గౌతమీ మాహాత్మ్యం -45
60-ఇంద్ర తీర్ధం
ఇంద్ర తీర్ధంలో వృషా కపము ,ఫేన్యాది సంగమం హనూమత తీర్దాలున్నాయి .నముచి ఇంద్ర శత్రువు. నముచి తలను నురుగును వజ్రాయుధం చేసి ఛేదించాడు ఇంద్రుడు .ఆతల గంగ దక్షిణ తీరం నేలపై పడి,భూమిని చీల్చుకొని పాతాళం చేరింది .అఫేనం అంటే నురుగే ఫేనానది గా ప్రవహించింది .ఫేనా గంగా సంగమం పవిత్రమైనది .హనుమంతుని దాది(ఉపమాత )ఇక్కడ స్నానం చేయటం వలన విష్ణు గంగల ప్రసాద ఫలితంగా ఆమె పిల్లి రూపం పోయింది .దీనిని మార్జర లేకమర్జాల తీర్ధమంటారు .దీనికే హనుమత్ తీర్ధమనే పేరుకూదావచ్చింది .దైత్యులకు పూర్వజుడు బలవంతుడైన హిరణ్యుడు .దేవతలు వీడిని జయి౦చ లేక పోయారు.వీడికొడుకు ‘’మహా శని’’ నీ దేవతలు గెలవలేకపోయారు .వీడి భార్య పరాజిత .ఎన్ని సార్లు యద్ధానికి వచ్చినా ఇంద్రుడు వీడిన జయి౦చ న్చాలేకపోగా వాడే ఇంద్రుడిని ఐరావతం తో సహా బంధించి ఇంద్రుని భార్య ఇంద్రాణి ని చూసి క్రూరత్వం వదిలి తండ్రికి చెప్పాడు .తండ్రి ఇంద్రుడిని పాతాళం లోపెట్టి గట్టికాపలా ఏర్పాటు చేశాడు .
ఇంద్రుని జయించిన మహాశని వరణుడిపై దాడి చేశాడు .తెలివిగా తనకూతురు వారుణి నిచ్చి పెళ్లి చేసి అల్లుడిని చేసుకొన్నాడు .తానుడే సముద్రాన్ని కూడా అల్లుడికిచ్చేశాడు ..వరుణుడి సహకారం తో మహాశని మహా పరాక్రమశాలి ఎదురులేని వాడయ్యాడు.ఇంద్రుడు లేని దేవలోకం లో ఉండలేక దేవతలు సమాలోచన చేసి విష్ణువును సందర్శించి,మహా శని ని జయించటం తమకు అసాధ్యంగా ఉందని మొరపెట్టుకొన్నారు .శ్రీహరి వరుణుడి దగ్గరకు వెళ్లి ఇంద్ర విముక్తి తక్షణ కర్తవ్యమన్నాడు .చేసేది లేక ఆయన అల్లుడి దగ్గరకు వెళ్లి ,సన్మానింప బడి,రాక కు కారణం అడుగగా అన్నీ వివరింఛి ఇంద్రుడిని వదిలేయమని కోరాడు .ఐరావతం తో సహా ఇంద్రుని విడుదల చేశాడు అల్లుడు మహాశని .విడిచిపెడుతూ ‘’ ఇంద్రా !అన్నీ ఉన్నా కూడా నువ్వు కేవలం వరుణుడి దయతో బందీ గా విడుదలయ్యావు .నీకు సిగ్గు అనిపించటం లేదా ?పౌరుషహీనమైన బతుకూ ఒక బతుకేనా ? నిన్ను విడిపించిన నా మామ వరుణుడు ఈ రోజు నుంచీ నీకు గురువు .ఆయనకు ఎప్పుడూ అణగి బతుకు .లేకపోతె మళ్ళీ బంధించి పాతాళం లో పడేస్తా ‘’అని దులిపేసి వదిలేశాడు .
సిగ్గుపడుతూ వంగి వంగి దొంగ నమస్కారాలు చేస్తూ ఇంద్రలోకం చేరి జరిగింది పూసగుచ్చినట్లు శచీదేవికి చెప్పాడు ఇంద్రుడు .తనపరాభవానికి ప్రతి క్రియ ఏమిటో ఆమెనే చెప్పమన్నాడు .ఆమె ‘’నీ శత్రువు మా పెదన్న హిరణ్యుడి కొడుకు .తపోబలంతో బలగర్వితుడయ్యాడు .కంగారు పడకు .నీకూ తపస్సే తరుణోపాయం.దండకారణ్యం దగ్గర గంగానది కి వెళ్లి శివుని కోసం తీవ్ర తపస్సు చెయ్యి అన్నీ తీరుతాయి ‘’అని సలహా చెప్పింది ఇంద్రాణి .ఇంద్రుడు దేవగురుడు ,భార్య లతోకలిసి గౌతమీ తీరం చేరి పుణ్య స్నానాలు చేసి శివునికై తపస్సు చేశాడు . . స్తోత్రానికి శివుడు పరవశించి వరం కోరుకోమన్నాడు .తన శత్రువు మహాశనిని జయి౦చేఉపాయ౦ చెప్పమని అడిగాడు ఇంద్రుడు .శివుడు ఈ పని తనొక్కడితో జరగదని విష్ణువు సహకారం కూడా కావాలికనుక ఆయన్ను ప్రసన్నం చేసుకోమన్నాడు .
ఇంద్ర ద౦పతులు ఆపస్త౦భ మహర్షితో కలిసి గంగ దక్షిణ తీరం లో శ్రీహరి కోసం తీవ్ర తపస్సు చేశాడు .హరి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితె దానవ సంహారానికి ఉపాయం అడిగాడు .ఇచ్చాను అన్నాడు. అప్పుడే గంగా శివ విష్ణు అనుగ్రహం తో గంగనుంచి ఒక పురుషుడు ఉద్భవించి చక్ర శూలాలు ధరించి రసాతలం చేరి మహాశని సంహారం చేసి ఇంద్రునికి స్నేహితుడయ్యాడు .ఈయనే వృషాకపి .ఈ దోస్తీ మైక౦లొ ఇంద్రుడు శచీదేవినే మరచిపోగా ,ఆమెకు కోపం రాగా ఇంద్రుడు ‘’వృషాకపి ని వదిలి ఉండలేను .ఇప్పటినుంచి నేను అచ్యుతుడనైన ఇంద్రుడిని .వృషాకపి దయవల్లే మళ్ళీ ఇంద్రపదవి దక్కింది .ఇకనుంచి ఈ ఇంద్రేశ్వరం అబ్జకం తీర్దాలు సర్వ సిద్ధిదాయకాలౌతాయి ‘’అనగానే దేవతలుకూడా తధాస్తు అన్నారు అని బ్రహ్మ నారదునికి తెలిపాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-19-ఉయ్యూరు

