గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-19

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-19
కార్మి చెల్ కోరికపై మోతీలాల్ ఆయనకు 1-పోలీసులను అదుపు చేయటం 2-గ్రామీణ ప్రజలలో పారిశుధ్యం పెంచటం అనే  రెండు విజ్ఞప్తులు చేశాడు .మోతీలాల్ కు పోలీసులకు ఎప్పుడూ పడేదికాదు ..1902లో పోలీస్ కమీషన్ ఆయన మెమొరాండం చదివి ఆదరాబాదరాగా ఆయన్ను ముఖ్య సాక్షిగా పిలవాలన్న దాన్ని మానుకోవటం విషయమై మోతీ లాల్ ప్రచారం లో ఉన్న ఒకజోక్ తన పత్రికలో రాశాడు –‘’కలకత్తాలో ఒక రోజు పొద్దున్నే రోడ్డుపక్క తూము దగ్గర తాగుబోతు పోర్లుతున్నాడు .డ్యూటీలో ఉన్న పోలీసు అతడిని నిలవేసి ‘ఇక్కడ ఏం చేస్తున్నావు ?’’అని అడిగితె ‘అమృత బజార్ పత్రిక నడుపుతున్నాను ‘’అని జవాబిచ్చాడు తాగుబోతు. అంతేపోలీస్ అక్కడి నుంచి ఉడాయించాడు ‘’.
  1911లో బొంబాయిలో జరిగిన మొదటి అఖిలభారత పారిశుధ్య మహా సభకు అనధికార ప్రతినిధిగా మోతీలాల్ హాజరై పారిశుధ్యం పై ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ తీసుకోవటం లేదని విమర్శించాడు .ప్రభుత్వ సహాయం లేకపోతె పల్లె ప్రజలు కీటకాల్లా మారిపోయి నశిస్తారు ‘’అని చెప్పాడు ..శుభ్రమైన మంచి నీటి సరఫరా ,మలేరియా మొదలైన వ్యాదుల్ని అరికట్టటం ,,మురికి నీటి పారుదల అన్నిటికన్నా ముఖ్యం అని ఉద్హోషించాడు .ఆయన చేసిన సూచనలనుబట్టి మరుసటి సంవత్సరం బ్రిటీష్ ఇంపీరియల్ ,ప్రోవిన్షియల్ బడ్జెట్ లలో కొన్ని నిధులు కేటాయించి ,పన్నులద్వారా వచ్చే ఆదాయాన్ని జిల్లా బోర్డు లకు అందేట్లు చేశారు .రాజ్యాంగ సవరణలు దృష్టిలో పెట్టుకొని 1912లో మళ్ళీ రాయల్ కమీషన్ ను నియమించారు. మోతీలాల్ అనారోగ్యంగా ఉండటం వలన వెళ్ళలేకపోయాడు .తన లిఖిత పూర్వక విజ్ఞప్తిని కమీషన్ కు పంపి దాన్ని అమృత బజార్ పత్రికలో ప్రచురించాడు .’’1858 విక్టోరియా రాణి ప్రకటనకు భిన్నంగా దేశీయ రాష్ట్రీయ సర్వీసులలో ఇండియన్స్ ను దూరం గా పెడుతున్నారు ప్రభుత్వ సర్వీస్ పరిక్షలు ఏకకాలం లో జరగాలి  .జిల్లా మేజిష్ట్రేట్ పదవులలో యాభై శాతం ,,జిల్లా జడ్జిపదవులలో నాలుగింట మూడవవంతు భారతీయులకు ప్రత్యేకంగా కేటాయించాలి .ప్రొవిన్షియల్ప్రభుత్వ కార్యదర్శి పదవులు రెండూ ,అండర్ సెక్రెటరీ పదవులన్నీ భారతీయులకే ఇవ్వాలి .పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ లలో ఒకరు తప్పక భారతీయుడై ఉండాలి .జిల్లా పోలీస్ సూపరిం టే౦డెంట్ లలో సగం మంది ఇండియన్లు ఉండాలి .సాధారణ ప్రభుత్వ సిబ్బంది జీతాలు తగ్గించాలి. బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే ప్రజ్ఞావంతుల సంఖ్య బాగా తగ్గించాలి ‘’అని రాశాడు ఈలేఖ దానిపై వచ్చిన వ్యాఖ్యలు అన్నీ కలిసి ఒక పుస్తకంగా తర్వాత ప్రచురించాడు మోతీలాల్ .హాట్ కేకుల్లా పుస్తకాలు అమ్ముడయ్యాయి .అయితే ఈ సిఫార్సులు సుమారు ఎనిమిదేళ్ళు చీకటిలోనే మగ్గి పోయాయి .1920లో మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలలో ఇవి వెలుగు చూశాయి .
