస్కృత కవి పవన దోయి .సేనవంశ రాజు లక్ష్మణ సేన ఆస్థానకవి .ఈనాడు పిలువబడుతున్న బెంగాల్ కు ఆనాడు గౌడ దేశం అనిపేరు కనుక అతడు గౌడరాజు లక్ష్మణసేనుని ఆస్థానకవి. పవన దోయి శక్తి గోత్రానికి చెందిన సేనవైద్య బ్రాహ్మణుడు .తండ్రి పుండరీక సేనుడు. తాత శ్రీవత్స సేనుడు .బెంగాల్ కు చెందిన శక్తి గోత్ర వైద్యులందరూ ధోయి వారసులని మహామహోపాధ్యాయ పు౦డరీక మాలిక్ తన కులగ్రంధం ‘’చంద్ర ప్రవ ‘’లో రాశాడు .పశ్చిమ బెంగాల్ కు చెందిన వారంతా అతడికొడుకు కాశీ సేనుడి వారసులు .తూర్పు బెంగాల్ వారంతా ఇతని కొడుకు కుశాలి సేన్ వారసులు అన్నాడు .
దోయి సేన్ కు ‘’కవి క్ష్మా పతి ‘’ కవి చక్రవర్తి అనే గొప్ప బిరుదు లున్నాయి ఇతడు రాసిన ముఖ్యకావ్యం ’’పవన దూత ‘’.దీనిలో కువలయతి అనే దక్షిణ దేశ గాంధర్వ కన్య చరిత్ర ఉంది .లక్ష్మణసేనుడి దిగ్వియాయ యాత్రలో అతడిని చూసి మోహించింది .తన ప్రియుడికి సందేశం తెలియ జేయటానికి దక్షిణానిలం ను ప్రాధేయపడి పంపటమే కథ.కనుక ఇది దూతకావ్యంగా ప్రసిద్ధి చెందింది .కాళిదాసు మేఘ దూతం లా ఉంటుంది .104శ్లోకాలకావ్యం లో 48శ్లోకాలు దక్షిణ వాయువు తూర్పున ఉన్న గంధమాదన పర్వతాన్నుంచి దక్షిణాన బెంగాల్ లోను ఉదయపుర౦ లో ఉన్న రాజు లక్ష్మణ సేనుడికి సందేశం చేరవేసే ప్రయాణమే వర్ణించాడు .38శ్లోకాలలో ఆమె సందేశం ఉంటుంది .వీటిలో కువలయవతి విరహం ,రాజు గుణగణ వర్ణ ఉన్నాయి .రసానికి అతీతంగా సందేశమే ప్రాధాన్యంగా కవి రాశాడు .
సర్ జేమ్స్ మాల్లిసాన్ దీన్ని ఆంగ్లం లోకి అనువదిస్తే క్లే సాంస్క్రిట్ లైబ్రరి దూతకావ్యాల శ్రేణిలో ప్రచురించింది
330-ధృత కవి ,కథాకలి,సంతాన గోపాలం కర్త –కిలిమనూర్ రాజరాజ వర్మ కోయి తంపురన్-( 1812-1845)
తిరువాన్కూర్ రాజా స్వాతి తిరుణాల్ రామవర్మ ఆస్థాన సంస్కృత విద్వాంసుడు .కరీంద్ర లేక చేరున్ని అనికూడా అంటారు 1812-1845 కాలం వాడు .కిల్లనూర్ పాలెస్ లో అన్మించాడు .ధృత కవిత్వం లో సాటి లేని మేటి .కనుక ‘’ధృతకవి మణి’’ సార్ధక బిరుదు పొందాడు .దిగ్గజం లాగా భారీగా బలిస్టం గా బాగా ఎత్తుగా ఉండేవాడు కనుక ‘’కరీంద్ర ‘’అనే వారు .ఆశువుగా ఏవిషయం పై నైనా క్షణాలమీద కవిత్వం చెప్పి మెప్పించే నేర్పున్నవాడు .అందుకే మహారాజు స్వాతి తిరుణాల్ ఇతనికి ‘’విద్వాన్ ‘’బిరుదు ప్రదానం చేసి గౌరవించి సత్కరించాడు .కథాకలిఅనే సంస్కృత నాటకం (అత్తకం ),సంతాన గోపాలం రాశాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-18-ఉయ్యూరు

