వెయ్యేళ్ళ నాటి అద్భుత గణపతి

చత్తీష్ గడ్  రాష్ట్రంలో మావోయిస్ట్  బస్తర్ పర్వతాలలో 13 వేల అడుగుల ఎత్తున ఉన్న డోల్కా పర్వత శిఖరాగ్రం పై వెయ్యేళ్ళ నాటి ప్రాచీన గణపతి విగ్రహం లభించి ,అందర్నీ ఆశ్చర్య పరచింది .భీకరారణ్యాలమధ్య ఉన్న ఈ పర్వతం చేరటం చాలాకష్టం ..పదవ శతాబ్ది కి చెందినా 6 అడుగుల ఎత్తు 21 అడుగుల వెడల్పు ఉన్న అతి భారీ గ్రానైట్ విగ్రహమిది .దీన్ని స్థానిక జర్నలిస్ట్ కనుగొన్నాడు .ఎవరు శిల్పించి అంతఎత్తుకు చేర్చారో అన్నదానిపై ఆర్కియాలజిస్ట లు బుర్రలు పగలకోట్టుకొంటున్నారు .

  ఇక్కడ లభించటానికి పౌరాణిక చారిత్రక కారణం ఉంది .బస్తర్ ప్రాంతం లోనే పూర్వం వినాయకుడికి ,పరశురాముడికి యుద్ధం జరిగింది .అందుకే ఈ గణేశునికి విపరీతమైన ఆరాధన ఇక్కడ జరుగుతుంది .వేలాది భక్తులు దేశం నలుమూలలనుంచి వచ్చి , దర్శించి  ఆశీస్సులు పొంది , కోర్కెలను తీర్చుకొంటారు .రాజీవ్ రంజన్ అనే రచయిత ,ఇలాంటి అద్భుత విషయాలు బస్తర్ లో చాలాఉన్నాయని ,పరిశోధకులు వీటిపై దృష్టి పెడితే మరిన్ని విగ్రహాలు, దేవాలయాలు  బయట అడతాయని లేకపోతే వాటి చరిత్ర భూగర్భం లో కలిసిపోతుందని హెచ్చరించాడు .ఈ ప్రాంతం ఒకప్పుడు అతి బీద అటవీ వాసుల ఆవాస భూమిగా ఉండేది .ఇప్పుడంతా మావోయిస్ట్ ల అధీనం లో ఉంది .అరణ్య సొగసు ,ప్రకృతి సంపద సహజ సౌందర్యం బస్తర్ ప్రాంతవిశేషం .ప్రభుత్వాలకు శ్రద్ధాసక్తులు తక్కువవటం తో అందరూ బాధపడుతున్నారు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-9-18 ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీదక్షిణా మూర్తి నుతించిన శ్రీ విష్ణు శతకం

శ్రీదక్షిణా మూర్తి నుతించిన శ్రీ విష్ణు శతకం

సరసభారతికి అత్యంత ఆప్తులు ,నాపై అపార కరుణా దృక్కున్నవారు ,చుళుకీకృత సర్వ గీర్వాణ వాజ్మయ పాదోది పయస్కులైన అపర ఆగస్య ముని వరేణ్యులు ,  శ్రీ లలితా పరాభట్టారిక పరమోపాసకులైన  బ్రహ్మశ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి బ్రాహ్మీ మూర్తుల అనుంగు అంతేవాసులు ,వారి దౌహిత్రులు  గీర్వాణ౦ లో శతావధానం చేసి  శిశుపాలవధపై పరిశోధనతో పిహెచ్ డి అందుకున్న శ్రీ చెరువు ఆంజనేయ శాస్త్రిగారి బావమరదులు  , నా గీర్వాణ గాండీవానికి,పదును పెట్టి శోభ సమకూర్చినవారు ,విద్వత్ కవి పండిత ప్రకాండులు , మహా భక్తి  తత్పరులు ,అమోఘ సాధనా చతురాననులు,అనేక గ్రంథ నిర్మాణ చాతురీవైభవమూర్తి   ,అద్భుత ప్రసంగ మాధురి ,కలకండ కవిత్వ రస పారీణులు  ఉద్గ్రంద రహస్యాలను కరతలామలం చేసుకొన్న వరిస్ట గరిష్ట  బ్రాహ్మీ మూర్తి , బ్రహ్మశ్రీ డా.తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు నాపైఅనుగ్రహం తో  పెనుభారం మోపి తాము ఆన్ లైన్ లో అనుగ్రహించిన  ‘’శ్రీ విష్ణు నుతి శతక౦’’ ’’కు ముందుమాట రాయమని దాన్ని శతకం లో ప్రచురిస్తామని నిన్న విద్యుల్లేఖ ద్వారా ఆనతిచ్చారు.గుర్వాజ్న శిరో దార్యం కదా .హనుమంతుని ముందు కుప్పిగంతులుగా  రాసే సాహసం చేస్తూ ,ఎల్లుండి శనివారం ఉదయానికల్లా రాసి ఆన్ లైన్ గా పంపిస్తానని మాట ఇచ్చి  ,శ్రీవారిని నా దొసగులను మన్నించమని వేడుకొంటున్నాను .

118 వృత్త పద్యాల కవితాకల్హార మాలికగా శ్రీ మహావిష్ణువు కంఠ  సీమను అలంకరించి ,విష్ణు ,వైభవ శోభలను ద్విగుణీకృతం చేసిన శతకం ఇది .విష్ణు పారమ్యాన్ని ,అవతార అంతరార్ధ పరమార్ధాలను  కళ్ళకు కట్టించారు .ప్రతిపద్యం రసగుళిక అనటంమామూలు మాట అవుతుంది .రసోవై సహ అయిన ఆ రసానందమూర్తిని నుతించేది కనుక  దానికి సమానంగా  పరమ రసస్పూర్తి గా ఉంది .’’’సర్వ ప్రవృత్తుల నాతడు ఇహము ,పరము ,సంతుస్టుడు,ముక్తుడు’’.అని మొదటిపద్యం లో చెప్పారు .విష్ణు సహస్రనామ స్తోత్రం లోని భావనలన్నీ మనముందుంచి ‘’శ్రీనారాయణ స్తోత్ర మంచిత భక్తిన్ బఠియి౦ప సిద్ధమగు సుశ్రేయంబు లున్గ ల్గేడున్ ‘’అని ఫలశ్రుతి చెప్పారు .ఆత్మ తత్వ ప్రబోధకుడు, అమలుడు ,అవ్యాజాను రాగుడు ,సద్గురుడు ఆనంద మయుడే కాక యోగి జన హృద్గుహ్యుడు  విష్ణుమూర్తి .కలిలో శ్రీ విష్ణు నామమే ఉపాస్యం  ప్రారబ్ధాన్ని నశింపజేసి,ముక్తినిస్తుంది .మానవత్వ విలువలు చాటటానికి శ్రీ రాముడుగా,పరశువు చేతబట్టి మునివర్గాన్ని బాధపెట్టే రాజులపాలిటి అరివీర భీకరుడై ‘’శృతి ధర్మముల్ నిరంతరముగసాగ జేసే శుభదాముడైన పరశు రాముడై,అమృతోత్పాదన సమయం లో ఆదికూర్మమై ,విష్ణువు సర్వవ్యాపి అని తెలియజెప్పటానికి నృహరి యై ,గీతామృతం పంచి ,విశ్వ రూపాన్ని వ్యాఖ్యానించి దుస్ట  సంహారం, శిష్టరక్షణ చేసే శ్రీ కృష్ణ పరమాత్మయై ,కలియుగం లో కల్కి గా ధర్మాలను నడుపుతూ వెలసిన అవతారమూర్తి విష్ణుమూర్తి అన్నారు .

‘’నీదు పాద వరివస్య౦ జేసి జన్మంబు ధన్య విశేషంబుగజేసికొందు ‘’   అని ఆర్తిగా అంటారు  .బ్రహ్మాన్ని మదిలో ఊహించటమేకాని ఇలాఉంటాడని చెప్పటం ఎవరితరం కాదంటూ ‘’నరనారాయణ తేజమీ జగతి నిండి ‘’ఉందని ,’’పరమోదారు ,పరంజ్యోతి ,నక్షరు ‘’ని సంకీర్తనతో ఆ పరముని చేరతారని అభయమిచ్చారు .ఎవనిని తలిస్తే సందేహ నివృత్తి, భీతి తొలగి ,సంపత్ శ్రేణులు  విద్యా లభిస్తాయో ‘’ఆ విష్ణువు సర్వ దోష హరుడు ‘’’.సకలార్ధ సాధకం ,వత్సర  మాస, పక్ష ,తిధులకు కారణమై కాలాన్ని నియమించే జ్ఞాని విష్ణువు ..విష్ణుపదం చేరటానికి రాగద్వేషాలు వదిలి, సజ్జన సాంగత్యం తో ,సమస్త భూత హితుడై ,సౌశీల్యుడు,మైత్రి ఉన్నవాడికే సాధ్యం అని యోగ రహస్యం చెప్పారు .అయితే తనకు జపం ,ధ్యానం కుదరదని ,’’ఈ సర్వంబు నీవన్న జ్ఞాన పథంబెరుగ’’అని తన అల్పత్వాన్ని ప్రవరగా చెప్పుకున్నారు .’’యోగంబు ప్రత్యహమున్ జేయగ యోగానండుడా విష్ణువే ‘’అని అభయమిచ్చారు .

విష్ణువు విశ్వ రూపాన్ని –

‘’స్థిరుడై ,శాశ్వతుడై వెలుంగు పురుష శ్రేస్టున్,సహస్రంబులౌ –శిరముల్ ,కన్నులు, బాహువుల్ ,పదములున్ ,చిత్రంబులున్ నామముల్

బరగన్ భక్తి నమస్కరింతు ,బరితాపంబుల్ నివారించి ,స –ద్వరమున్ గూర్చు ననంతు ,నచ్యుతు ,గృపాపా౦గున్ జగన్నాథునిన్ ‘’గా దర్శించారు .మనకూ దర్శింప జేశారు .

ఒకే చైతన్యం అనేకమై సర్వత్రా భాసిస్తుంది .ఈజగత్తు  అద్వైతమే .’’మోక్ష రమా కాంక్ష ,మనోజ్ఞ రూప మెనయన్  సాక్షాత్కారి౦పన్ గదే ‘’  అని ఆ వెన్నుని ప్రార్ధించారు .పరమాత్మ ‘’పరమాణు స్థితి ,పర్వతాకృతి యై భాసించు ‘’అంటారు .’’ప్రాణ౦బే ప్రణవంబు ,తత్ప్రణవమే రాజిల్లు నీ తేజము  నీ ప్రాణంబుల్ నీ ప్రతిరూపు లౌదురు ,మహాత్ప్రాణ౦బ నీ వౌచు ‘’సంత్రాసం చెందే జగత్తునుచైతన్యం చేసేవాడు త్రిభువనవ్యాప్తుడైన జ్ఞానప్రదుడైన పురుషోత్తముడు అని ఉపనిషత్ రహస్యాన్ని అందమైన పద్యం లో నిబంధించి తేటతెల్లంగా చెప్పారు .కవిత్వ మహాత్మ్యాన్ని వివరిస్తూ ‘’కవితా గంగ సువర్ణాభిషేకం ,కవితాగంధం చల్లదనం ,కవితాపుష్పం అలంకారం .’’కవితా మాధ్వినివేదనంబగు రసజ్నా ,పద్మనాభ ప్రభో ‘’అని వివరించారు .చైతన్యమే సృష్టికి కారణమై పోషకమై లయకారకం అయి సత్యజ్ఞాన మనంతమై వెలుగుతుంది .ధర్మానికి గ్లాని కలిగినపుడు ‘’ధర్మముద్ధరణ జేయన్ బుట్టు నా దైవం ‘’హరి అని భగవద్గీతాసారం చెప్పారు .’’పరమాత్ముండగు  విష్ణువున్  సకల విశ్వంబులో దర్శించువారు జ్ఞానులు ‘’.నరజన్మం బతి దుర్లభంబు ,తిరుమంత్రం బెంతొ శ్రేస్టంబు’’అని విశిష్టాద్వైతాన్ని ఆ భాషలోనే చెప్పటం బాగుంది .

‘’ఆతని కొలిస్తే అన్నిజగాలను కొలిచినట్లే .ఆయన తింటే సర్వ భూత సంతతి తిన్నట్లే .అన్నిటా ఆతడే .’’ఎవరే మార్గమున ప్రవర్తిలిన నిన్నే చేరారు శర్వా ‘’అని కృష్ణుని గీతలోని భావాన్ని పద్యీకరించారు .  ‘’హరినామం బెదవిస్మరింప బడుటే ,యత్యంత దుఖంబగున్ ‘’అన్నారు .’’మతినీవె గతినీవె ‘శ్రీపతీ ‘’అని ‘’శృతినీవె గతినీవె నా ఈ నా ఆకృతివి నీవె భారతీ ’’అంటూ స్వాతికిరణం సినిమాలో మాస్టర్ మంజునాథ్ పాడిన పాట భావం గానే శాస్త్రిగారూ అన్నారు. ‘’అన్నంబా హరి ,రూపమే ,తినెడువాతండె- దేహస్థుడై యన్నంబెల్ల బచించు నాల్గు గతుల౦ దాతండె’’..’’భ్రమలన్పాన్పి ,యదార్ధమున్ దెలియ జెప్పన్ ,దైవ మేన్నో ప్రయత్నములన్ జేయుచు ,విశ్వ రూపమున సందర్శింప గా జేసె’’  అన్నారు పరమాత్మ అసలురూపాన్ని దర్శింపజేస్తూ…’వరమై ,లోక వరేణ్యమై ,వరదమై ,వర్ధిల్లునారాయణ స్మరణం బార్తిహరం  ‘’అనీ ,’’ఖగరడ్వాహను డాశ్రితావనుడు,విఖ్యాతుండు ,శ్రీ శంఖ చ –క్ర గదా ఖడ్గ ధనుర్ధరుండు ‘’అని విష్ణుమూర్తి రూప సౌందర్యాన్ని వర్ణించారు .ప్రత్యక్ష దైవం అయిన సూర్యుని ఆరాధిస్తే ,అనురాగమూర్తి అయి ఆహారాదికాలు ఇస్తాడని ‘’తల్లి దండ్రి గురు డీ సర్వంబౌ జ్యోతి ,నా-దిత్యున్ గొల్చెద ,దేవ దేవుని, సురాధీశున్ గృతజ్నండనై’’అని చివరిపద్యం ముగించి ,శ్రీమన్నారాయణ మూర్తికి  సూర్యనారాయణ మూర్తికి అభేదాన్ని తెలియజేసి సూర్యుని  , సవితృ నారాయణనిగా భావించే అనాదిభావాన్ని విశదీక రించారు .

శాస్త్రిగారి శతకాన్ని తల స్పర్శగా స్పశించానే తప్ప, లోతుగా విశ్లేషణ చేయలేక పోయిన నా అజ్ఞానాన్ని శాస్త్రిగారు మన్నించాలని కోరుతున్నాను .రసానందస్వరూపమైన శ్రీ మహావిష్ణువు నుతి శతకం కనుక ప్రతిపద్యం మధురస స్వరూపంగా ఉంది .ఉదహరించాలంటే శతకమంతా మళ్ళీ రాయాల్సి వస్తుందని  కొన్నిటినే ఉదహరించిన నా సాహసాన్ని శాస్త్రిగారు మన్నిస్తారని విశ్వసిస్తూ ,వారికిచ్చిన మాటను ఒక పూట ముందే పూర్తి  చేసి, వారికి దీన్ని ఇప్పుడే మెయల్ చేస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-18 –ఉయ్యూరు

.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా తమలపాకు పందిరిలో తామరాకు లాంటి తమలపాకులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -13

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -13

4-బ్రహ్మశ్రీ సామవేదం సూర్యనారాయణ అవధానిగారు, కుమారులు

 శ్రీరామ పురాగ్రహారానికి చెందిన నాలుగవ వారు   బ్రహ్మశ్రీ సామవేదం సూర్యనారాయణ  అవధాని   గారు హరితస గోత్రీకులు .తాతగారు  ముక్కామల కు చెందిన ఆహితాగ్ని ‘తండ్రి తెలుగు పండితుడు .తండ్రీ కొడుకులు అగ్నిహోత్రంకాని శ్రౌతం కాని చేయలేదు , వేదవిద్యకే ప్రాధాన్యమిచ్చారు ‘’వేదం చదవటం నేర్పటమే నా జీవితం ‘’అంటారు సామవేదం .కుమారులు నలుగురిలో ఇద్దర్ని వేదం లో పెట్టారు .వేద పండిత కుటుంబ కన్యలనే వారికి వివాహం చేశారు .అవిశ్రాంత వేదాధ్యయన ,అధ్యాపనమే వారి శక్తి సామర్ధ్యాలు .

 1932 డిసెంబర్ 30న జన్మించిన శ్రీ సూర్యనారాయణ అవధానిగారు నలుగురు అన్నదమ్ములలో చివరి వారు .పదవ ఏట ఉపనయనం జరిగి ,పదేళ్ళు దీక్షగా  వేదం  నేర్చుకున్నారు .మొదట పెద్దన్నగారి వద్దే ముక్కామలలో ,తర్వాత బిళ్ళకూరు లో శ్రీ వ్యాఘ్రేశ్వర చయనులగారి దగ్గర నేర్చారు .అ తర్వాత  బులుసు చయనులుగారి వద్ద శ్రీరామపురం లో అభ్యసించారు .కొంతకాలం ఇందుపల్లిలోని శ్రీ రాణి హయగ్రీవం గారి వద్ద చదివారు .విద్యాభ్యాస సమయం లో వారాలు చేస్తూ,మదుకరం తో జీవనం గడిపారు .1955 లో విజయవాడ లో’’ కర్మ ‘’లో పరీక్ష ఇచ్చారు .శ్రీ బాబళ్ళ శాస్త్రి గారి కోడలి చిన్న చెల్లెలు శ్రీమతి కమల ను వివాహమాడారు .వీరిది వేల్చేరులోని ప్రభల వారి  కుటుంబం .

 ఈ కొత్త క్రమపాఠి గారికి 1955 లో శ్రీరామపురం లో ఒక ఇంటిస్థలం ,ఇంటినిర్మాణానికి వెయ్యి రూపాయలు మంజూరయ్యాయి .దీనితో పాటు సాలుకు 15 బస్తాలు వడ్లు పండే ఎకరం పొలమూ వచ్చింది .ముక్కామలకు శ్రీరామపురం పదినిమిషాల నడక దూరం లోనే ఉన్నా అవధాని గారి తల్లి తనను వదిలి వెళ్ళవద్దని కోరింది .కాని ముక్కామలలో తమకున్న దానిలో తనకు దక్కేది అతిస్వల్పమే నని తెలిసి తనకంటూ ప్రత్యేకమైన గృహం ఎర్పరచుకోవాలనే నిశ్చయించారు .ఆనాటి గ్రామవాతావరణాన్ని గుర్తు చేసుకొని ‘’మట్టి రోడ్డు మీద నడవాలంటే తాతలు దిగోచ్చేవారు .రాత్రి పూట అయితే మరీ భయంకరం .దారిలో దొంగల భయం  కూడా.సెటిల్మెంట్ గాంగ్ ల ఆవాసాలు దగ్గరే ‘’అంటారు .

  శ్రీరామపురం లోని ఎకరం పొలం కౌలుకిచ్చేవారు .ఫలసాయం బాగానే ముట్టేది .క్రమగా షెడ్యూల్ కాస్ట్ వారి ప్రాబల్యం పెరిగి వారి ఆక్రమణకు గురై౦ది పోలం .’’వాళ్ళు మాపోలం లో గుడిసెలు వేసేశారు కొబ్బరికాయలు మాకు దక్కకుండా కోసేసేవారు .కోళ్ళపెంపకం కూడా చేసి మా బోటివాళ్ళు అడుగు పెట్టటానికి కూడా వీలు లేని దుర్భర పరిస్థితి కలిపించారు .ఈ బాధ పడలేక ఆ ఎకరాన్ని అయినకాడికి అతి తక్కువ ధరకే అమ్మేసి చేతులు దులుపుకొని ,పీడా విరగడ అయిందని  వేరొక చోట మళ్ళీ అరఎకరం  పొలం కొన్నాను ‘’అని ‘’బాపన ఎవసాయం ‘’కస్టాలు చెప్పారు సామవేదం . ఏడాదికి రెండుపంటలు పండే పొలం అది .దాన్నీ అమ్మేసి వేదపండితునిగానే జీవిక సాగించాలని నిర్ణయించుకొన్నారు .డబ్బు అడగటానికి నామోషి పడలేదు  వృత్తిలో నిలబడటానికి ఎందరెందరినో  ధనసాయం చేయమని అడిగారు .కొంతకాలం బయటికి వెళ్లి వేదవిద్య ప్రదర్శించి డబ్బు సంపాది౦చటమా, లేక ఇంట్లోనే ఉంటూ తనపిల్లలకు వేదం నేర్పటమా అనే సందిగ్ధం లో పడిపోయారు ‘’డబ్బు సంపాదన లేకపోతె సంసారం ఈదటం కష్టం .యాచనకు బయటికి వెడితే ఇంట్లో వేదాధ్యయనం సాగదు.ఈ రెండిటికీ లంగరు కుదరదు ‘’అని విచికిత్సకు లోనయ్యారు .చివరికి తానే ఒక నిర్ణయానికి వచ్చి ,నలుగురు కొడుకులలో వేదం పై అభిరుచి ఉన్న ఇద్దరికీ తానె ఇంటి వద్ద నేర్పుతూ మిగిలిన ఇద్దరికీ శాస్త్రాలలో పాండిత్యం కలిగించే లౌకిక విద్య నేర్పించాలనుకొన్నారు .ఇంతలో నాలుగవ కుమారుడికి ఉపనయనవయస్సు వచ్చింది .పెద్దవాడికి 24 ,మధ్యలో ఇద్దరికీ 22,21 వయసు .వీరిద్దరికీ 82 పన్నాలు వచ్చాయి .

   అగ్రహారం వదలి బయటికి ఆశీర్వచానాలకు  వెళ్ళేవారు .లేకపోతె వేదం సభలలో పాల్గొనేవారు .మహా శివ రాత్రికి పట్టిసీమ లోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయం లో జరిగే స్వస్తి వచనానికి వెళ్ళేవారు .తిరుపతిలో వరుణ పూజలో పాల్గొనేవారు .అవసరమైతే శ్రౌత విధులకు ఆహ్వానిస్తే వెళ్ళేవారు .’’నా సంసారం గడవటానికి డబ్బుకావాలి. అందుకే వెళ్లి డబ్బు పొంది వచ్చేస్తాను. దీనికి పశ్చాత్తాపం పడాల్సింది ఏమీలేదు .క్షమాపణ అవసరం లేదు’’అన్నారు  .తన వేదస్వరానికి లెక్కకట్టి ఇచ్చే ధనం కోసం చివరిదాకా ఎక్కడికైనా  ఏ సమయం లోనైనా వెళ్ళేవారు .ఎక్కడ ఏ సభ ఎప్పుడు జరుగుతుంది ,ఎవరి ఆధ్వర్యం లో అరుగుతుంది ,యెంత సంభావన గిడుతుంది అన్న లెక్కలన్నీ ఆయనవద్ద సిద్ధంగా ఉంటాయి .దాదాపు ఆ సభలన్నీ ఉభయ గోదావరి జిల్లాలలోనే ఉండేవి .ఒక్కోసారి గుంటూరు, కృష్ణా ,విశాఖ జిల్లాలలో అరుదుగా జరిగేవి .వాటికీ వెళ్ళేవారు .ఒక సారి మద్రాస్ లో అత్యంత సంపన్న బ్రాహ్మణుడి నుంచి కూడా ఘన సంభావన పుచ్చుకున్నానని తెలిపారు .

  జీవితం లో చాలా ఒడిదుడుకులు చూశారు .ముసలితనం లో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకొన్నారు .1994 లో తిరుపతిలో జరిగిన వైష్ణవ యాగానికి 150మంది వేదపండితులు ఉదయం 7 గంటలనుండి మధ్యాహ్నం వరకు 12 రోజులు వరుసగా పారాయణకు పిలిచారు .వెయ్యి అగ్నిహోత్రాలు లక్ష్మీ నారాయణులకు ఏర్పాటు చేశారు. ఇద్దరు కుమారులతో అవధానిగారు వెళ్ళారు .మళ్ళీ వీరి ముగ్గురినీ 60 మంది వేదపండితులతోపాటు 7 రోజులు వేదపారాయణకు 1955 ఆగస్ట్ లో కంచిలోస్వామి  60 వ జన్మ దినోత్సవం కు ఆహ్వానించారు .ముగ్గురికీ  తలా వెయ్యిన్నూట పదహార్లు ,ఒక   బంగారు నాణెం ,14 తులాల వెండి పళ్ళెం నూతనవస్త్రాలు ,భార్యలకు కొత్త చీరలు  కానుకగా అందించారు  .మూడు నెలల తర్వాత పుట్టపర్తికి శ్రీ సత్యసాయి బాబా 70 వ జన్మ దినోత్సవానికి  ఆహ్వాని౦ప బడిన  70 మంది వేదపందడితులతో పాటు ఈ ముగ్గురూ వెళ్ళారు  .ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు ,బాబా సృష్టించి ఇచ్చిన చేతిగడియారం, నూతనవస్త్రాలు ,భార్యలకు సిల్క్ చీరలు ,ఒక్కోక్కరికి రెండు బంగారు గాజులు ,ప్రెజర్ కుక్కర్ ,వారం రోజులు ఉచిత భోజన వసతి కల్పిస్తూ ప్రయాణం ఖర్చులకుగాను ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇచ్చి ఘనంగా సన్మానించారు .

సామవేదం వారి ఫోటో జత చేశాను చూడండి

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హాస్యం జాలువారు రావూరు వెంకట సత్యనారాయణ రావు

హాస్యం జాలువారు రావూరు వెంకట సత్యనారాయణ రావు

సెప్టెంబర్ 9 ఆదివారం సాయంత్రం విజయవాడలో శ్రీ పంతుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యం లో నిర్వహింప బడుతున్న శారదాస్రవ౦తి కార్యక్రమం లో ముఖ్య అతిధిగా వెళ్లి ,అందరూ మరచిపోయిన కమ్మని తెలుగు హాస్య రచయిత శ్రీ రావూరు వెంకట సత్యనారాయణ రావు గారి గురించి మాట్లాడాను .ఆ విషయాలు మీకోసం .

  శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి ,శ్రీ మునిమాణిక్యం నరసింహారావు వంటి హాస్య రచయితల తర్వాత తెలుగులో చిరు దరహాసం చిందించిన హాస్య రచయిత శ్రీ రావూరు వెంకట సత్యనారాయణ రావు గారు .ఆయన ఆంద్ర ప్రభలో ధారావాహికంగా కొన్నేళ్ళు రాసిన ‘’వడగళ్ళు ‘’, ‘’ఆషామాషీ ‘’లకోసం ఎదురు చూసేవాళ్ళం ఒక రకం గా ‘’ఆషామాషీ ‘’ఫేం రావూరు ..సినీ రంగ ప్రవేశమూ చేసి అక్కడా హాస్యాన్ని చిలకరించారు .అలాంటి మనిషిని  నేటి తరం స్మరించి స్పూర్తి పొందాలి .

   1913 లో కృష్ణా జిల్లా మచిలీపట్నం లో రావూరు జన్మించారు .బందరులోనే బి ఏ చదివి పాసై ఏమీ చేయకుండా ఊహాలోకం లో సంచరించేవారు .డిగ్రీ పరీక్షలో కథ రాయమంటే వెరైటీ గా రాయాలని పించి పద్యాలలో రాసిన పైత్యకారి .దిద్దే గురువు మెచ్చుకోకుండా గుండు సున్నా పెట్టాడు .అదే వయసులో ‘’కుచేలోపాఖ్యానం ‘’పద్యకావ్యం గా రాసినకవి రావూరు .బందరు అంటే ముట్నూరు కృష్ణారావుగారు ,ఆయన ‘’కృష్ణా పత్రిక ‘’ముందు మనకు గుర్తొస్తాయి .రోజూ సాయంత్రం అక్కడ  ముట్నూరు వారు సాహితీ దర్బార్ నిర్వహిస్తారు .పింగళి కాటూరి ,విశ్వనాధ ,బాపిరాజు మొదలైన హేమా హేమీలతోపాటు దానికిరావూరు తప్పక హాజరయ్యేవారు .రోజూ పత్రికాఫీసు వెనకున్న తోటలో కృష్ణారావు గారు మౌనముద్రాలంకారులై పచార్లు చేస్తుంటే ,వారి వెనక రావూరు వారు నడిచేవారు .ఇద్దరి మధ్య చాలాకాలం మాటలే చోటు చేసుకోలేదు .ఒక రోజు అకస్మాత్తుగా ముట్నూరు వారు వెనక్కి తిరిగి చూసి ‘’రేపట్నించి చేరండి ‘’అని రెండే రెండు మాటలు మాట్లాడారు .పట్టరాని సంతోషం తో ఉప్పొంగి పోయారు రావూరు .’’నాకు కృష్ణా పత్రిక లో ఉద్యోగం వచ్చింది’’ అని హితులకు సన్నిహితులకు చెప్పేశారు .

  కృష్ణా పత్రిక ఆఫీసులో ఎడమ వైపు పౌరాణిక చిత్ర దర్శక బ్రహ్మ (అప్పటికి ఇంకా అంత సీను లేదు ) శ్రీ కమలాకర కామేశ్వరరావు కుర్చీలో కూచుని పత్రికకు ‘’ఆధ్యాత్మిక వ్యాసాలు ‘’రాసేవారు .కుడిప్రక్క కుర్చీలో రావూరు కూర్చుని సిని ,నాటక  సాహిత్య సమీక్షలు రాసేవారు .ఎదురుగా సంపాదకులు ముట్నూరు వారు ఆసీనులై ఉండేవారు .సంపాదకీయాలన్నీ కృష్ణా రావు గారే రాసేవారు .వాటికి చాలాగొప్ప విలువ ఉండేది .ఎవరినీ లెక్క చేసే వారుకాదు .నిష్పక్షపాత౦గా ,ఆలోచనాత్మకం కా ,మార్గ దర్శకం గా ఉండేవి .అవన్నీ తర్వాత ‘’లోవెలుగులు ‘’పేరుతొ ముద్రణ పొంది ప్రేరణ నిచ్చాయి . రావూరుగారు ఇక్కడే ‘’వడగళ్ళు ‘’శీర్షికతో వారం వారం ధారావాహిక రాశారు .సుతిమెత్తని హాస్యం తో చమక్కులతో గిలిగింతలు పెట్టేవి అవి .వడగళ్ళ కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురు చూసేవారు .

  కృష్ణా పత్రికలో రాస్తూనే ,’’ఆనందవాణి’’ పత్రికలో ‘’కప్పు కాఫీ ‘’శీర్షికతో హాస్యపు కాఫీ అందించేవారు .’’వినోదిని ‘’పత్రికలోనూ వినోదం పంచేవారు .రెండు చేతుల తోపనిచేస్తే సవ్య సాచి అంటారు .మరి మూడు పత్రికలలో ఏకకాలం లో రాసిన రావూరు వారిని ‘’త్రిసాచి ‘’అనవచ్చా ?.సమకాలీన రాజకీయాలను కథలు కథలుగా రాసి అవి ఎవరినుద్దేశించి రాశారో వారుకూడా ఏడవ లేక నవ్వుకోనేవారట .చురుక్కు ,చమక్కు లేకుండా ఒక్క వాక్యం కూడా ఉండేదికాదు .ఇప్పుడు హాస్య బ్రహ్మ శ్రీ శంకరనారాయణ రచనా అలానే ఉంటుంది .ఇవేకాక ‘’గుడి గంటలు ‘’,మాగ్రామం ‘’,మనకవులు ,మరపు రాని బాపూజీ వంటివీ రాసి తనకు తానె సాటి అనిపించారు .

  రావూరు వారు మొదటినవల ‘’నెలవంక ‘’రాశారు .పిల్లలు లేరని కుమిలిపోతున్న ఒక నటుని జీవితం మలుపు తిరిగి ఆధ్యాత్మికత పై ధ్యాస మళ్ళిచివరికి ముక్తి పొందటం ఇందులో కథ..రావుగారు విజయవాడ ఆకాశవాణి కి నక్షత్రాలు –నాగలి ,కనిపించటం లేదు ,రిహార్సిల్స్ ,షాజహాన్ ,బిల్హణీయం మొదలైన నాటక నాటికలు రాశారు ఇవి ఎన్నో సార్లు పునః ప్రసారాలైనాయి .వారి ‘’నెలవంక ‘’కూడా చాలా సార్లు ప్రసారమై ,14 భాషలలో అనువాదం పొంది రికార్డ్ సృష్టించింది .రావూరు పేరు దేశమంతా మారు మోగింది .

  బందరు నాటక నటులు అంటే అందరికి ముందు గుర్తుకొచ్చేవారు శ్రీ డి .వి.సుబ్బారావు .నాదస్వరం అంటే గుర్తుకొచ్చేది శ్రీ దాలిపర్తి పిచ్చిహరి .ఈ మహానుభావు లిద్దరికీ రావూరు వారు బందరులో ‘’గజారోహణం ‘’చేయించి పురవీధులలో ఊరేగించి అఖండ సన్మానం చేశారు.రావూరు వారి కళాభిమానం  అంత ఉత్కృష్ట మైనది .పాతతరాన్ని ఆడరించటమే కాదు కొత్తతరాన్ని ప్రోత్సహించటానికి ‘’భాషా కుటీరం ‘’సంస్థను స్థాపించి కొత్త రచయితలతో రాయించి స్వంత ఖర్చులతో ముద్రించి ప్రోత్సహించిన విశాలహృదయులు .దీనితోపాటు బందరు లోనే ‘’చుక్కాని ‘’పత్రిక స్థాపించి కొంతకాలం నడిపారు .ఇక్కడ నుంచి రావూరు వారి జీవితం కొత్త మలుపు తిరిగింది .

  మద్రాస్ వెళ్ళారు .సినిమా రచయితగా అరంగేట్రం చేశారు .15 సినిమాలకు మాటలు ,పాటలు కూడా రాశారు .అందులో భానుమతి ,నాగేశ్వరరావు  సూర్యకాంతం సి.యేస్. ఆర్.నటించి ,భానుమతి భర్త రామకృష్ణారావు దర్శకత్వం చేసిన  భరణి వారి ‘’చక్రపాణి ‘’ సినిమా రావూరు సంభాషణా చాతుర్యంవల్లనే సూపర్ డూపర్ హిట్ అయింది .భరణీవారిదే  ‘’వరుడుకావాలి ‘’సినిమాకు మాటలు కూర్చి గొప్ప హిట్ చేశారు .సతీసక్కుబాయి.కృష్ణమాయ ,శ్రీ కృష్ణ తులాభారం సతీసావిత్రి ,చింతామణి ,నాగపంచమి ,సొంతవూరు మొదలైన చిత్రాలకు సంభాషణలు రాసి రక్తి కట్టించారు

   రావూరు ఆంద్ర ప్రభ  సచిత్ర వార పత్రికకు ఇంచార్జ్ గా ,దినపత్రికకు సబ్ ఎడిటర్ గా ,హైదరాబాద్ లో స్పెషల్ కు కరస్పా౦డెంట్ గా వివిధ హోదాలలో పని చేసి తమ సమర్ధత నిరూపించారు .ఆంద్ర ప్రభ దినపత్రికకు గొప్ప క్రేజ్ తెచ్చింది రావూరు రాసిన ‘’ఆషామాషీ ‘’దాదాపు పదేళ్ళు నిర్వహించారు .1947 స్వాతంత్ర్య దినోత్సవాలకు రావూరువారిని సాంస్కృతిక కార్య దర్శిని చేశారు .ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు  విద్యామంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు గార్ల ఆధ్వర్యం లో జరిగిన శ్రీ మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో శ్రీ రావూరు వారిని ఘనంగా సత్కరించారు .1978 లో ‘’కళాప్రపూర్ణ ‘’సత్కారం అందుకున్నారు .తరతరాలుగా నిలిచిపోయే రచన ఒకటి రావూరు వారు రచించారు .అదే ‘’వంద చందమామలు ‘’అందులో ఆంధ్రరాష్ట్రం లో అన్ని రంగాలలో విశిస్టులైన వందమంది ప్రముఖుల గురించి  జీవిత చిత్రణమే ఇది  దీనికి మనమంతా రావూరువారికి రుణపడి ఉంటా౦. .

