Monthly Archives: May 2020

హనుమజ్జయంతి ఆహ్వానం

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 69- కోసోవో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 69- కోసోవో దేశ సాహిత్యం దక్షిణ యూరప్ లోని కొసొవో రిపబ్లిక్ దేశం .రాజధాని ప్రిస్టిన.కరెన్సీ-యూరో .బోస్నియన్ టర్కిష్ ,రోమాని ఇక్కడి భాషలు. అధికారభాషలు అల్బేనియన్ ,సెర్బియన్ .జనాభా సుమారు 18న్నర లక్షలు .రెండవ పరపంచయుద్ధం తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులలో  సెర్బియా ఆక్రమించాక స్కూలు పరీక్షలన్నీ సెర్బియన్ భాషలోనే జరపాల్సి వచ్చింది.అల్బేనియన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-25

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-25 రాక్షస స్త్రీల భీకరకఠినోక్తుల చేత కలత చెందిన సీతాదేవి భయకంపిత గద్గద స్వరంతో ‘’ నేను మానవ స్త్రీని రాక్షసుడికి భార్య కానేరను .కావాలంటే నన్ను చంపి తినేయ్యండి ‘’అని కఠినంగా చెప్పింది .కన్నీరు మున్నీరుగా కారుస్తుంటే ఒళ్ళంతా తడిసిపోయింది. వణికే ఆమె పొడవైన వెడల్పైన జడ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 68-ఎస్టోనియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 68-ఎస్టోనియా దేశ సాహిత్యం ఎస్టోనియా దేశం ఉత్తర యూరప్ లో బాల్టిక్ సముద్రం ,గల్ఫ్ ఆఫ్ ఫిన్ లాండ్ దగ్గర 1500 దీవులతో ఉన్నది .ప్రాచీన అరణ్యాలు ,ఎన్నో సరస్సులతో ఆకర్షణీయం .రాజధాని టాల్లిన్.కరెన్సీ-యూరో .జనాభా 13లక్షలు .    ఎస్టోనియా దేశ సాహిత్యాన్ని ఎస్టోనియన్ సాహిత్యం అంటారు .13వ శతాబ్దినుంచి 1918వరకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-24

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-24 రాక్షసరాజు వెళ్ళిపోగానే అక్కడి కావలి రాక్షసాంగనలు సీత దగ్గరకొచ్చి కోపంతోకూడిన కఠినమైన మాటలతో ‘’రావణుడు పులస్యబ్రహ్మ వంశం వాడు .నువ్వు అతనిభార్యవైతే నీకు గౌరవం ఎక్కువౌతుంది .ఏకజట’’మరీచి అత్రి ,అంగిరసుడు ,పులస్యుడు ,పులహుడు ,క్రతువు అనే నలుగురు ప్రజాపతులలో పులస్యుడు బ్రహ్మమానస పుత్రుడు .అతడి మనో సంకల్పంతో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 66- బెలారస్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 66- బెలారస్  దేశ సాహిత్యం బెలారస్ దేశం ఉత్తర యూరప్ లో రష్యా ,ఉక్రెయిన్ లిదువేనియా ల మధ్య యన్నది .రాజధాని –మిన్స్క్ .బెలారసియన్ రూబుల్ .జనాభా సుమారు కోటి బెలారస్ సాహిత్యాన్ని బెలారసియన్ సాహిత్యం అంటారు .17వ శతాబ్దికి ముందు క్లేవెన్ రస్ ఆధార సాహిత్యం ఉండేది .ఇదే రష్యన్ ఉక్రేనియన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-23

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-23 సీత మాట్లాడినమాటలకు ఎక్కడోకాలి రావణుడు ఆమెతో ‘’మగాడు అనునయి౦చిన కొద్దీ స్త్రీ వశపడుతుంది .గుర్రం పెడత్రోవ పడితే సమర్ధుడైన సారధి దాన్ని దారిలోపెడతాడు .నీపై ఉన్నకామాన్ని నా కోపం అడ్డగిస్తోంది .కామం ఏర్పడితే దయ ప్రేమకూడా కలగటం సహజం .నిన్ను అవమానించవచ్చు చంపచ్చు,వానప్రస్త వేషం లో ఉన్న … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాల సారస్వతం64-  అల్బేనియన్ సాహిత్యం

