హాస్యానందం
48- విభావనోక్తి
కారణం లేక కార్యం జరగదు కాని కవి చాకచక్యం తో అలా జరిగినట్లు చెబితే విభావనాలంకారం అన్నారు .ఇది హాస్యంలోనూ ప్రయోగిస్తే ,’విభావనోక్తి ‘’అంటారని మునిమాణిక్యం కని పెట్టారు .ఇలాంటివి పిల్లల మాటలలో కనిపిస్తాయన్నారు .ఉదాహరణ ఆయనే చెప్పారు –‘’నేను మేడమీద ఉంటె ,కింద పిల్లలు నానా అల్లరీ గోలా చేస్తున్నారు.ఏదో కొ౦ప మునిగిందని కిందకి దిగివచ్చాను ..ఏదో గుడ్డ తగలడుతోంది .ఏమిట్రా అది అన్నాను .అమ్మ చీర అన్నారు ఎందుకు తగలడుతోంది అన్నాను .నిప్పు పుల్లగీచి దానిపై వేస్తె అన్నారు .నిప్పుపుల్ల గీసి మేము వేయలేదునాన్నా అని అందరూ ఒక్కసారే అన్నారు .ఆశ్చర్యమేసింది .ఆశ్చర్యం కోపం ,వచ్చి వళ్ళు మండింది ‘’చా గాడిద కొడుకుల్లారా !ఎవరాపని చేసింది ?అని అగద్దించాను .మా అయిదేళ్ళ పెద్ద కు౦క ధైర్యంగా ‘’మేమంతా ఇక్కడే ఉన్నాం.మేమెవ్వరం అగ్గిపుల్లగీసి చీరమీద వేయలేదండి నానారండీ ‘’అన్నాడు .ఎట్లా అంటుకొందిరా. అంటే పెద్దపిల్ల ‘’ఏమో నాన్న దానంతట అదే అంటుకొని భగ్గున మండింది ‘’అన్నది ‘’కారణం లేకుండా కార్యం జరిగినట్లు చెప్పారన్నమాట అన్నారు స్వానుభవంతో మునిమాణిక్యం .
ఒక్కోసారి బల్లమీద మంచినీళ్ళ గ్లాస్ దానంతతకడే మొగ్గేసి బోర్లపడుతుంది.నూనె దానంతట అదే ఒలుకుతుంది .పుస్తకం లో పేజీలు వాటంతకు అవే చినిగిపోతాయి .మరీ విచిత్రం ఏమిటంటే ‘’మా ఆవిడ పులుసు రాచిప్ప పోయిమీద పెట్టి దొడ్లోకి స్నానికి వెళ్లి వచ్చే సరికి డబ్బాలో ఉన్న బొగ్గులు అవే నడిచివచ్చి పులుసులో పడిపోతాయి’’ .కనపడకుండా ఇవి జరిగిపోతూనే ఉంటాయి దానితో హాస్యం పుడుతూనే ఉంటుంది . .ఒక్కోసారి ఎండలేకుండానే దేశం మండిపోతుంది .ప్రేమలేకుండా భార్యను ప్రేమిస్తాడు. కోపం లేకుండానే ముఖం చిటపట లాడుతుంది ‘’అన్నారు .
‘’ఒకసారి రైలలో వెడుతున్నాం .పొలాల మధ్య రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది .డ్రైవర్ దిగి చూస్తె పట్టాలమధ్య ఆవు నలిగి రక్త సిక్తమైంది .ఆవు ఆసామివచ్చి డ్రైవర్ తో తగాదాపడి ‘’నా ఆవును చంపావు ‘’అని కలబడ్డాడు .డ్రైవర్ ‘’నేను చంపలేదు ఇంజన్ ఆవుమీదు గా పోలేదు .ఆవు దానంతతకు అదే చచ్చింది ‘’అంటే ఆసామి ‘’కాళ్ళు ఎలాతెగాయి “”అనగా ‘’ఆకాళ్ళు చచ్చు కాళ్ళు వాటంతటకవే తెగిపదడిపోయాయి .ఆవు తలను రైలు చక్రాలమధ్య పెట్టి ఆత్మ హత్య చేసుకొంది’’అన్నాడు ఆసామి ‘’ఇంజన్ నడుపుతున్నావుగా .కాస్త చూసి నడపాలికదా ‘’అంటే డ్రైవర్ ‘’ఇంజన్ ను నేను నడపటం లేదు అద౦తట అదే నడుస్తోంది ‘’అన్నాడు అని కత చెప్పి ఇందులో ఉపద్రవాలకు దేనికీ కారణం లేదు వాటంతకవే జరిగాయి. కారణం లేకుండా కార్యం జరగటానికి హాస్యం గా నడిపిస్తే ,అర్ధం పర్ధం లేకుండా ,అసంబద్ధంగా హాస్యజనకంగా ఉంటుంది అన్నారు మునిమాణిక్యం ముసిముసి నవ్వులతో .మరికొన్ని ఉదాహరణలు వాయి౦చా రాయన .వాహకుడు లేని పల్లకి ,కడుపులేనికానుపు ,తడుపులేని నానుపు ,మగువ లేని దాంపత్యం ,మగడు లేని పాతివ్రత్యం ,ప్రియురాలులేని అనురాగం,జవరాలులేనిపెనుభోగం ,నాటకం లేని వేషాలు ,మగతనం లేనిమీసాలు ,బిడ్డలు లేని ఇల్లరికం ,అత్తలేని కోడరికం ,భాగ్యాలు లేని పంపకం ,రోకళ్ళు లేని దంపుడు ,అని ఏకధాటిగా వాయించారు సార్.పైగా ‘’ఉన్నట్లు అంటే –ఊహిచటం విభావనోక్తి .కారణం లేని కార్యం ఉన్నచొ కవితా చమత్కారోక్తి .స్వకీయముల్ ఈ ఎక్సాంపుల్స్ –సరసము లీ శా౦పుల్స్ ‘’అని కవిత్వం తో ఎడాపెడా వాయించారు .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-22-ఉయ్యూరు