AANM And VVR SR ఇంగిలీషు మీడియం గుడ్లవల్లేరు హైస్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మీయులు శ్రీ నారాయణం శ్రీనివాసమూర్తిగారికి నమస్సులు .నన్ను మీ సాహితీ దినోత్సవ సభ కు ముఖ్య అతిధిగా ఈ రోజు 28-2-19 గురువారం ఆహ్వానించి ,నాతొ మీ బాలబాలికలకు నాలుగు మంచిమాటలు అందునా ఆ ప్రాంతపు కవి మహాకవి శ్రీ దాసు శ్రీరాములు గారిపై నాకు మాట్లాడే అవకాశమిచ్చినందుకు ,మీ విద్యా కుటుంబాన్ని పరిచయం చేసినందుకు ,గౌరవించి నందుకు ధన్యావాదాలు .వారందరి సౌజన్యానికి అభినందనలు ..
ఉదయమే కాక మధ్యాహ్నం జరిగిన సైన్స్ డే కార్యక్రమం లో కూడా సైన్స్ మాస్టర్ అయిన నాకు బాధ్యత కలిపించి ఎవరికీ పెద్దగా తెలియని ఆంధ్ర శాస్త్రవేత్తలు 1-కెమోటాలజి పిత డా కొలచల సీతారామయ్య 2-ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత డా.పుచ్చా వెంకటేశ్వర్లు 3-117 వ మూలకం టెన్నెస్సిన్ (Tn ) కనిపెట్టిన అణు శాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య గారు ల గురించి సైన్స్ డే నాడు నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ,అలాగే డా రామయ్య గారి పరిశోధనాంశం ”నూతనవధూవరులకు దక్షిణ భారత దేశం లో వివాహం రోజు రాత్రి అరుంధతీ నక్షత్రాన్ని చూపించటం లోఅంతరార్ధం” పై మాట్లాడించి నందుకు మీకు ,మీ సైన్స్ శాఖ వారికి విద్యార్థినీవిద్యార్థులను ధన్యవాదాలు .ఇంజనీరింగ్ కాలెజి వైస్ ప్రిన్సిపాల్ డా శ్రీ ప్రసాద్ గారితో ,యువ సైన్స్ కెరటం కుమారి శ్రావ్య తో వేదికపై కూర్చునేఅరుదైన అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు . కుమారి శ్రావ్య విద్యాకల్పవల్లి . మూర్తీభవించిన ఆమె సౌజన్యం చూసి నాకు ముచ్చటవేసింది .ఆమెకు నా హృదయపూర్వక ఆశీస్సులు .త్వరలోనే ఆ చిరంజీవికి తనకు కావలసిన దానిలో ప్లేస్ మెంట్ లభించాలని ఆమె భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశించాలని కోరుతున్నాను . .
మీ విద్యా కుటుంబమే కాదు మీ కుటుంబమూ ఆదరణకు ఆప్యాయతకు,ఆతిధ్యానికి నిదర్శనమని మీరూ ఈ శ్రీమతి గారు రుజువు చేశారు .అన్నపూర్ణ లాగ వారు వండి వడ్డించిన భోజనం మరిచిపోలేనిది .
మరొక్క మారు మీ అందరికీ ధన్యవాదాలు -గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-19 -ఉయ్యూరు 7-20P.M

