ప్రపంచ దేశాల సారస్వతం
105-సౌదీ అరేబియా దేశ సాహిత్యం
సౌదీ అరేబియా రాజ్యం పడమట ఆసియాలో ఉన్నది .అరేబియన్ అఖండ ద్వీపకల్పం .రాజధాని-రియాద్ –కరెన్సీ-సౌదీ రియల్ .జనాభా 3కోట్ల 40లక్షలు .ఇస్లాం మతం .భాషలు .అధికారభాష అరెబిక్ .అధిక ఆదాయం పెట్రోలియం నిధులు .టూరిస్ట్ లకు భద్రతఉంది .
సౌదీ అరేబియన్ సాహిత్యం కవిత్వం వచనం అన్నీ అరబిక్ భాషలోనే ఉంటాయి .5వ శతాబ్దం నుంచి సాహిత్యం ఉన్నది .ఆభాష సంస్కృతులకు స్వర్ణయుగం కొరాన్ తో వచ్చింది బాగ్దాద్ ను ‘’హౌస్ ఆఫ్ విజ్డం’’అంటారు .20వ శాతాబ్దిదాకా కవిత్వం ఎక్కువ .9వ శతాబ్దిలో ఐబాన్ ఆల్ నదీం అనే పుస్తక వ్యాపారి ‘’కితాబ్ అల్ ఫిహ్రిస్ట్’’అనే పుస్తకాల కేటలాగ్ తయారు చేశాడు .అబ్బాసిద్ కాలం లో అన్ని రకాల ప్రక్రియల పుస్తకాల సంకలనం బాగా జరిగింది .మేధావి అల్జహీజ్ చివరి మూడు సంకలనాలు రాశాడు .ఐబన్ కుతాబా -మర్యాదా మన్నన పాలన ,ఉద్యోగ నిర్వహణ ,రాసే విధానం మొదలైన వాటిపై శిక్షణ ఇచ్చాడు .సెక్స్ కూడా గొప్ప పాత్ర పోషించింది .ఘజల్ లేక ప్రేమ గీత౦ చాలాకాలం నుంచీ వస్తూ నే ఉంది.మిస్టికల్ , మత విషయాలూ వచ్చాయి . పేర్ఫ్యూమ్డ్ గార్డెన్ ,తక్ హాల్ హమామా వంటి సెక్స్ మాన్యువల్స్ ను ఐబాన్ హజీం ,నౌజట్ అల్లబాబ్ తెచ్చారు .పాపం లేకుండా శృంగారం ఎలా చేయచ్చో క్వయ్యిం ఆల్జాజియ రాశాడు.
బుక్ ఆఫ్ ది జీనలాజీస్ ఆఫ్ నోబుల్స్ అనే జీవిత చరిత్రల సంపుటి అల్ బలాదూరి రాశాడు .ఉస్మాన్ ఐబాన్ మునికిద్-కితాబ్ అల్ లిటిబార్ అనే స్వీయ చరిత్ర రాసుకొన్నాడు .ఇందులో క్రూసేడ్ యుద్ధాలలో తన అనుభవాలు పొందుపరచాడు .ఈకాలం లోనే తబాకత్ అంటే జీవిత చరిత్ర నిఘంటువులు వచ్చాయి .ఐబాన్ ఖుర్దా దిహిబి అనే పోస్టల్ ఉద్యోగి యాత్రా పుస్తకాలు రాశాడు .యాత్రా సాహిత్యం పండించినవారిలో –ఐబాన్ హవాకల్ ,ఐబాన్ ఫదియన్,అల్ముకద్దసి మొదలైనవారున్నారు .జాగ్రఫీ హిస్టరీ రచనలూ వచ్చాయి .అల్ యకూబి ,అల్ తబరి చరిత్రమాత్రమే రాశారు .ఐబాన్ ఆల్ అజ్రాక్ మక్కా చరిత్ర ,ఐబాన్ అబి తాహిర్ టేఫర్ బాగ్దాద్ చరిత్ర రాశారు .ఐబాన్ ఖల్దూం రాసిన’’ముఖద్దిమా ‘’అనే చరిత్ర పుస్తకం లో సోషియాలజీ ఎకనామిక్స్ కూడా కలిపాడు.
10వ శతాబ్ది ప్రారంభలో అరబిక్ డైరీ హవా వచ్చింది .ఇవాల్టి ఆధునికడైరీకి మాతృక 11వ శతాబ్ది ఐబాన్ బన్న డైరీ యే.సాహిత్య విమర్శ మతగ్రందాలపైనే ఎక్కువగా జరిగింది .మధ్యయుగ అరబిక్ కవిత్వం పై సాహిత్య విమర్శ విస్తృతంగా ఉన్నది .ఆల్ జహిజ్ ఇందులో ఘనుడు .అరబిక్ ఫిక్షన్ ఐబాన్ అబీద్ రబ్బీరాసిన ‘’ఆల్ ఐకద్ ఆల్ ఫరీద్ ‘’తో మొదలైంది .ఆరబ్ ప్రపంచం లో నాణ్యమైన భాషకు ,సామాన్యభాషకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది .తత్వ గ్రంథాలు ఫిలసాఫికల్ నవలలు కూడా రచయితలురాశారు .అరబ్ భాషలోని వెయ్యిన్నొక్క రాత్రులు లేక అరేబియన్ నైట్స్ ప్రపంచ ప్రసిద్ధి చెంది,వచనరచనకు ఆదర్శంగా నిలచింది తర్వాత అల్లాఉద్దీన్,ఆలీబాబా హాతిం తాయ్ కథలు విస్తృత వ్యాప్తి పొందాయి .ఇవి దాదాపు ప్రపంచాభాషలన్నిటిలోకి అనువాదమయ్యాయి.అరేబియన నైట్స్ ను అరెబిక్ ఎపిక్ అంటారు .
వచనానికి కవిత్వానికి మధ్య ‘’మకామా ‘’ప్రక్రియ వచ్చింది .ఇది లయబద్ధ వచనం అల్హమదాని దీనికి ఆద్యుడు .లైలా మజ్ను అరెబిక్ రొమాంటిక్ కవిత్వం .మరొకటి-అదిత్ బయద్ వా రియాద్ అంటే బాయాద్ రియాద్ ల ప్రేమ .మర్డర్ మిస్టరి కిఉదాహరణ షేహరాజాడే రాసిన ‘’దిత్రీ ఆపిల్స్ ‘’.అరెబిక్ సాహిత్యం లో వ్యంగ్యరచనకు ‘హిజా’’అనిపేరు .అస్సలామి మొదలైనవారు రాశారు .అరిస్టాటిల్ పోయేటిక్స్ అరేబియన్ అనువాదం వచ్చాక కామెడి సెటైర్ లు పర్యాయ పదాలయ్యాయి .మధ్యుగాలలో పప్పెట్ షోలు ఎక్కువ .తర్వాత నాటకశాలలేర్పడి నాటకాలు రాయటం ప్రదర్శించటం జరిగింది .సైన్స్ ఫిక్షన్ ఫిలాసఫికల్ నవలలూ రాశారు .స్త్రీలుకూడా రాశారుకాని స్పీడ్ తక్కువే .మర్యానా మరాహా, మే జియాదే,మేరి అజ్మి ఇప్పుడు దూసుకుపోతున్న రచయిత్రులు .సానియా సలీహా ఇప్పుడు గొప్పకవయిత్రి .సమకాలీనంగా నూ అన్ని ప్రక్రియలలో అందరూ రాసి అరెబిక్ సాహిత్య పోషణ చేస్తున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-5-20-ఉయ్యూరు

