మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-271
• 271- రంగస్థల, టీవి, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు-ముదిలి సంజీవి
• సంజీవి ముదిలి రంగస్థల, టీవి, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు.[1] 1965నుండి నాటకరంగంలో కృషిచేస్తున్న సంజీవి, సినీరంగంలో 50కిపైగా చిత్రాలకు నటుడిగా, రచయతగా పనిచేశాడు. ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాడు.[2]
జననం
సంజీవి సెప్టెంబర్ 24న కృష్ణా జిల్లా, విజయవాడలో జన్మించాడు.[3]
రంగస్థల ప్రస్థానం
సంజీవి రాసిన త్రేతాగ్ని పుస్తక ఆవిష్కరణ
1965లో నటనాలయం నాటకంలోని చిట్టిబాబు పాత్ర ద్వారా నాటకరంగంలోకి అడుగుపెట్టిన సంజీవి నటుడిగా, రచయితగా, దర్శకుడిగా అనేక నాటక నాటికలకు పనిచేశాడు.[4] గురజాడ కళామందిరం అనే సంస్థను స్థాపించి, గత 40 ఏళ్ళుగా నాటక ప్రదర్శనలను ఇస్తున్నాడు.
నటించినవి
నాటకాలు
- సమాధానం కావాలి
- యుద్ధం
- ఈ చరిత్ర ఏ సిరాతో
- దేశం మోసపోయినప్పుడు
- మాస్టార్జీ
- యాచకులు
- శబ్దం
- మూక
నాటికలు - పగగం పగిలింది
- నీరుపోయి
- చరమాంకం
- శవాలపై జీవాలు
- ఊసరవల్లి
- మనకెందుకులే
- కదలిక
- సంచలనం
- డేకోయిట్లు
- రేపు
- వర్తమాన భూతం
- అయో (వ) ధ్య
- మనుధర్మం
- రాజ్యహింస
- నిజాయితి
- ఊరుమ్మడి బతుకులు
- క్విట్ ఇండియా
- అమూల్యం
- చెప్పుకింది పూలు
- ఓటు బాట
- గబ్బిలం
- అని తెలుస్తుంది
- వామపక్షం
బహుమతులు
నంది అవార్డులు - ఉత్తమ నటుడు – నిజాయితి (నాటిక) – 2000
- ఉత్తమ నాటకం – మధురం
- ఉత్తమ రచన – శివరంజని
- నాలుగు అవార్డులు – గబ్బిలం (నాటిక)
- రెండు అవార్డులు (నంది నాటక పరిషత్తు – 2005)- అని తెలుస్తుంది (నాటిక)[5]
ఆంధ్ర నాటక కళా పరిషత్తు - ఉత్తమ బాల నటుడు – నటనాలయం (నాటకం), 1965, హైదరాబాదు.
- ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ రచన – ఈ చరిత్ర ఏ సిరాతో (నాటకం), విశాఖపట్టణం.
- ద్వితీయ ఉత్తమ నాటిక, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు – కదలిక (నాటకం), విశాఖపట్టణం.
ఇతర అవార్డులు - కళాసాగర్ అవార్డులు (1981 నుండి 84 వరకు, వరుసగా మూడుసార్లు)
- 62సార్లు ఉత్తమ రచయిత అవార్డులు
- 50సార్లు ఉత్తమ దర్శకుడు అవార్డులు
- 110సార్లు ఉత్తమ నటుడు అవార్డులు
పురస్కారాలు - మహాకవి గురజాడ స్మారక పురస్కారం, కళా విరించి – గుంటూరు
- పీపుల్స్ రైటర్ – జవ్వాది ట్రస్టు
- దాసరి ప్రతిభా పురస్కారం – 2018 ( ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ)[6]
సినిమారంగ ప్రస్థానం
నటనాలయం (నాటకం)లోని సంజీవి నటనను చూసి బి.ఎన్. రెడ్డి తన రంగులరాట్నం (1966) సినిమాలో బాలనటుడి వేషం ఇచ్చాడు. దాదాపు 50కిపైగా చిత్రాలకు నటుడిగా, రచయతగా పనిచేశాడు. సంజీవి రచనలో రాజశేఖర్ నటించిన ‘అన్న’ చిత్రం నాలుగు నంది అవార్డులు అందుకోవడమేకాకుండా, ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మా చిత్ర రచనలో కూడా సంజీవి తన సహకరించాడు. ఈ చిత్రం అంతకుముందున్న బాక్సాఫీస్ రికార్డులను అధిగమించడమేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక అవార్డులతోపాటూ ఉత్తమ నటి విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈయన రచయితగా చేసిన మరో సినిమా ఎర్రమందారం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో రాష్ఱ్ర ప్రభుత్వ అవార్డులు, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ అవార్డు గెల్చుకుంది. ఎర్రసైన్యం, ఒరేయ్ రిక్షా, సమ్మక్క సారక్క వంటి చిత్రాలకు పనిచేసిన సంజీవి తమిళ సినిమా, కన్నడ సినిమా రంగంకు కూడా పనిచేశాడు. అంతేకాకుండా ఛాయా (1981), తెలుగోడు (2014) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
సినిమాలు
నటుడిగా - 1966 – రంగులరాట్నం (బాలనటుడు)
- 1992 – హలో డార్లింగ్
- 1991 – కర్తవ్యం
- 1991 – ఎర్రమందారం
- 1989 – భారతనారి
- 1989 – అడవిలో అభిమన్యుడు
- 1989- మౌన పోరాటం
- 1988 – మహర్షి
- 2000 – అడవిచుక్క
- 2011- రాజన్న
రచయితగా - 2003 – అమ్ములు (కథ)
- 1997 – ఒసేయ్ రాములమ్మ (మాటలు)
- 1990 – అలజడి
- 2000 – అడవిచుక్క
దర్శకత్వం - 1981 – ఛాయా
- 1998 – తెలుగోడు
టీవిరంగ ప్రస్థానం - భరత నాట్యం
- అంతరంగాలు
- మాతృదేవత
- ప్రతిఘటన,
- నిన్నే పెళ్ళాడుతా
- సూర్యవంశం
- అపరాజిత
- పెళ్ళి
- కృష్ణవేణి
- మనసంతా నువ్వే
- కళ్యాణ తిలకం
- సీతమ్మ మాఅమ్మ
- బ్రహ్మముడి
- ఆరాధన
- శివరంజని
- గోరంత దీపం
- లక్ష్మీ కళ్యాణం
- మహలక్ష్మి
పుస్తకాలు
సంజీవి రాసిన త్రేతాగ్ని పుస్తకం 2021, ఆగస్టు 12న హైదరాబాదు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో అవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రంగస్థల నటులు, దర్శకులు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, దైవజ్ఞశర్మ, సినీ టివి దర్శకులు, నటులు నాగబాల సురేష్ కుమార్, సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-22ఉయ్యూరు —