ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -4హరిశ్చంద్ర -4

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -4

రాజారామ మోహన రాయ్ తన ‘’బంగదూత ‘’ను దేవనాగరిలో వచనం  తో సహా నాలుగు భాషలలో ప్రచురించాడు .ఉద౦త్ మార్తాండ్ మొదటి హిందీ పత్రికలో వచనమే రాశాడు .హిందీ వాడుకభాషలో వచ్చిన మొదటి పత్రిక కాశీ నుంచే 1844లో వెలువడింది .తారామోహన మిత్ర సంపాదకుడు .రాజా శివప్రసాద్ ‘’సితార ఎ హింద్’’పత్రిక కు పోషకుడు .ఇది హిందీలిపిలో ఉన్నా పర్షియన్ ఉర్దూ ప్రభావం ఎక్కువగా ఉండేది .1850లో తారామోహన మిత్ర సుధాకర్ పత్రిక స్థాపించాడు

  పత్రికలో ఏ భాష వాడాలి అనే వివాదానికి తెరదించి హరిశ్చంద్ర 1867లో  ‘’కవివచన సుధ’’పత్రిక నిర్వహించాడు .మొదట్లో బిహారి,జాయసీ రాసిన పద్యాలు వేశారు .హరిశ్చంద్రకు పద్య రచనా నైపుణ్యమే కాదు అద్భుతంగా శ్రావ్యంగా గానం చేసే ప్రతిభ ఉంది  .అందుకే ఆయనను ‘’కలియుగ్ కా కన్హ యా ‘’కలియుగ కృష్ణుడు అనేవారు .అతని శరీరచాయ గిరజాల జుట్టూ కూడా దానికి తగినట్లే ఉండేవి .ఇతని పత్రికకొనేవారు 25౦ మంది .వీరిలో 150 మంది చందాదారులు .మిగిలినవాటిని బ్రిటిష్ వారుకోనేవారు .కొద్దికాలంలోనే పక్షపత్రిక ఆతర్వాత వారపత్రికగా మారింది ..1867లో వెలువడిన మూడు స్వతంత్రహిందీ పత్రికలలో కవి వచన సుధఒకటిగా గుర్తి౦పు పొందింది.రామమోహన రాయ్ అంతటివాడు అని ప్రఖ్యాతిపొండాడు హరిశ్చంద్రసంపాదకుడై .ఎందఱో రచయితలకు మార్గదర్శి అయ్యాడు ..ఇతనివల్లనే హిందీ పత్రికా రంగానికి స్థిరత్వం కలిగింది .ఆకాలం లో సాహిత్యవిలువలున్న ఎన్నో పత్రికలూ వచ్చినా నిలదొక్కుకోలేక కాలగర్భం లో కలిసిపోయాయి .

 1873లో భారతేందు మరోపత్రిక ‘’మేగజైన్ ‘’ప్రారంభించాడు .ఈపేరు చాలామందికే కాక అతనికీ నచ్చక ‘’చంద్రిక ‘’గా మార్చాడు .ఇందులో వచనం నాటకాలు సమీక్షలు వ్యాసాలూ ,హాస్యరచనలు ,చదరంగ పోటీ విశేషాలు ఉండేవి .అంటే మానవ జీవితానికి కావాల్సిన అన్నీ ఉండేవి .సహాయ సంపాదకులుగా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్వామి దయానంద సరస్వతి ,భీషుబ్ చంద్ర సేన్ ,వంటిప్రముఖులు౦డేవారు .ఈపత్రికనూ బ్రిటీష్ వారు వందకాపీలు కొని ప్రోత్సహించారు .రాజా శివరామ ప్రసాద్ తనపత్రికలో వాడే పర్షియన్ పద మిశ్రిత హిందీకి ,వారణాసి బ్రాహ్మణులు వాడే సంస్కృత పదభూయిష్ట హిందీకి మధ్యగా హరిశ్చంద్ర చంద్రిక పత్రికలో సామాన్యమానవులు వాడే వాడుక భాషను వాడి ప్రజలకు పత్రికను సన్నిహితం చేశాడు .సంపన్న ఉన్నత కుటుంబం లో పుట్టినా సామాన్యుల భాషను ప్రోత్సహించటం ప్రశంసనీయం .వేషం లో డాబూ దర్పం ఉన్నా ,వీధి భాగవతులతోకలిసి కవిత్వం అల్లేవాడు .తాను  అనుసరించిన మార్గాన్నే పత్రిక భాషగా తీర్చి దిద్దాడు .ఇతని రెండు పత్రికలు ఎందరికో ప్రత్సాహాన్నిచ్చి ఎన్నోపత్రికలు రావటానికి తోడ్పడ్డాయి .దీనిఫలితంగా ‘’హరిశ్చంద్ర మండలి ‘’ఏర్పడి ,ఇప్పటికీ నడుస్తూనే ఉంది .బద్రీ నారాయణ చౌదరి అనే ప్రేమ ఘన అతడి వీరాభిమాని .ఆనంద్ కాదంబినీ ,మాసపత్రిక నగరినినాద్ వార పత్రిక ఈ ధ్యేయంతోనే ప్రారంభించి నిర్వహించాడు .పండిత ప్రతాప్ నారాయణ మిశ్ర హరిశ్చంద్ర పత్రికలకు రాసేవాడు .కలకత్తా నుంచి  అలహాబాద్ వచ్చిన పండిత బాలకృష్ణ భట్టా హిందీప్రదీప్ పత్రికస్థాపించాడు .ఇదేఅలహాబాద్ లో హిందీ వర్ధని సభకు మార్గదర్శనం చేసింది .దీనికి చైతన్యం తెచ్చినవాడు హరిశ్చంద్ర .అధ్యక్షోపన్యాసం ఇవ్వటానికి అలహాబాద్ వెళ్ళినప్పుడు మాతృభాష ప్రాధాన్యత గురించి వివరంగా చెప్పాడు. ప్రఖ్యాత రచయిత లాలా శ్రీనివాసదాస్ ఇక్కడికి వచ్చి ‘’సదా ధర్మ సదాదర్శ్ ‘’పత్రిక  పెట్టి నిర్వహించాడు .కొంతకాలానికి దాన్ని చంద్రికలో విలీనం చేశాడు .హరిశ్చంద్ర పై విపరీత అభిమాన గౌరవాలున్న రాధాచరణ్ గోస్వామి ‘’భారతే౦దు ‘’పత్రిక స్థాపించి తన అభిమాన్నాన్ని వ్యక్తం చేశాడు .ఇంతమంది గోప్పరచయితలకు ప్రేరణ ,ప్రోత్సాహం కల్పించటం వారి రచనలు తన పత్రికలలో ప్రచురించటం హరిశ్చంద్రకు గొప్ప గర్వ కారణం.

  పత్రికారంగం లో సాధించిన విజయాలను పురస్కరించుకొని మహిలా ఉద్యమ వ్యాప్తికి  ‘’బాలబోధిని ‘’,తానూ జన్మతః వైష్ణవుడుకనుక వైష్ణవ భక్తీ ప్రచారానికి ‘’భగవత్ తోషిణి’’అనే మరో రెండు పత్రికలూ నిర్వహించాడు .ప్రభుత్వం యధాశక్తి సహకరించింది .గోహత్య మహా పాతకం అనే శీర్షికపై రచనలు నాటికలపోటీ నిర్వహించి బహుమతులిచ్చేవాడు .మద్యం, మాంసాహారం తీసుకోము అని సభ్యులతో ప్రమాణం చేయించేవాడు .తన పత్రిక పాఠకులతో విదేశీ వస్త్రాలు వాడము అని ప్రతిజ్ఞ చేయించాడు .ఉత్తరభారతం లో హిందీని ప్రాధమిక భాష చేయాలని తీవ్రంగా కృషి చేశాడు

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.