హాస్యానందం
51- పూర్వ సాహిత్యం లో హాస్యం
మనపూర్వులు హాస్యాన్ని చిన్న చూపు చూశారు .ఉత్తమహాస్యం అంటే ఏమిటో తెలుసుకొన్నారుకానీ ఆదరించలేదు .వారి హాస్యం చదివితే ఊహ ఇంతవరకే పోయిందా ,మనోహర హాస్యం దొరకలేదా అనిపిస్తుంది అని బాధపడ్డారు మునిమాణిక్యం గారు .నరసభూపాలీయంలో హాస్యానికి ఒక ఉదాహరణ ఇచ్చారు –నరసభూపాలుడు వస్తున్నాడని శత్రుసైనికులు పరిగెత్తి గుర్రాలను ఎక్కారట .ఆతొ౦దర, భయం లో గుర్రాలతోకవైపు ముఖం పెట్టి కూర్చుని దౌడు తీశారట .నవ్వు వస్తు౦దికాని ఇది ఉత్తమహాస్యం కాదన్నారు మాస్టారు .
ప్రతాపరుద్రీయం లో ఉదాహరణ –కొప్పులుపెట్టి కళ్ళకు కాటుకపెట్టి కృత్రిమ స్తనాలతో స్త్రీ వేషం ధరించి ప్రచ్చన్నంగా కాకతీయ ఆంధ్రనగర వీధుల్లో వెళ్ళే శత్రురాజుల్ని చూసి దుండగులు, విటులు వారి బట్టలూడదీసి కుచాలులాగి నీవిని తాకి హిహిహీ అని నవ్వారని హాస్యానికి ఉదాహరణ గా ఇచ్చారు .ఇదాహాస్యం అన్నారు గురూజీ .
రసగంగాధర౦ లో ‘’గోవు పృష్టభాగం దర్శనీయం .రాసభ పృష్టభాగం ఎందుకు దర్శనీయంకాడదు ?అని ఉదాహరణ.పేలవంగా జుగుప్సగా లేదా అంటారు మాస్టారు .రమణీయార్ధకంగా ఉండాలన్న కర్త ఇలా వెకిలి ఉదాహరణ ఇవ్వటం ఏమిటని బాధపడ్డారు .కనుక హాస్యానికికూడా కావ్య లక్షణాలు ఉండాలన్నారు సార్.జుగుప్సలేని సభ్యమైన రసజనకమైనచిత్తవృత్తిని కలిగించేది ఉత్తమహాస్యం అని నిర్వచించారు నరసింహారావు మాస్టారు
పూర్వకవులలో హాస్యం మృగ్యం కాదు కానీ చాలాతక్కువ .బహుశా హాస్యానికి ఆరోజుల్లో ఆదరణ లేకపోబట్టి ఆవైపుకు వెళ్లి ఉండరు .హాస్య శీలుడిని నటవిట విదూషకుల పాత్రలతో కలిపి కూర్చోబెట్టారు .అంటే పంక్తి బాహ్యుడిని చేశారన్నమాట అంతనీచంగా చూస్తె ఎవరు సాహసించి హాస్యం వండి వడ్డిస్తారు అన్నారు మాస్టారు .ఇంకోటి అనౌచిత్యం .కావాలని ఏకవీ అనౌచిత్యాన్నిప్రవేశ పెట్టడు .దాన్ని సవ్యంగా సరసంగా సుందరంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు.డో౦క తిరుగుడుగా చెప్పి నవ్వించే ప్రయత్నం చేయడు అని వారి తరఫున వకాల్తా పుచ్చుకొన్నారు మాస్టారు .
పోనీ నాటకాలలో హాస్యం ఉందేమో అని వెతికితే ఆదిదొరకదు .పూర్వ పండితులుకవులూ హాస్యాన్ని గొల్లభాగోతులకు కేతిగాళ్ళకీ ,భండిక జనానికి గంధోలి గాళ్ళకు ఇచ్చేసి తాము గంభీర రచనలు చేశారు .నాటకపాత్రలూ హాస్యం మాట్లాడరు .నాయకుడుకానీ నాయిక కానీ చమత్కారంగా మాట్లాడరు అని నొచ్చుకొన్నారు.
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-22-10-22-ఉయ్యూరు
—