ప్రపంచదేశాలసారస్వతం64-  అల్బేనియన్ సాహిత్యం మధ్యయుగాలలోనే అల్బేనియన్ సాహిత్యం ఆ భాషలోనే  వృద్ధి అయింది .అల్బేనియా ,కొసావో ,ఇటలీలోని అల్బెనియన్లు రాసినదే ఈసాహిత్యం .ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందినభాష .అసలు దీని ఆవిర్భావం ఎప్పుడు ఎక్కడో తెలియకపోయినా ప్లిరియన్ భాషా జన్యం అంటారు 1332లో ఆర్చిబిషప్  ఆన్టివారి గులౌమే ఆడం ఒక రిపోర్ట్ రాస్తూ అల్బెనియన్లుపుస్తకరచనలో తమ భాషకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-22

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-22 రావణుడి మాటలకు తల్లడిల్లి తనకు అతడికి మధ్య ఒక గడ్డిపోచనుంచి సీతాదేవి ‘’నాపై మనసు నీభార్యలపై మరల్చు పాపం చేస్తే మోక్షం రానట్లే నువ్వు నన్ను కోరటానికి అర్హుడవు కాదు .ఇక్ష్వాకు వంశ పతివ్రతను నేను .నీ నిన్ద్యమైనకొరిక అంగీకరించను .నేను పరభార్యను .సజ్జన ధర్మాన్ని పాటించు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 63-సైప్రస్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 63-సైప్రస్ సాహిత్యం సైప్రస్ దేశ సాహిత్యాన్ని సైప్రియట్ సాహిత్యం అంటారు .గ్రీక్ టర్కి ఇంగ్లిష్ ,ఫ్రెంచ్ ఆధునిక భాషలలో  ఆ సాహిత్యం ఉంటుంది .ఆధునిక క్రిప్టాలిక్ భాష -ఆధునిక గ్రీకు ఆగ్నేయ మాండలికం లా ఉంటుంది .సైప్రియట్ సాహిత్యం క్రీ.పూ 7వ శతాబ్దిలో స్ట్రాన్షియస్ రాసిన ఎపిక్ .స్టావోయిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాలసారస్వతం62- క్రోషియన్  సాహిత్యం

ప్రపంచదేశాలసారస్వతం62- క్రోషియన్  సాహిత్యం క్రోషియాప్రజలభాష క్రోషియన్. ఆసాహిత్యమే క్రోషియన్ సాహిత్యం .మధ్యయుగ వచనం యూరోపియన్ మధ్యయుగ వచనంలాగానే ఉండేది .మధ్యయుగ సాహిత్యం 11నుండి 16శతాబ్ది వరకు ఉన్నది .మొదట్లోవ్రాత రాతి  పలకలమీద ,తర్వాత పత్రాలమీద ఉంటూ ఆతర్వాత ముద్రణ  పొందింది .ఈయుగ క్రోషియన్ సెగ్మెంట్ లాటిన్ లో రాయబడింది .హాజియోగ్రఫీ ,చర్చి చరిత్ర లను డాల్మాషియన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-21

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-21 రావణుడు సీతతో మాట్లాడాటం మొదలుపెట్టాడు ‘’భయంతో నీశరీరాన్ని దాస్తున్నావు సకలజన మనోభిరామ౦ గా ఉన్న నిన్ను నేను మోహిస్తున్నాను .నాపై వలపు చూపకపోతే నిన్ను తాకనే తాకను .నాశరీరంలో కామం వరదలై ప్రవహించినా సరే . ఇక్కడ నాకు తెలియకుండా ఎవరికీ ప్రవేశం లేదు.  భయం వదిలి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 61-బల్గేరియన్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 61-బల్గేరియన్ సాహిత్యం స్లావిక్ ప్రజల ప్రాచీన సాహిత్యమే బల్గేరియన్ సాహిత్యం .9వ శతాబ్దిలోనే మొదటి బల్గేరియన్ సామ్రాజ్యం  చక్రవర్తి మొదటి సైమన్ కాలం లో వర్ధిల్లి౦ది .మధ్యయుగం లో గ్రేట్ మొరేవియా నుంచి సిరిల్ ,మేతోడియస్ లను బహిష్కరించాక ,వారిని బల్గేరియన్ సామ్రాజ్యం ఆహ్వానించటం తో సాహిత్యానికి కేంద్రమై సాహిత్యానికి స్వర్ణయుగం అయింది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 60-బోస్నియా అండ్ హెర్జె గోవినా సాహిత్యం  

