గౌతమీ మాహాత్మ్యం -15
25-శ్వేత తీర్ధం
గౌతమ మిత్రుడు శ్వేతుడు అతిదిపూజలో తరించాడు .శివభక్తి పరాయణుడు.అతన్ని తీసుకుపోవటానికి యమ దూతలు వచ్చారు .కాని ఇంట్లోకి ప్రవేశించలేక పోయారు .వారిలో చిత్రకుడు యమునికి నివేదించగా మృత్యువే స్వయంగా వచ్చినా అతనికి మృత్యువుకాని కాని యమకింకరులు కాని వచ్చినట్లు తెలియదు .స్వేతుని దగ్గరున్న దండధరుడైన పురుషుడు ఎందుకోచ్చావని అడుగగా చెప్పగా ,మృత్యువుకు అక్కడ పని లేదు వెళ్లిపోమ్మన్నాడు .వినక, పాశం వదిలాడు. దండి మృత్యువును కొట్టగా మృత్యువు పడిపోగా దండి యమునికి చెప్పగా యముడే స్వయంగా రాగా, నంది జరిగినదంతా శివునికి తెలియజేయగా ,యమ శివులమధ్య భయంకర యుద్ధం జరుగగా ,కార్తికేయుడు యమకింకర సంహారం చేయాగా మిగిలినవారు సూర్యునికి విన్నవించగా ,ఆదిత్యాదులు బ్రహ్మను చేరగా అంతా కలిసి గంగా తీరం లొ మృతి చె౦ది ఉన్న యముని చేరి,భయపడి శంకరుని స్తుతించగా ప్రత్యక్షమై ఏమికావాలని అడిగితే ,యముని బ్రతికించమని కోరగా ‘’యముడు నామాట వింటే మీకోరిక తీరుస్తాను .అందరికీ నేనే స్వామిని గౌతమి ,విష్ణు భక్తులజోలికి యముడు పోకూడదు .వారికి ఆదివ్యాదులు ఉండరాదు .శివుని శరణు పొందినవారు తక్షణమే ముక్తి చెందుతారు ‘’అన్నాడు . గౌతమీ జలాలతో శివుని అభిషేకించమని చెప్పగా అలా చేయగా యమునితో సహా చచ్చినవారంతా బ్రతికారు. అందరూ శివునిపూజించి ఎవరి దిక్కులకు వాళ్ళు వెళ్ళిపోయారు .
గౌతమి ఉత్తర దిక్కున సుర దేవతా గణం శివునిపూజిస్తున్నారు అక్కడ లక్షా ఇరవై వేల తీర్దాలున్నాయి . దక్షిణ తీరం లొ 30 వేల తీర్ధాలు న్నాయి. ఇదే శ్వేత తీర్ధ విశేషం అని బ్రహ్మ నారదుడికి చెప్పాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25 -11-18 కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్ ,

