Monthly Archives: January 2020

ప్రపంచ దేశాల సారస్వత౦ 13-టర్కిష్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వత౦ 13-టర్కిష్ సాహిత్యం టర్కీభాష –టర్కీ బాష ను తుర్కి ,తర్కీష్ ,టర్క్ అనీ అంటారు .క్రీశ 6వ శతాబ్దానికే మధ్య ఆసియాలో ఈభాష వాడుకలో ఉందని శాసనాలు చైనా చరిత్ర చెబుతున్నాయి .అక్కడినుంచి ఇతరప్రాంతాలకు వెళ్లి వాటిని యించి స్థిరవాసం ఏర్పరచుకొని భాషావ్యాప్తి చేశారు  .ఇందియావంటి దేశాల్లో కాలక్రమలో అంతరించింది సోవియెట్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కిరాతార్జునీయం-6

కిరాతార్జునీయం-6 ద్రౌపది పలికినపలుకులు ములుకుల్లా తాకినా నిబ్బరంగా తన సహజశాంత స్వభావంతో యుధిష్టిరుడు ఇలా బదులు పలికాడు –‘’ద్రౌపదీ !నువ్వు ఇంతగా విచారి౦చటానికి  కారణం కనబడటం లేదు .నాకు ఏ ఆపదా లేదు .వ్యర్ధంగా విచారిస్తే నీకొచ్చే ఆపద ఏమిటో చెబుతావిను .నువ్వు ఇదివరకు  అంతః పురం లో   హంసతూలికాతల్పం పై శయనించి ఉంటె వైతాళికులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వత౦ 12-ధాయ్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వత౦ 12-ధాయ్ సాహిత్యం               ధాయ్ భాష ధాయ్ భాషనే సయమీస్ భాష అని అంటారు .చీనో –టిబెటన్ భాషా కుటుంబానికి చెందిన భాష .ఆ కుటుంబంలోని మిగాతాభాషల లాగానే  విశ్లేషిత పదరూపం లో ఉంటుంది .ఇందులో పదాలన్నీ ఏకాక్షరాలే .చైనా పదాల్లాగా వాక్యం లో పదాలు తమకున్న స్థానాన్ని బట్టి ,ఏ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కిరాతార్జునీయం-5

కిరాతార్జునీయం-5 ద్రౌపది ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతోంది ‘’దేవేంద్ర విభవ సమానులైన మీవంశంలో భరతుడు మొదలైన రాజుల చే చిరకాలం అవిచ్చిన్నంగా పాలింపబడిన భూమండలం నేడు నువ్వు మదపు టేనుగు పూలదండ ను పీకేసినట్లు నువ్వే నిష్కారణంగా కోల్పోయావు నీ ఔదాసీన్యం వలననే ఇన్ని కస్టాలుకలిగాయి .ఈ అనర్దాలన్నిటినీ పరిహరించటానికి ,శత్రు సంహారం చేసి ,మమ్మల్ని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం11-  జపనీస్ సాహిత్యం -6(చివరిభాగం )

11-  జపనీస్ సాహిత్యం -6(చివరిభాగం ) పైషో-షోవా యుగం (1912నుంచి ) మొదటిప్రపంచ యుద్ధం మొదలైన  దగ్గర్నుంచి జపాన్ లో  మత సంబంధ సాహిత్యం  ప్రచారం లో ఉంటూ ‘’కాగవాటో గొహికో’’అనే  క్రైస్తవవమంత్రి సాహిత్యం ద్వారా మానవ సేవ బోధించాడు .షిపెన్నోకోఎపే-1920,పై యావోఇరు మోనో -1921అనే ప్రసిద్ధ నవలలు రాశాడు .నాటకకర్త మొనోజో షుక్కెటుసోనో డేషి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-4