ప్రపంచ దేశాల సారస్వతం 60-బోస్నియా అండ్ హెర్జె గోవినా సాహిత్యం బోస్నియా అండ్ హెర్జె గోవినా సాహిత్యపితామహుడుగా మాటిజా డీవ్ కో విక్ ను భావిస్తారు .ఇతనితోపాటు హసనా జినికా కూడా జానపద సాహిత్యం లో ప్రసిద్ధుడు .20వ శతాబ్ది మహిళా రచయితలలో బిసేరా అలీ కెడిక్  లార్వా అండ్ క్రుగ్ రచనతో ప్రసిద్ధురాలు .గ్రాడ్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 59-హంగేరియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 59-హంగేరియన్ సాహిత్యం హంగేరియన్ భాష –ఫిన్నో –ఉగ్రియన్ భాషా కుటుంబానికి చెందింది .దీనికి ‘’మోడియర్’’అనే పేరుకూడా ఉన్నది .ధ్వని అనుకరణపదాలు తప్ప మిగిలినవేవీ సంయుక్తాక్షరాలతో మొదలుకావు అచ్చులు కూడా కొన్ని ఉపసర్గల్లాగానే వ్యవహరిప బడుతాయి .విభక్తి ప్రత్యయాలు పదం చివర ఉంటాయి. మొదట్లో టర్కీ రూని లిపిలో రాయబడేది. క్రీ.శ 1000నుంచి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-20

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-20 ఇంత జరిగే సరికి రాత్రి మూడుజాములసమయం దాటి,చివరిజాము మాత్రమే మిగిలింది .అప్పుడు సాంగ వేదపండితులు , ,శ్రేస్ట యాగాలు చేయించగల సమర్ధులు ఐన బ్రహ్మరక్షస్సుల వేద ఘోష వినబడింది .మంగళవాద్యాలు మ్రోగాయి .రావణుడు వెంటనే నిద్ర లేచి జారినమాలలు ,వస్త్రాలతో సీతను తలచుకొన్నాడు .మదంతోమదించిన వాడు  ,మదన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రేడియో బావగారి కబుర్లు -5

రేడియో బావగారి కబుర్లు -5 బావగారు 2-బ్రహ్మమోక్కడే పరబ్రహ్మమోక్క డే –బుద్ధం శరణం గచ్చామి –నమస్కారం బావగారూ బావగారు 1-నమ స్కారం బావగారు .అన్నమయ్యను బుద్ధుడిని వెంట తెచ్చారు బాగుంది 2-ఆవిశేషాలు తెలుసుకోవాలనే తాపత్రయం బావగారు సెలవీయండి 1-పరమానందంగా .ముందు అన్నమాచార్య గురించి చెబుతాను .అన్నమయ్య కడపజిల్లా తాళ్ళపాక లో పుట్టాడు .తండ్రివరకు అక్కడ శివాలయ పూజారులు .తర్వాత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-19

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-19 తెల్లకలువల సమూహం గా ప్రకాశించే నిర్మల చంద్రుడు ,నల్లని జలాలలోకి హంస వెళ్లినట్లు నిర్మలాకాశం పైభాగాన కనబడి ,తనకా౦తితో సహాయ పడేట్లు హనుమను సేవిచటానికి వచ్చాడు .ఆచల్లని వెన్నెలలో హనుమ సీతాదేవిని చూశాడు .ఆమె చుట్టూ ఒంటికన్ను ఒకే చెవి కలవారు చేటచెవులతో తలను దాచు కొన్నది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 58-జర్మన్ సాహిత్యం -2

