గౌతమీ మాహాత్మ్యం -33
45-అవిఘ్న త్తీర్ధం
అవిఘ్న తీర్ధ మహాత్మ్యాన్ని నారదునికి బ్రహ్మ తెలిపాడు .పూర్వం .గౌతమీనది ఉత్తరతీరాన దేవ యజ్ఞం ప్రారంభమై ,విఘ్న దోషం వలన పూర్తి కాలేదు..దేవతలు విచారం తో బ్రహ్మ విష్ణువులకు మొరపెట్టుకొన్నారు .బ్రహ్మ ధ్యానంచేసి విఘ్నానికి కారణం విఘ్నేశ్వరుడు అని,కనుక ముందు ఆయనను ప్రసన్నం చేసుకోమని సలహా ఇచ్చాడు . వారంతా గౌతమీ నదిలోస్నానం చేసి ,తీరం లో ఆదిదేవుడైన వినాయకుని భక్తితో-
‘’న విఘ్న రాజెన నమోస్తికశ్చిద్దేవో మనో వాంఛిత సంప్రదాతా –నిశ్చిత్య చైత త్రిపురా౦తకో పి తమ్ పూజయామాస వదే పురాణం ‘’
‘’కరోతు సో స్మాకమవిఘ్న మస్మిన్మహా క్రతౌ సత్వర మా౦బికేయః –ధ్యాతేన యేనాఖిల దేహభాజాం పూర్ణా భవిష్యంతి మనోభి లాషాః’’-అంటే విఘ్నరాజుకు సాటి కోరికలు తీర్చే దేవుడు లేడుఅని భావించి త్రిపురాంత సంహారానికి శివుడు కూడా పూజించాడు .ఎవరిని ధ్యానిస్తే జీవుల మనోవా౦ఛితాలు , నెరవేరుతాయో ,అలాంటి అంబికా తనయుడు విఘ్నరాజు మా క్రతువు నిర్విఘ్నంగా పూర్తయేట్లు చేయాలి .పార్వతీదేవికి పుత్రుడు పుట్టాడని లోకాలన్నీ మహోత్సవాలు చేసి విఘ్నరాజు అనే పేరు పెట్టాయి .తల్లి ఒడిలో ఆడుకొంటూ ,తల్లి వద్దంటున్నా ,సరదాగా చంద్రుని తండ్రి శివుడి జటలో దాచాడు .తల్లి పాలన్నీ తానే తాగేస్తూ తమ్ముడు కార్తికేయుడికి పాలు లేకుండాచేసి పొట్ట పెంచుకొన్నందున తండ్రి లంబోదరుడు అనే పేరు పెట్టాడు .దేవగణాలతో ఉన్నప్పుడు ఒకసారి తండ్రి కొడుకును నృత్యం చేయమనగా ,నూపుర రావం తో నే సంతోష పరచగా తండ్రి గణేశ్వరుడు గా అభిషేకం చేశాడు .చేతిలో విఘ్నపాశం ,భుజం పై కుఠారం ధరించి దేవతలచే పూజింపబడుతూ కూడా తల్లికి కూడా విఘ్నం కలిస్తాడో ,దేవాసురులచేత పూర్వ పూజ్యుడు అంటే మొదట పూజింపబడే వాడు ఐన విఘ్నపతికి సరి లేరు ఎవరూ .’’అని అనేక స్తోత్రాలతో స్తుతించారు .
గణేశుడు సుప్రసన్నుడై ఇకపై దేవ క్రతువుకు విఘ్నాలు ఉండవన్నాడు .అలాగే నిర్విఘ్నంగా క్రతువు పూర్తయి దేవతలు తృప్తి చెందారు .దేవతలతో గణపతి తన స్తోత్రాన్ని భక్తీ శ్రద్ధలతో పఠించినవారికి .దరిద్రం ,దుఖం కలగదని ,ఆస్థానం లో అలసత్వం లేకుండా స్నాన దానాలు చేసినవారి సకలకార్యాలు సిద్ధిస్తాయని చెప్పగా సురలు సరే అని కృతజ్ఞతలు చెప్పి ,స్వర్గానికి వెళ్ళిపోయారు .ఈ తీర్ధమే అవిఘ్న తీర్ధం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-19-ఉయ్యూరు