కిరాతార్జునీయం-4 ధర్మరాజుకు వనచరుడుఇంకా ఇలా చెప్పాడు ‘’రాజా !దుర్యోధనుని ఆజ్ఞను రాజులంతా పూలదండ లాగా శిరసావహిస్తూ ,అతడు ధనుస్సు ఎక్కు పెట్టటంకాని  ,కోపం తో ముఖం  చిట్లించటం కానీ చేయకుండా ప్రశాంతత కలిగిస్తున్నారు .రాజు మనసులో అనుకొన్న పని అతిశీఘ్రంగా నెరవేరుస్తున్నారు . ‘’స యౌవ రాజయ్ నవ యవ్వనోద్ధతం –నిధాయ దుశ్శాసన  మిద్ద శాసనం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11-  జపనీస్ సాహిత్యం -5

11-  జపనీస్ సాహిత్యం -5 1885 నుండి జపానీయులు పాశ్చాత్య వ్యామోహాన్ని తగ్గించుకొని స్వీయ సంస్కృతిని అవలంబించటం ప్రారంభించారు .ఎర్నెస్ట్ ఫెనోల్లాసా అనే పాశ్చాత్యుడు దేశీయ లలితకళల పునః పరిశీలనకు దారి చూపాడు .దేశీయ రచనలకు రచయితలూ ఆసక్తి చూపారు .ఒకరకంగా రాబోయే నవోదయానికి ఈ యుగం ఉషస్సు వంటిది .   మొయిజిసారస్వత చరిత్రలో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-3

కిరాతార్జునీయం-3 వనచరుడు ధర్మరాజుతో ‘’రాజా !ప్రజలను దండించటం ,క్రోధంగా చూడటం చేయకుండా విజ్ఞులకు తెలియ జేసి  వారికి నేరవిషయాలు తెలిపి న్యాయశాస్త్రపరంగా విమర్శ చేయించి శత్రు ,మిత్ర భేదం లేకుండా ఇంద్రియాలను వశంలో ఉంచుకొని తగినశిక్ష విధిస్తున్నాడు .దీనితో ప్రజలకు మరీదగ్గరై వారు మిక్కిలి భక్తి ప్రకటిస్తున్నారు .(అంటే ఈకాలం నాటి కౌన్సెలింగ్ చేయి౦చా డన్నమాట).తనరాజ్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి 150 వ కార్యక్రమంగా శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది వేడుకలు (మాదిరి ఆహ్వానం)

సరసభారతి 150 వ కార్యక్రమంగా శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది వేడుకలు (మాదిరి ఆహ్వానం)  సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ  మరియు ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో కెసీపి దగ్గరున్న రోటరీ క్లబ్ ఆడిటోరియం లో సరసభారతి 150వ కార్యక్రమంగా శ్రీ శార్వరినామ ఉగాది వేడుకలను ఉగాది(25-3-20)కి మూడు రోజులముందు 22-3 -2020 … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు మా ఇంట్లో 25-1-20 శనివారం సాయంత్రం మా మేనకోడలు శ్రీమతి పద్మ ,శ్రీ రామకృష్ణ దంపతులు ,కూతరు శ్రీమతి రవళి దంపతులు

ఉయ్యూరు మా ఇంట్లో 25-1-20 శనివారం సాయంత్రం మా మేనకోడలు శ్రీమతి పద్మ ,శ్రీ రామకృష్ణ దంపతులు ,కూతరు శ్రీమతి రవళి దంపతులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం

ఈడో యుగం లో 31అక్షరాల టంకా పద్యం కంటే చిన్నదైన ‘’హైకూ ‘’లేక హొక్కుపద్యం బాగా ప్రచారం లో ఉంది .టంకా లోని చివరి 14 అక్షరాలూ తీసేస్తే హైకూ ఏర్పడుతుంది .ఒక రుతువునుకాని ,పరాశ్రయభావాన్నికాని వర్ణించటానికి దీన్ని వాడుతారు .జపాన్ సారస్వత గుణ సంపన్నత టంకా ,హైకూ లలో గోచరిస్తుంది .ప్రకృతి బాహ్య సౌందర్యాన్ని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-2