ప్రపంచ దేశాలసారస్వతం 58-జర్మన్ సాహిత్యం -2 యోహన్ క్రిస్టోప్ గొట్జ్ షెట్జ్-1700-1766 తో 18వ శతాబ్ది జర్మన్ సాహిత్యం మొదలైంది సాహిత్యం లో శైలి,రూపం తో నియమబద్ద రచన చేశాడు .విషాదాంత నాటకాలలో హాస్యం కూడా జతకలిపాడు తర్కానికి అధిక ప్రాదాన్యం ఇచ్చాడు తరువాత రచయితలపై ఇతని ప్రభావం జాస్తి ..ఇదికాదు అని భావుకతకు ప్రాదాన్యమిచ్చాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రేడియోబావగారి కబుర్లు -4

బావ 2-ప్రహ్లాద వరద గోవి౦దా హరి –నమస్కారం బావగారూ బావ1-నమస్కారం రండి .సాభిప్రాయంగా నే పలకరించారు బావగారు 2-అదేమిటి బావగారూ 1-ఇవాళ ప్రహ్లాద వరదుడైన విష్ణుమూర్తి తన నాల్గవ అవతారంగా శ్రీ నృసింహావతారం దాల్చిన శుభదినం అంటే నృసింహ జయంతి 2-అలాగా యాదాలాపంగా అన్నదాన్ని చక్కగా సమన్వయం చేశారు బావగారూ .ఐతే  ఆ అవతార విశేషాలు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

6-5-20 బుధవారం శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం  

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల దేవాలయం లో17-5-20 శ్రీ హనుమజ్జయంతి మూడు రోజుల కార్యక్రమంగా ఈక్రింది విధంగా నిర్వహింపబడుతుంది . 15-5-20 శుక్రవారం –ఉదయం -5గం.కు మన్యుసూక్తం తో స్వామివార్లకు అభిషేకం అనతరం నూతనవస్త్రదారణ ఉదయం 6గం-లకు గంధ  సిందూరం తో … Continue reading

Posted in దేవాలయం | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-18

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-18 ముందుకు దూకుదామను కొన్న సమయం లో హనుమకు మళ్ళీ దుఖం ఆవరించింది .దీని నివారణకు సీతారామనామ స్మరణమే సాధనం అని భావించి ‘’అమేయ పరాక్రమశాలురైన సోదరద్వయం ,అమిత సాధుశీల సీతాదేవి లకే  ఇలాంటి దుఖం సంభవిస్తే’’ కాలాన్ని ఎవరూ అధిగమించటం సాధ్యం కాదు ‘’-అనిపిస్తోంది అనుకొన్నాడు . … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 58-జర్మన్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం 58-జర్మన్ సాహిత్యం -1 జర్మన్ భాష –ఆర్య భాషా కుటుంబానికి చెందిన’’ట్యూటనిక్’’ ,భాషలనుంచి జర్మన్, డచ్ ,డేనిష్  ,నార్వీనిజియన్ ,స్వీడన్, ఇంగ్లిష్ భాషలు వచ్చాయి .జర్మన్ భాషలో ప్రథమ ,ద్వితీయ ,చతుర్ధి ,షష్టివిభక్తులు ,త్రిలింగాలు ,అనేక వికరణాలు ఉన్నాయి .వస్తుస్వరూపంతో సంబంధం లేకుండా వ్యాకరణ నిస్ట మైంది లింగం .ఉపవర్గాలతో కొత్తశబ్దాలు, … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-17

