ప్రపంచ దేశాల సారస్వతం
80 సాన్ మెరినో దేశ సాహిత్యం
సాన్ మెరినో పర్వతమయమై ఉత్తర ఇటలి చేత పరి వేష్టించి ఉన్న చిన్న దేశం .అతిప్రాచీన రిపబ్లిక్ దేశం .చారిత్రాత్మక సంస్కృతికి నిలయం .రాజధాని పేరు కూడా సాన్ మెరినోమధ్యయుగ గోడలతో ఉంటుంది .జనాభా 34వేలు మాత్రమె .కరెన్సీ –యూరో ,19వ శతాబ్దిలో ఇటలి ఐక్యతా ఉద్యమం లో ఈ దేశం నాయకుడు గారిబాల్డి తో సహా శరణార్ధులకు వసతికల్పించినందుకు 1862లో స్వతంత్రం పొంది రిపబ్లిక్ అయింది .ఇటాలియన్ భాష మాట్లాడుతారు .
సాన్ మెరినో సాహిత్య౦ ఇటాలియన్ భాషలో ఉంటుంది .ఈ దేశం చుట్టూ ఉన్న దేశాలు ఈ దేశ సంస్కృతిని పీల్చేశాయి .అందుకే ఇటాలియన్ సంస్కృతీ భాష మిగిలాయి .మిరలీనా ఏర్కోలని –సమ్మరినీస్ కవి తనకవితా సంపుటి పర్నాసస్ లండన్ లో ప్రింట్ చేసింది .రెండు నవలలు రాసి౦ది కాని అనువాదం పొందలేదు .ఒకదానికి ఇంగ్లిష్ అనువాదం తెచ్చే ప్రయత్నం లో ఉన్నది .కార్లో లుకారేల్లి ఈ రిపబ్లిక్ లో ఉన్నాడు .పాల్ అనే కనడియన్ బ్లాగ్ నిర్వాహకుడు ఈ దేశ కథను తన బ్లాగ్ లో పొందుపరచాడు .సాన్ మెరీనా యూనివర్సిటి లో చదివే టినాచెప్పిన దానిప్రకారం ఈ దేశ చరిత్రను ఇటాలియన్ లో గుసేప్ రోస్సి రాస్తే తర్వాత ఇంగ్లిష్ అనువాదం వచ్చింది .1970లో ప్రచురింపబడిన కరపత్రం లో ఈ దేశ చరిత్ర కొంత కనబడింది .ఈ విషయాలన్నీ బ్రిటన్ కు చెందినఆన్ మోర్గాన్ తెలియ జేసింది .
ఈ దేశాన్ని గురించి 7పుస్తకాలలో ఉన్నది -1-ట్రావెల్ జర్నల్-ఇ.లాకేన్ 2-ఏ ఫ్రీక్ ఆఫ్ ఫ్రీడం –జేమ్స్ ధియో డేర్ బెంట్ 3-ది రిపబ్లిక్ ఆఫ్ సాన్ మెరినో –కార్లో డీ బ్రూక్ 4-ది గ్లాడియేటర్-హారీ తర్తెల్ డోవ్5-సబ్లిమినల్ -2-కి నివిన్ 6-ఫ్రం రోమ్ టు సాన్ మెరినో-ఆలివర్ నాక్స్7-స్మోక్ ఇంటు ఫ్లేం-జేన్ ఆర్బర్ .
ఇంతకంటే ఈ దేశ సాహిత్య వివరాలు తెలియలేదు .
81-సెర్బియా దేశ సాహిత్యం
సెర్బియా రిపబ్లిక్ దేశం సెంట్రల్-సౌత్ ఈస్ట్ యూరప్ క్రాస్ రోడ్స్ లో ఉంటుంది .రాజధాని-బెల్గ్రేడ్ .కరెన్సీ –సెర్బియన్ దీనార్ .అనేక మైనారిటీలున్న దేశం .సేఫ్ కంట్రీ.ఆరబ్ సంస్కృతీ ఎక్కువ .2003లో రిపబ్లిక్ అయింది .క్రిస్టియన్ మతం .70లక్షల జనాభా .
