గౌతమీ మాహాత్మ్యం -36
50-సోమ తీర్ధం
పూర్వం ఓషధులు ప్రాణం కంటే విలువైనవానిగా ,తల్లులులాగా పూజి౦పబడ్డాయి .వాటిలో ధర్మం ,స్వాధ్యాయనం,యజ్ఞకర్మ ప్రతి స్టింప బడ్డాయి .చరాచర జగత్తును ధరించేవి .ప్రాణుల రక్షణకు అతి ముఖ్యమైనవి .ఒకసారి ఓషధులు బ్రహ్మను సోముని తమకు పతిగా చేయమని కోరగా ‘’ప్రీతి వర్ధనుడైన’’ రాజు ‘’ను పతిగా ఇస్తాననగా ,రాజుకోసం తాము ఎక్కడికి వెళ్ళాలి అని అడగగా ,గౌతమీతీరం చేరితే ఆమె చంద్రుని పతిగా ప్రసాదిస్తు౦దన్నాడు .బ్రహ్మ చెప్పినట్లే అక్కడికి చేరి –‘’కో వేత్తి భాగ్యం నరదేహ భాజాం ,మహీగతానం,సరితామధీశే –యేషాం మహాపాతకం సంఘ హన్త్రీ త్వమ౦బ గంగే సులభా సదైవ ‘’
‘’నమోస్తు తే మాతరభీస్ట దాయిని ,నమోస్తుతే బ్రహ్మమయే అఘనాశిని –నమోస్తుతే విష్ణు పదాబ్జ నిః సృతే,నమోస్తు తేశంభు జతావినిః సృతే’’అని ప్రార్ధించాయి .గంగాదేవి సంతృప్తి చెంది ఏం కావాలని అడిగితె తేజో వంతుడైన రాజును భర్తగా ప్రసాదించమని కోరగా’’ గంగామాయి’’ –
‘’అహం చామృత రూపాస్మి ఓషధ్యోమాతరోమృతాః-తాదృశం చామృతాత్మానం పతిం సోమం దదామివః ‘’అన్నది అంటే –నేనూ ,మీరూ అమృత రూపులం .అలాగే అమృతాత్మకుడై న చంద్రుని మీకు పతిగా ఇస్తాను ‘’అనగా ఓషధులు పరమానంద పడి,కృతజ్ఞతలు తెలిపి తమ స్థానాలకు వెళ్ళిపోయాయి .అమృతాత్మకుడు,సమస్త సంతాప నివారకుడు రాజు అయిన సోముని ఓషధులు పతిగా పొందిన చోటు సోమతీర్ధంగా విరాజిల్లింది .భుక్తి ముక్తి తోపాటు సోమపాన ఫలాన్ని ఇస్తుంది అని నలువ నారదునికి తెలియ జేశాడు .
సశేషం
రధ సప్తమి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-2-19-ఉయ్యూరు