కిరాతార్జునీయం-2 ధర్మరాజు రహస్య ప్రదేశం లో కూర్చుని శత్రు సంహార విధానం పై ఆలోచిస్తుండగా  ఆ వనచరుడు దగ్గరకు వెళ్లి నమస్కరించి ‘’ప్రభూ !మీ అనుజ్ఞ ఐతే నాకు తెలిసిన విషయాలు విన్నవిస్తాను ‘’అనగానే అలాగే చెప్పమని ధర్మరాజనగానే వాడు ‘’రాజకార్యం కోసం నియమిప బడినవాడు ,ప్రభువుకు ఆగ్రహం కలిగితే తమకు ముప్పు జరుగుతుందని భయంతో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11-  జపనీస్ సాహిత్యం -3

ప్రపంచ దేశాల సారస్వతం 11-  జపనీస్ సాహిత్యం -3 ఈడో యుగం (1603-1868)-16వ శతాబ్ది చివరికి అంతర్యుద్ధాలు పూర్త యి ,శక్తి వంతమైన ప్రభుత్వమేర్పడి రాజాధాని రాజకీయ ,సాంస్కృతిక కేంద్రమైన ‘’ఈడో’’అంటే క్యోటో కు మారింది .ఈకాలపు సాహిత్యమే ఈడో యుగ సాహిత్యం .16వ శతాబ్ది ప్రారంభం లో జపాన్  పాశ్చాత్య దేశాలతో సంబంధాలు ఏర్పరచు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం

కిరాతార్జునీయం సాహితీ బంధువులకు పవిత్ర మాఘమాసం ప్రారంభ శుభ కామనలు.ఈ మాఘమాసంలో సంస్కృతంలో భారవి మహాకవి రచించిన ‘’కిరాతార్జునీయం ‘’కావ్యాన్ని ధారావాహికంగా రాయాలని ప్రయత్నిస్తున్నాను .పెద్దగా సంస్కృత శ్లోకాల జోలికి పోకుండా శ్లోక భావాలను తెలుపుతూ సరళంగా అందరికి చేరువ చేసే విధంగా రాయాలని ప్రయత్నం .అద్భుతశ్లోకాలకు అవసరమైన చోట్ల వివరణ ఇస్తాను . దీనికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి 149వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం

సరస భారతి 149వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ 149 వ కార్యక్రమము గా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో పవిత్ర మాఘమాసం లో రెండవ మాఘ ఆదివారం మాఘ శుద్ధ అష్టమి 2-2-20 నాడు ఉదయం 9 గంటలకు ఆవుపిడకలపై ఆవుపాలు పొంగించి ,పొంగలి వండి శ్రీ సూర్యనారాయణ స్వామికి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -2 కామకూరా యుగం (1192-1332)12వ శతాబ్దిలో జపాన్ లో జరిగిన అంతర్యుద్ధం లో ‘’మినమోటోస్’’వర్గం జయించి రాజధానిని కామకూరాకు మార్చారు కనుకనే ఆపేరు ఈయుగానికి వచ్చింది .ఒకరకంగా సైనికయుగం ఇది .మతం మీద ఆసక్తిపెరిగి మతగ్రందాలే ఎక్కువగా వచ్చాయి .చైనా నుంచి దిగుమతి అయిన ‘’జెన్ మతం ‘’బాగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆ”పాత”మధురాలు 11 

ఆ”పాత”మధురాలు 11 మా అమ్మాయి చి సౌ విజయలక్ష్మి కి డెట్రాయిట్ దగ్గర ట్రాయ్ లో 2005 డిసెంబర్ 9న ఒక నిమిషం తేడాతో జన్మించిన ”ట్విన్స్ ”చి ఆశుతోష్ ,చి  పీయూష్  ల బాల్యచిత్రాలు 1-హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన ట్విన్స్ తో  మా అమ్మాయి విజ్జి    తర్వాత ఇంట్లో వాళ్ళిద్దరితో , 2-చిన్నారి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆ”పాత” మధురాలు -10

ఆ”పాత” మధురాలు -10 ఆ”పాత” మధురాలు -10 1-2002 మొదటి అమెరికాప్రయాణం లో మాకు సెండాఫ్ ఇచ్చి బాన్ వాయేజ్ చెప్పిన మాతమ్ముడు మోహన్ ,కొడుకు రాజు వగైరా ,అమెరికాలో శిశిర రుతు అనే ”ఫాల్ ”సౌందర్యం హూస్టన్ స్పెస్  సెంటర్లో మేమిద్దరం ,మనవడు శ్రీకేత్ -మిచిగాన్ లోని ట్రాయ్ లో మా అమ్మాయి స్నేహితురాలు … Continue reading

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 10- ఐరిష్ సాహిత్యం -2(చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం 10-  ఐరిష్ సాహిత్యం -2(చివరిభాగం ) ఆలివర్ గోల్డ్ స్మిత్ వికార్ ఆఫ్ వెక్ ఫీల్డ్ నవలతో ప్రసిద్ధుడయ్యాడు.గోప్పకవికూడా . రాబర్ట్ బర్న్స్ స్థానిక రచయితగా ప్రసిద్ధుడు. డబ్లిన్ లో పుట్టిన ఎడ్మండ్ బర్క్ హౌస్ ఆఫ్ కామన్స్ కు విగ్ పార్టీ ప్రతినిధి,గొప్ప ఆరేటర్ ఫిలసాఫికల్ రచనలు చాలా చేశాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం 11-  జపనీస్ సాహిత్యం -1 జపనీస్ భాష జపనీస్-కొరియన్ భాషా కుటుంబానికి చెందింది అని కొందరు కాదు ఆ రెండిటికి  సంబంధమే లేదని కొందరు భావించారు .ఈ భాష సంయుక్త పద రూపం లో ఉండటం విశేషం .క్రీశ 1వ శతాబ్దికే ఈ భాష రూపొందింది .5వశతాబ్దం నాటికి చైనా భాషతో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆ”పాత ”మధురాలు -8

1-అమెరికాలో ని హ్యూస్టన్ లో నా పూజ మా శ్రీమతి పుట్టినరోజు హడావిడి ,నా చేతిలో మనవడు శ్రీకేత్ ,హ్యూస్టన్  స్పెస్ ,సెంటర్ లో మేమిద్దరం మనవుడు శ్రీకేత్ 2-కాలిఫోర్నియా లో ఉయ్యూరు శిష్యుడు చోడవరపు మృత్యుంజయ మూర్తి దంపతల ఇంట్లో మేమిద్దరం మిచిగాన్ యూ ని వర్సిటీ లో మేమిద్దరం మనవడు శ్రీకేత్ ,ఒకప్పుడు అక్కడ చదివిన … Continue reading

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 10-  ఐరిష్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం 10-  ఐరిష్ సాహిత్యం -1 ఐర్లాండ్ దేశం లో ఐరిష్ ,లాటిన్ ఇంగ్లిష్ భాషలలో వచ్చిన సాహిత్యమే ఐరిష్ సాహిత్యం .పశ్చిమ యూరప్ లో గ్రీకు లాటిన్ లతర్వాత  చాలాప్రాచీనభాష ఐరిష్ భాష .5వ శతాబ్దిలో క్రైస్తవం వచ్చాక బాగా వ్యాప్తి చెందింది .అంతకు ముందు చాలాసరళమైన ‘’ఒఘన్ ‘’భాష శాసనాలలో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పీఠికాపుర పీఠాధి పతి -ఉమర్ ఆలీషా కవి

