ఆస్ట్రేలియన్ రచయితలలో అంతర్జాతీయ ఖ్యాతి పొంది నోబెల్ ప్రైజ్ పొందినవాడు పాట్రిక్ వైట్ . క్రిస్టినా స్టేడ్ ,డేవిడ్ మలూఫ్ ,పీటర్ కార్వే, బ్రాడ్లీ క్లేవేర్ గ్రీవ్, ధామస్ కేనల్లీ ,కొలీన్ మెక్ కలోఫ్ ,నెవిల్ షూట్ ,మారిస్ వెస్ట్ లు కూడా లబ్ధ ప్రతిష్ట రచయితలే .సమకాలీన రచయితలలో ఫెమినిస్ట్ జెర్మేన్ గ్రీర్ ,ఆర్ట్ హిస్టోరియన్ రాబర్ట్ హగ్స్ ,హాస్య రచయితలు బారీ హంఫ్రీస్ ,క్లైవ్ జేమ్స్ లున్నారు .
క్లాసిక్ ఆస్ట్రేలియన్ రచయితలలో కవులు హెన్రి లాసేన్,బాన్జో పేటర్సన్, సిజె డెన్నిస్,డోరోతియామాకేల్లర్ ప్రసిద్ధులు .డెన్నిస్ ఆస్ట్రేలియన్ వ్యావహారిక భాషలో రాస్తే ,మాకేల్లర్ ‘’మై కంట్రి’’కావ్యం రాసిన దిగ్గజం .ప్రసిద్ధ బులెటిన్ డిబేట్ లో లాసన్ ,పేటర్సన్ లు ఆస్ట్రేలియా జీవిత విధానం పై పోటీపడి రొమాంటిక్ కవులను మించిపోయారు .లాసన్ చిన్న కథల గొప్ప ఆస్ట్రేలియా రచయితగా ప్రాభవం పొందాడు .పేటర్సన్ కవితలు పాప్యులర్ ఆస్త్రేలియన్ ‘’బుష్ పోయెమ్స్’’ గా కీర్తి పొందాయి. 20వ శతాబ్దపు కవులలో డెం మారీ గిల్ మోర్,కెన్నెత్ సీసర్,ఎ.డి. హాప్,జూడిత్ రైట్ అగ్రస్థానంలో ఉన్నారు .సమకాలీనకవులలో ప్రసిద్ధులు లెస్ ముర్రే ,బ్రూస్ డావ్.వీరి కవితలను ఆస్త్రేలియన్ హై స్కూల్స్ లో పాఠ్యా౦ శాలుగా విద్యార్ధులు చదువుతున్నారు .
క్లాసిక్ నవలా రచయితలలో మార్కస్ క్లేర్క్ మంచి మార్కులు పొందాడు. ఇతని ‘’ఫర్ ది టర్మ్ ఆఫ్ హిజ్ నేచురల్ లైఫ్ ’’ నవల కు మంచి క్రేజ్ ఉంది . ‘’మై బ్రిలియంట్ కెరీర్ ‘’నవలారచయిత మైల్స్ ఫ్రాన్క్లిన్ ,’’ది ఫార్త్యూన్స్ ఆఫ్ రిచార్డ్ మహోని ‘’రచయితహెన్రి హాన్డేల్ రిచర్డ్సన్,’’సచ్ ఈజ్ లైఫ్ ‘’నవలాకారుడు జోసెఫ్ ఫర్ఫి,’’రాబరీ అండర్ ఆర్మ్స్ ‘’నవలా రచయిత రోల్ఫ్ బోల్దర్ వుడ్ ,’’ది హార్ప్ ఇన్ ది సౌత్ ‘’రచయిత రూత్ పార్క్ లు మంచి గిరాకీలో ఉన్నారు .
బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారిలో ‘’ది మాజిక్ పుడ్డింగ్ ‘’రచయిత నార్మన్ లిండ్ల్సే,’’పోస్సం మాజిక్ ‘’రాసిన మెం ఫాక్స్ ,’’స్నగ్గీపాట్ అండ్ కుడ్డీ పై’’రచయిత మే గిబ్స్ లు క్లాసిక్ బాలసాహిత్య రచయితలుగా గుర్తింపు పొందారు .’’లుకింగ్ ఫర్ అల్బ్రాంది ‘’ మోడరన్ క్లాసిక్ .దీని రచయిత మేలీనా మార్కేట్టా.ప్రఖ్యాత నాటక రచయితలుగా స్టీలీ రడ్,డేవిడ్ విలియంసన్ ,అలాన్ సే మోర్ ,నిక్ ఎన్రైట్ నాటకాలకు మంచి పేరు ఉన్నది .
మేజర్ సిటీలకు దూరంగా చాలా మంది జనాభా ఉంటారు .ఆస్త్రేలియన్ కథలు ,పురాణాలనే లెజెండ్స్ అన్నీ ఆస్ట్రేలియా అవుట్ బాక్ లో ,డ్రోవర్స్( పశువుల కాపరుల).స్క్వాటర్స్అంటే కబ్జా దారుల ,బంజరు భూముల్లో ,మురికి మైదాన ప్రజల జీవితాలలో నుంఛి పురుడు పోసుకొన్నవే .ఆస్త్రేలియన్ ఆదిమ సంతతి రచయిత డేవిడ్ ఉనాపియన్ .మొట్టమొదటి సారిగా కవిత్వాన్ని ప్రచురించిన ఆదిమ సంతతి కవి ఊడ్జేరూ నునౌకల్ .స్టాలీ మోర్గాన్స్ రచన ‘’మై ప్లేస్ ‘’లో తరతరాల తన సంతతివారి కధలు గాధలు అనుభవాలు నిజాయితీగా నిర్భయంగా చిత్రించాడు . ఆస్త్రేలియన్ చారిత్రిక రచయితలలో చార్లెస్ బీన్ ,జాఫ్రి బ్లైనీ ,రాబర్ట్ హగ్స్ ,మాన్నింగ్ క్లార్క్ ,క్లైరీ రైట్ ,మార్సియా లాంగ్టన్ ముఖ్యులు .
ఆస్ట్రేలియా ను వదిలి 1960లో బ్రిటన్ ,అమెరికాలలో సెటిలైన ఆస్త్రేలియన్ రచయితలు నిరంతరంగా తమ దేశ సాహిత్యాన్ని పండిస్తూనే ఉన్నారు .వీరిలో క్లైవ్ ,జేమ్స్ ,రాబర్ట్ హగ్స్ ,బారీ హంఫ్రీస్ జెఫ్రీ రాబర్త్సన్ ,జెర్మేన్ గ్రీర్ లున్నారు .వీరిలోచాలామంది సిడ్నీలోని సిడ్నీ పుష్ మేధావివర్గసభ్యులు .’’ఓజ్ ‘’అనే సెటైరికల్ మాగజైన్ లో రాస్తుంటారు.బ్రిటన్ లో స్థిరపడిన క్లైవ్ జేమ్స్ లీడింగ్ హ్యూమరిస్ట్ .ఆస్ట్రేలియా నేపధ్యంగా గొప్ప సెటైర్ రచనలు చేసి పాప్యులర్ అయ్యాడు .ఇటీవలే రాసిన ‘’కల్చరల్ ఆమ్నేషియా ‘’ కు మంచి పేరొచ్చింది .రాబర్ట్ హగ్స్ ‘’ది ఫాటల్ స్టోర్ ‘’వంటి చారిత్రాత్మక రచనలెన్నో చేశాడు .