  ఆధారం –రావూరు వారి కుమార్తె శ్రీమతి జ్ఞాన ప్రసూన వ్రాసిన వ్యాసం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-9-18 –ఉయ్యూరు

— image.png

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అరణ్యాలలో మహర్షులు దర్శించిన -ఆరణ్యకాలు

అరణ్యాలలో మహర్షులు దర్శించిన -ఆరణ్యకాలు

ఏకాంత వాసం లో దీర్ఘ తపస్సులో అరణ్యవాసం లో మహర్షులు దర్శించినవి లేక ఆరాటంలో పుట్టినవి ఆరణ్యకాలు .ఇవి కర్మకాండలగురించి, వ్రతాలు ,ప్రవర్గ్యలు గురించి తెలియ జేస్తాయి .ఆరణ్యకాలు కర్మకాండ కు సంబంధించినవైతే ఉపనిషత్ లుజ్ఞానకాండకు సంబంధినవి .వేద మంత్ర భాగాలను సంహితాలని, వాటి వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలని ,,వాటిలోని  కర్మకాండను తెలియజేసేవి ఆరణ్యకాలని, వేదాలలోని జ్ఞానభాగాన్ని చెప్పేవి ఉపనిషత్లు లేక  వేదాంగాలని అంటారు.

ఆరణ్యకాలు కూడా వివిధ ఋషుల పేర్లతో పిలువ బడుతున్నాయి .ఋగ్వేదానికి ఐతరేయ ఆరణ్యకం, కౌశిక ఆరణ్యకాలు -యజుర్వేదానికి తైత్తిరీయ ఆరణ్యకం, మైత్రాయణీయ ఆరణ్యకం,కేదారణ్యకం ,బృహదారణ్యకం  సామవేదానికి తలవకారఆరణ్యకం ,ఆరణ్యక సంహిత ,అధర్వ వేదానికి ఆరణ్యకం ఆలభ్యం

ఐతరేయాఅరణ్యకం 5 అధ్యాయాలు మొదటి రెండిటిలోప్రాణ విద్య ఉంటుంది 3 లో సంహితోపనిషత్ లో స్వర చర్చ  4 ,5 ల లో మంత్రాల సాంకేతిక వివరణ ఉంటుంది దీన్ని మహానామ్ని  అంటారు

తైత్తిరీయ ఆరణ్యకం లో 10 భాగాలు .మొదటి దానిని  ‘కథాకాని ‘’అంటారు .అగ్ని ఛయన కాండ ఉంటుంది  2వది మహాయజ్ఞ నిర్వహణ విధానం మిగిలినవి మంత్రం తంత్ర సాంకేతిక వివరాలు.

కథారణ్యకం -తైత్తిరీయమే .సాంఖ్యాయన ఆరణ్యకం లో 15 అధ్యాయాలు . ,2 అధ్యాయాలు మహా వ్రతాన్ని 3నుంచి 6 కౌశిక ఉపనిషత్ ను ,7,8 సంహితోపనిషత్ ,9 ప్రాణ విశిష్టత ,10 అగ్నిహోత్ర విధి 11 అంత్య సంస్కారం 12 ప్రార్ధన ఫలితాలు13 శ్రవణ మనన నిధి ధ్యాస వివరణ 14 అహం బ్రహ్మాస్మి వివరణ 15 బ్రహ్మ నుంచి గుణ సాంఖ్యాన వరకు గురు స్తుతి ఉంటాయి .బృహదారణ్యకం బృహదారణ్యక ఉపనిషత్ ను ,ముఖ్యంగా ‘’పర్వాగ్య ‘’కర్మ కాండను గురించి వివరిస్తుంది.ఆరణ్యకాలను ‘’రహస్య బ్రాహ్మణాలు ‘’అన్నారని నిరుక్తానికి వ్యాఖ్యానం రాసిన దుర్గా చార్య అన్నాడు.

ప్రాచీన కాలంలో వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకోవాలంటే ఒకే ఒక వేదరాశిగా ఉన్న వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిపి నేర్చుకునేవారు. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి మొత్తం వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టముగా ఉండేది. భగవానుని అంశ అయిన వేదవ్యాసుడు ఈ వేదరాశిని విడివిడిగా ఋగ్వేదముయజుర్వేదముసామవేదము మరియు అధర్వణవేదము అను నాలుగు భాగములుగా విభజించాడు. వేదాలలో సంహితలు మూలగంథాలు. వీటికి వ్యాఖానాలు బ్రాహ్మాణాలు అవతరించాయి. బ్రాహ్మాణాలలోని ఒక భాగంగానే అరణ్యకం ఆవిర్భవించింది.

అరణ్యకములు

అరణ్యకములు అనగా అడవులకు సంబంధించిన విషయాలు. వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణములకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. కాని వీటిలో కర్మలయొక్క భౌతిక భాగం ఉండదు. కర్మలవెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి ఆరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. ప్రతి సంహితలు బ్రాహ్మణాలున్నట్లే అరణ్యకాలు కూడా ఉండేవి. కాలాలు గడిచే కొద్దీ ప్రజల నిరాదరణకు బలై చాలా వరకు నశించి పోయాయి. అథర్వవేదానికి చెందిన గోపథబ్రాహ్మణం అనే బ్రాహ్మణానికి సంబంధించిన అరణ్యకం లేకపోవడము ఇందుకు తార్కాణం.

అరణ్యకాలు అంటే ఏమిటి ?

వేదములలో సంహితలు మహర్షులు దర్శించినవి కావున ఇవి మూలగ్రంథాలు. బ్రాహ్మణాలనేవి సంహితలకు వ్యాఖ్యాన రూపాలు. వేద రాశిలో సంహితలుబ్రాహ్మణాలువరుసగా ఒకటి, రెండు స్థానములు కాగా అరణ్యకాలు మూడవ స్థానమును పొందినవి. అరణ్యకాలు అంటే అనేకమంది ద్వారా ఈ క్రింది విధముగా అనేక అర్థాలు ప్రతిపాదించబడినవి.

  1. అరణ్యంలో దీక్షతో అథ్యయనము చేసిన గ్రంథాలే అరణ్యకాలు.
  2. గృహస్థాశ్రమము వదలి సన్యాసము లేదా సన్యసించుట వలన అరణ్యాలకు వెళ్ళి ప్రశాంత వాతావరణములో తపదీక్షతో వేదాధ్యయనము చేయటకు కావలసిన గ్రంథాలే అరణ్యకాలు.
  3. కర్మఫలంతో పాటు జ్ఞానం సంపాదించు మేలు కలయిక అరణ్యకాలు.
  4. యజ్ఞాలలోని రహస్యాలను అరణ్యాలలోనే మహర్షులు చర్చించారు.
  5. బ్రాహ్మణము లలో ఉండే గృహస్థాశ్రమ కర్మకాండలు, జ్ఞానం మాత్రము ప్రధానముగా ఉండే ఉపనిషత్తు ల మేలు కలయికయే అరణ్యకాలు.
  6. అరణ్యములలో మాత్రమే ఆచరించవలసినవి కావున అరణ్యకాలు.
  7. వేదాల సారమే అరణ్యకాలు.

అరణ్యకాలు – సంహితలు

వేద విభాగానికి చెందిన సంహితలు మంత్రములతో కూడినవే మునుముందు వేదం అనుకునేవారు. తదుపరి కాలాములో మంత్రముతో పాటు వ్యాఖ్యాన రూపాలైన బ్రాహ్మణాలు కూడా కలిపిందే “వేదం” అని ఇంకొందరు అభిప్రాయ పడ్డారు. అరణ్యకాలు మాటేమిటి ? ఇవి కూడా కర్మభాగంతో పాటుగా జ్ఞాన మార్గమునకు చెందిన ఉపనిషత్తులు కలిగి ఉండుటచే వేదమని పిలువ కూడదని కొందరి అభిప్రాయము. అందుకు కారణము వేదాంతమే ఉపనిషత్తులు అని వ్యవహరించారు.

నిర్మాణ విషయం లో ఆరణ్యకాలు వాటిలోని విషయాలను బట్టి చాలా భేదం గా కనిపిస్తాయి  కొన్నిటిలో సంహితభాగం కలిసిఉంటే మరికొన్నిటిలో బ్రాహ్మణభాగం కలిసి ఉంటాయి .మిగిలినవాటిలో సూత్రాలతో కలసి ఉంటాయి .చాలా ఆరణ్య  కాలలోమంత్ర వివరణ ,పదాల వ్యుత్పత్తి ,వాటి గుర్తింపు ,చర్చలు , పురాణగాధలు ,ప్రతీకాత్మక లేక సాంకేతిక వివరణలు ,అరుణ కేతు లాంటి ఋషుల లోతైన వేదా౦త భావనలతో నిండిన మంత్రాలు ఉన్నాయి .

ముఖ్యంగా ఆరణ్యకాలు భాష  శైలి లలో బ్రాహ్మణాలులాగా యజ్ఞయాగాది క్రతు విధానంపై చర్చించాయి.కనుక వీటిని నిర్దుష్టంగా చేసే విధానాలపై దృష్టి పెట్టాయి .వేదపాఠ్య ప్రణాళిక లో కొన్ని యజ్ఞాల విషయం లోమాత్రమే ఆరణ్యకాలు నిబంధి౦పబడినాయి  .వేద శాఖల పేర్లతో ఆరణ్యకాలు పిలువబడి నాయి . వివరాలు మొదట్లోనే పైన తెలియజేయబడినాయి .అయినా మరొక్కమారు తెలుసుకొందాం –ఋగ్వేద సంహితకు ఐతరేయ శాఖ కు చెందిన ఐతరేయ ఆరణ్యకం ,కౌశికి ,సాంఖ్యాయన శాఖలకు ‘’కౌశీతకి ఆరణ్యకం’’ఉన్నాయి .కృష్ణ యజుర్వేద సంహితకు తైత్తిరీయ శాఖకు చెందిన తైత్తిరీయ ఆరణ్యకం ,మైత్రాయన శాఖకు మైత్రాయారణ్యకం,చరక లేక కథా శాఖకు కథారణ్యకం  ఉంటే, శుక్ల యజుర్వేద సంహితకు కాణ్వ ,మాధ్యందిన శాఖలకు బృహదారణ్యకం ఉన్నది .మధ్య౦దినం 9 భాగాలలో చివరి 6 భాగాలు బృహదారణ్యక ఉపనిషత్ లోనివే .సామవేదానికి జైమినేయశాఖకు తలవకార ఆరణ్యకం లేక జైమిని ఉపనిషత్ బ్రాహ్మణం ఉంది .ఆరణ్యక సంహిత విలక్షణ ఆరణ్యక గ్రంథంకాదు .సామవేద సంహితకు పూర్వార్చికం .దీనిలోని మంత్రభాగాన్ని ఆరణ్యక సంహిత అన్నారు .దీని ఆధారంగా ఆరణ్య గాన సామాలను గానం చేస్తారు .అధర్వ వేదానికి ఆరణ్యకం లభించలేదు .కాని గోపథ బ్రాహ్మణాన్నే దీని ఆరణ్యకం గా భావిస్తారు .

ఐతరేయ ఆరణ్యకం –లో 5 అధ్యాయాలున్నాయి .ఏ అధ్యాయానికి ఆ అధ్యాయాన్నే ఆరణ్యకం అని పిలుస్తారు .మొదటిభాగం ‘’మహావ్రతం ‘’గురించి వివరిస్తుంది .దీనిలో కర్మకా౦డతోపాటు ఊహాత్మక వివరణా ఉంటుంది .రెండవ  దానిలో 6 అధ్యాయాలున్నాయి .అందులో మొదటి మూడిటిలో ‘’ప్రాణవిద్య ‘’గురించిన అన్ని వివరాలు ఉన్నాయి .ఇదే అన్ని మంత్రాలకు ముఖ్య ఆధారం .ఇందులోనే అగ్ని హోత్రునికి సూర్య ,వాయువులకు  ఆహుతులు వేసే విధి విధానం ఉంది .వేద మంత్ర విధిని అతిక్రమించినా ,లోపం చేసినా అత్యల్ప జీవులైన పక్షులు ,పాకే జంతువుల  జన్మ లభిస్తుందని తెలియ జేసింది .రెండవభాగం లోని 4, 5 ,6  అధ్యాయాలనే ఐతరేయ ఉపనిషత్ అంటారు .మూడవ భాగానికి సంహితోపనిషత్ అని  పేరుంది .ఇది పద పాఠం ,క్రమపాఠ౦ ,జటపాఠం మొదలైనవి వివరిస్తుంది .అంటే వేదాన్ని ఎలా ఉదాత్త అనుదాత్తాలతో నేర్వాలో తెలియ జేస్తుంది .స్వరాలలో ఉన్న స్వల్ప భేదాలనూ సవివరంగా చర్చించి చెబుతుంది .ఇందులోని నాలుగు అయిదు ఆరణ్యకాలు అంటే భాగాలు మంత్రాల సాంకేతికత పై విపులంగా వివరిస్తుంది .దీనికి ‘’మహానామ్ని ‘’అనిపేరు .దీనికి సంబంధించిన యజ్ఞం మధ్యందిన యజ్ఞం .

తైత్తిరీయ ఆరణ్యకం –ఇందులో 10 అధ్యాయాలు .మొదటి6 ను సరైన ఆరణ్యకం అన్నారు .ఇందులో నిమొదటి రెండు అధ్యాయాలు ‘’అష్టౌ కాథకాని’’అంటారు.అంటే కాథకంలోని 8 అధ్యాయలు అని అర్ధం .ఇవి అసలు తైత్తిరీయ శాఖకు చెందినవికావు అనిభావం .వీటిని కాథక శాఖనుంచి అరువు తెచ్చుకొన్నారు .ఇవన్నీ వేదం లోని అగ్నిచయనం గురించి విపులంగా చెప్పేవే .

మొదటి అధ్యాయం వేదం లో చివర వచ్చినది .ఇందులో పురాణ పురుషుల పేర్లున్నందున అలా భావించాల్సి వచ్చింది .అగ్ని హోత్ర వేదిక నిర్మాణానికి ఇటుకలను పేర్చే విధానం ‘’ఆరుణ ప్రశ్న’’ఉండటం వలన సూర్యనమస్కారాలు చేసే విధానం ఉన్నందున ఆ పేరు వచ్చింది .రెండవ అధ్యాయం ప్రతి బ్రాహ్మణుడు ఆచరించాల్సిన పంచ మహాయజ్ఞాల వివరణ .వేద స్వాధ్యాయనం,యజ్ఞోపవీత ధారణ ,సంధ్యావందనం ,బ్రహ్మ యజ్ఞం ,పితృ యజ్ఞం ,కూష్మాండ హోమం (యజ్న వేదికను శుభ్ర పరచటం )గురించి విస్తృత వర్ణన . ఇందులోనే ‘’శర్మణ’’అనే పదం ప్రయోగింపబడింది .ఈపదాన్ని బౌద్ధ, జైనులు ఆతర్వాత వాడుకొన్నారు .3వ అధ్యాయం అనేక హోమాలు యజ్ఞాల సాంకేతిక వివరాలు తెలియ జేసింది .4 వఅద్యాయం శ్రౌత కర్మకాండలో ప్రవర్గ్య కు చెందిన మంత్రాలు  న్నాయి .దీనిలో అత్యధిక ఉష్ణోగ్రతలో ప్రత్యేకమైన మట్టిపాత్రలో పూర్తిగా పాలుని౦పి ,ఎర్రగా పాత్ర కాలేదాకా మరగించటం ఉంటుంది కనుక ఇది ప్రమాద హేతువుగా భావిస్తారు .ప్రవర్గ్య అంటే అగ్నిస్టోమం లో తాజా పాలను మహావిర లేక ఘర్మ అనే మట్టిపాత్రలో అత్యధిక ఉష్ణోగ్రతలో వేడి చేయటం .ఈ పాలను అశ్వినీ దేవతలకు నైవేద్యంగా పెడతారు .ఇదికూడా కథాశాఖ విదానంగానే ఉంటుంది .5 వ అధ్యాయం లో ప్రవర్గ్య యజ్న విధానం వచనం లో చెప్పబడింది .దీన్ని బ్రాహ్మణ శైలి అంటారు ఇదీ కథా శాఖ విధానాన్ని పోలి ఉంటుంది .6 వ అధ్యాయం పితృమేదానికి సంబంధించింది .అంటే దహన సంస్కార మంత్రాలున్నాయని అర్ధం .7,8,9 అధ్యాయాలు తైత్తిరీయ ఉపనిషత్ లోని 1-శిక్ష 2-ఆనంద 3- భ్రుగు అనే మూడు వల్లి లు .10 అధ్యాయం ను ‘’మహారణ్య ఉపనిషత్ ‘’అంటారు .ఇందులో మూడు సంహితలలోని మ౦త్రాలు ఉన్నాయి .

కథారణ్యకం –ఇది తైత్తిరీయ౦కు సమాంతరంగా ఉంటుంది .ఇందులో కొద్దిభాగం మాత్రమే భద్ర పరచబడింది .అదికూడా కాశ్మీర దేశం లో భూర్జర పత్రాలలో నిక్షిప్తమైంది .ఈమధ్యనే దీన్ని కూర్చి ముద్రించారు .అనువాదమూ ఉంది .

శాంఖ్యయన ఆరణ్యకాలు –ఇది 15 అధ్యాయాలు .మొదటి రెండు అధ్యాయాలు మహావ్రతం గురించి చెప్పబడింది . ౩ నుంచి 6 వరకు ఉన్నదాన్ని ‘’కౌషితకి ఉపనిషత్ ‘’అంటారు .7,8 సంహితోపనిషత్ .9 ప్రాణం గొప్పతనం వివరిస్తుంది .10 వ అధ్యాయం అగ్ని హోత్ర విధివిధాన వివరణ .మానవ శరీరం లో అంటే పురుషునిలో అగ్ని వాచకం లో ,వాయువు ప్రాణం లో ,సూర్యుడు కళ్ళల్లో ,చంద్రుడు మనసులో ,దిశలు చెవులలో  నీరు శక్తిలో ఉన్నాయని తెలియ జేసింది .ఈ ఆరణ్యకం అర్ధం చేసుకున్నవారికి దేవతలందరి అనుగ్రహంకలిగి ఇచ్చిన హవిస్సులు అందుకొని  తినటం నడవటం మాట్లాడటం ఆలోచించటం దానం చేయటం మొదలైన వాటికి సర్వ సమర్ధత లభిస్తుందని తెలిపింది .11వ అధ్యాయ౦ అనారోగ్యం, మృత్యువు  లను ఎదుర్కొనే పరిష్కారాలు సూచిస్తూ ,కలల ప్రభావాలను చర్చించింది .12 లో ప్రార్ధన ఫలితాల వివరాలున్నాయి .13 లో విశేషమైన తత్వ చర్చ ఉండి,మానవులు ప్రాకృతిక ,శారీరక బంధాలను విసర్జించి  శ్రవణ ,మనన ,నిధిధ్యాస లను అలవరచుకొని ,జపతపాలతో ,ఆత్మనిగ్రహం ,,విశ్వాసం లతో జీవించాలని చెప్పింది .14 వ అధ్యాయం లో రెండే రెండు మంత్రాలున్నాయి .అవి 1-అహం బ్రహ్మాస్మి –ఇదే సకల వేదసారం 2-వ మంత్రం ‘’మంత్రార్ధం తెలియకుండా వేదమంత్రాలను వల్లె వేసినవాడు తాను మోసే బరువు విలువ తెలియని జంతువు వంటి వాడు ‘’అని చెప్పే మంత్రం .

15 వ అద్యాయం బ్రహ్మ నుంచి గుణ సంఖ్యా యనుడి వరకు గురుపరంపర వర్ణన విపులంగా ఉన్నది .

బృహదారణ్యకం –శుక్ల యజుర్వేద బ్రాహ్మణం లో శత పథ బ్రాహ్మణం కు చెందిన ఆరణ్యకం బృహదారణ్యకం .మాధ్యందిన శాఖ కు చెందినది .తైత్తిరీయ ,కథారణ్య కాల లాగానే ఇది ప్రవర్గ్య కర్మకాండను గురించి విపులంగా చర్చించింది .బృహదారణ్య ఉపనిషత్ ను అనుసరించింది .

రహస్య బ్రాహ్మణాలు –ఆరణ్యకాలు బ్రాహ్మణాల కొనసాగింపే .బ్రాహ్మణాలలో చెప్పబడని రహస్య కర్మకాండల గురించి చర్చించటం వలన రహస్య బ్రాహ్మణం అనే  పేరొచ్చింది.

మొత్తం మీద మనకు తెలిసి౦దేమిటి  ?ఆరణ్యకాలు ముఖ్యంగా 1- బ్రహ్మ విద్య 2-ఉపాసన ౩- ప్రాణ విద్యను బోధిస్తాయి .యజ్న యాగాదులు కర్మకా౦డలలోని  రహస్యాలను వివరిస్తాయి .మైత్రేయి –యాజ్ఞవల్క్యుల మధ్య జరిగిన చర్చలు  చిన్నకథలు,వాటి అంతరార్ధం తెలియ జెప్పుతాయి .కర్మ కాండ కు, జ్ఞానకాండకు మధ్య సేతువుగా ఉంటాయి. అంటే బ్రహ్మవిద్యకు ఉపాసనకు మధ్య అంతరాన్ని తొలగించే వంతెన లా ఉంటాయి .భౌగోళిక చారిత్రిక సాంస్కృతిక విశేషాను తేటతెల్లంగా వివరిస్తాయి .

మనవి –బ్రాహ్మణాలు గురించి రాసిన చాలాకాలానికి మనోరణ్యం లో చిక్కుకున్న ఆరణ్య కాల గురించి ఇవాళ రాయటానికి ముఖ్య కారకులు శ్రీ సింగపూర్ శ్రీధర్ . ఆయన ఫోన్ చేసి అడగక పొతే ఇప్పుడప్పుడే రాసి ఉండేవాడిని కానేమో !ఆయన ప్రేరణే ఇవాళ ఉదయం  9-30 నుంచి మధ్యాహ్నం 1-30 వరకు  కదలకుండా కూర్చుని దాదాపు నాలుగు గంటలు రాసి పూర్తి  చేశాను .కనుక ఈ ఆరణ్యకాలు శ్రీ సింగపూర్ శ్రీధర్ గారికి అంకితస్తే సముచితమని భావించి ఆయన అనుమతిలేకుండానే అంకిత మిస్తున్నాను  –దుర్గాప్రసాద్

ఆధారం –ఇంగ్లిష్ ,తెలుగు వీకీ పీడియా.ఇంతకు మించిన వివరాలు నాకు దొరకలేదు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-18 –ఉయ్యూరు

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -5

శ్రీ యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -5

28 నుంచి 31 వరకు ఉన్న 4 అధ్యాయాలలో యజుర్గణనం మొదట్లో చూపిన అధ్యావస్థ విషయాలకే సంబంధించింది .కనుక తగిన చోట్ల ఉపయోగిస్తారు .32 నుంచి 39 వరకు 8 అధ్యాయాలలో పురుష మేధం ,సర్వ మేధం, పితృ మేధం ,ప్రవర్గ్యం మొదలైన వి కొత్తవి అని  కొందరి భావన .కాని దీనికి విలువలేదు .40 వ అధ్యాయం లో ఈశా వాస్యం ఉన్నది .దీనికి ముందున్న అధ్యాయాలలో కర్మ గురించి చెప్పి ఇప్పుడు దీనిలో బ్రహ్మాన్ని గురించి చెప్పటం చేత ఇది ఉపనిషత్తు అని పిలువబడి ‘’ఈశావాస్యోపనిషత్’’ అయింది .సంహిత లో యే వేదం లోను బ్రహ్మ విద్యను  తెలిపే భాగం లేదు .ఇలా ఒక అరుదైన విషయం వాజసనేయ సంహిత లోనే ఉంది .కనుక’’ వాజసనేయ సంహితోపనిషత్’’ అయింది .అందుకే ఉపనిషత్తు లన్నిట్లో ప్రధమ స్థానం పొందింది .దీని ప్రత్యేకత ఏమిటి ?ఇందులో కర్మ విషయాన్ని, బ్రహ్మ విషయాన్ని సాకల్యంగా చర్చించి బ్రహ్మ విషయమే శ్రేష్టం అని నిక్కచ్చిగా న్యాయాధికారిగా తీర్పు చెప్పింది .జగత్తు అంతా పరబ్రహ్మం చేత వ్యాప్తమై౦దని ,బ్రహ్మం లేనిది జగత్తు లో ఏదీ లేనే లేదని చెప్పింది. కనుక మమత్వం అంటే నాది నీది అనే భేదభావం ,లేకుండా సర్వం బ్రహ్మమయం అని భావించి భజించాలి అని నిష్కర్షగా తెలియ జేసింది .కనుక ఇందులోని మొదటి మంత్రమే సర్వోత్క్రు స్టం.

  రెండవ మంత్రం ‘’కుర్వాన్నే వేహ కర్మాణి ‘’లో ఒక వేళ సన్య సించినా,మనో వాక్కాయ కర్మలతో విషయాల క్రియలను మానేసి ముఖ్యమైన ఆత్మ చి౦తనాన్నిచేయ లేకపోతె ,బ్రతికి ఉన్నంతకాలం ఏ రోజూ మానకుండా సంధ్యావందనం మొదలైన విహిత కర్మలు మాత్రం చేస్తూ ఉండాల్సిందే .మూడవమంత్రం కామ్య కర్మలు సంసార బద్ధుని చేస్తాయి కాని ,పరబ్రహ్మార్పణం గా,జ్ఞానం కోసం  చేసే కర్మలు మనలను అంటవు అని బోధించింది .మిగిలిన 16 మంత్రాలు మొదటి మూడు మంత్రాల పరిపూర్ణమైన వివరణ మాత్రమే  .

     17 వ కాండ సంహితలో చివరది అయిన 40 వ అధ్యాయం కూడా బ్రహ్మ విద్యనే బోధిస్తుంది కనుక దీనికి ‘’బృహదారణ్యకోపనిషత్ ‘’అన్నారు .దీనిలో బ్రహ్మవిద్య కరతలామలకంగా బోధి౦పబడింది అని విద్యారణ్య స్వామి శతపథ బ్రాహ్మణ వ్యాఖ్య లో తెలియ జేశారు –‘’కరామలక వద్యత్ర పరం తత్త్వం ప్రకాశితం –యా కా చిత్తాదృశీశాఖా త్వయా వ్యాఖ్యాయతామితి ‘’.సాధారణంగా సంస్కృతం లోని సంజ్ఞావాచకాలన్నీ ఏదో ఒక ధర్మాన్ని బోధించేవే .శంకర భగవత్పాద ,విద్యారణ్యమొదలైన గురు దేవులంతా ‘’ చిత్త వృత్తి నిరోధానం కోసం అరణ్యాలలో నివసించే టప్పుడు ,ముందుగా గురువులు చెప్పుకుంటూ పోతుంటే ,వెనకున్న శిష్యులు దాన్ని ఉచ్చరిస్తూ ఉన్న జ్ఞాన శాస్త్రాన్ని’’ ఆరణ్యకం ‘’అన్నారు .అంటే చిన్నతనం నుంచి ముసలితనం వరకు వివిధ విషయాలపై పరిగెత్తే మనసును  ఎప్పటికప్పుడు  వెనక్కి మరలిస్తూ ,ఆత్మచింతనం చేయాలని అర్ధం .ఇలా అరణ్యాలలో సాధన చేయకుండా ,గ్రామాలలో చేస్తే ఇంద్రియాలు, మనసు స్వాదీనంకావు  .విషయవాంఛ బలీనమై మనసును ఒక చోట నిలువ నీయదని గ్రహించాలి .బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం వేదాంత గ్రంథాలను అధ్యయనం చేయాలని ,అలాంటి ఆరణ్యకాలే వేదాలకు ముఖ్యమైనవి అని మహా భారతం చెప్పింది –

‘’భారతస్య వపుర్హే తత్సత్యం చామృత మేవచ –నవనీతం యదాదధ్య్నో  ద్విపదాం బ్రాహ్మణో యధా

‘’ఆరణ్యకం చ వేదేభ్య శ్చౌషధిభ్యోమృతం యధా –హ్రదానాముదధిః శ్రేష్టో గౌర్తరిస్ఠోచతుష్పదాం ‘’.ఋగ్వేదానికి  ఐతరేయ శాఖా రణ్య కాలు ,కృష్ణ యజుర్వేదానికి తైత్తిరీయారణ్యకాలు , శుక్ల యజుర్వేదానికి బృహదారణ్యకాలు ఉన్నాయి ’.వీటిలో పరిమాణం లో,అర్ధ గౌరవం లో శుక్ల యజుర్వేద ఆరణ్యకం పెద్దది కనుక ‘’బృహదారణ్యకం ‘’అనే పేరొచ్చింది అనిదీనికి వ్యాఖ్యానం రాస్తూ  ఆది శంకరాచార్యాదులు తెలియ జేశారు .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-9-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

శ్రీ యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -4

శ్రీ యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -4

తాను పొందిన శుక్ల యజుర్వేద వ్యాప్తి కోసం యాజ్నవల్క్య మహర్షి గంగాతీరాన ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఉన్నాడు .ఒక రోజు కణ్వుడు అనే ఋషి పుత్రుడు వచ్చి పాదాలపై వ్రాలి ‘’మహాత్మా !శాకల్యుడి వంటి వాళ్ళు తప్ప మిమ్మల్ని పొగడని వారుండరు లోకం లో .మీకు తెలియని విద్య లేదు .నేను మీకు ముఖ్య శిష్యుడుగా ఉండాలనే ఆశతో వచ్చాను .నన్ను సర్వాదికారిని చేస్తే మహదానంద పడతాను .’’అన్నాడు వినయంగా .అప్పుడాయన ‘’భాస్కరాశీర్వాదం తో పొందిన శుద్ధ యజుర్వేజం లోని ముఖ్యభాగాన్ని నీకే బోధిస్తాను .దీనివలన లోకం లోని అన్ని వేదాలకంటే నీకు నేను చెప్పినదే మొదటి స్థానం లో ఉంటుంది .అదే లోకం లో ‘’ప్రధమ శాఖ ‘’అని,  కాణ్వ శాఖ అని ప్రసిద్ధి చెందుతుంది .అనగానే అతడు ‘’మీ అనుగ్రహం తో నేను అందరికంటే ఆదధిక్యుడు అనే కీర్తి పొందుతాను ‘’అన్నాడు .వెంటనే యాజ్న వల్క్యుడు ‘’వత్సా !నీవొక్కడివే గొప్ప వాడివి అవటం కాదు ,నీకు చెప్పేవేదం చదివి ,అందులోని అర్ధాదులను గ్రహించి నీ శిష్య పర౦పర కూడా గొప్పవారవ్వాలి .లోకం లో మంచి విషయాన్ని గ్రహించినవారంతా అధికులే’’అని ఆశీర్వదించి అన్ని విషయాలతో పరిపూర్ణంగా ఉన్న ప్రదానభాగాన్ని అంతటినీ కణ్వుడి కి బోధించి చదివించాడు  .ఈ కాణ్వ సంహిత లోని పూర్వ భాగానికి సాయనాచార్యుడు ‘’వేదార్ధ ప్రకాశం ‘’అనే భాష్యాన్ని ,ఉత్తర భాగానికి నాగ దేవభట్టు కుమారుడు అనంతా చార్యుడు ‘’వేదభావార్ధ దీపిక ‘’భాష్యాన్ని ,జాత వేద ఉపాధ్యాయుడి కొడుకు శ్రీ మదానంద బోధ భట్టో పాద్యాయుడు ‘’కాణ్వ వేదమంత్ర భాష్య సంగ్రహం ‘’రచించారు .

కాణ్వీయ సంహిత లోని మొదటి అధ్యాయం నుంచి 27 వ అధ్యాయం వరకు ఉన్న దానిలో దర్శ పూర్ణ మాసలు  మొదలు అశ్వమేధం చివరవరకు అన్ని క్రతువులు ఉన్నాయి .21 నుంచి 27 వరకున్న అధ్యాయాలు మొదటి 20 అధ్యాయాలలోని విషయాలే అన్న పాశ్చాత్య పండితుల అభిప్రాయం సరై౦ది కాదంటారు  .28 నుండి 35  వరకు ఉన్న8  అధ్యాయాలు’’ ఖిలం ‘’అని అంటారు .వీటికి శ్రౌత వినియోగాన్ని కాత్యాయనుడు చెప్పలేదు .అయితే వాటిని ఎందుకు ఉంచారు అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం వాటిలో విశేషాలు ఉండటం ,బ్రహ్మ యజ్ఞం మొదలైన వాటిలో వాటి అవసరం ఉ౦దికనుక .కానీ అవి ఏదో ఒక క్రతువు గూర్చి మాత్రం చెప్పలేదు .36 నుండి 40 వరకు 5 అధ్యాయాలను ‘’శుక్రియములు ‘’అంటారు వాటిని పగలు మాత్రమే ఉచ్చరించాలి, కాని రాత్రి వేళ కాదు బ్రాహ్మణాలలో  .వీటికి ‘’ఆరణ్యకాలు’’ అనే పేరుకూడా ఉంది .కారణం ఇవిబ్రాహ్మణాలలోని,ఆరణ్యాక భాగం లో వ్యాఖ్యానం చేయబడ్డాయి  .కనుక అరణ్యాలలో నే కాని, గ్రామాలలో  వాటిని పఠించ రాదు .శుక్రియ భాగం తప్ప మిగిలిన వేదభాగాలన్నిటిని గ్రామ౦ లోనైనా, అరణ్యం లోనైనా చదువ వచ్చు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనకు తెలియని శ్రీ కృష్ణ సంతాన లీలలు  

మనకు తెలియని శ్రీ కృష్ణ సంతాన లీలలు

శ్రీ కృష్ణుడికి పదహారు వేల ఎనిమిది మంది భార్యలున్నారని లోకం లో ప్రచారంగా ఉంది.వీరిలో అసలు భార్యలు ఎంతమంది?వాళ్ళే అష్టభార్యలు –రుక్మిణి ,సత్యభామ ,జాంబవతి ,కాళింది ,మిత్రవింద ,నాగ్నజితి ,భద్ర ,లక్ష్మణ అని భాగవత పురాణం పేర్కొన్నది .మరి వీరి సంతానం  సంగతేమిటి ?ఈ ఎనిమిది మందికి 80 మంది కొడుకులనుకన్నాడు కన్నయ్య .అందులో

1-రుక్మిణీ-కృష్ణు ల కుమారులు 10 మంది.-1-ప్రద్యుమ్న 2-చారు దేష్ణ 3-సుధేష్ణ 4-చారు దేహ 5-సుచరు 6-చారు గుప్త 7-భద్ర చారు 8-చారు చంద్ర 9-విచారు 10-చారు .

2-  సత్యవతీ –కృష్ణుల కొడుకులు 10 మంది -1-భాను 2- సుభాను 3-స్వభాను 4-ప్రభాను 5-భానుమాన్ 6-చంద్రభాను 7-బృహద్భాను 8-అతిభాను 9-శ్రీభాను 10-ప్రతిభాను .

3-జాంబవతీ –కృష్ణుల పుత్రులు 10- మంది -1-సాంబ 2-సుమిత్ర 3-పురుజిత్ 4-శత్రజిత్ 5-సహస్ర జిత్ 6-విజయ 7-చిత్రకేతు 8-వసుమాన్ 9-ద్రవిణ్ 10-కృతు .

4-నాగ్నజిత్ –కృష్ణుల మగసంతానం – 10 మంది- 1- వీర 2- చంద్ర 3-అశ్వసేన 4- చిత్రగు 5-వేగవాన్ 6-వృష 7-ఆమ్ 8-శంకు 9-వాసు 10-కుంతి

5-కాళిందీ-కృష్ణుల  కుమారులు 10 మంది -1-శ్రుత్ 2-కవి 3-వృష 4-వీర 5-సుబాహు 6-భద్ర 7-శాంతి 8-దర్ష 9-పూర్ణమస్10-సోమక్ .

6-లక్ష్మణ –కృష్ణుల కొడుకులు -10 మంది -1-ప్రబోధ 2-గాత్రవాన్ 3-సింహ 4- బల 5-ప్రబల 6-ఊర్ధ్వగ 7-మహా శక్తి 8-సహ 9-ఓజ 10-అపరాజిత్ .

7-మిత్రవింద –కృష్ణుల పురుష సంతానం 10 మంది -1-వృక్ 2-హర్ష 3-అనిల 4- దృఢ 5-వర్ధన 6-అన్నాద 7-మహష్ 8-పావన్ 9-వహ్ని 10-క్షుధి.

8-భద్ర –కృష్ణుల సంతానం 10 మంది-1-సంగ్రామజిత్ 2-బృహత్సేన 3-శూర 4-ప్రహరణ 5-అరిజిత్ 6-జయ 7-సుభద్ర 8-వామ 9-ఆయు 10-సాత్యకి .

అస్టభార్యలకు  సమాన సంఖ్య లోనే పుత్రులను ప్రసాదించాడు పరమాత్మ శ్రీ కృష్ణుడు .

వీరిలో అందరూ తండ్రికున్న పేరు,ప్రఖ్యాతులున్న వాళ్ళు కాక పోవటం విచిత్రం .జాంబవతి కుమారుడు సాంబుడికిమాత్రం  ఒక ప్రత్యేకత ఉన్నది .మహాభారతం లో చిన్నపాత్ర పోషించటమే కాక ,చివరలో యాదవ వంశ వినాశనానికీ కారకుడయ్యాడు .సాంబుడు ముమ్మూర్తులా తండ్రి శ్రీకృష్ణుని పోలి ఉంటాడని అందరూ అంటున్నా ,కృష్ణుడు మాత్రం సాంబుడు అన్ని విధాలా తన ఆరాధ్యదైవం పరమేశ్వరుడైన సాంబ శివుని పోలి ఉంటాడని భావించాడు .

ఆధారం –పల్లవీ ఠాకూర్ రచన –‘’ది అన్ నొన్ అండ్ అన్ టోల్డ్ స్టోరీస్ ఆఫ్ కృష్ణాస్ సన్స్ ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-9-18 –ఉయ్యూరు


 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

సింగపూర్ నుంచి శ్రీ శశిధర్ ఫోన్

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఈ రోజు మధ్యాహ్నం 2- 30 కి సింగపూర్ నుంచి శ్రీ శశిధర్ (శశికుమార్ )ఫోన్ చేసి ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు .ఆయన తెలంగాణా కరీం నగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి .మన సరసభారతి బ్లాగులను గత మూడేళ్లు గా రెగ్యులర్ చదువుతున్నాననీ ,చాలా ఆసక్తికరంగా ,ఉత్తేజంగా విషయాలు రాస్తున్నానని తాను చదవటమే కాక అందులోని విషయాలను తన స్వరంతో రికార్డ్ చేసి తన బంధువులకు స్నేహితులకు పంపుతూంటానని చెప్పారు . కోనసీమ” ఆహితాగ్నులు” గురించి రాసిన 12 ఎపిసోడ్ లు అత్యంత గొప్పగా ఉన్నాయన్నారు .ఎవరూ ఎక్కడా రాయని విషయాలు ఉన్నాయని సంతోషించారు . మళ్ళీ ఎప్పుడు మొదలు పెట్టి రాస్తారా అని తాను ,బంధువులు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు . త్వరలోనే రాస్తానని అంతటి ఆసక్తి చూపిన వారిని నిరాశ పరచననీ చెప్పాను నర్మదానది గురించి అక్కడి ఓంకార క్షేత్రం గురించి రాసింది ముచ్చటగాఉంది మొదటిసారిగా ఎన్నో విషయాలు తెలుసుకున్నామన్నారు . గీర్వాణకవుల మూడు భాగాలు శిరోధార్యాలన్నట్లు గా ఉన్నాయని సంతోషించారు . ఇప్పుడు రాస్తున్న యాజ్ఞ వల్క్య చరిత్ర ఆసక్తికరంగా ఉంటోందని తాను సద్గురు శివానందమూర్తిగారు మనమహర్షులపై రాసిన రెండు భాగాలపుస్తకం అత్య౦తాసక్తిగా చదివి దాచు కొన్నానని అయన తన సంస్కారాన్ని తెలియ జేసినందుకు ఆన౦దపడ్డాను .
.సుమారు రెండుమూడేళ్ళక్రితం రాసిన ”బ్రాహ్మణాలు ”కూడా తామందరు ఉత్కంఠ గా చదివామని ఆరణ్యకాలు గురించిరాస్తామని అప్పుడే చెప్పి ,ఇంతవరకు రాయకపోవటం తమకు నిరాశ కలిగించిందని వెంటనే రాయమని కోరారు .సరే అన్నాను తాను అక్టోబర్ లో కరీం నగర్ వచ్చి రెండువారాలు ఉంటానని అన్నారు .కరీం నగర్ రాగానే ఫోన్ చేస్తేసరసభారతి పుస్తకాలు పంపిస్తాను వాటికి డబ్బులేమీ ఇవ్వక్కరలేదు అని చెప్పాను సంతోషించారు . సింగపూర్ కు ఇండియాకు టైం లో తేడా రెండున్నర గంటలని ,ఇప్పుడు తమ టైం 5 గంటలని చెప్పారు .”అంతా బాగానే ఉంటున్నా సార్ మీరు ఏమీ అనుకోకపోతే ఒకమాట . ఒక్కో సారి ” థ”కు” ధ ”కు తేడా లేకుండా టైప్ చేస్తున్నారు ”అని సుతిమెత్తగా చురక అంటించారుఎంత జాగ్రత్త తీసుకున్నా కొన్ని సార్లు అవి వస్తూనే ఉన్నాయి మరింత జాగ్రత్త పడతాను ”అని ఓ కుంటి సాకు చెప్పాను. దానికి ఆయన సార్! నేను మాత్రం మా వాళ్లకు పంపేటప్పుడు వాటిని సవరించి పంపుతున్నాను ”అని చెప్పటం తో అవాక్కయ్యాను . సుమారు అరగంట శ్రీ శ్రీధర్ మాట్లాడి నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చారు .
సరసభారతికి ఇంతమంది అభిమానులు ఇన్ని చోట్ల ఉండటం వారంతా క్రమం తప్పకుండా మనబ్లాగులను చదవటం కు మించిన ఆనందం ఏముంది ? ఇంతమందిని సరసభారతి ద్వారా అలరిస్తున్నందుకు నేను ధన్యత చెందానని పించింది .సరసభారతిపై వారందరికీ ఉన్న ఆప్యాయ అనురాగాలు ఆత్మీయత నన్ను ముగ్ధుడిని చేశాయి . . సరస్వతీ ప్రసాదం అందరికి అందజేయగలగటం నా అదృష్టం . సరసభారతిపై అంతటి మక్కువ గౌరవం వాఱందరు చూపటం నా కృషి కంటే వారి సౌజన్యమే ఎక్కువ . –మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -15-9-18 -ఉయ్యూరు .

Posted in సమయం - సందర్భం | 1 Comment

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -3

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -3

యాజ్ఞవల్క్యుడు దివాకరుని అనుగ్రహం తో పొందిన వేదాన్ని శుద్ధ యాజుషం అని , ,ఏకాయనం అని ,అయాత యామ అనిపిలువబడింది .పూర్వ మీమాంస శాస్త్రం పుట్టటానికి కర్మకాండ ,ఉత్తర మీమాంసకు కారణం అయిన బ్రహ్మకాండ ,తర్వాత మంత్ర బ్రాహ్మణం వేర్వేరుగా ఉండటం చేత శుద్ధ లేక శుక్ల యజుర్వేదం అనే పేరు తోపాటు ,దీనికంటే శ్రేష్టమైనది వేరేలేనందున ఏకాయతనం అనే పేర్లు వచ్చాయి .శుక్లాయజుర్వేదానికి చరణ వ్యూహం ,భారతం లలో చెప్పబడినట్లు 15 శాఖలున్నప్పటికీ ఇప్పుడున్నవి కేవలం కాణ్వ ,మాధ్యందిన అనే రెండు శాఖలు మాత్రమే అని ముందే చెప్పుకున్నాం .ఇతర వేదాలలో కొన్ని పాఠక భేదాలు అంటే సూత్ర భేదాలనుబట్టి శాఖలేర్పడ్డాయి .కాని శుక్ల యజుర్వేదానికి మాత్రం ఏశాఖ బ్రాహ్మణం ఆ శాఖకే ఉన్నాయి .అంటే కాణ్వశాఖ కు సంహిత బ్రాహ్మణాలు వేరుగా ,మాధ్యందిన శాఖకు బ్రాహ్మణాలు వేరుగా ఉన్నాయి .శుక్ల యజుర్వేద బ్రాహ్మణాన్ని’’శత పథం’’అంటారు .కాణ్వ శాఖాను సారంగా ఈ బ్రాహ్మణం లో 17 కాండలు ,104 అధ్యాయాలు ఉన్నాయి.మాధ్య్యందిన శాఖాను సారంగా 14 కాండలు ,100 అధ్యాయాలున్నాయి .’’పథిక్’’అంటే అధ్యాయం అనే  అర్ధం ఎక్కడా లేదు .నాలుగు అనే అర్ధం చెప్పవచ్చు .కనుక శతపథం అనేది కాణ్వ బ్రాహ్మణానికి మాత్రమె చెందుతుంది అని గ్రహించాలి .వ్యాకరణ భాష్యం లో శతపథం,షష్టి అనే రెండుపదాలున్నాయి .మాధ్య౦దినం లో  మొదటి 9 కా౦డలలోని అధ్యాయాలు 40 కనుక ఆ తొమ్మిది కా౦డలకు మాత్రమె ‘’షష్టి పథం’’అన్నారు .వార్తికం పుట్టేనాటికి మాధ్యందిన శాఖలో 100 అధ్యాయాలున్నట్లు భావించారు. ఏతావాతా తేలిందేమిటంటే’’ షష్టి పథం’’అంటే మాధ్య౦దినం అనీ ,’’శతపథం’’ అంటే కాణ్వ మనీ గ్రహించాలి. మాధ్య౦దినం లోని 40 అధ్యాయాలు కాణ్వం నుంచి చేర్చబడ్డాయి .

   యాజ్న వల్క్యుడు యాజ్ఞిక ప్రవీణుడు ,ఆధి దైవత త్త్వంతెలిసిన పండిత శ్రేష్టుడు .  కనుక ఆయనకు బ్రహ్మవాదం అంటే మహా ప్రీతి .తురీయాశ్రమాన్ని మొట్టమొదట స్వీకరించినవాడు యాజ్ఞవల్క్యుడు అని చరిత్ర ప్రసిద్ధం .శతపధం లో అనేక పూర్వ ఋషుల, రాజుల చరిత్ర ఉంది . ఋగ్వేదం చదివినవారికి మిగిలినవేదాలు నేర్వటం యెంత సులువో ,శతపధ బ్రాహ్మణం నేర్చినవారికి యాజ్ఞిక కర్మలు చేయించటం అంత తేలిక మాత్రమేకాక తైత్తిరీయాదులు గ్రహించటం కూడా చాలా తేలికౌతుంది. శతపథం లో వేదార్ధాన్ని గ్రహించటం సులువు .ఇది తెలిస్తే వైదిక విషయాలు కరతలామలకం అవుతాయి .కనుక అన్ని బ్రాహ్మనాలకంటే శ్రేస్టం గా పేర్కొన్నారు .ఆధ్యాత్మ రామాయణం ఆరణ్యకాండ 8 వ సర్గ   లో ‘’అపూర్వ మైన శతపద౦ నాచే చేయబడింది ‘’అని యాజ్ఞవల్క్యుడు అన్నట్లు ఉంది –‘’రతి పతి శత కోటి సుందరాంగం’’  –శతపధ గోచర భావనావిదూరం –యతి పతి హృదయే సదా విభాంతం –రఘుపతి మార్తిహరం ప్రపద్యే ‘’   వెబర్ అనే పాశ్చాత్య పండితుడు’’ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ ‘’లో ‘’White Yajus occupies the most significant and important position of all the Brahmanas ‘’అన్నాడు .శతపథం కు మాత్రమే కాక తాండ్యభాల్లవి బ్రాహ్మణానికి కూడా ఉదాత్త అనుదాత్త స్వరాలు రెండేఉంటాయి అని కాత్యాయనుడు’ భాషిక సూత్రం’’ లో చెప్పాడు .ఈ సూత్రం ప్రాతిశాఖ్యము వేదం యొక్క స్వర సంస్కార నియమాన్ని తెలిపినట్లే, వేద వ్యాఖ్యానమైన బ్రాహ్మణ స్వర సంస్కార నియమాన్ని కూడా తెలుపుందని విజ్ఞుల ఉవాచ .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-18- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | 3 Comments

అది (ఏనాది )భిక్షు

మా చిన్నతనాలలో ఎప్పుడో ఇళ్లకు భిక్షానికి వచ్చే ఏనాది  (ఆది )భిక్షువు ఇవాళ మళ్ళీ గుమ్మం  లోకి భిక్షకు వస్తే తీసిన ఫోటో -దుర్గాప్రసాద్  

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా ఇంట్లో వినాయక చవితి పూజలో తాతా ,మనవరాలు రమ్య

మా ఇంట్లో వినాయక చవితి పూజలో తాతా ,మనవరాలు రమ్య

https://photos.google.com/share/AF1QipNCDS0LzXpfPieAiLVrKXVW78clVsCDAOVUlkqwiW_IGvunaGpTvINZAJrvq4Imlg?key=RkpzYTZKSkNRWF9jQ0d2Y2traUY0cnNRRlNGeTlB

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

యాజ్న వల్క్య మహర్షి చరిత్ర –2

యాజ్న వల్క్య మహర్షి చరిత్ర –2

మేనల్లుడు యాజ్ఞావల్క్యుని ఏమీ చేయలేక మేనమామ శాకల్యుడు శిష్యులనందర్నీపిలిపించి విషయం  చెప్పాడు .అదెంత పని అని ప్రచూడుడు ,పైన్గ్యుడు తమకు తపోమహిమ తక్కువేమీ లేదని ప్రకటించి ,రాజుకు మంత్రోదకం ఇవ్వటానికి వెళ్ళారు .రాజు వారిని నమ్మటానికి అక్కడ ఒక మొద్దు పడేసి దాన్ని మంత్రోదకం తో చిగురించేట్లుచేయమన్నాడు .ఎన్ని సార్లు మంత్రజలం చల్లినా వాళ్ల పాచిక పారలేదు .తెల్లమొహాలు వేసుకొని గురువును చేరి జరిగింది చెప్పారు .రాజు సుప్రియుడు గురువును పిలిపించి తాను అవమానించిన యాజ్న వల్క్యుడు మహా తపస్సంపన్నుడు అని తర్వాత తెలుసుకున్నానని అతడే వచ్చి మంత్రోదకం ఇస్తేనే తన వ్యాధి నయమౌతుండదనే నమ్మకం తో ఉన్నానని  అతడు రాకపోతే తానె అక్కడికి వస్తాననిప్రాదేయపడి ,గురువు వెంట ఆశ్రమ౦ చేరాడు .మేనల్లుని పిలిచి రాజు వచ్చాడని,మంత్రోదకం ఇవ్వమని చెప్పాడు .పట్టు వదలని అతడు ససేమిరా అన్నాడు .కోపం తో ఊగిపోతూ  రాజుల మన్నననలు పొందుతూ అభిమానం మొదలైనవి వదులుకోవాలని హితవు చెప్పాడు. దానికి బదులిస్తూ ‘’రాజు దయా ధర్మ భిక్షనాకక్కరలేదు .అవమానించిన వారి మోచేతి నీళ్ళు తాగటం నేను చేయను .ఆత్మ గౌరవం లేని బతుకు బతుకు కాదు ‘’అన్నాడు .అగ్గిమీద గుగ్గిలం అయి ‘’నేను చెప్పిన చదువంతా’’ కక్కేసి ‘’ నా ఇంట్లోంచి బయటికి వెళ్ళు ‘’అని ఆజ్ఞాపించాడు గురుమేనమామ .నిమిషం ఆలస్యం చేయకుండా యోగ బలం తో తాను నేర్చిన యజుర్వేదాన్ని మూర్తిమంతం చేసి, కక్కిపారేసి  అక్కడ నుంచి యాజ్ఞవల్క్యుడు వెళ్లి పోయాడు .ఆ కక్కిన దాన్ని వైశంపాయనుడు అనబడే శాకల్యుని శిష్యులు ‘’తిత్తిరి పక్షులు ‘’గా మారి తినేశారు .అప్పటినుంచి ఆవేదం’’ తైత్తిరీయం ‘’అనే పేరుతో పిలువబడింది .మేనమామ ఇంటినుంచి వెళ్ళిపోతూ మేనల్లుడు యాజ్న వల్క్యుడు ‘’నీ వేదం బుద్ధి మాలిన్యం తో పూర్వ ,ఉత్తరాంగ రహితమై ,అవ్యవస్తితమై ,కక్కినదాన్ని జనం ఎవరూ చూడక అసహ్యించు కోనేట్లుగా, నీ దగ్గర చదివిన యజుస్సులు అన్నీ స్మరణ కైనా రానీయను .ఇంతకంటే అనేక రెట్ల గొప్పదైన వేదాన్ని పొంది నీవేదాన్ని మూలపడేట్లు చేస్తా.’’అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు .

  అక్కడినుండి బయల్దేరిన యాజ్ఞవల్క్యుడు హాటకేశ్వరం వద్ద ఉన్న విశ్వా మిత్ర హ్రదం చేరి

   స్నానం చేసి, వేదమాత ను ఉపాసించటానికి ముందు సూర్యోపాసన చేసి ,ప్రభాకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ‘’ ఏ కొరతా లేని కర్మ బ్రహ్మ విద్యలు కలిగి శుద్ధ స్వరూపమైన వేదాన్ని ప్రసాదించు ‘’అని  వేడుకొన్నాడు .రవి యాజ్ఞవల్క్యుని నోరు తెరవమని చెప్పి సరస్వతీ రూపమైన తన తేజస్సు ను అతని నోటిలో ప్రవేశ పెడతానని ,దానివలన ‘’శుద్ధ (శుక్ల )యజుర్వేదమే కాక  అఖిలవిద్యలు నీకు    వశమౌతాయి .సకల జగద్రహస్యాలు తెలియ జేసే అద్వితీయమైన ‘’శత పథం’’నువ్వు రాస్తావు’’అని చెప్పి యాజ్న వల్క్యుని నోటిలో తన తేజస్సును ప్రవేశ  పెట్టాడు ఆదిత్యుడు .

  ఈ విధం గా యాజ్న వల్క్యుడు శుద్ధ యజుర్వేదాన్ని పొందాడు .వాజీ రూపాన్ని ధరించి ఐ శుక్ల యజుర్వేదాన్ని బోధించాడు .శుక్ల యజుస్సులు వాజస నేయుడైన యాజ్న వల్క్యు నివలన ‘’ఆదిత్యాలు ‘’ అని పిలువ బడ్డాయి   .అంటే ఆదిత్యుడు యానవల్క్యుని చేత చదివించిన తర్వాతే స్వయంభు ఐన బ్రహ్మనుండి బయల్వెడలిన శుక్ల యజుర్వేదాన్ని ఆదిత్యం అంటారని భావం .

  వినాయక చవితి శుభాకాంక్షలు

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వినాయక చవితి శుభా కాంక్షలు 

 

వినాయక చవితి శుభా కాంక్షలు 

వినాయకునిపై రెండు విచిత్ర పద్యాలు

భట్టుమూర్తి అనే రామ రాజభూషణుడు వినాయకుని స్తుతిస్తూ ఒక తమాషా పద్యం చెప్పాడు .దాని చమత్కారం అనుభవిద్దాం –

‘’దంతా ఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయం గ్రాహమున్ –గంతు ద్వేషికి గూర్చి ,శైలజకు దద్గంగా ఝరీ చ్ఛాంతి న

త్యంతా మోదము మున్నుగా నిడి,కుమారాగ్రేసరు౦డై పితృ –స్వాంతంబు ల్వెల యింప జాలు నిభరా డ్వక్త్రుం  బ్రశంసి౦చెదన్ ‘’.

భావం – శివుని జటాజూటం పై తిష్టవేసి, తల్లి పార్వతికి సవతి పోరు తెచ్చిన గంగ నీళ్లన్నీవినాయకుడు తొండం తో పీల్చేసి జనని పార్వతికి  సవతి పోరు లేకుండాచేసి ఆనందం  కలిగించాడు . అలాగే తొండం తో వెండికొండను ఒక్క సారి కదిలించగా ఆ ఊపుకు పార్వతీ దేవి శివునికి  పరిష్వంగసుఖం చేకూర్చి తండ్రికీ మోదం కలిగించాడు .అలాంటి వినాయకునికి నమసకారం అన్నాడు కవి చమత్కారంగా .

రెండవ పద్యం దశకుమార చరిత్ర రాసిన కేతన కవి  చక్కని పద్యం

‘’గ్రక్కున నేత్ర యుగ్మము కరద్విత యంబున మూసి పట్టి –మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటు సేసి ,యిం

పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవి౦పగా –దక్కొక ముద్దు నం బొలుచు దంతి ముఖుం గొలుతు బ్రసన్నుగాన్ .’’

బాల వినాయకస్వామి బాల్య చేస్టగా తండ్రి శివుడి రెండుకళ్ళు తన రెండు చేతులతో మూసి ,మిక్కిలి కన్ను అంటే అధికమైన కన్నుఅంటే త్రినేత్రాన్ని అనగా మూడో కంటిని,తన మూడవచేయి అంటే హస్తం అనగా తొ౦డ౦  తో మూసి పరమేశ్వరుని చిత్తాన్ని పల్లవి౦ప జేశాడట .అలాంటి గజాననుకి నమస్కారం అన్నాడు సరదాగా .

మనం కూడా ఇలాంటివినాయకుని రేపు వినాయక చవితి సందర్భంగా   స్మరించి ధనులమవుదాం –

13-9-18 గురువారం శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలతో –

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -12-9-18 –ఉయ్యూరు

— 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి

నేను రాసిన ‘సిద్ధ యోగిపుంగవులు” పుస్తకం లోని ”త్రికాలజ్ఞాని మహాయోగి గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి ”వ్యాసం సెప్టెంబర్ గురు సాయి స్థాన్ లో పునర్ముద్రించారు -దుర్గాప్రసాద్ s

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -1

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -1

బృహత్కల్పం లో కురు పాంచాల దేశం లో గంగానది తీరం లో చమత్కార పురం లో యజ్న వల్క్యుడు బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .సకల సద్గుణాలతో విరాజిల్లుతూ చిన్ననాటే వేదాధ్యయన పరాయణుడై యాజ్న వల్క్య ,వాజసని ,బ్రహ్మరాత ,దేవ రాత పేర్లతో ప్రసిద్ధి చెందాడు .యజ్ఞం అంటే వేదం .వేదాలను చక్కగా చెప్పగలవాడు కనుక యజ్న వల్క్యుడని,అన్నికాలాలలో  అన్నదానం చేయటం చేత వాజసని అనీ ,బ్రహ్మము అంటే వేదం కనుక వేదాన్ని నిరంతరం బోధించేవాడుకనుక బ్రహ్మ రాతుడని,దేవునిచే పాత్రదానం ఇవ్వబడ్డాడుకనుక దేవరాతుడని సార్ధక బిరుదనామాలు పొందాడు .వల్కలం అంటే వస్త్రం .యజ్ఞం లేక యాగం ఆయనకు వస్త్రాలవంటివి అంటే విడువరాని బంధం కలవి కనుకనూ యజ్న వల్క్య నామం సార్ధకం .

    ఆ కాలం లో వర్ధమాన పురం లో శకలుడు అనే మహర్షి ఉండేవాడు .ఆయనభార్య దితి .ఈ దంపతులకు సునంద అనే కుమార్తె ,శాకల్యుడు అనే కుమారుడు జన్మించారు .సునందను యజ్ఞవల్క్యునికిచ్చి వివాహం చేశాడు .వీరికి చాలాకాలం సంతానం లేదు .పుత్ర సంతానం కోసం యజ్న వల్క్యుడు కేదారం వెళ్లి 12 ఏళ్ళుశివునికై  తీవ్ర తపస్సుచేశాడు .ప్రత్యక్షమైన పరమేశ్వరుడు వరం కోరుకోమనగా సత్పుత్రుని ప్రసాదించమని అర్ధించాడు .అప్పుడు శివుడు ‘’లోకం అంతా బ్రహ్మ విద్యా విహీనంగా ఉంది .కనుక నేనె నీకు కుమారుడిగా జన్మించి బ్రహ్మ విద్యా వ్యాప్తి చేస్తాను ‘’అని వరమిచ్చాడు .ఆనందం తో యజ్ఞవల్క్యుడు చమత్కార పురం చేరి శుభవార్త చెప్పాడు .కొంతకాలానికి సునంద గర్భవతి యై పండంటి పుత్రుని కార్తీక శుద్ధ ద్వాదశి ఆదివారం కన్నది .వేదోద్ధరణకు జన్మించిన పరమేశ్వరుడనే ఆ బిడ్డను అందరూ భావించారు .అతనికి యాజ్న వల్క్యుడు అనే పేరు పెట్టారు .తండ్రికున్న నాలుగు పేర్లూ ఈయనకూ సంక్రించాయి .అయిదవ ఏట అక్షరాభ్యాసం ,గర్భాస్టమం లో ఉపనయనం చేశారు .కొంతకాలానికి కంసారి అనే పుత్రిక కూడా కలిగింది .యజ్న సునంద లకు.ఈమెకు యుక్త వయసు రాగానే వివాహ ప్రయత్నాలు చేశారు .కొడుకు  దేవ దేవుని వరప్రసాదంఅని వారి మధ్య సంభాషణ జరిగింది .దేవదేవుడు ఎవరు  అని కొడుకు వాళ్ళను ప్రశ్నించాడు .అతని తెలివి తేటలకు సంతోషించారు  .బాష్కలుడు అనే  గురువును చేరి వేద విద్యా రహస్యాలను  నేర్వమని పంపించి దంపతులు శేష జీవితాన్ని కేదార క్షేత్రం లో గడపటానికి వెళ్లి పోయారు .

   యాజ్న వల్క్యుడు బాష్కలుని వద్దకు చేరి ఋగ్వేదం అభ్యసించాడు .సామ వేదాన్ని జైమిని వద్ద నేర్చాడు .పైలుని వద్ద అధర్వ వేదం  చదువు కొన్నాడు  .యజ్న యాగాలకు ఉపయోగ పడే యజుర్వేదాన్ని తన మేనమామ విదగ్ధ శాకల్యుడు ఉండే వర్ధమాన పురం వెళ్లి నేర్చుకొన్నాడు .వేదపాఠం చెప్పటం లో బహు ప్రజ్ఞావంతుడు కనుక విదగ్ధ శాకల్యుడని పించుకొన్నాడు .ఇతడు వర్ధమాన పుర రాజు సుప్రియుడికి పురోహితుడుకూడా .ఈయన దగ్గర మూడువందల అరవై మంది విద్యార్ధులు యజుర్వేదం అభ్యసిస్తున్నారు .యాజ్ఞావల్క్యుని అవతార పరమార్ధం వారెవరికీ తెలియక పోవటం చేత అవమానిస్తుండేవాళ్ళు .

  రాజు సుప్రియుడు దుర్వ్యసనాల పాలిటబడి రోగ గ్రస్తుడయ్యాడు .పురోహితుడికి మొరపెట్టుకొని తన జబ్బు తగ్గే ఉపాయం చెప్పమన్నాడు .మందులకు లొంగని జబ్బు ‘’శాంతిక ‘’కు  లొంగుతుందని చెప్పి ఊరడించి ,రాజమందిరానికి రోజుకొక శిష్యుని పంపి అతనిచే శాంతికం జరిపిస్తూ రాజుకు మంత్రోదకం తీర్ధంగా ఇచ్చే ఏర్పాటు చేశాడు .ఏ రోజు ఎవరు వెళ్ళాలో కూడా శిష్యులకు తెలియ జేశాడు .ఒక రోజు యాజ్ఞ వల్క్యుని వంతు వచ్చింది .మేనమామ వెళ్లి శాంతిక జరిపి మంత్రోదకం రాజుకు ఇచ్చి రమ్మన్నాడు .రాజు గుణ శీలాలు తెలిసి  వెళ్ళనన్నాడు .నచ్చ చెప్పి పంపాడుమేనమామ మేనల్లుడిని .రాజు అమర్యాదగా ప్రవర్తించినా సహించాడు .మంత్ర జలం పై నమ్మకం లేదన్నాడు . తెచ్చిన మంత్ర జలాన్ని కోపంతో అక్కడున్న ఎండిపోయిన కర్రపై చల్లి’’ మళ్ళీ రాజమందిరానికి రాను’’ అని చెప్పి గురు కులానికి వెళ్లి పోయాడు .ఇంతలో ఆ ఎండుకర్ర ఆకులు, కాయలు, పండ్లు తో ఒక చెట్టు గా మారి శోభాయమానంగా కనువిందు చేసింది .చూసిన రాజు ఆశ్చర్యపోయి తాను చేసిన తప్పు తెలుసుకొన్నాడు .గురుకులానికి సేవకులను పంపి యాజ్ఞవల్క్యుని మళ్ళీ పంపమని గురువును వేడుకున్నాడు .ఆయన శిష్యుడికి చెప్పాడు .’’మా నాన్న చెప్పిన నీతి మార్గాన్నే నేను ఆచరించాను .మళ్ళీ వెళ్ళను ‘’అని తెగేసి చెప్పాడు గురుమామకు .ఆయనకు కోపంవచ్చి ‘’నీమహిమ తో నీకు గ్గర్వం హెచ్చింది ‘’అన్నా వినక శిష్యులతో బుద్ధి చెప్పిస్తానన్నా బెదరలేదు .తర్వాత ఏం జరిగిందో తర్వాత తెలుసుకొందాం .

 రేపు వినాయక చవితి శుభాకాంక్షలతో

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-18- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరో స్వయం సిద్ధ డా శ్రీమతికోనేరు (కోగంటి )లక్ష్మీ ప్రమీల

మరో స్వయం సిద్ధ డా శ్రీమతికోనేరు (కోగంటి )లక్ష్మీ ప్రమీల

మొన్న 10 వ తేదీ ఆదివారం బెజవాడ లో శారదా స్రవంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెళ్లి, అయి పోయాక తిరిగి వస్తుంటే శ్రీమతి లక్ష్మీ ప్రమీలగారు తాను పరిశోధించి పిహెచ్ డి పొందిన ‘’ఆంద్ర ప్రదేశ్ లో పేరంటాళ్ళు ‘’గ్రంథం నాకు ఇచ్చి చదివి అభిప్రాయం తెలియ జేయమని కోరారు .బస్ ఎక్కి  ఉయ్యూరు వస్తూ దారిలో దాన్ని తిరగేశాను .నాకు కొన్ని అభిప్రాయాలు తోచాయి .నిన్న 11 వ తేదీ సోమవారం ఆమెకు ఫోన్ చేసి వాటిని చెప్పాను .ఆవిడ సంతృప్తి గా సమాధానాలు చెప్పారు. తర్వాత ఆమె ఫోన్ చేసి తన జీవితం గురించి చదువు భర్త సహకారం  పిల్లలు ,ఇటీవలే జరిగిన భర్త మరణం వగైరాలన్నీ ఒక ఆత్మీయుడితో చెప్పినట్లు దాదాపు అరగంట మాట్లాడి చెప్పారు. సంభాషణలో నేను ఆమెను ‘’అయితే మీరు ‘’స్వయం సిద్ధ ‘’అన్నమాట ‘’అనగానే నవ్వారు . ఆమె జీవితం  అనేక విషయాలలో సాధన,తపన భర్త ప్రోత్సాహం ,గమ్యం చేరటం  గురించి మీకు తెలియ జేయాలని రాస్తున్నాను .ఇందులోని విషయాలు ఆమె పరిశోధన పుస్తకం లోని ఆమె రాసిన ‘’నా మాట ‘’లోని సారాంశమే .నిన్ననే ఆమెకు మన సరసభారతి పుస్తకాలు కొరియర్ లో పంపాను                        గుంటూరు జిల్లాలో నాటక ,సినీ రంగ నటుడు పర్జన్య గర్జన గళంతో ఉర్రూతలూగించిన శ్రీ వేమూరి గగ్గయ్య ,రాజకీయ దురంధరుడు మన మాజీ ముఖ్యమంత్రి ,తమిళనాడు మాజీ  గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య ,తెలుగు తల్లి విగ్రహ రూప శిల్పి శ్రీ దేవు శంకర్ లు జన్మించిన వేమూరు గ్రామం లో శ్రీమతి లక్ష్మీ ప్రసూన గారు కోగంటి వారింటి ఆడపడుచుగా శ్రీ వెంకట సుబ్బయ్య శ్రీమతి చిట్టెమ్మ దంపతులకు జన్మించారు .తల్లి వద్దనే  అ ఆ లు దిద్ది ,రామయ్య మేస్టారువద్ద నాలుగవ తరగతి లో తెలుగుపై మమకారమేర్పడి ,పడవ తరగతిలో శ్రీ గిరి మేస్టారి బోధనతో చరిత్రపై అభిమానమేర్పడింది .స్కూల్ ఫైనల్ స్కూల్ ఫస్ట్ గా పాసైనా ,పియుసి లో చేరినా మాన్పించి తలిదండ్రులు ఆమె పెళ్లి చేసేశారు .

భర్త శ్రీ కోనేరు శివ సత్యనారాయణ రైల్వే ఉద్యోగి అవటం తో కాపురానికి హైదరాబాద్ వెళ్ళారు లక్ష్మి .చదువుకొంటాను అంటే అందరు మగాళ్ళ లాగానే ఆయనా  ‘’టాట్ కుదరదు ‘’అని అడ్డు చెప్పగా కోరిక మనసులోనే అణచుకొని ,పిల్లలు ,వారిపె౦పకం ,విద్యా, వివాహాలు అన్నీ దంపతులు సక్రమగా నెరవేర్చి ,భర్తకు అన్నిరకాలా సహకరించి ఆయనమనసు గెలిచి  55 ఏళ్ళ వయసులో  భర్తకు   చదువు కొంటానని మళ్ళీ అప్లికేషన్ పెట్టి, సాంక్షన్ చేయించుకొని ,ఆయన అందించిన అన్ని రకాలైన ప్రోత్సాహ సహకారాలను  అంది పుచ్చుకొని 2004 లో దూరవిద్య ద్వారా  బి. ఏ .  ఎం .ఏ.లు నాగార్జున యూని వర్సిటీ నుండి  పాసై , హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం లో ఎం.ఫిల్..,,పి హెచ్. డి .సాధించి వరుసగా 12 ఏళ్ళు కస్టపడి ఇలా చదివి తన జీవిత ధ్యేయం నెరవేర్చుకొనే సరికి ప్రమీలగారికి 68 ఏళ్ళు వచ్చేశాయి  .ఈ లోగా యోగా లోనూ సాధన చేసి అనేక పరీక్షలు పాసై అనేక రాష్ట్రాలలో ప్రదర్శనలిచ్చి  మెడల్స్ కూడా సాధించారు .ఒక రకంగా పట్టు వదలని ‘’లేడీ విక్రమార్క’’శ్రీమతి లక్ష్మీ ప్రమీల .ఈ పన్నెండేళ్ళు తనభర్త తనకెంతో చేదోడు వాదోడుగా ఉన్నారని ,ఆయన తోడ్పాటే లేకుంటే తానింత సాధించగాలిగేదాన్ని కాదని చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నారు భర్త సత్యనారాయణ గారికి .

తాను పుట్టిన వేమూరు చారిత్రిక రాజకీయ సాంఘిక ప్రాముఖ్యం పై అధ్యయనం చేయాలని కోరిక కలిగి ,అక్కడ తమ తాత ముత్తాతల నుండి తమ తండ్రి కి కు సంక్రమించిన వైశ్యు ల పొలం లో క్రీ.శ.11 20 లో ఆ వూరి వైశ్యులు నిధి పాతిపెట్టారని కాశీలో శాసనం వేయించగా ,దాన్ని చదివిన ఒక సన్యాసి చందోలు పాలించే వెలనాటి కులోత్తుంగ చోళుని కి తెలియజేయగా ,రాజు దాన్ని తవ్వి తీయించి చందోలుకు తరలించాడని ,నిధికి కాపలాఉన్న కాలభైరవుడికి సన్యాసి బలి అయ్యాడని కైఫీయత్ లలో ఉన్నట్లు ఆమె గ్రహించారు .పొలం లో అప్పటి పెద్ద సైజు ఇటుకలు ,యక్షిణి విగ్రహం  బయటపడి ఆప్రదేశానికి ‘’ధనపు కొట్లు ‘’అనే పేరు వచ్చిందని తెలిపారు .

తన ఈ పరిశోధన అంశం కు ప్రేరణ చిన్నతనం లో తాను చదివిన ‘’బాల సన్యాసమ్మ ‘’కథ అనీ భర్తతో పాటు సహగమనం చేసిన ఆమె అలా ఎందుకు చేసిందనే సందేహం కలిగి తనమనసులో పరిశోధన బీజం మొలకెత్తటం ప్రారంభమై౦దన్నారు .మూఢాచారాల వల్ల ,సంఘం లో భర్త చనిపోయిన విధవలకు గౌరవ మర్యాదలు లేక పోవటంవలన సంఘం నుండి నిర్లక్ష్యాన్ని భరించలేక సతీ సహగమనం ప్రారంభమై  అలాంటి వారు గ్రామ దేవతలై పూజ లండుకొంటున్నారని అర్ధమైందని ,ఇలా ‘’ పేరంటాళ్ళు ‘’ గా మారిన త్యాగధనులైన మహిళలలో అగ్రవర్ణాలవారితోపాటు, అడుగు వర్ణాలస్త్రీలూ ఉన్నారని తెలిసింది .భర్తతోనే కాక తోడబుట్టిన వారితోనూ సహగమనం చేసినవారున్నట్లు తెలుసుకొన్నారు .కనుక ఆంద్ర దేశం లోని పేరంటాళ్ళ జీవిత విశేషాలను చారిత్రకా౦శాలతో పరిశోధించటానికి లక్ష్మిగారు పూనుకున్నారు .ఇలా ఇంతవరకు ఎవరూ పరిశోధించకపోవటం ఆమెకు దక్కిన అరుదైన అవకాశం, అదృష్టం కూడా .ప్రాధమిక విషయాలు సేకరించి నిజనిర్ధారణకు ప్రతి చోటుకూ  వెళ్లి ,ప్రత్యక్షంగా అక్కడి సమాచారాన్ని, ఫోటోలను సేకరించి బహు ప్రయాస పడ్డారు .లక్ష్మీ ప్రమీల గారి ఈ పరిశోధనకు మార్గ నిర్దేశం చేసినవారు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం చరిత్ర సంస్కృతీ ,పురావస్తు శాస్త్ర పీఠం శ్రీశైల ప్రాంగణ పీఠాధిపతి ఆచార్య పెదారపు  చెన్నా రెడ్డి గారు . ‘’ముందుమాట’’గా రెడ్డిగారు రాసిన వాక్యాలు  ఆలోచనాత్మకాలు .తన పిహెచ్ డి ఆమోదం పొందగానే ఆమె భర్త అందుకోసమే ,ఈ ఆనందాన్ని పొందటానికే ఆమె సాధించిన దానికి సంతృప్తిని పొందటానికే అన్నట్లు జీవించి ,ఈ ఆనందం శాశ్వతంగా అనుభవించకుండానే పుస్తకావిష్కరణ దాకా జీవి౦చ కుండా  కొద్దికాలానికే పరలోక గతులవ్వటం ఆమెను చాలా కృంగ దీసింది ..తట్టుకో లేకపోయారామే .పుస్తకావిష్కరణ చేసిన శ్రీ మండలి బుద్ధప్రసాద్ ‘’అరుదైన పరిశోధన ‘’గా అభి వర్ణించారు .

ఈ పరిశోధన గ్రంథం లో శ్రీమతి ప్రమీల పేరంట౦ అంటే ఏమిటో చెప్పి  ,ఒక ప్రత్యేక పరిస్థితిలో ప్రత్యేకకారణ౦ తో  మరణించిన స్త్రీమూర్తిని ‘’పేరంటాలు’’అంటారని ఆమె మహిమలతో దైవత్వం పొంది పూజలందుకొని గ్రామదేవతగా రూపు దాల్చటం సర్వ సాధారణమని చెప్పారు  . వీరిలో సతీ సహగమనం చేసిన వారెక్కువ అని అన్నారు .జిల్లాలవారీగా పేరంటాళ్ళ చరిత్ర గొప్ప అధ్యయనంతో తనకున్న పేజీల పరిమితిలో అవసరమైనంత వరకే వివరాలు అందించారు ,ఫోటోలు పెట్టారు .మొత్తం మీద 57 మంది పేరంటాళ్ళ చరిత్ర ఇందులో ఉంది .వారికి రంగ రంగ వైభవంగా జరిగే తిరునాళ్ళు గురించికూడా సంతృప్తిగానే రాశారు .

శ్రీమతి కోనేరు (కోగంటి )లక్ష్మీ ప్రసూన డా.లక్ష్మీ ప్రసూన అయిన సోపాన ప్రక్రియ అందరకు ప్రేరణగా నిలుస్తుంది .ఇంత చేసినా పి.హెచ్ .డి .లో,  యోగా లో స్వర్ణ పతకం రావాల్సిన తనకు ప్రాంతీయ దురభిమానం , వివక్ష అడ్డుగా నిలవటాన్ని జీర్ణించుకోలేక పోయారు .వెండి పతకం తో సరిపెట్టారని బాధ పడ్డారు .పట్టుదల,ప్రోత్సాహం ,దీక్ష ఉంటే మహిళ సాధించరానిది ఏమీ ఉండదని మనకు సాక్ష్యం గా ,’’మరో స్వయం సిద్ధ ‘’గా నిలచిన శ్రీమతి లక్ష్మీ ప్రసూన గారిని హృదయపూర్వకంగా అభి నందిస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-18 –ఉయ్యూరు

 




 

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శారదా స్రవంతి సాహిత్య సాంస్కృతికసమితి

శ్రీ శారదా స్రవంతి సాహిత్య సాంస్కృతికసమితి
————————————————————————
నెలనెలా జరిగే
          ❤  మళ్ళీ కూయవే గువ్వా❤   కార్యక్రమం
9-9-18   రెండవ ఆదివారం సాయంత్రం 5-30గంటలకు
వేదిక:: MROoffice లో  మొదటి అంతస్తులో
స్వర్ణాపేలస్ హోటల్ ఎదురుగా
ఏలూరు రోడ్డు
ఈనెల సాహితీఅతిథి: శ్రీగబ్బిటదుర్గాప్రసాద్
రసజ్ఞులైన కవగాయకపండితులందరు విచ్చేసి తమతమ స్వరాలను వినిపించవలసినదిగా కోరుతూ వినిపించే స్వరాలను వినవలసినదిగా కోరుకుంటున్నాము
ప్రత్యేకతలు.. ప్రార్థన: అమృతవాణి; ఇతిహాసబాణి;ప్రక్రియ;తెలుసుకుందాం ;చాటువు;పాట ఈఏడుశీర్షికల సాహితీ హరివిల్లు
ఇట్లు
👏మీ
శారదా కుటుంబం
Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్యులు  

యాజ్ఞ వల్క్యులు

    యాజ్ఞ వల్క్యమహర్షి   సూర్యుని అనుగ్రహం వలన శుక్ల యజుర్వేదాన్ని15 శాఖలుగా విభజించి  ,అందులో ప్రధమ శాఖను కణ్వునికి ,ద్వితీయ శాఖను మధ్య౦దునికి ,మిగిలిన వానిని శాబీయ ,స్థాపానీయ,కాపార ,పౌండర వత్స ,ఆవటిక ,పరమావటిక ,నైధేయ,నైనేయ ,జౌఖేయ ,వైజేయ ,బైజన , గాలవ ,పౌరాశల్యులకు ఒక్కొక్కరికి ఒక్కో శాఖ ఉపదేశించి ప్రచారం చేయించాడు .వీరంతా యాజ్న వల్క్య వంశం వారే కనుక యాజ్న వల్క్యులని పిలువబడ్డారు .వీరినే శుక్ల యజుర్వేదులని ,వాజసనేయులనీ అంటారు .ఈ పదిహేను శాఖలకు సూత్ర కారుడు కాత్యాయన మహర్షి .కనుక కాత్యాయన సూత్రులనీ పిలుస్తారు .ప్రధమ శాఖను ఏర్పరచిన కణ్వమహర్షి సంప్రదాయులను కాణ్వులు ,ప్రధమ శాఖీయులు ,ఆది శాఖీయులు ,అగ్రశాఖీయులు ,మూల శాఖీయులు అని కూడా అంటారు .మాధ్యందిన మహర్షి సంప్రదాయయానికి చెందినవారిని మాధ్య౦దినులు అంటే , మిగిలిన శీఖీయులను ఆయా ఋషుల పేరిట పిలువబడుతున్నారు .

  ప్రస్తుతం కా ణ్వ ,మాధ్యందిన శాఖల వేదం తప్ప మిగతా శాఖల వేదాలు ప్రచారం లో లేవు .తెలుగు కన్నడం తమిళ మాతృ భాష ఉన్న శుక్ల యజుర్వేదీయులంతా కాణ్వు లే.మరాఠీ గుజరాతీ ,హిందీ బెంగాలీ ,పంజాబీ మాట్లాడే వారంతా కూడా కాణ్వులే.వీరి సంఖ్య చాలా తక్కువే దాదాపు వీరంతా మాధ్య౦దినులే .

  కాణ్వులలో నియోగులు ,వైదీకులు వారి వృత్తిని బట్టి ,నివ సహించే ప్రదేశాన్నిబట్టి హనుమకొండలు ,దువ్వలు ,కాకులపాడు ,ఆర్యులు ,అరవలు అనే 5 నాడీ భేదాలేర్పడ్డాయి .ఇప్పుడు వీరంతా నాడీ భేదం పాటించకుండా సంబంధాలు కలుపుకొంటున్నారు.స్వరాజ్యం నా జన్మహక్కు అని ఎలుగెత్తి చాటి ,గీతా రహస్య గ్రంథం రాసిన బాలగంగాధర తిలక్ , కాశీ  విశ్వ విద్యాలయ సంస్థాపకులు పండిత మదన మోహన మాలవ్యా మాధ్యందిన శాఖీయులే .ఆంధ్ర దేశం లో కాణ్వులలో దేశ ముఖులు,దేశ పాండ్యా లు ,జమీందార్లు భూస్వాములూ ఉన్నారు.  కాణ్వ శాఖీయులు రాజ్య పాలన కూడా చేశారు .క్రీ .పూ. 73నుండి క్రీ.పూ.28 వరకు శుంగ వంశం అంతరించాక ,మగధ సామ్రాజ్యాన్ని పాలించిన గుణ హీనుడు ,పరభామినీ లోలుడైన శుంగ వంశ ‘’దేవ హూతి’’ని చంపి రాజ్యాధికారం చెలాలాయి౦చిన  వాడు ‘’వాసు దేవ కాణ్వ ‘’.ఇతని తర్వాత’’ భూమిత్ర కాణ్వ’’ ,నారాయణ కాణ్వ,సుశర్మ కా ణ్వా లు పాలించారు .గజపతి మహారాజు ప్రధాన మంత్రి ,రాజకీయ దురంధరుడు ,త్యాగ శీలి ,గ్రామకరణోద్ధరుడు గోపరాజు రామప్రధాని ఈ శాఖ వాడే .నిరతాన్న ప్రదాతలు ,తానీషాసుల్తాన్  మంత్రి వర్యులు అక్కన్న మాదన్న సోదరులు ,భద్రాద్రి శ్రీ రామ దేవాలయ నిర్మాత మహా రామభక్తుడు భక్త రామదాసు అనబడే కంచర్ల గోపన్న ,పాండు రంగ మహాత్మ్యాన్ని రచించి వికటకవి యై అష్ట దిగ్గజకవులలో ఒకడని గుర్తింపు పొందిన తెనాలి రామకృష్ణ కవి  కాణ్వ శాఖీయులే  .

  కాలక్రమం లో వీరు ఆర్ధికంగా చితికి పోవటం వలన శ్రీ కూచి పంచాగ్నుల మన్నారు శాస్త్రి గారు, శ్రీ పువ్వాడ వెంకటరావు గారు కలిసి మద్రాస్ లో కాణ్వ శాఖ మహత్వాన్ని గురించి గ్రంథ ప్రచురణ చేసి ప్రోత్సహించి ,1872 లో మద్రాస్ లో పెద్ద బహిరంగ సభ జరిపి ఆ శాఖీయులందరికీ ప్రేరణ కలిగించి ‘’యాజ్ఞ వల్క్య నిధి ‘’ఏర్పాటు చేసి ఆదుకొన్నారు .5-11-19 19 లో తెనాలిలో యాజ్ఞ వల్క్య సభ జరిపి ,సంచలనంతెచ్చారు. 1925 లో మూడు రోజుల సభ శ్రీ వివి గిరిగారి తండ్రి శ్రీ జోగయ్య పంతులుగారి అధ్యక్షతన జరిపి ,తర్వాత శ్రీ భాగవతుల లక్ష్మీపతి ,శ్రీ వంగిపురపు చలపతి రావు గారి సంపాదకత్వం లో ‘’శ్రీ యాజ్న వల్క్య ‘’మాసపత్రిక స్థాపించి నడిపారు .దేశభక్త శ్రీ కొండా వెంకటప్పయ్య ,’’ఆంద్ర యాజ్న వల్క్య సంఘం ‘’ను పునరుద్ధరించారు .1952 లో గుంటూరు పండరీ పురం లో దాతల సహకారం తోశ్రీయాజ్నవల్క్య క్షేత్రం ‘’నిర్మించి ,శ్రీ మైత్రేయీ కాత్యాయినీ సమేత శ్రీ యాజ్న వల్క్య మహర్షి పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించి, తర్వాత  క్షేత్రాన్ని బాగా అభి వృద్ధిపరచి వివాహాది శుభకార్యాలు జరపటానికి వసతి సౌకర్యాలు కల్పించారు .మా అబ్బాయి రమణ వివాహం ఇక్కడే జరిగింది .ఇలా యాజ్నవల్కీయుల  సముద్ధరణ జరిగి వారికెంతో మేలు చేకూర్చింది .

  ఆధారం –శ్రీ భాగవతుల లక్ష్మీ పతి శాస్త్రి గారు రచించి,  గుంటూరు లోని ‘’ఆంద్ర యాజ్నవల్క్యసంఘం’’ ప్రచురించిన ‘’కణ్వగురు వాజసనేయ యాజ్న వల్క్య చరిత్రము ‘’ .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-9-18 –ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ శంభుని మూర్తిగారి 12 వ రోజు కార్యక్రమం  

శ్రీ శంభుని మూర్తిగారి 12 వ రోజు కార్యక్రమం

మా పెద్ద తోడల్లుడు గారు స్వర్గీయ శంభుని శ్రీ రామచంద్ర మూర్తిగారి 12 వ రోజు కార్యకరామానికి ఈ రోజు ఖమ్మంవెళ్ళటానికి  ఉదయం 5 గంటలకే లేచి స్నానసంధ్య పూజాదికాలు పూర్తీ చేసి మా కోడలు రాణి పంపిన ఇడ్లీలు తిని,నేను కలిపిన కాఫీ రెండు సార్లు తాగి ,దారిలో ఆకలైతే ఉంటుందని మా ఆవిడ చేసిన ఉప్మా హాట్ పాక్ లో పెట్టుకొని మేమిద్దరం, మామూడవ కోడలు రాణి కారులోఉయ్యూరు నుంచి ఉదయమ7-30 కు బయల్దేరి బెజవాడ లబ్బీపేట స్టేట్ బాంక్ కాలనీ లో ఉన్న మా వదిన గారు (–మా ఆవిడరెండవ  అక్కగారు) జానకిగారిని కార్లో ఎక్కించుకొని ,వాళ్ళిచ్చిన కాఫీ తాగి ,సత్యనారాయణపురం వెళ్లి సుమారుపదిరోజులక్రితం లైట్ హార్ట్ ఎటాక్ వచ్చి  స్టెంట్ వేయించుకొని ,ఇంటివద్ద కోలుకుంటున్న కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డా శ్రీ పూర్ణచంద్ గారింటికి వెళ్లి పరామర్శించి ,పళ్ళు ఇచ్చి ,మళ్ళీ అక్కడ ఆయన శ్రీమతి గారిచ్చిన కాఫీ తాగి ,మా ఆవిడకు మా కోడలుకు ఆవిడ పెట్టిన జాకెట్ పండ్లు తీసుకొని ,పూర్ణ చ౦ద్ దంపతులు ‘’ఇవాళ శ్రావణ శనివారం  ఆదిదంపతులు  మా ఇంటికి రావటం మా అదృష్టం ‘’అంటూ ఇద్దరూ మా పాదాలు తాకి నమస్కరిస్తే అక్షింతలతో ఆశీర్వదించి ,ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి , పూర్ణచంద్ రాసినా  ఇంకా ఆవిష్కరణ జరగని ‘’తెలుగు కోసం ‘’పుస్తకం ఆప్యాయంగా నాకు అందిస్తే పుచ్చుకొని   అక్కడినుంచి  9-30 కు మళ్ళీ బయల్దేరి కొంగరమల్లయ్యగట్టు దగ్గరున్న గట్టు భీమవరం,ముండ్లపాడు, పెనునుగంచిప్రోలు, మక్కపేట ,లింగాల ,వత్సవాయి చేరి ,అక్కడ నేను మొదటిసారిగా సైన్స్ మాస్టర్ నుండి హెడ్ మాస్టర్ ప్రమోషన్ పొంది 1978 నుండి సుమారు ఏడాది పని చేసిన వత్సవాయి స్కూల్ వాళ్లకు చూపించి, అక్కడ  కనేను శ్రీ పుల్లయ్యనాయుడు దంపతులింట్లో ఒక చిన్న దిలో అద్దెకు౦టూ వంట చేసుకొని తిన్న  గదిని చూపించి నాయుడు దంపతులు నాకు సహకరించిన విషయాలు వీళ్ళకు తెలియజేసి , ఎప్పుడు ఖమ్మ వెళ్ళినా తిరుగు ప్రయాణం లో పుల్లయ్య దంపతుల ఇంటివద్ద పది నిమిషాలు ఆగి ,ఆ దంపతులు మాకు ఆప్యాయంగా ఇచ్చే స్ప్రైట్ తాగి వచ్చేవాళ్ళం -ఈ సారి మేం ఫ్రైట్ బాటిల్ కొని వాళ్ళకిచ్చి ,మేమూ తాగి  సరసభారతి పుస్తకాలు ,పళ్ళు ,ఆ దంపతుల చేతిలో పెట్టి,బిటెక్ పాసి బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న  వాళ్ల అబ్బాయికి పెళ్ళిసంబంధం ఖాయమైనదని విని సంతోషించి ,ఉదయం 11 గంటలకు అక్కడినుంచి బయల్దేరి బోనకల్లు ,ముష్టి కుంట మీదుగా ఖమ్మం మధ్యాహ్నం 12 -30 చేరి అప్పటికే అన్ని కార్యక్రమాలు అయి, మాసికంమొదలు  పెడుతున్నారని తెలుసుకొని ఇచ్చిన కాఫీ పుచ్చుకొని  అప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చిన మా బావమరది రుక్మిణి దంపతులతో కబుర్లు చెప్పి కాసేపు విశ్రాంతిగా కుర్చీలలో చేరబడ్డా౦ .

భోక్తలు భోజనాలు చేస్తుండగా ఆ పెద్ద వదినగారు అంటే మా శ్రీమతి పెద్దక్కగారిని చూసి ,పైన డాబా పై ఏర్పాటు చేసిన భోజనాలకు ఉపక్రమించాం . మూర్తిగారి కూతురు మంజుల మామాగారు  ,బావగార్లు ఆడపడుచులు ,మూర్తిగారి కొడుకు సూర్యం బామ్మర్దులు , బాబాయి కొడుకు, కూతుళ్ళు , యజ్ఞశ్రీ  మా నాల్గవ తోడల్లుడు స్వర్గీయ దక్షిణామూర్తి గారి కూతుళ్ళు మాధవి ,పద్మజ ,సూర్యం కొడుకు మామగారు అత్తగారు  మా ఆవిడ మేనమామ కొడుకు చలపతి ,మా ఆవిడ చెల్లెలు స్వర్గీయ దుర్గ కూతురు ,మాఆవిడ మేనమామకొడుకు శ్రీనివాస్ ,అతని తమ్ముడు శివయ్య దంపతులు ,మూర్తిగారి స్నేహితులు  అందరూ వచ్చారు .భోజనాలు అందరివీ అయ్యేసారికి మధ్యాహ్నం 3-15 అయింది . వంటలు బాగున్నాయో లేదోకాని నాకేమీ సహించక ‘’కతికా’’.

సాయంత్రం 4 గంటలకు ఆనంద్ దంపతులుముందే బుక్ చేసుకున్న  హైదరాబాద్ బస్ లో వెళ్ళిపోయారు .బ్రహ్మగారు 4-15 కు ఆశీర్వచన కార్యక్రమం మొదలు పెట్టారు వేద పనసలతో ఆశీర్వచనం బాగానే జరిపించారు సూర్యానికి .ఆయన మామూలుగా వేదాంత ధోరణిలో పుతృనికిఉన్న మూడు రుణాలు, వాటిని ఎలా తీర్చుకోవాలో వివరించారు .ఆయనే బంధువులేవరైనా మాట్లాడండి అంటే నేను మంజుల మామగారిని నాలుగు మాటలు చెప్పమన్నారు .ఆయ చెప్పలేనంటే ఆయన కొడుకు, నాకు సాహితీ  మిత్రుడు అందరి తరఫునా నన్ను మాట్లాడమని కోరారు .నేను ‘’మా పెద్దతోడల్లుడు శ్రీరామచంద్ర మూర్తిగారు సాక్షాత్తు ఆ శ్రీరాముని సద్గుణాలన్నీ మూర్తీభవించిన సహృదయులు .ఆనందంగా జీవించారు .సంతృప్తి తో సార్ధక జీవితం గడిపారు .మునిమనవలలను కూడా చూసి పరమసంతోషం చెందారు .ఆయనకుమారుడు సూర్య౦, కోడలు స్వర్ణ చాలాబాధ్యతగా ఆయన్ను కనిపెట్టుకొని ఉన్నారు .ఎంతటి ఖర్చుకైనా వెనకాడక వైద్యం చేయించారు .ఆయనా కొడుకు సేవలకు మురిశారు .కూతురు మంజుల అన్నకు సహకారిగా ఉంటూ, తలిదండ్రులను చూసుకొన్నది .మూర్తి గారి అల్లుడు సత్యనారాయణ ఉత్తమోత్తముడు .అలాంటి అల్లుడు మూర్తి దంపతులకు లభించటం వాళ్ల అదృష్టం .ఈ 12 రోజులు ఇక్కడే ఉండి బావమరది సూర్యానికి అండగా నిలిచి కార్యక్రమాలను చక్కగా దగ్గరుండి జరిపించాడు .మావదిన గారు  భర్త మూర్తిగారికి తానేస్వయంగా వండి వడ్డించి ఆయన కు తృప్తిగా భోజనం పెట్టాలనే తపనతో ఖమ్మం లోనే ఉండిపోయారిద్దరూ .మూర్తిగారు ఆఖరి క్షణాలు స్వంత ఇంటిలో గడవటం, ఇక్కడేఆఖరి శ్వాస విడవటం   ఆయన మంచి మనసుకు అద్దం పట్టే విషయం .దినవారాలను సూర్యం చాలా నిబద్ధతతో నిర్వహించాడు .తండ్రిబాధ్యతను అన్నా చెల్లెలు ఎలా నిర్వహించారో, ఇప్పుడు అమ్మబాధ్యతనూ అలాగే చేబ తారనటానికి ఏ మాత్రం సందేహం లేదు. వాళ్ళిద్దరూ , వీళ్లిద్దరికి కను రెప్పలు .’’అని ముగించాను .మధ్యలోనే టీలు ఇస్తే తాగాం .

సాయంత్రం 5-30 కు మేం నలుగురం కారులో బయల్దేరి  బెజవాడలోజానకిగారిని ఇంటివద్ద దింపేసి ,ఇంటికి ఉయ్యూరు తిరిగి వచ్చేసరికి రాత్రి 9-30 అయింది .పొద్దున్న ఉప్మాను చెరికొంచెం తిని, మజ్జిగ తాగి ఇది ‘’కొట్టి’’రాత్రి 11-25 కు పూర్తి  చేసి, పడక సీనుకు రెడీ అవుతున్నా .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-9-18 –ఉయ్యూరు


Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కొంగర కలాన్ -కొంగర మల్లయ్య గుట్ట 

కొంగర కలాన్ -కొంగర మల్లయ్య గుట్ట

కేసి ఆర్ జరిపిన కొంగర కలాన్  సభ పేపరు, ఛానెల్ వార్తలు ,”కుండబద్దలు ”కొట్టే కాటా సుబ్బారావు విశ్లేషణ చూశాక  నా కెందుకో కొంగరమల్లయ్య గుట్ట జ్ఞాపకం వచ్చింది . ఇంతకీ ఇదెక్కడుంది అంటారా ? జగ్గయ్యపేట కు వెళ్లే  దారిలోచిల్లకల్లు దగ్గర ఎడమవైపు ఉన్న ఎత్తైన కొందనే కొంగర మల్లయ్య గుట్టఅంటారు .పూర్వం అంటే సుమారు  అరవై ,డెబ్బై ఏళ్ళ క్రితం ఈ ప్రాంతమంతా విపరీతమైన చెట్లు ,చిన్నగుట్టలు ,పొదలతో భయంకరంగా ఉండేదట మా అమ్మావాళ్లు చెప్పారు .అప్పుడు  ఎక్కడికి వెళ్లినా రెండెడ్ల బండీ ప్రయాణమే . అసలే మట్టి ఇరుకు రోడ్డు . బ0 డీలో ప్రయాణమంటే ఉయ్యాలలూగటమే . దీనికి తోడు దొంగల ,బంది  పోట్ల భయం  తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగించేవారట . అటువంటప్పుడు మనకు ప్రాణ సంకటం అయితే దొంగలకుజనం  ప్రాణాలతో చెలగాటమేకదా .ఈ గొప్ప అవకాశాన్ని  చేజిక్కించుకున్నాడు కొంగర మల్లన్న అనే గజ దొంగ .

  మల్లన్న గుట్టపైకి ఎక్కి నివాసం ఉండేవాడు .వాడికి వందలాది అనుచరగణం వీర విధేయంగా ఉండేవారట .వాడి ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ . ఈ దారిలోకాలినడకన వెళ్లే  ప్రయాణి కులను ,బండ్లలో  వెళ్లేవారిని ఆపి వారిదగ్గరున్న సర్వం దోచేసేవారు . ఇవన్నీ కధలు గాధలుగా ప్రచారం అయ్యేవి.  మల్లన్న అనుచరుల ఆగడాలు రోజు రోజుకీ మితి మీరు పోయాయి   బిక్క చచ్చి ప్రయాణంచేసేవారానాడు  .
  మల్లన్న ఒక గొప్ప టెక్నీక్ ఉపయోగించేవాడట దోపిడీకి .గుట్టపైనుంచి గట్టిగా అరుస్తూ ”నేను కొంగర మల్లయ్య ను .మీ దగ్గరున్నదంతా మా వాళ్లకు ఇచ్చి ప్రాణాలు దక్కించుకొ0డి  .నేను దిగివచ్చానా మీ ప్రాణాలు కూడా ఉండవు మీ ఆడాళ్ళమానాలూ దోచేస్తా . అంతదాకా తెచ్చుకోకండి .డబ్బు, విలువైన ఆభరణాలు పొతే మళ్ళీ మీరు సంపాదించుకోవచ్చు ప్రాణ ,మానాలు పొతే మళ్ళీ రావుకదా .కనక నా హెచ్చరికను  గమనించి  మీ దగ్గరున్న సమస్తం మా వాళ్లకు ఇచ్చేసి హాయిగా ముందుకు సాగి పొండి ‘  అని మీసాలు మెలేస్తూ భయపెట్టేవాడు . దొంగ అంటేనే కాళ్ళు వణుకుతాయి మరి గజ దొంగ బంది పోటూ అంటే గజగజ  వణకటమే కదా . పాపం చేసేది లేక, దిక్కు తోచక, రక్షణ లేక  వాడి పాలబడి సర్వస్వము అంటే మాన ప్రాణాలు పోగొట్టుకోవటం కంటే ఉన్నది వాడి మొహాన పడేసి ప్రాణాలు దక్కించుకోవటం మంచిది అని భావించి ,ఉన్నది అంతా  ఊడ్చేసి  నిలువు దోపిడీ ఇచ్చేసి గండం నుంచి బయట పడే వాళ్ళట  . వాడి ఆగడాలు రోజు రోజుకూ మితిమీరి పోతున్నాయి .వాడు కొండ దిగకుండా ఇదంతా మేనేజ్ చేసేవాడు .వాడిని ఎవ్వరూ చూసిన పాపాన పోలేదు .ఎలాఉంటాడో తెలీదు వాడి అరుపులు కేకలు హెచ్చరికలే దోపిడీలకు పెట్టుబడి . వాడి మందీ మార్బలం సరేసరి  ,ఇలా చాలాకాలం గడిచిపోయింది . పైన వాడొక్కడు మాత్రమే ఉంటాడని కొందరు సాహసవంతులైన యువకులు గ్రహించారు .వాడి గుట్టు రట్టు చేయాలని సంకల్పించుకొన్నారు .
    యువకబృందం బందరు జగ్గయ్యపేట దారి గుండా కాకుండా  కొండ అవతలి వైపు నుంచి కొన్ని రోజులు కస్టపడి ఎక్కి కొంగర మల్లన్న ఉండే స్థావరం చేరుకున్నారు .వాడు కుర్చీలో లుంగీతో ,తెగబారెడు మీసాలతో భయంకరంగా కని పించాడు .చేతులున్నాయి కానీ వాడికి కాళ్ళు లేవు అని గ్రహించారు . అంతే ఒక్కుమ్మడిగా వాడిపై దాడి చేసి చంపి పారేశారు . వాడు జనంతో ”నేను దిగితే మనిషిని కాను ”అని ఎందుకు భయపెట్టే వాడో గుట్టు తేల్చారు.  దిగటానికి అసలు వాడికి కాళ్ళు ఉంటేగా . దొంగరాముడు సినిమాలో రేలంగి మీసం మెలేసి ”నేను వీరభద్రయ్యను ”అనటం యెవడైనా అతడికి బుద్ధి చెబితే ”కాదు కాదు వొట్టి భద్రయ్యనే”మీసం దించేసి అనటం మనకు తెలిసిందే . మల్లయ్య చచ్చాక జనం పీడా విరగడైంది . హాయిగా ఊపిరి పీల్చుకొని ప్రాణభయం లేకుండా ప్రయాణాలు సాగిస్తున్నారు .కానీ ఆ గుట్టకు ”కొంగరమల్లయ్య గుట్ట ”అనే పేరు మాత్రం సార్ధకమై పోయింది .అప్పటినుంచీ లోకం లో ఎవరైనా బెదిరిస్తే ”నువ్వో కొంగరమల్లయ్యవు నీకు భయపడేదేంటి “‘అనే సామెత వాడుకలోకి వచ్చింది .
 ” కత బానే సెప్పావ్ సామీ ” దీనికీ కొంగర కలాన్  కు సాపత్యమేంటి అంటారా ?అక్కడ కేసి ఆర్ సభకూడా వస్తారనుకొన్న పాతిక లక్షలజనం రాకుండా  వేల  వాహనాలు పెట్టి మనిషికి రెండు వేలిచ్చి తోలుకొచ్చినా పాకెట్లు , సీసాలు సరఫరా చేసినా మూడు నాలుగు లక్షలకు మించి జనం రాకపోవటం కొంగరమల్లన్న ప్రగల్భాలులాగానే  ఉన్నాయని నేను చెప్పలేను బాబూ . తనకు వారసుడు కొడుకు తారక్ అతడే గులాబీకి తారకమంత్రం అని ప్రకటిద్దామనుకొంటే  అంటా ఉల్టా పల్టా అయిందని నేను చెబితే బాగుండడదు గురూ . ఏవేవో పాలసీ మేటర్లు జనాలకు తాయిలాలుగా అందిద్దామని అనుకొన్న అధినాయకుడి గుండెల్లో జన్నాన్ని  చూసి  గుండెల్లో రాళ్ళుపడి ,మాటలు తడబడి గొంతు తడారిపోయి కక్కా లేక మింగా లేక పచ్చి వెలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్లు విలవిల్లాడాడని నే సెప్పలేనుసారూ . రెండు నెలలనుంచి తానూ మీడియా ఊదరకొట్టిన ముందస్తు ప్రకటన చేద్దామని వచ్చి ఖంగుతిని చెప్పలేకపోయాడని చెపితే అస్సలు బాగుండదయ్యా . కొడుకు మీద ప్రేమ,  వ్యామోహం ”గుడ్డి రాజు”  వంశానికి యెంత క్షోభ తెచ్చిందో తెలియందేమిటి చెప్పాల్సిన అవసరమేంటి అయ్యవారూ .. ఇప్పుడు తప్పు తెలిసి మేనల్లుడికి బాధ్యత అంతా నెత్తికెత్తటం వివేకమోకాదో మీరే తెలుసుకోండి సాములూ . అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ తో భాయ్ భాయ్ అని సీట్లు కొల్లగొట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయం కప్పుకొని మళ్ళీ దండుకొందామన్న అత్యాశ గులాబీ నాయకుడిదని నే సెప్పాలాసారూ. ఓటర్లు ఫూల్స్ అవుతారో అధినాయకుడిని ఫూల్ ని చేస్తారో వేచి చూదాం బాబుల్లారా .
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-9-18 -ఉయ్యూరు
  

image.png

Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Posted in రాజకీయం | Tagged | Leave a comment

సరసభారతి 132వ కార్యక్రమం ఒక చిన్న పెద్ద చేర్పు

నిన్న జరిగిన బ్రహ్మశ్రీ  కోట గురు వరేణ్యుల  గురు పూజోత్సవ సందర్భంగా రాసిన ”ధన్యవాదాలు ”లో అతి ముఖ్య విషయం రాయటం మరచిపోయాను . మన్నించండి . అదే -గురు పూజోత్సవానికి సన్మానం అందుకొంటున్న బ్రహ్మశ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారిపై ” నవ రత్న పద్యాలు”  రాయించి సన్మానం లో చదివిస్తే బాగుంటుందని పించింది .నాకోరికను నాకు, సరసభారతి ఆత్మీయులు, కవి ,శర్మగారి దగ్గర బంధువు, హైదరాబాద్ వాసి, మన ”దైవ చిత్తం ”గ్రంధానికి ఆంగ్లమూలం “”ది విల్ ఆఫ్ గాడ్ ”రచించిన శ్రీ ఎసిపి శాస్త్రి గారికి సుమారు 15 రోజులముందే ”ఈ సాహితీ సాయం చేయగలరా ?”అని మెయిల్ రాయటం ,,వారు నిమిషాలమీద స్పందించి మహద్భాగ్యమనటం ,నాలుగైదు రోజుల్లోనే నవరత్న పద్యాలు రాసి వారు నాకు మెయిల్ చేయటం  చక చకా జరిగిపోయాయి  .వీటిని డిటిపి చేయించే బాధ్యత మా అబ్బాయి  రమణకు అప్పగిస్తే ,,వాడు శ్రీ సుశీల్  చేత చేయించి, అందమైన డిజైన్ గా   అరటి చెట్టు, చెరకుగడ లతో రంగుల సమ్మేళనం తో కల్పన   చేసి బహు అందంగా తీర్చిదిద్ది ఇస్తే ,అందాన్ని ద్విగుణీకృతం చేసే ముచ్చటైన ఫ్రే౦ కట్టించి తెచ్చాడు . సభలో అమరవాణి తెలుగు పండిట్ శ్రీ మూర్తి గారు శ్రావ్యంగా చదివి కవి  గారి కవిత్వానికి  మరింత వన్నె తెచ్చారు ఇది చింతలపాటి వారికి ఘనమైన సత్కారమై భాసించింది.  దీనికి శ్రీ శాస్త్రి గారిని ,మా రమణ .,,సుషీల్ లకు శ్రీ మూర్తి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు ఆలస్యంగా నైనా అందజేస్తున్నాను -దుర్గాప్రసాద్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 132వ కార్యక్రమంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని బ్రహ్మశీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురుపూజోత్సవం

ధన్యవాదాలు

 సరసభారతి 132వ కార్యక్రమంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని బ్రహ్మశీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురుపూజోత్సవంగా స్థానిక అమర వాణి  హైస్కూల్ తో ఆ విద్యాలయం లో 5-9-18  బుధవారం నిర్వహించటానికి అన్నివిధాలా సహకరించిన  కమ్మని విందుభోజనం తో అందించి సంతృప్తి పరచిన ఆవిద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీ నాగరాజు గారికి ,ఉపాధ్యా విద్యార్థి బృందానికి ధన్యవాదాలు  . ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు  శ్రీసోమేపల్లి వెంకట సుబ్బయ్యగారికి , కార్య దర్శి శ్రీ చలపా క ప్రకాష్ గారికి ,,ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్ శ్రీ ఖుద్దూస్ గారికి ,అమెరికాలోని అలబామా రాష్ట్రము లో ఉన్న హ0ట్స్  విల్ తెలుగు సంఘాధ్యక్షులు ,శ్రీ ద్రోణవల్లి రామ మోహనరావు గారికి  వారితో పాటు విచ్చేసిన శ్రీ కర్రీ శివ ప్రసాద్ గారికి   ఈనాటి విశిష్ట అతిధి పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారికి  వారితోపాటు వచ్చిన వారి  కుమారులు శ్రీ పురుషోత్తమ ప్రసాద్  వారి శిష్యులు నటులు శ్రీ గుప్త గారికి ,మూర్తి ,ప్రసాద్ గార్లకు,శ్రావ్యమైన   ప్రార్ధనతో సభ ప్రారంభించిన సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారికి,  కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి కి  టెక్నీ కల్ సలహాదారు శ్రీ వి బి జి రావు గారికి కృతజ్ఞతలు
  ఉపాధ్యాయ  దినోత్సవ పురస్కారమందుకున్న డా శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి, శ్రీ మూర్తి, శ్రీ శర్మగార్లకు అభినందనలు . శ్రీ కోట గురు వరేణ్యులు బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శర్మ శ్రీమతి సీతమ్మ గార్ల   స్మారక  నగదు పురస్కారం ఏర్పాటు చేసి   ఈ రోజు అందజేసినసరసభారతి ఆత్మీయులు  శ్రీ మైనేని గోపాల కృష్ణ  శ్రీమతి సత్యవతి (అమెరికా ) దంపతులకు ,తమ తలిదండ్రుల పేరిట స్మారక పురస్కారం ఏర్పాటు చేసి అందేసిన కోట గురుపుత్రులు కోట సోదరులు  శ్రీ కోట  చంద్ర శేఖర శాస్త్రి  శ్రీ సీతారామాంజనేయులు  శ్రీ గాయత్రిప్రసాద్ గార్లకు ధన్యవాదాలు .
   నగదు పురస్కారమందుకున్న 2018 మార్చి పదవ తరగతి మొదటి స్థాయి సంపాదించిన అమరావతిని విద్యార్థినులు కుమారి డి .సపూర, కుమారి ఎం .  .తేజశ్విని ,(5 వేల  రూపాయలు )శాంతినికేతన్  హైస్కూల్   ప్రధమస్థాయి పొందిన చి కరిమి పవన్ కుమార్ (5 వేల  రూపాయలు ),స్థానిక ఏజీ అండ్ ఎస్ జి సిద్దార్ధ కళాశాల లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సోదరీమణులు కుమారి చౌడాడ మౌనిక ,హేమలత  సిస్టర్స్ కు ( 5 వేల రూపాయలు ),గురుపుత్రులు ఏర్పాటు చేసిన నగదు బహుమతి  అందుకున్న  స్థానిక ఏజీ అండ్ ఎస్ జి జూనియర్ కాలేజీ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్థిని కుమారి  గూడూరి చరిత(10 వేల  నూట పదహారు రూపాయలు ) లకు నగదు బహుమతి తోపాటు సరసభారతి గ్రంధాలు రెండు అందజేశాము ఆ చిరంజీవులు అభి వృద్ధిలోకి రావాలని అందరు   దీవెన లందించారు .
 చింతలపాటివారికి పూల కిరీటం ,నూత్న వస్త్రాలు శాలువా 2 వేల  రూపాయలు  ,సరసభారతి గ్రంధాలు అందజేశాము . ఉపాధ్యాయులకుకూడా కిరీటం  శాలువా ,సరసభారతి గ్రంధాలు పుష్పమాలలతో గౌరవించాము ద్రోణవల్లి, సోమేపల్లి, చలపాక గార్లకు శాలువాలతో సన్మానించాము . కర్రి  ప్రసాద్ గారితో ,శర్మగారితో వచ్చినవారితో ప్రసంగింప జేశాము .అందరు పరమానందం పొందారు గొప్ప అనుభవం గా భావించారు .
  నగర పంచాయితీ అధ్యక్షులవారితో సభాముఖంగా చింతలపాటి వారికి ఉయ్యూరులో పెద్ద ఎత్తున ముఖ్యులందరి సమక్షం లో పౌరసన్మానం ఘనంగా నిర్వహిస్తే వారి విద్వత్తుకు గౌరవంగా ఉంటుందని సూచించాను వారు సహృదయత తో స్పందించి తప్పని సరిగా చేద్దామన్నారు అందరూ కరతాళ ధ్వనులతో అభినందించారు  .   ఉయ్యూరు ఎసి లైబ్రరీకి శ్రీ  మైనేనిగారు భూరి విరాళమిచ్చినప్పుడు ఈనాటి  ఏం ఎల్ సి శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఒక నిర్మాణ కమిటీని వేసి నన్ను కన్వీనర్ చేశారు ఆకమిటీలో  నేటి ఉయ్యూరునగర పాలక చైర్మన్ ఖుద్దూస్ గారు ఒక సభ్యులని సభాముఖంగా జ్ఞాపకం చేశాను .
  నా శిష్యుడు ఈనాటి పురస్కారగ్రహీత కాలేజీలో తెలుగు లెక్చరర్  సరసభారతి ఉపాధ్యక్షుడు డా శ్రీ గుంటకవేను గోపాలరెడ్డి మా దంపతులిద్దరికీ పుష్పమల శాలువా ఫలాలతో సన్మానించి ఆశీస్సులందుకొన్నాడు . దీనికే మేము ఆశ్చర్యపోతుంటే ప్రిన్సిపాల్ నాగరాజు దంపతులు అతని తండ్రి నా శిష్యుడు శ్రీ నందబాబు దంపతులు  మా దంపతులకు పూల కిరీటం పెట్టి శాలువా కప్పి పుష్పహారం వేసి గజమాలతో ఘాన సత్కారం చేసి మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేశారు.  ఆశీస్సులు పొందారు . మా జీవితం లో  ఇంతటి అపూర్వ సన్మానం అందుకోవటం ఇదే మొదటి సారి .ఆ దంపతులకు శుభాశీస్సులు తెలిపి ఇప్పటి దాకా మేము ఇక్కడ చేసిన సత్కారాలన్నీ వీరి సత్కారం తో వెలవెల బోయాయని చెప్పాను చప్పట్లు మారు మ్రోగాయి .
 ఒక మంచి విద్యాలయం లో క్రమశిక్షణ గల విద్యార్థుల సమక్షం లో మూడున్నర గంటల కార్యక్రమ0 మహా కన్నులపండువుగా జరిగింది . మా కోట గురుదేవులు నిండుమనసుతో మమ్మల్ని అందర్నీఆశిర్వదించి అభినందించి ఉంటారని భావిస్తాను . కవిగారు తమ అవధాన విశేషాలను తమ కవితా శక్తినీ అర్ధమయేట్లు చక్కగా ప్రసంగించి విద్యార్థులకు గొప్ప ఆనందం కల్గించారు .ఈ సభ విజ యం అమర వాణి  విద్యార్థి ఉపాధ్యాయ బృందానిదే అని వేదికపై ఉన్న పెద్దలందరూ ముక్త కంఠం తో మెచ్చారు .
  రమ్యభారతి లో నేను చింతలపాటి వారిపై రాసిన వ్యాసం వలన”పేటికాంతర్గతం”అని దుర్గాప్రసాద్ గారు చెప్పిన విషయం తెలుసుకొని  కవి గారు కొన్ని వేలమంది దృష్టిలోపడ్డారని శ్రీ చలపాక అభినందించారు .ఇలాంటి కార్యక్రమ0 విద్యాలయం లో జరగటం దానిలో ”విశ్వం పట్టని” కవి గారికి సన్మానం చేయటం అద్భుతం అన్నారు శ్రీ సోమేపల్లి . ద్రోణవల్లివారు తమ మిత్రులు శ్రీ మైనేని వారు  ఈ కార్యక్రమం  ఫోటోలు చూసి తాము చెప్పగా విని పరమానంద భరితులౌతారని అంతటి సుమనస్కులని శ్లాఘించారు. తాము ,కఱ్ఱివారితోకలిసి ఎసి లైబ్రరీ చూసి మైనేని గారికి ఫోటోలద్వారా   వివరిస్తామని అన్నారు . మొత్తం మీద అందరూ ఆనందించిన మధురమైన క్షణాలు .తీపిగుర్తులు . ఇదంతా సరసభారతి కార్యవర్గం కృషి, సాహిత్యాభిమానులు ఆదరణ, వితరణ శీలురతోడ్పాటుఅని సవినయంగా మనవి చేస్తున్నాను .
  ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-9-18-ఉయ్యూరు .. . .

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

5-9-18 బుధవారం ఉదయం గురుపూజోత్సవ సందర్భంగా సరసభారతి 132 కార్యక్రమ

5-9-18 బుధవారం ఉదయం గురుపూజోత్సవ సందర్భంగా సరసభారతి 132 కార్యక్రమ౦గా అమరవాణి హైస్కూల్ తో సంయుక్తంగా ఆ స్కూల్ లో జరిపిన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం, కవి రాజమౌళి, కవి సార్వభౌమ,అష్టావధాని ,బహు కావ్యకర్త బ్రహ్మశ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారికి ఘన సన్మానం, ఉపాధ్యాయులకు సత్కారం,శ్రీ మైనేని గోపాలకృష్ణదంపతులు ఏర్పాటుచేసిన శ్రీ కోట గురువరే ణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం , శ్రీ కోట సోదరులు తమ తలి దండ్రుల జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన నగదుపురస్కార ప్రదానం ,అన౦తర౦ మేము ఊహించని విధంగా,అకస్మాత్తుగా అమరవాణి విద్యాలయం మా దంపతులకు జరిపిన అపూర్వ సత్కార చిత్రమాలిక

https://photos.google.com/share/AF1QipM2Yw5pbf_5XHRI-2MDQq8iStYSk1DVNzNzHWBM2YhgvVrhNHocEPq273WTwPw3xA/photo/AF1QipPvijaGogQ9K1A4HU6_GTcb4zG_IOfmTua11tPS?key=WjNQYk1McnBDbmxlWHJmOTJFd2FWX3VkMmVPSndB

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సన్మాన పత్రం

                       శ్రీ 
          కవి  సార్వభౌమాది షోడశ బిరుదాంకితులు ,బహుపద్య,వచన,నాటక గ్రంథకర్తలు,
                 అనేకానేక సన్మాన గృహీతలు, సర్వదా సుప్రసన్న రస స్వభావులు …. అయిన  
                        శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారికి 
                            (నదీశ )
                     పరోక్ష అంతేవాసులు సమర్పించు పద్యహారతి 
 
      1  ఉ // శ్రీ కమలాక్షి చెల్వమగు శ్రేయ కవిత్వములిచ్చి ప్రోవగా 
                     ఆ కవితా వధూటి మది యర్మిలి బ్రహ్మగ నెంచె నీ జతన్   
           ఆ కవి సర్వవేదు సతి ,యంబ వరంబుల గంగ ముంచగా 
                   ధీ కలితాత్మ ! యో కవి ‘నదీశ ‘ మమున్మదినుంచు మెప్పుడున్ 
 
 
        2    ఆ // ప్రభవ వత్సరమున ప్రభవించి నాడవు         
                    భవుడొసంగెనేమొ భవ్య కవిత 
                    కవి పదమ్ము గొనుచు గరళ కంఠుని ‘రాజ    
                      మౌళి ‘పదమునందు మనిపినావు . 
 
 
       3     సీ // వంశము ‘చింతలపాటి ‘ట !కవితయో 
                        మధురమధుర మగు మంచి తేనె 
                     పేరు నృసింహుడు వీడ డెన్నడు నవ్వు 
                           శాంతమూర్తిగ నుండు చనవుమెండు 
                      కవనమే దీక్షగా కలము సాగింపగా            
                           ‘దీక్షిత’ నామంబు దిటవు నొందె 
                      శర్మ నామము , గాని ,సమరానికి బిలుచు 
                             సమపండితుల ఘనాశ్చర్య రీతి 
                      ఛాత్రులన్ని దిశల శ్లాఘ్యు లై కీర్తిని 
                            పొంద .. తలచు తాను పొందినటుల 
   
                      తేగీ // గౌరవంబు పొంది జలధి గౌరవంబు 
                               సరణి , గురువను పేరును సార్థకంబు               
                               జేసె , తను ‘నదీశు’ డనగ చిఱు నగవుల 
                               సొగసు చూపు ‘నదీశు’ ని జూడ శుభము  
                              
             4. సీ// కోగంటి పాలెమ్ము కొలువునిన్బిలిచెను   
                           పేరు నిల్పెద వంచు ప్రేమతోడ
                        చందర్ల పాడిక చదువులు నేర్పెను
                              తన కీర్తి దాయాది వని తలంచి
                          వేదాంత వర్ధినీ వేల్పుల నెలవులో
                                సంస్కృతంబును నేర్చి చతురుడవయ
                           భావనారాయణ పలు భాషలు  గఱుపఁ
                                   తెలుగు మధువు ద్రావ జెలగితీవు
                           తేగీ // మీసములు పెంచు వయసున మీసములను
                                   ద్రిప్పి, యుభయ భాషలవారిదీప్తి కొల్ల
                                   గొట్టి కవిపేరు గణియించి కొమరు మిగుల
                                    బోధ వృత్తి యను జలధి మునిగినావు
              5         తేగీ // కళలు పదునాఱు శశికిని గగనమందు
                                   బిరుదులు పదునాఱు ‘నదీశ ‘ వరుని కిలను
                                   పరులు పదునైదు బిరుదులు గరిమనీయ
                                   స్వీయ నామంబె బిరుదాయె విపులయందు
                                    రవియొసంగెను కళలను రాజుకనిరి
                                    సూరి జనులోసంగిరి యిల సూక్తినిధికి
           6            సీ // విశ్వమంత వెదకి వేల్పుల ముప్పది
                                        మువ్వుర దెచ్చిన పుణ్యు వోలె
                                  పద్యకావ్యములను బహులోక ప్రీతిగా
                                       రచన జేసి భువిని రాణ కెక్కె
                                  తాను నదీశుడు తన తల యొకగిరి
                                           గిరినుండి పాఱెడు సురనదివలె
                                  వచన రచన జేసి వచన వనధికి తా
                                          నొకవచన సతిని యొసగె కరుణ
                            తేగీ // నాటకము వ్రాసె జగతిని నయపథమున
                                    నడుప ‘ధర్మవిజయము’ను కడునిపుణత
                                     ‘దానవైభవము’ను దెల్పు తలపు తోడ
                                     వ్రాసె బాస యందములందు వఱద పాఱ
                  7.     తేగీ // సంస్కృతంబున రచనలు చతురరీతి
                                    జేసి తనవిద్యకు సొబగు చెక్కి చెక్కి
                                      పండితులలోన మాన్యత బడసె నాడు
                                       దేవతలు మెచ్చుచు నొసఁగఁ దీవెనలను .
                 8.   సి //     ఎన్నెన్ని వ్రాసెనో యెన్నెన్ని జూచెనో
                                         రాత్రిమ్బగళ్లును రచన రచన
                                  ముద్రితంబులు కొన్నముద్రితంబులు కొన్ని
                                       గుట్టలైబడియుండు కొలువుదీరి
                                  కన్యను వరునకై కర తోయ మిడినట్లు
                                       కావ్యదానమొనర్చు ఘనుల జూచి
                                  మదిలెక్క రానట్టి చదువులెన్నింటినో
                                           పరుల కొఱకు వ్రాసి వరుల జేయు
                             తేగీ // ఎల్లాదాటని సంద్రము కొల్లబోని
                                      చదువలలవలె గ్రంధాలు సాగిపోవు
                                       సాహితీ క్షేత్రమున కల్ప శాఖి వోలె
                                       నిత్యఫలముల నందించు నేర్పు గల్గి
                                       సేద్యమును జేయు శిల్పి కృషీవలుండు
                  9          సీ // కవిరాజ మౌళిగా కవిశిరోమణి యౌచు
                                              మధుర భారతి యౌచు మధురకవిగ
                                 కవిసార్వభౌముగా కవివతంసునిగను
                                         సాహిత్య సాగర సత్కవీంద్ర
                                 ఆంధ్ర గోవర్ధనుడని జనులు పొగడ
                                          భక్త కవివరేణ్య పండిత పర
                                   మేశ్వరుడంచు నా యీడ్యమౌ బిరుదులు
                                          కొల్లగొట్టితివీవు కుకవి వైరి
                         తేగీ // నీదు బిరుదులె  నీ శక్తి పాదుకొనగ
                                 జేసె నీ భువి ,యిట్టి నీ జీవనంబు
                                 పావనంబుగా !గోవుల భక్తిమీర
                                 పూజసలిపి యా పుణ్యము మూట గట్టి
                                   జగతి నీ దీక్ష తెలియంగ శాలనొకటి
                                   కొమరు మీరగ గట్టుచు గోవుకరుణ
                                  పొందు కవి నీవె !నిజమిది! మూడుమార్లు
                                  తెలిపెదము మము మదినుంచి దీవెనలిడు
                                             స్వస్తి    
                                                                రచన : అందుకూరి శాస్త్రి
                                                                   (A .C.P.Sastry)
                                                                 9440308760
Posted in సభలు సమావేశాలు | Leave a comment

గురుమహిమ -జ్యోతి-5-9-18 శ్రీ అందుకూరి శాస్త్రిగారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షపద్యాలు

గురుమహిమ -జ్యోతి-5-9-18 శ్రీ అందుకూరి శాస్త్రిగారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షపద్యాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
 సెప్టెంబర్ 5 బుధవారం భారత మాజీ రాష్ట్ర పతి ,మహాతత్వవేత్త   డా సర్వేపల్లి రాధాకృష్ణ  జయంతి గా జరిగే ఉపాధ్యాయ దినోత్సవ ,శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురు పూజోత్సవ శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్ 

image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

 బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యులగురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం 10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,132 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

 ఆహ్వానం ,పర్య వేక్షణం , –శ్రీ పి వి. నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి,వాసవి క్లబ్ ప్రెసిడెంట్

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభం –శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి  గౌరవాధ్యక్షులు

ముఖ్య అతిధి –శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు –ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు ,మరియు  స్పెషల్ అసిస్టెంట్ కలెక్టర్ –పులిచింతల ప్రాజెక్ట్

 విశిష్ట అతిధి – ”కవి రాజ మౌళి ,కవి సార్వ భౌమ ,మధురకవి ,అష్టావధాని ,కనకాభి షేకి ,70 గ్రంథాల  రచయిత ,విశ్రాంత తెలుగు పండితులు ,గుంటూరు జిల్లావాసి ,93 ఏళ్ళ శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారు

ఆత్మీయ అతిధులు –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు  ,శాసనమండలి సభ్యులు

                        శ్రీ అబ్దుల్ ఖుద్దూస్ – ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్

                                                శ్రీ చలపాక ప్రకాష్ గారు –రమ్యభారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి

                         శ్రీ ద్రోణవల్లి రామమోహనరావు గారు –అమెరికాలోని హ౦ట్స్ విల్ తెలుగు సంఘాధ్యక్షులు ,ప్రముఖ సమాజ సేవకులు

                        శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు ,శ్రీ కోట సీతారామంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )

   మొదలగు ప్రముఖులు

                      కార్యక్రమ వివరం

స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం  ,పుష్ప సమర్పణ

ఉపాధ్యాయ  దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు

1-విశిష్ట అతిధి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారికి

2-డా.శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి గారు –తెలుగు లెక్చరర్ ,ఏ. జి .అండ్ ఎస్. జి .సిద్ధార్ధ జూనియర్ కాలేజి

3-అమరవాణి పాఠశాల కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు

              ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ  బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి  శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం

1–2018 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన 1- శాంతినికేతన్  పాఠశాల విద్యార్థి-చి.కరిమి పవన్ కుమార్ కు ,-5 వేలరూపాయలు

 2- అమరవాణి పాఠశాల విద్యార్థినిలు  -కుమారి ఎం. డి.సఫూర మరియు కుమారి పి .తులసి లకుకలిపి – 5 వేల రూపాయలు .

ఉన్నత విద్య నభ్యసిస్తున్న పేద,ప్రతిభగల విద్యార్ధులకు  ఏర్పాటు చేసిన  ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం –

3- ఎ.జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కాలేజి –మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్ధినులలైన అక్కా చెల్లెళ్ళు -కుమారి చౌడాడ మౌనిక,కుమారి హేమలతలకు కలిపి  –రూ 5,వేల రూపాయలు .

-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు  శ్రీమతి సీతమ్మ దంపతుల  పేరిట    ఇంటర్ చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధికి  ఏర్పాటు చేసిన 10 ,11 6 రూపాయల స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార౦  –

4-2018 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 9.8 మార్కులతో  ఉత్తీర్ణత  సాధించి, స్థానిక .ఎ. జి. అండ్ ఎస్ .జి . సిద్ధార్ధ జూనియర్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న  -కుమారి గూడూరి చరిత కు

శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .

సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

                                                                        ఆహ్వాని౦చు వారు

ఉయ్యూరు -4-9-18                                            గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

                                                                     పి .వి .నాగరాజు –ప్రిన్సిపాల్ ,అమరవాణి

 దీనితో అమరవాణి వారి ఆహ్వానం జతపరుస్తున్నాను చూడండి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

3-9-18 సోమవారం సాయంత్రం శ్రీ సువర్చ లాంజనేయ స్వామి దేవాలయం లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ,డా .శ్రీ వేదాంతం శ్రీధరా చార్యులు గారిచే శ్రీ కృష్ణ లీలలు ప్రసంగం

3-9-18 సోమవారం సాయంత్రం శ్రీ సువర్చ లాంజనేయ స్వామి దేవాలయం లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ,డా .శ్రీ వేదాంతం శ్రీధరా చార్యులు గారిచే శ్రీ కృష్ణ లీలలు ప్రసంగం

https://photos.google.com/share/AF1QipMlJqFo9lsb3MokrzrajIa7n1zn1IQngbmJbXnlqSHJZXYzUVbuHanTJyKtdVEsJw?key=SXFTVGkya3hQbXQwVWtiS2ZSMmNoM1hEbGZvZDBn

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణం వందే జగద్గురుమ్

image.png
” రాధనురా ప్రభూ ,నిరపరాధనురా ,అనురాగ భావనారాధన మగ్న మానసనురా ”’
  ”ఏది మరొక్కమారు హృదయేశ్వర గుండెలు పుల్కరించగా ఊదగదోయి  యుష్మదీయ వేణు నాద  రసోదయ  రాగ డోలికలతో  జగమ్ము విస్మయమ్ముగ నిదురించే -కాంక్ష ”మర్రాకయి తేలేరా ప్రభూ ,రమ్ము ఒక్క క్షణమ్మేని  నిదురింతువుగానిరమ్ము  తెరచి యుంచితి నా హృదయ కుటీరమ్ము తలుపు ”అని రాధ ఆనందమయ గాధను కళ్ళకు కట్టించారు కరుణశ్రీ కవి .
  అసలు కృష్ణ అని అనగానే మనముందు నీలమేఘచ్చాయ తో ముగ్ధ మోహన రూపం తో” వ్యస్తష్టపాదం ” తో పెదాలవద్ద వేణువు తలలో నెమలి పించం మెడలో తులసిమాల  ,ప్రక్కన గోమాత ఉన్న నందనందన యదునందనుఁడు గోపాల కృష్ణుని దివ్య మంగళ రూపం కళ్ళ ముందు దర్శనమవుతుంది .ఆ రూపానికి జగత్తు అంతా పరవశించింది . ఆయన దేహచ్చాయ నీలవర్ణం .అనంతమైన ఆకాశం సముద్రం రంగు కూడా నీలమే .కనుక అది అనంతత్వానికి ప్రతీక -సింబల్ .అంతేకాదు అన్ని రంగులూ నీలం లో లయమవుతాయి .నిరాకార పరబ్రహ్మ తత్వానికి అదేప్రత్యేకత ..భాగవత రచన ప్రారంభిస్తూ వ్యాసమహర్షి కృష్ణుడు దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ కోసం మాత్రమే అవతరించలేదు -అజ్ఞానం ,విషయం వాంఛలతో ,సుఖ భోగ లాలసత్వం సంసారం లో మునిగితేలేవారికి తనలీలలద్వారా తరించే మార్గం చెప్పటానికి అవతరించాడు అంటే స్మరణ మాత్రం తో మోక్షాన్నిస్తాడని అర్ధం .అంతేకాదు ఇన్ని అవతారాలున్నాయి ఏ అవతర0 లో లేని లీలలు కృష్ణావతారం లో కనిపించి ఆ కృష్ణ లీలలకు సమ్మోహితులమవుతాం మన మనసు శరీరం అంతా ఆయన వశమైపోయే తాదాత్మ్య స్థితి అనుభవిస్తుంటాం .అదీ కృష్ణావతార పరమార్ధం . మేనమామకు  గండం ఉన్న రోహిణీ నక్షత్రం లో  ఆదివారం నాడు అడ్డ కాళ్లతో పుట్టాడు .పుట్టగానే తనను చంపటానికి సిద్ధపడిన ఏడుగురు దాసీలను చంపేశాడు . పూతన చనుబాలుతాగి దాని ప్రాణాలు తోడేశాడు దాని చనుబాలలో ఉన్న విషాన్ని  కూడా తాగేసి ,అంటే పాపాలన్నీ తాగేసి దాని శరీరానికికి పుణ్యమే మిగిల్చాడు పూతన దేహాన్ని తగలబడుతుంటే ”అగరువత్తుల సుగంధం వచ్చిందట . ”పునాతి దేహం పూతన ”అంటే దేహాన్ని పవిత్రం చేసేది అని అర్ధం . ఆమె విషం ఈయనకు అమృతం అయింది అందుకే ఏ పదార్ధమైనా భగవంతుడికి ”అమృతమస్తు ”అంటూ నైవేద్యం చేసి తింటాం అది అమృత స్వరూపంగా మారుతుంది అదే ప్రసాదం అంటే ప్రకృష్టమైన సాదం అంటే భోజనం పవిత్ర భోజనం . శకటాసుర తృణాసుర ,కాళీయుల ను సంహరించాడు .అహంకారం తో ప్రకృతిపూజను అవహేళన చేసిన ఇంద్రుడికి గోవర్ధనపర్వతం కొనగోటిపై నిలబెట్టి వరుణుడి గర్వాన్ని అణచి గోవులకు గోపాలురకు రక్ష కల్పించాడు . గోపాలకులతో కలిసి చద్దన్నాలు తిన్నాడు . దీన్ని చూసిన నారదుడు ”మహా మునీశ్వరులు కూడా దర్శించలేని కృష్ణపరమాత్మతో ఈ గోపీగోపాలురు హాయిగా ఆటలాడుకొంటున్నారు కలిసి ఎంగిలి కూడు తింటున్నారు వాళ్ళ అదృష్టం యెంత గొప్పదో ”అన్నాడు .పోతన్నగారైతే ఏకంగా కృష్ణుడితో  ఆవకాయ మాగాయ పచ్చళ్ళుతినిపించాడు  దీన్ని చూసిన వ్యాసభగవానుడు కృష్ణుడితో ”కన్నయ్యా  నువ్వుమరీ తెలుగుకృష్ణుడివి అయిపోయావు ”అని అన్నాడని కరుణశ్రీ ”భాగవతః వైజయంతిక ”లో సరదాగా రాశారు . ఏ ప్రాంతం వారికీ ఆ ప్రాంతపు కృష్ణుడుగా కనపడటం ఆయన ప్రత్యేకత . ఎంత ఆకర్షణ లేకపోతే భక్తమీరాలాయి సూరదాసు వంటి మహా భక్తులు తమహృదయాలలో ఆయనకు గుడికట్టి పూజించారు .అంతటి ఆకర్షణ ఉన్న అవతార పురుష్ఘుడు లేదు రామావతారం లో రాముడు నీలమేఘ శ్యాముడే .ఆయన మర్యాదా పురుషోత్తముడు .తాను  ఎలా ధర్మాన్ని పాలిస్తూప్రవర్తించాడో జనం అలా నడవాలని ఒక ఆదర్శ మూర్తిగా మార్గదర్శిగా నిలిచాడు . కృష్ణుడు ఆచరింపజేశాడు . ధర్మ చ్యుతి కలిగితే నిర్దాక్షిణ్యంగా బంధువైనా సరే సంహరించాడు .అలా సంహరింపబడినవారిలో మేనమామ కంసుడు  మేన బావ శిశుపాలుడుఉన్నారు   .  బావలవరుస అయినసమస్త కౌరవులు అర్జునుంచేత భీమునిచేతసంహరింపజేశాడు .చివరికి ధర్మ భ్రష్ఠులైన యాదవుల ప్రవర్తన సహించలేక యాదవ కులం లో ముసలం (రోకలి )పుట్టించి వారందరి నాశనానికి కారకుడయ్యాడు ఆయన ధర్మ పక్షపాతం అంతటి విశిష్టమైనది అందుకే ”ధర్మ సంస్థాపనార్ధం సంభవామి   యుగే యుగే ”అని అభయమిచ్చాడు . ఇంతటి ఆకర్షణీయ పురుషునికి అంతటి పగా ద్వేషమా అని అని అని పిస్తుంది అది ధర్మ సంస్థానార్ధమే అని గ్రహించాలి .
  నంద వంశ పురోహితుడు గర్గ మహర్షి నంద బాలుడికి ”కృష్ణ ”అని నామకరణం చేశాడు  .”కృష్ అంటే శాశ్వతత్వం ఉన్నవాడు” ణ ” అంటే చిదానందమైనవాడు అంటే శాశ్వత చిదానంద రూపుడైనవాడు అని అర్ధం .. ఇంకో అర్ధం సర్వాన్ని ఆకర్షించేవాడు .కృష్ -ఆకర్షణీయే.అధవా ఆకర్షయేత్ సర్వం జగత్ స్థావరం జంగమం -కృష్ణం ”అని గర్గముని తెలియజేశాడు .ఆయనే ”నామ్నా0 భగవతో నందః కోటీనాం స్మరణేచ యత్ ”అని వివరించాడు స్మరణ మాత్రం చేత తరింపజేసేవాడు .కృష్ణ అంటే సమస్తమును   సమ్మోహ పరచేవాడు ,ఆకర్షించేవాడు .సకాలానికి ఆత్మ అయినవాడు -ఆయనే ఆదిపురుషుడు . ..కృష్ణంధర్మం సనాతనం ” అంటే కృష్ణుడే  ధర్మం .మనకు రాముడుకాని కృష్ణుడు కానీ వాళ్ళ ధర్మాన్ని ఏదీ కొత్తగా బోధించలేదు సనాతన వైదిక ధర్మాన్నే వాళ్ళమాటలలో చెప్పారు అని మనం తప్పకుండా గ్రహించాలి ..వ్యాసుడు ”నిష్కల్మషులైన గోప గోపీ జనాలకు ఆయన అతి దగ్గరవాడయ్యాడు ”అన్నాడు  .
  శ్రీ కృష్ణుడు తాను పుట్టిన దగ్గర్నుంచి ప్రతి సందర్భం లో తన పరమేశ్వరతత్వాన్ని ,సర్వ సాక్షిత్వాన్ని ,సర్వజ్ఞత్వాన్ని ,సర్వ కారణత్వాన్ని ప్రదర్శించిన సంపూర్ణ అవతారం .అందుకే కృష్ణం వన్డే జగద్గురుమ్ అన్నారు .జగద్గురుత్వం అంటే ఎవరు ఎలా పూజిస్తే ,వాళ్ళను ఆ ప్రకారం అనుగ్రహిస్తాడని అర్ధం . ఎవరు ఏ మార్గం లో సేవించినా  ,ఆ దారి తననే చేరుతుంది అని స్పష్టంగా చెప్పాడు .అందుకే అన్ని ధర్మాలను అన్నిమార్గాలను సమన్వయము చేస్తూ ”భగవద్గీత ”అర్జును నిద్వారా మనకు బోధించి తన అవతార తత్వాన్ని తెలియజేశాడు. పూర్ణ కళలతో భగవంతుడు కృష్ణావతారం దాల్చాడు  .
  జరాసంధుడు 18 సార్లు ప్రతిసారీ 23 అక్షౌహిణుల సైన్యం తో మధురపై దాడి చేశాడు . ఆసైన్యాన్ని అంతటినీకృష్ణ బలరాములు ఇద్దరే సంహరించారు .ఒక అక్షౌహిణి అంటే 10 వేల  రథాలు ,20 వేల  గుర్రాలు 40 వేల  కాల్బలం  . అంటే23 x 18=414 అక్షౌహిణుల సైన్యాన్ని బలరామకృష్ణులిద్దరే సంహరించారు .దేనికోసం ధర్మ సంస్థాపనకోసమే . అంటే కర్తవ్య దీక్ష మూర్తీభవించిన అవతారం కృష్ణావతారం …
  స్వామి త్యాగీశానంద గొప్ప వేదాంతి  మహా గొప్ప సన్యాసి . ప్రాక్ పశ్చిమ వేదాంతాలను క్షుణ్ణంగా చదివి లోతులు తరచినవారు .ఆయన కృష్ణుని గురించి చెబుతూ ”The lord of the autumn moon ”శరత్ చంద్ర ప్రభువు అన్నారు అంటే శరత్కాలం పౌర్ణమి వెన్నెల మనోహరంగా హృదయాహ్లాదంగా పరవశంగా ఉంటుంది అలాంటి పున్నమిచంద్రుడు కృష్ణుడు అని అర్ధం . ఆయనే శ్రీ కృష్ణుడు గొప్ప రాజకీయ నిపుణుడు – స్టేట్స్ మన్ అన్నారు ఆయనే ఆయన జగదురుత్వాన్ని గురించి చెబుతూ ”Krishna is the first teacher in the  history of the world to discover and proclaim the grand truth of love for love’s sake    and duty for duty’s sake ”అని గొప్పగా కృష్ణ గురుత్వాన్ని ఆవిష్కరించారు .అందుకే కృష్ణం వ0దే  జగద్గురుమ్ .                                           గోలోకం
మనలో చాలామందికి భాగవత భారతాలగురించి తెలుసు .కానీ కృష్ణుడికి ప్రత్యేకంగా ఒక లోకమే ఉందని తెలియక పోవచ్చు .బ్రహ్మ వైవర్త  పురాణం ”లో శ్రీ కృష్ణ ఖండం ”లో ఆ వివరాలన్నీ ఉన్నాయి .కొద్దిగా ఆ వివరాలు తెలుసుకొందాం .గోలోకం అన్ని లోకాలకంటే పైన ఉన్నది .అందుకనే ఆశీర్వదించేటప్పుడు ”గోలోకే నిత్యనివాస శాశ్వత సిద్ధి రస్తు ”అని దీవిస్తారు .వైకుంఠ లోకానికి 500 మిలియన్ యోజనాల దూరం లో అంటే 4,00000,0000మైళ్ళు .దాని విస్తీర్ణం(ఏరియా ) 30మిలియన్ యోజనాలు అంటే 24,00000,0000 మైళ్ళు .
  గో లోకం లోరాధా కృష్ణులు ఉంటారు . వీరిద్దరితో సహా గోప గోపికల   అందరి వయసు 16 సంవత్సరాలే దీనికి ”కిశోర ప్రాయం ”అంటారు .అదీ ఈలోకం  ప్రత్యేకత ..చేతిలో మురళి వక్షస్థలంపై కౌస్తుభ మణి  ధరించి గోప వేషం లో శ్రీ కృష్ణుడు గోపీ జనం తో సదా రాసమండల విహారిగా సర్వ సిద్ధి స్వరూప ,సర్వసిద్ధి ప్రదాత ,ఆదిపురుష అవ్యక్త స్వరూపంగా ఉంటాడు అని బ్రహ్మ వైవర్త పురాణం చెప్పింది ..రాస లీలలు అంటేవిశృంఖల శృంగారం(రిబాల్డ్రీ  ) కాదు ,అది జీవాత్మపరమాత్మల సంధానమే అని నిరూపిస్తూ ఒక పుస్తకం రాసి అందరి కళ్ళు తెరిపించింది  అనీబిసెంట్  .  శ్రీ కృష్ణుని కుడి భాగం నుండి సత్వ ,రజస్ ,తమో గుణాలు  వాటి నుంచి అహంకారం ,పంచభూతాలు ,పంచ జ్ఞానాలు ఏర్పడ్డాయి. తరువాత నారాయణుడు   జన్మించాడు .ఆయన ఎడమభాగం నుంచి లక్ష్మీదేవి పుట్టి భార్య అయింది ..కృష్ణుని ఎడమభాగం నుంచి ”సదాశివుడు ”అయిదు ముఖాలతో దిక్కులే వస్త్రాలుగా (దిగంబరం )సకల సిద్ధేశ్వరునిగా ,గురువుకే గురువుగా ఉద్భవించాడు ఆయన మృత్యుంజయుడు ,మృత్యు స్వరూపుడు ..నాభి నుంచి చతుర్ముఖ బ్రహ్మ కమండలం ,జపమాలతో పుట్టి  జీవుల ప్రాణదాత అయ్యాడు .శ్రీ కృష్ణ వక్షస్థలం నుంచి ”ధర్మ దేవత ” ఈయన ఎడమభాగం నుంచి ”మూర్తి ”పుట్టి ఆయన భార్య అయింది ..కృష్ణుని ముఖం నుంచి వీణా,పుస్తక ధారిణి  సరస్వతి షోడశ వర్ష కన్యగా జన్మించి బ్రహ్మ భార్య అయింది .మనసునుంచి మహా లక్ష్మి  బుద్ధినుంచి ”మూలప్రకృతి -ఈశ్వరి ”జన్మించి వెయ్యి భుజాలతో దుర్గతి నాశిని దుర్గగా భాసించింది .ఈమె సర్వ శక్తులకు మూలం శ్రీ కృష్ణుని శక్తి స్వరూపమే దుర్గ .
  శ్రీ కృష్ణుని నాలుక చివర వేదమాత గాయత్రి జన్మించింది .మనసునుంచి మన్మధుడు ,అతని ఎడమభాగం నుంచి రతీదేవి పుట్టి భార్య అయింది .శ్రీ కృష్ణ వామభాగం నుంచి రాధ జన్మించింది .ఈమె కిశోర వయస్క .కృష్ణుని రోమాలనుంచి గోపాలుడు రాధ రోమాలనుంచి గోపికలు పుట్టారు .కృష్ణుని మనసునుంచి నారదుడు పుట్టి పుట్టగానే నారం అంటే నీటిని ఇచ్చాడు నారం అంటే జ్ఞానం కూడా .జ్ఞానప్రదాత నారదుడు ..బ్రహ్మ కంఠం నుంచి ”నరదులు ”అంటే మానవులు పుట్టారు .ఈ విధం గా అఖిల ప్రపంచాన్నీ సృష్టించి పాలించి ,తనలో లయం చేసుకొంటాడు శ్రీ కృష్ణ పర బ్రహ్మ . ఇంతటి అఖండ పరమానంద స్వరూపమైన శ్రీ కృష్ణుని మనసారా పూజించి గుణగానం చేసి ఎందరో మహాత్ములు పునీతులయ్యారు .
   చింతామణి అనే వేశ్య వలయం లో చిక్కిన బిల్వ మంగళుడు చివరికి తన తప్పు తెలుసుకొని సన్యాసియై ”లీలా శుక” నామం ;;తో ”శ్రీ కృష్ణ కర్ణామృతం ”రాసి ధన్యుడయ్యాడు .మనకు పరిచయమైన”కస్తూరీ తిలకం లలాట ఫలకె ”శ్లోకం అందులోనిదే .ఆయనే తిరువనంతపురం (త్రివేండ్రం )లో శ్రీ అనంత పద్మనాభ స్వామి దివ్య దర్శనం పొంది మొదటగా పూజించిన పుణ్యశాలి ,అనంత పద్మనాభునిలో త్రిమూర్త్యాత్మకం రూపం మూడు తెరలనుండి దర్శిస్తాం . శ్రీ కృష్ణుడు ద్వారక మునిగిపోయేటప్పుడు సోమనాధ్ లో ఒక అడవిలో నేలపై పడుకోగా ఆయన కాళ్ళను లేడికళ్ళు అని భ్రమించిన వేటగాడిబాణం తో ప్రాణాలు విడిచాడు . ఆ వేటగాడు పూర్వ జన్మలో వాలి .కృష్ణుడు తన భక్తుడు ఉద్ధవుడికి తన రూపాన్ని విగ్రహం గా చేసి ,మునిగిపోయే ద్వారకను వదిలి ఎక్కడైకైనా వెళ్ళిపోయి అనువైన చోట ప్రతిష్టించమని చెప్పాడు .ఆయన తిరిగి తిరిగి పరశురాముని సాయం తో శివుని అనుజ్ఞతో కేరళలోని ”గురువాయూర్ ”లో ఆ విగ్రహం ప్రతిష్టించాడు ..ఇది గొప్ప కృష్ణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది .ఇక్కడి నారాయణ భట్టు కవి ”నారాణీ యం ”రాశాడు

లీలాశుకుని శ్లోకం తో సమాప్తి చేస్తా –

హి గోపాలక హే  కృపా జలనిధే  హే  సింధు కన్యాపతే -హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే  మాధవ-హే  రామానుజ హే” జగత్రయ గురో ”హే పుండరీకాక్ష మామ్ -హే  గోపీ జననాధ పాలయ పరం జానామి న త్వామ్ పరం ”
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-16-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా
3-9-18 సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-9-18 -ఉయ్యూరు

image.png

image.png
image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గురుగీత గ్రంథావిష్కరణ

        గురుగీత గ్రంథావిష్కరణ
శ్రీ మతి జ్యోష్యులా శ్యామలాదేవి గారి తండ్రిగారు బ్రహ్మశ్రీ తాడేపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి (స్వామీ ప్రాణవానంద భారతే కుమార్ )గారి శతజయంతి కుటుంభవేడుకల సందర్భంగా స్థానిక రోటరీ క్లబ్ ఆడి టోరియం  జరిగిన ”గురుగీత ”గ్రంథావిష్కరణ -2-9-18 ఆదివారం ఉదయం

                                 గురు గీత

బ్రహ్మశ్రీ తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (స్వామీ ప్రనవానంద భారతీకుమార్ )రచించిన 48   గ్రంధాలలో  ‘’గురుగీత ‘’పునర్ముద్రణ గ్రంధం ఇవాళ 2-9-18 ఆదివారం ఉదయం రోటరీ క్లబ్ ఆడిటోరియం లో శాస్త్రి గారి శత జయంతి కుటుంబ వేడుకలలో ఆవిష్కరి౦ప బడింది .దానిపై నన్ను సమీక్ష చేయమని  శాస్త్రి గారి కుమార్తె శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారు కోరగా ,ఆపని చేసే ప్రయత్నం చేశాను .కాని అందరూ కుటుంబ సభ్యులే పాల్గొని వారి పరిచయాలు వారి పాటలు మాటలతో సమయం బక్కచిక్కి నాకు లభించింది రెండే రెండు నిమిషాలే .కాని   ఈ పరిచయం  సరసభారతి సాహితీ బంధువులకు అందజేసే తలంపుతో రాసి తెలియ జేస్తున్నాను .

వ్యాసమహర్షి రాసిన స్కాందపురాణం లోని సనత్కుమార సంహితలో  శివ పార్వతీ సంవాదంగా  ‘’గురు గీత ‘’ఉన్నది .మహర్షి ‘’అస్య శ్రీ గురుగీతా స్తోత్ర మంత్రస్య భగవాన్ సదాశివ రుషిః నానావిధాని చందాంసి శ్రీ గురుపరమాత్మ దేవతా హం బీజ౦ సః శక్తిః క్రోం కీలకం శ్రీ గురు ప్రసాద సిద్ద్యర్దే పాఠే వినియోగః ‘’అని అన్నిరకాల ఛందస్సులు వాడి రచించాడు వ్యాసర్షి .సిద్ధ యోగ విధానం లో గురుగీత కు ప్రాధాన్యత ఎక్కువ. స్వామి ముక్తానంద 182 శ్లోకాలను ఎంపిక చేసి శ్రావ్యత కలిగిస్తే, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గురుగీతకు గొప్ప ప్రచారం చేస్తున్నారు .అలాంటి గురుగీతను తాడేపల్లి శాస్త్రిగారు 3అధ్యాయాలు ,35 1 శ్లోకాలతో ఉన్నదాన్ని ‘’కందమాలిక’’గా  అలాగే రాశారు .కందం అందంగా సాగి సులభ బోధకంగా ఉంది .

‘’గురుర్బ్రహ్మా ర్గురుర్విష్ణుః  గురుర్దేవో మహేశ్వరః –గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ‘’

అజ్ఞాన తిమిరాన్ధస్య జ్ఞానాన్జన శాలాకయా –చక్షురున్మీలన తమ్ ఏవ తస్మైశ్రీ గురవేనమః ‘’

త్వమేవ మాతాచ పితాచ త్వమేవ –త్వమేవ బందుశ్చసఖా త్వమేవ –త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ –త్వమేవ సర్వం మమ దేవ దేవ’’

‘’ఏక ఏవ మహా మంత్ర౦ గురురిత్యక్షరద్వయం ‘’

‘’మంగళం గురురూపాయ –మహనీయ గుణాత్మనే –సర్వ లోక శరణ్యాయ –సాదు రూపాయ మంగళం ‘’తో పాటు సాక్షాత్తు శ్రీ కృష్ణునికి అభేద రూపమైన వ్యాసమహర్షి ని స్తుతించే –

‘’ఆచతుర్వదనో బ్రాహ్మా –ద్విబాహు రపర కేశవః  -అఫాల లోచన శ్శివః-పరబ్రహ్మ స్వరూపకః ‘శ్లోకమూ గురువుకే చెందుతుంది .రేపు జగద్గురువైన శ్రీ కృష్ణ జన్మాష్టమి . ముందురోజు గురుగీత  గురించి  మాట్లాడటం  సమయోచితమే .కుచేలుడు కృష్ణ దర్శనం కోసం ద్వారకకు వెళ్లి  అక్కడ స్నేతుడు కృష్ణుడు తనకు చేసిన సకల సపర్యలకు పొంగిపోయి కృష్ణుడు తమ గురువైన సాందీప మహర్షి ని తలచు కొని  గొప్పగాకీర్తించాడు . అవాక్కైన కుచేలుడు

‘’గురు మతి దలపగ త్రిజగ –ద్గురుడవనం దగిన నీకు గురుడనగా నొం-డొరు డెవ్వ డింతయును నీ-కరయంగ ,విడంబనం బగు గాదె హరీ ‘’అంటాడు .అంటే త్రిలోక గురువైన నువ్వు నీ గురువును తలచుకోవటం మహనీయ విషయం .లోకానికి ఆదర్శంగా నిలిచావు అని పోతన్నగారి పద్యం .అదీ గురు గరిమ .

ప్రధమాధ్యాయంలో శౌనకాది మహర్షులు యధాప్రకారం గా సూతమహర్షి ని’’ఎవని తత్వ శ్రవణ౦బున  భువిని జీవి సర్వ దుఃఖ ముక్తు౦ డగునో  ‘’వివరించమని అడిగితే ఆయన ‘’భవ రోగ శామమని గీత ‘’ను వివరిస్తానంటూ ఒకప్పుడు కైలాసం లో పార్వతి శివుని ఇదే ప్రశ్న అడిగితే ఆయన బోధించి ‘’గురు గీత ‘’ను సవివరం గా చెప్పాడు

మాయా జగత్తులో శరీరం అజ్ఞాన సంభవం అనే జ్ఞానం ఎవరి ప్రసాద మహిమ వలన లభిస్తుందో అతడే గురువు .’’గురువర్యు ననుగ్రహమే –హరియించును శోక మోహ భారము లెల్లన్ –వర దేశి కేంద్రు కేవల –పరమాత్మ స్వరూపునకు ప్రణతు లొనర్తున్ ‘’అని గురువు అంటే ఎవరో చెప్పాడు .ఎవరి అనుగ్రహం తో అజ్ఞానం నశించి జ్ఞానం లభిస్తుందో అతడే పరమాత్మస్వరూపమైన గురువు .’’గు వర్ణ అజ్ఞాన తమము –రు వర్ణంబు జ్ఞాన తేజ భాసంబగు మా –నవులకు తమస్సు హరియించు గు –రువు నిస్సంశయంబుగను బ్రహ్మ౦బే యగున్ ‘’అనిగురువు బ్రహ్మమే అని స్పష్టం చేశాడు .అజ్ఞాన మనే చీకటిని విజ్ఞానం అనే కంటి కాటుకపెట్టి ఆత్మజ్ఞాన దృష్టి ప్రసాదించే ‘’బ్రహ్మ జ్ఞాన ఘనుండు గురుడు ప్రణతుల నిడెదన్ ‘’

గురువు గొప్పతనాన్ని వివరిస్తూ శాంతుడు, గగన తలానికి అతీతుడు ,శాశ్వత గుణుడు నిరంజనుడు ,చైతన్యుడు గురు దేవుడు అన్నాడు .గురువు విశాల హృదయం ఉన్నవాడు –‘’తన సత్యమె జగతికి నాగు –తనభాసమె సకల జగతికి భాసమునౌ –తనయానందమెసర్వుల –కానందంబైన గురునికి వందనముల్ ‘’

గురువు కారణ ,ప్రేరణ  ఫలకార్య రూపుడు కారణ కార్య స్వరూపుడు ‘’తారకం కూడా గురువే .అజ్ఞానమనే పాముకాటుకు ప్రజ్ఞానం అనే ప్రధమ వైద్య౦ చేసి ,సుజ్ఞానం బోధించే ‘’బ్రహ్మ జ్ఞాన స్వరూపం ..గురుసేవకు దూరమైన వాడికి  ‘’దొరకదు ముక్తిమార్గము ‘’అని ఘంటాపథంగా చెప్పాడు .

రెండవ అధ్యాయం గురు ధ్యానవైభవం .గురువు ఎక్కడుంటాడు ?’’హృత్పద్మ కర్ణిక కేంద్ర-తత్పద సిమ్హా  సింహాసనస్థిత దివ్యమూర్తి –సత్ చిత్ సుఖ సకలాభీ –ష్ట ప్రదు శశికళాభాసి సద్గురుడు ‘’అని యోగాఢ్య స్వరూపునిగా వర్ణించాడు .ఇంకొంచెం లోతుకు వెళ్లి –‘’అ కథా త్రిరేక సరసిజ –ప్రకటితమును ,సహస్ర దళమండలమున హం –సకు సరస త్రికోణ౦బున ‘’ప్రకాశించే జ్యోతి అన్నాడు .గురువుకంటే అధికం లేదు హరి హరాదుల కోపాన్ని గురువు హరి౦చ గలడు కాని గురువుకు కోపం వస్తే’’ అప్పీలే’’లేదు .మళ్ళీ ఆయన అనుగ్రహం పొందాకే ఏదైనా .జ్ఞానం జ్ఞేయం అన్నీ తన మనసే  అని తెలుసుకోవాలి .గురు భక్తిలో లోపం రానీయ కూడదు .’’గురు శాపగ్రస్తునకు –దొరకదు పార్వతీ ,రక్ష ‘’దీనికి సురులు  మహర్షులు కూడా ఆశక్తులే .పరబ్రహ్మం నుంచి గడ్డిపరకవరకు పరమాత్మ స్వరూపమే .అలాంటి పరమాత్మ గురువే .

‘’అంగుస్ట మాత్ర పురుషుడు –సంగత హృత్పద్మ మరయ సద్గురు ధ్యానం –మంగళ ప్రద జ్ఞానము ‘’అంటాడు.

గురుని ధ్యానం తో స్వయం బ్రహ్మ అయ్యే శిష్యుడు భూమిపై పిండ ,పద ,రూపము ల విముక్తుడవుతాడు ‘’అని శివుడు అనగానే పార్వతి పిండం,,పదం  రూపం ,రూపాతీతం అంటే వివరించమని అడగగా పరమేశ్వరుడు ‘’’కుండలినీ శక్తి పిండ –మండగ పదమగును హంస పరికిం పంగా-మదాల రూపము బిందువు –ని౦ డగు రూపము కతీత నిరంజనమున్ ‘’అని తాంత్రిక రహస్యం చెప్పాడు .ఎప్పుడూ శాంతంగా ఉంటూ సర్వకాల సదానంద బ్రహ్మం –సర్వత్రా చెందిన సర్వాత్మయే,తాను అనే స్పృహ సర్వజ్ఞత అవుతుందని సూక్ష్మ౦  చెప్పాడు .గురూపదేశం గురు మార్గం లో నడవటం  గురుభక్తి ముక్తికి సోపానాలు .

తర్వాత గురు గీత మహాత్మ్యాన్ని వర్ణించి చెప్పాడు అ౦బకు అ౦బాపతి .గురుగీత పుస్తకం రాసినా, దానం ఇచ్చినా ,గురు శ్రవణం చేసినా ,పఠించినా సద్గతి కలుగుతుంది .’’గురు గీతా జప పరునకు –దొరకు నన౦త ఫలప్రాప్తి  గురు కృప చేతన్ –దారిద్ర్యము నశియించును  -కర గించును సర్వ పాపగిరుల సహితమున్ ‘’.అకాల మృతువు సంకటాలు ఆది వ్యాధులూ తొలగిపోతాయి .ఎవరెవరికి ఏ కోరిక ఉంటె ఆ కోరిక తప్పక తీరుతుంది .’’శైవ ,శాక్త ,పశుపతి ,వై –ష్ణవ ,గాణాపత్య ,సౌర ,షణ్మతచరులున్ –సవినయముగ జపియి౦తురు గురుని ‘’అని షణ్మతా వల౦బు లందరూ గుర్వనుగ్రహం కోసం తపించేవారే అన్నాడు .

మూడవ అధ్యాయం –జ్ఞాన ప్రదాన ప్రశంసన లో గురు మంత్రం ముఖం లో ఉన్నవాడికి అఖిల కార్య సిద్ధికలుగుతుందని ,గురువుకు సంతృప్తికలిగితే శిష్యుడికి ముక్తిలభిస్తుందనిచెప్పగా ఇదంతా శ్రద్ధగా విన్న పార్వతి ‘’బోధ గురువుల సంగతి బాగానే ఉంది మరి బాధ గురువుల సంగతేమిటి ?అలాంటి నిషిద్ధ గురు సేవవల్ల వాళ్ల గతేమిటి ?’’అని ప్రశ్నించింది .దానికి ‘’నిషిద్ధ గురువు అని ఎప్పుడైతే తెలుసుకొని వదిలేస్తాడో అప్పుడే  సద్గురు భావన కలుగుతుంది .పరమ గురువు సంగతి వివరిస్తూ పరమ శివుడు  నదులన్నీ  సముద్రం లో కలిసినట్లు గురువులందరికీ ధ్యేయం పరమగురువే ,అయితే ఎవరా పరమగురుడు అంటే –‘’అజ,హరి హర ,వైభవమును –త్యజించు శాంతుండు నిత్య తృ ప్తుం డగు చున్ –విజిత శోక మోహాది  వి-రాజ నిజాశ్రయుండగు ‘’పరమగురువు ‘’ప్రియా ‘’అని చెప్పాడు .త్రిమూర్తులకతీతభావం కలిగి శాంతం భూషణ౦ గా  అను నిత్య సంతృప్తి తో శోక మొహాదులను విసర్జి౦ చిన వాడే  పరమ గురుడు అని  విస్పష్టం గా చెప్పాడు పార్వతీ విభుడు  .గురువును మించిన దైవం ,గురువుతో సమానుడైన తండ్రి లోకం లో లేరు .గురుభక్తి ఉంటె ఏం జరుగుతుందో వివరిస్తూ పరమగురుడు పరమేశ్వరుడు –‘’’

‘’గురు భక్తి పరుడు ,సతతము –చరియించు వేద శాస్త్ర సారాను గుణం –ఘోర పాతక శ్రేణిని-హరియించు విశేష భక్తి పరతంత్రు౦డై ‘’అని భరోసా ఇచ్చాడు భవుడు. ‘’భుక్తియు ముక్తియు ,నొసంగ –శక్తి ప్రదములును గురుని చరణ కమలముల్-శక్తుండు నశక్తుడు నా –సక్తి నాశ్రయించ జన్మ సఫలత గాంచున్ ‘’

‘’గురు గీత వేదసారము –పరిపూర్ణముగా వచింప బడినది యగుచున్ –గురు పదమున కన్యంబును –నరయ లేదు జీవ ముక్తి కరమగు నదియున్ ‘’అంటే గురు గీత వేదం లో ఉన్న సార సంగ్రహం ,సంపూర్ణం కనుక గురువు పాదాలకంటే వేరేదీ జీవన్ముక్తి కలిగించేది లేదు .మరోక్కమారు ‘’ఎ౦ఫటిక్ ‘’గా ‘’గురునామ తుల్య దైవము –గురు సమపిత ,బంధు జనులు ,గురు సమ ప్రభువున్ –గురు సదృశ పరమపదము –నరయ దుర్లభంబు జగతి నేరికి నైనన్ ‘’అని ముక్తాయింపు ఇస్తూ మరొక్కసారి ఉమతో ఉమారమణుడు  -‘’గురు గీతయె-భవ దుఃఖ వినాశకారి  పఠించగ దీ-పవిత్ర  తత్వము గురు దీ-క్షా విహీను ముందు నెపుడు నే విధి నైనన్ ‘’అని సమాప్తి పలికారు. గురు అంటే విశేషమైన విశిష్టమైన అనే అర్ధం కూడా  ఉంది కనుక ఇది నిజంగానే గురు గీత  సార్ధక నామం తో విరాజిల్లింది .దీనిని శాస్త్రిగారు 2-11-1995 లో ప్రారంభించి 19-11-95 న 18 రోజులలో దీక్షగా  రాసి ముగించారు .వారి అనుభవసారం,  శ్రీ లలితా పరాభట్టారిక అనుగ్రహం  వారి అర్ధాంగి శ్రీమతి స్వరాజ్య లక్ష్మిగారు  వ్రాసే స్వతంత్యం ఇచ్చి ప్రోత్సహించటం తో 48 గ్రంథాలు రాసి సంగీత, సాహిత్య సవ్య సాచిగా కీర్తిపొందారు .

వారిని తరచూ ఆ కుటుంబ సభ్యులు స్మరిస్తూ ఘన నివాళి అర్పిస్తామని ఈ ఉదయం శపధం కూడా చేశారు .  అది నిలబెట్టుకుంటారని ఆశిద్దాం .  శాస్త్రి గారి పేరిట స్మారక పురస్కారం ఏర్పరచి, ప్రతి ఏడాది వారి జయంతి లేక వర్ధ౦తి నాడు  సంగీత , సాహిత్యాలలో లబ్ధ ప్రతిస్టులను ఎంపిక చేసి, ప్రదానం చేస్తే శాస్త్రి గారికి ఘననివాళి గా ఉంటుందని సభావేదికపై తాడేపల్లి కుటుంబ సభ్యులకు నేను సూచన చేశాను  .మనకు తెలిసిందే .ఇవన్నీ సభా వైరాగ్యం లాంటివే.అలా కాకూడదు .అని ఆశించటం లో తప్పులేదు .

రేపు 3-9-18 సోమవారం శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-18 –ఉయ్యూరు

— 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అద్వితీయ అపురూప సౌ౦దర్యాకర్షణ గల కపుర్తల యువరాణి -సీతాదేవి-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ పత్రిక -సెప్టెంబర్ 

అద్వితీయ అపురూప సౌ౦దర్యాకర్షణ గల కపుర్తల యువరాణి -సీతాదేవి-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ పత్రిక -సెప్టెంబర్

సౌ౦దర్యంలో రతీ దేవిని,అప్సరసలను మించిన వారు లేరని మనకు తెలిసిన విషయం .వారు దివి వాసులేకాని భువి వాసులుకారు .చిత్తూర్ రాణి పద్మిని సౌందర్యం జగద్విదితమైన విషయం .కాని ఆధునిక కాలం లో కపుర్తల యువరాణి సీతాదేవి సౌ౦దర్యాకర్షణ కు సాటి వేరెవరూ లేరని రుజువైన సత్యం .

కపుర్తలయువరాణి సీతాదేవి కుమాన్ రాజు కుమార్తె .1915 లో జన్మించింది .కపుర్తల మహారాజు జగజీత్ సింగ్ చిన్న కుమారుడు యువరాజు కరం జిత్ సింగ్ సీతాదేవి ని ఆమె 13 వ ఏట వివాహమాడాడు .అందుకని ఆమెను కపుర్తల ప్రిన్సెస్ అన్నారు . ఆమె అనేక భాషలలో అత్యంత ధారాళంగా సంభాషించే నైపుణ్యం కలది .చిన్నప్పటి నుండి దుస్తుల, అలంకరణ విషయాలలో ప్రత్యేక శైలిని కనబరచేది .అందుకే ఎందరో ఫోటోగ్రాఫర్లు ఆమె అందాన్ని ఫోటోలలో బంధించి మేగజైన్ లలో ప్రచురించి ఆమె సౌందర్యాన్ని జగద్విదితం చేశారు .ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ సిసిల్ బీటన్ నుంచి మాన్ రే దాకా ఆమె సౌందర్య దీదితులను లోకానికి తెలియ జేసినవారే .ఆమెకు తన వివాహ దుస్తులు అత్యంత అందంగా ఆకర్షణీయంగా డిజైన్ చేసి కుట్టిన మెయిన్ బోచేర్ అంటే అభిమానం ఎక్కువ .ఇతడే వాలిస్ సి౦ప్సన్ కు ఆమె కు, డ్యూక్ ఆఫ్ విండ్సర్ తో శోభనం జరిగినపుడు కళ్ళు చెదిరే డ్రెస్ కుట్టినవాడు .సీతాదేవికి షిఫాన్ చీరలన్నా ,ఫర్ డ్రెస్ లన్నా మహా క్రేజు . వీటి ముఖ్య డిజైనర్ మెయిన్ బ్రోచర్ . సమాజం లోని మహిళలందరూ ఆమె ఫాషన్ డ్రెస్ కు అదిరిపోయేవారు ,అనుసరించేవారు .అంతటి ప్రభావం కలిగించింది సీతాదేవి .

1930కాలం లో సీతాదేవి సమాజం లో అత్యంత ప్రజారంజన, ప్రజాకర్షణ కలిగించిన వ్యక్తి అయింది .193 6 లో జీగ్ ఫెల్డ్ ఫాలీస్ వాళ్ల ఇరా గెర్శ్విన్స్ ఉత్పత్తుకు సీతాదేవి ప్రేరణగా నిలిచింది .ఆమె 19 వ ఏట ‘’వోగ్ మేగజైన్ ‘’ఆమెను అత్యాధునిక ‘’లౌకిక దేవత ‘(సెక్యులర్ గాడెస్ ) గా ఎంపికచేసి అభిషేకించింది .మూడేళ్ళ తర్వాత ‘’లుక్ మాగజైన్ ‘’ఆమెను భూమిపై అత్యుత్తమ వస్త్రధారణ చేసిన అయిదుగురు మహిళల లో ఒకరుగా అభి వర్ణించింది .ప్రఖ్యాత ఫాషన్ డిజైన్ వస్త్ర వ్యాపారి ఎల్సా షియాప రెల్లి సీతాదేవికి 1935 లో డిజైన్ చేసి కుట్టిన గౌన్లు భారతీయ చీరల లాగా ఉండటం చూసి అమితాశ్చర్యానికి లోనయ్యారు .1939 లో హాలీవుడ్ డయటీషియన్ డా.గెలార్డ్ హాసర్ గౌరవార్ధం లేడి మెండిస్ లో ఏర్పాటు చేసిన టీపార్టీ లో సీతాదేవిని ప్రపంచ ప్రసిద్ధ పన్నెండు మంది అత్యాకర్షణ గల అందగత్తెలలో ఒకరుగా ఎంపిక చేసి ,ఆమె అందానికి ఆకర్షణకు గొప్ప గుర్తింపు కలిగించారు.

1939 జులైలో డిజైనర్, రచయిత, కళారాధకుడు ,పోషకుడు,సౌ౦దర్యారాధక ,పునరుజ్జీవన(రినైసేన్స్ ) తత్వవేత్త కౌంట్ ఎలిన్నే డీ బ్యుమౌంట్ ,భార్య ఎడిత్ ల చే ఏర్పాటు చేయబడిన ‘’కాస్ట్యూమ్ బాల్’’ కు కపుర్తల యువరాణి సీతాదేవి, ప్రముఖ డిజైనర్ అలెక్సీ రూపొందించిన ‘’గ్రేషియన్ స్టైల్ గౌన్ ‘’ధరించి హుందాగా ,రాజసం ఒలకబోస్తూ నెమ్మదిగా నడుచుకొంటూ హాల్ లోకి ప్రవేశించింది. ఆమెనూ ఆమె డ్రెస్ నూ చూసి భూలోక సుందరా లేక దేవ గ౦ధర్వ కిన్నెర కింపురుష అప్సరసా !అని ఆశ్చర్యంతో రెప్పలార్పకుండా వీక్షించారామెను .1939 వేసవి చివరి రోజులలో ఎల్సి డీ ఉల్ఫ్ కపుర్తల యువరాణికోసం ఒక ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు .అందులో వినోద ప్రదర్శనకూడా ఉంది .శిక్షణ పొందిన ఏనుగులతో కవాతు చేయించారు .వేసవి సీజన్ కు తగిన ధగద్ధగాయమానమైన బంగారు, వజ్రాల ఆభరణాలు దరించి యువరాణి సీతాదేవి ,అంతే ఆకర్షణతో వినూత్న ఆభరణాలు ధరించి ఆమెభర్త ,యువరాజు మహారాజకుమార్ కరంజిత్ సింగ్ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు . ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ఆభరణాలు డిజైన్ చేసి రూపొందినవారు కార్టర్,వాన్ క్లీఫ్ అండ్ అపెరల్స్ మొదలైన వారు .ఈ అందాల అతిలోక జగదేక సుందరి కపుర్తల యువరాణి సీతాదేవి 2002లో ఢిల్లీ లో 87 వ ఏట భువినుండిఅప్సరసలతో అందాలపోటీకి దివికేగింది ..ఆమె మనవడు హంట్ సింగ్ ప్రఖ్యాత జ్యుయలరి డిజైనర్ .

-గబ్బిట దుర్గాప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Posted in రచనలు | Tagged | Leave a comment

వ్యావహారిక భాషోద్యమ సారధి శ్రీ గిడుగు వెంకట రామ మూర్తి పంతులు (29-8-1863 -22-1-1940

శ్రీ గిడుగు రామమూర్తి గారి జయ౦తి (155) తెలుగు  భాషా దినోత్సవం గా సరసభారతి,స్థానిక రోటరీ క్లబ్ సంయుక్తంగా 29-8-18 బుధవారం నిర్వహించిన సభలో నేను మాట్లాడిన నాలుగు మాటలకు  పరిపూర్ణత కోసం అదన౦గా మరో పదిమాటలు కలిపి మీకోసం  –

 వ్యావహారిక భాషోద్యమ సారధి శ్రీ గిడుగు వెంకట రామ మూర్తి పంతులు (29-8-1863 -22-1-1940

          జనన ,విద్యాభ్యాసాలు ,ఉద్యోగం

‘’గ్రా౦ధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు –వ్యవహార భాష ఘనుడు గిడుగు

తేట తేనియల తెల్లనిపాల మీగడ గిడుగు –కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు ‘’అనిపించుకున్న శ్రీ గిడుగు  వెంకట రామ మూర్తి పంతులుగారు గిడుగు రామమూర్తిగా, గి .రాం .పంతులు గారుగా లబ్ధ ప్రతిస్టులు .29-8-1863 న శ్రీకాకుళం జిల్లా ముఖ లింగ క్షేత్రం దగ్గరున్న పర్వతాల పేటలో శ్రీ వీర్ర్రాజు ,శ్రీమతి వెంకమ్మ దంపతులకు జన్మించారు .తండ్రి రెవిన్యు డిపార్ట్ మెంట్ లో అధికారి .ప్రాధమిక విద్య1877 వరకు  పుట్టిన చోటనే పూర్తి చేసి,తండ్రి చోడవరం బదిలీ అయి అక్కడి దోమకాట్లకు విషజ్వరం కు  బలై 1875 లో మరణించగా , విజయనగరం మేనమామగారింట ఉండి మహారాజా కాలేజిలో 1875 నుండి 80 వరకు చదివారు .79 లో మెట్రిక్ పాసైనారు  .కాలేజీలో శ్రీ గురజాడ అప్పారావు గారు సహాధ్యాయి .1880 నుండి నెలకు 30 రూపాయల జీతం తో రాజాగారి స్కూల్ లో ఫస్ట్ ఫాం విద్యార్ధులకు చరిత్ర  బోధించారు .అప్పుడే ముఖ లింగ క్షేత్రం లోని శాసనలిపి స్వయంగా నేర్చి ఎన్నో చారిత్రకాంశాలు వ్యాసాలుగా రాశారు .ముఖ్యంగా ఆయన రాసిన’’ గా౦గ వంశీయుల’’ పై ఇంగ్లీష్ లో రాసిన ప్రామాణిక వ్యాసాలు వారి పరిశోధనా పటిమకు గొప్ప నిదర్శనాలు .ఇవి ఇండియన్ యాన్టిక్వరి,మద్రాస్ లిటరేచర్ అండ్ సైన్స్ జర్నల్స్ లో ప్రచురితాలై విశేష కీర్తి నార్జించాయి .సవర భాష దక్షిణ ముండా భాష .ముండా ఉపకుటుంబానికి చెందిన ఈ సవర భాష ను శాస్త్రీయంగా పరిశోధించిన ప్రధమవ్యక్తి గిడుగువారు .ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం లో ముండాభాషలు ఒక శాఖ .క్రీ.పూ. 15 వ శతాబ్ది నుంచి సవరలు మనదేశంలో ఉన్నారు .వీరిని’’ శబరలు ‘’అని ఐతరేయ బ్రాహ్మణం పేర్కొన్నది .

     కాలేజీ లెక్చరర్ అవ్వాలంటే చరిత్రలో డిగ్రీ తప్పని సరి .1886 లో ఇప్పటి ఇంటర్ అప్పటి ఎఫ్.ఎ.పాసై 1894 లో తనకభిమానమైన చరిత్ర లో డిగ్రీ మొదటి తరగతిలో ,యూని వర్సిటి రెండవ రాంక్ తో సాధించారు .వెంటనే పర్లాకిమిడి కాలేజి లెక్చరర్ గా పదోన్నతి పొందారు .30 ఏళ్ళు సుదీర్ఘ సర్వీస్ పూర్తీ చేసి ఎఫ్. ఏ. విద్యార్ధులకు చరిత్ర బోధించి ,1911 లో స్వచ్చంద  పదవీ విరమణ చేశారు .

               బోధనా విధానం –మెరికల్లాంటి శిష్యులు

    పాఠం చెప్పటం అంటే ఏమిటో రామమూర్తి పంతులుగారు తన బోధన వలన తెలియ జేశారు .గ్రీకు చరిత్ర బోధిస్తుంటే ప్రాచీన  గ్రీకుల నీతి నియమాలు ,ఆధ్యాత్మిక తత్త్వం ,రాజ్యపాలన ,సారస్వతం లను , ఆర్యుల ప్రాచీన చరిత్రనుండి సామ్యాలు ,భేదాలు తులనాత్మకంగా పరిశోధించి బోధించేవారని ,అలాగే రోమన్ చరిత్ర చెప్పేటప్పుడు కుటుంబ విశ్వాసాలలో తండ్రికున్న అసాధారణ అధికారాలను ప్రాచీనార్యుల నాగరకత తో పోల్చి హృదయానికి హత్తుకోనేట్లు బోధించేవారని గిడుగువారి ప్రియ శిష్యుడు శ్రీ పారనంది జగన్నాధా చార్యులు తెలియ జేశారు. ఆచార్యులవారు గిడుగు వారి  శిష్యులే కాదు తత్వ శాస్త్రం ,మనస్తత్వ శాస్త్రం లను ప్రత్యేకంగా నేర్చి విపుల గ్రంథ రచన చేశారు .

  గిడుగువారి పెద్ద కుమారుడు శ్రీ గిడుగు వెంకట  సీతాపతి 1903 లో ఎఫ్. ఏ .చదివి,19 07లో రాజమండ్రి లో ఉధ్యాయ శిక్షణ పొందుతున్నప్పుడు ‘’అంతర్జాతీయ ధ్వని లిపి’’నేర్చుకున్నారు .దీనితో ఏ భాషలోనైనా మాట్లాడినట్లే రాసుకో వచ్చు ,చదువుకోవచ్చు .కొడుకు సీతాపతి గారివద్ద తండ్రి రామ మూర్తిగారు అంతర్జాతీయ ధ్వనిలిపి నేర్చుకున్నారు .అంటే ఆయనకు వివిధ విషయాలు అవగాహన చేసుకోవటం లో యెంత అభిరుచి ఉందొ తెలుస్తోంది .తండ్రిలాగానే సవరభాషను నేర్చి అందులోని పాటలను సేకరించి వాటిని ఇంగ్లిష్ లోకి అనువదించారు .సవర సంగీతం పై ఇంగ్లిష్ లో పెక్కు వ్యాసాలూ రాశారు .తండ్రికి తగ్గ తనయుడనిపించారు  .సీతాపతి గారి సవర భాషా సేవలను గుర్తించి వాషింగ్టన్ లోని ఇంటర్  నేషనల్ అకాడెమి 1940 లో డి .లిట్. ప్రదానం చేసి గౌరవించింది .విద్వాంసుడు, భాషా శాస్త్ర వేత్త ,శాసన పరిశోధకుడు ,ఉత్తమ అనువాదకుడు,గొప్ప అధ్యాపకుడు   సీతాపతి గారు. .’’తెలుగు విజ్ఞాన సర్వస్వం ‘’కు సంపాదకత్వం వహించిన మేధావి .’’ బైబిల్ ‘’ను సవర భాషలో రచించారు సవరభాష లాటిదే అయిన ఫరంగీ భాషపైనా పరిశోధించారు .ఇంతటి ఘనవిద్యలన్నీ గురువైన తండ్రి రామమూర్తిగారి వలన అబ్బినవే .తండ్రికి లేని నటన లో ప్రావీణ్యం ఉన్న నటుడుకూడా అయిన సీతాపతిగారు’’ పల్నాటి యుద్ధం, రైతు బిడ్డ ,పంతులమ్మ’’ మొదలైన సినిమాలలో నటించి తండ్రికి మించిన తనయుడయ్యారు .గుబురు మీసాలతో ఆయన కొట్టొచ్చినట్లు కనిపిస్తారు .

   పంతులుగారి మరొక అభిమాన శిష్యుడు శ్రీ బుర్రా శేషగిరిరావు .సీతాపతి సహాధ్యాయి .19 03లో ఎఫ్ .ఏ .చదివి పంతులుగారి ప్రభావం వలన చరిత్రకు, తెలుగు భాషాభిమానానికి పరిశోధనలకు  ఆకర్షితులై ,ఎం యే .పాసై విజయనగరం మహారాజా కాలేజి లో సహాయ అధ్యాపకులుగా 30 ఏళ్ళు ఆంగ్ల భాష శాఖాధ్యక్షులుగా ,ఆ శాఖ ప్రదానాధ్యాపకులుగా సేవ లందించారు .  గొప్ప పరిశోధకులైన బుర్రావారు ‘’దక్షిణ దేశం లో జైనమత వ్యాప్తి ‘’ఉద్గ్రంధం రచించారు .భాషా సాహిత్యాలపై లోతైన అవగాహనతో లెక్కకు మించిన వ్యాసాలూ రాశారు .ఆయన రాసిన ‘’విమర్శాదర్శం’’తొలి తెలుగు విమర్శ గ్రంధం గా చరిత్ర సృష్టించింది . ఆనాడు గిడుగు రామమూర్తి గారిని సమర్ధించిన వ్యావహారిక భాషా వాదులలో బుర్రావారు ,గురజాడ ,పి .టి .శ్రీనివాస అయ్యంగార్ ,చిలుకూరి నారాయణరావు ,ముఖ్యులు .బుర్రావారు విజయనగరం లో తమ ఇంటివద్ద ‘’ఆంద్ర భారతీ తీర్ధ ‘’అనే రిసెర్చ్ యూని వర్సిటి స్థాపించి ,విదేశాలలో బ్రా౦ఛీలుకూడా ఏర్పాటు చేసి పరిశోధకులకు అండగా నిలిచారు .కవి పండితులకు ,కళాకారులకు బిరుదులిచ్చి సత్కరి౦చే వారు .బుర్రా వారి బుర్రకు పదును గిడుగు వారే అని  వేరే చెప్పక్కరలేదు .

  పరిశోధక పరబ్రహ్మ  శ్రీ చిలుకూరి నారాయణరావు 1908 లో ఎఫ్. ఏ. పర్లాకిమిడి లో చదివేటప్పుడు గిడుగువారి శిష్యుడు .మిల్టన్ సానెట్ ను గురువుగారు క్లాసులో ఒకసారి చదివి ఎవరైనా అప్పగించగలరా అని ప్రశ్నిస్తే  రావుగారు లేచి మరో సారి చదవమని కోరి చదవగానే అప్పగించిన ఘనుడు .అప్పటినుంచి గురువుగారి అత్యంత ప్రియ శిష్యుడై నారు .తెలుగులో ఎం. ఏ. చేసి ,సంస్కృత ,ప్రాకృత ,ఆంగ్ల, మరాటీ ,తమిళ కన్నడాది బహుభాషా కోవిదులై ,ఘనాఘన పండితుడని పించుకొన్నారు .తొలి తెలుగు పరిశోధకులు నారాయణరావు గారు ‘’ఆంద్ర భాషా చరిత్ర ‘అనే పరిశోధనాత్మక గ్రంథం రాసారు .వీరికి  గిడుగు గురువుగారు విషయ సేకరణలో చాలా తోడ్పడ్డారు .తెలుగులో అన్ని  సాహిత్య ప్రక్రియలలో రచనలు చేసిన వారు రావు గారు ..240 గ్రంథాలు రాసిన సాహితీ మూర్తి .1915 నుంచే గిడుగువారి ప్రభావంతో వాడుక భాషలో రచనలు చేయటం ప్రారంభించారు 1950 లో’’గుజరాతీ చరిత్ర ‘’రాసి ఆంద్ర భారతీ తీర్ధ నుండి  ‘’మహోపాధ్యాయ ‘’బిరుదు సత్కారం పొందారు .ఆంద్ర విశ్వ విద్యాలయం 1947 లో ‘’కళాప్రపూర్ణ ‘’తో సత్కరించింది .ఇదంతా గిడుగు గురు కటాక్షమే .  గిడుగు వారి మరో శిష్యుడు శ్రీ తాపీ ధర్మా రావు గారు .రామమూర్తి గారి  లాగా చరిత్ర బోధించే వారు మద్రాస్ లో లేరని గ్రహించి పర్లాకిమిడి వెళ్లి ఎఫ్. ఏ. లో చేరి, గిడుగువారి  అ౦ తేవాసియై  సార్ధత సాధించారు. ‘’గురువుగారు చరిత్ర చెబుతుంటే పాత్రలు ప్రత్యక్ష మైనట్లు ఉండేవి ‘’అని తాపీ ఉవాచ .మొదట్లో గురు తిరస్కారం చేసి  గ్రాంధిక భాషలో రాసిన తాపీ ,తప్పు తెలుసుకొని’’ కలం తాపీ’’తో  వ్యావహారిక సొగసులు తీర్చి దిద్దారు .చేమకూరకవి ‘’విజయ విలాసం ‘’   కు ధర్మారావుగారి ‘’హృదయోల్లాస వ్యాఖ్య ‘’పండితుల కళ్ళు తెరిపించి కొత్త పుంతలు తోక్కించింది . ఆయన కొత్తపాళీ ,దేవాలయాలపై బూతుబొమ్మలు పుస్తకాలకు విశేష గిరాకీ ఉన్నసంగతి మనకు తెలిసిందే .ముద్దుబిడ్డ మొదలైన సినిమాలకు పాటలూ రాశారు వీరికుమారుడు తాపీ చాణక్య ‘’రోజులు మారాయ్’’అనే సూపర్ డూపర్ హిట్ సినిమా దర్శకుడు .ఇందరు ప్రముఖ శిష్యులకు గురువు గిడుగు  ఖ్యాతి వర్ణించ  తరమా ?

                      గిడుగు వారి భాషోద్యమం

    పదవీ విరమణ చేసినప్పటినుంచి గిడుగు వారు వ్యావాహారిక భాషోద్యమ వేగాన్ని పెంచారు .సవర విద్యార్ధులకు తమ ఇంట్లోనే వసతి భోజన సౌకర్యాలు కలుగ జేసి పుస్తకాలు రాసి ,స్కూళ్ళు పెట్టి,  అధ్యాపకులకు స్వయంగా జీతాలు చెల్లించి , వారి విద్యకు అన్నివిధాల సాయం చేశారు .దీన్ని గుర్తించిన ప్రభుత్వం 1913 లో ‘’రావు బహదూర్ ‘’బిరుదునిచ్చి సత్కరించింది .అప్పుడే కొత్తగా వస్తున్న భాషాశాస్త్ర పుస్తకాలు చదివి ,30 ఏళ్ళు తీవ్ర కృషి చేసి , వ్యాకరణ నిర్మాణం నేర్చుకొని 1931 లో’’ సవర భాషా వ్యాకరణ౦’’ ,1936 లో ‘’సవర –ఇంగ్లిష్ నిఘంటువు’’ నిర్మించారు .వీటిని ప్రభుత్వం అచ్చు వేసి అందుబాటులోకి తెచ్చింది .ఆయనకు ‘’కైజర్ –ఏ- హింద్ ‘’అనే స్వర్ణపతకాన్ని ప్రభుత్వం 1934లో  అందించి  గౌరవించి సత్కరించింది .మన్య ప్రాంతాలలో నిరంతరం తిరగటం వలన గిడుగు వారికి తరచుగా విష దోమకాటు వలన మలేరియా వచ్చేది .అప్పటికి అందుబాటులో దానికి మందు ‘’క్వినైన్’’.తన పరిశోధనలు, సవరభాషా వ్యాప్తి పై దృష్టి నిలిపిన పంతులుగారు ఆరోగ్యం లెక్కచేయలేదు .మలేరియా వచ్చినప్పుడల్లా క్వినైన్ మాత్రలు అధికంగా వాడేవారు. దీనితో వారికి వినికిడి సమస్యవచ్చి క్రమగా చెవుడు గామారి చివరికి ‘’పుట్ట చెవుడు ‘’తో విపరీతంగా బాధపడ్డారు .

  ఆయనకు వ్యావహారిక భాష పై అంతటి అభిమానం కలగటానికి ఒక సంఘటన  కారణం గా ఉంది .అప్పుడు జే .ఏ .యేట్స్ దొర ఉత్తరాంధ్ర స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గా ఉండేవాడు .ఆయనకు స్కూళ్ళల్లో తెలుగు బోధన కావ్య భాష లోనా? లేక వారు మాట్లాడుకొనే వ్యావహారిక భాషలోనా ?అనే విషయం పై ఆరా తీయాలనిపించి విశాఖ పట్నం మిసెస్ ఎ .వి .యెన్ ..కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ పి.టి .శ్రీనివాస అయ్యంగార్ ని అడిగాడు .ఆయన దీనిపై తానేమీ సరిగ్గా చెప్పలేనని ,ఆ వివరాలన్నీ గురజాడకు ,గిడుగుకు బాగా తెలుసునని చెప్పాడు .వారిద్దరిని కలిసి ప్రాధమిక విషయాలన్నీ అవగాహన చేసుకొని ,సంతృప్తిపడక  విద్యార్ధులు తాము మాట్లాడే భాషలో అధ్యయనం చేస్తేనే బాగా రాణిస్తారని గిడుగు గురజాడ ల అభిప్రాయాన్ని బలపరచాడు .ఇలా అధికారి కూడా తమకు తోడ్పడటం తో ఉద్యమతీవ్రత పెంచారు సభలు సమావేశాలు జరిపి పండితులతో వాదించి వారి అభిప్రాయాలను మార్చుకోనేట్లు చేశారు .ఉద్యమవ్యాప్తికోసం ‘’తెలుగు ‘’అనే పత్రిక 1919-20 లో స్థాపించి నిర్వహించారు .1906 నుండి 1940 వరకు అవిశ్రాంత పోరాటమే చేశారు .1925 లో తణుకులో’’ఆంద్ర సారస్వత పరిషత్’’ సభలో  నాలుగు గంటలు సుదీర్ఘ ఉపన్యాసం చేసిన వ్యావహారిక భాషా పోరాట యోధులు పంతులుగారు .ఈ పోరాట ఫలితంగా 1912-13 సంవత్సరం లో స్కూల్ ఫైనల్ విద్యార్ధులు  కావ్యభాషలోకాని ,వ్యావహారిక భాషలోకాని  పబ్లిక్ పరీక్ష రాయవచ్చునని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .ఇదే మొట్టమొదటి విజయం .1930 లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పర్లాకిమిడి రాజా పర్లాకిమిడి తాలూకాను ఒరిస్సాలో చేర్చటానికి తీవ్ర ప్రయత్నం చేస్తే, తెలుగువారందరి తరఫునా నాయకత్వం వహించిన ఎదిరించి నిలిచిన ధీశాలి గిడుగు .కాని రాజు బలవంతుడు కనుక ఆతాలూకాను, పట్టణాన్నీ కూడా బలవంతంగా ఒరిస్సాలో కలిపేశాడు . తెలుగు వారికి తీవ్ర అన్యాయం జరిగిందని భావించి 1936 లో ఒరిస్సా రాష్ట్ర ప్రారంభోత్సవం నాడు  ఉదయమే పర్లాకిమిడి వదిలిపెట్టి రాజమహేంద్రవరం చేరి అక్కడే కడదాకా ఉండిపోయిన భాషాభిమాని

   1936 లో నవ్య సాహిత్య పరిషత్ శివ శంకరస్వామి ఆధ్వర్యం లో ఏర్పడి రాష్ట్రం లోని కవులు రచయితలూ సభ్యులు గా చేరి వ్యావహారిక భాషోద్యమాన్ని ఊరూరా ప్రచారం చేసి గిడుగువారికి కొండంత అండగా నిలిచారు .1937 లో శ్రీ తాపీ ధర్మారావు ‘’జనవాణి ‘’పత్రిక పెట్టి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళారు. 1938 లో ఆంద్ర విశ్వ విద్యాలయం ‘’కళాప్రపూర్ణ ‘’బిరుదునిచ్చి సత్కరించింది .కొడుకు సీతాపతిగారికీ ‘’కళాప్రపూర్ణ ‘’నిచ్చింది .తండ్రీ కొడుకులు ఆంధ్రా యూని వర్సిటి నుంచి కళాప్రపూర్ణ పొందటం వీరిద్దరికే దక్కిన అరుదైన అదృష్టం .

  ఇంతటి బహుముఖీన ప్రతిభా వ్యుత్పత్తులున్నసృజన శీలి, వ్యావహారిక భాషోద్యమ పితామహుడు ,ఆంధ్రుల ప్రాతస్మరణీయుడు,సవర భాషకు ప్రాణ ప్రదాత , కారణ జన్ముడు శ్రీ గిడుగు వెంకట రామ మూర్తి పంతులుగారు 22-1- 1940  న 77 వయసులో మరణించారు .గిడుగు వారి పుట్టిన రోజు ఆగస్ట్ 29 ని’’తెలుగు భాషా దినోత్సవం ‘’గా మనం నిర్వహించుకొంటున్నాం .

ఆయన గురించి కొందరు ప్రముఖుల ప్రశంసలు –

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి

“ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి సమర్పించుకొని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే”

విశ్వనాథ సత్యనారాయణ

  • “రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట”
  • “రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు”

పులిదిండి మహేశ్వర్

  • “గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు, వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు,

తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు, కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు”

    గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుది విన్నపంలో వ్యావహారికభాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందాడు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు,విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డాడు. ఆ విన్నపంలోని చివరిమాటలు –

‘’దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కళకళలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా, సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు, వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస?

స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామిక పరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.

image.png
image.png
image.png
image.png
image.png
image.png

ఆధారం –ఆంధ్రజ్యోతిలో శ్రీ అల్లం సెట్టి చంద్ర శేఖరరావు గారి రచన ‘’గురువు గా గిడుగు ‘’ ,ఆంద్ర భూమి, ఆంద్ర ప్రభ, వీకీ పీడియా

   మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-18 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ” – ఆరుద్ర జయంతి సందర్భంగా

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ”

—————————————————————–

కవన రుద్రుడు ,నిత్య ప్రయోగ శీలి ,బహుముఖ ప్రజ్ఞా శాలి అయిదు దశాబ్దాలు సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేసి ,73  మూడవ ఏట అలసి ,సొలసి ,దీర్ఘ నిద్ర లోకి జారు కున్న వాడు ఆరుద్ర అనే భాగవతుల సదా శివ శంకర శాస్త్రి .7+3==10    సంఖ్యా శాస్త్రం  లో. వందా పూర్తి అయినట్లే .

శ్రీ రంగం శ్రీని వాస రావు వైష్ణవ నామం .శంకర శాస్త్రి శివ నామం ..మేన మామ ,మేనల్లుడు విష్ణు ,శివ రూపాలుగా వెలిగి ,”త్వమే వాహం”ఆంటే నువ్వే నేను అనిపించుకున్నారు .బాంధవ్యం ,స్నేహం ,అపూర్వం .శ్రీ శ్రీ తర్వాత పేర్కొనదగిన స్థాయి సంపాదించి ఆరుద్ర మామకుతగ్గ    అల్లుడైనాడు .మహా ప్రస్థానం తర్వాత పేర్కొన దగిన రచన ”త్వమేవాహం ”.ఆధునిక మహా కావ్య త్రయం లో త్వమేవాహం ఒకటి .మొదట్లో శ్రీ రంగం నారాయణ బాబు,శ్రీ శ్రీ పురిపండా ,పఠాభి ల ప్రభావం బాగా వున్నా ,క్రమం గా అందులోంచి జారి ,స్వంత గొంతుక తో ,స్వీయ వ్యక్తిత్వం తో ,మహాకవుల స్థాయికి ఎదిగిన వాడు ఆరుద్ర

తెలంగాణా నేపధ్యం గా ”త్వమేవాహం ”రాశాడు ఆరుద్ర . ఈ నాటి తెలం గాణా కాదు .పొరపడ కండి .నిజాం నిరంకుశత్వాన్ని నిర్భయం గా ప్రత్యక్షర శిల్పం గా మలిచాడు .పొట్టి వాడైనా గట్టివాడైన దాశరదికి తోడై,గట్టిగా గళం విప్పాడు .ఇదొక సింబాలిక్ రచన .టి ఎస్ .ఇలియట్ రాసిన వేస్ట్ లాండ్ లోని లక్షణాలన్నీ నిక్షిప్తం చేసి ”,ఆంద్ర ఇలియట్ ”అనిపించు కున్నాడు .అయితే దీనికి టీకా ,టిప్పణి ఉంటేనే బోధ పడుతుంది .అందుకే మొదటి ప్రచురణ జన రంజకం కాలేదు .తర్వాత దాశరధి తో చక్కని ఉపోద్ఘాతం రాయించి ప్రచురించాడు .అతడు నిజం గా ఆరుద్ర హృదయాన్ని అద్భుతం గా ఆవిష్క రించాడు .readability కలిగించాడు .అప్పటి నుంచే త్వమేవాహం  చదువరుల హస్తాలను ,మస్తకాలను   అలంకరించింది  .oft quoted lines కు జీవం పోసింది .హరీన్డ్ర నాధ చటోపాధ్యాయ  రాసిన ”తెలంగాణా విప్లవ గాధలు ”     ఆరుద్ర త్వమేవాహం కు ప్రేరణ .దీన్ని ఆరు కధలుగా కూర్చి కదా కావ్యం చేశాడు .ఈ ప్రక్రియ లో ఇదే మొదటిది

ఆరుద్ర మౌలికం గా ప్రయోగ వాది .ఆవేశం కంటే ఆలోచనతో కవిత్వం రాస్తాడు .చమత్కారం ,శబ్దాలంకారం ,భావ వ్యక్తీకరణకు తోడ్పదేట్లు రాయటం ఆయన ప్రత్యేకత .ఖండ కావ్యాన్ని కదా సూత్రం తో బంధించి ,పెద్ద కావ్యం గా ప్రయోగం గా రాశాడు .అభ్యుదయ కవితా చైతన్యాన్ని మరో మలుపు తిప్పాడు .”technic  లేని కవిత్వాన్ని నేను ఊహించలేను ”అంటాడు .అయితే ”ఆరుద్ర కవిత్వం టెక్నిక్ లో కూరుకు పోయింది ”అన్న వాళ్ళూ వున్నారు .              ”ట్రెయిన్ లో స్టీన్ గన్ .లా చెట్లు ,చిట్టెలుకలు —-చెయిన్సులో మగాళ్ళు -చెరచ బడ్డ ఆడాళ్ళు   —చెడ పురుగులు –మదమెక్కిన సోల్జర్లు ”అనటం ఆరుద్ర మార్కు కవిత్వం .

పైథాగరస్ సిద్ధాంతాన్ని చక్కగా కవిత్వీకరించాడు ”.చిన్ని చీమలు వగైరా అడుగు భుజం అనుకోండి —బలవంత మైన సర్పం -గట్రా ఎట్ సేటేరా -లంబం అవదా మరి ?–రెండు విభిన భుజాలపై గల చతురశ్రాలలోని తమిశ్రం    –థీసీస్,యాంటి   థీసీస్ సుల మిశ్రమ -రెండు భిన్న పక్ష    సంజ్ఞల పోరాటం –అనగా ఒక నూతన వ్యవస్థ ”

ఆరుద్ర కవిత్వం చదివి ”ఇంకా నేను కవిత్వం మానేసినా ఫర్వాలేదు ”అని కితాబు ఇచ్చాడు శ్రీ శ్రీ   తన ముద్దుల మేనల్లుడికి .ఆంగ్లం లోని క్రియ ను తెలుగు లో కూడా వెర్బ్  గా చేసి ప్రయోగించాడు

.    చెరిష్+ఇంచు=చరిషించు  అనీ రన్ +అండి ==రనండి ,అలాగే ఆమెన్ -ఆమెన్ ఒక చోట మెన్  అనీ ఇంకోచోట ఆమె అనీ శ్లేష .

గతం లోని మంచి ద్వారా వర్త మానం తీర్చి దిద్ది ,భవిష్యత్తు పై  దృష్టి కేంద్రీకరించిన ప్రతిభా మూర్తి   ఆరుద్ర.  అందుకే శ్రీ శ్రీ అంటాడు సాహిత్యోపనిషత్ లో ”  చూశావా ఆరుద్రా !సంప్రదాయం నిలిచే వుంటుంది హమేషా  –మధాచారాలు మారుతూ౦టా యి నిజం -కాని –సంప్రదాయం తాత ముత్తాతల ధనం    -జాతికి జీవ నాళిక —జాన పద గీతిక ”  .ఇదే మహా కవుల జంట దృష్టి తెలుగు సాహిత్యాకాశం లో శ్రీ శ్రీ ,ఆరుద్రలు సూర్య చంద్రులు . ..

 

ఆరుద్ర మరో పార్స్వ్యం

సినీ వాలి

 

ఆరుద్ర వచన కావ్యాలలో పేరు పొందింది ”సినీ వాలి ”ఆంటే అమావాశ్య ముందు కన్పించే ”చంద్ర రేఖ ”.పార్వతీ దేవికి కూడా ఆ పేరుంది .ఎంత కటిక చీకటి ముందు వున్నా ,ఆశా కిరణం తోడు వుంటుంది ,నిరాశ పనికి రాదనీ ఇందులోని ధ్వని .ఈ పేరు ఈ కావ్యానికి పెట్టి సార్ధకం చేసిన వారు ప్రముఖ కవి కాటూరి వెంకటేశ్వర రావు గారు .ఆధునిక కవిత్వానికి మూల వస్తువూ ,స్ఫూర్తీ ఆర్తీ అన్ని తనే అయిన వాడు ,మనిషిని ,అతని వ్యధను యుగయుగాల పీడనను ,వచ్చే యుగం పట్ల ఆశను ,ఆకాంక్షను ,తన కవితా దృష్టి లో ప్రతిఫలింప జేయటం ఆరుద్ర ఆనవాయితీ .అందుకే ప్రయోజన వాది గా గుర్తింపబడ్డాడు .అభ్యుదయం అతని వాదం .మనిషే అతని నాయకుడు .అనుభూతి తో పాటు,ఆలోచన వైపు మనిషినీ ,చదువరినీ   నడిపించిన మహా కవి . ..సినీ వాలి నగర జీవితం పై వ్రాసిన గేయ కావ్యం ..విలక్షణ హీరో జగ్గయ్యకు అంకితమిచ్చి మామ అయాడు .మధ్య తరగతి క్లార్కు సూర్యారావు జీవిత చిత్రమే ఇది .కాంక్రీటు అరణ్యాలు అయిన నగర ఘోష ..

ప్రక్రియా వైవిధ్యం

——————–

” ఇంటింటి పద్యాలు ”రాసి ప్రతి ఇంట్లో పాడుకోనేట్లు చేశాడు ఆరుద్ర .”గాయాలు -గేయాలు ”రాసి మనసు లోని బాధను వెళ్ళ గక్కాడు ..”విశ్వ నాద నాయకుడు ”చరిత్రను నాటకం గా మలిచాడు .అందరు స్త్రీ పాత్రలే వుండే నాటికలు రాశాడు .”ఆరుద్ర నాటికలు ”పరమ ప్రయోజనం కోసమే రాశాడు .అవి కాలక్షేపం బఠానీలు కావు .”సర్రియలిస్ట్ ”కవిగా రాణ పొందాడు కధకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు .”నేను చెప్పానుగా ”అనే కదా సంపుటి తెచ్చాడు .దేశీయ ఛందస్సు లో ‘కూనలమ్మ పదాలు ” ”రాసి అందర్నీ కొరడాతో ఝళిపించాడు .”పైలా పచ్చీసులు ”తో పరవళ్ళు తొక్కాడు .”వెన్నెల -వేసవి-”లతో చల్లదనం ,చంద్ర గాడ్పులు విసిరాడు .”అచ్చు తప్పులు ”రాసి కొత్త వరవడి సృష్టించాడు .ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి .”కొండంత మనిషి చ (క) నుమరుగైనాడు ”

”anthropology  ”,  ప్రీ హిస్టరీ వ్రాసి పాత చరిత్రను తవ్వి తలకెత్తాడు .”ఆరుద్ర గళ్ళ నుడికట్టు ”సాహితీ ప్రియులకు గొప్ప కని కట్టు గా వుండేది .”స్థల నామాలు ”పై తీవ్ర పరిశోధన చేశాడు .”వ్యాస పీఠం ”రాసి ఆధునిక వ్యాసుడే అయాడు .”detective ”సాహిత్యం సృష్టించి ,నేర పరిశోధన లో కొత్త దనం ప్రవేశ పెట్టాడు .జర్నలిస్ట్ గా పత్రికా సేవ కూడా చేశాడు .”సమగ్రాంధ్ర చరిత్ర ”తో ఆరుద్ర సాహితీ విశ్వ రూపం మనకు దర్శన మిస్తుంది .అంతకు ముందే”త్వమే వాహం ”కావ్యాన్ని తెలంగాణ నేపధ్యం లో రాశాడు .ఇది symbolic  రచన   .చదరంగం మీద ప్రత్యెక అభిమానం వుంది దాని లోతులు తరిచి పుస్తకం రాశాడు .’ఇంత విస్త్రు తం గా వైవిధ్యం గా తన సాహితీ జేవితాన్ని పండించు కొన్నాడు భాగవతుల సదా శివ శంకర శాస్త్రి అయిన ఆరుద్ర ..సిని పాటల మాటల రచయిత గా శ్రీ శ్రీ తో పాటు నిలబడ్డాడు .డబ్బింగ్ రచయిత గా మామకు తగ్గ అల్లుడని పించు కున్నాడు . తాను చే బట్టిన ప్రతి ప్రక్రియను సర్వాంగ సుందరం చేసి భళా అనిపించుకున్న ఆరుద్రను గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే వుంటుంది …

 

నిత్య పరిశోధకుడు ఆరుద్ర

 

తెలుగు సాహిత్యానికి సామాజిక నేపధ్యం లో సాహిత్య చరిత్ర రాసిన ఘనాఘనుడు  ఆరుద్ర .సప్త సాహితీ సముద్రాలను తానొక్కడే అవలీలగా ఈది ఒడ్డుకు చేరిన వాడు .సామాన్యుడు సైతం చక్కగా ,కధలా చదూకోనేట్లు”సమగ్రాంధ్ర సాహిత్యం ”సృష్టించిన బహుముఖ  బ్రహ్మ .అనితర సాధ్యమైన దాన్ని తాను చేసి చూపాడు .మొదటి సారిగా పది సంపుటాలు తెచ్చాడు ..ఆ తర్వాత రెఫెరెన్సు కోసం పది సంవ త్సరాలు పరిశోధన చేసి ఇంగ్లాండ్ ,అమెరికా లైబ్రరీ లలో వున్న సమస్త విషయాలను సేకరించి మిగిలిన మూడు భాగాలు ప్రచురించాడు .కవి కాలమ్ పై చర్చలు ,కులం పై రాద్దా౦తాలు  అరణ్యం లో ,కొండల్లో చీకటి కోణం లో చిక్కుకున్న సాహితీ చరిత్ర అనే దివ్య గంగను భూమార్గం పట్టించి ,జనసామాన్యం కోసం జాతి తరించటం కోసం కృషి చేసిన ”సాహితీ భగీరధుడు ”ఆరుద్ర .పది విశ్వ విద్యాలయాలు ,,వెయ్యి అకాడెమీలు చేయలేని పనిని ఒంటరిగా ఆరుద్ర చేసి జాతికి అంకితమిచ్చి ధన్యుడైనాడు .తన ఆరోగ్య సర్వస్వాన్ని కోల్పోయాడు .

.           ”ప్రపంచ వాజ్మయాన్ని  ప్రజాపరం చేసి ,ప్రస్థాన భేరి మోగించి ,బావుటా ఎగుర వేసిన ప్రజా కవి ఆరుద్ర ”అన్న మాట సత్యం యుగవిభజన చేయటం లో ఆరుద్ర కొత్త మార్గం తొక్కాడు .పోషకులను ఆధారం గా చేసుకొని యుగవిభజన చేసి తన మార్క్సీయ దృక్పధాన్ని నిల బెట్టుకున్నాడు .కవి ,పండితుడు ,విమర్శకుడు ,శాసన భాషావిష్కారుడు అన్నీ తానె కనుక సాహిత్య చరిత్ర అంత గొప్ప గా వచ్చింది .అందుకే సాహిత్య పండితుల్లో ఆరుద్ర అగ్రేసరుడు .”చుళికీ కృత సర్వ పాదోది పయస్కుడైన ముని ”అని నన్నయ గారు అగస్త్య మహర్షిని సంభావించారు .అలాగే బవిరి గడ్డం తో ,కాషాయ వస్త్రాల తో వున్న ఆరుద్ర  నిజం గానే” సాహితీ ఆగస్తి యార్ ”.  ,

నిరంతర పరిశీలనా వ్యసనుడు

తొమ్మిదవ ఆసియా క్రీడల సందర్భం గా పోస్టల్ శాఖ వారు ”మత్ష్య యంత్రాన్ని కొట్టే శ్రీ కృష్ణుని” చిత్రాన్ని స్టాంప్ గా వేశారు .దాన్ని చూసి చాలా మంది ఆక్షేపించారు .అయితె ఆరుద్ర ప్రాచీన తెలుగు కావ్యాలలో ఒక దాని నుంచి కృష్ణుడు మత్ష్య  యంత్రాన్ని కొట్టే ఘట్టాన్ని వుదహరించి సమర్ధించాడు .

”  శ్రీ కృష్ణుడు అసలు సిసలు ఆంధ్రుడు ”అని కూడా వివరించాడు

ఏకలవ్యుడు కుంతీ దేవి అక్క కొడకు అని సంస్కృత హరివంశం ఆధారంగా తెలిపాడు .             కుమార్తె కు పుత్రిక కు భేదం వుందని”మనుధర్మ శాస్త్రం ”ఆధారం గా వివరించాడు .కుమార్తె ఆంటే తోడబుట్టిన అన్నదమ్ములు కల అమ్మాయి .పుత్రిక ఆంటే సహోదరులు లేనిది ..ఈమెకు పుత్రుని అధికారాలన్నీ దక్కు తాయి .

”  సీత రామునికి ఏమవుతుంది ?”అనే వ్యాసం లో వివిధ దేశాల లోని రామాయణాలను సాకల్యం గా పరిశీలించి వివరించాడు .

”  వేమన్న ” పై పరిశోధన చేసి ”వేమన్న వేదం ”అనే అభినవ వేదం రాసాడు /.

”  గురజాడ ”పై అంతులేని అభిమానం తో ”గురజాడ  గురు పీఠం ”రాసి ఆయనకు మహోన్నత పీఠం కల్పించాడు . ‘

తెలుగు వాళ్ళు చేసుకొనే ప్రతి పండుగ వెనుక వున్న, ప్రతి ఆచారం వెనకా వున్న పరమార్ధాన్ని తెలియ జేసిన sixth sense వున్న ఆరో రుద్రుడు ఆరుద్ర .   చరిత్ర ,విజ్ఞానం ,దర్శనాలు ,నాట్య శాస్త్రం ,సంగీతం ,చదరంగం ,ఇంద్రజాలం మొదలయిన వాటన్నిటి పై సాధికారం గా రచనలు చేసిన సాహితీ విరాణ్మూర్తి ఆరుద్ర .అయితే ప్రతి రచనను  ”  marxist దృక్పధం ”అనే గీటురాయి పై పరీక్షించాడు నిబద్ధత గల గొప్ప రచయిత అనిపించు కొన్నాడు ఆరుద్ర .31-8-1925 విశాఖలో జన్మించి 4-6-1998 మద్రాస్ లో మరణించాడు ఆరుద్ర .

నమో రుద్రాయ ఆరుద్రాయ  అని నమస్కరిస్తూ

నేడు ఆరుద్ర జయంతి సందర్భంగా

మీ

గబ్బిట దుర్గా ప్రసాద్ -2-6-20 11 –ఉయ్యూరు

 

 

 

 

 

— 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హరి కృష్ణ –ఒక పరిచయం

హరి కృష్ణ –ఒక పరిచయం

అప్పుడు నేను పామర్రు హై స్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నాను .అవి ఎన్టి ఆర్ కొత్తగా తెలుగు దేశం పార్టీ పెట్టి  ఊరూరా ప్రచారం చేస్తున్న రోజులు .ఒక రోజు హరి కృష్ణ మా స్కూల్ కు మందీమార్బలంతో వచ్చి స్టాఫ్ నందర్నీ స్వయంగా కలిసి,నమస్కారం చేస్తూ  తెలుగు దేశం పార్టీ కి ఓటు చేయవలసిందిగా అభ్యర్ధించారు .అప్పుడేవరైనా ‘’అలాగే ‘’అంటాం అందరం అలానే అన్నారు .ఆతర్వాత చాలాసార్లు ఎన్నికలప్రచారం లో పామర్రు మీదుగా వెడుతూ ప్రచార రధం పైనే కనిపించారు తప్ప మళ్ళీ ప్రత్యక్షంగా చూడలేదు .

మరో సారి పామర్రులో పని చేస్తుండగానే’’ తాతమ్మ కల’’సినిమా నందమూరు లో షూటింగ్ జరుగుతున్నప్పుడు స్టాఫ్ అందరం  సైకిళ్ళమీద నందమూరు రామారావు గారింటికి వెళ్లాం .రామారావు గారు మమ్మల్ని సాదరం గా ఆహ్వానించి టిఫిన్ కాఫీలు అందించి  షూటింగ్ జరిగే ప్రదేశం మాకు చూపమని ఒక మనిషి నిచ్చిపంపారు .పొలాల్లో షూట్ చేస్స్తున్నారు .భానుమతి  రామారావు నటిస్తున్నారు చేతిలో కర్ర పట్టుకొని ముసలి గెటప్ లో ఇద్దరూ ఉన్నారని జ్ఞాపకం .హరికృష్ణను కూడా చూసినట్లే గుర్తు .ఒక గంట షూటింగ్ ప్రదేశం లో ఉండి రామారాగారికి ధాంక్స్ తెలిపి ,తిరిగి వచ్చాం .

మా మద్రాస్ మేనల్లుడు అంటే   మా పెద్దక్కయ్య శ్రీమతి లోపాముద్ర , బావగారు శ్రీ కృపానిధి గార్ల కుమారుడు శ్రీనివాస్ మద్రాస్ లో మెట్రిక్ పరీక్షలకు తయారౌతున్నప్పుడు వాడు చదివే స్కూల్ లో RAMA KRISHNA  కూడా చదవటం ,ఇద్దరికీ మంచి స్నేహం ఉన్నట్లు తరచూ చెప్పేవాడు .వాళ్ళు మెట్రిక్ పరీక్ష గుంటూరు కేంద్రంగా రాశారు .వాళ్ళంతా ఒక పెద్ద  హోటల్ లో బస చేశారు .నన్ను వెళ్లి చూడమని మా అక్కయ్య చెబితే ,నేను గుంటూరు కు చూడటానికి వెళ్లాను .అక్కడ హరి  కృష్ణ ను  చూసిన ట్లు లీలగా జ్ఞాపకం. గట్టిగా చెప్పలేను .

మరో సారి నాకు మోపిదేవి హై స్కూల్ లో1963లో – నాతోపాటు పనిచేసిన నాకు అత్యంత ఆప్తుడు , జూనియర్ తెలుగు పండిట్ స్వర్గీయ శ్రీ కూచిభొట్ల  సత్యనారాయణగారు  తర్వాత నందమూరు హై స్కూల్ కు బదిలీ అయినప్పుడు హరికృష్ణ అక్కడి స్కూల్ లో చదివేవాడని ,అప్పటికే నటనలో దిట్ట అని డైలాగ్స్ తాను నేర్పెవాడినని సినిమాలో చిన్న కృష్ణుడు వేషం వేశాడని కలిసినప్పుడు చెప్పేవారు .

మూడు ఏళ్ళ క్రితంఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో జరిగిన  శ్రీ హనుమజ్జయ౦తికి మధ్యాహ్నం 12 -30 కి స్వామివార్ల శాంతి కల్యాణం కూడా అయిపోయాక ఇద్దరు మహిళలు వచ్చి స్వామివారికి పూజ చేయించలని కోరారు .ఆసమయం లో ఇక పూజలు  ఉండవని, సాయంత్రం వస్తే నేనే దగ్గరుండి పూజ చేయిస్తానని చెప్పాను .సరేనని తీర్ధ ప్రసాదాలు తీసుకొని వెళ్ళారు .సాయంత్రం ఘనంగా చాలీసా పారాయణ జరుగుతున్న సమయం లో ఆ ఇద్దరు మహిళలు మళ్ళీ వచ్చారు .అప్పుడు కూర్చోపెట్టి వాళ్ల వివరాలు అడిగాను .ఒకామె తాను సినీ యాక్టర్ నందమూరి హరి కృష్ణగారి భార్యనని చెప్పి తనతో పాటు వచ్చిన ఆవిడ హరి కృష్ణ తోడల్లుడిగారి భార్య అనీ ,తామిద్దరం ఉయ్యూరు దగ్గర కుమ్మమూరు నుంచి వచ్చామని చెప్పారు .అప్పుడు నాకు తెలిసింది ఆ రెండో ఆవిడ నాకు బాగా తెలిసిన హనుమంతరావు గారి భార్య అని .దగ్గరుండి పూజారితో వారిద్దరి గోత్రనామాలతో అష్టోత్తర సహస్రనామార్చాన చేయించాను .స్వామి వారి అలంకరణ వైభవం చూసి వారిద్దరూ పరవశం చెందారు .ఆ రోజు తమలపాకులతో ప్రత్యేక పూజ కనుక స్వామి దాదాపు తమలపాకులతో మునిగిపోయి అత్యంత వైభవంగా ఉన్నారు. వాళ్లకు కన్నులపండువుగా ఉందని తెగ మెచ్చుకొన్నారు . పూజ పూర్తయ్యాక అసలు  ‘’మా ఆలయం గురించి మీకు ఎలాతెలుసు ?’’అని హరికృష్ణ భార్యను అడిగాను .ఆమె ‘’మా వారు హరిక్రష్ణగారు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం గురించి  నెట్ లో చూసి చదివి తెలుసుకోన్నారట .నిన్నరాత్రి  కుమ్మమూరులో ఉన్న నాకు ఫోన్ చేసి ,నన్ను తప్పకుండా హనుమజ్జయ౦తినాడు  ఆలయానికి వెళ్లి, స్వామివార్లను దర్శించి పూజ చేయించి రమ్మని చెప్పారు .అలాగే నని చెప్పి ,ఉదయం పనులన్నీ ముగించుకొని  మేమిద్దరం వచ్చాం ‘’అని చెప్పారు .చాలా సంతోషించి వెంటనే ఇంటికి వెళ్లి సరసభారతి పుస్తకాలు  తెచ్చి ,ఇద్దరికీ చెరో సెట్ ఇచ్చాను .దీనికి మరీ సంబర పడ్డారు .డబ్బు ఇవ్వటానికి సిద్ధమయ్యారు .డబ్బుకు పుస్తకాలు అమ్మము .మీకు కావాలంటే హుండీలో మీరు ఇవ్వాలనుకోన్నది వేయండి .అని చెప్పాను. అలానే చేసి మరింత  ఆశ్చర్యపోయారిద్దరూ.

ఇదీ నందమూరి హరికృష్ణ తో నాకున్న పరిచయంగా నేను చెప్పుకొనేది .

కొస మెరుపు –నేను ఉయ్యూరు హై స్కూల్ లో పని చేస్తున్నప్పుడు ,ఎన్టీ ఆర్ కొత్తగా పార్టీ పెట్టె ఆలోచనలో ఉన్నాడు .మాస్టాఫ్  అంతా కాంగ్రెస్ సానుభూతిపరులు .కాని రామారావు పా  ర్టీ పెట్టి ,ఘన విజయం సాధిస్తారని ఆయనే ముఖ్యమంత్రి అవుతాడనీ రోజూ నాకు తెలిసిన పేపరు వార్తలతో వాదించేవాడిని .ఒకరోజు పేపర్ లో పడిన రామారావు ఫోటో నా రాక్ కు అంటించి నా అభిమానం చాటాను . రామారావు  గెలవటం ముఖ్యమంత్రి అవటం జరిగిపోయాయి .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అపర శ్రీరామ చంద్ర మూర్తి శ్రీ శంభుని శ్రీ రామచంద్ర మూర్తి గారి అస్తమయం

అపర శ్రీరామ చంద్ర మూర్తి శ్రీ శంభుని శ్రీ రామచంద్ర మూర్తి గారి అస్తమయం

మా పెద్ద తోడల్లుడుగారు శ్రీ శంభుని శ్రీరామ చంద్ర మూర్తిగారు 90  ఏళ్ళ వయసులో ఖమ్మం లోని స్వగృహం లో 28-8-18 మంగళవారం రాత్రి 7-30 గం.లకు మరణించారు .సుమారు మూడేళ్ళ నుంచి మూత్రపిండాల బాధతో  హార్ట్ ఎటాక్ తో కాళ్ళ వాపులు, కంటి జబ్బులతో ఇబ్బంది పడుతూ తేడా చేసినప్పుడు హైదరాబాద్ యశోదా హాస్పిటల్ లో చికిత్స చేయి౦చు కొంటున్నారు .ఆగస్ట్ మొదటి వారం లో బాగా లేక యశోద లో చికిత్స పొందుతుండగా నేను 7 వ తేదీ ఉయ్యూరునుంచి హైదరాబాద్ వెళ్లి హాస్పిటల్ లో ఆయన్ను చూసి పలకరించి వచ్చాను .అయితే అంతకుముందే డయాలిసిస్ జరిగి నీరసంగా ఉండటం తో నేను ఎక్కువ సేపు ఉండకుండా వచ్చేశాను .అ ఆర్వాత ఆయన వాళ్ళబ్బాయి అమ్మాయిలతో ‘’ప్రసాద్ గారు వచ్చారు కాని నేను ఆయనతో ఎక్కువ సేపు మాట్లాడలేక పోయాను ‘’అని బాధపడ్డారట .అంతటి మెత్తని మనసు ఆయనది .ఉగాది రోజుకూడా ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు .

   ఈ మధ్య వారం క్రితం మళ్ళీ తేడా చేస్తే హాస్పిటల్ లో చేరారు .వయసు రీత్యా డయాలిసిస్ తట్టుకోలేని పరిస్థితి .కనుక హాస్పిటల్ వద్దు అని ఇంటివద్ద మారాం చేశారట .కాని ఆయనబాద చూస్తూ ఊరుకోలేరుకదా .ఒప్పించి చేర్పించారు .అన్ని రకాల వైద్య౦ చేస్తూనే ఉన్నారు .కాని 27 వ తేదీ రాత్రితొమ్మిదిన్నరకు మా బావమరది ఆనంద్ ఫోన్ చేసి మూర్తిగారి పరిస్థితి చాలాక్రిటికల్ గా ఉందని వెంటిలేటర్స్ పైనే ఉన్నారని  ఆశలేదేమో నని నిర్వేదంగా చెప్పాడు . బహుశా రాత్రికో తెల్లవారుఝామునో ఖమ్మ౦కు అంబులెన్స్ లో తీసుకు వెడుతున్నారని చెప్పాడు .అప్పటికప్పుడు మేమూ బయల్దేర లేని స్థితి . మంగళవారం ఉదయం  మూర్తిగారి అమ్మాయి అల్లుడు శ్రీమతి మంజుల శ్రీ సత్యనారాయణ గార్లతో ఫోన్ లో మాట్లాడాను.మూర్తిగారిని అంబులెన్స్ లో హాస్పిటల్ వాళ్ల టెక్నీషియన్ సహాయంతో  వెంటిలేటర్స్ తోనే ఉదయం 5-30 కి హైదరాబాద్ లో అందరూ కలిసి బయల్దేరామని సుమారు ఉదయం 10-30 కు ఖమ్మం చేరుతామని అక్కడ పరిస్థితిని బట్టి వెంటిలేటర్స్  గురించి ఆలోచిస్తామని చెప్పారు .

28 వ తేదీ మంగళవారం ఉదయం స్నానపూజాదులు పూర్తీ చేసుకొని ,అన్నం వండుకొని ఉదయం 9 గం లకే తిని,కారులో మేమిద్దరం  9-30 కి బయల్దేరి బెజవాడ వెళ్లి అక్కడున్న మా శ్రీమతి చిన్నక్కయ్య జానకిగారిని కూడా ఎక్కించుకొని అక్కడ 11 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1-15 కు ఖమ్మం చేరాం  .మూర్తిగారి భార్య అంటే మా శ్రీమతి పెద్దక్కయ్య గారు మహా లక్ష్మి గారు , కొడుకు సూర్యనారాయణ ,కోడలు స్వర్ణ ,మూర్తిగారి తమ్ముడికుమారులు కోడళ్ళు సూర్యం పెద్ద వియ్యంకుడు వియ్యపరాలు  అప్పటికే వచ్చి ఉన్నారు .లోపలగదిలో ఆయన మామూలుగా పడుకొనే మంచం మీదే పడుకోబెట్టారు .అప్పటికి వెంటి లేటర్స్ తీసేసి గంటన్నర అయి౦దన్నాడు సూరి .టెక్నీషియన్ వెంటి లేటర్స్ తీసేయ్యగానే ప్రాణం పోతుంది అని చెప్పాడట .అయినా శ్వాస ఆడుతోంది .గుండె కొట్టుకొంటోంది .ఎగ రొప్పుతో పొట్ట బాగా కదుల్తోంది .మనం పలకరించినా తెరచి ఉన్నకనులు మనల్ని గుర్తించలేక పోతున్నాయి . కృత్రిమ శ్వాస లేదు కనుక ఏ క్షణం లోనైనా ఊపిరి ఆగిపోవచ్చు  .అందరూ మంచం చుట్టూ కూర్చుని విషాదంగా ఉన్నాం .

    రాత్రి అసలేమి జరిగింది అని సూర్యాన్ని అడిగితే వాడు ‘’బాబాయ్ !రాత్రి నాన్నగారి బాధ చూడలేక డయాలిసిస్ చేయమని డాక్టర్ ను రిక్వెస్ట్ చేశాం . నాన్నగారికి 12 ఏళ్ళ నుంచి ఆయనే డాక్టర్ .నాన్నగారి వ్యాధి గురించి అన్ని విషయాలు ఆయనకు తెలుసు ఈ 12 ఏళ్ళలో 6 సార్లు మాత్రమే డయాలిసిస్ చేశారు .కనుక మనం కోరినప్పుడు చేయరు అన్నీ ఆలోచించే ఆ డాక్టర్ నిర్ణయాలు తీసుకొంటారు . ఆయనంటే నాన్నగారికీ, మాకు అంతనమ్మకం .కాని ఇప్పుడు డయాలిసిస్ చేస్తే తట్టుకోలేరు  చేయటం  మంచిది కూడా కాదు  అన్నారు .ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అని అడిగాం .ఒక్కటే ఉంది .80 వేలరూపాయల  ఇంజెక్షన్ ఉంది .అదిచేస్తే ఆయన శరీరం దాన్ని తీసుకోగలిగితే 6 నెలలు లైఫ్ గ్యారంటీ .కాని అది సైడ్ ఎఫెక్ట్ ఇస్తే హార్ట్ పై ప్రభావంకలిగి  కార్డియాక్ అరెస్ట్ ,లేక బ్రెయిన్ పై ప్రభావం చూపించవచ్చు .ఇంతకంటే మనం ఏమీ చేయలేం .మీ  నిర్ణయాన్నిబట్టి చేస్తాం అన్నారు .క్షణం కూడా ఆలోచిచకుండా  అందరం వెంటనే చేయమని కోరాం .దానికోసం కాలర్ బోన్ దగ్గర గాటు పెట్టి చేయాలట .అలానే చేశారు .డాక్టర్ వెంటనే బయటికి వచ్చి సక్సెస్ సూర్య౦ గారూ అని సంతోషంగా చెప్పారు .అందరం హాయిగా ఊపిరి పీల్చుకున్నాం .అరగంట కాగానే నన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి రమ్మని విచారంగా మొహం పెట్టారు డాక్టర్ .మూర్తిగారి శ్వాస ఆగిపోయింది .అని చెప్పాడు .అయినా ప్రయత్నిస్తున్నామని గుండెలను కదిల్చే ప్రయత్నం చేశారు .బాగానే పని చేసి గుండె కొట్టుకొన్నది ..ఒక్కసారి మూర్తిగారు పెద్దశబ్దం చేశారు .డాక్టర్ అది గమనించి నాతో కార్డియాక్ అరెస్ట్ జరిగిందని ,బ్రెయిన్ కూడా దెబ్బ తిందని ఇక ఏమీ లాభం లేదని ఖమ్మం  తీసుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు అయితే ఖమ్మానికి వెంటిలేటర్స్ పైనే తీసుకు వెళ్ళమని సలహా ఇచ్చారు .ఉదయం 5-30 కు బయల్దేరి 10-30 కు చేరాం ‘’అని జరిగిన విషయాలన్నీ చెప్పాడు .ఆదివారం కూడా మూర్తిగారు అందరితో సరదాగానే మాట్లాడారట .మనవరాలు మంజులకూతురుకు ఉద్యోగం వచ్చిన వార్తవిని అభినంది౦చారట .ఇంతలో ముంచుకొచ్చేసింది .

                మూర్తిగారి బంధువులు మిత్రులు వచ్చి చూసి వెడుతున్నారు .తెల్లవారుజామున 5 గంటలవరకు యశోదా హాస్పిటల్ లోనే ఉన్న మా బావమరది ఆనంద్ ఇంటికి వెళ్ళాడు వీళ్ళు ఇటు వచ్చారు .వాడు, భార్య రుక్మిణి మధ్యాహ్నం 12 గంటలకు బస్ లో హైదరాబాద్ నుంచి ఖమ్మం బయల్దేరి సాయంత్రం 5-30 కు ఖమ్మం చేరారు .వీళ్ళకూ సూర్యం మంజులావాళ్ళకూ రాత్రి తెల్లవార్లూ నిద్ర లేదు .సూర్యం వాళ్లకు మూడు రోజులనుంచి నిద్రే లేదు మొహాలన్నీ అలసి పోయి ఉన్నాయి .మేము సాయంత్రం 5-30  గంటలవరకు ఉండి,అందరికీ చెప్పి కారులో మళ్ళీ ఉయ్యూరు బయల్దేరాం .సుమారు నందిగామ దగ్గరకు రాగానే రాత్రి 7-30 కి ఆనంద్ ఫోన్ చేసి ‘’పెద్దబావ వెళ్ళిపోయాడు బావా ‘’అని బావురుమన్నాడు .నేను మా అబ్బాయిలకు ఫోన్ చేసి చెప్పాను మా అమ్మాయి పోద్దుననుంచీ చాలాసార్లు ఫోన్ చేసి విషయాలు తెలుసుకుంటూనే ఉంది .మాఅబ్బాయి రమణకూడా.అంటే మూర్తిగారి గుండె, ఊపిరి తిత్తులు  వెంటిలేటర్స్ తీసేసిన తర్వాత కూడా 8 గంటలు పనిచేస్తూ ఇక సెలవు అని ఆగిపోయాయన్నమాట .ఇదొక వింత అనుభవం అని అందరూ అన్నారు  .నిన్న 29వ తేదీ బుధవారం ఉదయం మూర్తిగారి పార్ధివ శరీరానికి  మూర్తిగారి తమ్ముడు, బావమరది ఆనంద్, కూతురు అల్లుడు  ,బంధువుల కుటుంబాలు, స్నేహితుల సమక్షం లో  కొడుకు సూర్యం యధావిధిగా అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించి పితృ ఋణం తీర్చుకున్నాడు .

దాదాపు పదేళ్ళ  నుంచీ ఇన్ని రకాల వ్యాధులతో బాధపడుతూ కూడా చెదరని చిరునవ్వుతో ,సడలని ఆత్మ విశ్వాసం తో ,ధైర్యంగా మౌనంగా మునీశ్వరుడిలా మూర్తిగారు గడిపారు.ఎవరిపైనా చికాకు, కోపం ప్రదర్శించని తత్త్వం ఆయనది .ఎంతటి దుఖాన్నైనా బాధనైనా నిబ్బరం గా తట్టుకొనే మనస్తత్వమున్నవారు . భార్య మహాలక్ష్మి గారు ఆయనకు అన్నిటా బాసటగా ఉన్నారు . ఇద్దరూ కూర్చుని చక్కగా అనేక విషయాలు గంటలతరబడి మాట్లాడుకోనేవారు  అంతటి అన్యోన్యం వారిది .సుమారు ఏడాది నుంచి ఆయన కు ఆమె కనిపించకపోతే విలవిలలాడేవారట  అనుక్షణం ఆమె ఆయన ఎదుట కనిపించాలని ఉండేదట.  హైదరాబాద్ లో కొడుకు, కూతురు ఉన్నా ,వాళ్ళు అక్కడికి వచ్చి ఉండమన్నా ఖమ్మం స్వంత ఇంట్లోనే పెద్దగా సౌకర్యాలు లేకపోయినా హాయిగా వండుకు టిని ఉండాలనుకొనే స్వేచ్చా జీవులు  వారిద్దరూ .ఆయనకు ఇష్టమైన పదార్ధాలు ,పిండివంటలు ,ఉపాహారాలు  వండి వడ్డించి సంతృప్తిగా భోజనం పెట్టటం ఆవిడకు ఎంతో ఇష్టం .ఆయన కాఫీగత ప్రాణి .కనుక అడిగినప్పుడల్లా చిక్కని చక్కని కాఫీ కలిపి ఇచ్చేది .ఇంటికి వచ్చినవారికీ అంతే.అతిధి మర్యాదలకు పెట్టింది పేరు .ఎన్నో రకాల ఊరగాయలు పెడుతుంది .మా ఆవిడను ‘’అమ్మడూ !’’అని .చాలా ఆప్యాయంగా పిలిచి మాట్లాడుతుంది ఫోన్ లో కూడా అంతే .నెలకు కనీసం వాళ్ళే రెండు సార్లైనా ఉయ్యూరు కు ఫోన్ చేసి మాట్లాడేవారు .వెడల్పు ముఖం నుదుటిపై పెద్ద కుంకుమబొట్టు తో ఆవిడ సాక్షాత్తూ మహా లక్ష్మీగా కనిపించేవారు .మహా లక్ష్మి పేరు సార్ధకం చేసేవారు

   దారిలో నేను మొదట హెడ్ మాస్టార్ గా పని చేసిన వత్సవాయి హైస్కూల్ ను ,అక్కడ స్కూలు వెనక నేను అద్దెకున్నశ్రీ పుల్లయ్యనాయుడు గదిని చూసి నాయుడు దంపతులు మమ్మల్ని చూసి ఆనందంతో ఇచ్చిన కోకాకోల తాగి మళ్ళీ బయల్దేరాం .ఇటు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఆగి వెళ్ళటం  మాకు మామూలే .మార్చిలో వచ్చినప్పుడు, అంతకుముందు మా అమ్మాయి విజ్జి ,కోడలు సమత మేము వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణ౦ లో పుల్లయ్యనాయుడు దంపతులను చూసివచ్చాం .వాళ్ళకూ మేమంటే విపరీతమైన అభిమానం .

అయిదునెలలక్రితం  మార్చి 12 ఉయ్యూరులో బయల్దేరి ఖమ్మంవచ్చి మూర్తిగారు అప్పటికి అనారోగ్యం నుంచి తేరుకున్నందున మేమిద్దరం చూడటానికి వచ్చాం .మూర్తిగారు దంపతులకుమేము నూటా వస్త్రాలు పెడితే ,ఆదంపతులు మా దంపతులకు బట్టలు పెట్టారు .వారికి ‘’షార్లెట్ సాహితీ మైత్రీబంధం ‘’;;వసుధైక కుటుంబం ‘’పుస్తకాలు అప్పుడు అందజేశాం .అనారోగ్యం మర్చిపోయి రాజకీయాలగురించి దేశ పరిస్థితులపైనా చాలాసేపు మాట్లాడారు .మా పిల్లల౦ టే  చాలా ఇష్టం .ముఖ్యంగా శర్మ ,రమణలు ఆయనకు శిష్యులు .మా అమ్మాయి విజ్జి మూర్తి గారికి  అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడుతుంది .నా సాహితీ కృషిని నిండుమనసుతో మెచ్చుకొనేవారు .శ్రీ ఆంజనేయస్వామిపూజకు కి తరచుగా డబ్బు లిచ్చేవారు .పుస్తకం లో ఆయన మరదలు అంటే మా ఆవిడ ఫోటో ఉండటం చూసి మహా మురిసి పోయేవారు .ఆయనకు  సరసభారతి పుస్తకాలు ఆవిష్కరణ కాగానే పంపటం ,ఆయనా ,అందుకొన్న  తర్వాత ఫోన్ చేసి ‘’ప్రసాద్ గారు !ఇన్ని పుస్తకాలు, ఇంతటి విషయసేకరణ ఎలా చేయగాలుగుతున్నారో తలచుకొంటే ఆశ్చర్యం వేస్తుంది ‘’అనే సుమనస్కత మూర్తిగారిది .90 సంవత్సరాల నిండైన సంతృప్తికరమైన జీవితం అనుభవించారు.హాయిగా నిష్క్రమించారు .కొడుకు సూర్యం కు ఇద్దరబ్బాయిలు .ఇద్దరూ అమెరికాలో మంచి ఉద్యోగాలలో ఉన్నారు .ఇద్దరికీ మగపిల్లలు .అమ్మాయి మంజుల కొడుకు బి టెక్ చేసి కెనడా లో ఉద్యోగం లో ఉన్నాడు .కూతురు బి టెక్ పాసై ఉద్యోగం సాధించింది ఈమధ్యనే .కొడుకు ,కూతురు మూర్తిగారికి రెండుకళ్ళు .మునిమనవళ్ళను చూసి  మూర్తిగారు మురిసిపోయారు .ఎత్తుకొని ఆడించి ఆనందించేవారు .మనవళ్ళు తాతగారితో వీలైనప్పుడల్లా ఫోన్ లో మాట్లాడుతారు .ఆయనకూ వాళ్ళతోసంభాషించటం చాలా ఇష్టం . వాళ్ల భార్యలపైనా  గొప్ప ఆపేక్ష ఆయనకు .ఆయన మంచితనం ఎల్లలు లేనిది .మా కుటుంబానికి మూర్తిగారంటే విపరీతమైన అభిమానం ,ఆపేక్ష ,గౌరవం మర్యాదా .ఆయనకూ అంతే .మా అమ్మాయి అమెరికానుంచి వస్తే కారులో మేమందరం ఖమ్మం వెళ్లి చూసివస్తాం .మూర్తిగారింట్లో పనస చెట్టు బంపర్ క్రాప్ ఇస్తుంది ఇష్టంగా  ఆ దంపతులు  కోసి ఇస్తారు .

    మూర్తిగారు  జిల్లా కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రా ర్ గా గా పని చేసి రిటైరయ్యారు .ఒక్క దమ్మిడీ లంచం తీసుకోకుండా అత్యంత నిజాయితీగా నిబద్ధతతో పని చేసిన స్ట్రిక్ట్ డిసిప్లిండ్  ఆఫీసర్ .రాకీయాలకు తలొగ్గకుండా కమ్యూనిస్ట్ ల ,నక్సలైట్ ల ప్రాబల్య ప్రాబల్యం ఉన్న ఏరియాలలో కూడా పని చేసి భేష్ అనిపించుకొన్నారు .ఖమ్మం లోని సహకారనగర్ లో స్వంత ఇల్లు కట్టుకోవటానికి ముందు శివాలయం దగ్గర ఉండేవారు .వీళ్ళ ఇంటి ప్రక్కనే తెలంగాణా కవి శ్రీ దాశరధి గారి ఇల్లు ఉండేది. ఒక సారి మూర్తిగారింటికి వెళ్ళినప్పుడు వాకిట్లో కూర్చున్న దాశరధి గారిని చూశాను .వీరింటి ఎదురుగా కొడపై ఖిల్లా ఉండేది .ఇప్పుడు స్వంత ఇంటిదగ్గర చిన్న కొండపై శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఉంది .మా అబ్బాయిల పెళ్లిళ్లకు , అమ్మాయి పెళ్ళికి మూర్తిగారి దంపతులు వచ్చారు .తోడల్లుళ్ళ అందరి ఇళ్లలోని శుభకార్యాలకూ రావటం  వాళ్ల ఆశీర్వాదాలు పొందటం మాకు ఆనందం .శుభంగా భావిస్తాం .ఆ దంపతులకు పాద నమస్కారం చేయకుండా ఎప్పుడూ రాము .

  మూర్తిగారు’’ చైన్ స్మోకర్ ‘’.చేతిలో సిగరెట్ పెట్టె, వక్కపొడి పాకెట్ లేకుండా కనిపించేవారుకాదు .ఈయనకు తోడు మా ఆవిడ మేనమామ ,మాకజిన్ బ్రదర్ .మంకొల్లులో పోస్టాఫీస్   నిర్వహిస్తూ ,ఆయుర్వేద డాక్టర్ అయిన  చతుర్వేదుల పూర్ణానందం అన్నయ్య ‘’జిగినీ దోస్తీలు’’ .ఒకరికొకరు  బహిర్ ప్రాణం .ఇద్దరూ ‘’ఊదుడు గాళ్ళే’’అవటం తో స్నేహం ఎక్కువ .వాళ్ళిద్దరూ ఎన్నెన్నో రాజకీయాలు మాట్లాడుకొనేవాళ్ళు పోగపీలుస్తూ  వక్కపొడి నమలుతూ. ఆరోగ్యందేబ్బతిన్నాక సుమారు అయిదారేళ్ళనుంచీ సిగరెట్ ,వక్క పొడిలకు స్వస్తి పలికారు .

   మూర్తిగారిని మొదటిసారి  నా చిన్నప్పుడు జగ్గయ్యపేట లో ఆయన వివాహమైన కొత్తలోనో ఎప్పుడో రేడియో స్టోర్స్ లో పని చేస్తుండగా చూసిన గుర్తు .ఆయన తండ్రిగారు పరమభక్తులు .జగ్గయ్యపేటలో ఇంట్లో నిత్యం పూజలు పునస్కారాలు సంతర్పణలతో పెళ్లి ఇల్లులాగా ఉండేదని చెప్పుకొనేవారు .దాదాపు ఆస్తి అంతా ఇలా ఖర్చుయిందని అంటారు .అలా ఎందుకనుకోవాలి ?ఆయన పుణ్యఫలమే ఇప్పుడు వారి సంతతికి  రక్షగా ఉందని భావించవచ్చు .’’చేసిన ధర్మమూ చెడని పదార్ధము వచ్చును నీ వెంట ‘’అనే తత్వ గీతం ఉంది కదా.

  మూర్తి గారికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చాలామందే ఉన్నారు .అందరిమీదా ఆయనకు విపరీతమైన అభిమానం .వాళ్ళకూ ఆయనపై ఆరాధనా భావం .కుటుంబ పెద్దగా ఆయనకు విశేషమైన గౌరవం ఇస్తారు .మూర్తి గారి దంపతుల కుమార్తె మంజుల వివాహం ఖమ్మం లో మా పెద్దబ్బాయి శాస్త్రి, సమత లవివాహానికి ముందు జరిగింది .మా అబ్బాయిలందరూ మంజుల పెళ్ళికి మంచి సహకారం అందించారు .మా బావమరది ఆనంద్ కూడా .వాడంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ .వాడు పుట్టగానే తమకు ఒక బావమరది పుట్టాడని గొప్పగా చెప్పుకున్న విశాల హృదయం ఆయనది  .రామప్పగుడికి మా వాళ్ళను జీపులో తీసుకువెళ్ళి అక్కడ జరిగే పేరిణి శివ తాండవం చూపించారు .ఆయన కరీనగర్ లో పనిచేసినప్పుడు సిద్దిపేటలో ఉన్న మామేనల్లుడు అశోక్ ఇంటినుంచి బస్ లో వచ్చి మూర్తిగారింటికి వెళ్లి చూసి వచ్చాను .అప్పుడు వాళ్లకు బాయిలర్ ఉండేది .అదే దాన్ని నేను మొదటి సారి చూడటం .తర్వాతెప్పుడో నేను కొన్నాను .మూర్తి గారు నాతో చాలా గౌరవంగా మాట్లాడుతారు .పెద్దగా రాచకీయ చర్చ చేయరు .మూర్తిగారి కుమారుడు సూర్యనారాయణ మూర్తిని మేమందరం సూర్యం లేక సూరి అంటాం .వాడు స్టేట్ బాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగం లో చేరి మేనేజర్ గా రిటైరయి హైదరాబాద్ మియాపూర్ లో అపార్ట్ మెంట్ కొనుక్కున్నాడు .తండ్రిని ‘’నాన్నారూ నాన్నారూ’’అంటూ గౌరవంగా సంబోధిస్తాడు .తండ్రిని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాపాడారు సూర్యం, స్వర్ణ దంపతులు .వైద్యానికి ఎంతఖర్చైనా భరించారు .సేవలు చేశారు .తండ్రి ఋణం బాగానే తీర్చుకున్నాడు సూర్యం .కూతురు మంజుల కూడా తనవంతు సహకారం అందించింది .అల్లుడు సత్యనారాయణ గారు బహు యోగ్యుడు .అలాంటి అల్లుడు దొరకటం మూర్తిగారు చేసుకొన్నా అదృష్టం .ఆయన మంచితనానికి దక్కిన ప్రతిఫలం .

  అతి సాధారణ జీవితాన్నే గడిపారు మూర్తి గారు .ఆడంబరాలు ,హెచ్చులుకు పోలేదు  గొప్ప సంతృప్తి తోఉండేవారు. అల్ప సంతోషి  .ఆ దంపతుల వివాహం అయి 50 ఏళ్ళు అయిన సందర్భంగా ఏదైనా వేడుక ఘనంగా చేసుకోమని మా ఆవిడ వాళ్లకు ఎన్నో సార్లు చెప్పింది కానీ వాళ్ళు వద్దన్నారు . మేమిద్దరం కనీసం సత్యనారాయణ స్వామి వ్రతం అయినా చేసుకోమని గోల చేశాం .చివరకు ఒప్పుకొని ఖమ్మం లో వ్రతాన్ని బంధు మిత్రుల సమక్షం లో చేసుకొని విందు ఏర్పాటు చేశారు .ఉయ్యూరునుంచి మేమిద్దరం వెళ్లి నూతనవస్త్రాలు చదివించాం .వాళ్ళూ  అందరికీ బట్టలు పెట్టారు .మూర్తిగారి అల్లుడు సత్యనారాయణ  స్వగ్రామం ఖమ్మ౦  దగ్గరున్న మీనవోలు .ఖమ్మంలో సత్యనారాయణ అన్నలూ అక్కలు ఉన్నారు .కనుక బందుగణానికి కొదవలేదు .మూర్తిగారి సహోద్యోగులు ,మిత్రులు వీరింట్లో ఏ శుభకార్యమైనా హైదరాబాద్ కు వచ్చి వెళ్ళటం పరిపాటి. అంతటి సౌజన్యం సంపాదించారు మూర్తిగారు .

            శ్రీ శంభుని శ్రీరామ చంద్ర మూర్తి గారు అన్ని విధాలా సాక్షాత్తు ఆ శ్రీరామ చంద్రుని సద్గుణాలు మూర్తీభవించిన వారు . ఏప్రిల్ 13 మా చిన్నక్కయ్య శ్రీమతి దుర్గ హైదరాబాద్ లో మరణించింది .నాలుగు నెలలకు మళ్ళీ మూర్తిగారి మరణం .ఈ  రెండూ మాకు తీవ్ర మనస్తాప౦  కలిగించాయి .మా కుటుంబాలకు పెద్ద అయిన మూర్తి గారి  మరణానికి సంతాపం తెలియజేస్తూ ,వారి ఆత్మకు శాంతికలగాలని కోరుతూ ,ఆ కుటుంబానికి సాను భూతి అందజేస్తున్నాను .

    మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-8-18 –ఉయ్యూరు

image.png

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరసభారతి ,రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో వ్యావహారిక భాషోద్యమ సారధి శ్రీ గిడుగు రామమూర్తి గారి జయంతి (188 ) తెలుగు భాషా దినోత్సవం గా 29-8-18 బుధవారం సాయంత్రం రోటరీక్లబ్ ఆడిటోరియంలో

oogle.com/share/AF1QipMtLIYSln3Skv8LMgvWz_qJPBSygTAWgBd_p80bNN0XHI0gLLj5_o7tgnn_Wr4LKg?key=R1RhN3diN0gwWk9KTUZ1RHNfYjV6WlZuSUJyNS1B

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,129 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

ఆహ్వానం ,పర్య వేక్షణం , –శ్రీ పి వి. నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి,వాసవి క్లబ్ ప్రెసిడెంట్

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభం –శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి  గౌరవాధ్యక్షులు

 

ముఖ్య అతిధి –శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు –ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు ,మరియు  స్పెషల్ అసిస్టెంట్ కలెక్టర్ –పులిచింతల ప్రాజెక్ట్

విశిష్ట అతిధి – ”కవి రాజ మౌళి ,కవి సార్వ భౌమ ,మధురకవి ,అష్టావధాని ,కనకాభి షేకి ,70 గ్రంథాల  రచయిత ,విశ్రాంత తెలుగు పండితులు ,గుంటూరు జిల్లావాసి ,93 ఏళ్ళ శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారు

ఆత్మీయ అతిధులు –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు  ,శాసనమండలి సభ్యులు

శ్రీ అబ్దుల్ ఖుద్దూస్ – ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్

శ్రీ చలపాక ప్రకాష్ గారు –రమ్యభారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి

శ్రీ ద్రోణవల్లి రామమోహనరావు గారు –అమెరికాలోని హ౦ట్స్ విల్ తెలుగు సంఘాధ్యక్షులు ,ప్రముఖ సమాజ సేవకులు

శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు ,శ్రీ కోట సీతారామంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )

మొదలగు ప్రముఖులు

 

 

కార్యక్రమ వివరం

 

స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం  ,పుష్ప సమర్పణ

ఉపాధ్యాయ  దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు

1-విశిష్ట అతిధి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారికి

2-డా.శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి గారు –తెలుగు లెక్చరర్ ,ఏ. జి .అండ్ ఎస్. జి .సిద్ధార్ధ జూనియర్ కాలేజి

3-అమరవాణి పాఠశాల కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు

ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ  బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి  శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం

 

1–2018 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన 1- శాంతినికేతన్  పాఠశాల విద్యార్థి-చి.కరిమి పవన్ కుమార్ కు ,-5 వేలరూపాయలు

2- అమరవాణి పాఠశాల విద్యార్థినిలు  -కుమారి ఎం. డి.సఫూర మరియు కుమారి పి .తులసి లకుకలిపి – 5 వేల రూపాయలు .

ఉన్నత విద్య నభ్యసిస్తున్న పేద,ప్రతిభగల విద్యార్ధులకు  ఏర్పాటు చేసిన  ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం –

 

3- ఎ.జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కాలేజి –మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్ధినులలైన అక్కా చెల్లెళ్ళు -కుమారి చౌడాడ మౌనిక,కుమారి హేమలతలకు కలిపి  –రూ 5,వేల రూపాయలు .

-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు  శ్రీమతి సీతమ్మ దంపతుల  పేరిట    ఇంటర్ చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధికి  ఏర్పాటు చేసిన 10 ,11 6 రూపాయల స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార౦  –

4-2018 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 9.8 మార్కులతో  ఉత్తీర్ణత  సాధించి, స్థానిక .ఎ. జి. అండ్ ఎస్ .జి . సిద్ధార్ధ జూనియర్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న  -కుమారి గూడూరి చరిత కు

శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .

 

సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి

 

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

 

ఆహ్వాని౦చు వారు

ఉయ్యూరు -29-8-18                                            గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

పి .వి .నాగరాజు –ప్రిన్సిపాల్ ,అమరవాణి

 

అమరవాణి  వారిఆహ్వానం కింద జత చేశాను చూడండి -దుర్గాప్రసాద్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

image.png
   తెలుగు భాషా దినోత్సవం

 వ్యావహారిక భాషోద్యమ నాయకులు శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి 188 వ జయంతిని ”తెలుగు భాషాదినోత్సవం” గా సరసభారతి, స్థానిక రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో రోటరీ క్లబ్ ఆడిటోరియం లో ,29-8-18 బుధవారం సాయంత్రం 5 గం లకు నిర్వహిస్తున్నాము . ఈ సందర్భంగా తెలుగు భాషకు విశిష్ట సేవలందిస్తున్న 1-శ్రీ ఎం ఆర్ వి . సత్యనారాయణ మూర్తి (రమ్య సాహితీ వ్యవస్థాపకులు బహుగ్రంథకర్త -పెనుగొండ )2-శ్రీ సిలార్ మహమ్మద్ (సాహితీ మిత్రులు సంస్థ అధ్యక్షులు ,మచిలీ పట్నం చరిత్ర రచయిత-మచిలీ పట్నం )3-శ్రీ బండ్ల మాధవరావు (ప్రముఖ కవి -విజయవాడ ) 4-తెలుగు పండితులు -తాడంకి
 గార్లకు తెలుగు భాషోత్సవ పురస్కారం అందజేస్తున్నాము
    సాహిత్యాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
                                                                  గబ్బిట దుర్గా ప్రాసాద్ -సరసభారతి అధ్యక్షులు
                                                                     మరియు రోటరీక్లబ్ అధ్యక్షులు  

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

25-8-18 శనివారం సాయంత్రం ఉయ్యూరు ఎసి లైబ్రరీ లో సరసభారతి 12 9 వ కార్యక్రమంగా మాజీ ప్రధాని వాజ్ పాయ్ ,ప్రముఖ కధానికా రచయితా దావేదగిరి రాం బాబు ,జర్నలిస్ట్ పితామహుడు కులదీప్ నయ్యర్ మరియు కేరళ కర్నాటక వరదలలో అసువులు బాసినవారికి నివాళి

25-8-18 శనివారం సాయంత్రం ఉయ్యూరు ఎసి లైబ్రరీ లో సరసభారతి 12 9 వ కార్యక్రమంగా మాజీ ప్రధాని వాజ్ పాయ్ ,ప్రముఖ కధానికా రచయితా దావేదగిరి రాం బాబు ,జర్నలిస్ట్ పితామహుడు కులదీప్ నయ్యర్ మరియు కేరళ కర్నాటక వరదలలో అసువులు బాసినవారికి నివాళి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

Invitation

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

“24-8-18 శుక్రవారం మా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ”

https://photos.google.com/share/AF1QipOT4FWAWgHRbQ0jywZpfEcye0ed4NZ_3-IRK14T-vLt6zcafKjqa6g4C5moRuARCA?key=dTI2bllpUlA2cDBuZUU5TmZkXzVZeFlxVjBjOXJR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ ముత్తేవి సీతారాం గారికి సద్గురు శివానంద మూర్తి పురస్కారం

కృష్ణాష్టమి సందర్భం గా హైదరాబాద్  సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ 2-9-18 ఆదివారం ఉదయం -పెదముత్తేవి ముముక్షు  పీఠాధిపతులు శ్రీ శ్రీ ముత్తేవి సీతారాం గారికి సద్గురు శివానంద మూర్తి స్మారక పురస్కారం అందజేస్తున్నారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు 

 వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు 24-8-18 శుక్రవారం శ్రావణ  వరలక్ష్మి  వ్రత శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్

image.png
image.png

 

Posted in సమయం - సందర్భం | Leave a comment