శ నేను మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టారుగా 1963-65లో పనిచేసినప్పుడు దానికి దగ్గరలోఉన్న పెదప్రోలు గ్రామం లో కాపురం ఉండేవాడిని .అప్పుడే మాపెళ్లి 1964లో అయింది .అప్పుడే ఒకరోజు రాత్రి మా ఇంటికి దగ్గరలో నాంచారమ్మగుడిదగ్గర చెరువుప్రక్కన బుర్రా వారి హరికథ ఏర్పాటు చేశారు .నాకు అప్పుడు వారి గురించి ఏమీ తెలీదు .నా శిష్యులు ఆగ్రామస్థులు చి అడివి శ్రీరామమూర్తి ,,కె మాధవరావు లు నాకు ఆయన గొప్పతనం గురించి చెప్పి నన్ను తీసుకు వెళ్లారు .రాత్రి 10గంటలకు హరికథ ప్రారంభించి రాత్రి ఒంటిగంటవరకు చెప్పారు .ఆయన అభినయం ఫెమినైన్ వాయిస్ చిందులు రక్తి భక్తీ కలగలుపుగా కదా విధానం నన్ను బాగా ఆకర్షించాయి .ఆయనపై ఒక రకమైన ఆరాధనా భావమేర్పడింది .ఆయన గురించి ఎప్పుడు పేపర్లో పడినా మా శ్రీమతికి పెదప్రోలులో ఆయన హరికథ సంగతి గుర్తు చేసేవాడిని
1992 కృష్ణాపుష్కరాలలో బెజవాడలో ఉదయం చిట్టిబాబు గారి వీణకచేరీ చూసి సాయంత్రం బుర్రావారి హరికద మళ్ళీ చూసాం . ఇదే రెండవసారి చూడటం .తర్వాత కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమాలలో ఆయన పాల్గొనగా చాలాసార్లు చూశాను పేపర్ ప్రెసెంటేషన్ కూడా చేసేవారు .అయితే ఎన్నడూ వారితో పరిచయం పెంచుకోలేదు వ ఏటా
రంగస్థలం పై స్త్రీపాత్రలతో అలరిస్తూ హరికథలు చెబుతూ ,నాటకాలు ప్రదర్శిస్తూ దర్శకత్వం వహిస్తూ తమదైన ప్రత్యేకత సాధించిన కళా విజ్ఞానమూర్తి.అభినయ సరస్వతి ,నాటమయూర ,లలితకళాప్రపూర్ణ కళారత్న మొదలైన బిరుదులూ పొందారు శాస్త్రిగారు . కృష్ణాజిల్లా దివితాలూకా కోడూరులో 1936 జులై 1 న జన్మించిన శాస్త్రిగారు 84వ ఏట 7-4-19.ఆదివారం తెల్లవారుఝామున మరణించి కళామతల్లికి తీవ్ర శోకం మిగిల్చారు . వారికుమారుడు బుర్రా సాయిమాధవ్ గొప్ప సినీ రచయిత . గబ్బిట దుర్గాప్రసాద్
—