బారిస్ హంఫ్రీ తన డడాయిస్ట్ నాటకానుభవంతో 1960నుంచి లండన్ లో బ్రిటిష్ టెలివిజన్ లో కలంతో దున్నేశాడు .తర్వాత అమెరికాలోనూ ప్రసిద్ధుడయ్యాడు .ఈయన డెం ఎడ్నా ఎవిరేజ్ ,బారీ మెకంజీ ,లెస్ పాటర్సన్ లపై రాసిన ఆస్త్రేలియన్ కారి కేచర్స్ బాగా ప్రసిద్ధమై పుస్తకరూపం పొందాయి .5దశాబ్దాల నాటక ,సినీ అనుభవమున్న ఈతని జీవిత చరిత్రరాసిన అన్నే పెండర్ 2010లో చార్లీ చాప్లిన్ తర్వాత అంతటి హాస్యనటుడు అని కితాబిచ్చాడు .ఆయన స్వీయ రచనలలో డెం ఎడ్నా బయాగ్రఫీస్ ,మై గార్జియస్ లైఫ్ ,హాన్డ్లింగ్ఎడ్నా,తన బయోగ్రఫీ ‘’మై లైఫ్ ఆజ్ మీ ఎ మెమాయిర్ ‘’ఉన్నాయి .జాఫ్రి రాబర్ట్సన్ ప్రముఖ అంతర్జాతీయ మానవహక్కుల లాయర్ ,రచయిత,బ్రాడ్ కాస్టర్.ఈయన రాసినపుస్తకాలలో ‘’ది జస్టిస్ గేమ్’’,క్రైమ్స్ ఎగనస్ట్ హ్యుమానిటి మంచి ప్రచారం పొందాయి .ప్రముఖ ఫెమినిస్ట్ జెర్మేన్ గ్రీర్ ‘’ది ఫిమేల్ యూనక్ ‘’( the female eunuch )అనే పుస్తకం రాసింది . ఇంగ్లాండ్ లో ఉంటున్నా అధ్యయనం విమర్శ విశ్లేషణ మాతృదేశం పై వీరాభిమానం ఏ మాత్రం తగ్గలేదు .ఈమె ఇటీవలి రచనలు ‘’వైట్ ఫెల్లా జంప్ అప్’’,’’ది స్టోరీస్ వే టు నేషన్ హుడ్’’
ఇంగ్లీష్ కాకుండా ఇతర ఆస్ట్రేలియన్ సాహిత్యం
ఆస్ట్రేలియా అనేక దేశాల వలస జాతుల సముదాయం .ఇటాలియన్ గ్రీక్ ,అరెబిక్ చైనీస్ ,వియత్నమీస్ లావోస్ ,ఫిల్పినో , లాట్వియన్ ,యూక్రేనియన్,పోలిష్ రష్యన్ సెర్బియన్ ,ఇద్దిష్, ఐరిష్ జాతులవారున్నారు .మైనారిటీలైన వీరుతమతమ భాషల్లో కవిత్వం కథలు రాసుకొంటారు .తమ పండుగలను చేసుకొంటారు .జాతీయ స్రవంతిలో కలవరు,వారి పత్రికలు మేగజైన్లున్నాయి .అందులో విమర్శ విశ్లేషణ ప్రచురణ చేసుకొంటారు .ఇంగ్లీష్ కాక ఇతర పురాతన సాహిత్యం ఇటీవల అనువాదం పొంది విమర్శనాత్మక చారిత్రాత్మక గుర్తింపు పొందాయి .చైనీస్ భాషలో మొదటినవల వాంగ్ షీ పింగ్ 1909 లో రాసిన ‘’డి పాయిజన్ ఆఫ్ పోలిగమి’’ ఆస్ట్రేలియా లో 2019లో పబ్లిష్ అవటం విశేషం .పశ్చిమ దేశాలలో ఎక్కడా ఇలా పబ్లిష్ అయిన దాఖలాలు లేవు .
ఐరోపాదేశాలలో లాగా ఆస్ట్రేలియా లో సైన్స్ ఫిక్షన్ విస్తృతంగా రాలేదు .నెవిల్ షూట్ రాసిన ‘’ఆన్ ది బీచ్ ‘’1957లో పబ్లిష్ అయి 59లో సినిమాగా వచ్చింది .ఇది అంతర్జాతీయ విజయంగా భావిస్తారు .క్రైమ్ ఫిక్షన్ కెర్రి గ్రీన్ వుడ్ ,షేన్ మెలోని , పీటర్ టంప్లె ,ఆర్ధర్ అప్ ఫీల్డ్ ,పీటర్ కారిస్ మొదలైనవారు రాశారు .మూడుకోర్టు కేసులపై రచనలు వచ్చాయి .ఆదిమజాతి మనిషి కామెరాన్ డూ మద్గ్రీ పోలీస్ కస్టడి లో చనిపోవటం పై ‘’ది టాల్ మాన్ డెత్ అండ్ లైఫ్ ఆన్ పాం ఐలాండ్ ‘’క్లో హూపర్ రాసి 2008లో ప్రచురించాడు .
మేగజైన్లు
ది ఆస్త్రేలియన్ మేగజైన్ ,1821లో ప్రార౦భ మైఒక్క ఏడాది నడిచింది .దీనిలో కవిత్వం కథలు వ్యాసాలూ ,సాధారణ విషయాలు వచ్చేవి .ఇవాళ ఎక్కువ మేగజైన్లను యూనివర్సిటీలు ప్రచురిస్తున్నాయి .అందులో మీజిన్ ,ఓవర్ లాండ్ ,హీట్ ,సదర్లి ,వెస్టర్లి వంటివి ఉన్నాయి .మిగతా జర్నల్స్ లో ముఖ్యమైనవి –క్వాడ్ర౦ట్ , ఆస్ట్రేలియన్ బుక్ రివ్యు ,ఐలాండ్ ,వాయిస్ వర్క్స్,కిల్ యువర్ డార్లింగ్స్ వగైరా .
సాహిత్య అవార్డ్ లలో ప్రముఖమైనవి –అన్నే ఎల్డర్ అవార్డ్ ,చిల్డ్రన్స్ బుక్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ,డిట్మార్ అవార్డ్ ఫర్ సైన్స్ ఫిక్షన్ ,కెన్నెత్ స్లీజర్ అవార్డ్ ఆఫ్ పోయెట్రి ,పీటర్ బ్లాజీ ఫెలోషిప్ ,స్టెల్లా ప్రైజ్ ,విక్టోరియన్ ప్రీమియర్ లిటరరిఅవార్డ్ వగైరా .,బుకర్ ప్రైజ్,మాన్ బుకర్ అవార్డ్ ,ఆరంజ్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అవార్డ్ లకు ఆస్త్రేలియన్ రచయితలూ అర్హులే
. నోబెల్ ప్రైజ్ పొందిన రచయితలు-బియాన్ ఫై స్క్మిద్ట్ ,ఎలిజబెత్ బ్లాక్ బరన్ ,బారీ జే మార్షల్ ,జే రాబిన్ వార్రెన్ ,జేఎం కొడ్జీ ,పీటర్ దోహేర్తి,జాన్ హార్సాని ,జాన్ కంఫోర్త్ ,పాట్రిక్ వైట్ ,సర్ బెర్నార్డ్ కార్త్జ్ ,అలేక్జానర్ ప్రోఖ్రోవ్ ,సర్ జాన్ కారీ ఎక్క్లెస్ఫ్రాంక్ మార్కెన్ బార్నెట్ ,హవార్డ్ ఫ్లోరీ .అంతర్జాతీయ అణ్వాయుధ నిషేధ ప్రచారానికి ఆస్ట్రేలియా దేశానికి 2017లో నోబెల్ శాంతి అవార్డ్ వచ్చింది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-19-ఉయ్యూరు
— మొదటి నోబెల్ ఫ్రీజ్ విన్నర్ -పాట్రిక్ వైట్
మొదటి ఆదివాసీ రచయిత-యునేపియన్

