ప్రపంచదేశాలసారస్వత౦ 96-జార్జియా దేశ సాహిత్యం
ఆసియా ఐరోపా సరిహద్దులో కాకస్ పర్వతాల దగ్గరున్న దేశం జార్జియా .నల్ల సముద్ర బీచెస్ ,వార్డీజియా కేవ్ ,ద్రాక్షతోటలతో ఆకర్షణీయం .టిబిలిసి రాజధాని .కరెన్సీ –జార్జియన్ లరి.టూరిస్ట్ లకు సేఫ్ .పీనట్స్ పీ కాన్స్ ,పీచేస్ ల దేశం .అతి తియ్యని ఉల్లిపంట మరో ప్రత్యేకత .ధనికం కాదు బీదా కాని దేశం .వ్యవసాయం ,మాంగనీస్ ,కాపర్ ,గోల్డ్ ,ఆల్కహాల్ ,మేషిన్రి,కెమికల్స్ ఆదాయ వనరులు .37లక్షల జనాభా .ఆర్ధడాక్స్ క్రిస్టియన్ మతం .అధికార భాష జార్జియన్ .
జార్జియన్ సాహిత్యం 4వ శతాబ్దిలో దేశం క్రిస్టియానిటి లోకి మారి ,జార్జియన్ ఆల్ఫబేట్ ఏర్పడ్డాక ప్రారంభమైంది .గ్రీకు ఆర్మేనియా మొదలైన దేశాల సాహిత్య అనువాదాలు చేశారు .470లో వచ్చిన ‘’సామేబా ,సామిడిసా సుషానికిసి డేడోప్లసా ‘’అంటే ది పాషన్ ఆఫ్ సెయింట్ క్వీన్ సుషానిక్ ను ఐకోబ్ సుర్టావేలి రాశాడు .10వ శతాబ్దిలో లాయోనే మెంఖి ,మైకేల్ మోడ రేకిలి లు 910లో చర్చిఫాదర్స్ పై రాశారు . ది లైఫ్ ఆఫ్ సేరాపియాన్ ను బేసిల్ జర్జేమేలి ,గ్రిగేల్ ఖాండ టెలిస్స్కొవ్రేబా 950లో రాశారు .జ్యోర్గి మెర్కూలె-‘’గ్రిగోల్ ఆఫ్ ఖండ్ జట రాశాడు .10-13శతాబ్దాలలో క్రానికల్స్ చాలా వచ్చాయి వీటిలో ఆ దేశ చరిత్ర కొంత లభిస్తుంది .
బైజాంటిన్ సామ్రాజ్యం బలహీనమయ్యాక 10వ శతాబ్దిలో దేశం ఆర్ధిక పరి పుష్టి పొంది ,సెక్యులర్ రచనలనూ ఆహ్వానించారు .నాలుగవ కింగ్ డేవిడ్ ,తర్వాత మనవరాలు రాణి తమర సాహిత్య సాంస్కృతిక పోషణ చేసి 11-13శతాబ్దాల కాలానికి స్వర్ణయుగం తెచ్చారు .అన్ని కళలను పోషించారు .ముఖ్యంగా కవిత్వం వచనం బాగా వృద్ధి చెందించారు .పర్షియన్ కవి రాసిన షానామా అంటే రాజుల చరిత్ర కు ప్రేరణ పొంది రొమాంటిక్ కవిత్వం ఎపిక్ కవిత్వం విలసిల్లాయి .షోటా రుస్టవెలి1220లో వేప్ క్వివిస్టాకోసాని ‘’అనే రొమాంటిక్ కావ్యం నిర్మించి అత్యుత్తమకవిగా గుర్తింపు పొందాడు .తర్వాత దినైట్ ఇన్ ది పాన్థర్స్ స్కిన్ ‘’రాశాడు. మోస్ ఖోనేలి యుద్ధవీర నైట్స్ ల యుద్ధాలు రాశాడు
చెంగిజ్ ఖాన్, తైమూర్ ల కాలం 1220-1390 లో స్వర్ణయుగ సాహిత్యం అంతరించింది .ఏదో నామమాత్రంగా మిగిలింది .17వ శతాబ్దిలో వచ్చిన పునరుజ్జీవనం ప్రారంభమై కవిత్వం మళ్ళీ ఓ వెలుగు వెలిగి ది బుక్ అండ్ పాషన్ ఆఫ్ క్వీన్ సెయింట్ కేట్వాన్ ను ఒకటవ కింగ్ టిమురజ్ రాశాడు .ఇందులో తనతల్లి వీరోచిత మరణం వస్తువు .
