సరసభారతి శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలు
సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఉయ్యూరు ,మరియు స్థానిక రోటరీ క్లబ్ వారి సహాయ సహకారాలతో సంయుక్తంగా శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి ముందువచ్చే ఆదివారం 31-3-19 సాయంత్రం 3గంటలకు కే.సి .పి.షుగర్ ఫాక్టరీ దగ్గరున్న రోటరీక్లబ్ ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నాము .సాహిత్యాభిమానులూ, కవిమిత్రులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ వలసినదిగా ఉగాది శుభాకాంక్షలతో ఆహ్వానిస్తున్నాము .
ఈ వేడుకలలో1- ‘’స్త్రీ శక్తి ‘’అనే అంశం పై జిల్లాలోని ప్రముఖ కవి మిత్రుల చేత ‘’కవి సమ్మేళనం నిర్వహింపబడుతుంది
2-,కొందరు ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ,
3-స్వయం శక్తితో ఎదిగిన వారికి ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కారాలు అంద జేయబడుతాయి
4.శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి ,సరసభారతి ప్రచురించిన మూడు పుస్తకాలు 1-117వ మూలకం ‘’టెన్నిస్సిన్’’కనిపెట్టిన ఆంధ్ర శాస్త్రవేత్త ‘’అణు శాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకటరామయ్య’’( 117వ మూలకం ‘’టెన్నిస్సిన్’’కనిపెట్టిన ఆంధ్ర శాస్త్రవేత్త –అమెరికా )‘’ 2 –‘’ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత కీ.శే.డా.పుచ్చా వెంకటేశ్వర్లు’’ ( లేజర్ కిరణాలపై నూతన ఆవిష్కరణలు చేసి ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి ,కాన్పూర్ ఐ .ఐ .టి .,,అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటి ల నిర్మాణానికి కారకులైన తెలుగు శాస్త్ర వేత్త ) 3-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 –రెండవభాగం (254 శ్రీ ఆంజనేయ దేవాలయ విశేషాలు )ఆవిష్కరణ జరుగుతుంది .
కార్యక్రమ౦లో పాల్గొను అతిధులు-1-శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి సభ్యులు 2-శ్రీమతి గుళ్ళపల్లి రామమూర్తి రాధిక –ప్రముఖ పర్వతారోహకురాలు ,ఆంధ్రప్రదేశ్ సూపరి౦టె౦డ్ ఆఫ్ పోలిస్ ,ఆక్టోపస్ -విజయవాడ , శ్రీ 3-జి.వెంకటేశ్వరావు – సి .ఇ.ఒ-కెసీపి 4-శ్రీ పులి శ్రీనివాసరావు-రోటరీక్లబ్ అధ్యక్షులు –5 శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు 6-శ్రీ చలపాక ప్రకాష్ –ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి, రమ్యభారతి సంపాదకులు,7-శ్రీ విద్యానంద ,శ్రీ చక్రార్చన పరాయణ ,ఆధ్యాత్మిక గ్రంథకర్త , నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి M.E..(హైదరాబాద్ ) 8–డా ఉప్పలధడియం వెంకటేశ్వర –తెలుగు ,హిందీ భాషాకవి ,గ్రంథకర్త ,జనని సాహిత్య సంస్థ నిర్వాహకులు –చె న్నై 9-శ్రీ గీతా సుబ్బారావు –ప్రముఖ కార్టూనిస్ట్ ,కవి ,హాస్య రచయిత-హైదరాబాద్ 10-శ్రీ కొల్లూరి రమణ –తెలుగు విద్యార్ధి మాసపత్రిక నిర్వాహకులు 11-శ్రీ అల్లూరు శివ కోటేశ్వరరావు –వ్యాస బృందం –ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులు –కారం చేడు 12-శ్రీమతి కమలాకర్ భారతి –కమలాకర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ,శ్రీ వికాస భారతి స్కూల్ ,,ఓల్డేజి హోమ్ స్థాపక నిర్వాహకురాలు ,ప్రముఖ సామాజిక సేవా కర్త –హైదరాబాద్ -13కుమారి చలమల శెట్టి నిఖిల –మహిళా వ్యక్తిత్వ వికాస రచయత్రి –విజయవాడ 14- శ్రీ మల్లంపల్లి విజయనీ మహా కాళేశ్వరావు-రిటైర్డ్ తెలుగు జూనియర్ లెక్చరర్ – కాకినాడ 15-డా.కోనేరు లక్ష్మీ ప్రమీల మొదలగువారు
—