పీఠికాపుర పీఠాధి పతి -ఉమర్ ఆలీషా కవి నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ” పీఠికాపుర పీఠాధి పతి -ఉమర్ ఆలీషా కవి ”ఆర్టికల్ ను జనవరి గురు సాయి స్థాన్ లో ప్రచురితమైంది   

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆ”పాత”మధురాలు -7 2001 జూన్ 19 ,20,21 తేదీల నా డైరీ ముఖ్యవిషయాలు-జంధ్యాల మరణం ,జానకిజాని గారి ఉత్తరం,వారితో ఫోటో

ఆ”పాత”మధురాలు -7 2001 జూన్ 19 ,20,21 తేదీల నా డైరీ ముఖ్యవిషయాలు-జంధ్యాల మరణం  ,జానకిజాని గారి ఉత్తరం,వారితో ఫోటో

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ ”పాత ”మధురాలు 06

ఆ ”పాత ”మధురాలు -61-మా పెద్దబ్బాయి శాస్త్రి కోడలు సమత,సమంత చేతిలో మా మనవడు చరణ్    మా పాత పెంకుటిల్లు ఎక్కిన మా పెద్దమనవడు (శాస్త్రి కొడుకు )సంకల్ప్     అన్నదమ్ములు సంకల్ప్ భువన్ 2-శాస్త్రి సమత,సంకల్ప్   భువన్ పుట్టినరోజు పండుగవేడుక 3-మా రెండవ అబ్బాయి శర్మ కోడలు ఇందిర,మనవడు హర్ష ,మనవరాలు హర్షిత    శర్మ ఇంట్లో కోడాలుపూజ     … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

9-స్కాటిష్ సాహిత్యం

9-స్కాటిష్ సాహిత్యం స్కాట్ లాండ్ దేశం లో స్కాటిష్ ప్రజల చేత రచి౦ప బడినదేదే స్కాటిష్ సాహిత్యం .ఇది ఇంగ్లిష్ ,స్కాతిక్ గేతిక్,స్కాట్స్ ,బ్రితోనిక్,ఫ్రెంచ్ ,లాటిన్ ,నార్మ్ మొదలైన స్కాట్ లాండ్ సరిహద్దులలో ఉన్న భాషలలో రాయబడిన సాహిత్యం .ఇవాళ స్కాట్ లాండ్ గా పిలువబడుతున్న దేశం లో మొట్టమొదట బ్రితోనిక్ భాషలో 6 వ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ఆ”పాత ”మధురాలు -5

ఆ”పాత ”మధురాలు -51-మా పాత శ్రీ ఆంజనేయస్వామి గుడి లో నేనూ మా  శ్రీమతి ప్రభావతి   మా ఇంట్లో రిటైరీలు -ఎడమనుంచి -శ్రీ కోటేశ్వర శర్మ ,శ్రీ చలమయ్య ,,శ్రీ కృష్ణమూర్తి ,శ్రీ రామశేషయ్య,శ్రీ సాయి బాబు  ,శ్రీ గరుడాచలం మేష్టారు 2-అమరవాణి స్కూల్ లో శ్రీ సూరి రామశేషయ్య బాబాయి దంపతులకు సాహితీమండలి సత్కారం  ,-  … Continue reading

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ”పాత”మధురాలు -4

పాత పెంకుటిల్లు నుంచి కొత్త డాబాకు  మార్పు ,పెంకుటింట్లో సావిడిలో గోడలకు ఫోటోలు వగైరా  1-పెంకుటింటి వాకిలి వసారా లో మేమిద్దరం ,మాకోడలు సమత మేనకోడలు జయ    వెనకున్న పెంకుటిల్లు  ముందు కొత్తగా కట్టిన రెండస్తులభవనం లోకి గృహప్రవేశం ,కుటుంబ సభ్యులు 2-నా షష్టి పూర్తి వేడుకలో హోమం ,కుటుంబ సభ్యులు     … Continue reading

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ” పాత ”మధురాలు -3

ఆ” పాత ”మధురాలు -3కృష్ణా జిల్లా అవనిగడ్డ దగ్గర పులిగడ్డ గ్రామంలో శతాధిక వృద్ధులు ,కాంగ్రెస్ నాయకులు స్వాతంత్ర్య సమరయోధులు ,నిరాడంబర జీవి నాకు ఆత్మీయులు,గాంధీమహాత్ముని అనుచరులు  శ్రీ మండలి రాజగోపాలరావు గారిని వారింట్లో 2014ఫిబ్రవరి లో సందర్శించనప్పడు  వారి దంపతుల ఫోటో ,వారు  2001 లో నాకు ఆత్మీయంగా రాసిన ఉత్తరం .ఇవాళ ఇప్పుడే … Continue reading

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ”పాత”మధురాలు -2

ఆ”పాత”మధురాలు -2 ఆ”పాత”మధురాలు -2 1987లో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయ పునః ప్రతిస్తాపనోత్సవ చిత్రాలు 1-దేవాలయం ఏరియల్ వ్యూ ,ఆధ్వర్యులు శ్రీమాన్ వేదాంతం రామాచార్య ,మూల విరాట్ప్రతిస్తలో మా దంపతులతోపాటు కెసీపి ప్లాంట్ మేనేజర్ శ్రీ ఇంజేటి జగన్నాధరావు గారు 2-మూల విరాట్ ప్రతిష్ట 3-కలశ స్థాపనలో ఉయ్యూరు శాసనసభ్యులు శ్రీ అన్నే … Continue reading

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 8-  కొరియన్ సాహిత్యం -2 (చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం 8-  కొరియన్ సాహిత్యం -2 (చివరిభాగం ) గోరియో పాటలు –హంజా పాత్రల నేపధ్యం లోని సాహిత్యంక్రమగా మారిపోయి గోరియా పాటలు వ్యాప్తిలోకి వచ్చాయి .ముందుగా మౌఖికంగా వ్యాప్తి అయి ,జోసేన్ పీరియడ్ లో వ్రాతరూపం పొందాయి .కొన్ని హన్గూయ్ లోకి మారాయి .వీటికవిత్వభాష  ను పయల్గొక్ లేక చాంగ్గా అంటారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 8- కొరియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 8- కొరియన్ సాహిత్యం   ప్రపంచ దేశాల సారస్వతం 8-  కొరియన్ సాహిత్యం కొరియన్ భాష జపనీస్ –కొరియన్ భాషా కుటుంబానికి చెందింది అని చాలామంది అభిప్రాయం కానీ అది సరికాదు ఒక స్వతంత్ర భాష అని కొందరి భావన .మొదట్లో చైనీస్ లిపినే వాడుకొన్నా ,తర్వాత ద్వన్యాత్మక లిపిని అనుసరించారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆ ”పాత ”మాధుర్యాలు -1

ఆ ”పాత ”మాధుర్యాలు -1 1-మొదటి ఫోటో -ఉయ్యూరు ఎసి గ్రంధాలయం 2004 లోప్రారంభమైనప్పుడు బిల్డింగ్ కమిటీ కన్వీనర్ గా ఉన్న నన్ను సత్కరిస్తున్న శ్రీ మైనేని గోపాలకృష్ణగారు ,జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీమతి 2- రెండవ ఫోటో -హైదరాబాద్ లో చిట్టెం రాజు గారు జరిపిన బాపు -రమణ ల స్నేహ షష్ఠి పూర్తి సభలో … Continue reading

Posted in ఆ''పాత''మధురాలు, రచనలు | Tagged | Leave a comment

‘డిసెంబర్ ”సొగసులు –మా పెరటి లో జనవరి చివరిలోనూ డిసెంబర్ పూల సొగసులు ,సౌరభాలు .ధనుర్మాసం అంతా శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ గోదా రంగనాధులకు డిసెంబర్ పూల హారాలు కట్టి వేయించిన మా శ్రీమతి -దుర్గాప్రసాద్

