ప్రపంచ దేశాలసారస్వతం
84-యుక్రేన్ సాహిత్యం
యుక్రేన్ తూర్పు యూరప్ లో పెద్ద దేశం .ఆర్ధడాక్స్ చర్చిల నిలయం .నల్లసముద్ర తీరం ,వృక్షాల పర్వతాలు ఆకర్షణ .రాజధాని –కీవ్ లో గోల్డ్ డోమ్ 11వ శతాబ్ది కేధడ్రిల్ చర్చి ఉంటుంది .కరెన్సీ యుక్రేన్ హ్రివ్నియా .అధికార భాష యుక్రేనియన్..భయపడకుండా సందర్శించవచ్చు .4న్నర కోట్ల జనాభాలో నాలుగో వంతు ప్రజలు బీదలే .అతి పేద దేశం .అందరూ యుక్రెన్ భాషలోనే మాట్లాడుతారు .క్రైస్తవ మత దేశం .
యుక్రెన్ సాహిత్యం అంతా యుక్రేనియన్ పై అనేక దేశాల పెత్తనం వలన మౌఖిక వ్రాత సాహిత్యమంతా 17వ శతాబ్ది నుంచి 21వ శతాబ్ది వరకు నేరంగా భావించబడింది .కానీ పోలిష్ –లిదూనియన్ కామన్ వెల్త్,పోలాండ్ ,రష్యా సామ్రాజ్య కాలం ,రొమేనియా రాజ్యపాలనలో ,ఆస్ట్రియా-హంగేరి సామ్రాజ్యం ,అట్టోమాన్ సామ్రాజ్య కాలం లో యుక్రేన్ భాషా సంస్కృతులకు దోహదం జరిగి,యుక్రెన్ రచయితలు ఆభాషలో చాలా సంతోషంగా రాశారు .
17 వ శతాబ్ది పూర్వం వరకు చాలామంది స్కాలర్లి భాషఅంటే లాటిన్ ,ఓల్డ్ స్లావానిక్ భాషలలో రాశారు .వీరిలో హ్రియోరి స్కోవోరోడా,యురియ్ డ్రోహోబిక్,సెబాస్టియన్ క్లెనో విక్,జాన్ టొమా, పావియో రుసిన్ మొదలైనవారున్నారు .1770నాటికి దేశంలో విద్యా ఆలయాలు చాలా వచ్చాయి .1720లో జర్మన్ యాత్రికుడు రాస్తూ ఈత్మన్ డాన్యోఅపోస్టల్ కొడుకు ఏనాడూ యూక్రెన్ దాటి వెళ్లకపోయినా లాటిన్ ,ఇటాలియన్ ఫ్రెంచ్ జర్మన్ పోలిష్ రష్యన్ భాషలలో మహా ప్రతిభ ఉన్నవాడు అన్నాడు .16నుంచి 17వ శతాబ్ది మొదటిభాగం వరకు ‘’డూమి’’అనే జానపద ఎపిక్స్ బాగా వచ్చాయి .వీటిలో కోసక్కుల జీవిత వ్యవహారాలున్నాయి ఇవి మౌఖికంగా తరతరాలుగా వ్యాపించాయి .
యూక్రేనియన్ భాషలో రాయబడి మొదట ముద్రణ పొందింది మాత్రం ఇవాన్ క్రోటీ లర్ విస్కీ 1798 లోరాసిన ‘’ఎనీడా ‘’కావ్యం.అందుకే ఈయనను ‘’యూక్రెన్ సాహిత్య జనకుడు’’అని గౌరవిస్తారు .ఆధునిక యూక్రేన్ వచననవల ‘’మరుస్యా ‘’ కు 1834లో శ్రీకారం చుట్టినవాడు-హ్రిహోరిక్విటివా సోవియనేస్కో ‘
1830లో యువ గలీషియన్ కవులు రచయితలూ ‘’రుధేనియన్ ట్రయడ్’’ నెలకొల్పి దేశం పశ్చిమభాగం లో సాంస్కృతిక పునరుజ్జీవనం కలిగించారు .వీరిలో ముఖ్యులు మార్కియన్ షషి కే విచ్ ,యాకివ్ హలో వట్స్కి,ఇవాన్ వహిలో విచ్ . వీరివలన యూక్రేనియాన్ చరిత్ర అన్వేషణ జరిగి గాల్లిక్ ,బుకోవినా ,ట్రాన్స్ కర్పాధియా లు అందరూ యూక్రేనియాన్ ప్రజలే అన్నారు .వీరికి స్వంత భాష మతం సంస్కృతీ,చరిత్రా ఉన్నాయని తెలియజేశారు.వీరి వ్యాస సంపుటి ‘’రుసల్కా డిస్త్రోవా ‘’ ,దీన్ని మౌఖిక యూక్రేనియాన్ భాషలో రాశారు .ఇదే అసలైన యూక్రేనియాన్ భాషలో సాహిత్య ప్రారంభం .రోమా౦టిజం కూడా అప్పుడే ప్రవేశించి ఉద్యమానికి స్పూర్తికలిగించి సాహిత్య ఐక్యతకు తోడ్పడింది .ఇయాన్ కోటియారస్కి రచన ఎనీడా అందరిపై గొప్ప ప్రభావం చూపింది .ఈ యువ బృంద విశాలభావాలు ఇరుకు హృదయాల చర్చి పెద్దలకు నచ్చక తీవ్రంగా వేధించారు .ఈయువకుల పుస్తకం హన్గేరిలో ప్రింట్ చేశారు .జనపదాలు అనేక ప్రదేశాలలో రికార్డ్ చేశారు .పాతతరం రచనలన్నీవెలుగు లోకి తెచ్చారు ‘
యూక్రేనియన్ రొమాంటిక్ కవులలో టరాస్ చెవ్ చెంకో,పాంట లీమన్ కులిష్ ముఖ్యులు వీరితో జాతీయోద్యమం కూడా బలపడి సెవ్ చెంకో ను జాతీయకవి అన్నారు .తర్వాత పాప్యులిజం యువతను ఆకర్షించి౦ది .రాడికలిజం పదంలో రాడిక్స్అనే లాటిన్ ధాతువు అర్ధం వేరు –రూట్ .ఈ ఉద్యమం ఒక ఊపు ఊపి ,అగ్రేరియన్ సోషలిజం దారి చూపింది .మైఖేలియో డ్రహమ నోవ్ యూక్రెన్ రాడికల్ పార్టీ నాయకుడు అయ్యాడు ‘
19,20వ శతాబ్దాలలో ఆధునిక భావజాల వ్యాప్తి జరిగి నవల కథ,నాటక రచన ప్రారంభమయ్యాయి .కొంతకాలానికి బోర్ కొట్టి సింబాలిక్ కవిత్వం రాశారు .మైఖేల్ కొత్సుబియంకి రియలిజం మోడర్నిజం కు వారధి .ఒహ్లా కోబి నిస్కా నియో రొమాంటిక్ కవిత్వం తో ఉర్రూత లూగించింది .లిసోవా పిస్నియా 1911లో ఏ ఫారెస్ట్ సాంగ్ ‘’నాటకం రాసి నాటకాలకు తెరఎత్తాడు.ఇంప్రెష నిస్ట్ కథలురాసింది వాసిల్ స్టెఫనిక్.వొలోడి మిర్ విన్ని చెంకో మానసిక అనుభూతులు నైతికత కు ప్రాముఖ్యమిచ్చాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-5-20-ఉయ్యూరు

