ప్రపంచ దేశాల సారస్వతం
106-ఎమిరేట్స్ దేశ సాహిత్యం
పశ్చిమాసియాలో యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ ను సింపుల్ గా ఎమిరేట్స్ అంటారు .అబుదాబి ,దుబాయ్ ,షార్జా ,అజమాన్ ,ఉమాల్ కొమాన్ ,ఫుజారిహా అనే 7 ఎమిరేట్స్ కలిసి ఉన్నది .రాజధాని –అబూ ధాబి –కరెన్సీ-యుఎయి దిర్హాం .జనాభా 97లక్షలు .ఇస్లాం మతం .భాష-అరబిక్ .సేఫెస్ట్ దేశం .సంపన్న దేశం .డ్రగ్స్ నిషేధం .ఆయిల్ బావులే ఆదాయ వనరులు .
మొదటినుంచి సాహిత్యం అంతా అరబిక్ భాషలో ఉన్నది .సౌదీ అరేబియా సాహిత్యమే ఇక్కడకూడా వర్తిస్తుంది .ఆధునిక సాహిత్యం గురించి బార్బరా మిఖలాక్ పికుల్స్కా అనే అరెబిక్ డిపార్ట్ మెంట్ హెడ్ ‘’మోడరన్ లిటరేచర్ ఆఫ్ దియునైటెడ్ ఎమిరేట్స్’’పుస్తకం రాసింది .ఆదేశ సంస్కృతీ భాష వివరాలపైనా కథానికలపైనా ,సమకాలీన కథాసాహిత్యం పైనా ,ఆధునిక ప్రోజ్ పోయెట్రిపైనా ,అధారిటి ప్రైవసీ పబ్లిక్ ఆర్డర్ ఇన్ ఇస్లాం ,1967నుంచి వచ్చిన ఆధునికసాహిత్యం అన్నిటిని సుదీర్ఘంగా వివరించింది .ఇది చదివితే ఆదేశ సాహిత్యం అంతా తెలిసినట్లే .
ఆడెల్ ఖోజాం –కవి జర్నలిస్ట్ .14కవితా సంపుటులురాశాడు .బుద్ధునిజీవితంకూడా రాశాడు .ఖలీద్ అబ్డునూర్ –కబాటి కవిత్వ స్పెషలిస్ట్ .నౌరా అల్ నామాన్ –సైన్స్ ఫిక్షన్ రచయిత.అజ్వాన్ మందాన్ మొదలైన నవలలు బాలకతలుగా –కాటన్ దికిట్టేన్ ,కివి దిహెడ్జ్ హాగ్ వగైరా.సల్హా ఓబేద్ –అల్జిమీర్స్ అనే కథా సంపుటి రాసి యంగ్ ఎమిరేట్స్ ప్రైజ్ పొందింది పోస్ట్ మాన్ ఆఫ్ హాపినెస్ ,ఇ౦ప్లిసిటి ,వైట్ లాక్ హెయిర్ మొదలైన సంపుటులు రాసింది .మాల్తా హాల్ ఖయాత్ –బాలసాహిత్య రచయిత్రి .17పుస్తకాలురాసి ‘’మై ఓన్ స్పెషల్ వే’’కు అవార్డ్ పొందింది .పేరెంట్స్ నవాఫ్ అల్ జవాఫ్ రాసింది .నాడియా అల్ నజ్జర్ –ఫాక్ట్ ఫిక్షన్ కలిపి నవలలు రాసింది.మదీన్ అల్ లాఫా కు ఎమిరేట్స్ నవల అవార్డ్ వచ్చింది .నౌరా అల్ ఖూరి –ఖర్జూర చరిత్ర ,ఆల్ యాది ఆల్ బయాదా –దివైట్ హాండ్స్ -2016నవలలో ఇమ్మిగ్రంట్స్ పై చూపాల్సిన మానవత్వాన్ని గురించి రాసింది ,
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-20-ఉయ్యూరు

