శ్రీ కపాలీశ్వర విభూతి -2(చివరిభాగం )
, ‘’లావణ్యోదయ పూర సంభ్రుత సరస్సముద్భూత పద్మాయితౌ –బోధానంద రసో ప బృంహితతరుపాజ్ఞత్ర వాలాయితౌ –పాదౌ తే వసతాం మదీయహృదయాభోగే భవానీపతీ –స్వామిన్ చంద్ర కలావతంస భగవన్!శంభో కపాలీశ్వరా ‘’అనేది రెండవ శ్లోకం .’’భగవాన్ శంభో కపాలీశ్వరా ‘’అనేది మకుట రాజం .మరో శ్లోకాని కి తెలుగు పద్యం-‘’దారుణ౦బగు గరళ౦బు త్రాగి త్రాగి –గిరి తటంబుల నిచ్చలు తిరిగి తిరిగి –వెడద సిరులుండ గోచినే ముడిచి ముడిచి –ఇంత భరమేల మముగావ ఇందు మౌళి’’.సూర్య చంద్రులు కనులుగా అగ్ని మూడవనేత్రంగా ఉంచుకొని తప్తులను కాచే మహాను భావుడు శివుడు .తలమీద చదలేరు ,చిన్ని జాబిల్లి తో సుప్రసంనంగా కనిపిస్తాడు శివుడు .
వ్యాజస్తుతి చేస్తూ –వామాన్గే వనితా పరాచ సతతం మూర్ధాన మారోపితా –పుత్రా వంక తలోప వేశలలితౌ హస్తే చ హేమాచలః –త్వామాక్రామతి చైషణాత్రయ మహో కావా కధా మాదృశాన్ ‘’.నొసట నిప్పు ,తలను నురిగొను సురనది –ఆరుత విసము ,సిగను నబ్జరేఖ –వింత వింత వృత్తి విభవాన విశ్వంబు –మోహపెట్టు దీశ ముట్టుపడగ’’.వామాకేకర దృగ్విలాస మామానంగ వాహ్యాలికా౦ –గాఢాలింగన సంపదం సకృదపి ద్వాభ్యాం భుజాభ్యాం పునః –గౌరీనాన్వభవత్తధాపి పరమ ప్రేమైక సారే స్థితా ‘’.’’నిన్ను మరివేడను సంపదలను నువ్వు నిర్భర భిక్షువు కనుక .దిగంబరివి కనుక విభవం కోరను .అభవుడవుకనుక మోక్షం ఇవ్వు చాలు అంటాడు కవి గడుసుగా .’’ముగ్దేందుశిరసోపలాలయసి యద్బాలం కురంగం ముదా ‘’అనే శ్లోకానికి –‘’బాల మృగాల –స్నిగ్ధత లాలింతు వౌర శిరమున గేలన్ –ముగ్ధుడ బాలుడ గానా -స్నిగ్ధత నను జూడ రాదే శీతాంశు ధరుడా ‘’
మరో శ్లోకానికి’’ మత్తకోకిల ‘’ గానం చేశాడు –‘’ఆప్తకామిని బిచ్చగాడవు హాళిమై పరమేశ ని-ర్లిప్తత౦ జరియింతు వెల్లెడల ,లీల నాయుపచారముల్ –లుప్తమై కడ తేరు నీమదిలోన హాళిని గూర్చనే- క్లప్త సర్గ విధాన నామది కిక్కనం బరికి౦పు మా ‘’
మరో రమణీయ శ్లోకం –‘’త్వత్పాబ్జతలాంతరోజ్జ్వల ధనుహ్ శంఖాది రేఖాంతర –స్ఫారద్దూలిల వాంఛి తాత్మ నిటలైరింద్రాది దిక్పాలకైహ్-ల్లక్ష్మీ సర్వసముజ్జ్జ్వలా చిరతరస్థాయిన్యుపశ్లిష్యతే ‘’.దీనికి కంద౦లో తెలుగు –‘’ తావకపాదసరోరుహ –భావుక రేఖాన్తరాళ భాస్వద్ధూలిన్-దేవాళి తలదాల్చియే -దేవా స్థిర లక్ష్మి తోడదీపించు నొగిన్ ‘’.భక్తుని కట్టెలు మోశావ్ మూఢ భక్తుని రాజ సభలో గెలిపించావ్ .నక్కను గుర్రం గా మార్చిన నీ విభూతి పొగడటం ఎవరి తరమూ కాదు .
‘’అంతకనాశే కరుణా కోశే –శంకర దేవే జాగ్రతి భావే –పాపభయంవా తాప భయంవా మృత్యు భయం వా నాస్తిహి నాస్తి ‘’అని శంభు వైభవాన్ని కొనియాడాడు కవి .మరో శ్లోక పద్యానికి భావం-అన్నము ప్రాణం హంతవ్యుడు, హంత,హననం మొదలైన అన్ని రూపాలు శివుడే .వేదం వేదాంత సంవేద్యుడే ఆయన .’’తనో రర్ధం సదా సర్వ మంగళాస్పదమేవ తే-మంగళా శంసనంయత్తేశైత్యోప చరణం విధో’’.చివరి 133వ శ్లోకం –‘’ఏకం ను విప్రైబహుధాపి గీతం –తమః పరస్మి న్పదిభాసమానం –శివాత్మకం వ్యాప్యధ వైష్ణవం వా మహో మద౦తస్తి మిరం హినస్తు’’-దీనికి గీతపద్యానువాదం –‘’ఏక వస్తువు విప్రులనేక మండ్రు-రజసు కావల వెలుగొందు నజితమహము – శైవ వైష్ణవ భేదంబు సరకు గొనము –మాదునంతర తమమును బాపుగాత ‘’అంటూ శ్రీకల్పవల్లీ కపాలీశ్వర విభూతి ‘’ని కవి వాసా సూర్య నారాయణ శాస్త్రి గారు ముగించారు .లోతుకు వెళ్లి తరిస్తే అన్నీ అనర్ఘ రత్న రాసుల్లాంటి శ్లోకాలు వాటికి భావస్పోరక తెలుగు ముత్యాలపద్యాలు కపాలి విభూతికి అద్దం పట్టాయి .ధన్యుడు కవి .చదివితే ఆ విభూతి వైభవం మనకూదక్కుతుంది .ఈ కావ్యాన్నీ కవినీ పరిచయం చేసి నేను ధన్య విభూతి పొందాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-2-21-ఉయ్యూరు