  కొండను తవ్వి ఎలుకను పట్టటం
  1912కు అజ్ఞాత విప్లవకారుల కార్యకలాపాలు ప్రభుత్వానికి జటిలంగా మారాయి .ఏమాత్రం ఆధారం దొరక్కుండా బాంబు దాడులు చేశారు .సీక్రెట్ పోలీసులకు వారి ఆచూకీ పట్టుకోవటానికి రెండేళ్ళు పట్టింది .రాజకీయ దోపిడీలు గుట్టు చప్పుడుకాకుండా జరిగిపోతున్నాయి .ప్రతి బెంగాలీనీ ప్రభుత్వం అనుమానించే పరిస్థితి ఏర్పడింది .సురెంద్రనాద్ బెనర్జీ కూడా  విప్లవకారులకు వత్తాసు పలుకుతున్నట్లు భ్రమపడింది ప్రభుత్వం .ఇవన్నీ నిరుద్యోగులపనులని కతఠినంగా వ్యవహరిస్తే అణగిపోతాయని కాడ్రాక్ భావించాడు .యువజన సంఘాలను నిషేధించారు .దానితో ఆసంస్థలు అజ్ఞాతం లోకి వెళ్లి విజ్రుమ్భించాయి .ఇదంతా సిద్ధాంతపరంగా జరుగుతోందని కార్నీ చెల్ వాదించినా ఆయనమాట వినిపించుకోలేదు .పోలీస్ గూఢచారి శాఖను రంగం లో దింపి,అపరిమితంగా అరెస్ట్ చేసే  విశేష అధికారాలిచ్చి౦ది ప్రభుత్వం .సరైన సాక్ష్యాలు  లేకపోయినా ,అనుమానితులను దీర్ఘకాలం విచారించి ఖైదీలుగా ఉంచటం అలవాటైంది .తన క్లయింట్ లు నిర్దోషులని న్యాయవాదులు తేలికగా రుజువు చేసి విడిపించటం సర్వ సాధారణం అయిపొయింది .1910 హీరాకుట్ర కేసు అలాంటిదే .ఉత్తర బెంగాల్ ,పశ్చిమ బెంగాల్ లోని అనుమానితులను అరెస్ట్ చేసి ఒక చోటే ఉంచటంతో జతిన్ ముఖర్జీ నాయకత్వాన విప్లవకార సంస్థ దృఢంగా  పాదుకొన్నది .ఈ జతిన్ ఆతర్వాత మొదటి ప్రపంచ యుద్ధకాలం లో జర్మనీ ఆయుదాలరూపంగా ,డబ్బురూపంగా ఇచ్చిన సాయంతో తిరుగుబాటుకు ప్రయత్నించాడు .
  1913మే లో బెంగాల్ సి ఐ డి గూఢచారి విభాగం  ఒక పెద్ద కుట్ర బయట పెట్టినట్లు గొప్పలు చెప్పుకొన్నది .బారిసాల్ లో బందిపోటు సంఘటనలు ,,తర్వాత చక్రవర్తిపై దాడికి కుట్ర చేస్తుంటే పట్టుకోన్నామని బీరాలు పలికింది .కేసుకూడా నమోదు చేసింది .ఈకేసుకింద సుమారు యాభై మందిని అరెస్ట్ చేశారు .మారుమూల పట్టణం లో కేసు విచారణ జరిగింది .ఆరోపణలను రుజువు చేయలేకపోయింది .అందులో యువ విద్యార్దులుకూడా ఉన్నారు .వారికి ఆరోపణ కాపీలివ్వలేదు వాళ్ళను తాళ్ళతో కట్టి చేతులకు బేడీలు వేసి వీధుల్లో ఊరేగించారు .న్యాయ సూత్రాలకు భిన్నంగా వ్యవహరించిన ఈ విషయాన్ని అమృత బజార్ పత్రిక ఘాటుగా విమర్శిస్తూ ‘’దేశప్రజలన్దర్నీ ఇలానే కుట్రలొఇరికిస్తారా అనే అనుమానం కలుగు తోంది .వారిపై విచారణకు ప్రాధమిక సాక్ష్యాలున్నాయో లేదో ముందు విచారించి తర్వాత కేసులు పెట్టాలని కార్నీ చెల్ కు విజ్ఞప్తి చేసింది పత్రిక .బ్రిటిష్ న్యాయసూత్రాన్ని ఆధారం గా చేసుకొని మోతీలాల్ రాశాడు భారతీయులంతా ఆయన పక్షాన నిలిస్తే ,ఆంగ్లో ఇండియన్ పత్రికలూ ప్రభుత్వానికి వంతపాడాయి .మోతీలాల్ పై కోర్టు ధిక్కారణ నేరం మోపారు .జెంకేంస్ ,స్టేఫెంస్ ,అసుతోష్ ముఖర్జీ లతో కలకత్తా హైకోర్టు ప్రత్యెక ధర్మాసనంగా విచారించింది .ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కెన్సీ వాదించగా ,ని౦దితులపక్షాన ప్రముఖ న్యాయవాదులు వాదించారు .మోతీలాల్ పై సారిన ఆధారాలు చూపించమని చీఫ్ జస్టిస్ డిమాండ్ చేశాడు .ఆధారాలు సమర్పించలేక పోయింది ప్రభుత్వం. కేసు కొట్టేశాడు చీఫ్ జస్టిస్ .కోర్టు ధిక్కరణ నేరం జరగనే లేదని న్యాయమూర్తి ముఖర్జీ వాదించాడు .ఆతర్వాతే ప్రభుత్వం కోర్టు ధిక్కరణ బిల్లు ప్రవేశపెట్టింది .ఇది ఆమోదం పొందటానికి 12ఏళ్ళు పట్టింది .కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది అని ఈ కేసును ప్రజలు పత్రికలూ ఆక్షేపించారు .
   సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.