గాంధీజీ –ఆధునికత -3
వీటికి మించి ఆధునికత అంతమవటం లేక దాన్ని అధిగమించటం పై గాంధీజీ ఎలా చూశాడు ?ఇప్పుడున్న ఆధునికతను వెనక్కి మరల్చగలమా ?యా౦త్రికతపై ఆయన భావాలు సువిదితమే కాని ఒకసారి పునశ్చరణ చేసుకోవటం అవసరం .యంత్రానికి వ్యతిరేకత ,పరిశ్రమలకు వ్యతిరేకత ,యాంత్రికత పై విముఖత ,ఆధునికతపై వ్యతిరేకత మధ్య ఆయనభావాలున్నాయి .వీటిలో ఆయన స్థానం 1-దోపిడీ చేసే యంత్రానని బహిష్కరించటం 2-యంత్రం కోసమే యంత్రం అనవసరం .చాకిరీని రూపు మాపే,మానవాళి అవసరాలకు ఉత్పత్తి చేసే యంత్రం అభిలషణీయమే .ఆయన పారిశ్రామికత ,యాంత్రికత లలో కొన్ని తర్కాలను తిరస్కరించాడు .కనుక అన్ని యంత్రాలపై ,అన్ని యా౦త్రి కతలపై విముఖత ఉన్నట్లుకాదు .ఆధునికతను వెనక్కు మర్చలటం అసాధ్యం అని ఆయనకు తెలుసు .’’మిల్లులు మూసెయ్యాలని మీ ఉద్దేశమా ?’’అని అడిగిన ప్రశ్నకు ఆయన ‘’సువ్యవస్థితమైనది దేనినీ కాదనటం తేలికైన పనికాదు .రైల్వే, హాస్పిటల్స్ వంటి యాంత్రికత ను నాశనం చేయమని నేను కోరను .’’అని స్పష్టంగా చెప్పాడు .నిజానికి ఈ ప్రశ్నలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు .’’అత్య౦త ప్రాధాన్యమైన,పట్టించుకోవాల్సిన విషయం మనిషి ‘’అని నమ్మాడు మహాత్ముడు . ఆధునికత తిరోగమనం కంటే,కాలనీ ప్రభుత్వం అందించిన పారిశ్రామీకరణ కంటే దాని రూపాన్నిఅనేక విలువల ఆధారిత చట్ర౦ తో మార్చటానికి ఆయన కృషి చేశాడు .
నైతిక విమర్శ
ఇప్పటిదాకా మన వాదం గాంధీ సంప్రదాయవాది కాని ,ప్రమాదకరమైన సంప్రదాయవాది కానికాడు .ఆయనభావాలు అత్యాధునిక వాడది భావాలను సమర్ధిస్తాయా ?ఆయన ఆధునికతలో కొన్ని విషయాలను ,ఆధునికసమాజం అనుసరిస్తున్న కొన్నిటిని వ్యతిరేకించాడు .. ఆధినికతపై విమర్శకుడు భిక్షూ పరేఖ్.సివిల్ సొసైటీ పై విమర్శకుడు పార్ధ చటర్జీ చెప్పిన విషయాలే ఇవన్నీ . గాంధీ ఆధునికతపై విమర్శ సంప్రదాయం ఆధునికతల మధ్య ఉన్న వైరుధ్యాన్నిభగ్నం చేసింది అని’’ పంధం’’అనే విమర్శకుడు చెప్పాడు .
సంప్రదాయంతో గాంధీ బాంధవ్యం విచిత్రమైనది, అసాదారణమైనది .సంప్రదాయాన్ని ఆవాహన చేస్తాడు కాని ఆధునికత ను సంప్రదాయవాదిదృష్ట్యా తిరస్కరించడు .ఆధునికతను విమర్శిస్తే ఆయన ఏ విషయాలను కాదంటాడు ?ఆధునికతను ఆయన బయట ఉండిమాత్రమె విమర్శించాడు .ఐతే ఆయన వాదానికి ఆధారమేమిటి ?దీని సమాధానం విమర్శలోనే ఉంటుంది .అత్యాధునిక జ్ఞానోదయ భావనను కారణం,సైన్స్ దృష్ట్యా విపులంగా చర్చించాడు .ఆయన వ్రాతలలో ఈ రెండింటి పరిమితులేమిటో కూడా తెలియ జేశాడు .మొదటగా అవి పూర్తి సత్యాన్ని ఆవిష్కరి౦చ లేవు .సత్యం అనేది కారణానికి ,సైన్స్ కు అందని రూరంలో ఉంటుంది .ఈ భావన అనుభవవాదవిమర్శ ,ప్రత్యక్షైక వాద విమర్శకిందకు వస్తుంది .దీనికిసత్యం ఆధారం .సత్ అంటే నిత్యమైనది అనే పదం నుండి సత్యం పదం ఏర్పడింది .ఇంకొంచెం ముందుకు వెళ్లి గాంధీ నైతికత యేసత్యం అన్నాడు .కనుక ఆయన సిద్ధాంతంఅన్నిటినీ కలుపుకొన్న సంపూర్ణ మైనసిద్ధాంతం (ఆబ్సల్యూట్ ).ఈ భావన సత్యాన్వేషకుని నిరంతర సాధన అయి ,ఎప్పటికీ పూర్తికానిది అవుతుంది .సంపూర్ణ సత్యం ఆవిష్కారమైతే ,సాపేక్ష సత్యం మన కర్తవ్యానికి మార్గ దర్శనం చేస్తుంది .కానిసాపేక్ష సత్యం బహురూపాలు గా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వేరు వేరుగా అనిపిస్తుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-10-19-ఉయ్యూరు

