మరికొన్ని మంచి పుస్తకాలు
–నిరతాన్నదాత శ్రీమతిడొక్కా సీతమ్మగారి ఇనిమనవడు శ్రీడొక్కా రాం గారు తండ్రిగారి అంత్య క్రియల కోసం అమెరికాలోని ఆస్టిన్ నుంచి ఇండియావచ్చి రాజమండ్రిలో కార్యక్రమాలు పూర్తీ చేసి మొన్న ఉదయం ఫోన్ చేసి తాను రాసిన పుస్తకాలు కొరియర్ లో పంపిస్తున్నానని చెప్పి అభిప్రాయం రాయమని కోరారు అలాగే ఆయన పంపగా నిన్న సాయంత్రం అందాయి .వీరితో దాదాపు 9ఏళ్ళ పరిచయం ఉంది .2017లో మేము ఐదవసారి అమెరికా లో మా అమ్మాయి వాళ్ళు ఉండే షార్లెట్ కు వెళ్ళినప్పుడు సాహిత్య సాన్నిహిత్యం బాగా పెరిగి వారి ,మా పుస్తకాల పరస్పర బట్వాడా జరగటం వారి పుస్తకాలపై నేను నా అభిప్రాయాలు రాయటం జరిగింది .నిరుడు వ్యాస జయంతికి వారు ఆస్టిన్ లో జరిపే మా బడి కార్యక్రమాలు చేయలేక పోవటం వలన సరస భారతి ద్వారా చేయించి 80 వేలరూపాయలు పంపగా కరోనాలో ఉద్యోగాలుకోల్పోయినా తెలుగు బోధిస్తున్న అయిదుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఆ డబ్బు సమానంగా అందిస్తూ సరసభారతి ద్వారాకూడా మరింత ఆర్ధిక సాయం ఇచ్చి ఒక్కొక్కరికి సుమారు 25 వేల రూపాయలు అంద జేశాం .
రాం గారు మంచి పద్యకవి విమర్శకులు హాస్య చతురులు .వారి పుస్తకాలలో ఇవన్నీ దర్శనమిస్తాయి .వారు పంపిన పుస్తకాలు -అవ్యక్తం -2కాపీలు ,తటిల్లతలు ,చిత్రపది ,ప్రవాసి ,పాట వెలది ,పలకరించే పద్యం ,ఆకు చుట్టిన ప్రకృతి, మా ఆఫ్రికా యాత్ర అనే పద్య సఫారి ,అమెరిక వాసి
రాం గారు ఏదో కవిత్వంతో రచనలతో కాలక్షేపం చేసే వారు మాత్రమేకాదు బహు సాహితీ సాహిత్య కార్యక్రమాలు నిర్వహించటమేకాక సాఫ్ట్ వేర్ అధిపతి కూడా .ఆయన సోదరులూ మాంచి సరస్వతీ పుత్రులే .అమెరికాలో సాహితీ దండ యాత్ర చేసే సాహితీ మూర్తులే .
రాం గారికి ధన్యవాదాలు .పుస్తకాలు చదివి అభిప్రాయం రాశాక వాటిని ఉయ్యూరు లైబ్రరీకి అందజేస్తాను
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-22-ఉయ్యూరు