సెర్బియన్ సాహిత్యం అంటే బాల్కన్ ప్రజలసాహిత్యమే .12వ శతాబ్దిలో మతరచనలతో ప్రారంభమైంది .ఓల్డ్ చర్చ్ స్లావానిక్ సాహిత్యం బైజాంటిన్ మోడల్ లో వచ్చింది .సిరిల్ మేదోడియస్ వాళ్ళస్లావ్ మతాధికారులు , శిష్యులు దీనికి ఆద్యులు .కర్మకాండలకు చెందిన హగియోగ్రఫీ ,హోమేలిటిక్స్,హిమ్నోగ్రఫీ లు వచనం అలంకార ,కవిత్వ శాస్త్రాలు .సెయింట్ సావా 12వ శతాబ్దిలో మతరచనలు తీర్చిదిద్దాడు .మొదటినుంచి మౌఖిక సాహిత్యమే తరతరాలుగా వచ్చింది .14వ శతాబ్ది కొసొవో యుద్ధం ,విశేషాలతో సెర్బియన్ ఎపిక్ కవిత్వం వచ్చింది .తర్వాత నాటకం వచనం కూడా వచ్చాయి .
తర్వాత బోరోకి ,క్లాసిసిజాలు వచ్చాయి వాస్తిజి 3,మొదలైనవారు ఇన్దులొఘనులు .1848లో రోమా౦టిజం, రియలిజం వచ్చి డేస్తేజి ఒబ్రడోవిక్ బాగా రాశాడు .సెర్బియన్ స్వతంత్ర ఉద్యమం వచ్చి ,రిపబ్లిక్ అయ్యాక అసలైన సెర్బియన్ సాహిత్యానికి బీజావాపన జరిగింది .పెటార్-2రాసిన ‘’మౌంటేన్ రీత్ ‘’సెర్బియా సాహిత్యం లో ఎపిక్ గౌరవం పొందింది .దీనిలో లయతోకూడిన జానపద గీతాలూ ఉన్నాయి .వాన్ గోధేజానపద గీతాల సంకలన కర్తగా ,ఎపిక్స్ కవిగా పేరుపొందాడు .వుక్ కరాడ్ జికి సెర్బియన్ ఫైలాలజిస్ట్ .డూరో డాన్సిసి తోకలిసి ఆధునిక సెర్బియన్ భాషా నిర్మాణం చేశాడు .
20వ శతాబ్దిలో ఆధునిక సాహిత్యంవచ్చింది .సింబాలిజం తో సైకలాజికల్ నవలా రచనలు వచ్చాయి. జొవాన్ డుసిసి ,మిలాన్ రాకిక్ దీనిలో నిష్ణాతులు .అలెక్సాసా౦టిక్ విషాదాత్మక కవిత్వం అల్లాడు .మిలూటిన్ బోజిక్ ,మిలాన్ కర్సిన్ డానికామార్కొవిక్ వంటి వారెందరో ఉన్నారు .వచనం పచనం చేసినవారు –స్వెటోజర్ కోరోవిక్ ,వేజికో మాలిసేవిక్ ,బోరిసావ్ స్టాంకోవిక్ వంటి వారు చాలామ౦చి నాటక రచయితలున్నారు ఇంప్యూర్ బ్లడ్ నాటకం రాసిన బోరిసావ్ అత్యంత పేరు ప్రతిష్టలు పొందాడు ఈనాటకం జనం నోళ్ళలో బాగా నానింది .పెటార్ కోకిక్ హై లిరికల్ ప్రోజ్ రాశాడు .మిలూటిన్ ఉస్కకోవిక్,వేలిమిర్ రాజిక్ పెట్కోవిక్ డిస్ కూడా ముఖ్యరచనలు చేశారు .గోర్డానా కూయిక్ .స్వెత్లానా వేల్మేర్ ,లు ఈనాటి ఫేమస్ మహిళా నవలాకారిణులు.అన్ని ప్రక్రియలలో ఇవాళ సెర్బియన్ సాహిత్యం వర్ధిల్లుతోంది .మిలోరాడ్ పావిక్ .కఝార్స్ నిఘంటువు కూర్చి ఎంతో పేరుప్రఖ్యాతులు పొందాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-20-ఉయ్యూరు

