గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
329-యతి గీతి శతక కావ్య కర్త –మన్మోహన ఆచార్య (1967-2013)
ఒరిస్సా జహత్సింగ్ పూర్ జిల్లా లతంగ గ్రామం లో 1967 అక్టోబర్ 20మన్మోహన ఆచార్య జన్మించాడు .మాయాధర ఆచార్య తండ్రి .పార్వతి దేవి తల్లి .అతని కవిత లు –గీతామోహనం ,గీతా భారతం ,గీతా మిలి౦ద౦ ,పాలిపంచాసిక ,సుభాస చరితం ,శ్రీ శివానంద లహరిక ,యతి గీతి శతకం సంస్ సంస్కృతకావ్యం .నృత్య రూపకాలు –అర్జున ప్రతిజ్ఞా ,శ్రిత కమలం ,పాదపల్లవం ,దివ్య జయదేవం ,రావణ ,పింగల ,మృత్యు ,స్థిత ప్రజ్ఞా,తంత్రం,పూర్వ శాకుంతలం,ఉత్తర శాకుంతలం .
జయ దేవుని గీత గోవిందాన్ని ‘’గీత గోవింద రసావలి ‘గా అనువదించాడు .అనేక పరిశోధన వ్యాసాలూ రాశాడు –శిష్టాచార,ఇండియన్ ట్రెండ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ,యాన్ ఆల్జీబ్రేక్ ఆపరేషన్ ఇన్ వేదిక్ మాధమాటిక్స్ ,యాన్ ఎన్సైక్లో పీడిక్ డిక్షనరీ ఆఫ్ యజుర్వేదిక్ ఉపనిషత్స్ ,దిస్క్రిప్షన్ ఆఫ్ హార్ట్ ఇన్ ఉపనిషత్స్ ,తర్క వాచస్పతి మధుసూదన మిశ్ర ,మాప్ ఆఫ్ పురాణిక్ ఇండియా .
మన్మోహన్ ఆచార్య ప్రతిభకు తగిన పురస్కారాలు పొందాడు –సాంస్క్రిట్ ఎలక్వెంసిఅవార్డ్ ,వా ణీకవి అవార్డ్ ,గీతాసారస అవార్డ్ ,భారత భారతి సమ్మాన్ ,సాంస్క్రిట్ సంగీత నాటక అవార్డ్ ,ఫెలో ఆఫ్ వాచస్పతి ,చింత చేతనా నేషనల్ బాలసాక్షి అవార్డ్ మొదలైనవెన్నో .
మన్మోహన్ ఆచార్య 2013లో 46ఏళ్ళకే కటక్ లో మరణించాడు
330-’’శ్రీ శివ రాజ్యోదయం ‘’మహా కావ్య కర్త –శ్రీధర్ భాస్కర్ వర్నేకర్ (1918)
శ్రీధర్ భాస్కర్ వర్నేకర్ నాగపూర్ లో 31-7-1918 జన్మించాడు .సంస్కృతంలో అనేక కవితలు రాశాడు .అందులో అతి ముఖ్యమైన మహా కావ్యం ‘’శ్రీ శివ రాజ్యోదయం ‘’.దీన్ని యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ వారు సివిల్ సర్వీస్ పరీక్షలో సంస్కృత పేపర్ రాసేవారికి పాఠ్య గ్రంథంగా నిర్ణయించారు . .ఇది సంస్కృత విభాగం లో సాహిత్య అకాడెమి ఆవార్డ్ ను 1974 లో పొందింది .ఛత్ర పతిశివాజీ మహారాజ్ జీవితం ,త్యాగం ,రాజ్యపాలనలపై 68 కాండల సంస్కృత కావ్యం ఇది.
డా.వర్నేకర్ కు ప్రెసిడెంట్ అవార్డ్ కాళిదాస సమ్మాన్ అవార్డ్ బిర్లా ఫౌండేషన్ సరస్వతి పురస్కార్ మొ దలైన పురస్కారాలు లభించాయి .అమెరికాలోని లోని న్యుపాల్త్జ్ లో ఉన్నన్యూయార్క్ స్టేట్ యూని వర్సిటి ఆహ్వానం పై సంస్కృత సెమినార్ కు వెళ్ళాడు . ఈకవి సంస్కృత సాహిత్య సేవకు హర్షించిన శ్రీ శంకరా చార్య జగద్గురువులు ‘’ప్రజ్ఞా భారతి ‘’బిరుదు ప్రదానం చేసి సన్మానించారు.
సశేషం
దుర్గాష్టమి శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-18-ఉయ్యూరు .