‘డిసెంబర్ ”సొగసులు –మా పెరటి లో జనవరి చివరిలోనూ డిసెంబర్ పూల సొగసులు ,సౌరభాలు .ధనుర్మాసం అంతా  శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ గోదా రంగనాధులకు డిసెంబర్ పూల హారాలు కట్టి వేయించిన మా శ్రీమతి -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged , | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 8-  స్కాండి నేవియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 8-  స్కాండి నేవియన్ సాహిత్యం .స్కాండినేవియన్ సాహిత్యాన్ని నార్డిక్ సాహిత్యం అంటారు .అంటే నార్డిక్ దేశాలైన ఉత్తరయూరప్ లోని డెన్మార్క్ ,ఫిన్లాండ్ ,ఐస్ లాండ్ ,నార్వే, స్వీడన్ ,స్కాండినేవియాకు చెందిన అసోసియేటెడ్ అటానమస్ టెర్రిటరీలు అయిన ఆలాండ్ ,ఫారో ఐలాండ్స్, గ్రీన్ లాండ్   దేశాలు .ఇందులో మెజారిటి దేశాలు ఉత్తర జర్మని భాష ను వాడుతాయి .ఫిన్లాండ్ ప్రజలలో ఎక్కువమంది యురాలిక్ భాషలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 7- నార్వీజియన్ సాహిత్యం -2(చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం 7- నార్వీజియన్ సాహిత్యం -2(చివరిభాగం ) నాలుగువందల ఏళ్ళ చీకటి స్కాండినేవియన్ యూనియన్ కాలం లో నార్వీజియన్ సాహిత్యం ఏమీ రాలేదు .తర్వాత డానో-నార్వీజియన్ అంటే 1387-1814కాలాన్ని ఇబ్సెన్ ‘’నాలుగువందల ఏళ్ళ చీకటి ‘’అన్నాడు .అప్పుడు కోపెన్ హాన్ యూనివర్సిటి ఒక్కటే యువతకు దిక్కు .ఇక్కడే అందరికి శిక్షణ ఇచ్చేవారు .గేబెల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

173వ త్యాగరాజ ఆరాధనోత్సవం సరసభారతి ఉయ్యూరు

173వ త్యాగరాజ ఆరాధనోత్సవం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 6-ఐస్ లాండిక్ సాహిత్యం -2(చివరిభాగం )

మధ్యయుగ ఐస్ లాండిక్ సాహిత్యం 15వ శతాబ్దం నుంచి 19వ శాతాబ్దివరకు ఐస్ లాండిక్ సాహిత్యం పవిత్ర కవిత్వం అందులో ముఖ్యంగా ‘పాషన్  వెర్సెస్ ఆఫ్ హల్లిగ్రిముర్ పీటర్సన్ ,’’రిమూర్ లు రైమ్స్ తో పాదానికి నాలుగు లేక రెండువాక్యాలలో ఉండేది .వచన రచనజోన్ మాగ్నూసన్ రాసిన  ‘’పీసియర్ సాగా ‘’తో ప్రారంభమైంది 19శతాబ్ది చివరలో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 6-ఐస్ లాండిక్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం 6-ఐస్ లాండిక్ సాహిత్యం -1 ఐస్ లాండిక్ సాహిత్యం అంటే ఐస్లాండ్ దేశం లో వర్ధిల్లిన ,ఐస్ లాండ్ ప్రజలు రాసిన సాహిత్యం .ఇక్కడ మధ్యయుగాలలో 13వ శతాబ్దిలో సాహిత్యం’’ సాగాలు ‘’అంటే కుటుంబ కథలదారావాహిక  పేరిట వచ్చింది .ఐస్ లాండిక్ ,పురాతన నార్సే అంటే ఒకటే .కనుక ఓల్డ్ నార్సే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  స్వీడిష్ భాషా సాహిత్యం -3(చివరిభాగం )