18వ శతాబ్దిలో సుల్ఖాన్ సాబా ఓర్బెలియాని ,అతడి శిష్యుడు మేనల్లుడు 6వకింగ్ వకాట౦గ్ లు జార్జియాలో నూతన విద్యాలయం ,ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు .ఓర్బెలియాని ఆభాషలో మొదటి నిఘంటువు కూర్చాడు .బోధనాత్మక ఫేబుల్స్ పుస్తకం ‘’ది బుక్ ఆఫ్ విస్డం అండ్ లైస్’’రాశాడు .బెసికి మారుపేరుగల బెసారియన్ గబషివిలి అలంకార శాస్త్రం రాస్తే డవిట్గురామిషివిలి వాడుకభాషలో రచనలు చేశాడు .
రాష్యాపెత్తనం నశించి ఐరోపా సాహిత్యానికి తెరలు తీశారు .అలేగ్జాండర్ చావచవడేజ్ అంటే రష్యానాటకకర్త అలేక్జాండర్ సెర్జియో విచ్ మామ సృజనాత్మక కవిత్వ కర్త .నికోలస్ బరటాస్ విలి ఆంగ్లకవి కీట్స్ తో పోల్చదగిన విజనరీ కవి .1860లో ఫిక్షన్ నాన్ ఫిక్షన్ రెండూ బాగా వృద్ధిపొందాయి ,ఇలియా చావా చావా డేజ్,ఆకాకి సేరటేలిలు నైతిక ,బౌద్ధిక శక్తితో ఎన్నదగిన రచనలు తెచ్చారు ‘’ఈజ్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ ?’’దిస్టోరి ఆఫ్ మై లైఫ్ ‘’అత్యద్భుత కథనాలు .
19వ శతాబ్దం లో నాటక శాలలూ వచ్చి నాటకరచన ఉత్సాహంగా జరిగింది .గిగోర్గి ఎరిస్టవి సాహిత్య పత్రిక నడుపుతూ ,దియేటర్ నిర్వహణకూడా చేశాడు .దిమాడ్ వుమన్ ‘’నాటకం 1861లో రాసి ప్రదర్శించాడు .కామెడీలు –దావా ,అను తోచ్కా1850లో రాసి ప్రదర్శించాడు .దిలా సూట్ ,దిఫ్యామిలి సెటిల్మెంట్ నాటకాలూ రాశాడు.
20వ శతాబ్దం లో వాజాషవేలా మారుపేరుతో లూక రాజి కాష్ విలి జార్జియాస్ గ్రేటెస్ట్ జీనియస్ .అతని ట్రాజిక్ నారేటివ్ పోయెమ్స్-హోస్ట్ అండ్ గెస్ట్స్ ,ది స్నేక్ ఈటర్ లలో కాకస్ ఫోక్ మిత్ ఉంటుంది .సింబాలిజం కూడా వచ్చి వజా షవేలా ఇమేజరీ కవిత్వం రాశాడు .స్నేక్స్ స్కిన్ లోఅస్తిత్వ అన్వేషణ ఉన్నది .
దేశం స్వతంత్రం పొందాక చిలద్జే –అవలెంనవల 1995లో,2003 –దిబాస్కెట్ రాశాడు .2005లో జార్జియా ది బ్రిలియ౦ట్ హిస్టారిక్ నవలను అమిరేజిబి రాశాడు .ఆకా మోర్చిలడ్జే-‘’జర్నీ టు కరబాక్ ‘’మొదలైన నవలలు రాశాడు .లాశా బుగ్ద్జే అన్తర్జాయ ఖ్యాతి పొందిన రచయిత .న్యు అనరేషన్ కవులలో కోటే కుబనేష్ విలి ,రతిఅమఘో బెలి వంటి వారున్నారు
97-కువైట్ దేశ సాహిత్యం
కువైట్ పడమటి ఆసియాలో తూర్పు అరేబియా సముద్రానికి ఉత్తర చివర టిప్ ఆఫ్ పెర్షియన్ గల్ఫ్ లో ఉన్న దేశం .రాజధాని –కువైట్ సిటి .జనాభా 42లక్షలు .కరెన్సీ –కువైట్ దీనార్ .ధనిక దేశం .సేఫ్ దేశం .ఆల్కహాల్ నిషేధం ఉన్నది .ఇస్లాం మతం .భాషలు .అధికార వ్యవహార భాష అరెబిక్ .క్రూడ్ ఆయిల్ తో మహా సంపన్నం .