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-17 అశోక వనం అంతా’’సంతానకం ‘’అనే తీగెలతో పూలు కాయలు పండ్లు ఉండే చెట్లతో కళకళలాడుతోంది .ప్రతిక్షణం రెక్కలల్లార్చే పక్షులతో ఆకులు ,రెమ్మలు లేని అశోకవనం లా ఉంది .ఎర్రని అశోక పుష్పాలు భూమిపైరాలి నిప్పు కణికలేమో అనిపిస్తున్నాయి .అప్పుడు శింశుపా వృక్షం కింద మలిన దేహంతో ,నిట్టూర్పు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 56- తువాలు దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 56- తువాలు   దేశ సాహిత్యం కరోన నీడపడని 15వ దేశం తువాలు దక్షిణ ఫసిఫిక్ లో తొమ్మిది ఐలాండ్ ల సముదాయం .పాం, చేతల్ బీచెస్ రీఫ్ లు ,ప్రకృతి దృశ్యాలు ఆకర్షణ .ఫునఫూటి రాజధాని .అత్యధిక బీద దేశం .జనాభా 11వేలు మాత్రమె .టూరిస్ట్ లకు సేఫెస్ట్ ప్లేస్ ..టెలికమ్యూనికేషన్ ఇంటర్నెట్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

  హాస్య దినం    ముళ్ళపూడి వెంకటరమణకు హాస్యా౦జలి తో –

     హాస్య దినం ‘’ఒక అప్పారావు కు తండ్రి ,రుణాన౦దలహరికి జన్మస్థానం ,బుడుగుకు గొడుగు ,జనతా ఎక్స్ప్రెస్ కు రైలింజన్ ,సీగాన పెసూనా౦బ కు  గాడ్ఫాదర్ ,రాజకీయ బేతాళ పంచ వింశతిక కు స్వర్ణలతిక ,సినీ విక్రమార్క సింహాసనానికి పట్టువదలని రచనా విక్రమార్కుడు .అతని మార్కే వేరు రూటే సెపరేటు ,రిమార్కు లేని రచన ,’’తెలుగూస్ కు అరుదుగా లభించే బంగారు గూసు’’ ,సినీ జీవితాన్నిస్కాచ్ వడబోసి ,మన’’సారా’’ తాగిన  స్కెచ్ పెన్,అది విసిరే ప్రతిమాటా జోకుల తూటా చరుపే ,జలదరి౦పే ,ఇంపే ,సొంపే ,తలకడిగే ‘’షాంపే’’,తెలుగు మాటల తీరుకు అక్షరశిల్పి జక్కన్నే ,తెలుగు వాడి తలతిక్కకు ,పొగరుకూ ,ఠీవికీ  డాబూ దర్పాలకూ ,అమాయకత్వానికీ ప్రతిమలే . మలచినపాత్రలు మధురస పాత్రలే .కవ్విస్తాయ్,నవ్విస్తాయ్ ,కొంటె కోణంగిలా వెక్కిరిస్తాయ్,కొక్కిరిస్తాయ్ ,నెత్తి కెక్కి కూర్చుంటాయ్,మనల్ని వదలి పోనని భీష్మి౦చుకు కూర్చుంటాయ్.అతడే’’ ముళ్ళవాడి వ్యంగ్యట రమణ’’ .ఆయనది ఒక ప్రత్యెక స్కూల్ ఆఫ్ … Continue reading

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | 1 Comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-16

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-16 అశోక వనం చేరిన హనుమ అక్కడ వస౦తోదయం తో పులకించిన వృక్షజాలాన్ని చూశాడు .మృగగాపక్షి సంతతి మహాదానంద౦ తో కనిపించాయి .పక్షులకిలకిలారవాలు వీనుల వి౦దు చేశాయి వనాలు ఉపవనాలతో అది ఉదయించే సూర్యునిలా కనిపించింది .అతని సంచారంతో నిద్రిస్తున్నపక్షులు మేల్కొన్నాయి .రకరకాల పుష్పాలు పుష్ప వర్షం కురిపిస్తూ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 55- తుర్కేమెనిస్తాన్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 55- తుర్కేమెనిస్తాన్  దేశ సాహిత్యం కరోనా సోకని 14వ దేశం తుర్కెమెనిస్తాన్ మధ్య ఆసియాలో కాస్పియన్ సముద్రం ,కారకుం ఎడారి తో చుట్టబడి ఉంటుంది .నీసా, మెర్వ్ లలో పురాతత్వ వస్తువులు ఎక్కువ .రాజధాని అష్కబాత్  సోవియట్ స్టైల్ లో నిర్మించబడింది .సుమారు 60లక్షల జనాభా .కరెన్సీ –తుర్కేమెనిస్తాన్ మనత్ .నేరాలు తక్కువ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సేవకు మారుపేరు-‘’లేడీ విత్ దిలాంప్’’ ఫ్లారెన్స్ నైటింగేల్ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మే 2020

సేవకు మారుపేరు-‘’లేడీ విత్ దిలాంప్’’ ఫ్లారెన్స్ నైటింగేల్ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మే  01/05/2020 విహంగ మహిళా పత్రిక ఈనాడు కరోనా విపత్తు సమయంలో ప్రపంచమంతా అతలాకుతలై పోతుంటే , అపర నారాయణ స్వరూపులుగా డాక్టర్లు ,వారికి సాయపడే నర్సుల నిస్వార్ధ సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయి .అందుకనే ఆ నాడేప్పుడో బాధ పడుతున్న వారికి, రోగులకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

స్టే హోం జీరోలు కరోనా

స్టే హోం జీరోలు దానయ్య –అమ్మా వాసంతి ఏమిటి అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నావు  మావాడు బానే ఉన్నాడా .ఏడీ కనబడడెం వాసంతి –మీ కోసం ఎదురు చూస్తూ గదిలో ఉన్నరన్నయ్యా ,ఏమిటి తల, మొఖానికి  తువ్వాలు చుట్టుకు వచ్చారు దాన-అదా అదీ  అదీ-కంగారులో వస్తుంటే మాస్క్ దొరక్కపోతే పోలీసులు పట్టుకొంటారని అలా వచ్చానన్నమాట అదన్నమాట … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 54-అంగోలా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 54-అంగోలా దేశ సాహిత్యం కరోనా సోకని 13వ దేశం అంగోలా ఆఫ్రికాలో ట్రాపికల్ అట్లాంటిక్ బీచెస్ , నదులు ,సబ్ సహారా ఎడారులతో ఉంటుంది .రాజధాని లువాండా .దీన్ని రక్షించటానికి 1576లో పోర్చుగీస్ పటిష్టమైన కోట కట్టింది .పాలియోలితిక్ కాలం నుంచి జనావాసమున్న దేశం .ఎన్నో ఎత్నిక్ గ్రూపులున్నాయి .అనంతమైనఖనిజం పెట్రోలియం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-15

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-15 విమానం నుంచి ప్రాకారం పై దూకి ,మేఘాలమధ్య  మెరుపులా వేగంగా వెళ్ళాడు హనుమ .అన్ని చోట్లా వెదికినా సీత కనపడనందుకు విచారించి ,సంపాతి చెప్పిన దానిప్రకారం సీత లంక లోనే ఉండాలి .అయోనిజ సీతామాత రావణుని వశం కాదు .రావణుడు ఆమెను ఎత్తుకొని వచ్చేటప్పుడు జారి కిందపడి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కరోనా భువనవిజయం

కరోనా భువనవిజయం అష్టదిగ్గజాలు –నమోస్తు మహా మంత్రీ  .ఈ రోజు మా ఆసనాల వైఖరి మారింది .కవికీ కవికీ దూరం గజం పైనే ఉంది .ఏమిటి విశేషం అప్పాజీ అప్పాజీ – కరోనా క్రిమి స్వైర విహారం చేస్తోందని చారులవలన విని దానికి సా౦ఘిక దూరమే విరుగుడు అని   ప్రభువులవారు నిర్దేశించగా ఇలా ఏర్పాటు జరిగింది … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 53- తజకిస్తాన్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 53-  తజకిస్తాన్  సాహిత్యం కరోనా సోకని పన్నెండవ దేశం తజకిస్తాన్ మధ్య ఆసియాలో ఆఫ్ఘనిస్తాన్ ,చైనా ,కుర్గిజిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ల మధ్యలో ఉంటుంది ఎత్తైనపర్వతాలు హైకింగ్ ,క్లైమ్బింగ్ కు  ఆకర్షణ .క్రీపూ 500 నాటికీ ఆకెమెనిడ్ సామ్రాజ్యంలో ఉండేది .క్రీ పూ 150లో యుజి ట్రైబులు ఉండేవారు .సిల్క్ రోడ్  దీనిగుండా ఉండి,చైనా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment