లలిత లలితంగా సాగిన డా.లలితకుమారి పచ్చీస్ ‘’బాలకథలు ‘’
నక్షత్రమాల 27 గా సంఖ్య ఉన్నా, ఉన్న కథలు పచ్చీస్ అంటే పాతిక .గురుదీవన తో మొదలై ఆత్మానంద౦ తో ముగిసిణ కతలివి .ఇందులో 10 పురాణం ఇతిహసాలలోనివి .మిగిలిన వాటిలో ఒకటి పండుగ గురించి తతిమ్మావి సమాజ౦ లో జరిగే విషయాలాను సూక్ష్మ దృష్టితో పరిశీలించి పిల్లల మనస్తత్వాలను తెలుసుకొని వారి బుద్ధులు పెడమార్గం లో పడకుండా జీవితాలను తీర్చి దిద్దుకోనటానికి బామ్మలు ,స్నేహితులు ,పెద్దలు బోధించినట్లు కల్పించిరాసిన నిజాయితీ కథలు .
మనవడిని బామ్మ అర్ధం చేసుకొన్నట్లు తలిదండ్రులు కూడా అర్ధం చేసుకోలేక పోవటంతో ఆపాసివాడు పొందిన మానసిక క్షోభ ‘మామ్మ పరిష్కారం ‘’బామ్మమాట ‘’బంగారు బాట అనిపించింది.మిగిలినవీ విషయానికి తగిన శీర్హికలతో లలిత లలితపదజాలంతో లలితకుమారి చక్కగా వండి వడ్డించారు .’’రాయి అనుకొన్నది ఒకనాటికి రత్నమౌనురా ‘’అన్న సినీ గేయం గుర్తుకు తెచ్చింది ‘’విలువ ‘’కథ.ఎదుటివారికి సాయం చేయటంలోనే ఆనందం ఉంది అని మాస్టారు చెప్పినమాటలో పరమార్ధంకూడా ఉన్నది .జీవులన్నిటికీ స్వేచ్చ ప్రాధమిక అవకాశం హక్కు , అది లేకపోతె ఎన్ని ఉన్నా లాభం లేదు .సమయస్పూర్తి లేని తెలివితేటలూ వ్యర్ధం అని చేప్పేకథ.కరుణశ్రీ గారి అహింసా జ్యోతి బుద్ధభగవానునికి దేవదత్తునికి హంస విషయ౦ లో జరిగిన సంభాషణ లో ‘’అరాళమరాళ శరాగ్నులోర్చునే ‘’అని గాయపడిన హంసనువొడిలోకితీసుకొని అనుకంప చూపిన ‘’ఆసియా జ్యోతి ‘’ దర్శనమిచ్చాడు ‘’హంస తీర్పు’’లో.
విదుషీమణి లలితకుమారి తన సాహితీ ప్రతిభను ప్రతికథలోనూ వ్యక్తపరచి కథా గౌరవం కల్పించి బాలలనేస్తం అనిపించారు .
గబ్బిట దుర్గాప్రసాద్-6-8-26-ఉయ్యూరు .