కువైట్ సాహిత్యం మొదటి సైన్స్ ఫిక్షన్ నవల అజ్మా ఇడిగ్రీ 1952లో రాసింది .దేశ చరిత్ర గురించి తక్కువే ఉంటుంది .ఆధునిక సమకాలీన రచయితలూ చాలామంది ఉన్నారు .ఈ దేశ సంస్కృతి ఫ్రెంచ్ ఇంగ్లిష్ లతో కలిసిపోయింది .అనువాదకులు – యాకూబ్ ఆలి అహమద్ ,ఫతిల్ ఖలాఫ్.కవులు –సులేమాన్ అల్ ఖులాఫీ ,తఫ్వీక్ అహమ్మద్ లు కవిత్వం తో పాటు ఫ్రెంచ్ ఇంగ్లిష్ సాహిత్యాన్ని మోలియర్ నాటకాలను అరేబిక్ లోకి అనువదించారు
ఇస్మాయిల్ ఫహిద్ ఇస్మాయిల్- కువైట్ నావలిస్ట్ .కథారచయిత క్రిటిక్ కూడా .20పైగా నవలలు ఎన్నో కతలు రాసి ప్రచురించాడు
తలెబ్ అల్రెఫై-జర్నలిస్ట్ రైటర్ .ఇతడు షేడ్ ఆఫ్ ది సన్,సామర్స్ వర్డ్స్ మొదలైనవి రాశాడు
లైలా అల్ అట్మన్-నవల కత రచయిత్రి –ది వుమన్ అండ్ ది కాట్ ,వాస్మియ కమ్స్ ఔట్ ఆఫ్ సి ,ఎ గ్లిమ్స్ ఆఫ్ రియాలిటి,ఎడైరీ ఆఫ్ పేషేన్స్ అండ్ బిట్టర్ నెస్మొదలైన 8నవలలు,ఎవుమన్ ఇన్ యాన్ వేస్,ది డిపార్చర్ ,ఫతే చూజేస్ హర్ డిమైస్ మొదలైన 5కథా సంపుటులు రాసింది .ఈమెనవల వాస్మియ కమ్స్ ఔట్ ఆఫ్ సి ని 21వ శతాబ్ది ‘’టాప్100 అరెబిక్ నవలలు ‘’లో ఒకటిగా గుర్తింపు పొందింది .
ఏ హెచ్ అల్మనాస్ –ఆధ్యాత్మిక రచయిత అల్మనాస్ అంటే వజ్రం .దిఎలిక్సిర్ ఆఫ్ ఎన్లి న్లైటేన్మేంట్ ,ఫెసేత్స్ ఆఫ్ యూనిటి,జర్నీ ఆఫ్ స్పిరితువాల్ లవ్ సిరీస్ ,దివాయిడ్ ది పాయింట్ ఆఫ్ ఎక్సిస్టెన్స్ మొదలలైన15గ్రంథాలు,డయమండ్ హార్ట్ సిరీస్ గా 5,బాడీ సిరీస్ గా 3పుస్తకాలు రాసిన కువైట్ రచయిత అమెరికాలో ఉంటున్నాడు .
తాయి బాఆలి ఇబ్రహీం –సైన్స్ ఫిక్షన్ రాసింది .2008 కువైట్ మూడవ కాన్ష్టి ట్యుయన్సి కి కాండిడేట్ .మతాన్ని రాజకీయాలకుదూరం చేయాలని పోరాడింది .దికర్స్ ఆఫ్ మని ,స్ప్రింగ్ థార్న్స్,క్రుయల్ హార్ట్ ,బివేర్ టుకిల్ వంటి 9రచనలు చేసింది
నజ్మా అబ్దుల్లా ఇడ్రీస్-మై లాంగ్వేజ్ ఫ్రాక్చర్స్ —ఐ గ్రో రాసింది .ఆరబ్ వుమన్ అవార్డ్ ,కువైట్ స్టేట్ అవార్డ్ పొందింది
ఫాత్మ యూసఫ్ ఆలి –జర్నలిస్ట్ కథరచయిత్రి . .మొదటి నవలరాసిన కువైట్ మహిళ .4కవితా స౦పుటులు తెచ్చింది .కువైట్ లిటరరీ అసోసియేషన్ సభ్యురాలు .మాగజైన్ సంపాదకురాలు
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-20-ఉయ్యూరు

