గౌతమీ మాహాత్మ్యం -26
39-ఇలాతీర్ధం
బ్రహ్మహత్యాదిపాపాలను తొలగించే ఇలా తీర్ధం గురించి నారదునికి బ్రహ్మ చెప్పాడు .వైవశ్వత మన్వంతరం లో ఇలుడు అనే రాజు సైన్యం తో వేటకు వెళ్ళాడు .అక్కడ మంత్రులతో వాళ్ళందరినీ తనకొడుకు పాలిస్తున్న స్వదేశానికి తిరిగి వెళ్ళి తనకొడుకు రక్షణగా ప్రజాపాలనలో సహకరించమని చెప్పి ,తాను హిమాలయానికి వెళ్లి రత్నాలతో ఉన్న ఒక గుహలో మన్యువు అనే యక్షుడు భార్య ‘’సమా ‘’తోఉంటున్న గుహలోకి వెళ్ళాడు .భార్యాభర్తలు మృగ రూపం లో హాయిగా విహరించటం చూశాడు .తన సైన్యం తో ఇలా రాజు ఆగుహలో కూర్చున్నాడు .
యక్షుడు భార్యతో తిరిగి వచ్చి తనగుహను ఇలుడు ఆక్రమించటం సహించక ,అతని సైన్యాన్ని ఎదుర్కొనే దమ్మూ లేక ,తన వాళ్ళతో ఎలాగో అలా ఇలుని బయటికి పంపే ఏర్పాటు చేయమన్నాడు .వాళ్ళు రాజుదగ్గరకు వచ్చి గుహ వదిలి వెళ్ళమని లేకపోతె యుద్ధం లో ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు .రాజు యక్ష గణంతో యుద్ధం చేస్తూ పది రాత్రులున్నాడు .యక్షుడు అడవుల్లో మృగరూపలతో సంచరిస్తూ ఇల్లూ లేక,సైన్యమూ లేక విచారించాడు .భార్యతో సంప్రదింఛి ఆమెను ఆడలేడిగా మారి ఉమావనం లో సంచరించమని ,రాజు వేట నెపం తో అక్కడికి వచ్చి స్త్రీ రూపం తోదగ్గరకు చేరతాడని చెప్పగా యక్షిణి’’నువ్వు ఎందుకు వెళ్ళలేవు ?’’అని ప్రశ్నించగా యక్షుడు ‘’హిమాలయాలో శంకరుడు దేవగణంతో సచారిస్తుంటే పార్వతీ దేవి ఏకాంతం లో ఆయనతో తనకు రహస్యంగా సంచరి౦చటానికి ఒకవనం ఏర్పాటు చేసి దానికి ఉమావనం పేరుపెట్టి గణపతి ,కార్తికేయుడు, శివుడు సహా ఎవరు అందులో ప్రవేశించినా స్త్రీ రూపం పొందేట్లు చేయమని కోరింది .శివుడు అలాగే చేశాడు. కనుక పురుషులకు ఆవనం లో ప్రవేశం లేదు కనుక నేను వెళ్ళలేను ‘’అని వివరించాడు .
భర్త మాట విని యక్షిని ఆడ లేడి యై ఉమావనం లో తిరుగుతుంటే ఇలామహారాజు ఆలేడి ని వేటాడటానికి వెంబడించిఉమావనం ప్రవేశించి స్త్రీ రూపం పొంది ఆశ్చర్యపోగా ఎదుకు తనకు ఇలా జరిగిందని లేడిని అడిగితె అది ‘’హిమవత్పర్వతగుహలో నా భర్త యక్షుడున్నాడు .నువ్వు సైన్యం తో గుహ ఆక్రమిస్తే నేను నిన్ను బయటికి పంపటానికి ఆడలేడి రూపం తో వచ్చాను .ఉమావనం లో ప్రవేశించిన పురుషుడు స్త్రీగా మారుతాడని శివుని శాపం ఉంది ‘’అనగా స్పృహతప్పి కిందపడితే యక్షిణి ఓదార్చి మళ్ళీ మగరూపం రాదుకనుక స్త్రీ విద్యలైన నృత్య సంగీతాలను నేర్చుకోమని చెప్పింది .తను మళ్ళీ పురుషునిగా మారే విధానం చెప్పమనగా ‘’సోముని పుత్రుడు బుధుడు ఈవనానికి తూర్పున ఉన్న ఆశ్రమ౦ లో ఉన్నాడు ,రోజూ తండ్రి ఆశీర్వచనం కోసం ఈమార్గం లోనే వెడతాడు ,నువ్వు అతనిని ప్రసన్నం చేసుకొని ఫలితం సాధించు ‘’అని చెప్పి అంతర్ధానమై గుహను చేరి భర్తకు చెప్పి ఆనందం కలిగించింది .
ఉమావనం లో ఆడ రూపం లోని ఇలుడు నృత్యగానాలతో కాలక్షేపం చేస్తూ ఉండగా బుధుడు రావటం చూసి మోహపడి తనభార్యవు కమ్మని కోరగా అంగీకరించగా ఇద్దరూ బుధ నివాసంలో హాయిగా సుఖించారు .
సశేషం
మీ-గబ్బిట-దుర్గాప్రసాద్ -4-12-18-ఉయ్యూరు
—

