ఉగాదికి సరసభారతి ప్రచురించే రెండు గ్రంధాల ఆవిష్కరణ
సాహితీ బంధువులకు మహర్నవమి విజయ దశమి శుభాకాంక్షలు –
శ్రీ వికారి నామసంవత్సర ఉగాది (6-4-2019 ) కి 6 రోజుల ముందు వచ్చే ఆదివారం అంటే 31-3-2019 సరసభారతి నిర్వహించే ఉగాది వేడుకలలో నేను రచించిన 20 21 , ,సరసభారతి ప్రచురిస్తున్న 31,32పుస్తకాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోందని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది .
1-దర్శనీయ శ్రీ ఆంజనేయదేవాలయాలు -2 రెండవ భాగం -మొదటి భాగం లో చోటు చేసుకొనని సుమారు 150 దేశ ,విదేశాలలోని శ్రీ ఆంజనేయ దేవాలయాల విశేషాలు .
2-శ్రీ మైనేని గోపాలకృష్ణగారు పంపిన శ్రీ దాసరి ఆంజనేయులుగారి గారి ఇంగ్లిష్ రచన -”–‘’PUTCHA VENKATESWARLU(1921-1997) Elected Fellow 1970’’.ఆధారం గా నేను అంతర్జాలం లో 2-12-2017 నుండి 20-12-2017 వరకు రాసిన 14 ఎపిసోడ్ ల-
” మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు”.
. విద్యార్థులకు యువతకు స్ఫూర్తిదాయక కరదీపిక .
సరసభారతి అభిమానులు ,ప్రాయోజకులు ,సాహిత్యాభిమానులు అందిస్తున్న యెనలేని ప్రోత్సాహక అభిమానాలకు మరొక మారు
దసరా శుభాకాంక్షలతో కృతజ్ఞతలు-
గబ్బిట దుర్గాప్రసాద్ -18-10-18-ఉయ్యూరు
