గాంధీజీ –ఆధునికత
పాశ్చాత్య నాగరకతపై తరచుగా గాంధీజీ తీవ్రమైన విమర్శ చేసేవాడని అవి బాగా ప్రాచుర్యం చెందాయని మనకు తెలుసు .ఒకసారి వాటిని గుర్తు చేసుకొందాం .వాటిలోంచి సారభూతమైన విషయాన్ని తెలుసుకోవాలి .కాలనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన జీవిత కాలం చేసిన పోరాటం లో పాశ్చాత్య తపై, వారిపెత్తనం పై ఆయన చేసిన విమర్శలన్నీ ఒక మేధావి ఉటంకించిన భావాలుగా,సమాధానాలుగా ఉండేవి .ఇలాంటి అవగాహన తూర్పు –పశ్చిమ వైరుధ్యాన్ని తగ్గించి ,భౌతిక లాలసత కంటే గాంధీ కి గతకాలపు ఆధ్యాత్మికత పై గొప్ప గౌరవం ఉండేదని అర్ధమౌతుంది .సమకాలీనులు మరింత లోతుగా అత్యాధునిక విశ్లేషణ చేశారు .ఇందులో కొన్ని అతివ్యాప్తి అనిపించాయి .వీటిలో 1-గాంధి పారిశ్రామీకరణను ,ఆధునిక విజ్ఞానాన్నీ పూర్తిగా తిరస్కరించాడని 2- పడమటి దేశాల ఆధునికత తిరస్కరించాడని 3-సంప్రదాయానికిచ్చిన విలువ ఆధునికతకు ఇవ్వలేదని 4-గాంధీ ఆలోచన ఆధునికోత్తరమైనదని (పోస్ట్ మోడరన్ )సిద్ధాంతాలు చేశారు .వీటిని నేపధ్యంగా చేసుకొని 1-ఆధునికతపై గాంధి ఎలా స్పందించాడు 2-ఆధునికత పై ఆయన సమన్వయము ఏమిటి అన్నప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొందాం .
స౦ప్రప్రదాయానికి స౦ప్రదాయేతర విధానం
ఈవిశ్లేషణలో మనం ముందుగా స౦ప్రదాయం లో గాంధికి ఉన్నస్థానం ఏమిటో చూద్దాం .గాంధి సంప్రదాయాన్ని ఉన్నదున్నట్లుగా సమర్ధించలేదు .సంప్రదాయంఅతిముఖ్యమని కాని ,సంప్రదాయంలో శృంగారం వాస్తవమని కాని అనుకోలేదు .సంప్రదాయ బద్ధుడు గాంధి అని 1987 పరేఖ్ ముద్ర వేశాడు .భారతీయ సంప్రదాయం ఆయనకు చాలా సంక్లిష్టమైనది కాని స౦ప్రదాయేతరమైనదికూడా . కొన్ని సందర్భాలలో ఆయన కు స౦ప్రదాయం ఆధునికతకు మరో పార్శ్వం .ఇలాంటి విరుద్ధ భావాలు అప్పుడప్పుడుసరదాకి ఆయన చెప్పినా ఆయన మొత్తంగా చెప్పిందదానిలోని సారాంశం తీసుకోవాలి .మొదటిప్రశ్న .మనం వెనక్కి వెళ్లగలమా ? వెళ్ళలేము అని ఆయన స్పష్టమైన సమాధానం .ఇష్టమున్నా లేకున్నా ఆధునికత లో బతకాలి .ఇది అనివార్యం అనిఆయనే అన్నాడు .రెండవ విషయం సంప్రదాయం అనేది ఎప్పుడూ పూర్తి స్వచ్చంగా లేదు .సంప్రదాయం అన్నీ కలిపినవిధానం .అది ఆలోచన ,ఆచరణ లపై నిర్మింపబడింది .అది ఆధునికత ఇచ్చిన ఉత్పత్తి .మూడవది –మానవాళికి తమకు ఏదికావాలో దాన్ని తీసుకోవటం ,నచ్చిన సంప్రదాయాన్ని అనుసరించటం ,వాటిలో తమ అర్ధాలు నింపుకోవటం వాళ్ళకున్న అధికారాలు. కొన్ని సంప్రదాయాలను తిరస్కరించే హక్కు కూడా ఉంది .సంప్రదాయ అనుసరణ ,ప్రాచుర్యం లోఉన్న అవగాహన జనజీవన విధానం లో కలిసి పోయి ఉంటాయి .సంప్రదాయం అనేది విడిగా ఉండేది కాదు. రాజకీయాలు ,ప్రవేశించి ఘర్షణలు ,రాజీ పడటాలు ఉంటాయి .కనుక గాంధి దృష్టిలో సంప్రదాయం అంటే1-ప్రాచుర్యం పొందింది 2-ఆచరణలపై సంపూర్ణ నియంత్రణ ఉన్న విధానాల చట్రం .మొదటి దానిపై రెండవది అనుగుణ్యంగా మెలగటానికి గాంధి తనబుద్ధిని మనసును మేధస్సును ఉయోగించి అవి ఒకదానిలో ఒకటి పూర్తిగా కలిసిపోయేట్లు వ్యూహాత్మకంగా వివరణలిచ్చాడు .ఇవి అన్నీ గాంధి స్వంత తాత్విక సిద్ధాంతాలుగా గుర్తింపు పొందాయి .ఇవి సంప్రదాయానికి వెలుపల అంటే సంప్రదాయేతర భావనా సిద్ధాంతాలే అని మరువ రాదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-10-19-ఉయ్యూరు