  స్వీడిష్ భాషా సాహిత్యం -3(చివరిభాగం ) బాలడ్(గేయకథా)సాహిత్యం 18వశతాబ్దిలో బాల్లడ్ సాహిత్యాన్ని బెలిమన్ కవి మొదలుపెట్టాడు .యూనివర్సిటి చదువుల విజ్రు౦భణలో వెనకబడి మళ్ళీ 1890పుజు కున్నది .గేయానికి సంగీతం తోడై ఎక్కువ మంది శ్రోతలను ఆకర్షి౦చేట్లు కవులు రాసి ప్రచారం తెచ్చారు .1900లో 90కి పైగా కవులు ఈప్రక్రియ బాగా పండించారు .గుస్తాఫ్ ఫ్రోడింగ్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -20(చివరిభాగం )

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -20(చివరిభాగం ) ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 7(చివరిభాగం ) 34-పిరాట్ల శంకర శాస్త్రి (1884-1950)-తారణ సంవత్సర భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు శ్రీశైల శాస్త్రి ,పిచ్చమా౦బ లకు కృష్ణాజిల్లా నందిగామ తాలూకా జయంతిపురం లో జన్మించాడు తండ్రి ఆంధ్రగీర్వాణ భాషాపండితుడు, దేవీ ఉపాసకుడు .సోదరులు  మృత్యుంజయశాస్త్రి ,శివరామ శాస్త్రి, … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -19 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 6

  దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -19 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 6 30-కాశీ భట్ల లక్ష్మణ శాస్త్రి –గరికపర్తి కోటయ్య దేవర శిష్యుడు .కస్తూరివారి సావరం నివాసి .చిన్నప్పుడే ఫిడేలు, గాత్రం నేర్చి తోడి ,శుద్ధ సావేరి రాగాలలో వర్ణాలు రచించి చాలామందికి నేర్పాడు .1944లో చనిపోయాడు .కొడుకులు కామేశ్వరావు గణపతి కాశీపతి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -18 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 5 29-వారణాసి రామసుబ్బయ్య(1882 -1912)-    

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -18 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 5 29-వారణాసి రామసుబ్బయ్య(1882 -1912)- గుంటూరు జిల్లా పొన్నూరు వాసి .తండ్రి కోటయ్య .తల్లి లక్ష్మీ దేవి .భార్య రోశమ్మ ..30ఏళ్ళు మాత్రమె జీవించినా చిర యశస్సు నార్జిం చాడు .స్పురద్రూపి ఆజానుబాహు ,విశాలనేత్రుడు .సహజ సుస్వర గాత్రుడు .ఆకార సదృశ ప్రజ్ఞ ఉన్నవాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -16 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 3

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -16 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 3 15-లయబ్రహ్మ పాపట్ల లక్ష్మీకాంత కవి (1877-1921) జగ్గయ్య పేట వాసి .సంగీత విద్వన్మణులలో ఒకడు .దిగంత యశోవిశాలుడు సహజ ప్రతిభ స్వతంత్ర రాగాతాళప్రస్తారాలతో ,అనేక గీతికా పాఠ్యఅనుభవం గాన్ధర్వగానం లతో ఆంధ్రనాటకానికి కొత్త జవ, జీవాలు తెచ్చాడు .గాన స్వతంత్రుడు .వివిధ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -15 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 2

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -15 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 2 8-రాజనాల వెంకటప్పయ్య (1860-1930)గురువుకు తగిన శిష్యుడు .పల్లవి పాడటం లో నేర్పరి .అనేకులకు భోజన వసతులు కల్పించి గానవిద్య నేర్పిన కులపతి .శిష్యుడు పొన్నూరు రామ సుబ్బయ్య . 9-ద్వివేదుల లక్ష్మన్న సోదరులు-బొబ్బిలి వారు. గాత్రం త్రిస్థాయిలో పలికించే నేర్పున్నవారు  .మృదువుగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment