ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -196 74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్ నవలా రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -196

74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్  నవలా  రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా

‘’విజయవంతమైన జీవితానికి తగిన లక్షణాలేవీ నాలో లేవు ‘’అని చెప్పుకోన్నవాడు జెక్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా ..రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ అపనమ్మకం ,ప్రపంచ వ్యాప్త అభుద్రత భావం లను గురించి ముందే ప్రజలను తన అవాంతర ఉపమాన నీతి కధలతో జాగృతం చేసిన జెకోస్లోవేకియాయువ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా 3-జులై 1883 న ప్రేగ్ లో జన్మించాడు .మొదటి నుండి వంటరివాడు .అణచబడిన అణగారినజాతివాడు ..ఆస్ట్రియన్ సామ్రాజ్యం లో జెక్ ప్రజలు మైనారిటీలు .అతను జ్యూఅవటం తో మైనారిటీలలో మరీ మైనారిటీ వాడయ్యాడు .పరిసరాలకు తగినట్లు ప్రవర్తించటం చేత కాకపోవటం మరీ వంటరి వాడిని చేసింది .తల్లి జ్యూయీ లోవీ చాలా సున్నిత మనస్కురాలు .ఆమె అసాధారణ వైపరీత్యం ఉన్న మహిళ.శతాబ్దాల తరబడి లూవీలు విద్యా వేత్తలు ,దార్శనికులు ..బాల్యం నుండి కాఫ్కా వారిలో ఒదిగిపోయాడు .తండ్రి హెర్మన్ కాఫ్కా బడా వ్యాపారి  ,హోల్ సేల్ బిజినెస్ లో పూటుగా సంపాదించాడు .అందుకనే ఫాన్సీ వస్తువులు ఇంట్లో బాగా వాడుకలో ఉండేవి .తండ్రి యెడల కొడుకు ప్రవర్తన బాధాకరంగా సందిగ్ధంగా ఉండేది .తండ్రి పర్సనాలిటి ,వ్యాపారం లో బుద్ధి సూక్ష్మత ,నిర్ణయ సామర్ధ్యాలను చూసి అసూయ పడేవాడు ఈ అర్భక కుర్రాడు .ఆయన శక్తిని ఆరాది౦చాడుకాని ఆయన క్రూరత్వాన్ని అసహ్యి౦చు కొన్నాడు .

   దీన్నించి ఇక ఎప్పుడూ తేరుకోలేక పోయాడు .36 వ ఏట తండ్రికి ‘’పుస్తకం అంత’’’’ఎ లెటర్ టు మై ఫాదర్ ‘’ఉత్తరం రాసి అందులో ఆరోపణలు ఫాంటసీలు ,స్వీయ రక్షణలు గుప్పించాడు .ఉత్తరం ఇలా ప్రారంభించాడు ‘’ప్రియమైన నాన్నా !ఒకప్పుడు నువ్వు నా గురించి ఎందుకు భయం అని అడిగావు .అప్పుడు ఏం జవాబు చెప్పాలో భయం తో నాకు తెలియలేదు .’’అని కొనసాగిస్తూ తన బలహీనతలను తండ్రి సామర్ధ్యాలను వరసపెట్టి చెప్పుకొచ్చాడు .తండ్రికున్న సాఫల్యత తనకున్న అభద్రతాభావం వైఫల్యం అన్నీ రాశాడు .’’మనిద్దరినీ బేరీజు వేస్తె నేను కొంచెంకాఫ్కా లలోని  లోయీ ని.అయితే జీవించటానికి  ,బిజినెస్ విజయవంతం చేయటానికి, డామినేట్ చేసి జయించటానికి  కావలసిన కాఫ్కా లక్షణాలు నాకు లేవు .నీ సంగతి చూస్తె కాఫ్కాలలోని బలం ,ఆరోగ్యం తిండి పుష్టి ,మాట్లాడే నేర్పు స్వీయామోదం ,ఆధునిక ఆడంబరం ,పట్టుదల ,ఏకాగ్రత ,ప్రజల గురించిన జ్ఞానం ,ఒకప్రత్యేక హుందా తనం నీ సొమ్ము .కుర్చీలో కూర్చుని ప్రపంచాన్ని ఏలే తెలివి తేటలు నీవి .నీ నిర్ణయం ఎప్పుడూ తప్పదు .మిగిలిన వన్నీ ఆడంబరం అసాధారణం .నీ ఆత్మ విశ్వాసం మహత్తరమైనది .నీది స్థిర బుద్ధి .జెక్ లకు వ్యతిరేకంగా నాటకంగా మాట్లాడగలవు .జర్మన్ల, జ్యూస్ ల  విషయం లోనూ ఇదే ధోరణి నీది . ఇవన్నీ ఏదో కారణం ఉండికాదు కారణం లేకుండానే .నిన్ను ఎవరూ దేనిలోనూ ఓడించలేరు .ఎప్పుడూ నువ్వే విజేతవు .ఇలాంటి రహస్యమైన గుణం నీది .నియంతల౦దరిది ఇదే ధోరణి .వాళ్ళు లాజిక్ తోకాక మేజిక్ తో ,తెలివి తేటలతోకాక పరనాలిటీ తో అవతలి వారిని దెబ్బ తీస్తారు .’’అనిరాశాడు ఈ ఉత్తరం ఒక రకం గా కాఫ్కా జీవిత చరిత్ర యే.చిన్నప్పుడు కాఫ్కా పిరికి తనాన్ని ,మనిషిగా అపనమ్మకాన్ని వ్యక్తపరిచింది .తండ్రి మహోన్నత వ్యక్తిత్వం అడుగడుగునా కాఫ్కా అసమర్ధతను  ,వ్యక్తం చేసింది .’’you made me lose all possible self confidence and exchange a boundless sense of guilt for it ‘’అని ఆవేదన చెందాడు కాఫ్కా 

.Inline image 1

సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్- 7-7-16 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -195

 

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19573-ఆంగ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డింగ్టన్3(చివరి భాగం )

ఎడ్డింగ్ టన్ఉపన్యాసాలు ఇవ్వటానికీ సిద్ధమయ్యాడు .నెమ్మదిగా మొదలు పెట్టి గంభీరంగా మాట్లాడేవాడు .దృఢమైన నోరు ,లోతైన కళ్ళు ,వాటిని సగం మూసి ఉంచే కనురెప్ప వెంట్రుకలు చూస్తీ ఈ వ్యక్తీ ప్రపంచం అంతా, ఆలోచనలతో మునిగి ఉన్నట్లు అనిపిస్తుంది .వక్తగా చూస్తే  దీనికి పారడాక్స్ గా ఉంటుంది  .వ్యక్తీకరణ చాలా డల్ గా  ఉన్నా విషయ వివరణం సూటిగా స్పష్టంగా ఉండేది .విని ప్రేరణకు లోనవ్వాల్సిందే .రాత ,కూత తర్వాత కాలాన్ని గోల్ఫ్ ,పజిల్స్ ,డిటెక్టివ్ కధలలో గడిపాడు .కనుక పెళ్లి ఆలోచనే లేదు .ఐన్ స్టీన్ వర్క్ లోని  జామెట్రీకల్ రీజనింగ్ పై ఆలోచన పెట్టాడు .దీనిలో చాలాక్లిస్టమైన ‘’కాల్క్యులస్ ‘’గణితం ఉంది .’’రిలేటివిటి దీరీ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ‘’లో తన సూత్రాన్ని వివరించాడు .ఫిజిక్స్ లోని నంబర్లు ‘’కాన్ స్టంట్స్ఆఫ్ నేచర్ ‘’ను పూర్తిగా ప్రేరక తార్కికత(ఇండ్యూసివ్ లాజిక్ ) తో గుర్తించి పరిష్కరించ వచ్చుఅన్నాడు  .విశ్వ సత్యాలను కాంతి వేగాన్ని కాని అణువు బరువు ను బట్టికాకుండా కూడా సాధించవచ్చు .మొదట్లో ఏదో ఒక దాన్నిఅతి సరళంగా మూలంగా ఉన్న దాన్ని  ఊహించి తరువాత ముందుకు వెళ్ళవచ్చు .అని చెప్పాడు .

  ఉదాహరణకు మనం మూడు పరిమాణాలప్రపంచం లో లో ఉన్నామని అనుకొంటే కాలం ఉందనిభావిస్తే,విద్యుత్ కు ధన రుణ తటస్థ స్వభావాలు ఉన్నాయనుకొంటే వీటి ఆధారం గా గణిత  చట్రనిర్మాణాన్ని  తయారు చేయవచ్చు .ఇది చాలా సంక్లిష్టమైనది కాని కొలువదగినంత ఫలితాలనిచ్చే దానిగా చేయచ్చు .ఎలక్ట్రాన్ కంటే ప్రోటాన్ 18 40 రెట్లు బరువైనదని ఈయన  సిద్ధాంతం రుజువు చేసింది .అటామిక్ ఫిజిక్స్ లోఆయన ఊహా గణిత భావనలు ప్రయోగ ఫలితాకు అతి దగ్గరగా ఉండటం గొప్ప విశేషం .ప్రోటాన్ కు ఎలెక్ట్రాన్ కు మధ్య ఒక ఊహాత్మక అటామిక్ పార్టికల్ ఉంటుందని చెప్పాడు .తరువాత పరిశోధనలో అదే’’ మీసాన్ ‘’ అని కనిపెట్టారు .ఆయన ఊహించిన అన్ని లక్షణాలు బరువు చార్జి లతో సహా దానికి ఉన్నాయి .

విశ్వం లో 204 x2to the power of 256 కణాలు ఉంటాయని చెప్పాడు .ఈ సంఖ్య  16 తర్వాత 78సున్నాల సంఖ్య కు సమానం .కాని వ్యోమగాముల గణనాల ప్రకారం విశ్వం ద్రవ్యరాశి అన్ని కణాలు కలిగి ఉండే వీలు లేదు .లెక్కల్లో ఏదో కొద్ది తేడా తప్ప ఆయన ఊహ దాదాపు యదార్ధమే .సైంటిస్ట్ లు ఆయనను మేధావి అనాలో లేక సంఖ్యల మర్మజ్ఞుడనాలో అర్ధకాక జుట్టు పీక్కున్నారు .భౌతిక స్థిరత్వాల సంఖ్యా సంబంధ యాదృచ్చికాలు ఎడ్డింగ్ టన్ ఫలితాలతో సరిపోతున్నాయని విమర్శకులు తేల్చి చెప్పారు .1944లో కేన్సర్ సోకి రెండేళ్ళు బాగా పోరాడుతూ నూతన జామెట్రీకల్ సూత్రాలను వివరిస్తూ విశ్లేషిస్తూ గడిపాడు .22-12-19 44న 62ఏళ్ళ వయసులోకేంబ్రిడ్జ్ నర్సింగ్ హోం లో  చనిపోయాడు .

ఇంకా శోదిన్చాల్సినవెన్నో మిగిలే పోయాయి .యువ శాస్స్త్ర, గణిత వేత్తలు వీటిని సాధించాలి .కాని ఎడ్డింగ్ టన్ కృషి చెల్లుబాటు అవుతుందో కాదో తేల్చాల్సిన పనేమీ లేదు .ఆయన విధానాలలోనిర్ణయాలలో తప్పులు ఉండవచ్చు కాని లాజిక్ నుండి ఫలితాలు సాధించవచ్చునని ఆయన రుజువు చేసింది పూర్తీ యదార్ధం .జామెట్రికల్ రీజనింగ్ పరిధి బాగా విస్తరించి,మిశ్రమ లోహాల ,నెబ్యులాలపై మరింత విజ్ఞానం లభించింది .ఆయన కృషి పరిధి పెరిగింది .సైన్స్ పరికరాల కంటే మనిషి తార్కిక శక్తి ఎక్కువ ఫలితాలనిస్తుందని ఎడ్డింగ్ టన్ నిరూపించాడు .కాస్మలాజికల్ కాన్ స్టంట్ విశ్వ ఆవిర్భావానికి ముఖ్య దోహదకారి అయి ఉండచ్చు అని నిర్ణయించి, కస్మలాజికల్ పరిశోధనలను ఆ  కాన్ స్టంట్ పాత్ర ,దాని లక్షణాల పరిశీలనపై  కేంద్రీకరించాడు .వీటిని ‘’మాదేమేటికల్ దీరీ ఆఫ్ రిలేటివిటి ‘’గ్రంధం లో పొందుపరచాడు .ఈ కాన్ స్టంట్ అంటే విశ్వ స్వీయ కొలమానం ..

  ఫండమెంటల్ ఫిజిక్స్ కు E numbers అనే ఆల్జీబ్రా ఆధారితమైనది ఉందని తెలుసుకోన్నట్లు చెప్పాడు .దీనినే క్లిఫోర్డ్ ఆల్జీబ్రా అన్నారు .స్పేస్ టైం ను హయ్యర్ డైమెన్షనల్ ఆకృతికి దారి తీసింది .క్వాంటం దీరీ ,రిలేటివిటి ,కాస్మాలజి ,గ్రావిటేషన్ లను కలిపి విశ్వానికి ఒక ఏక సూత్రత సాధించే ప్రయత్నం లో చివరి రోజులు గడిపాడు .

సైక్లిస్ట్ లు ఎక్కువ దూరం తొక్కే సామర్ధ్యానికి చెందిన’’ఎడ్డింగ్ టన్  నంబర్ ‘’ను కనిపెట్టాడు .ఎడ్డింగ్టన్ నంబర్ 60 అంటే ఒక సైక్లిస్ట్ సైకిల్నురోజుకు 60 మైళ్ళు  60  సార్లలో   తోక్కాడని అర్ధం .62మైళ్ళు 100 కిలోమీటర్ లకు సమానం .కానీ తర్వాత లెక్కల ప్రకారం నంబర్ 62అంటే వందకిలోమీటర్లు 6 2రోజుల్లో తోక్కాడనే అర్హం కాని వందకిలోమీటర్లు వంద రోజుల్లో తోక్కాడని కాదు .1919 సూర్య గ్రహణం నాడు ఉమర్ ఖయ్యాం కవితకు పేరడీగా ఎడ్డింగ్ టన్ Oh leave the Wise our measures to collate
One thing at least is certain, LIGHT has WEIGHT,
One thing is certain, and the rest debate —
Light-rays, when near the Sun, DO NOT GO STRAIGHT.కవిత రాశాడు .

చంద్ర మండలం లో ఒక గుంటకు ,ఆస్టెరాయిడ్ 2761 కి ,ఆయన పేరు పెట్టారు .స్మిత్ ప్రైజ్, బ్రూస్ మెడల్,గోల్డ్ మెడల్ ,రాయల్ మెడల్,కింగ్ హుడ్ ,ఆర్డర్ ఆఫ్ మెరిట్ వంటివివి ఎన్నో పురస్కారాలు అందుకొన్నాడు .దాదాపు 15 పుస్తకాలు రాశాడు .

 

మన భారతీయ ఆస్ట్రో ఫిజిస్ట్ సుబ్రహ్మణ్యం చంద్ర శేఖర్ లండన్ కేంబ్రిడ్జ్ లో చదువుతున్నప్పుడు ఎడ్డింగ్ టన్ ప్రొఫెసర్ .చంద్ర శేఖర్ ఫలితాలు బ్లాక్ హోల్స్ ఉన్నాయని తెలియ జేశాయి .ఆయన చంద్ర శేఖర్ లిమిట్ చాలా ప్రాచుర్యం పొందింది .అది భౌతికంగా అసంబద్ధమ౦ (అబ్సర్డ్ )అని కొట్టిపారేసి దాన్ని తిరస్కరించాడు తోక్కిపట్టేశాడు .పూర్తిగణితాదారిత నిర్ణయాలు యదార్ధ ప్రపంచానికి దుష్పరిణామాలు తెస్తాయన్నాడు .లేకపోతే అప్పుడే  చంద్ర శేఖర్ కు నోబెల్ బహుమతి వచ్చి ఉండేది .తరువాత ఎడ్డింగ్ టన్ భావన తప్పు అని తేలింది .ప్రతిభకు పట్టిన గ్రహణం వీడింది .తరువాత ఎప్పుడో యాభై  ఏళ్ళ తర్వాత ఆయనకు నోబెల్ పురస్కారం లభించింది .ఎడ్డింగ్ టన్ అసూయా ద్రుష్టి,నిరంకుశత్వం ,పిడి వాదం, జాతి వివక్షత  ఇంతపని చేసిందనిచరిత్రకారులు నిర్ధారించారు చంద్ర శేఖర్ కూడా చాలా వ్యధకు గురయ్యాడు  .దీనినే నేను ‘’యాభై ఏళ్ళ ప్రతిభా ‘’చంద్ర’’ గ్రహణం ‘’పేరుతొ ఒక వ్యాసాన్ని సుమారు ఏడెనిమిదేళ్ళ క్రితం రాస్తే ‘’చినుకు ‘’మాస పత్రిక లో అచ్చయింది .

  Inline image 1  Inline image 2

                                                                                             s  . చంద్ర శేఖర్  

సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-16- ఉయ్యూరు

   

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -194

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -194

73-ఆంగ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డింగ్టన్-2

  పూర్వపు సైంటిస్ట్ లు నక్షత్ర౦ లోని పరిస్థితులను అతి సామాన్యంగా చెప్పారు .కాని ఎడ్డింగ్ టన్ ధేర్మో డైనమిక్స్ ను ,అటామిక్ ఫిజిక్స్ తో మిక్స్  చేసి సేఫీడ్ వేరియబుల్స్ అంటే కొన్ని నక్షత్రాలు క్రమప్రకారం వాటిలోని కాంతి తగ్గి మళ్ళీపెరగటం ,మళ్ళీ పెరుగదలనుంచి కాంతి క్రమంగా తగ్గిపోవటం వంటి ప్రత్యేక సమస్యలను అధ్యయనం చేసి చెప్పాడు .కొన్ని నక్షత్రాలలో గరిష్ట కాంతి కి చేరటానికి కొన్ని గంటలే పడితే ,మిగిలినవాటిలో చాలా ఎక్కువ కాలంఅంటే సంవత్సరకాలం  పడుతుందని చెప్పాడు .కాంతి లో వచ్చే ఈ మార్పులు నక్షత్ర ఉష్ణోగ్రత లో మార్పులు తెచ్చి ,ఒకదాని తర్వాత ఒకటి తగలబడి చివరికి నక్షత్రం మొత్తం కుంచి౦చుకు పోతుంది .ఎక్కువ కాంతి కల నక్షత్రాలు ఈ మార్పుకు నెమ్మదిగా గురౌతాయి .వాటిలోని పరిస్థితులను కూలంకషంగా అధ్యయనం చేసి నక్షత్రాల బరువుకు ,వాటి పల్సేషన్ ఫ్రీక్వెంసి  కు ఉన్న సంబంధాన్ని సూత్రప్రాయంగా వివరించాడు .వాటి సుమారు బరువు ,కాంతి లను పరిశీలనద్వారా తెలుసుకొన్నాడు .తర్వాత సూత్రాన్ని చాలా ఖచ్చితం చేసి చెప్పాడు .సేఫీడ్స్ పీరియడ్ నుంచి దాని ద్రవ్య రాశి కనుక్కోవచ్చు ,దానిద్వారా దాని అసలు కాంతి ఎంతో తెలుసుకోవచ్చు .ఈ సేఫీడ్స్ ను లైట్ హౌస్ లు గా భావిస్తే  వాటి ఫ్లాషింగ్ సిగ్నల్ ద్వారా వాటి కాండిల్ పవర్ తెలుసుకోన్నట్లే వాటి కనిపించే కాంతి ,దూరాలను లెక్కించవచ్చు .

 చాలా సందర్భాలలో నెబ్యూలాలు మన మొత్తం గెలాక్సీ లోని నక్షత్రాలకంటే ,మిల్కీ వేకు చాలా దూరం లో ఉంటాయి .అంటే మన సూర్యుడు ఒక పెద్ద టౌన్ కు శివారు లో నక్షత్రాలు మన చుట్టూ కాంతి నిచ్చేటట్లు కనిపిచ టమన్నమాట . మన గెలాక్సీ కి బయట ఉన్న నెబ్యూలాలు దూరపు సిటీ లోని తక్కువ కాంతిగా(ఫైంట్ ) కనిపించే లైట్లు అన్నమాట .వీటి దూరాలను వీటి’’ డిగ్రీ ఆఫ్ ఫైంట్ నెస్ ‘’ ను బట్టి కాంతి సంవత్సరాల ద్వారా  తెలుసుకోవచ్చు ..అతని సేఫీడ్ వేరియబుల్స్  అంత రిక్ష యాత్రికులకు విలువైన ఏక రీతి కొలమానాన్ని అంద జేసింది .సాధారణ నక్షత్ర గర్బవిషయ౦  అంత అద్భుతమైనదేమీ కాకపోయినా అది రేడియేషన్ ప్రేసర్ కు వినియోగించి మొదటి సారిగా స్టెల్లార్ అంతర్భాగాలను తెలుసుకోవటానికి సహకరించింది .ఈ రేడియేషన్ పీడనం  నిజంగా అది బాగా ప్రకాశ వంతంగా ఉన్నప్పుడున్న  ఒక శక్తి లేక  కాంతి  తోపుడే నక్షత్ర  నిర్మాణాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశం .’’ఆన్ ది రేడియేటివ్ ఈక్విలిబ్రియం ఆఫ్ స్టార్స్ ‘’లో రాసి వివరించాడు .దీనిలో   అతని కీలక భావనలు అన్ని రకాల నక్షత్రాల ద్రవ్య రాశి, ప్రకాశాలకున్న సంబంధాన్ని ,వాటికి ఉష్ణం, కాంతి లను ఎర్పరచటానికి    జరిగే వివిధ పరమాణు చర్యలను తెలుసుకొన్నాడు .

   రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ కి 19 12 నుంచి 17వరకు సెక్రెటరిగా ఉన్నాడు .డచ్ గణిత వేత్త విల్లెం డీ సిట్టర్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు .ఈయనకు  రిలేటివిటిపై ఉన్న అభిరుచి గమనించి ఐన్ స్టీన్ రాసిన జెనరల్ దీరీ పుస్తకాన్ని కొన్ని వివరణ పత్రాలను  పంపాడు . అది యుద్ధ సమయ౦ కనుక ఈ విషయం ఇంగ్లాండ్ లోనే ఉండి పోయింది .జామె ట్రికల్ ,న్యూమేరికల్ రీజనింగ్ కు  అది బాగా ఉపయోగ పడుతుందని గ్రహించాడు .సంఖ్యల మూల లక్షణాలు ,అంత రిక్ష శోధనలో మునిగాడు .తన పనిలో తానూ మునిగిఉన్నా జనరల్ దీరీ ఆఫ్ రిలేటివిటిని సహచరులకు ప్రజలకు  వివరించి చెబుతున్నాడు .1918 లో 91పేజీల ‘’రిపోర్ట్ ఆన్ రిలేటివిటి ‘’అనే బృహత్తర వ్యాసం రాశాడు. మరుసటి ఏడాది సూర్యుని శక్తి వంతమైన గురుత్వాకర్షణ క్షేత్రం లో కాంతి పుంజం  వంగిపోవటం పై ఐన్ స్టీన్ చెప్పిన జోస్యాన్ని అధ్యయనం చేసే అన్వేషణ యాత్రలో పాల్గొన్నాడు .1920 లో ‘’స్పేస్ ,టైం ,గ్రావిటేషన్’’పుస్తకం ప్రచురించాడు .ఇందులో ఐన్ స్టీన్ సిద్ధాంతాలను తన విభజనలతో వివరించాడు ఇది సైంటిఫిక్ అన్వేషణలో విధానాలను ఫలితాలను బాగా వివరించింది .దీనితర్వాత ‘’స్టార్స్ అండ్ ఆటమ్స్ ‘’,’’ది నేచర్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్ ‘’,ది  ఎక్స్పా౦ డింగ్ యూనివేర్స్ ,’’న్యు పాత్ వేస్ ఇన్ సైన్స్ ,’’ది ఫిలాసఫీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ‘’గ్రంధాలు రాశాడు .తన భావజాలాన్ని సాన్ద్రతరం చేసి విస్పష్టం చేశాడు ,సైన్స్ కున్న ఊహాజనిత లక్షణాన్ని మెచ్చుకొన్నాడు .

   జటిలమైన గణితాన్ని సమగ్ర౦ గా మార్చే ప్రయత్నం చేశాడు .గ్రావిటేషన్ ను సొట్ట గా పోల్చాడు .అదే స్పేస్ టైం లమెత్తని వస్త్రం అన్నాడు .వస్తువులు గ్రావిటి వలన ఆకర్షింప బడుతాయి .దీన్ని ఎలా పోల్చవచ్చు అంటే –మంచు తో ఉన్న చెరువు పై దొర్లే  రాయి ఐస్ లోని డిప్రెషన్ (అణచటం ) కు ఆకర్షింప బడి నట్లు ఉంటుంది .విశ్వం అంతా వక్రంగా నాలుగవ పరిమాణం లో దానింతటికి అదే మూసుకు పోయినట్లు ఉంటుందే తప్ప అనంతం కాదు అని తన రిలేటివిటి సిద్ధాంతం తో చెప్పాడు ..ఆస్ట్రో ఫిజికల్ గణనాలు ఒక అంత రిక్ష నౌక కనబడే  ఒక సరళ రేఖ పై చాలా దూరం ప్రయాణం చేస్తే ,అది వ్యతిరేక దిశ  నుండి తిరిగి వస్తుంది అని తెలియ జేస్తున్నాయని చెప్పాడు  .ఆయన ఖగోళ విషయాలలో మరో ముఖ్యమైంది –నెబ్యూలాలు మనకు దూరంగా కదిలి పోతున్నాయి అని .’’the  fundamental view point was not the apparent recession of nebulae ,but the expansion of the whole four –dimensional curved universe ‘’ఈ వ్యాప్తి నిరంతర ఎంట్రోపి అభి వృద్ధి తో  సంబంధం  కలిగి ఉంటుంది .విశ్వం లోని శక్తి అనేక రకాలుగా వాడుకోబడి లేక నశింపు పొందుతుంది కాని మళ్ళీ సృష్టింప బడదు అని తెలిపాడు .

Inline image 1Inline image 2

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-16 –ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -193

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -193

73-ఆంగ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డింగ్టన్

‘’మనిషి తర్కం అతని గొప్ప ఆయుధం ‘’అంటాడు బ్రిటిష్ ఖగోళ ,గణిత శాస్త్ర వేత్త ఆర్ధర్ ఎడ్డింగ్ట న్ .సంఖ్యలతో ప్రారంభమై సంఖ్యలతో అంతమయే తీరులో మధ్యలో ప్రభావిత సైంటిఫిక్ పాండిత్యం అని ఆర్ధర్ స్టాన్లీ ఎడ్డింగ్ట న్ ను విశ్లేషించ వచ్చు .చివర్లో నంబర్ల విషయం లో మేధస్సు తగ్గుతుందో , ,లేక భవిష్యత్తులో మేధస్సు  గుర్తింపు తెస్తుందో చెప్పలేని స్థితి .ఏది ఏమైనా ఎడ్డింగ్ టన్ సూత్రంలోని కీలక భావన శాస్త్రీయ ఆలోచనలో కొత్త విధానానికి నాంది పలికింది . ఎడ్డింగ్ టన్ 28 12- 18 82న స్కాట్లాండ్ సరిహద్దుకు యాభై మైళ్ళ దూరం లోని కేండాల్లో జన్మించాడు ..రెండవ ఏటనే తండ్రి ఆ ఊళ్ళో ఒక స్కూల్ నడుపుతూ చనిపోయాడు .తల్లి అతన్ని సోమర్సెట్ కు తీసుకువెళ్ళి క్వేకర్ విధానం సరైన విద్య నేర్పి లో పెంచాలనుకోన్నది .సౌకర్యాలు ,నంబర్ల మీద ధ్యాసచిన్నప్పటి నుంచి ఉన్నాయి .24 వ ఎక్కం వరకు క్షుణ్ణం గా వచ్చేసింది .ఆరవ ఏట పెద్ద పెద్ద సంఖ్యలతో ఆడుకోవటం ఖగోళ శాస్త్రం వైపుకు ఆకర్షించింది .గణిత విషయాలన్నీ  అప్పటికే హస్తగతమయ్యాయి .పదవ ఏట మూడు అంగుళాల టెలిస్కోప్ తో ఆకాశాన్ని అధ్యయనం చేశాడు .

గొప్ప విద్య అడ్వొకేట్ అయిన  తల్లి కొడుకును ప్రత్యేకత కల బ్రిమిలిన్ బోర్డింగ్ స్కూల్ లో చేర్చింది .బోర్డింగ్ స్కూల్ లో చదివి౦ చేంత ఆర్ధిక స్తోమత లేదు .కాని ఈ స్కూల్ మాత్రమె మిగిలిన వాటి కంటే మంచి విద్య ఇస్తుందని నమ్మింది .కుర్రాడి ప్రత్త్యేక అభిరుచులను టీచర్లు బాగా ప్రోత్సహించారు .13 వయసులో కేంబ్రిడ్జ్ జూనియర్ లోకల్ పరీక్షలలో మంచి మార్కులు సాధించి ప్రశంసలు పొంది ,సోమర్సెట్ కౌంటి స్కాలర్షిప్180 పౌండ్లు పొందాడు .ఇది మాంచేస్టర్లో ఓవెన్స్ కాలేజి లో   చేరటానికి వీలు కలిగించింది 1902లో కేంబ్రిడ్జ్ ట్రినిటి కాలేజ్ లో చేరి ట్రిపోస్ గణిత పరీక్షలో పాల్గొని మొదటి గౌరవం –సీనియర్ రాంగ్లెర్ సాధించాడు .దీన్ని మిగిలిన పోటీ దారులకంటే ఒక్క ఏడాదిలోనే సాధించటం అతని ప్రతిభా విశేషం .లెక్కలలో అపార పాండిత్యం ,ఆస్ట్రానమి మీద అభిరుచి అతన్ని గ్రీన్విచ్ అబ్సర్వేటరి  చీఫ్ అసిస్టంట్ అవటానికి దోహదం చేసింది .అక్కడ సమగ్ర నక్షత్ర గమనాలపై అధ్యయనం చేశాడు .ఒక ఏడాది తరువాత 19 07లో ‘’స్టెల్లార్ మోషన్స్ ‘’పైన రాసిన వ్యాసంఅనేక నక్షత్ర సమూహాలతో ఏర్పడిన  మన గెలాక్సీగమనాన్ని ,ఆకారాన్ని గురించి తెలిపింది .తన పరిశోధనల కేటలాగ్ ను 1910లో ప్రచురించాడు .దీనికి ‘’సిస్టెమాటిక్ మోషన్ ఆఫ్ స్టార్స్ ‘’అని పేరుపెట్టాడు .ఇందులో 6 ,188  నక్షత్రాల సైజు, స్థితి, గమనాలను విశ్లేషించి తెలియ జేశాడు .

31 వ ఏట  ఆస్ట్రానమి లో  ప్లూమియన్ ప్రొఫెసర్   అయ్యాడు .ఏడాది తర్వాత ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం పొంది కేంబ్రిడ్జ్ అబ్సర్వటరి డైరెక్టర్ అయ్యాడు .ఈ కాలం లో 12 ఏళ్ళు అక్షాంశాల తేడాలు ఖచ్చితమైన భూ గమనం తెలుసుకోవటానికి ఎలా ఉపయోగ పడతాయో ,కనిపెట్టాడు .నక్షత్ర గమనాలు ,నక్షత్ర అంతర్భాగ నిర్మాణ విశేషాలను అందరూ వదిలేసిన ఐన్ స్టీన్ సిద్ధాంతం ఆధారంగా వివరించాడు .

Inline image 1Inline image 2

      సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-16 –ఉయ్యూరు  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”మా అన్నయ్య ”ఆత్మీయ కవితా సంకలనం ఆవిష్కరణ సభ

సాహితీ బంధువులకు శుభకామనలు -సరససభారతి 94 వ సమావేశంగా ,సరసభారతి రమ్య భారతి మల్లెతీగ సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో న ”మా అన్నయ్య ”పై నిర్వహించిన ఆత్మీయ కవిసమ్మేళనం కవితా సంకలనాన్ని 17-7-16 ఆదివారం ఉదయం 10 గం  లకు విజయవాడ చండ్ర  రాజేశ్వర రావు లైబ్రరీ(బందరు రోడ్డులోని పశువుల ఆస్పత్రి కి ఎదురు రోడ్డు లో ) ప్రముఖ కథానికా రచయిత ,న్యాయవాది,విశ్లేషకులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు ఆవిష్కరిస్తారు . సరసభారతి కార్య వర్గ సభ్యురాలు శ్రీమతి సీతం రాజు మల్లికగారు ఈ పుస్తకానికి స్పాన్సర్ అని మీకు తెలిసిన విషయమే .పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం త్వరలోనే అంద  జేస్తాము  .సాహితీ మిత్రులు అందరూ పాల్గొని జయప్రదం చేయ వలసినదిగా కోరుతున్నాం –

గబ్బిట దుర్గాప్రసాద్ -సరస భారతి  అధ్యక్షులు  ,చలపాక ప్రకాష్ -రమ్య భారతి అధ్యక్షులు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -192

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -192

72-20 వ శతాబ్ది ప్రముఖ ప్రభావ రష్యన్ స్వర కర్త –ఇగార్ స్ట్రావిన్స్కి-2 (చివరి భాగం )

సాధారణ సంగీత సూత్రాలకు విరుద్ధంగా పెట్రౌచాకా ,షాకెర్ లను చేశాడు .ఆకస్మిక అంతర్వేశనం(ఇంటర్ పోలేషన్ ) ,దారుణ దాట్లు,సంబంధం లేని ఫ్రేజులుతో  ఒక తరాన్ని అంతటిని ప్రభావితం చేశాడు .సంగీత కర్తలు కొత్తగా చెప్పాలన్న ఆలోచనలకు వచ్చారు .వీటితోపరిచయం లేని వారు నేర్చుకొని చేయాల్సి వచ్చింది .స్ట్రా విన్స్కి ఎక్కడా రాజీ పడలేదు .వినేవారికి చేసేవారికి అసూయ కలిగించలేదు  .తన నెర్వస్ ఎనర్జికి సమాధానం చెప్పాడు .శబ్ద జంఝకు,వైరుధ్యానికి  విముక్తి కల్గించి దూసుకు పోయాడు .1914లో స్వల్పకాలం రష్యాలో గడిపాడు .ఇదే చివరి దర్శనం .తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళాడు .దీనివలన రష్యా నేపధ్యం తో ఏవేవో చేయాలనే ఊహ కలిగింది .వెంటనే రష్యన్ జానపద గీతాలతో ‘’ప్రిబౌతి ‘’,ను ఒకే గాత్రం తో ఎనిమిది వాయిద్యాలతో ను ,’’బెర్స్యూఎస్ డి చాట్ ‘’ను మూడు క్లారినెట్ లతో ,’’రేనార్డ్ ‘’ను రష్యన్ ఫోక్ మేలదీస్ తో ఒపెరాను చేశాడు .రష్యా విప్లవ సమయం లో రోమ్ లో ఉండి పోయాడు .అక్కడే ‘’వోల్గా బోట్ మన్స్ సాంగ్స్ ‘’పేరఒక ఆర్కెస్ట్రా కు రాశాడు .దీని డయాఘిలేవ్ నిర్మాణం లో చేశాడు .

మరో రష్యన్ ఆధార ‘’లేస్ నోసెస్ ‘’అనే పెళ్లి సందడి ని రష్యా సంప్రదాయ జానపద బాణీలతో నేపధ్యం తో శతాబ్దాలక్రితం రష్యా పల్లెటూర్లలో  జరిగే  పెళ్లి వేడుకలలోని అన్ని విషయాలకు పునః ప్రాణ ప్రతిష్ట చేశాడు .’’ఆ ఆచారాలు కట్టుబాట్లు నాకోసమే ఉన్నాయా అన్నట్లు స్వేచ్చగా వాడుకొన్నాను సంగీతం లో ఆడుకొన్నాను ‘’అన్నాడు .అదొక బృహత్తర ,నమ్మశక్యం కాని17 విభిన్న వాయిద్యాల సమ్మేళనం .దీన్ని గురించి వివరిస్తూ ‘’there were no strings or wood winds  no harmonic pleasantries  or instrumental sonorities ,choruses  piled on top of choruses –dwarfed the soloists –the constant use  of voices ,chanting in authentic folk accents even shouting and at times screaming ,is a guarantee against any intrusion not nakedly indigenous ‘’అని అర్ధర్ బెర్జేర్ ‘’మ్యూజిక్ ఫర్ ది బాలెట్ ‘’లో రాశాడు .ఎల్ హిస్ట్ రే డు సోల్దాట్’’ ను స్విస్ లో ఉండగానే చేశాడు .దెయ్యం వలలో చిక్కిన ఒక రష్యన్ సైనికుడి కద.యుద్ధ సమయం కనుక చాలా పొదుపుగా చేశాడు .స్టేజి పైఒక ప్రక్క  వివరించే వాడు ,రెండవ వైపు 7 వాయిద్యాలు మాత్రమే ఉంచాడు .ఈ రెండిటినడుమ నాటకం నడుస్తుంది .చిన్న చిన్న ఎపిసోడ్ లతో ఒకదానికొకటి ఉన్న సంబంధం తో నడిచే దీన్ని ఆయన ‘’రాగ్ టైం ‘’అన్నాడు .అప్పటికే 1916కె అమెరికాలోని నూతన సంగీతం ఆయన చెవిన పడింది .తనతో ఎంతో జాజ్ సంగీతాన్ని తెచ్చుకొన్నాడు 11-11-1918 ‘’ఆర్మిస్టిస్ ‘’రోజున ఒక నివాళిగా భవిష్యత్తులో తన దేశం కాబోతున్న అమెరికాకు కానుకగా ఇచ్చాడు.దీన్నీ ‘’రాగ్ టైం ‘’అనే అన్నాడు .11 వాయిద్యాలతో అద్భుత శబ్ద సృష్టి చేశాడు .తనను తానే అధిగమించాడు .

  ప్రేక్షకులకు స్ట్రా విన్స్కి ‘’ఆబ్స్ట్రాక్ట్ మ్యూజిక్ ‘’ను కోరుకొంటున్నారు .టోన్ పోయెమ్స్  ,ప్రోగ్రాం మ్యూజిక్ లపై వీటిని రాశాడు .ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం ఆయనకు దియేటర్ పరిధి దాటిన విస్తృత స్వర సమ్మేళనాలు ఉండాలని కోరుకొన్నారు .అవే ఆయన సంగీత విలువలను ,ఆచరణీయఅంశాలను గా మారుస్తాయి .35వయసులొ స్విస్ ను వదిలి ఫ్రాన్స్ చేరి 16ఏళ్ళ తర్వాత పౌరసత్వం పొందాడు .హార్మానిక్ రిధమిక్ అతి ని వదిలి నిరాడంబర నియో క్లాసిజం వైపుకు మారాడు .’’సంగీతం సరైన విజ్ఞానం .కనుక దానినుండి ఏదో సందేశం లేక అర్ధం ఆశించరాదు దాన్ని దానిగానే అనుభవించాలి ‘’అన్నాడు .నలభై లలో చేసినదంతా స్వచ్చమైన ఆబ్ స్ట్రాక్ట్ సంగీతమే .

నలభై దాటాక క్లాసికల్ మ్యూజిక్ వైపుకు కదిలాడు .గాలి వాయిద్యాలకోసం ఒక ఆక్టేవ్ రాశాడు .పియానో వయోలిన్ ల మేళనం వదిలేశాడు .గాలి వాద్యాలపైనే ఎక్కువగా పని చేశాడు .అవి స్వచ్చమైనవి ,ప్రతిధ్వనినిచ్చి మానసికానందాన్ని చ్చేవి అన్నాడు .స్వచ్చమైన నాదం కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు .గతాన్ని మళ్ళీ నెమరేసుకొన్నాడు .’’పల్సినేల్ల ‘’లోపాత మాధుర్య స్వరాలను వాడాడు .పెర్గోలేసి ,చికో విస్కీ ల సుస్వరాలను వాడుకొన్నాడు .దీనిపై స్పందిస్తూ ‘’శిశు జననం తర్వాత రేప్ నిజమే ననిపిస్తుంది ‘’అని సమర్ధించుకొన్నాడు .ఇతర సంగీత కర్తల ట్యూన్స్ ను చక్కగా వాడి కొత్తతరానికి పరిచయం చేశాడు .

 ఇటలీ పర్యటనలో ఉండగా తాను మరీ మరీ ప్రాచీనం వైపు వెడుతున్నానని భావించాడు .దీనిఫలితంగా తన స్నేహితుడు జీన్ కాక్టువా ను ‘ఫ్రెంచ్ భాషలో ఉన్న ’ఈడిపస్ రెక్స్ ‘’ను లాటిన్ లోకి అనువాదం చేయమని కోరాడు .కొద్దిగా తనకు లాటిన్ వచ్చుకనుక అందులోని పదాలను ఫోనెటిక్ సామగ్రికోసం వాడుకోవచ్చు అనుకొన్నాడు .శబ్దాలపై ఒత్తిడి కల్పించి ఇంద్రియాలు వాటి జాగ్రత్త అవి పడేట్లు చేయాలని సంకల్పించాడు  .ఈ ఒపేరా –ఆర టోరియో  తర్వాత మరొకటి క్లాసిజ ప్రకాశం తో ‘’అపోలాన్ ముసగేట్స్ ‘’చేసి మొదటి సారి 1925లో అమెరికా వెళ్లి అక్కడ ఎలిజబెత్ స్ప్రేగ్ కూలిడ్జ్ తో ఆవిష్కరింప జేశాడు  .మళ్ళీ తంత్రీ వాయిద్యాలు ఉపయోగించి ఆర్కెస్ట్రా తో డామినేట్ చేయింఛి బహు సొగసైన వీనుల విందైన ,మార్మిక అస్థిరత తో మారు మోగింఛి సంగీతం లో రస ధునులు సృష్టించిన బాష్ ,హాండెల్ లను గుర్తుకు తెచ్చాడు . .

1929లో  డయాఘలేవ్ మరణం తర్వాత పూర్తిగా దియేటర్ సంబంధం లేని సంగీతాన్నే కూర్చాడు యూరప్ లో ఉంటున్నా ద్రుష్టి అమెరికావైపే ఉండేది .19 30 లో బోస్టన్ సింఫనీ  50 వ వార్షికోత్సవానికి ఒక సింఫనీ రాయమని ఆహ్వానించారు .’’19 వ శతాబ్ది నుండి వార సత్వంగా వచ్చిన సింఫనీ మనకు భాష ,ఆలోచనలు రెండిటిలోనూ విదేశీ వాసన కలది ‘’అని భావించి ఉపేక్షించాడు .కనుక మానవ స్వరాలను ఆర్కెస్ట్రా స్వరాలతో కలిపి నియోక్లాసిక్ పీరియడ్ కు చెందిన అద్భుత స్వర సృష్టి చేశాడు .తన జీవితచరిత్రలో దీనిపై రాస్తూ ‘’సింఫనీ భిన్నస్వరాలతోఅభి వృద్ధి చెందినఒక విశేషమేకాని కాని నా ఆలోచనల మేరకు విస్తృత పరచాలనుకోన్నాను .కనుక కోరల్ ,వాయిద్యాల కలగలుపు తో వినూత్న అందాన్ని తెద్దామనుకోన్నాను .రెండిటికి సమాన ప్రాదాన్యమిచ్చి ఒకదాన్ని మరొకటి ఆక్రమి౦ చ కుండా జాగ్రత్త పడ్డాను .పదాలను ప్రత్యేకంగా సృష్టించి పాడించాను .సాల్టర్ నుంచి దీన్ని వాడుకోవాలనే ఆలోచన వచ్చింది .’’సింఫనీ ఆఫ్ సాల్మ్స్ ‘’లో స్ట్రా విన్స్కి పదాలను నాదాల కోసం లాటిన్ లోని వల్గేట్ నుంచి గ్రహించాడు ..50 ఏళ్ళు వచ్చేసరికి మరింత ఘనమైన స్వర కర్త అయ్యాడు .వయోలిన్ ,పియానోలకు ‘’యుగళ కన్సర్తెంట్ ‘’చేశాడు .’’పెర్సేఫోన్ ‘’కంసర్ట్ కు రెండు పియానాలతో  సమకూర్చాడు .16 వాయిద్యాలతో మరో కంసేర్ట్ చేశాడు .

 20వ ఏట రెండవ కజిన్ నడేజా సౌలిమాను పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు త౦డ్రి అయ్యాడు .పెళ్లి అయిన 33 ఏళ్ళకు భార్య చనిపోయింది .యూరప్ అంటే విసుగు పుట్టి అమెరికాకు వెళ్ళిపోయాడు .అక్కడ మాసా చూసేట్స్ లోని  బెడ్ ఫోర్డ్ లో 58వ ఏట వేరాసుడేకేన్ ను పెళ్ళాడి ,మూడవ పిత్రు దేశమైన అమెరికాలో స్థిరపడి 63వ ఏట అమెరికన్ పౌరుడయ్యాడు .70 వయసులో పూర్తీ ఒపేరా ‘’ది రేక్స్  ప్రోగ్రెస్ ‘’ను 18న్ వ శతాబ్ది కి చెందినవిలియం హోగార్త్ శిల్పరచనకు  పరవశుడై ,దానినాదారంగా 20 వ శతాబ్ది కధనుమాంచి శక్తి వంతంగా దూకుడుగా డబ్ల్యు హెచ్ ఆడెన్ , చెస్టర్ర్ కాల్ మన్  కవులు కల్పిత కధగా మలిచిన దాన్ని తీసుకొని ,తనదికాని భాషలో ఉన్నదాన్ని అక్షర నాదాలను బట్టి సోనాట్ యూనిటీ గా పరివర్తన చెందించాడు .ఇప్పుడుకూడా విమర్శకులు అది స్వీయమా ,లేక ఇతర స్వరకర్తలైన హాన్డెల్, మొజార్ట్  టేకోవ్ స్కి ల   కాపీ యా?అని ప్రశ్నించారు   .కాని ఇర్వింగ్ కోలేడిన్ మాత్రం అంతగా మెచ్చక పోయినా ,ఆడెన్ ,కల్లాం పాఠాన్ని అతి నూతనంగా ,తెలివిగా ,చిరస్థాయిగా నిలిచే సంగీతం తో ప్రకాశింప జేశాడు .ఇది ఏనాటికైనా మనతరం లోనే కాదు భవిష్యత్ తరాలలో కూడా అరుదైన ప్రయోగం అని పించు కొంటుంది  అన్నాడు .

స్ట్రా విన్స్కి చిత్రాన్ని పికాసో ,కాక్టువాలు అద్భుతంగా గీశారు .’’లైఫ్ ‘’మేగజైన్ లో విన్త్రాప్ సార్జంట్ దీనిపై రాస్తూ ‘’ఒక కొత్త ఇమేజ్ లాఉంది .బరువైన హారన్ రిమ్మేడ్ కళ్ళ అద్దాలతో అయన దేనిమీదో ముందు ద్రుష్టి పెట్టిన గొల్లభామ లాగా కనిపిస్తున్నాడు ‘’అని  కామెంట్ చేశాడు (his aquiline nose and heavy horn –rimmed glasses give him the look of a deeply preoccupied grasshopper ‘’ )ఇక్కడ ‘’ప్రీ ఆక్యు పైడ్’’అంటేఒక మేధావి  ఏదో విషయం పై నిరంతర అన్వేషణలో మునిగి ఉన్నట్లు ‘’అని అర్ధం చెప్పారు .’’his willingness to write to order had made him more a craftsman than a creator ‘’అని గిట్టని వాళ్ళు విశ్లేషించారు .అంటే ఆయన సృజన కర్త కంటే గొప్ప కళాకారుడు .కాని ఆయన అభిమానులు మాత్రం ‘’అంతటి జీవకళ ,ఉత్సాహం వైవిధ్యం ,ప్రతి సూక్ష్మ విషయం పై దృష్టి,దాన్ని స్వర్ణమయం చేసే నేర్పు ,అసాధారణమైన  మిరుమిట్లు గొల్పే ప్రయోగాలు ,ప్రశాంత సాధనా, సాఫల్యత, ఆగ్రహ లయల అనుసంధానం, ,అంతటి క్రమపద్ధతి  నిర్మాణం స్ట్రా విన్స్కి సంగీతం లో తప్ప ఇంకెక్కడా కనిపించదు కాక కనిపించదు ‘’అని ప్రశంసించారు .పొగడ్తల తెగడ్తల , దూషణ భూషణ లేమీపట్టించుకోకుండా తన పనేదే తానూ చేసుకు పోయాడు .కొత్త శ్రుతులకోసం ,కొత్త వాయిద్య సమ్మేళనాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు .ఆతను ఎలా పని చేస్తాడంటే ‘’  He lives only on music ,shaping ,cutting ,and correcting it on a desk as severe as an architect;s drafting table .అంతటి దీక్ష తపన ,అంకితభావం తాదాత్మ్యం ఆయనది .ఆయనకు  ప్రేరణ ఒక లేబర్ . ‘’He knows how to sublimate instinct to a regular force ‘’అని ఆయన పనితనాన్ని డచ్ క్రిటిక్ ఫ్రాంక్ ఆనేన్ విశ్లేషించాడు .స్ట్రా విన్స్కి కి ‘’A thing of beauty is not a joy until it conforms to discipline bringing form out of chaos ,fulfilling the stern definition of St.Thomos ‘’Beauty is the essence and glory of order ‘’

6-4-19 71న అమెరికాలో 89వ ఏటఅమర సంగీతమ౦  అందించిన  స్ట్రా విన్స్కి అమరుడయ్యాడు .

 

    ఆయన జీవితం లో 1-రష్యన్ పీరియడ్ -19 07 -19, 2-నియో క్లాసికల్ పీరియడ్ -19 20-54,3-సీరియల్ పీరియడ్ -19 54 -68అనే నాలుగు దశలు నడిచాయి .ఆయనను ‘’one of music;s truly epochal innovators ‘’అంటారు .కాంపోజిషన్ శైలిని ఎప్పటికప్పుడు మార్చటం ఆయన గొప్ప ప్రత్యేకత .అందులో స్పష్టత ,తాదాత్మ్యాలను కాపాడు కొన్నాడు .అనేక రకాల వాయిద్యాలతో మానవ స్వరాలతో ,ఏక వాయిద్యం నుంచి అనేక వాయిద్య సమ్మేళనాలతో  చరిత్ర సృష్టించాడు .ఆయనకు రాయల్ ఫి హార్మోనిక్ సొసైటీ గోల్డ్ మెడల్ ను ,అందజేస్తే సానింగ్ మ్యూజిక్ ప్రైజ్ ను లియోని ఇచ్చింది .బెస్ట్ క్లాసికల్ పెర్ఫార్మార్ గా ,బెస్ట్ క్లాసికల్ కంపోజర్ గా ఆర్కేస్ట్రాలోను సోలో లోను పొందాడు జీవిత సాఫల్య పురస్కారం మరణానంతరం 1987 లో అందజేశారు .తన జీవితం లోసంగీతపరమైన  అనేక గ్రంధాలు రాశాడు ,’’క్రానికల్ ఆఫ్ మై లైఫ్’’అనే ఆటో బయాగ్రఫి రాసుకొన్నాడు మరికొందరితో కలిసీ రచనలు చేశాడు .

  Inline image 4  Inline image 2Inline image 3

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-16- ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా మేనమామ కొడుకు విశ్వనాధం

 

మామేనమామ గుండుగంగయ్య గారి 63ఏళ్ల నాలుగవ కొడుకు విశ్వనాధం జూన్ 27 సోమవారం రాత్రి  కొంతకాలంగా కిడ్నీ వ్యాధి తో బాధపడి చనిపోయాడు .వాడిది ఒక వింత కధ . చిన్నప్పటి నుంచి మాటలు రావు .కానీ మంచి అవగాహన ఉండేది .వయసు వచ్చినా పసిపిల్లాడి మనస్తత్వం .చెప్పిన పని చేసేవాడు .మా ఇంటికి ఎప్పుడూ వస్తూ ఉండేవాడు .పిల్లల్ని ఆడించేవాడు .ఎత్తుకొనేవాడు పడేస్తాడేమోనని మా భయం .ఒక రకం గా జడ భరతుడు ,అవధూత . మా మామయ్య అత్తయ్య చాలా బాగా చూసుకునేవారు .మా మామయ్య చని పోయాక వాడి బాధ్యతను మూడవ కొడుకునరసయ్య  ఇంటి బాధ్యతలు పొలం వ్యవహారాలతో పాటు వాడి బాధ్యతనూ తీసుకొన్నాడు ..వీడి అక్క చెల్లెల్లు తమ్ముళ్లు కూడా విశ్వనాధానికి సేవ చేసేవారు  నరసయ్య కొడు కు కూతుళ్లు నలుగురూ అందరూ వాడిని ”విస్సు బాబాయ్ ”అని ఆత్మీయంగా పిలిచేవారు.వాడి సేవ చేసేవారు .వాడికి స్నానం కూడా ఎవరో ఒకరు చేయించాల్సిందే .అన్నంకూడా కలిపి నోట్లో పెట్టి తినిపించాల్సిందే..   .అయినా ఆడా  మగా ఎవ్వరూ వాడినిఏవ గించుకోవటం కానీ  విసుక్కోవటం కానీ చేసేవారు కాదు.  బాధ్యతగా వాడి సేవ చేసేవారు .  అంత ఓర్పుగా వాడికి కుటుంబం అంతా బాసటగా ఉండేవారు ..చురుగ్గా నడిచేవాడు నోటి వెంట ఎప్పుడూ చొంగ కారుతూ ఉండేది ఏదో మాటలు నోటి నుంచి వచ్చేవికాని అర్ధం తెలిసేది కాదు .ఇలాంటి వాళ్ళు మన ఊర్లో మరో ముగ్గురు ఉండేవారు .ఒకరు గోవింద రాజు శ్రీరామ మూర్తి గారబ్బాయి, రెండవ వాడు బూరగడ్డ బసవయ్య గారబ్బాయి మూడవ వాడు మా హిందీమాస్టారు కొడాలి రామారావు గారి అబ్బాయి .ఈ ముగ్గురికంటే విశ్వం చాలా నయం .వాళ్ళు ముగ్గురూ చొక్కా ఎవరైనా తొడిగితే తప్ప ఒంటి మీద ఉండేదికాదు ఎప్పుడూ దిశమొలతోనే రోడ్డు మీద ఉండేవారు  .వీడు వాళ్ళకంటే వెయ్యి రెట్లు నయం  చొక్కా లాగూ లేకుండా ఎప్పుడూ ఉండేవాడు కాదు .. మాటలు రావు అంతే . మా ఆవిడను అక్కయ్యా నన్ను బావ అని అస్పష్టంగా అనేవాడు .మా పిల్లలకూ వాడు అంటే ఆధరమే .వాళ్ళ ఇల్లు మాఇంటికి ఉత్తరం వైపునే ఉంది మధ్యలో చిన్న సందు ఉంది .సుమారు పదేళ్లక్రితం మా వీధిలోనే రోడ్డుమీద ఇల్లు కట్టుకొని అక్కడే వీడితో సహా ఉంటున్నారు  .నరసయ్య నలుగురు కూతుళ్ళకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాడు .కొడుక్కి చేయాలి .మామామయ్య ఆస్థి లో   విశ్వనాధానికి కూడా వాటా ఇచ్చాడు . ఆస్థి  వాడికి ఉంది అని వీళ్ళు సేవ చేయలేదు .బాధ్యతగా చేశారు .బహుశా ఈ కాలం లో ఇలాంటి వాడి కి కుటుంబం ఇంతగా అండగా ఉండటం ఆశ్చర్యమే   కలిగిస్తుంది  .దాన్ని మా మామయ్య కొడుకు నర్సింహం ఆచరించిఆదర్శంగా నిలిచాడు .. నరసయ్య పిల్లలు విశ్వం అక్క చెల్లెల్లు అందరూ కలిసి విశ్వనాధానికి  ఉత్సాహంగా షష్టి పూర్తి ఉత్సవం జరిపారు .
   .  విశ్వాన్ని హాస్పిటల్ లో కొంత కాలం ఉంచి కిడ్నీలకు ట్రీట్  మెంట్ ఇప్పించి రెండూ ఫెయిల్ అయ్యాయని,ఒకటి రెండు రోజులే అని  డాక్టర్ చెబితే ఆదివారం ఉదయం మా ప్రక్కన ఉన్న వాళ్ళ పాత ఇంట్లో ఉంచి జాగ్రత్త్తగా చూశారు .సోమవారం రాత్రి పదిగంటలకు వాడు వెళ్లి పోయాడు .మంగళ వారం  ఉదయం అంత్య క్రియలు జరిపి అప్పటి నుంచే  విధి విధానంగా దినవారాలు ఈ పాత ఇంట్లో నే శిల ఉంచి పుల్లేరు గట్టుమీద ఉన్న ఊర తాతయ్య గారు కట్టించిన అపరకర్మల సత్రం లో చేస్తున్నారు . .  . . మనమధ్య ఉన్న మనుషుల్లోనూ ఇంతటి సేవాభావం ఉన్న వాళ్లు న్నారని  తెలియ జేయటానికే ఇదంతా .మా మామయ్యకు పక్షవాతం వచ్చినప్పుడు నరసయ్య చంటి పిల్లాడికి చేసినట్లు సేవ చేశాడు .విశ్వం తర్వాత వాడు మోహనాయ్ ఏం కామ్ బందరులో చదువుతూ మామామయ్య హాస్పిటల్ లో ఉండగా చూడటానికి వచ్చి ఉయ్యూరు సెంటర్ లో రోడ్డుమీద లారీ ఆక్సిడెంట్ లో చనిపోయాడు . అప్పుడూ ఇలానే సేవ చేసింది కుటుంబం .  . వాళ్ళమ్మ అంటే మా అత్తయ్య కూ ఇలాగే సేవచేశాడు ఆవిడ పోయి దాదాపు ఆరేళ్ళుఅయి  ఉంటుంది   .పోనీ నర్సయ్య ఆరోగ్యమైనా  బాగుందా అంటే వాడికీ బి పి ,షుగరు బాగా ఉన్నాయి ..అయినా ఏ లోటు రానీయకుండా తలిదండ్రులకు తమ్ముడికి ఈ విధంగా సేవ చేసి వాడూ వాడికుటుంబం రుణం తీర్చుకొన్నారు .ఇలాంటివాళ్ళు బహు అరుదు . మానవత్వం పరిమళించటం అంటే ఇదేనేమో !ఇవాళ 10 వ రోజు .ధర్మోదకాలు వదిలి వచ్చాను . మానవ సేవే  మాధవ సేవ అని నిరూపించాడు నరసయ్య  -దుర్గా ప్రసాద్
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -191

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -191

72-20 వ శతాబ్ది ప్రముఖ ప్రభావ రష్యన్ స్వర కర్త –ఇగార్ స్ట్రావిన్స్కి

‘’క్రమం యొక్క కీర్తి సారమే సౌందర్యం ‘’అన్నాడు  రష్యన్ స్వరకర్త ఇగార్ స్ట్రా విన్స్కి.1913లో పార్శియన్ పబ్లిక్ ముందు ‘’ది రైట్ ఆఫ్ స్ప్రింగ్ ‘’బాల్లేట్ ను  అన్ని సంప్రదాయాలను విస్మరించి విభిన్నంగా  ప్రదర్శించినపుడు అది విప్లవాత్మకమో ,విధ్వంసకమో శూన్యమో తెలియక జుట్లు పీక్కుని ప్రేక్షకులు నిరసన ,ఆందోళన ,ఈలలు ,అరుపులు ,పిల్లికూతలు ,కేకలతో  రాళ్ళవాన తో భీభత్సం సృష్టించారు . ఈ భీభత్సం వాగ్నర్ కు జరిగిన పరాభవాన్ని గుర్తు చేసింది .వేదిక మీద వాద్య ధ్వనులకంటే ,ఈ గొడవే ఎక్కువగా విని పించింది .సభలో ఉన్న అమెరికన్ క్రిటిక్ కార్ల్ వాన్ వేచ్ టెన్ లేచి నిలబడి ‘’ఈ కుర్రాడి సంగీతం వింటుంటే నా నెత్తి మీద అతని చేతులతో ముష్టి ఘాతాలు చేస్తున్నట్లుంది .అన్ని సంప్రదాయాల్ని నాశనం చేశాడు .నా భావోద్వేగం ఏమిటంటే ఆ దెబ్బలు కొంచెం సేపు నాకు బాధ కలిగించలేదు ‘’అన్నాడు .

 ఇగార్ స్ట్రా విస్కీ ముఖ్య లక్షణం  భావోద్విగ్నత ను ప్రేరేపించటం .సంగీత పరమార్ధం ‘’వస్తువుల విషయాలమధ్య క్రమాన్ని సృష్టించటం ,దీనికి మించి మనిషికి ,కాలానికి మధ్య క్రమత్వం నెలకొల్పటం ‘’అంటాడు ఇగార్ ..ఎమోషన్ ను ప్రసరి౦ప చేయటం లేక సృజనలో అర్ధాన్ని కల్పించటమే కాక స్ట్రా విన్స్కి ఆర్ట్ –ఒక మేధా కార్యక్రమం ,స్వర సమూహాన్ని కొన్ని విరామాలలో క్రమబద్ధం చేయటం  అతని ప్రత్యేకత .ఇంద్రియాలకు ప్రత్యేక విన్నపాలను చేయటం ,శృంగార స్పూర్తి కలిగించా-టాన్ని వ్యతిరేకించాడు .అలా చేస్తే కాక్టియాచెప్పినట్లు  ‘’హృదయాన్ని బ్లాక్ మెయిల్ ‘’చేయటమే నంటాడు .హేతు వాది .ఎమర్సన్ చెప్పిన ‘’transcendentalism’’అంటే అతీత భావ వాదం ,అందులోని ‘’beauty is its own excuse  for being ‘’నచ్చినవాడు .దీన్ని సాధనక్రమం లో సాధించాలనుకొన్నాడు .స్వర కల్పన నిత్యకృత్యం అంటాడు  .అలాకాకపోతే వాడని వాయిద్యం పనికి రాకుండా పోయినట్లు ఇదీ పాడై పోతుంది .నిత్యాభ్యాసం లేక పోతే సంగీత కర్త కు ప్రగతి ఉండదు అంటాడు .ఏదైనా సృష్టించే ముందు స్పూర్తికోసం ఎదురు చూడాలి అను కొంటారు ఎక్కువ మంది ..ప్రేరణ ను తాను కాదు అనలేనని ,అది ముందుకు తీసుకుపోయే శక్తి అని ,ప్రతి మానవ క్రియకు అవసరమేనని అంతమాత్రం చేత అది ఒక్కటే ఆర్టిస్ట్ యొక్క ఆస్థికాదని  అంటాడు .నిరంతర ప్రయత్నం ,ప్రయాస బుద్ధికి అవసరం .అదే స్ట్రావిన్స్కి సంగీత వైవిధ్యానికి ముఖ్య సోపానాలు .అదే ఆతని ‘’thinking of the music ‘’.

1882లో రష్యన్ కాలెండర్ ప్రకారం జూన్ 5,పాశ్చాత్య కాలమానం ప్రకారం  17 న సెయింట్ ఇగార్ దినోత్సవం నాడుజన్మించాడు .తండ్రి ఫియోడర్  స్ట్రావిన్స్కిప్రసిద్ధ బాస్ సింగర్ .ఇదే మూడోకొడుకు విగార్ కు సెయింట్ పీటర్స్ బర్గ్ దగ్గరున్న ఒరానీన్ బాం లో సంక్రమించింది .ఆరేళ్ళ వయసులోనే పియానో పై చిన్న చిన్న విషయాలు వాయించేవాడు .అవి గోప్పవేమీకాడు .19 వయసులో రిమ్స్కి కోరాకాఫ్ కు వాయించినప్పుడూ అభి వృద్ధి  కనిపించలేదు.24 లో షిహారజేడ్   కంపోజర్ అతనికి నేర్పటానికి ఒప్పుకొన్నాడు .గురువుగారికంటే ఓరిఎంటల్ మ్యూజిక్ లో చాలా ముందుకు దూసుకు పోయినా  తన ప్రేరకుడిని ఎప్పుడూ గుర్తుంచుకొంటాడు .గురువు కూతురు రిమ్స్కి ని పెళ్లి చేసుకొన్నప్పుడు స్ట్రా విన్స్కి ఒక సింఫనీ కవిత ‘’ఫైర్ వర్క్స్ ‘’రాశాడు  ,గర్భాదానంతర్వాత నాలుగు రోజులకు రిమ్స్కి కోర్సాకాఫ్ చనిపోయాడు .గురువు స్మృత్యర్ధం శిష్యుడు ‘’చాంట్ ఫోనేబర్ ‘’ కంపోజ్ చేశాడు .

ఇంకా చదువులోనే ఉండి,పియానో పై ఎట్యూడ్స్ ను సాధన చేస్తుండగా రష్యన్ బాలెట్ ను విప్లవావాత్మకంగా మార్చేసిన సెర్జీ డయాఘిలేవ్ తో పరిచయం కలిగింది .ఈయన 70బాలెట్ లను ప్రదర్శించే  ఆలోచనలో ఉండి,డేబస్సి,ఫాలా ,ఆలిక్ ,పౌలీన్ రిమ్స్కి లతో  సంగీత౦ చేయిస్తున్నాడు .కర్టెన్లు  రంగాలంకరణ దుస్తుల డిజైన్ కు  పికాసో వంటి ప్రసిద్ధులను నియమించుకొన్నాడు .స్ట్రా విన్స్కి శక్తి సామర్ధ్యాలు తెలిసిన వాడుకనుక చేరమనికోరాడు .అతనికి పని ఎలా చేయించుకో వాలో తెలుసు ..అతని మార్గదర్శకత్వం లో స్ట్రావిన్స్కి స్థానిక రష్యన్ సంగీత కారుడి అవతారం నుండి అంతర్జాతీయ యూరోపియన్ అవతారమెత్తాడు .

    1909 లో డయాఘిలేవ్ ప్రోత్సాహం తో స్ట్రా విన్స్కి ‘’ది ఫైర్ బర్డ్ ‘’,తో బాటు మరొక దానికీ సంగీత సమకూర్చాడు .కాని అతనిపై రష్యా సంగీత ప్రభావం ఇంకా దూరం కాలేదు .పియానో శబ్దాలను మిగతా ఆర్కెస్ట్రా మింగేసి కర్ణ కఠోర శబ్దాలను సృష్టించింది .పపెట్ ప్రదర్శన దారుణంగా విఫలమైంది .అయినా డయాఘిలేవ్ స్వయంగా తర్వాత కలిసి జరిగిందేదో జరిగింది దాన్ని పూర్తీ బాల్లేట్ గా మార్చే ప్రయత్నం చేసి సత్తా చూపించమని ప్రోత్సహించాడు .’’పెట్రౌ చకా ‘’లో తన  సామర్ధ్యం  ప్రదర్శించాడు .రష్యన్ జానపద ట్యూన్స్ వాడి ,స్వంత బాణీ ప్రదర్శించాడు .కొత్త రిధం లను ప్రయోగించాడు .మధురం శ్రావ్యత కలిపించాడు .కాని ఇదంతా చాలా ప్రాధమిక దశకు చెందినదే అనిపించింది .స్వేచ్చా వాతావరణానికి 31 వ ఏడాది లో ప్రవేశించి ‘’లీ సాక్రే డుప్రిన్టేమ్స్’’కు స్వర రచన చేశాడు .చరిత్రాతీత త్యాగ కద ఒక్కసారిగా ఆయన మనసులోకి వచ్చింది .తన ఊహలో ‘’ఒక పాగాన్ ఉత్సవం లో గుండ్రంగా కూర్చున్న వృద్ధ తాపసులు చూస్తూ ఉండగా  నడుమ ఒక యువతి డాన్స్ చేస్తూ చేస్తూ చనిపోవటం .ఆమెను రాబోయే శుభ వసంతానికి బలిగా చేయటం  ఇందులో కద.ఒక గుహ ,అందులో వెర్రి ఆవేశపు స్త్రీలు ,హిప్నటైజ్ అయిన కౌమారదశ వారు ,కన్యరికాన్ని కాపాడుకోన్నవాళ్ళు ,వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకోవటం కలుసుకోవటం ,ఆనందించటం విడిపోవటం అంతా అత్యంత సహజమైన డాన్స్ లతో ప్రక్రుతి శక్తుల నృత్యాలతో  తీర్చి దిద్దాడు .నియంత్రణలో ఉన్న హింస ఉండటం తో ఇది మాస్టర్ పీస్ అని పించుకోన్నది .దీనిపై జీన్ కాక్టువా రాస్తూ ‘’ఆటవిక దుఖం బాధ ,చి౦తల పుట్టుకలో భూమి ,పొలాలపై కేకలు, సన్నని మాధుర్యాలు ,శతాబ్దాల కిందటి వాతావరణం ,పశువుల నెమరువేతలు,పూర్తీ ప్రక్రుతి సౌందర్యాన్నిఒడిసి పట్టి  చాలా గొప్పగా సిమ్ఫనైజ్ చేశాడు ‘’అని రాశాడు .ఇందులోని సంగీత విలువలు చిరస్మరణీయం .ప్రతిదీ సెంట్రి ఫ్యూగల్ శక్తితో చలించింది .రెండు విభిన్న తాళాలతో శ్రుతి కల్గించాడు .వరుసక్రమంలో మనుషులు వంగటం ,తుఫాను గోధుమ చేను పై విరుచుకు పడ్డట్టు  ఆడవాళ్ళ భుజాల మీద నుండి  దాటుకు పోవటం,తమ మడమలను కాల్చుకోవటం ఓహ్ పరమాద్భుతం అని పించింది   .’’Srtavinsky  ;s dancers  are not merely electrified by these rhythmic disturbances ,they are electrocuted ‘’   అని  మహా ఇదిగా మెచ్చుకొన్నారు అతని సృజన విజ్రుమ్భించి శత పత్ర పద్మ సుందరిలావికసించి మనసులకు హృదయాలకు మహదానందాన్ని పంచింది .అలౌకిక అనుభూతికి లోను చేసింది .రాళ్ళ దెబ్బలు కొట్టిన ప్రేక్షకులను స్వర సమ్మోహనం చేసి తానే ఇప్పుడు సు స్వరాలతో బాది పారేసి ప్రతీకారం తీర్చుకొన్నాడు స్ట్రా విస్కీ.

Inline image 1Inline image 2

  సశేషం

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-16 –ఉయ్యూరు  .

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -190 71-చైతన్య స్రవంతి కి ప్రాణం పోసిన –జేమ్స్ జాయిస్ -3(చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -190

71-చైతన్య స్రవంతి కి ప్రాణం పోసిన –జేమ్స్ జాయిస్ -3(చివరి భాగం )

‘’ఫిన్నేగాన్స్ వేక్స్ ‘’ను ‘’the rivering waters of hitherandthithering waters of night ‘’అన్నారు ,రాత్రి ‘’ఫిన్నేగాన్స్ ‘’ను కంట్రోల్ చేస్తే పగలు ‘’యులిసెస్ ‘’ను పరిపాలించింది .కాల నిబంధనల నుండి విడుదల అవటానికి జాయిస్ తాను  చెప్పేవిదానాన్ని మార్చి ఇందులో ఒక కలల సముదాయంగా మార్చాడు .స్వప్నఅనంతత్వాన్ని ,దాని ప్రత్యేక పరిభాషను ,దాని అసంబద్ధ లాజిక్ ను చేర్చాడు .యులిసెస్ లాగా ఇదీ మిత్ ఆధారంగా రాసిందే .కాని ‘’it is  an impersonal rather than personal mythology which makes the central figure mankind itself .ఇది అందరికి అన్నిచోట్లా అన్నికాలాల్లో జరిగేదే .ఒకరకంగా ‘’allegorical  ,psychological spiritual history of humanity in a single theme .దీన్ని అనేక ప్లేన్స్ లో రాశాడు జాయిస్ .ఫ్రాయిడ్ భావాలకు రూపకల్పన గా ఉంటుంది .విరుద్దాల యాదృచ్చిక సంఘటనం .ఎన్నో .షేక్స్ పియర్ టాగ్ లు ,దారితప్పిన సామెతలు ,భాషాయాసలు ,జాతీయాలు ,వికార భాషా శాస్త్ర విషయాలు ,జారుళ్లు,చర్చలు ,టేలిస్కోపేడ్ శబ్దాలు ,పద సమ్మేళనాలు ,పేరడీలు ,శ్లేషలతో ముంచేశాడు .శ్లేష ఆయన శ్వాసగా కనిపిస్తుంది .12 భాషలలో వేలాది శ్లేషలను ఇందులో గుప్పించాడు .షేక్స్పియర్ తర్వాత ‘’పన్ లో పాదుషా’’ జాయిస్ మాత్రమే .ఒకే పదానికి రెండు మూడర్దాలుంటాయి .సామాన్యుడికి అదొక కారడవి అనిపిస్తుంది .వ్యాఖ్యాన దీపం లేక పోతే కారు చీకటే .క్రాస్ వర్డ్ పజిల్ గాఅర్ధం కాని కోడ్ భాషగా  తికమక పెడుతుంది .అంత్యక్రియలకు నాంది గా అనిపిస్తుంది .ఆ శైలీ విన్యాసం చూద్దాం –

‘’Buy a book in brown paper –from Faber and Faber –to hear Annie Liffie ,trip ,tumble and caper –sevensinns in her singthings –Plurabell;s on her prose –sheashell ebb music wayriver she flows ‘’ఈపుస్తకం అతి పెద్ద బూటకం అన్నారు .17 ఏళ్ళు కస్టపడి పబ్లిక్ పై ట్రిక్కులు ప్రయోగించాడు అన్నారు.

59 వ ఏట జాయిస్ కస్టాలు మరీ పెరిగాయి .’’ఫిన్నేగాన్స్ ‘’పుస్తకం ఫెయిల్ అయింది దమ్మిడీ రాలేదు .భవిష్యత్తు అంధకారమై కూతురి ఆరోగ్యం ఏమై పోతుందో అనే బెంగతో కుంగి పోయాడు .ప్రాణాంతక ఆంత్రమూల అల్సర్ ఏర్పడింది .ఆపరేషన్ జరిగింది .రెండు సార్లు రక్తం ఎక్కించారు .కోలులోలేక జ్యూరిచ్ లో13-1-19-41 న 59ఏళ్ళకే జేమ్స్ జాయిస్ చనిపోయాడు .

  ‘’ విమర్శకులు జాయిస్ ను విమర్శించే ముందు ఆయన చదివినంత చదుకోవాలి ‘’అన్నాడు ఎల్. యే జి,స్ట్రాంగ్ .ఇందులో నిజం కొంత ఉంది .ఏ సాయం లేకుండా అతని సాహిత్యం చాలా భాగం చదవచ్చు. కాని కొన్నిటికి తప్పక గైడ్ ఉండాల్సిందే .ఆయనను విశ్లేషిస్తూ ‘’in the beginning there was the word and the word was the life .in the end there was only the word ‘’అన్నాడు .జాయిస్ కవి ,అర్ధ జ్ఞాని, సృజన శీలి .దారుణ మైనవాడు స్పూర్తికలిగించేవాడు కూడా .’’he enlarges Shakespearean soliloquy into an interior monolog of unexampled length breadth ,and richness .He was the first to employ ‘’the stream of consciousness ‘’as a running commentary ,a tossing flood of free association .He caught and preserved in a fluid amalgam part speech ,partsliding ,suggestive syllables ,the shapes of dissolving dreams .A genius who united the comic with the cosmic ,a renegade Jesuit with the lustiness of a Rabelais and the savagery of a Swift ,Joyce was an influence so great that imitators were imitable and so unique that imitation was impossible ‘’అంటూ అనుకరణకు అందని సాహితీ మూర్తి జాయిస్ అన్న రచయితలూయీ అంటర్ మేయర్ మాటలు యదార్ధం.

 జాయిస్ సాంఘిక వ్యవస్థను క్రస్టియానిటి ని వ్యతిరేకించాడు .వీటితో తానెప్పుడూ అంతర్యుద్ధం చేసేవాడిని అని చెప్పాడు .కేధలిక్కుల అణచి వేత విధానం పై పోరాడాడు .జాయిస్ చనిపోయినప్పుడు క్రిస్టియన్ మతగురువు వచ్చి కార్యక్రమం చేస్తానంటే భార్య అబ్యంతరం చెప్పింది . సంగీతం అంటే విపరీతమైన మోజున్న జాయిస్ కవితల్లో వచనం లో సంగీతం కట్టలు తెంచుకొని ప్రవహించింది .ధామస్ మూర్ ‘’ఐరిష్ మేలోడీలు ‘’,జార్జ్ బార్కర్ బాలడ్ లను చాలా చోట్ల ఉపయోగించాడు .సంగీతజ్నులైన సల్లివాన్ ,మొజార్ట్, వాగ్నేర్ లను బాగా అధ్యయనం చేశాడు .జాయిస్ రచనలు సంగీతానికి ,వాద్య సంగీతానికి ప్రేరణ అయాయి .

  జాయిస్ ప్రభావం చాలా మందిమీద ఉంది .ముఖ్యంగా నాటక రచయిత శామ్యూల్ బెకెట్ పై ఎక్కువ .జోసెఫ్ కాంప్బెల్, జాన్ అప్ డైక్,మలార్మే రింగ్ బాడ్లపై కూడా జాస్తీగానే ఉంది .జూన్ 16 ను ‘’బ్లూమ్స్ డే’’గా జాయిస్ రచనలు ,జీవితం పై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు .1999 లోటైమ్స్ మేగజైన్  వంద మంది ప్రసిద్దుల పేర్లలో జాయిస్ పేరూ చేర్చింది .2013 లో ఐర్లాండ్ ప్రభుత్వం ఆయన స్మారక సిల్వర్ కాయిన్ ముద్రించి,దానిపై యులిసెస్ లోని ప్రఖ్యాత వాక్యాన్నిచేర్చి గౌరవించింది .ఐరిష్ నౌకకు ఆయన పేరు పెట్టారు .జాయ్స్ జీవించి ఉండగా 8 పుస్తకాలు చనిపోయాక 10పుస్తకాలు ముద్రణ పొందాయి .  Shortly after the publication of Ulysses, he elucidated this preoccupation somewhat, saying, “For myself, I always write about Dublin, because if I can get to the heart of Dublin I can get to the heart of all the cities of the world. In the particular is contained the universal.”[2]

అని తన డబ్లిన్ అభిమానాన్ని గుండె డప్పుతో మోగించి చాటిన ఐరిష్ దేశభక్తుడు ,శాశ్వత౦గా  ఐర్లాండ్ ను వదిలి ప్రవాస జీవితం గడిపిన చైతన్య స్రవంతి రచయిత జేమ్స్ జాయిస్ .

   Inline image 1   Inline image 3

 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-16-ఉయ్యూరు  

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -189

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -189

71-చైతన్య స్రవంతి కి ప్రాణం పోసిన –జేమ్స్ జాయిస్ -2

ట్రిస్టేలో ఒంటరిగా ఉంటూ సున్నిత మైన బతుకు బతుకుతున్నానని చెప్పుకొన్నాడు.పెళ్ళాం ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్నాడు .స్కూల్ లో ఇంగ్లీష్ బోధిస్తూ ఏడాదికి వచ్చే ఎనభై పౌండ్ల జీతం తో బతుకు బండీ  లాగిస్తున్నాడు .ఒక పుష్కరం ముందే’’ పోర్ట్రైట్ ‘’  నవల పూర్తీ చేశాడు .ఇది ఆయన మొదటి పాతికేళ్ళ జీవిత చిత్రణే..దీనికి మొదట్లో ‘’స్టీఫెన్ హీరో ‘’పేరు పెడదామనుకొన్నాడు .పేర్లలో ఉన్న రిదం బాగా తెలిసిన వాడు .ఇందులో ముఖ్యపాత్ర జాయిస్ ను పోలి ఉంటుంది .చివరి పేరును డేడాలస్ గా  మార్చాడు .డేడాలస్ మనిషిని భూమి నుంచి పైకి తీసుకు పోవటానికి రెక్కలు సృష్టించుకొన్న వాడు .డేడాలస్ అంటే కపట  వేషధారి అని అర్ధం .ఇదంతా ఆయన ఊహ .సింబాలిజం సృష్టి .జార్జ్ రస్సెల్ AE అనే మరు పేరుతొ రాశాదు  ఈయనఐర్లాండ్ లో ఆధునిక వ్యవసాయ పద్ధతులను గురించి ‘’ఐరిష్ హోం స్తేడ్ ‘’పుస్తకం రాస్తూ ,సెల్టిక్ ఉద్యమ రచయితలపై  పుస్తకం తెస్తూ జాయిస్ ను అందరికి అర్ధమయ్యేట్లు సరళంగా రాస్తే ఎడిటర్ వ్యాసానికి ఒక పౌండ్ చొప్పున ఇస్తాడని తనకు ఎప్పుడు వీలయితే అప్పుడు అగ్రిమెంట్ మీదసంతకం చేయచ్చునని మారు పేరు వాడుకోవచ్చని సలహా ఇచ్చాడు .సరేనని ‘’స్టీఫెన్ డేడాలస్ ‘’అనే మారు పేరుతొ మూడు కధలు రాశాడు .

‘’పోర్ట్రైట్ ‘’,నవల ద్వివిధమైన వ్వ్యక్తీకరణ ఉన్న నవల .అందులో తాను  అమితంగా ప్రేమించి ఆరాధించే ఐర్లాండ్ ,అందులో ఒక విలువైన యువరచయిత  వ్యంగ్య చిత్రం కలిసి ఉన్నాయి .శబ్దాలమీద పూర్తీ అధికారం తో ,మాంత్రిక శబ్దజాలం తో అదరగొట్టాడు దీనిపై ఆయనే స్పందిస్తూ ‘’to encounter for the millionth time the reality of experience and forge in the smithy of my soul the uncreated conscience of my race ‘’అంటూ తన ఉద్దేశ్యాన్ని వివరించాడు .ఇందులో విద్యా చరిత్ర ,అసాధారణ జ్ఞానం ఉన్న కౌమారదశలోని కుర్రాడు పరిపక్వతకు చేరుకోవటం అదే సమయం లో దాపరికం లేనిఆ వయసులోని  శృంగార భావనలు కలిసి ఉంటాయి .ఇది సాధారణ రచన కాదు .తరువాత రాయబోయే ఎపిక్ కు నేపధ్యం .ఈ పుస్తకమూ ముద్రణ ప్రసవ వేదన అనుభవించింది .’’ఈగోయిస్ట్ ‘’పత్రికలో సీరియల్ గా వచ్చింది .పుస్తక రూపం లోకి తేవటానికి యే పబ్లిషర్ కూడా సాహసించలేదు .కాగితాలు అమెరికా నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది .

జాయిస్ రాసిన మరో గొప్ప రచన ‘’యులిసెస్ ‘’అది ఆయన ఐరిష్ స్వదేశీయ భక్తీ .హోమర్ రాసిన గ్రీక్ ఎపిక్ పేరును వాడుకొన్నాడు .అందులో హీరో యులిసెస్ తనలాగే దేశం వదిలి ప్రవాసం లో ఉంటూ  దేశదిమ్మరిగా తిరిగాడు .హోమర్ రాసిన కధలోని సంఘటనలు ఇక్కడ ఒక రోజు 1904జూన్ 16న డబ్లిన్ లో జరుగుతాయి .అందులో టేలిమాకాస్ ,యులేసేస్  భార్య మోలీ లు బదులు డేడాలస్,లియో పోల్ద్ బ్లూమ్ పెనెలోప్ ఉన్నారు మిగతా పాత్రలూ చాలా ఉన్నాయి .కదా బ్లూమ్ మీడే ఎక్కువగా నడుస్తుంది .అతని కొడుకు తప్పిపోతాడు మరోకడికోసం తపన పడతాడు .డేడాలస్ మానవులకు దూరమై తండ్రికోసం వెతుకుతుంటాడు .ఇదిఆబాల వృద్ధుల  అందరి జీవితాలలో ఉన్న సమస్య యే .దేనికోసమో పరితపించటం అంతు  లేని అన్వేషణ చేయటం .దీనినే జాయిస్ తండ్రికోసం వెతుకులాటగా సింబలైజ్ చేశాడు .తన జీవితం సంగతి చెబుతూనే ఆధునిక మానవుని అయోమయ పరిస్థితిని చిత్రించాడు .

   యులిసేస్ ను ప్రచురించటానికి చాలాముందే సెన్సార్ కత్తి ఝళిపించింది .1918లో అది ‘’ది లిటిల్ రివ్యు ‘’లో ధారావాహికగా వస్తున్నప్పుడే గుసగుసలు సాగాయి .’’గెట్టిమాక్ డేవేల్’’భాగం ప్రచురితమైనప్పుడు అమెరికాలోని ఆశ్హ్లీల సాహిత్య నిరోధక సంఘం రంగం లోకి దిగింది .అమెరికా పోస్టాఫీస్ అన్ని కాపీలను స్వాధీనం చేసుకొన్నది .సంపాదకులకు జరిమానా విధించి ,వ్రేలి ముద్రలు తీసుకొని ధారావాహికను ఆపేయించింది .అతని అభిమాని సిల్వియా బీచ్ ఆ పుస్తాకాన్ని రహస్యంగా ఫ్రాన్స్ లో ముద్రింప జేసి ,మొదటికాపీని జాయిస్ కు ఆయన 40వ పుట్టిన రోజున అందజేసింది .పుస్తకానికి గ్రీస్ కు చెందిన బ్లూ వైట్ రంగుల కవర్ పేజీనిఏర్పాటు చేయించింది .అది జాగ్రత్తగా సేకరించి భద్ర పరచాల్సిన పుస్తకం అయింది .దుకాణాలలో అమ్మారు .మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేసి దొంగాచాటుగానూ  వదిలారు .ప్రముఖ రచయితా డి హెచ్ లారెన్స్ కూ ఆయన రాసిన ‘’లేడీ చాటర్లీస్ లవర్ ‘’నవల విషయం లో ఇలానే జరిగింది .పుస్తకం అయితే అనేక కాపీలు అమ్ముడు పోయి౦దికాని అయ్యగారి చేతిలో  పెన్నీకూడా  రాలలేదు .పోస్టాఫీస్ వారికి దొరికిన అయిదు వందల పుస్తకాలను తగల బెట్టేశారు .అది సీరియల్ దశనుండి పుస్తకం గా రావటానికి మరొక 15 ఏళ్ళు పట్టింది .ఈ కేసు విచారించితీర్పు చెప్పిన జడ్జి జాన్  ఏం . ఊల్సేచెప్పిన వాక్యాలను .’’whilst in some places ,the effect on the reader is somewhat emetic(వాంతిమందు ) ,nowhere does it tend to be an aphrodisiac (నిరోదిన్చాల్సింది కాదు ) ‘’ ప్రపంచమంతా ఘనంగా చెప్పుకొన్నది.జడ్జి ఊల్సే ఆ పుస్తకాన్ని ‘in terms of catharsis ,the purge of the emotions through pity and terror that Aristotle attributes to tragedy ‘’అని విశ్లేషకులు తెలియ జేశారు .

  పుస్తకం పై నిషేధం తొలగినా విమర్శల జడి వానలు కురుస్తూనే ఉన్నాయి .’’ఇంతదరిద్ర గొట్టు ,నీచ పుస్తకం చరిత్రలో లేదు ‘’అన్నారు .అందులో పాక్షిక రాజకీయం ,ద్వేషం ఉన్నాయన్నారు .సమకాలీన సమాజ నిరర్ధకత్వం ,అరాచకం పెద్ద కాన్వాస్ పై చిత్రించాడు అన్నారు .టి ఎస్ ఇలియట్ మాత్రం ‘’సిన్జీ తర్వాత ఇంతఅద్భుతమైన వచనం రాసిన వాళ్ళు లేరు .ఇదొక మహా కావ్యం .మార్మికతను వాడుకొంటూ సమకాలీనతను ,పురాతనత్వాన్ని కలగలుపుగా చిత్రించాడు .దీనితో ఆర్ట్ లో ఒక కొత్త ప్రపంచ౦ వైపు అడుగులు వేయటం సాధ్యంఅయింది  అని జేమ్స్ జాయిస్ రుజువు చేశాడు ‘’అన్నాడు .ఇందులో చాలాభాగం యే హోమర్ రిఫరెన్స్ లేకుండా హాయిగా చదువుకోవచ్చు .అయితే కొన్నిటికి అర్ధం వివరణ లేక పొతే కీకారణ్యం లో ఉన్నట్లు ఉంటుంది .ఇందులో డిసిప్లినేడ్ లాజిక్ ఉందని అన్నారు .పదాల ఆట సయ్యాటలున్నాయి .మైదాలజి ఫిలాసఫీ ,ఎక్కువ మందికి తెలియని గ్రంధాలు ,వి౦త పాత్రలు,అన్యమత నమ్మకాలు ,కేధలిక్ మత ఉత్సవాలు ,రహస్య ,గూఢవిజ్ఞాన విశేషాలు ఉన్నాయి .అందుకే యులిసెస్ ‘’un questionably the most complex ,the most confusing ,and the most learned novel-if it is a novel –in all literature ‘’

  

యులిసెస్ రాయటానికి జాయిస్ కు ఏడేళ్ళు పట్టింది .అమెరికాలో అది చట్ట రీత్యా చదవతగింది అని తేలినప్పుడు జాయిస్ కు 52 ఏళ్ళు వచ్చాయి .కళ్ళు కనిపించకుండా పోయాయి .చని పోయే లోపు పది ఆపరేషన్లు జరిగాయి .ఇవన్నీ ఎనేస్తీషియా ఇవ్వకుండా జరిపారు .అందుకే వేలాది పేపర్లపై పెద్ద పెద్ద అక్షరాలతో రాయాల్సి వచ్చేది .పొడుగ్గా సన్నగా ఉండి ఎక్కడికి వెళ్ళినా వారిని అతి మర్యాదగా పలకరించటం తో ఆయన్ను అందరూ తేలిగ్గా గుర్తు పట్టేవారు .ఆయన ప్రవాస జీవితం అంతా కష్టాలమయమే .మొ ప్ర యు లో ఆస్త్రియాలోని త్రిస్టీనుంచి స్విట్జర్లాండ్ పంపారు .ఎక్కడా ఆయన్ను ఉంచుకోవటానికి ఒప్పుకొనే వారు కాదు .ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాడు .యుద్ధ విరమణ తర్వాత పారిస్ వెళ్లి శాశ్వత శాంతి ఏర్పడుతుందని కలలు కన్నాడు.జబ్బు ,డబ్బులేమి ,కుటుంబ గొడవలు అతన్ని బాధిస్తూనే ఉన్నాయి .పుస్తకాల పై వచ్చే రాబడి అతి తక్కువ .స్నేహితుల అభిమానుల  సాయం మీదే బతకాల్సి వస్తోంది .వచ్చిన డబ్బులో ఎక్కువ భాగం కూతురు లూసీ నరాల జబ్బు నయం చేయటానికే ఖర్చయేది .కొంత భరోసా కలిగిన సమయం లో మళ్ళీ అగాధం లో పడ్డాడు ..1940లోరెండవ ప్రపంచ యుద్ధం లో  జర్మన్ సైన్యం ఫ్రాన్స్ ను ఆక్రమించే ప్రయత్నం చేసినప్పుడు జాయిస్ ,కూతుర్ని కదిలించలేక మిగిలిన వారితో స్విట్జర్లాండ్ చేరాడు .కట్టుకొన్న బట్టలు తప్ప యే ఆధారం లేకుండా వచ్చారు.అమెరికానుంచి వచ్చిన సాయం తో జ్యూరిచ్ చేరారు .

దరిద్రం తో పోరాటం ,వంటరితనం ,త్వరగా పోతున్న కంటి చూపు తో ఉన్నా ,జాయిస్ మరొక వివాదాస్పద ‘’ఫిన్నేగాన్స్ వేక్’’రాశాడు .సరళంగా చక్కని భాషలో రాశాడు .ఇందులో కూడా యెడ తెగని ఆలోచనా స్రవంతి నిఅంటే స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్ ను కొనసాగించాడు .

Inline image 1 Inline image 2 Inline image 3 Inline image 4


       సశేషం

        మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -188 71-చైతన్య స్రవంతి కి ప్రాణం పోసిన –జేమ్స్ జాయిస్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -188

71-చైతన్య స్రవంతి కి ప్రాణం పోసిన –జేమ్స్ జాయిస్

 పుట్టిన దేశం  ఐర్లాండ్  అంటే అమిత భక్తీ ,ఐరిష్ ప్రజలంటేయూరప్ లో ఆలస్యంగా వచ్చిన జాతి అనే  విపరీత ద్వేషం ఉన్నవాడు జేమ్స్ జాయిస్ .స్వయం నిర్ణయం తో జీవితమంతా ప్రవాసం లో గడిపాడు .దరిద్రం, పక్షపాత ధోరణి ,అనారోగ్యం, దాదాపు గుడ్డితనం తో పోరాడుతూబతికాడు .యవ్వన దశలో ఐరిష్ రినైసంస్ అనే సంకుచిత జాతీయత కు వ్యతిరేకంగా ,పోరాడాడు .’’సెల్టిక్ ట్వి లైట్’’ను కల్టిక్ ట్వాలైట్అంటేకృత్రిమ  వస్త్రాలంకరణఅంటూ నిరశి౦చాడు .సెల్టిక్ ఉద్యమ౦ లో ముఖ్యుడైన కవి విలియం బట్లర్ ఈట్స్ తో ‘’మనం చాలా ఆలస్యంగా కలుసుకొన్నాం .నువ్వు నా ప్రభావం పడటానికి చాలా ముసలాడివై పోయావు ‘’అన్నాడు .ఐరిష్ రివైవల్ కు చెందిన మిస్టిక్ సింబాలిజం ,స్థానిక పురాతన గాధలను తిరస్కరించి ,ఒక కొత్త హింసాత్మక భాషను కొత్త సింబల్స్ తో  దానికి చెందిన ధారావాహిక జటిల విషయాలతో  ఒక విస్తృత మైన తికమక పెట్టె ఆధునిక ప్రపంచ పురాణం  రాశాడు.

      అసలు పేరు జేమ్స్ ఆగస్టైన్  ఆలోసియస్ జాయిస్ .2 -2  -1882 న ఐర్లాండ్  రాజధాని డబ్లిన్ దగ్గర జన్మించాడు .తల్లి గొప్ప సంగీత విద్వాంసురాలు .అది భర్తకు చర్చి కి మధ్య విభజన పొందింది .తండ్రి ఏదీ పట్టని , బాధ్యత లేని అందగాడు  .తండ్రి నుంచి తీవ్ర స్వభావం ,సుస్వర గాత్రం వచ్చాయి .తనకు పుట్టిన 17మంది పిల్లలో జాయిస్ తన అభిమాన పుత్రుడు అని చెప్పుకోనేవాడు తండ్రి .అరవ  ఏట జేసూట్ స్కూల్ లో చేరి ,తర్వాత కాన్గోస్ వుడ్ కాలేజి లో 3 ఏళ్ళు చదివాడు .తొమ్మిదో ఏట తండ్రి పొగడ్తలకు ఉబ్బిపోయి ఒక విలువైన అభినందన రాస్తే ,దాన్ని అచ్చు వేయించి తండ్రి డబ్లిన్ అంతా పంచిపెట్టాడు .11వ ఏట మరో జెసూట్ సంస్థకు కు చెందిన బెల్వేదర్ కాలేజి లో  చేరి 4 ఏళ్ళు చదివాడు .ఇక్కడ తానూ రాసిన వ్యాసాలకు బహుమతులు పొందాడు .అందులో ముఖ్యమైనది ‘’నా అభిమాన హీరో ‘’.15వయసులోనే ఆయనకు నిరంతర దేశ సంచారి ,తుఫాను బాధితుడు యులిసెస్ అభిమాన హీరో అయ్యాడు .  

  16 నుంచి 20 వెళ్ళే వరకు యూని వర్సిటి కాలేజిలో చదివి చాలా పవిత్రమైన విద్యార్ధి అనిపించుకొని జెసూట్ ఆర్డర్ లో చేరుదామనుకొన్నాడు .ఇతరభాషా సాహిత్యాలను విపరీతంగా చదవటం తో అభిరుచి మారింది .20 కె లాటిన్ ఫ్రెంచ్ ,ఇటాలియన్ భాషలలో ఇంగ్లీష్ లో లాగానే ప్రావీణ్యం సాధించాడు.ఇబ్సెన్ అసలు సాహిత్యం చదవాలనుకొని నార్వేజియన్ భాష నేర్చాడు.18లో ‘’ఇబ్సన్స్ న్యు డ్రామా ‘’అనే వ్యాసం రాస్తే ప్రముఖ పత్రిక ‘’ఫోర్ట్ నైట్లి రివ్యు ‘’ప్రచురించింది . నార్వేజియన్ నాటక రచయిత ఇబ్సన్ కు జాబు రాసి అందులో ఆయన సత్యా రాదనను ,ఆయన కు కళా నియమాలపై ఉన్న ఉదాసీనతను అభినందించాడు .20 లో డిగ్రీ పొంది ‘’డబ్లిన్ గాంగ్  ‘’తో ఉండటం ఇష్టం లేక డబ్లిన్ వదిలి పారిస్ చేరాడు .’’ఎ పోర్ట్రైట్ ఆఫ్ ఆన్ ఆర్టిస్ట్ అస్ ఎ యాంగ్ మాన్ ‘’రచనలో దీన్ని వివరిస్తూ ‘’నాకు నమ్మకం లేని  నా స్వంత ఇల్లు అయినా పితృ దేశమైనా లేక నా చర్చ్ అయినా  నేను సేవ చేయలేను ‘’అన్నాడు .దీన్ని మరింత చేదుగా దూషణ భాషలోకవిత లో  ఇలా చెప్పాడు  –

‘’This lovely land always sent –her writers and artists to banishment –and in a spirit of Irish fun-betrayed her own leaders ,one by one ‘’.

 పారిస్ కు ఒక సిఫార్సు ఉత్తరం రెండు పూడు పౌండ్లడబ్బు ,  కొన్నికవితలతో తో చేరాడు  .అక్కడ ఏదో ఒక కాలేజి లో మెడిసిన్ చదవాలనుకొన్నాడు ,కాని దానికి ముందే డబ్బు కట్టాలని తెలుసుకొని విరమించుకొన్నాడు .డబ్బు సంపాదించే కవితలేవీ రాయలేక పోయాడు .కనుక చేతిలో పైసా కూడా లేకకడుపు మాడ్చుకొని దాదాపు పస్తులతో గడిపాడు .అతనికి అందుబాటులో ఉన్నది కోకా ఒక్కటే .అదే ఆయన యులిసేస్ లో సంస్కారపర౦గా సింబాలిక్ అయింది .తి౦డిలేకపోతే కండ ఉండదు కనుక జబ్బు పడ్డాడు .విపరీతమైన పంటి నొప్పి బాగా బాధించింది .పంటి చికిత్సకు డబ్బుల్లేవు .ఈ దెబ్బ తిన్న దంతాలవలననే తరువాత కంటి వ్యాధి వచ్చి కళ్ళు కనపడకుండా పోయాయి .ప్రొఫెషనల్ సింగర్ అవుదామని ఉంది .సంగీతపాఠాలు నేర్చుకొందామనుకొంటే గురు దక్షిణ కు గుడ్డి గవ్వ కూడా లేదు .ఆరు నెలల తర్వాత ఇంటికి రమ్మని కబురొచ్చింది తల్లి చావు బ్రతుకుల్లో ఉంది కొడుకును మత ప్రచారకునిగా ఉండమని  కోరితే కాదు పోమ్మందుకు ఆమె జబ్బు మరీ పెరిగి చనిపోయింది

  21 వ ఏడు సందడిగా గడిచింది .పూటుగా తాగి చేత పెన్నీ కూడా లేకుండాచింకి బొంత తో  కొంప వదిలి వచ్చేశాడు .మురికి కూపాల గదులలో బతుకుతూ మారుతూ గడిపాడు .డాల్కీలోని క్లిఫ్తన్ స్కూల్  లో టీచర్ గా చేరి ఇతర భాషలను నేర్వటం మళ్ళీ మొదలు పెట్టాడు .నేషనల్ ఫెస్టివల్స్ లో టెనార్ పోటీలలో పాల్గొని అంతకు పూర్వం జన మెక్ కొమార్క్ లాగా విజయం సాధించాలనుకొన్నాడు .ప్రేక్షకులు ,న్యాయ నిర్ణేతలు ఆతని విధానాన్ని బాగా మెచ్చారు .అతనికే ప్రైజ్ వస్తుందని అందరూ అనుకొన్నారు.  కాని మూడవ పరీక్ష సైట్ రీడింగ్ టెస్ట్ కు తాను  సంగీతం  చదవలేదని కనుక పూర్తీ న్యాయం చేయ లేనని చెప్పి  అంగీకరించలేదు  . రాజీ మార్గం వదిలేసి అక్కడినుండి బయటికి వెళ్ళిపోయాడు .అతని స్వర మాధుర్యం గ్రహించిన ఒక కోచ్ కొద్ది పాటి ఫీజు తో ఒపేరా సంగీతం నేర్పు తానని ముందుకొచ్చాడు .కాని ఆయనతో నిబంధనల గురించి మాట్లాడటానికి ఇష్ట పడలేదు .డాల్కేలో నారా బర్నాకిల్ అనే అమ్మాయిని ప్రేమించి 1904అక్టోబర్ లో పెళ్లి చేసుకొన్నాడు .కొత్తదంపతులు స్విట్జర్లాండ్ చేరారు .అక్కడ అనుకొన్న ఉద్యోగం రాక ,ట్రీస్టీచేరి  బ్ర్లిత్జ్ స్కూల్ లో భాషా బోధకుడు గా కుదిరాడు .

  ఇకపై పాతికేళ్ళ జాయిస్ జీవితం అంతా బాధ ,ప్రవాస చరిత్రే .ఒకదానిపై ఒకటి రోకటి పోట్లే.ముద్రణకు కానీ లేదు .ఆదరణ లేదు .అసంతృప్తి అసహనం ,అనుకొన్నది ఆలస్యంగా జరగటం ,డిప్రెషన్ లతో బాధామయ గాధ అయింది జేవితం .23 లో కొన్ని చిన్న కధలు రాసి ముద్రణకిస్తే  పబ్లిషర్ కు అందులో ఉన్న నేచురలిజం చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పి పుస్తకం పూర్తీ అయినా చేతికివ్వలేదు .మరొకడు ఒప్పుకొని అచ్చువేసి జాయిస్ స్వంతంగా ప్రింట్ చేసుకొంటానంటే జాయిస్ కు అమ్మకానికి కూడా  ఒప్పుకో లేదు .కోపం వచ్చి టైప్ ను ధ్వంసం చేసి కాగితాలను చింపి పారేశాడు .ఇది అచ్చు వేయటానికి పదేళ్ళు పట్టింది .1914లో లండన్ లో ఇదే ‘’డబ్లినర్స్ ‘’గా వెలుగు చూసింది .

  జాయిస్ ముద్రించిన మొదటి పుస్తకం  ‘’చేంబర్ మ్యూజిక్ ‘’కవితా సంపుటి 25 వ ఏట వెలువడింది.ఇందులో శ్లేష ,పరిహాసం ఉన్నాయి .ఈ విరుద్ధ విపరీత ప్రతి వాద కవిత్వ౦  తోనే జాయిస్  గుర్తింపు పొందాడు .ఇది ప్రయోగం కాదు .పూర్తిగా సంప్రదాయమే  .17 వశతాబ్ది గాయకుల ,ఫ్రెంచ్ సింబాలిస్ట్ ల ,విలియం బట్లర్ ఈట్స్ తొలి లిరిక్కుల ప్రతిధ్వనులే ఇవి .దీని తర్వాత రచనలన్నీ తన సృజన ,కొత్త విషయాలతో రాసినవే .మైనర్ ఎలిజబెతేన్ సంగీతం అంటే జాయిస్ కు ప్రాణం . వచనాన్ని వదిలేశాక నలభైలలో మళ్ళీ కవిత్వం రాసి ‘’పోయెమ్స్ ఆఫ్ పెనీచ్ ‘’పేర ప్రచురించాడు .’’డబ్లినర్స్ ‘’అనువాదం .దీనిలోరిపోర్టర్ గా  జాయిస్ ఉంటాడు .తాను  పుట్టిన సిటి డబ్లిన్ లోని విషాద గాధల వివరణ .ఒకరకంగా స్వీయ చరిత్రకూడా .మొదటి మూడు కధలలో తనబాల్యం లో కొన్ని భాగాలున్నాయి .మిగిలినవన్నీ తన సమకాలికుల గర్వం పొగరు దాష్టీకం లపై దయారహిత వ్యాఖ్యానాలే .వ్యంగ్య చిత్రణే.ఇందులోని టు గాలంట్స్ ,ఈవేలిన్ ,కౌంటార్ పార్ట్ ,ది డేడ్ ఎపిసోడ్ లు బాగా ఆలోచింప జేసి యధార్ధాన్ని తెలియ బరుస్తాయి .చివరిది చాలా పదునైన సున్నితమైనకధ.ఇందులో పూర్తీ రియలిస్ట్ ,పూర్తిగా సింబలిస్ట్ గా మారుతాడు  .

 

Inline image 1Inline image 2

          సశేషం

      మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లిబరలిజం తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-4(చివరి భాగం

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -187

70-న్యు డీల్  ,అమెరికన్ లిబరలిజం  తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-4(చివరి భాగం )

రెండవ ప్రపంచ యుద్ధం లోకి7-12 -1941న జపాన్ ప్రభువులు అమెరికాలోని పెరల్ హార్బర్ పై ఆత్మ హత్యా సదృశ పాశవిక దాడులతో ఆక్రమించే ప్రయత్నం లో  అమెరికా బలవంతాన లాగ బడింది .ఇలా చాల దేశాలలో జరిగినా రూజ్ వెల్ట్ దీన్ని ‘’ప్రజలలో విశ్వాసం ఉన్న వారికి నియంతలపై విశ్వాసం ఉన్న వారికి మధ్య జరిగే యుద్ధం ‘’అన్నాడు .చర్చిల్ తో చర్చించి ఐక్య రాజ్య సమితి ఏర్పాటు చేయించాడు .ఉత్తర ఆఫ్రికా పై ఆంగ్లో అమెరికన్ దాడి చేయించాడు .మిత్ర దేశ సైన్యాల పరస్పర సహకారం తో నాజీ నియంతృత్వాన్ని ఎదుర్కొవాలన్నాడు .టెహరాన్ లో మొదటి సారి రష్యా నియంత స్టాలిన్ తో సమావేశమై యుద్ధం లో గొప్ప ముందడుగుకు సిద్ధమై యూరప్ పడమటి తీరం పై విరుచుకుపడి జర్మని సర్వనాశనానికి పూను కొన్నాడు .

  1944లో అన్ని సంప్రదాయాలకు భిన్నంగా నాలుగో సారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశాడు .పూర్వం అంత కాకపోయినా మంచి మేజారిటీతోనే నెగ్గాడు .ప్రజలకు ఆయనపై పూర్తీ విశ్వాసం ఉంది .విపక్షులు కాకి గోల చేశాయి .రిపబ్లికన్ అభ్యర్ధి ధామస్ యి డ్యూయీ కి కేవలం 99ఎలెక్టోరల్ ఓట్లు మాత్రమే వచ్చాయి .రూజ్ వెల్ట్ కు 432 .దేశావ్యాప్తంగా వేలాదిమందితో పరిచయాలు ,మిలియన్ల కొద్దీ  ఆరాధకులు ,ఉన్నప్పటికీ సన్నిహితులు అతి తక్కువ మందే ఉండేవారు .ఆయనపై భారం అధికమైంది .62 ఏళ్ళ వాడు బాగా ముసలాడిగాకనిపిస్తున్నాడు .జుట్టు తెల్లబడింది కవళికలు బలహీనమై  భావ వ్యక్తీకరణ గంభీరమై  ముఖం పాలి పోయింది.ఒంటరివాడై దిగులుగా ఉన్నాడు .యుద్ద౦ ఎలాంటి ముగింపు ఇస్తు౦దోనని ఆందోళన పడుతున్నాడు .శాంతి భయ పెడుతోంది .శాంతికోసం మళ్ళీ యాల్టా లో చర్చిల్ స్టాలిన్ లతో భేటీ వేశాడు .ఈ సమావేశం బాధాకర వివాదాలను ,అనంతమైన వైరుధ్యాలను కలిగించింది . నిందించే వాళ్ళు ‘’బుజ్జగింపులు ‘’,ద్రోహం ‘’,అమ్మేశాడు ‘’అన్నారు .ఈ వ్యతిరేకత ఆయన చనిపోయినా ,డెమొక్రాట్ లు1952లో  ఘోరం గా ఓడిపోయేదాకా ఆగలేదు  .రష్యా సైన్యం పోలాండ్ ను ఆక్రమించి,పడమటి వైపుకు దూసుకొస్తున్నాయి .రూజ్ వెల్ట్ బేరాలు ,ఒడంబడిక లలో మునిగాడు కొన్ని బెడిసి కొట్టాయి .శాశ్వత శాంతి స్థాపన సాధ్యమే నని పూర్తిగా నమ్మాడు కాని అది తప్పు అని తేలింది .యుద్ధం ముగియటానికి ,అతి త్వరగా పూర్తీ అవటానికి తొందర పడ్డాడు .ఒడంబడికలన్నీ రష్యా ఉల్లంఘించింది .దీన్ని రూజ్ వెల్ట్ ముందే గ్రహించి ఉండాల్సింది .కాని ఆయన ఆశతో ,భయం తో పరస్పర అవగాహన ,సౌహార్దత పొందవచ్చు అనుకొన్నాడు .

   కొన్ని వారాల తర్వాత 63వ పుట్టిన రోజున కాంగ్రెస్ కు యాల్తాసమావేశ విషయాలు వివరించి చెప్పాడు .అలసి సొలసి వార్మ్ స్ప్రింగ్స్ కు  మార్చ్ చివరలో విశ్రాంతికి వెళ్ళాడు   .రెండు వారాల తర్వాత ఆయన పోర్ట్రైట్ పూర్తి అయ్యాక అకస్మాత్తుగా ఒక రోజు  విపరీతమైన తల నొప్పి వచ్చి బాధ పడ్డాడు .మరొక మూడు గంటల లోపే సెరిబ్రల్ హేమరేజ్ వచ్చి 1945ఏప్రిల్ 12 సాయంత్రం 5-47గం లకు తుది శ్వాస విడిచాడు .ఈ విషాద వార్తా దేశమంతా వార్తామాధ్యమాల ద్వారా జనాలకు తెలిసింది .అమెరికా మొత్తం అచేతనమై వణికి పోయింది .ఆయనను నమ్ముకొని  ఆయనపైనే ఆధార పడి ఈ 13 ఏళ్ళు జీవించిన మిలియన్ల జనం ఒక్కసారిగా నిశ్చేస్టు లయ్యారు .ఆయన అంత్య క్రియలనాడు ఆబాల వృద్ధ జనం అందరూ ఆపుకోలేని ఏడుపుతో పొర్లి పొర్లి దుఖించారు .ప్రపంచ వ్యాప్తంగా నాయకులు ఒకరినొకరు కలుసుకొని ఊరడించు కొన్నారు .ఆయనకు నలుగురు కొడుకులు ,ఒక కుమార్తె. భార్య అన్నా ఎలినార్ గొప్ప మానవతా వాది,ప్రజాసంబంధాలు బాగా కలిగిన ప్రధమ మహిళ.

  రూజ్ వెల్ట్ పై పన్నీరు చల్లారు బురదాచిమ్మారు .ఆయన పాలనలో కాపిటలిజం బాగా పెరిగిందని ,స్వేచ్చా వాణిజ్యం దెబ్బతిందని,తన క్లాస్ వారిని మోసగించాడని ఆరోపణలున్నాయి .అయినా ఆయన చేసిందిఅంతా  ప్రజా సంక్షేమం కోసమే .అభి వృద్ధి విధానం లో న్యు డీల్ గొప్ప ముందడుగు .సామాన్యమానవుడు అంటే ఆలోచన లేని వాడుకాడని ఆతను ఒక వినియోగ దారుడు అని గుర్తించి గౌరవించిన వాడు రూజ్ వెల్ట్ .ఈ సామాన్య మానవులే వినియోగ దారులుగా ప్రవర్తించక పొతే తన క్లాస్ వాళ్ళు నట్టేట మునిగే వాళ్ళు అంటాడు .కేపిటలిజం అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది అన్నాడు .’’వైట్ హౌస్ లో కుంటాడు ‘’అని శత్రువులు దెప్పినా ,ఆయన్ను అర్ధం చేసుకోన్నవాళ్ళు ఆరాధించారు .ఆయన్నుమరింత హాయిగా జీవించగలిగే  ప్రపంచాన్నిచ్చిన ప్రపంచ  పౌరుడు అన్నారు .స్టీఫెన్ వింసేట్ బెంట్ కవి మాటలలో రూజ్ వెల్ట్ ‘A country squire from Hyde Park with a Harvard  accent –who never failed the people –and whom the people will not fail ‘’

    మాంచి దాటీ వక్త యే కాని గొప్ప రచయిత కాదు రూజ్ వెల్ట్ .వివాదం లో ,అసమ్మతి ప్రకటనలో గొప్పవాడు కాదు కాని గొప్పతనం పొందాడు .దాన్ని ప్రతి సందర్భం లోనూ వికిరణ  కాంతి లాగా ప్రదర్శించేవాడు .ఆయన ప్రతి పాడించిన ’’ ది సమ్మరి ఆఫ్ ఫోర్ ఫ్రీడంస్ ‘’ప్రపంచ వ్యాప్త ప్రచారం పొందింది .’’the first is the  freedom of speech and expression –everywhere in the world .The second is freedom of every person to worship god in his own way –everywhere in the world .The third is freedom from want –everywhere in the world .The fourth is freedom from fear which translated into world terms ,means a worldwide reduction of armaments to such a point  that no nation will be in a position to commit an act of physical aggression against any neighbor –anywhere in the world .That is no vision of a distant millennium .It is a definite base for a kind of world attainable in our own time and generation ‘’అన్న మహోన్నత మానవతా మూర్తిమత్వం రూజ్ వెల్ట్ ది .   రూజ్ వెల్ట్ మైనారిటీల హీరో .ముఖ్యంగా ఆఫ్రో అమెరికన్ ల ,కేధలిక్కుల, జ్యూ ల సంక్షేమాన్ని అమలు చేశాడు .చైనా ,ఫిలిప్పినో అమెరికన్ల అభిమానం ,మద్దతు పొందాడు ,న్యు డీల్ లో వీరందరి అభి వృద్ధికి దోహద పడ్డాడు .ఆఫ్రికన్ అమెరికన్ ల పౌరహక్కులకోసం ప్రయత్నించాడు . అమెరికాలోఉన్నపౌరసత్వం లేని  ఇటలీ పౌరులు ఆరు లక్షలమంది పై  ఉన్న ఆంక్షలను 1942అక్టోబర్ లో తొలగించాడు .లక్షా ఇరవై వేలమంది జపనీయులను వెస్ట్ కోస్ట్ ను వదిలి పొమ్మన్నాడు . Reflecting on Roosevelt’s presidency, “which brought the United States through the Great Depression and World War II to a prosperous future”, said FDR’s biographer Jean Edward Smith in 2007, “He lifted himself from a wheelchair to lift the nation from its knees.

ఆయన హైడ్ పార్క్ నివాసం జాతీయ చారిత్రిక చిహ్నంగా మార్చారు .వాషింగ్టన్ డి సి లో ఏడున్నర ఎకరాలలో ఆయన మెమోరియల్ ఏర్పాటు చేశారు .

Inline image 1Inline image 2

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3 7-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -186 70-న్యు డీల్ ,అమెరికన్ లిబరలిజం తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-3

  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -186

70-న్యు డీల్  ,అమెరికన్ లిబరలిజం  తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-3

   అయినా అమెరికా ఇంకా భయ విహ్వాలతతోనే ఉంది .రూజ్  వెల్ట్ మొదటి బాధ్యత ఉదాసీన ,అనుమాన౦ , నమ్మకం లేని స్థితి నుంచి  ప్రశాంత స్థితి కల్పించటం ‘’.వాస్తవ స్థితులను గమనించి కు౦గి పోకూడదు .ఇలాటి ఎన్నో ఉపద్రవాలను తట్టుకొన్న దేశం ,జాతి మనది ,ప్రతి సంక్షోభం నుంచీ విజయవంతంగా బయట పడింది .ఇప్పుడు మనం భయ పడాల్సింది భయం గురించి తప్ప మరి దేని గురించి కాదు .మళ్ళీ మనం అభివ్రుద్ధిసాధించి ,విజయం తో విలసిల్లుతాం .సమస్యలు చుట్టుముట్టి ప్రగతిని పక్షవాతానికి గురి  చేసింది .దానికి తగిన ట్రీట్ మెంట్ ఇచ్చి మళ్ళీ చైతన్యవంతం చేద్దాం  ‘’అని రూజ్ వెల్ట్ ప్రెసిడెంట్ గా పదవీ స్వీకారం చేసిన రోజు జాతిని ఉద్దేశించి చెప్పి ధైర్యం కలిగించాడు .పదవిలోకి రాగానే విస్తృత యాజమాన్యం తో సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు .అధిక లాభం ,డివిడెండ్ లపై పన్నులు విధించాడు .ప్రభుతోద్యోగుల జీతాలు  పెన్షన్లు తగ్గించాడు  ,బాంక్ లపై కంట్రోల్ కోసం కాంగ్రెస్ అనుమతి పొందాడు .డాలర్ విలువ తగ్గించాడు .దేశం లో ఉన్న బంగారాన్ని అంతా బయటికి తీయించి గోల్డ్ స్టాండర్డ్ కల్పించాడు .

ఇది ఆరంభం మాత్రమే .వాషింగ్టన్ లో ఆర్ధిక వేత్తల ,సైంటిస్ట్ ల ,రచయితల టీచర్ల ,రాజకీయ పండితుల ను సమావేశ పరచి చర్చించాడు .ప్రెసిడెంట్ సరళీ కృత విధానాలను ‘’ది బ్రెయిన్ ట్రస్ట్ ‘’అని హేళన చేశారు .లెక్కచేయలేదు .మూడే మూడు నెలల్లో ఆయనా ,ఆయన తో  ఉన్న మేధావులు కలిసి ‘’న్యు డీల్ ‘’ప్రయోగానికి సిద్ధమయ్యారు .నేషనల్ ఇండస్ట్రి యల్ రికవరీ యాక్ట్ తో సహా అగ్రికల్చరల్ అడ్జెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ,సివిల్ కన్జర్వేషన్  కార్ప్స్ మొదలైన  వాటిని ఏర్పాటు చేశాడు .ఇందులో కొన్ని ఫెయిలయ్యాయి కాని  1933కు అవే అత్యవసరమైనవయ్యాయి .సెక్యూరిటి యాక్ట్ వాల్ స్ట్రీట్ ను నియంత్రించింది .సివిలియన్ కన్జర్వేషన్ కార్ప్స్అరమిలియన్ యువకులకు ఉద్యోగాలు కల్పించింది .హోం ఓనర్స్ లోన్ అసోసియేషన్ తేలికగా తనఖాపై అప్పు సౌకర్యం కల్పించింది .టేనస్సీ వాలీ అధారిటి భూ క్షయాన్ని నివారింఛి పారిశుధ్యం విద్యుత్తూ ,వరద నివారణ లను చేసి దక్షిణ ప్రాంతం లో దరిద్రం లో మగ్గు తున్న వారి పాలిటి ఆశా జ్యోతి అయింది .నేషనల్ ఇండస్ట్రియల్ యాక్ట్ బాలకార్మికులపై నిషేధం విధించి,వస్తువుల ధరలు తగ్గించింది ,అన్యాయపు పనులకు చెక్ పెట్టింది ,ఉద్యోగుల వేతనాలు  పెంచింది  ,పని చేసే చోట్ల అద్భుత సౌకర్యాలు కలిపించింది ,ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో లేబర్ హక్కులను సాధించింది .లేబర్ యూనియన్ ను సంప్రదించకుండా యజమాని ఉద్యోగాలు ఇవ్వరాదనేది అమలైంది .

  వీటితో గొడవ ,పేచీలతో పరిస్థితి  కొంత భయానకమైంది .దాదాపు పత్రికలన్నీ రిపబ్లికన్ ల చేతుల్లో ఉన్నాయి కనుక అవి విషం కక్కాయి  .ఒక పత్రిక కాలం లో న్యు డీల్ ఫాసిస్ట్ విధానం అంది .మరోటి కమ్యూనిస్ట్ విధానం అన్నది .తాను తెచ్చిన ప్రతి కొత్త చట్ట౦ తో వ్యతిరేకులు పెరుతున్నా ,తన సంస్కరణలకే కట్టు బడి ముందుకు కదిలాడు రూజ్ వెల్ట్ .’’సంపద పన్ను ‘  నినాదం ’బాంకర్లను  వాణిజ్య వర్గ స్నేహితులను దూరం చేసింది .కాని ఆయనలో కనిపిస్తున్న మానవతా కార్యక్రమాలకు ప్రజా సమూహాలు విపరీతమైన మద్దత్తు నిచ్చాయి. కనుక రెండవ సారి ప్రెసిడెంట్ గా ఎన్నికవటానికి ఢోకాలేదని పించింది .1936లో నామినేషన్ వేసి ఒక ఇంగ్లిష్ జడ్జి చెప్పిన ‘’necessitious men are not free men ‘’అన్న వాక్యం ఉదాహరించాడు .ఎకనామిక్ రాయలిస్ట్ లనుద్దేశించి ‘’better the occasional faults of a government that lives in a spirit of charity than the consistent omissions of a government frozen in the ice of its own indifference ‘’అని మెత్తని చెప్పుతో కొట్టినట్లు చెప్పాడు .

    రేడియో ద్వారా సామాన్య జనాన్ని’’ఫైర్ సైడ్ చాట్ ‘’’(కుర్చీలో కూని రాగాలు )పేరుతొ తరచుగా   పలకరిస్తూ ప్రతిసారి యాభై వేల మిలియన్ల ప్రజలు రేడియో లో తన ప్రతిమాటా వినేట్లు చేసి మరీ దగ్గరయ్యాడు .ఆయన మాటలు వారిని మంత్రం ముగ్ధం చేసేవి ,అందులోని ప్రతి విషయం వారి గుండెల్లోకి సూటి గా చేరేట్లు చేశాడు తన అత్యద్భుత వాక్చాతుర్యం తో .వివేకం కల రాజకీయ వేత్తగా,తన శక్తి సామర్ధ్యాలను గొప్పగా వ్యక్తీకరించే మహా నటుడిగా ,తన దేశ ప్రజల పాలిటి ఆపద్బా౦ధ వుడిగా ఒక ‘’పెద్దన్న’’ గా వారి మనసులలో నిలిచి ఉండిపోయాడు .ప్రతి ఉపన్యాసమూ ‘’మై ఫ్రెండ్స్ ‘’అంటూ ప్రారంభించి వాళ్ళ మనసుల్ని దోచుకొన్నాడు .వీటన్నిటితో ప్రజలు ఆయనకు సన్నిహితస్నేహితులు అవటమేకాదు వారికి ఆరాధ్య దైవమే అయ్యాడు  .రెండో సారి గెలుస్తాడనే అందరూ అనుకొన్నా మొదటి సారికంటే భారీ మెజార్టీతో గెలవటం అందర్నీ ఆశ్చర్య పరచింది .కాన్సాస్ రాష్ట్ర పూర్వ గవర్నర్ ఆల్ఫ్రెడ్ ఏం లండన్ తో ఈ సారి పోటీ .అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల చరిత్ర లో ఎప్పుడూ రాని భారీ మెజారిటీతో గెలిచి ఏక పక్ష విజయం గా నిరూపించాడు .523 లో 521ఎలెక్టో రల్ ఓట్లు సాధించాడు కేవలం రిపబ్లికన్ లకు అధికబలమైన మెయిన్ ,వెర్మాంట్ లలో ఆ రెండూ పోయాయి .

   రెండవ సారి అధ్యక్షోపన్యాసం లో మొదట దేశపు చురుకైన ఆరోగ్యానికి చేయవలసింది చాలా ఉందని ,దేశం లో మూడవ వంతు ప్రజలు సరైన నివాసం వస్త్రాలు ,పోషకాహారం లేక ఇబ్బంది పడుతున్నారని ,మిలియన్లజనం వ్యవసాయ ,పారిశ్రామిక ఉత్పత్తులను కొనే సామర్ధ్యం లేకుండా ఉన్నారని ,వారి దారిద్ర్యం పనికి దూరం చేస్తోందని ,వీటినన్నిటినీ సరి చేయాల్సిన తక్షణ అవసరం ఉందని చెప్పాడు .ఆశా వివేకం తో రాగల ఉజ్వల భవిష్యత్తును గురించి చెప్పిన మాటలివి ‘’మొదటి సారి గద్దేనేక్కినప్పుడు నేను స్వార్ధం పదవీ వ్యామోహ శక్తుల పై నాపోరాటం అన్నాను .,ఇప్పడు రెండో సారి పదవీ బాధ్యతతీసుకొంటున్నప్పుడు ఆ శక్తులు వాటి యజమానిని కలిశాయి ‘’అన్నాడు .అయన వ్యతిరేకులు దేన్నీ ఉపెక్షించలేదు .విషపు మాటలతో ద్వేషం కక్కారు .’’మాకియవెలేన్ ఈగోయిస్ట్ ‘’అన్నారు .రూజ్ వెల్ట్ తప్పులూ చేశాడు .సుప్రీం కోర్ట్ లో తోమ్మిదిమందికి బదులు 15 మంది జడ్జీలు ఉండాలని కాంగ్రెస్ ను కోరాడు .ప్రముఖ డెమొక్రాట్ నాయకులే దీన్ని వ్యతిరేకించారు .కనుక వోటింగ్ కు రాకుండానే ఈ సూచన చచ్చిపోయింది .ఆయన్ను ఓడించవచ్చుననే నమ్మకం తో రిపబ్లికన్లు ఎదురు తిరిగారు .కాంగ్రెస్ ఇప్పటివరకు ఆయన సూచనను అంగీకరించే స్థితిలో ఉంది కాని దీనివలన ఆయనకు విస్తృత ఎక్సిక్యూటివ్ అధికారాలు లభి స్తాయని , పబ్లిక్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ తో సహా అన్నిటా  ఇష్ట మొచ్చినవారికి కాబినెట్ పదవుల పందారం చేస్తాడని భావించి తిరస్కరించింది .

  దేశం రెండు అతి ముఖ్య విషయాలతో సతమతమై గిలగిల లాడుతోంది .అందులో ఒకటి యుద్ధ ప్రమాదం .రెండవది పాత సంప్రదాయాన్ని కాదని నిబంధనలను తుంగలో తొక్కి ,అన్నిటికి విరుద్ధంగా   రూజ్ వెల్ట్ మూడవ సారి 1940లో  ప్రెసిడెంట్ పదవికి సిద్ధమౌతున్నాడని .మొదటిది రెండోదానికి దారి చూపించింది .చాలాకాలంగా ఇక ప్రెసిడెంట్ పదవి చాలు అనుకొంటూ నే ఉన్నాడు కాని విస్తరిస్తున్న యూరోపియన్ యుద్ధంవలన  తటస్థ దేశమైన అమెరికా కు ఇబ్బందులెదురౌతాయేమో నని ,చికాగో లో డెలిగేట్లు మొదటి బాలెట్ లోనే రూజ్ వెల్ట్ ను నామినేట్ చేశారు .దీనితో అమెరికా రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు జార్జ్  వాషింగ్టన్ ఏర్పరచిన రెండు సార్లు మాత్రమె పోటీ చేయాలనే    సంప్రదాయాన్ని కాదని మూడవ సారి నిలబడటానికి సిద్ధమయ్యాడు .58ఏళ్ళ వయసులో దీన్ని  సమర్ధించు కొంటూ తానూ నియంతగా మారటం లేదని ,అంతర్జాతీయ విపత్తు సమయం లో ,అన్ని పక్షాలవారు ప్రభుత్వానికి బాసటగా నిలవాలని అభ్యర్ధించాడు .

  యుద్ధానికి దేశాన్ని సన్నద్ధం చేయటమే ఇప్పుడు ఆయన ప్రధాన విషయమై పోయింది .నిర్బంధ సైనిక శిక్షణ అమలు చేశాడు .యాభై పాత డిస్ట్రాయర్ లను 99 ఏళ్ళ లీజ్ కు తీసుకొని అట్లాంటిక్ సముద్ర బ్రిటిష్ స్థావరాల వద్ద నిఘా ఉంచాడు .న్యు డీల్ ను పారిశ్రామిక సంస్థలు అధిక తుపాకుల టాంకు ల ,ఆయుధ సామగ్రి  తయారీకోసం  కొంత ఉదారం చేశాడు .దీనితో అమెరికాను ‘’ఆర్సేనల్ డెమోక్రసీ ‘’(సాయుధ ప్రజాస్వామ్యం )గా మార్చాడు .ఇంగ్లాండ్ ఫ్రెంచ్ మిలిటరీ సహకారం పొందాడు .అమెరికాలోని అన్ని జపాన్ ,ఇటలీ నౌకలను స్వాధీనం చేసుకొన్నాడు .గ్రీన్ లాండ్ కు సైన్యాన్నిపంపాడు .ఇంగ్లాండ్ ప్రధాని చర్చిల్ తో అతి రహస్య సమావేశం జరిపి ‘’అట్లాంటిక్ చాప్టర్ ‘’రూపకల్పన చేసి నాజీ నియంతృత్వం నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించి యుద్ధానంతర ప్రపంచం సముద్రాలపై అంతర్జాతీయ స్వాతంత్ర్య౦ ,ప్రజల స్వీయ నిర్ణయ హక్కు ,బలవంతపు దాడులులేకపోవటం  ,ముడి సరుకులను విజేత ,పరాజిత ,నాశనమైన  దేశాలతో సహా అందరూ  పంచుకోవటం ‘’అనే అంశాలకు ప్రాముఖ్యత నిచ్చారు .

Inline image 3

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -185 70-న్యు డీల్ ,అమెరికన్ లిబరలిజం తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -185

70-న్యు డీల్  ,అమెరికన్ లిబరలిజం  తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-2

 

  వివాహ సమయం లో రూజ్ వెల్ట్ కొలంబియా లా స్కూల్ లో చదువుతున్నాడు .రెండేళ్ళ తర్వాత ‘’అడ్మిరాల్టి లా’’(దళాధిపతి చట్టం )ను స్పెషలైజ్ చేద్దామనుకొన్నాడు .బార్ కౌన్సిల్ లో చేరాడు .ఇంతలో తండ్రి చనిపోతే హైడ్ పార్క్ లో ఆతిధ్య బాధ్యతలు చేబట్టాడు ఇక్కడే ఇద్దరు పిల్లలు పుట్టారు .స్థానిక రాజకీయాలలో ప్రవేశించి బలపడి స్టేట్ సెనేట్ కు నామినేట్ అయ్యాడు .ఆయన పేరు మంత్రం ముగ్ధం అయి  విపరీతమైన పేరు ప్రఖ్యాతులొచ్చాయి .రిపబ్లికన్ లకు బలమున్న చోట డెమొక్రాట్ అభ్యర్ధిగా పోటీ చేశాడు .సివిల్ వార్ తర్వాత ఇక్కడి నుంచి ఎన్నికైన ఏకైక డెమోక్రాటిక్ సెనేటర్  రూజ్ వెల్ట్ ఒక్కడే .ఈ సవాలును ధైర్యంగా ఎదుర్కొన్నాడు .నిలువెత్తు మనిషి, నీలి కళ్ళతో అందమైన జుట్టుతో బలమైన ముక్కు, దవడలు తో అందగాడు .’’ఆయన అంత ధన సంపన్నుడు కాక పోయి ఉంటె ,ఆ  పర్సనాలిటీ సినిమా ఇండస్ట్రిని ఏలుతూ ఉండేది ‘’అని న్యూయార్క్ హెరాల్డ్’’ రాసింది .అననుకూల పరిస్థితులలో, ఓడిపోతాడనే జోష్యాలతో ఉక్కిరి బిక్కిరౌతూ కూడా ఏది ఏమైనా గెలిచి తీరాల్సిందే అని నిర్ణయించుకొన్నాడు .ఈ సందర్భం లోనే ‘’there is nothing I love so much as a good fight ‘’అన్నాడు .తీవ్రమైన ప్రచారం తో ప్రత్యర్ధిని ఆత్మ రక్షణలోకి తోసేసి ,వ్యంగ్యం తో,నయనా భయానా బెదర గొడుతూ ,పల్లెలు పట్టణాలు కారులో తిరిగి చుట్టేస్తూ ,ఇదివరకు యే పార్టీ అభ్యర్ధీ తిరగని మారు మూల ఊళ్ళన్నీ చుట్ట బెడుతూ అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ దారికి తెచ్చుకొంటూ న్యు యార్క్ రాష్ట్రం అంతా కలయ  తిరిగాడు .రూజ్ వెల్ట్ కు తప్ప అందరికి ఆశ్చర్యం కలిగే విధంగా గెలిచి తన సామర్ధ్యమేమిటో రుజువు చేసుకొన్నాడు .లా ఫర్మ్ వదిలి ఆల్బనికి చేరాడు .

   స్టేట్ సెనేటర్ గా లిబరల్ దృక్పధం తో పనిచేశాడు.అభివ్రుద్ధికరమైనవాటిని స్వాగతించాడు  .స్త్రీ వోటు హక్కు ఆ నాడు వివాదాస్పదమైనదే అయినా సమర్ధించాడు .ఉడ్రో విల్సన్అభి వృద్ధి  విధానాలను మెచ్చుతూ 1912డెమోక్రాటిక్ సమావేశం లో విల్సన్ నామినేట్ అవటానికి ఎక్కువ కృషి చేశాడు .విల్సన్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాగానే 31 ఏళ్ళ రూజ్ వెల్ట్ ను నేవీ కి అసిస్టెంట్ సెక్రెటరి ని చేశాడు .దీనితో తనుఇన్నాళ్ళు  కన్నకల నెరవేరింది .మొదటి ప్రపంచ యుద్ధం ఆయనకు నౌకారంగం  పై ఉన్న అనుభవం సామర్ధ్యం తెలివి తేటలు ప్రదర్శించటానికి బాగా దోహదమయింది .రహస్యంగా నౌకా సంస్థలను ,సబ్ మేరీన్లను సమర్ధవంతంగా అధ్యయనం చేసి జర్మనీ వాళ్ళ జలాంతర్గాములను తుత్తునియలు చేసే  విధానాలు ప్రయోగించాడు .లెఫ్టినెంట్ కమాండర్ హోదాలో పని చేశాడు .38 వ ఏటవిపరీతమైన ఆర్ధిక మాంద్యం ఉన్న కాలం లో  శాన్ ఫ్రాన్సిస్కో లో డెమోక్రాటిక్ పార్టీ సదస్సు జరిగి౦ది .యుద్ధం లో జయం లభించి౦ది కాని శాంతి నష్ట పోయింది .ప్రెసిడెంట్ విల్సన్ లీగ్ ఆఫ్ నేషన్స్ ప్లాన్  సెనేట్ చేత తిరస్కరింప బడింది  .గుండెపోటు వచ్చి విల్సన్ చావు బతుకుల్లో ఉన్నాడు .ఒహాయో రాష్ట్రానికి చెందిన జేమ్స్ ఏం .కాక్స్ ను రాజీ అభ్యర్ధిగా ప్రెసిడెంట్ పదవికి ,రూజ్ వెల్ట్ ను వైస్ ప్రెసిడెంట్ పదవికి నిర్ణయించారు .ఇద్దరూ కలిసి ప్రచారం చేసినా రూజ్ వెల్ట్ 800కు పైగా ఉపన్యాసాలిచ్చి దున్నేసినా రిపబ్లికన్ అభ్యర్ధులు హార్డింగ్ ,కూలిడ్జ్ చేతుల్లో  ‘’మళ్ళీ యధాస్థితి కి ‘’అన్న వాళ్ళ ఆకర్షణీయమైన స్లోగన్ తో పరాజయం పొందారు .

         ఒక ఏడాది తర్వాత మళ్ళీ ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించి ,పెద్ద ప్రాణాంతక మహా విపత్తుకు గురైనాడు .1921ఆగస్ట్ లో కుటుంబం అంతా కాంప్ బళ్లో ఐలాండ్ లోని న్యు బ్రన్స్ విక్ లోసెలవులు  గడుపుతుండగా  రూజ్ వెల్ట్ ఒక రోజంతా విపరీతంగా బే లోని మంచు నీటిలో ఈతకొడుతూ పూర్తిగా అలసిపోయాడు .చలి ,వణుకు తో జ్వరం  ప్రారంభమై పాక్షిక పక్ష వాతం వచ్చింది .డాక్టర్లు సరిగ్గా రోగ నిర్దారకం చేయక పోవటం తో ‘’పోలియో మైలేటిస్’’వ్యాధికి గురైనాడు .పూర్తిగా వికలాంగుడై ,కాళ్ళను కదల్చలేక బ్రేసులు, క్రచ్ లూ లేకుండా ఒక అడుగు కూడా నడవలేని స్థితికి వచ్చాడు .ఎంతో కస్టపడితేకాని , సహాయకుడు ఎవరైనా ఉంటేకాని కుర్చీలోంచి లేవగలిగే వాడు కాదు  . నిలబడటానికి ఎవరో ఒక ఆసరా లేక ఒక కర్ర  ఉండాల్సోచ్చేది .దీనితో రూజ్ వెల్ట్ ప్రజా జీవితం సమాప్తం అనుకొన్నారు అందరూ .పదవికి పనికి రానని చెప్పి రిజైన్ చేసి హాయిగా హైడ్ పార్క్ ఇంట్లో విశ్రాంతి తీసుకోమని తల్లి సలహా ఇచ్చింది .పరాజయాన్ని రూజ్ వెల్ట్ ఏనాడూ అంగీకరించలేదు .ఒక ఏడాది ఈ బాధ తోనే ఉంది మళ్ళీ తన పని ప్రారంభించాడు .

  జార్జియాలోని వార్మ్ స్ప్రింగ్స్ లో ఒక రిసార్ట్ లోపూర్తిగా మినరల్ సాల్ట్ లు,  ఎక్కువ స్పెసిఫిక్ గ్రావిటిఉన్న   ఒక బేదింగ్  పూల్ ను కనుక్కొని నిత్య స్నానం చేస్తూ మూడేళ్ళకు  బిగుసుకు పోయిన అవయవాలకు కొద్దికొద్దిగా చలనం వచ్చేట్లు చేసుకొన్నాడు .ఆ తర్వాత ఏడాదికి రెండు సార్లు ఇక్కడికి వచ్చేవాడు .ఈ చికిత్స కోసం మిలియన్ డాలర్లలో నాలుగో వంతు  డబ్బు ఖర్చయింది .డబ్బు పెట్టి దీన్ని కొని లాభ నష్టాలు లేని విధానం లో తన లాంటి వ్యాధి గ్రస్తులకు ఉపయోగ పడేట్లు చేశాడు. 42వ ఏట న్యు యార్క్ లో డెమోక్రాటిక్ పార్టీ సదస్సుకు  క్రచేస్ సాయం తో హాజరవ గలిగాడు .నాలుగేళ్ల తర్వాత  ,టెక్సాస్ లోని  హూస్టన్ సభకు క్రచేస్ లేకుండా  తుంటి నుండి పాదం వరకు  స్టీల్ బ్రేసేస్ తో దర్జాగా హాజరై అందర్నీ ఆశ్చర్య పరచాడు .

   1928 లో ప్రెసిడెంట్ అభ్యర్ధిగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఆల్ఫ్రెడ్ స్మిత్ ,న్యూయార్క్ గవర్నర్ గా రూజ్ వెల్ట్ ను ,ఆయన సహాయకుడిగా హెర్బర్ట్ లె మాన్ ను ఎంపిక చేశారు  .తీవ్రంగా జరిగిన పోటీలో స్మిత్ ఒడి పోయి ,రూజ్ వెల్ట్ గవర్నర్ గా ఎన్నికయ్యాడు .ఈ ‘’గూబర్ నేటోరియల్  పోస్ట్ ‘’లో నాలుగేళ్ళు ఉన్నతరువాత1932 ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఎంపికయ్యాడు .ఇంకా కొంతకాలం గవర్నర్ పదవీకాలం ఉంది ,కాని దేశం అతి తీవ్రమైన డిప్రెషన్ లో కొట్టు మిట్టాడు తున్నప్పుడు ఆయన ‘’మరువ బడిన  మనిషి ‘’అని  భవిష్యత్ వాణిగా  చెప్పాడు  .వ్యవస్థ మళ్ళీ వైభవం లోకి రావాలంటే సంస్కరణలు పై నుంచి కాక అట్టడుగు నుంచి ప్రారంభం కావాలని నొక్కి వక్కాణించాడు .’’ఆర్ధిక పిరమిడ్ లో అట్టడుగు మనుషులను మర్చి పోయారని వారి సంక్షేమం దేశ ప్రగతికి గతి అన్నాడు .యాభై వయసులో అయన ఉపన్యాసాలలో దీనినే మరీ మరీ చెప్పి ప్రజల దృష్టికి తెస్తూ ప్రెసిడెంట్ పదవీ ప్రచారం చేశాడు .అమెరికన్ ప్రజలకోసం ‘’న్యు డీల్ ‘’ను అందజేస్తానని ప్రతిజ్ఞ చేశాడు .ప్రతి పౌరుడు బాగా సౌకర్యాలతో ఆర్ధిక పుస్టి తో జీవించాలని అన్నాడు .అమెరికా పారిశ్రామిక వ్యవస్తలు,వ్యావసాయక యంత్రాంగం బాగా ఉత్పత్తి చేస్తూ తగినంత మిగిల్చాలి .ప్రభుత్వ ,ప్రభుత్వేతర సంస్థలు ,రాజకీయ నాయకులు ,ఆర్ధిక వేత్తలు అందరూ తగినంత ఉత్పత్తి చేసి మిగల్చాలి  ..దేశం లో అంతులేని వనరులున్నాయని ,15 మిలియన్ల జనం వీధుల్లో తిండిలేక  అవమానకరంగా అడుక్కు తింటున్నారని ,పూరిగుడిసేల్లో ,అట్టముక్కల ఇళ్ళల్లో ఉంటూ దిక్కూ మొక్కూ లేక బతుకుతున్నారని ,వారి పరిస్థితి దయనీయంగా ఉందని .వీళ్ళందరి జీవితాలలో ఉషోదయం రావాలంటే ధైర్యంగా నిరంతర ప్రయోగాలు చేయాలని ,దీనికి చాలా కామన్ సెన్స్ కావాలని ,ఒక వేళ ఈ ప్రయోగాలలో అపజయం పాలైతే ధైర్యంగా ఒప్పుకోవాలని ,మరొక ప్రయోగం చేయాలని చెప్పాడు .మిలియన్ల మంది పేద ప్రజలు  తమకు రావాల్సినవి తమ దగ్గరకు రాకపోతే ఇక ఉపేక్షిస్తూ ఊరుకొంటారను కొంటె పొరబాటని గట్టిగా అన్నాడు .తమకిప్పుడు ఏం కావాలో ఆయన మాటల్లోనే ‘’we need enthusiasm ,imagination ,and the ability to face facts ,even unpleasant ones bravely .We need to correct by drastic means ,if necessary ,the faults in our economic system from which we now suffer .We need the courage of the young ‘’.

   ఇలాంటి ధైర్య వచనాలు ,నివేదనలు ఆ సమయం లో బాగా ప్రభావం చూపాయి .రూజ్ వెల్ట్ అయస్కాంత ఆకర్షణ వ్యక్తిత్వం ,దేశపు దుస్థితి రూజ్ వెల్ట్ చాలా సరైన దిశలోనే ఆలోచిస్తున్నాడని అర్ధం చేసుకొన్న జనం ఆయన్ను విపరీతంగా ఆరాధించారు అభిమానించారు .ప్రజా బలం తో దేశాన్ని దారుణ సమ్మెలు ,విప్లవ స్థితులనుండి కాపాడాడు .అదొక గొప్ప నాటకీయ సమయమై ఆయనకు బాగా కలిసొచ్చింది .దీని ఫలితంగా అతి భారీ మెజారిటి తో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు .ఎనభై ఏళ్ళ అమెరికా చరిత్రలో ఆరు రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలలోను మెజారిటీ సాధించి న డెమోక్రాటిక్ అభ్యర్ధిగా రికార్డ్ సాధించాడు .హోవర్ కు కేవలం 59 ,రూజ్ వెల్ట్ కు 472 ఎలెక్టోరల్ వోట్లు వచ్చాయి .అదీ రూజ్ వెల్ట్ వీరవిజయ గాధ.

   సశేషం

Inline image 2

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-16-ఉయ్యూరు

   

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -184-

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -184-

70-న్యు డీల్  ,అమెరికన్ లిబరలిజం  తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్

 

‘’మంచి పోరాటం కంటే నాకిస్ట మైంది ఏదీ లేదు ‘’అనే అమెరిక ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ,నాలుగు సార్లు ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి గెలిచి రికార్డ్ సృష్టించిన వ్యక్తీ ..అమెరికన్లు ఆయను ఆరాధించారు ,అలక్ష్యమూ చేశారు .అంకిత భావమున్న క్రుసేడర్ గా అభిమానించారు .వినాశకర నియంతగా తిట్టీ పోశారు .శాశ్వత అంగ వైకల్యం తో విపరీతమైన ఆర్ధిక మాంద్యం ,చరిత్రలోనే భయంకర యుద్ధ సమయం లో  ధైర్య స్తైర్యాలతో నిలబడి ‘’the only thing we have to fear is fear itself ‘’అని జాతికి చాటి చెప్పి సంక్షోభం నుండి గట్టేక్కి౦చినవాడు .

30-1-1882న రెండవ జేమ్స్ రూజ్వెల్ట్ కు ఆయన రెండవ భార్యసారా డేలనో  కు ఏకైక సంతానంగా అమెరికా లో న్యూయార్క్ లోని హైడ్ పార్క్ లో ఫ్రాంక్లిన్ డేలనో రూజ్ వెల్ట్  జన్మించాడు .ఇరువైపుల వారు పూర్తిగా అమెరికా జీవులే .రూజ్ వెల్ట్ లకు కొత్త ప్రపంచం అయిన అమెరికా లో రెండు విధాల అంటే సీనియర్ ,జూనియర్ లైన్ లు గ  పేరు ప్రతిష్ట లున్నాయి .దియోదర్ రూజ్ వెల్ట్ డచ్ జాతి వాడు .వీరిలో మొదటి రూజ్ వెల్ట్ న్యు ఆమ్ స్టర్ డాం కు 1644లోనే వచ్చాడు .జూనియర్ లైన్ లో వచ్చిన ఫ్రాంక్లిన్ డేలనో డచ్ ,ఇంగ్లిష్ ,ఫ్రాన్స్ ,జర్మన్ కొంత స్వీడిష్  మిశ్రమం .అతని తల్లి వంశం-ఫ్రెంచ్ సముద్ర నావికుడు ఫ్రెంచ్ తలిదండ్రులకు లేదేన్ లో పుట్టినవాడు ,అమెరికాలోని మాసా చూసేట్స్ రాష్ట్రం న్యు బెడ్ ఫోర్డ్ లో 1624లో పుట్టిన  ఫిలిప్పి డీ లా నాయ్ కు చెందింది. దీనినే డేలనో అన్నారు .ఇంత ఘన చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రూజ్ వెల్ట్ అమెరికా 32వ ప్రెసిడెంట్ అయ్యాడు .అందుకే ఆయనకు ఓడలన్నా సముద్ర యానమన్నా విపరీతమైన ఇష్టం .

 రూజ్ వెల్ట్ లంటే ఏదో ఒక కుటుంబం కాదు .అదొక రాజ వంశం (డైనాస్టి ).ముఖ్యంగా వాళ్ళు వాణిజ్య వేత్తలు .ఐజాక్ రూజ్ వెల్ట్ సంపన్ను డైన బాంకర్ వ్యాపార వేత్త ,సెనేటర్, రివల్యూషనరి యుద్ధం లో సైనికుడు .ఈయన ముత్తాత తండ్రికి ఫ్రాంక్లిన్ అనే గౌరవనామం ఇచ్చారు అప్పటి నుంచి ఆ వంశం వారందరికీ అది పారంపర్యంగా వస్తోంది .ఈయన మనవడు మొదటి జేమ్స్ రూజ్ వెల్ట్ రిటైర్ అయి ,హడ్సన్ రివర్ తీరం లో డాచేస్ కౌంటి లో హైడ్ పార్క్ లో చాలా ఖరీదైన విశాలమైన ఎస్టేట్ కొన్నాడు .డేలనో లు కూడా సరి సమానంగా భాగ్యవంతులే .ఫ్రాంక్లిన్ తల్లి అందంతో పాటు పెత్తనం ,సంఘ గౌరవ స్పృహ ఉన్నావిడ .తనపై తనకు అత్యంత నమ్మకం ,స్వీయ అభయం ఉదాత్త గుణం తో పాటు ,సర్వ సమర్ధత ఉన్న మహిళ.తల్లి కున్న ఈ లక్షణాలన్నీ వారసత్వంగా రూజ్ వెల్ట్ కు సంక్రమించాయి .ఇతడిని డాబు దర్పం తో పెంచారు .నౌకాయానం అతనికి పరమ ప్రీతికరమైన వ్రుత్తి .కెనడా ,,మైమ్ మధ్య ఉన్న పస్సామా ఖాతం లో ఒంటరిగా స్వంత బోటు ను నడిపేవాడు .15ఏళ్ళు  నిండకముందే యూరప్ కు  10సార్లు తీసుకు వెళ్ళారు .జర్మనీలో నాఔహెల్మ్ లో జర్మన్ భాష నేర్చాడు .అప్పటికే కాస్మోపాలిటన్ యువకుడయ్యాడు .14వ ఏట కాలేజి లో చేరే నిమిత్తం అప్పర్ క్లాస్ గ్రోటాన్ కు తప్పనిసరిగా పంపబడే ప్రయత్నం లో ఉన్నారు .

  గ్రోటాన్ లో స్టూడెంట్ గాకంటే ఇతర వ్యాపకాలపై మోజు పడ్డాడు .అక్కడి కోర్సులు పెద్దగా అభిరుచి కలిగించలేదు .టెన్నిస్ ఆడుతూ ,సముద్ర కధలు చదివాడు.కాని వారానికి మూడు సార్లు అమ్మ దగ్గరకు వెళ్ళేవాడు .ఇప్పడు అది దూరమయింది .16వ ఏట వివాదాస్పద విషయాలపై దృష్టిపడి ,డిబేట్ లలో లిబరల్ అయ్యాడు .ఫిలిప్పీన్ స్వాతంత్ర్యం గురించి ,ఇమ్మిగ్రేషన్ లపై నిబంధనల కు వ్యతిరేకంగా మాట్లాడేవాడు .17 వయసులో అసమ్మతి వాది  అయ్యాడు .తన సహచర గ్రోటేనియన్  మిత్రుల తో విభేదించి అగ్రకుల భూ యజమాని విషయం లో వింత భావాలు ప్రకటించాడు .జాన్ గందర్ తన ‘’రూజ్ వెల్ట్ ఇన్ రెట్రాస్పెక్ట్ ‘’పుస్తకం లో ‘’ఆయనకు స్కూల్ లో చదివే జ్యూ విద్యార్ధి ఎవరూ లేకపోయినా  జ్యూస్ అంటే అభిమానం పెరిగింది .దక్షిణ రాష్ట్రాలలో నీగ్రోల్ కు చదువు నేర్చుకొనే అవకాశాలు లేవని ,వారు విద్యా వంతులు కావాలని ఉపన్యాసాలిచ్చాడు .దక్షిణ ప్రాంతం లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే బోఎర్ల పై సానుభూతి చూపాడు .బోఎర్ల పక్షాన చేరి వారికి నిధులు సమకూర్చి అందజేశాడు .

   రూజ్ వెల్ట్ కు నౌకాయానం పై యెంత పిచ్చి అంటే ,ఒక రోజు ఎవరికీ చెప్పకుండా గ్రోటాన్ నుంచి పారిపోయి నేవీ లో పేరు నమోదు చేయి౦చు కోవాలనుకొన్నాడు. కాని పొంగు జబ్బు సోకి ఆగిపోయాడు .కాని నావల్ అకాడెమి లోఅన్నా పోలిస్ లో గ్రాడ్యు ఏషన్ అయ్యాక  చేరాలని నిర్ణయించుకొన్నాడు  .కాని తండ్రికి కొడుకును తమ వంశంవారందరికి మాతృ విద్యాలయమైన హార్వర్డ్ లో చదివించాలని కోరిక .అలాగే 1900 లో హార్వర్డ్ యూని వర్సిటి లో చేరాడు.18వయసులో రేస్ట్ లెస్ అయి ఫుట్ బాల్ ఆటలో తన టీం కు సరైన శిక్షణ ఇవ్వలేక ,తెడ్డూ,పడవ పుచ్చుకొని దానికోసమే తానూ పుట్టాడేమో అన్నట్లు నీటి  విహారం చేశాడు .అథ్లెటిక్స్ వదిలి జర్నలిజం లో చేరాడు .కాలేజి న్యూస్ మేగజైన్ ‘’క్రిమ్సన్ ‘’లోముఖ్య పదవి దొరికి మేగజైన్ ఎడిటర్ ,ప్రెసిడెంట్ కూడా అయ్యాడు .నాలుగేళ్ల హార్వర్డ్ చదువులోచిన్నప్పటి నుంచి పరిచయమున్న  అన్నా ఎలినార్ రూజ్ వెల్ట్   తో ప్రేమాయణం సాగించి ,చివరి ఏడాదిలో ఎంగేజ్ మెంట్ దాకావచ్చి ,తల్లి అభ్యంతరం తో పెళ్లి 1905వరకు వాయిదా పడి ,ఆయనకు 23 ,ఆవిడకు 20 వయసులో పెళ్లి చేసుకొన్నారు .ప్రెసిడెంట్ దియోడర్ రూజ్ వెల్ట్ వాషింగ్ట న్ నుంచి ప్రత్యేకంగా తన ,దైవదత్త కుమార్తె ,అనాధ అయిన నీస్   వివాహానికి హాజరై వేడుక జరిపించాడు .

 

Inline image 1

సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2 -7-16- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -183

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -183

69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో -5(చివరి భాగం )

  పికాసో చూపిన సాహసం దౌర్జన్యం పై ఏహ్యభావ ప్రకటన ,టెర్రర్ ను రేకెత్తించే చిత్రాలు ‘’గుయెర్నికా ‘’లో ప్రస్పుటంగా తెలియ జేశాడు .కాని అందులోని సంకేతాలు ,రాక్షసులు ,విరిగి పోయిన శరీరభాగాలు ,వక్రీకరించబడిన ఎద్దులు ,అరిచే గుర్రాలను గ్రే ,బ్లాక్ ,తెలుపు రంగుల్లో భయంకరంగా ఉన్నా స్పష్టంగా భావ వ్యక్తీకరణ చేయనట్లు గా చిత్రించాడు .1937లో జరిగిన పారిస్ వరల్డ్ ఫెయిర్  లో పికాసో ప్రదర్శించిన విస్తృత చిత్రాన్ని చాలా నిశితంగా పరీక్షించి తన పుస్తకం లో చాలా పేజీలు  కేటాయించి రాశాడు ఆల్ఫ్రెడ్ హెచ్ బార్ .’’సైన్స్ అండ్ సొసైటీ ‘’లో వెర్నాన్ క్లార్క్ ఉదాహరించిన ‘’గుర్నేకా చిత్రం ఉన్న స్థితిని  అన్నిధోరణుల  పరాకాష్టగా ,కళాత్మక౦గా ,మానసికంగా ,పాత విధానాలపై నిర్మించిన కొత్త విధానంగా ఉంది ‘’అని మెచ్చినట్లు తెలిపాడు .న్యు యార్క్ మెట్రో పాలిటన్ మ్యూజియం అండ్ ఆర్ట్    డైరెక్టర్ ఫ్రాన్సిస్ హెన్రి టేలర్ ‘’బాబెల్స్ టవర్ ‘’సామాన్యాన్ని పెద్ద ప్రకటన గా చెప్పాడు ‘’అని వెక్కిరించాడు .కానిఆంగ్ల  కవి ,రచయితా హెర్బర్ట్ రీడ్ మాత్రం ‘’A monument to disillusion ,to despair ,to destruction .His symbols are  are banal ,like the symbols of Homer ,Dante ,Cervantes .It is a great work of art transcending all schools and categories ,is being born and being born lives  immortally ‘’అని మహా మెచ్చాడు .పికాసో ఒక ప్రపంచ మహా విపత్తు ను సామాన్యుడికి ఇప్పటికిప్పుడు అర్ధమయ్యేట్లు కాని చిత్ర భాష లోరచించాడు .’’ఈ చిత్రం పూర్తిగా తనను తాను వివరించుకోక పోయినా ,దాన్ని తేలికగా అనుకూలంగా రక్షించు కొంటుంది .ఇది సరి పోయేంత డోసులో లేని మహోన్నత చిత్రంకాదు  అన్నవారికిఅది రాబోయే కాలం లో జరిగే అనర్ధాన్ని చాటి చెబుతుంది .బహుశా మనం ఉన్న శతాబ్దం లోనే ఆ వికృత రూపాన్ని చూస్తాం ‘’అన్నాడు బార్ .

1937నుండి పికాసో గీసిన చాలా చిత్రాలు చాలా నిరాశతో భంగ కరం గా ఉన్నాయి .మనం చూస్తున్న అవిటి అనాకారి మానవ రూపాలు ,మానవులు పరస్పర కలహం దౌర్జన్యం ,హింసలతో ఆవిర్భవి౦ఛినవే  ,కావాలని వినాశనం కొని తెచ్చుకొన్నవే .క్రమంగా పికాసో ఉపరితల ప్రదర్శనకు దూరమై ,సామాన్య మానవుడికి అప్పటికప్పుడు అర్ధమయ్యే రీతి లేని విధంగా శక్తి వంతమైన నిగూఢ కళను చేబట్టాడు .సాద్రుశ్యత లేని విధంగా సాంకేతికతతో  భయ విహ్వలంగా ,ముఖం లోపలి భావాలను పికాసో చిత్రిస్తున్నట్లు ,ముసుగువెనక  ఉన్న బుద్ధి ,మనసు లాగా  చిత్రిస్తున్నాడు .కవళికలను పునః పంపిణీ చేస్స్తున్నట్లు ,రేఖాచిత్ర దృశ్యంగా(ప్రొఫైల్) ముఖంకూడా  బాగా కనిపించేట్లు  ముక్కు కన్ను ఉన్న స్థానం లో ,ఉండేట్లు గీశాడు .’’The simultaneity of two different aspects has a distinctive purpose .Picasso hopes to give a feeling of the live and active person  not a static replica –he presents a face with all its complexity ofplanes in motion ,moving not only in space but time ‘’అని వీటికి భాష్యం చెప్పారు .అతని చిత్రాలు వింతగా ,అర్ధం చేసుకోవటానికి వీలు లేనివిగా ఉన్నాయ౦టే ,దానికి కారణ౦ మన విజన్ .మనం ఎప్పుడూ ఒకే దృష్టితో వస్తువులను చూడటానికి ఇప్పటిదాకా అలవాటు పడటం ,ఒకటే విషయాన్ని చూడటమే దీనికి కారణం .అందుకే ఒకేసమయం లో అనేక విషయాలు, పార్శ్వాలు చూసే దిక్సూచి లాంటిది మనకు లోపించటమే.  బ్లేక్ కవి ‘’ఆగరీస్ ఆఫ్ ఇన్నో సెన్స్ ‘’కవిత పికాసో కు బాగా తెలుసు నని పిస్తుంది .ఆ కవితా సౌందర్యం బ్లేక్ మాటలలోనే –

‘’we are led to believe a lie –when we see with ,not through the eyes ‘’కంటి తో చూసిన అబద్ధాన్ని నమ్మటానికి అలవాటు పడ్డాం కాని కంటి లోంచి చూసింది కాదు  .పికాసో చేసిన,చూపిన రెండు ముఖాల తలలతో బాటు మరింత లోతుగా నైరూప్యానికి అన్వేషణ సాగించాడు .ఒక  పీడకల లాంటి ఐరానిక్ నాటకం రాశాడు  .ఇంకా తెగువతో ప్రాజెక్ట్ లను చేయాలని ఆలోచిస్తుండగా రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది .,జర్మన్ సైన్యం పారిస్ ను ఆక్రమించినప్పుడు పికాసో అక్కడే ఉన్నాడు .తన కళ ను దిగజారి పోయిన కళ అని ఈసడించిన నాజీలు ,అతని ప్రాణానికి  ప్రమాదం తెచ్చారు  .పారిపోవటానికి నచ్చ చెప్పుకోలేక పోయాడు ..యుద్ధ కాలమంతా పారిస్ లోనే ఉంటూ శత్రు దేశం తో చేతులు కలిపి పని చేయటానికి తిరస్కరించాడు .దీనికి విరుద్ధంగా తన ‘’గుయెర్నికా ‘’చిత్రాలను అందరికి పంచి పెడుతూ ఆనందిస్తున్నాడు .లిబరేషన్ –విముక్తి తర్వాత క్లాడే, పలోమా అనే ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు .తన వయసుకు 42ఏళ్ళ జూనియర్ అయిన ఆవిడ ద్వారా .ఫ్రెంచ్ రేవేర్రా మీద యాన్టైర్ దగ్గరున్నవల్లారిస్ కు చేరాడు .మళ్ళీ ఆయన ఆర్ట్ మార్పు చెందింది .ఈ పెయింటింగ్ లు కొత్త అత్యుత్సాహం ,కొంత ఉపశమనం మరికొంత తేలిక హృదయం తో .అలరించాయి .నిరంతర అన్వేషణ  సృజన శీలి కనుక లితోగ్రఫీ లో కొత్త టెక్నిక్ ప్రయోగించి ,సరి కొత్త పాత మాధ్యమం పింగాణీని కనిపెట్టి మట్టిని పిగ్మేంట్ ల్లాగా సృజనతో కొత్త ఆకారాలు చేశాడు .నీడింగ్ , వస్తువుల్ని కాల్చటం ,ప్రాచీన ప్లేట్ల మీద ,డేగిసాలమీద గీశాడు .మట్టి కుండల్ని అనేక రూపాలతో చేశాడు .మేక లాంటి జగ్గులు ,స్త్రీ లాంటి జాడీలు ,టీ పాట్ లను పక్షి ముక్కు స్పౌట్స్ (జారే ప్రదేశం )లు తయారు చేశాడు .

   70 వ పడిలో కూడా నిరంతర సృజన శీలి గానే ఉన్నాడు .పూర్తిగా విగ్రహ వినాశకారి అయ్యాడు .1952లో ఒక ‘’మిడటరేనియన్  లాండ్ స్కేప్ ‘’ను దట్టమైన రంగుల కాంపోజిషన్ తో పూర్వం ఎప్పుడూ చిత్రించని విధంగా  భిన్నంగా చిత్రించాడు .’’మాసకర్ ఇన్ కొరియా ‘’మరో కనికరం లేని సమకాలీన భయంకర చిత్రం .1953మే లో అంతకు పూర్వం ఎవరూ చూడని తన ‘’వన్ మాన్ ‘’50చిత్రాల ప్రదర్శనను రోమ్ నగరం లో ఏర్పాటు చేశాడు .ఇవి మ్యూజియం ఆఫ్ మోడరన్  ఆర్ట్ భవనం లో 14 గదులలో అమర్చాడు .విమర్శకులు యదా ప్రకారం అతని కొత్త విధానాలను ఒకటి కాదని వేరొక దానికి మొగ్గటాన్ని విమర్శిస్తూనే ఉన్నారు .ఆయన అభిమానులు ఒక దానిలో పరి పూర్ణత సాధించాకే ఇంకో దానిని స్వీకరిస్తున్నాడని అన్నారు .ఆయన్ను వ్యతిరేకించేవారు ఈ మార్పులన్నీ ఆయన కు సీరియస్ నెస్ ఉద్దేశ్యం లేక పోవటంగా(గాంభీర్య రాహిత్యం గా )  ఆయన విధానానికే తప్ప అర్ధానికి విలువ ఇవ్వటం లేదని దెప్పారు .అయన కళ  ఎప్పుడో అర్ధ రహితమై పోయిందన్నారు .’’మోడరన్ ఆర్ట్ ‘’పుస్తకం లో ధామస్ క్రేవన్ ‘’పికాసో కు జీవితంపై ఆసక్తి లేదు ఆయనకు  యాంత్రిక చిత్ర నిర్మాణమే ఉన్న కళ మాత్రమె కావాలి .తన చురుకైన తెలివిని నిరింద్రియ ప్రపంచం ను  కళా రాహిత్యంగా చేయటానికి శ్రమిస్తున్నాడు .ఆయన కళ పరిపూర్నమైనదే ఎందుకంటె ,అది ఏమీ ఇవ్వదు కనుక .అది స్వచ్చమైనది కారణం అది సంతృప్త మానవ  ప్రక్షాళన  చేస్తుంది కనుక .అది క్లాసిక్ –ఎందుకు అంటే అది చచ్చిపోయింది కనుక .’’అని రాశాడు .

  పికాసో ఇలాంటి ఉడత ఊపులకు జవాబు ఇవ్వలేదు .కాని గుయెర్నికా  లాంటి పెయింటింగ్ లతో ,తన రచనలతో మాత్రమే జవాబిచ్చాడు .ఆయన ‘’artists who live with spiritual values cannot remain in different to the conflicts about them struggles ‘’in which the highest values of humanity and civilization are at stake’’ అని రాశాడు .రూపం అనేదే నిర్హేతుక స్వేచ్చ కలదే అయినా తాను  ‘’నైరూప్యకళ ‘’(ఆబ్స్ట్రాక్ట్ )ఉందని నమ్మనని ,కళ కు ఉన్న లోతైన ధర్మం మానవుని భావోద్వేగాలను సమతుల్యం ,క్రమతలను సాధించటమే ‘’అన్నాడు పికాసో .’’if the subjects I have wanted to express have suggested different ways of expression I have never hesitated to adopt them ‘’అని చెప్పాడు రాతలలో .’’నేను ఎప్పుడు ఏది చెప్పాలను కొన్నా ,దాన్ని నేను అనుభవించిన విధానం లోనే ,చెప్పాల్సిన పద్ధతిలోనే చెప్పాను .విభన్నమైన ఉద్దేశ్యాలు తప్పని సరిగా విభిన్న విధానాలలో చెప్పాల్సిన అవసరం ఉంది .దీనికి పరిణామ క్రియకాని ,లేక అభి వృద్ధి కాని అన్వయించదు.కాని ఒక ఆలోచన కు అనువర్తనం అయి చెప్పాల్సిన దాన్ని అతి విస్పష్టంగా ఆవిష్కరించే  వీలు కలుగుతుంది  .’’అని చెప్పాడు పికాసో .’’painting of his pictures as ‘’the result of  sudden vision ,rather than of calculated manipulation of form ‘’అని విశ్లేషిస్తూ  జేమ్స్ త్రాల్ సోబే చివరగా ‘’he was and remains one of the most extraordinary creators of imagery in the long history of art ‘’అని ముగించాడు .91 వ ఏట మహా చిత్రకారుడు పాబ్లో పికాసో 8- 4 -1973న ఫ్రాన్స్ లోని మొగిన్స్ లో మరణించాడు .

 పికాసో చిత్రకళా సోపానాన్ని చూస్తుంటే మన కృష్ణా జిల్లా గుడి వాడకు చెందిన ఆధునిక చిత్రకారులు శ్రీ ఎస్ ,వి రామా రావు గారు జ్ఞాపక మొస్తున్నారు .ఆయన కూడా చిత్ర కళ లో అనేక ప్రయోగాలు చేసి ,నిరంతర ప్రయోగ శీలియై నైరూప్య చిత్రకళ అవధిని దాటి సుమారు 50 ఏళ్ళనుంచి అమెరికాలో ఉంటూచిత్రకళా లోతులనుతరచి   ‘’ఆధునిక పికాసో ‘’అని పించుకొన్నారు  .మంచి కవి కూడా .తమ కవితలను సంకలనాలుగా తెచ్చారు .ఈ మధ్య ఆరేళ్ళ నుంచి ఢిల్లీ లో ఉంటూ మరొక కొత్త ప్రక్రియ కోసం తపిస్తున్నారు . శ్రీ రామోజీ రావు గారి ఆధ్వర్యం లో నడుస్తున్న ‘’తెలుగు వెలుగు ‘’మాసపత్రిక మే సంచికకు ఇంటర్వ్యు ఇస్తూ ‘’నేను పికాసో కంటే గొప్ప వాడిని ‘’అని స్పష్టంగా చెప్పిన చిత్రకారులాయన .నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు రామారావు సావిత్రి ,శాంతకుమారి నటించి ఆత్రేయ రచన చేసి పెండ్యాల సంగీత దర్శకత్వం చేసిన  శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం చలన చిత్రానికి కళా దర్శకత్వం వహించింది రామా రావు గారే .

ఇప్పుడు పికాసో గురించి మరికొన్ని సంగతులు తెలుసు కొందాం –ఆయన చిత్ర యాత్రలో మొదటికాలం బ్లూ పీరియడ్ .ఇది 1901నుంచి మూడేళ్ళు సాగింది .ఈ కాలం లో బార్సెలోనా ,పారిస్ ల మధ్య తిరిగాడు .ఇప్పుడు గీసిన ‘’ది ఫ్రూగల్ రిపాస్ట్ ‘’లో గుడ్డివాడు కళ్ళున్న స్త్రీ ఉంటారు .ఆయన చిత్రాల్లో గుడ్డితనం పునరావ్రుత్త మౌతుంది .’’బ్లైండ్ మాన్స్ మీల్’’గొప్ప చిత్రం .19 04నుండి 06వరకు ఉన్న రెండవ కాలాన్ని ‘’రోజ్ పీరియడ్ ‘’అంటారు .సర్కస్ జనాన్ని ఆరంజ్ ,పింక్ రంగులలో చిత్రించాడు .హీర్లేక్విన్ అనే హాస్యగాడిని గళ్ళ దుస్తులతో చిత్రించాడు .స్నేహితురాలు భార్య  ఫెర్నాడే ఆలివర్ ను ఈకాలం లో చాలాచిత్రాలలో చూపాడు .లియో గేర్త్రుడ్ స్టెయిన్ ల అభిమానం పొందాడు .1907లో పారిస్ లో డేనియల్ హెన్రి కావీలర్ పెట్టిన ఆర్ట్ గాలేరీలో చేరాడు .

తరువాతది  ఆఫ్రికన్ ప్రభావ కాలం .ఇది 1907నుంచి రెండేళ్ళు సాగింది .ఇదే తర్వాత క్యూబిజం లోకి దారి తీసింది .1909 నుంచి 12వరకు ఉన్నకాలాన్ని అనలిటికల్ క్యూబిజం పీరియడ్ అన్నారు .మోనో క్రోం బ్రౌనిష్ ,న్యూట్రల్ రంగులు వాడాడు .తర్వాత సిన్దేటిక్ క్యూబిజం లోకి ,తర్వాతా కోల్లెగ్ లోకి ప్రవేశించాడు(19 12-19).1911 .లో ఇటలీ చిత్రకారుడు లియోనార్డో డావిన్సి చిత్రించిన పరిసిద్ధ ‘’మోనాలిసా ‘’చిత్రాన్ని దొంగిలించాడని అరెస్ట్ చేశారు .విచారణ జరిగి వదిలేశారు .1915-17మధ్య రేఖీయ చిత్రాలకాలం .స్క్వేర్ కట్ డయమండ్స్ తో ప్రయోగాలు చేశాడు .ఈ కాలాన్ని ‘’క్రిస్టల్ పీరియడ్ ‘’అంటారు .

  1917లో ఇటలీ మొదటిసారి వెళ్ళాడు .నియో క్లాసిక్ చిత్రాలు గీశాడు .1925లో సర్రియలిస్ట్ రచయిత  ఆండ్రే బేటన్ -పికాసో ను తమవాడు అని ప్రకటించాడు .’’దేశ డిమో సిల్లెస్ మొదటిసారిగా యూరప్ లో తిరిగి సృష్టించాడు .సర్రియలిస్ట్ ఎక్సి బిషన్ లో క్యూబిస్ట్ ప్రదర్శన చేశాడు .1930లలో హీర్లేక్విన్ బదులు మినోటార్ను ఎక్కువగా గీశాడు .1935 నుంచి 1959వరకు 24 ఏళ్ళు పికాసో 300కు పైగా కవితలు రాశాడు 1949లో మూడవ అంతర్జాతీయ శిల్ప సదస్సు ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో జరిగింది .ప్రపంచ వ్యాప్తంగా 250మంది శిల్పులు పికాసో తో  సహా పాల్గొన్నారు .మళ్ళీ శైలి మార్చాడు .చికాగో లో 50అడుగుల ఎత్తు ఉండే విగ్రహాన్ని  నిర్మించటానికి పికాసోను ఆహ్వానించారు .దాన్ని ఇప్పుడు ‘’చికాగో పికాసా ‘’అంటారు .ఆయన జీవితం చివరలో చేసినవన్నీ మిశ్రమ శైలికి చెందినవే .

  జీవితకాలం లో పికాసో యాభై వేల పనులు చేశాడు  .అందులో 1885 పెయింటింగ్ లు ,1228శిల్పాలు ,28 80 సిరామిక్స్ ,సుమారు 12వేల డ్రాయింగ్ లున్నాయి  . రంగును భావ వ్యక్తీకరణకు బాగా ఉయోగించిన వాడు పికాసో .పెయింట్ లో ఇసుక కూడా కలిపి రావాల్సిన ఎఫెక్ట్ సాధించాడు .అయన క్యూబిక్ విధానం ఆబ్స్ట్రాక్ట్ పద్ధతిలోకి దారి తీసింది .ఆయనది ‘’అతి విశాల చిత్ర స్వీయ చరిత్ర ‘’(వాస్ట్ పిక్టోరల్  ఆటో బయాగ్రఫి ).ఆయన చిత్రాలు అత్యంత ఎక్కువ ఖరీదుకు అమ్ముడయ్యాయి .’’గార్కాన్ ఆ లా పైప్ ‘’చిత్రం 104మిలియన్ డాలర్లకు లండన్ లో  అమ్ముడయి రికార్డ్ సృష్టించింది .20 16 జూన్ 21న ‘’ఫెమ్మి అస్సేస్సే ‘’చిత్రం 43 .2మిలియన్ డాలర్లకులండన్ లోని సౌత్ బె లో  కొన్నారంటే ఆయనపై అభిమానం ఈనాటికీ యెంత ఉందో తెలుస్తోంది  .అదీ పాబ్లో పికాసో చిత్ర విజయం ..

Inline image 1Inline image 2Inline image 3Inline image 4

ప్రఖ్యాత గుయెర్నికా చిత్రం 

 సశేషం                                చికాగో లో 50అడుగుల పికాసో చేసిన శిల్పం  

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలెగ్జాండ్రియా గ్రంధాలయం – మిసిమి – గబ్బిట కృష్ణ మోహన్

 

77

 

 

 

 

79

 

 

 

 

78

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -182

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -182

69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో –4

34వ ఏట రియలిజాన్ని వదిలేసిన పదేళ్లకు ఒక్క సారిగా మళ్ళీ వెనక్కి మళ్ళి ,అతి జాగ్రత్తగా తన స్నేహితుల, సహాయకుల నేచుర లిస్టిక్ గ్రాఫిక్ పోర్ట్రైట్ లు గీశాడు .’’ఈ క్లాసిక్ పీరియడ్ ‘’రోమ్ కు వెళ్లి విస్తృత పరచాడు .అక్కడ ‘’పెరేడ్ ‘’అనే ఒక బాలెట్ కు కర్టెన్, స్క్రీన్ ,కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు .దీన్ని సెర్జీ డయాఘిలేవ్ నిర్మిస్తే ఎరిక్ సాటీ సంగీతం సమకూర్చాడు .అక్కడ స్ట్రావేన్స్కిఅనే కంపోజర్ ను కలిసి ఆయన ‘’రాగ్ టైం ‘’ కవర్ కు స్కెచ్ వేశాడు .రష్యన్ బాలెట్ బృందం తో బాగా ఉల్లాసంగా గడిపాడు .వారితో రిహార్సల్ లను రోమన్ సెల్లార్ల  లో  చేస్తూ రాత్రి వేళ చంద్రకాంతిలో తిరుగుతూ నేపుల్స్ ,పాంపీలు తిరిగి చూస్తూ ,ఆ ట్రూప్ లో డాన్సర్ యువతి వోల్గా కొక్లోవా ను పెళ్లి చేసుకొని ,పాల్ అనే కొడుకుకు  జన్మ నిచ్చాడు .మూడేళ్ళ వయసులో తీవ్రమైన కాంక్ష కళ హాస్య గాడిగా ఒకటి ,నాలుగో ఏట అందమైన ఆకర్షణ,కొద్దిపాటి విచక్షణ తో ఫ్రెంచ్ పాంటోమైమ్ లోని విచార పాలిపోయిన ముఖం ,వదులైన తెల్లటి బట్టలతో పాయి౦టెడ్ హాట్ పెట్టుకొన్న వాడిగా   ఒకటి  మొత్తం రెండు కొడుకు పాల్ చిత్రాలను చిరస్మరణీయంగా చిత్రించాడు తండ్రి పికాసో .  ముప్ఫై లలో ఎప్పుడూ పికాసో పరిణతి చెందినవాడిగా కనిపించాడు .కాని యే శైలికి కట్టు బడక ,నైరూప్య (ఆబ్ స్ట్రాక్ట్ ), క్యూబిక్ నమూనాలు ,అలంకరణ ఉన్న లాండ్ స్కేప్ ,సున్నిత లైన్ డ్రాయింగ్ చిత్రాలు గీస్తూ ‘’ఇంగ్రేస్ ‘’చిత్రకారుని నాజూకు ,సొంపుతో తో పోటీ పడే చిత్రాలు తయారు చేశాడు .

  ముప్ఫై ల చివరలో పికాసో ‘’నియో క్లాసికల్ పీరియడ్ ‘’ప్రారంభమైంది .సెమి ట్రాపికల్ ఫ్రెంచ్ రేవేరాలో ఉంటూ పూల ముక్కల్ని పరిణతి చెందింప  జేస్తూ ,పండ్లను 17 ,18 శతాబ్దాలనాటి యూరోపియన్ ఆర్కిటెక్చర్ లాఅమరుస్తూ ,వస్తువులను ఆకర్షణ తోకళకళ లాడేట్లు గుండ్రంగా ,అసలు ఇది వరకు ఎప్పుడూ క్యూబ్ ను చూడని వాడిలాగా మెస్మరైజ్ చేశాడు .నలభైలలో అతని చిత్ర రూపాలు హీరోయిక్ సమతుల్యత తో గీశాడు .మొదటి ప్రపంచ యుద్ధం  అనంతర పరిణామాలు పికాసోను మళ్ళీ పూర్వపు మానవత్వ భావాలకు చేర్చాయి.అనేక సార్లు గీసిన ‘’వుమన్ ఇన్ వైట్ ‘’ఇప్పుడు సున్నితంగా కొంతవరకు  అభివ్యక్తీకరణంగా  ఉన్నాయి  .  కాని అందులో ఎక్కువ భాగం పురాతన శిలను నరికి మలచినట్లు ఉండేవి .అవి ద్రుఢత్వం  లో క్లాసికల్ గాఉండటమే కాక ఆవి విషయం  కంటే రూపానికి ప్రాధాన్య మిచ్చి నట్లు ఉండేవి .అంతేకాదు హుందా ,గౌరవం కలబోసినట్లు ఉండేవే కాని రొమాంటిక్ ప్రయోగాలతో ఏర్పడ్డవి కాదు .ఈ పికాసో పెయింటింగ్ లను ‘’Monumental ,impassive ,immovable are a few of the adjectives with which the critics described the heavy –limbed sculptural paintings ‘’.‘’

  తరువాత 12 ఏళ్ళలో పికాసో అనేక రూపవిక్రియ లకు( మెటామార్ఫసెస్ )లోనైనాడు .వైర్ లతో తుప్పు పట్టిన ఇనుము ,కొయ్య లతో  నిర్మాణాలు చేశాడు .సర్రియలిస్టిక్ కవిత్వం రాశాడు .శిల్పకళ లో ప్రవేశించి ,అతి పెద్ద తలకాయలు ,జంతువులను రూపమార్పిడిచేశాడు .స్మారక చిహ్నాల ప్రాజెక్ట్ లు చేబట్టాడు .నైరూప్య వరదలో నుండి బయటపడి హింసాత్మక ,తిరుగు బాటు ధోరణి తో ,అవాంచనీయ లక్షణాలతో ,గాఢమైన అలజడితో సరసమైన సొగసైన ఒంటికాలిపై నిలబడి ,రెండవ కాలు సమాంతరంగా జాపినట్లున్న కేవలం ఆనందం కలుగ జేసే డిజైన్ లను రూపొందించాడు .అంటే ఇప్పుడు పికాసో ప్రవహించే గీతలో అందాన్ని దర్శింఛి ఆ వైపుకు తన దృష్టిని కేంద్రీకరిస్తున్నాడన్న మాట .దీనిలో ఆకృతిని దాటి అర్ధం లేదని లేక ఆక్రుతే పరమార్ధమని అదే పరిపూర్ణ మైన రూపం అని భావించాడు .

   స్పానిష్ సివిల్ వార్ పికాసో యాభైలలో ఉండగా వచ్చింది .యుద్ధ సన్నద్ధమౌతున్న లాయలిస్ట్ ల తో స్పెయిన్ లో ఉన్నాడు .ఆయన్ను యుద్దోత్సాహం లేని ,ఫ్రాన్స్ లోనివసిస్తున్న  స్పానియార్డ్ గా మొ ప్ర.యు కాలం లో భావించారు .ఇప్పుడు ఆయన రాజకీయాలకు దూరంగా  ఉన్నా , .ఫ్రాంకో నాయకత్వం వహిస్తున్న నిరంకుశత్వ తిరుగు బాటు దారులకు ,వారి మిలిటరీ క్రూర విప్లవ భావాలకు ఎదురు నిలిచి పోరాడుతున్న రిబలికన్ ప్రభుత్వానికి పికాసో మద్దతు చూపే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు .మాంచి ప్రచార కర్తగా దూసుకు పోతూ ‘’పారడో’’కు డైరెక్టర్ అయి మ్యూజియం లోని విలువైన వస్తువులు దుండగుల చేతుల్లో వినాశనం కాకుండా కాపాడ గలిగాడు .అందుకే ఆయన ‘’painting is not done to decorate  apartments .It is an instrument of war for attack and defense against the enemy ,against brutality and darkness ‘’అని అన్నాడు ..నాజీ విమానాలు స్పానిష్ ఫాసిస్ట్ లతో చేతులు కలిపి గ్యూర్నికాలోని ప్రశాంత బ్రాస్క్యు టౌన్ పై బాంబుల వర్షం కరిపించి తుడిచి పెట్టేసినప్పుడు పికాసో అందరూ భావించినట్లుఅతని సర్వోత్కృష్టమైంది కాకపోయినా అత్యంత భావాత్మకవ్యక్తీకరణమైన  ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్నాడు .300 చదరపు అడుగుల అతి పెద్ద కేన్వాస్ మీద యుద్ధపు క్రూరత్వాన్ని,ముఖ్యంగా ఇప్పడు జరుగుతున్నా యుద్ధ అనాగరకత్వాన్ని   నిరశిస్తూ రాశాడు .తన భావాలను తెలియ బరుస్తూ ‘’The Spanish struggle  is the fight of  reaction against the people ,against freedom ‘’అన్నాడు .పెయింటింగ్ లో ఉండి’’నా జీవితమంతా కళాత్మకమే ,ప్రతిక్రియపై ,కళ మరణం పై నిరంతర సమరమే . మిలిటరీ కులం స్పెయిన్ దేశాన్ని బాధా మరణ సముద్రం లో ముంచేసింది అని నేను విస్పష్టంగా నా అసహాయతను వ్యక్త పరుస్తున్నాను ‘’అని చెప్పిన ప్రజాభిమాని పికాసో .

Inline image 1

            సశేషం

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1- 7 -16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”మునిగిపోతున్న బల్లకట్టు ”శ్రీ ఏ వి రెడ్డి శాస్త్రి గారి ఉత్తరాంధ్ర కధ -నా కంఠ స్వరం తో

Ballakattu

”మునిగిపోతున్న బల్లకట్టు ”శ్రీ ఏ వి రెడ్డి శాస్త్రి గారి ఉత్తరాంధ్ర కధ -నా కంఠ స్వరం తో

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -181 69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో -3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -181

69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో -3

   అన్నీ విసర్జించే  ప్రయత్నం లో వస్తు నిర్మాణం కంటే వాటి కారక అంశాలకు సంబంధించిన సూత్రాలను  స్థాపించే ప్రయత్నం లో ఉన్న పికాసో పూర్వపు రూపం కోసం వస్తువుల ఆకారం మార్చి ,పూర్వపు బలమైన రంగుల్ని వదిలేసి పొడిలక్షణాలను ,విలక్షణమైన ఆకర్షణ ను కలిపించాడు .దీనికోసం కోల్డ్ గ్రే ,ఆకర్షణ లేని బ్రౌన్ పాలిపోయిన సా౦డోయిష్ ఎల్లో బ్రౌన్,స్తబ్దత గా కనిపించే 19వ శతాబ్దిలో మోనో క్రోం ఫోటోగ్రాఫ్ లలో వాడిన రెడ్డిష్ బ్రౌన్ రంగులను ఉపయోగించాడు .తీవ్రత అంచులదాకా వెళ్లి ,తన వస్తువుల నుండి సారాన్ని పీల్చి స్వచ్చ మైన రూప కల్పనను కాపాడుతూ చిత్రించి ,అస్తవ్యస్తత తో పోగు చేసిన అనవసర వివరాలకు స్వస్తి చెప్పాడు .నిశిత కోణ రూప భేదాలను ,అవి ఎలాంటి అక్రమ ప్లాస్టక్ ప్లేన్ లైనా ,పికాసో అనాటమీ ని అతి శాస్త్రీయంగా భాగాలుగా విడగొట్టిఆపరేషన్ విజయవంతం అయినా  ,తరచుగా వ్యక్తీ  బతక నట్లు ప్రయోగాలు చేశాడు .సమాంతర ,నిలువు లకు ముసుగేసి అసలు వస్తువే దాదాపు కనిపించకుండా పోయేట్లు చిత్రించాడు .అందులో ఒక సలహా  ,అస్పష్ట సూచన  ,ఉండి   ధీం అంటే నేపధ్యం వైవిధ్య సంక్లిష్ట త తో  ఒక ‘’ఐడియో గ్రామ్’’లాగా మారి పోయేట్లు చేశాడు.The true Picassophile  divides this period into proto –cubism ,analytical cubism ,hermeti ccubism ,synthetic cubism ,-there is even a completely contradictory  but solemnly announced ‘’curvilinear cubism ‘’.ఇన్ని విధాలుగా ఆయన చిత్రకళ రూపాంతరం చెందింది .అన్నీ ప్రయోగాలే .ఎందులోనూ అసంతృప్తే .అందుకే ప్రయోగాలమీద ప్రయోగాలు అంతులేకుండా చేశాడు పికాసో .

   తన అభి వృద్ధి గురించి అతి తక్కువగా పికాసో వివరించేవాడు .క్యూబిజం కు దాదాపు బానిస అయ్యానని సమర్ధించుకొనే వాడు .1923మే నెలలో ప్రచురితమైన ‘’ది ఆర్ట్స్ ‘’పత్రికలో ‘’క్యూబిజం మిగిలిన యే రకమైన పెయింటింగ్ కంటే తేడా ఉన్నది కాదు  .అవే సూత్రాలు అవే మూలకాలు ఇందులోనూ ఉన్నాయి .నిజానికి క్యూబిజాన్ని ఇవాల్టి వరకు ఎవరూ అర్ధం చేసుకో లేక పోయారు .కొంతమందికి అందులో ఏమీ కనిపించలేదు .ఏమీ లేదు అన్నారు కూడా .నేను ఇంగ్లీష్ చదవ లేను .ఇంగ్లీష్ పుస్తకం నాకు బ్లాంక్ పుస్తకం .దీనర్ధం నేను ఎవరిపైనో నింద వేస్తున్నాననికాదు విమర్శిస్తున్నానని కాదు . లెక్కలు ,కేమిస్ట్రి,ఫిజిక్స్ ,సైకో అనాలిసిస్ ,మ్యూజిక్ మొదలైనవి నాకు అర్ధం కానంత మాత్రాన అవి క్యూబిజానికి సంబంధించినవి  కావు అనటాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నాను .ఇదంతా సాహిత్యమే .సిద్ధాంతాలతో ప్రజలకు అంధత్వం ,చెడుఫలితాల నిచ్చినంత మాత్రాన  అర్ధం పర్ధం లేనిది అనటం అర్ధం చేసుకోలేక పోతున్నాను .క్యూబిజం తనను తాను పెయింటింగ్  హద్దుల్లో ఉంచుకొని ,ఎప్పుడూ దాని హద్దు దాట నని అది మభ్య పెట్టలేదు . .విషయం ,రూపాలను గతం లో విస్మరించగా మేము పెయింటింగ్ లలో పరిచయం చేసిన వస్తువులు తేడాలుగా ఉండవచ్చు .పరిసరాలను  మా కళ్ళు  మెదడూ  ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి .’’అన్నాడు పికాసో .తన కళ్ళు  ఎప్పుడూ తెరుచుకొని ఉండటమే కాదు పికాసో తన విమర్శకులను ఒక అత్యున్నత వివాద వైరుధ్యాలలో పడేస్తూ  20ఏళ్ళు దాటగానే’’ లెజెండ్’’ అని పించుకొన్నాడు .30 వ ఏట తన 84 చిత్రాలతో 1911 ఏప్రిల్ లో అమెరికాలో ఏక వ్యక్తి  ప్రదర్శన నిర్వహించాడు  .

   క్యూబిజం తో ఉన్న ఆర్ట్ అంతా ఖర్చు చేసి ఆగిపోలేదు .అంతకన్నా మరింత తీవ్రమైన ప్రయోగాలు చేశాడు .కొంతకాలం ‘’కోల్లెజేస్ ‘’తో ఆడు కొన్నాడు .కోల్లెజేస్ అంటే ఫోటోగ్రాఫ్ లు ,కాగితం ముక్కలు,గుడ్డ ముక్కలు  మొదలైన అనేక రకాల వస్తువులను ,ఆర్టిస్టిక్ గా అంటించటం .అలాగే ఉపరి తలాలపై పేపర్ ,మొదలైన వస్తువులను ఒకదానిపై ఒకటి ఇష్టమొచ్చినట్లు అతికింఛి ,వాటిపైకాని వాటి చుట్టూ కాని పెయింట్ చేయటం చేశాడు .అంటే అతి సామాన్య వస్తువుల నుంచి అందాన్ని రేకేత్తించటం ,చేశాడు .న్యూస్ ప్రింట్ పై ,తాడు ముక్కలపై ,లినోలియం అంటే లిన్ సీడ్ ఆయిల్ ,పౌడర్డ్  కార్క్ లను కాన్వాస్ పై దట్టంగా అంటించటం  సాండ్ ,క్లాత్ ,గ్లాస్,గుర్తించలేని విధంగా కొయ్యను ,షీట్ మ్యూజిక్ అంటే ప్రింటెడ్ మ్యూజిక్ ను చార్కోల్ ,ఇంకు లేక ఆయిల్ లతో కలిపి అతికించటం చేశాడు .ఇదంతా కోల్లెజ్ టెక్నిక్ .ఇది ఒక సరళీకృత మోజాక్ .నేత విధానంకు ప్రాధాన్యమిచ్చి ,అతి సాధారణ చెత్తా చెదారం ను మిశ్రమం చేసి అపూర్వ ,అసాధారణ ,అవాస్తవిక అందాన్ని చేకూర్చి ఒక రకంగా ‘’పెయి౦టర్స్ పార డాక్స్ ‘’(చిత్రకారుని విరుద్ధత )ను వింత ,విలక్షణ అందమైన నిరాడంబర రూప కల్పన చేశాడు .

Inline image 1Inline image 2Inline image 3Inline image 4

      సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30 -8-16- ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -180

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -180

69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో -2

సర్కస్ ఆటమాత్రమే కాదు అది చేసేవాళ్ళ జీవితాలపై అభిమానం ;అధ్యయనం పికాసో జీవితాన్ని మలుపు తిప్పింది .వీరిపై కళా ఖండాలు అనదగ్గ చిత్రాలు గీశాడు .అందులో బఫూన్లు విషాదంగా కనిపిస్తారు .అప్పటిదాకా ఉపయోగించిన బ్లూ కలర్ ను వదిలేసి రోజ్ కలర్ లో కి దిగాడు .లేకపోతే పింక్ కలర్ వాడాడు .దీనివలన భౌతిక అందం తగ్గి౦చాదు .హాలండ్ వెళ్లి వచ్చాక బ్లూ పీరియడ్ ను వదిలేసి గుండ్రని రమ్యాక్రుతులు ,రక్తం మాంసం తోఉన్న ,వయోరహిత ఔన్నత్యాన్ని కలిపించాడు .ఇదంతా ఇంకా 25 దాటని కుర్ర చిత్రకారుని ప్రతిభ .రిల్కీ చిత్రాల్లా సగం కాంతి తో నిత్య వాస్తవికతకు దూరంగా ఉండేవి .తీవ్రంగా ఉన్నా ప్రశాంత ఆహ్లాదంగా కనిపించేవి కాని అవి వ్యక్తీకరణ లేనట్లు ఉండేవి .శైలి కోసం ఆయన పడుతున్న ఏక మానసిక స్థితి గుర్తించాం అన్నాడు. ‘’మారిస్ రేయ్నాల్ ..సంప్రదాయంగా ఉన్న అన్ని సరిహద్దుల్ని అధిగమించి కొత్త క్లాసిజం వైపు అడుగులేస్తున్నాడు .దీనితో అత్యంత ఖచ్చితత్వం వచ్చింది .అతని రోజ్ పీరియడ్ లో వచ్చిన కూర్పులు పెయింటింగ్ లో ఉత్తమమైనవి ,మాస్టర్ పీస్ అనిపించుకోన్నవాటికి పోలిక లో సరి పోతాయి .

    25ఏళ్ళకే పికాసో సుస్థిర చిత్రకారుడైనాడు .ఆయన చిత్రాలను కొనటం ,వాటిపై గొప్ప వ్యాఖ్యానాలు చేయటం వంటివి ప్రఖ్యాత చిత్రకారుడు విమర్శకుడు అయిన జేర్త్రూడ్ స్టెయిన్ లాంటి వాళ్ళు చేశారు .రష్యన్ డీలర్ సెర్జీ శేకిన్ 50 పెద్ద కాన్వాస్ లు కొన్నాడు.తన చిత్రాన్ని గీయటానికి పికాసో దగ్గర మోడల్  గా ఎనభై సిట్టింగులు ఇచ్చానని స్టెయిన్ చెప్పింది .దాదాపు చిత్రం పూర్తీ అయిందికాని అది పికాసో కు నచ్చక ముఖాన్ని చెరిపేశాడు .కొంతకాలం ఎక్కడెక్కడో తిరిగి వచ్చి మోడల్ లేకుండానే ముఖ కవళికలను గొప్పగా చిత్రించాడు .వస్తువు ను చూసి చేయటం కంటే ఇమాజినేషన్ తో చేయటం దీనితో ప్రారంభించాడు .

  ‘’వైల్డ్ బీస్ట్ ‘’లని పిలువ బడేమాతిస్సే ,రౌవాల్ట్ ,వ్లామింక్ ,డిరైన్  మొదలైన అతని  పెర్షియన్ స్నేహితుల చిత్రాలు పికాసో లో ఆలోచనలు రేపి స్వయం ప్రతిపత్తిగల కళ ను సృస్టించే అవకాశం ఉంది అనే  భావన కలిగింది .అప్పటికి ఇంకా ప్రాతి నిధ్యాన్ని వదిలి పెట్టటానికి సిద్ధంగా లేడు . ప్రధానమైన బహుశా పూర్తిగా చిత్ర సంబంధ మైన ‘’కళ కళ కోసమే ‘’అని నిందించిన దానికి మరింత అనువర్తనం గా ,సహజానికి విరుద్ధం కాకుండా ,యదార్ధం కానట్లుగా ఉండే వక్రీకరించని ,సృజనాత్మక  కళను  పికాసో ఊహిస్తున్నాడు .అతని స్నేహితులు ఆఫ్రికన్ నీగ్రో ల మాస్క్ లు ,కొయ్య శిల్పాలుకనుక్కొంటే పికాసో పదునైన కోణాలు ,ఆకస్మిక స్తరాలు(ప్లే న్స్),నాటకీయ,జ్ఞాన శూన్య క్రౌర్యం తో  వక్రీకరణల  పై మోజు పడ్డాడు .అవన్నీ ఈస్తేటిక్ షాక్ ఇచ్చాయి .సంప్రదాయ కళను  ద్రుష్టి కోణాన్ని సవాలు చేసి పెయింటింగ్ కు నూతన పరిమాణాన్ని ఆవిష్కరించాయి . ఆ పరిణామమే క్యూబిజం .అయినా పికాసో రేఖీయ ఆక్రుతుల అవకాశాలకోసం అన్వేషిస్తూనే ఉన్నాడు .’’ఆఫ్రికా దేశపు ఆదిమ జాతుల విగ్రహాలు అసలైన విలువ కలవని అనుకొని ,తన ఈస్తేటిక్  అనుభవాలను మార్చు కొంటూ ,ప్రపంచపు కొత్త చిత్రాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తూ ,సహజ అనుభవం ,అతీంద్రియ అనుభవం ఒకదానిపై ఒకటి పడి ఒక ప్రత్యేక వాస్తవ చిత్రాన్ని తయారు చేసే కృషి కొనసాగించాడు పికాసో ‘’అన్నాడు క్రిస్టియన్ జేర్వోస్ .

  ఆ’’ ప్రత్యెక వాస్తవం’ను కొట్టవచ్చేట్లు 26వ ఏట’పెయింట్ చేసిన ’ లెస్ డేమాసేల్స్  డి అవిగ్నాన్’’లో చూపించి కళాప్రపంచాన్ని ఒక కొత్త వివాదాస్పద ఈస్తెటిక్స్ తో పెద్ద కుదుపు కుదిపాడు .దీనిపై జేర్వోస్ సమీక్షిస్తూ ‘’this about- face of all aesthetic values marked the beginning of a period which revolutionized painting and enriched all art .’’అని అంటే ,ఆల్ఫ్రెడ్ హెచ్ .బార్ జూనియర్ ‘’పికాసో –ఫిఫ్టి యియర్స్ ఆఫ్ హిజ్ ఆర్ట్ ‘’లో ఈ చిత్రం మొట్ట మొదటి క్యూబిస్ట్ చిత్రం –అది సాధారణ రూపాలను అవి వస్తువులైనా స్టిల్ లైఫ్ చిత్రాలైనా ,పరదాలైనా వాటిని సెమి అబ్ స్ట్రాక్ట్ డిజైన్ లుగా జారిపోయేట్లు , స్తరాలమార్పులతో ,బోలు ప్రదేశంగా అదిమి మార్చాడు .ఇదే క్యూబిజం .అదొక సంధికాలపు చిత్రం ,ప్రయోగ శాల ,అంతకు మించి యుద్ధ భూమి ,విచారణ, ప్రయోగం .కాని అది కూడా ఒక దారుణమైన ,చైతన్య వంతమైన శక్తి –ఆ కాలం లో ఐరోపా కళ లో అన్నిటిని మించి అద్వితీయమైనది .’’అన్నాడు .

   తన స్నేహితుడు ,సాటి చిత్రకారుడు జార్జెస్ బ్రేక్ తో కలిసి పికాసో బలీయ మైన వెంచర్లను శక్తి వంతమైన క్యూబిజం లోకి మార్చాడు .ప్రముఖ చిత్రకారుడు సిజానే –లాండ్ స్కేపులు ,సాధారణ వస్తువులు శంకువులు స్తూపాలు గోళాలుగా అమరి ఉంటాయని సూచించాడు .ఈ ఇద్దరుకలిసి దాని క్యూబ్ అంటే ఘనం లోకి వ్యాప్తి చెందించారు .ప్రిజం ,త్రిభుజ౦ ,మరికొన్ని పదునైన కోణాలు కల వానిగా ,సాలిడ్ జామెట్రీ అనుకరణ  గా మార్చారు .మరో చిత్రకారుడు స్యురాట్ పెయింటింగ్ ను ‘’the art of hallowing surface ‘’అన్నాడు .పికాసో విరుద్ధ కళ ను తయారు చేసే ప్రయత్నం లో ఉన్నాడు .ఉపరితలాన్ని శుద్ధ ఘన పరిమాణం ద్రవ్య రాసి తో నిర్మించాడు .తనకు కనిపించిన ప్రతి దాన్నీ విశ్లేషించి వ్యక్తిగత భౌతిక కంటి తో కాక తనమనో నేత్రం తో  ఊహను జోడించి చిత్రించాడు .’’ఇప్పడు పికాసో వస్తువును ఒకే అనేక పార్శ్వాలనుండిఅంతర్ నేత్రం తో దర్శించినట్లు గమనిస్తాడు . ఆర్టిస్ట్ ఊహ కు అనుగుణంగా భౌతిక వస్తు పధకం కాక వస్తువు పూర్తిగా ఒక్కసారే దర్శనమిస్తుంది .వస్తువు యొక్క ప్రాతినిధ్యం గా ఆర్ట్ ఉండాలి .అది స్వయం సమృద్ధ మవ్వాలి ‘’అనేది పికాసో సిద్ధాంతం అని మారిస్ రెయ్నాల్ అన్నాడు .

  Inline image 4Inline image 5Inline image 1  Inline image 2Inline image 3

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -179

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -179

69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో

‘’పెయింటింగ్ అంటే అపార్ట్ మెంట్ లకు  అలంకారం తెచ్చేదికాదు . ఛీకటి ,క్రూరత్వాలపై యుద్ధం ‘’అన్న మహా చిత్రకారుడు పికాసో .సాధారణం గా యే ఆర్టిస్ట్ అయినా మొదట్లో అనుకరణ స్థాయి నుంచి ప్రారంభిస్తాడు ,క్రమంగా తనదైన విధానాన్ని అవలంబించి ప్రతిభ చూపిస్తాడు .అప్పుడు ఏమీ తెలియని వాడైనా అది ఫలానా వాడి చిత్రం అని గుర్తిస్తాడు .కాని పికాసోఒక అసాధారణ చిత్రకారుడు .ఆయన వేసే చిత్రం సాధారణం గా ఉండదు .కనీసం అందులో అర డజన్ శైలీ భేదాలుంటాయి .ఆయన అనేక తీవ్ర మార్పులకు లోనయ్యాడు .అన్నిటిలో ఆయన ఉత్కృష్ట చిత్రకారుడని పించుకొన్నాడు .ఒక ప్రయోగం తర్వాత మరొకటి చేస్తూ ముందు దాన్ని వదిలేస్తూ సాగింది ఆయన చిత్ర కదా పయనం .అయినా తానూ పూర్తిగా పరిణతి చెందలేదని భావించేవాడు .ఒకే మూసలో వస్తువులు స్థలాలు మనుష్యులు చిత్రింప బడటం ఆయనకు అసంతృప్తి కలిగించింది .అన్నికాలాల్లోనూ అస్థిర ,అత్యుత్సాహ ఆర్టిస్ట్ పికాసో .మేధో సృష్టి కర్త పికాసో .ప్రయోగ శిఖరారోహకుడు .

    5-10 -18 81న స్పెయిన్ లోని మాలగా లో పుట్టిన పికాసో అసలు పేరు  చర్చి లోరాసిన దానిప్రకారం  ‘’పాబ్లో నేపెనూసేనో క్రిస్పినియానో డి లా సా౦టిస్మా ట్రినిడాడ్ రూయిజ్ యపికాసో ‘’.స్నేహితులు ఈ చాంతాడు పేరును పాబ్లో రూయిజ్ గా కుదించారు .తండ్రి జోసె రూయిజ్ బ్లాస్కో ,బాస్క్ వంశానికి చెందిన ఆర్ట్ టీచర్ .కుర్ర పికాసో మొదటి పెయింటింగ్ గీసి తల్లి ,తండ్రి పేర్లు వచ్చేట్లు పి.రూయిజ్ పికాసో అని సంతకం చేశాడు .ఇరవై వ ఏట తండ్రి పేరు సామాన్యమైనదే అని భావించి దాన్ని వదిలి అసాధారణం ,శ్రావ్యం అయిన ఆతల్లి పేరు నే ఉ౦చేసుకొన్నాడు .కొన్ని కధనాల ప్రకారం పికాసో చేతిలో పెన్సిల్ తో జన్మించాడు .కనుకనే నిర్దుష్టమైన డ్రాఫ్ట్స్ మన్ గా ,నిర్ణయాత్మక ఆర్టిస్ట్ గా ఎదిగాడు .14వ ఏట పోర్ట్రైట్ లను చిత్రించాడు .వాటిని ఎక్స్ప్రేసివ్ రియలిజం కు  లోతైన మోడలింగ్ కు ఉదాహరణలుగా భద్రపరచి రక్షిస్తున్నారు .కుటుంబం బార్సెలోనా కు మారినప్పుడు ,అక్కడ ప్రొఫెసర్ గా ఉన్న తండ్రి కొడుకును స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేర్పించాడు .అత్యంత కఠిన మైన ఎంట్రెన్స్ పరీక్షలకు సిద్ధం కావటానికి ఒక నెల మాత్రమె గడువు ఇచ్చారు .కాని మనవాడు ఒకే ఒక్క రోజులో  వాటిని పూర్తీ చేశాడు .పదారేళ్ళ వయసులో మాడ్రిడ్ లో జరిగిన ఫైన్ ఆర్ట్స్ ఎక్సి బిషన్ లో చిత్ర ప్రదర్శన లో పాల్గొని అవార్డ్ పొందాడు .కొన్ని నెలలతర్వాత స్వంత స్టూడియో ఏర్పాటు చేసుకొన్నాడు .చిత్రం వేసుకొనే ఏటవాలు బల్ల (ఈజేల్ )కాక ఆ రూమ్ లో ఒక మంచం ఒక కుర్చీ మాత్రమె ఉండేవి .అందుకని గోడలపై విలాసవంతమైన ,అలంకరించ బడిన ఫర్నిచర్ ను పెయింట్ చేసి సంతృప్తి చెందేవాడు .వీధుల వెంట తిరుగుతూ కేబెరాలు ,రేవులు చూస్తూ  కనిపించిన ప్రతిదాన్నీ చిత్రించేవాడు ,ఆయన చిత్రించన వాటిలో సోమరిపోతులు ,నన్స్ ,వేశ్యలు ,రేవు పనివాళ్ళు ,కుక్కలు ,అందం ఫాషన్ ఉన్న స్త్రీలు ,నీరసించిన ముసలి ముతకా జనం ,బలిసిన కాబ్ డ్రైవర్లు ఉన్నారు .వీరి కారికేచర్ నే చిత్రించేవాడు .

        19ఏళ్ళ వయసులో మొదటి సారి పారిస్ వెళ్ళాడు .అక్కడ పికాసో విజయం సాధించటం సామాన్యమైన విషయమే .నెల లోపల మూడు కాన్వాసులను అమ్మాడు .మాడ్రిడ్ తిరిగొచ్చి ,’’య౦గ్ ఆర్ట్ ‘’అనే మేగజైన్ ప్రారంభించాడు .తన పాస్టెల్స్ ప్రదర్శించి మళ్ళీ పారిస్ చేరాడు .అక్కడ బాగా ప్రచారం లో ఉన్న తోలోసే లాట్రేస్  బోహీమియన్ స్టూడియో తో  ,వాన్ గో బ్రష్ వర్క్ ,గాగిన్ కలర్ మాస్ చిత్రాలతో ప్రభావితుడయ్యాడు .,తర్వాత మృదు త్వం తగ్గించి అస్పష్ట అవుట్ లైన్స్ తో ,వివక్షా పూరిత పాలెట్ తో చిత్రించాడు .అనేక రీతులను అధ్యయనం చేసి ,తానే విభిన్న శైలులు అవలంబించి చివరికి తనదైన సృజనాత్మక చిత్రాలకు ప్రాణం పోశాడు .ఇరవై ఏళ్ళకే బీద ,అసంతృప్త శుష్కించిన  ఎముకలు పొడుచుకు వచ్చిన చేతులు పొడవైన బొమి కల్లాంటి వేళ్ళు ,విషాద మాత్రుమూర్తులు ,వారి శరీరాలకు అతుక్కుపోయిన పసి పిల్లలు ,బిచ్చగాళ్ళు ,దీనులైన శ్రమ జీవులు ,అ౦గవిహీనులు ఆకలితో అలమటించే జంటలు ,సంఘ బహిష్కృతులు అయిన  స్త్రీ పురుషులను సీరియల్ గా  గీశాడు .విషాదానికి చిహ్నమైన నీలి రంగు తో వ్యంగ్య చిత్రాలుగా కాకుండా లోకం లో ఉన్న దరిద్రం అలసత్వం కాపట్యం  కారుణ్య హీనత కు అద్దం పట్టేట్లు చూపించాడు .ఒక మానవ సజీవ చిత్ర శాల అది .తాడిత పీడిత దీన గాదా చిత్రమాలిక అది .పికాసో స్నేహితుడు అవి మనుషులపై ఆయనకున్న మమకారం సానుభూతి సహవేదనకు చిహ్నాలు అన్నాడు

  23వ ఏట పికాసో చిన్న ,నల్లగా  బలంగా ,అశాంతిగా ,చింత తో ,నిరుత్సాహపులోతైన  కళ్ళతో ,గుచ్చే చూపులతో వింతగా కదలిక లేని వాడుగా ఉండేవాడు .దుబ్బ జుట్టు నుదిటిపై పడుతూ వికారంగా ,సున్నితమైన స్త్రీ చేతులతో ,నిర్లక్ష్యంగా డ్రెస్ వేసుకొని కనిపించేవాడు .మేధావి నుదురు, దానిపై నల్లని కనుబొమలతో సగం బోహిమియన్ లాగా ,సగం వర్కర్ లాగా కనిపించేవాడు .రాత్రి వేళల్లోనే పెయింట్ చేసేవాడు .డైవ్స్  ప్రైజ్ ఫైట్స్ తిరిగి చూస్తూ సర్కస్ మోజులో పడ్డాడు .

Inline image 1Inline image 2

                సశేషం

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా పుట్టిన రోజు

ఇవాళ జూన్ 27 సోమవారం నా పుట్టిన రోజు . వయసు 77లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు బంధు మిత్రులకు శుభ కామనలు-దుర్గా ప్రసాద్

27-6-16సోమవారం నా పుట్టిన రోజు పండుగకు అమెరికా నుంచి నా ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఆత్మీయంగా అభిమానంగా విజయవాడ కు ఆర్డర్ ఇచ్చి ఉయ్యూరు లో అందజేయించిన పుష్ప గుచ్చం ,కాశ్మీర్ శాలువా ,బత్తాయి , ఆపిల్ ,పైనాపిల్ ,దానిమ్మ ,బంగినపల్లి మామిడిపళ్ళు-చిత్రాలు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -178

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -178

68-పెనిసిలిన్ ప్రదాత –అలేక్సాండర్ ఫ్లెమింగ్ -2(చివరి భాగం )

     మోల్డ్ నుంచి పెనిసిలిన్ తయారవటం ఫ్లెమింగ్ మర్యాదగా చెప్పినట్లు యాదృచ్చికం కాదు .అనేక పరిశోధనల ,పరిశీలనల ,అనుకూల పరిస్థితుల వలననే జరిగింది  .దీనికి నోబెల్ బహుమానం అందుకొన్న రోజు ఫ్లెమింగ్ ‘’ అదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో  పెనిసిలిన్ ఏర్పడింది .అప్పుడు నేను మామూలుగా బాక్టీరియాలజీ సమస్యలపై పరిశోదిస్తున్నానే కాని బాక్టీరియా సంహారకాలపై కాని మోల్డ్ లపైకాని యాంటి సెప్టిక్క్స్,యాంటి బయోటిక్స్లపై    నా ద్రుష్టి యే మాత్రం లేదు .నా మొదటి పరిశోధనా పత్రం లో మోల్డ్స్ ద్వారా యాంటి బాక్టీరియల్ పదార్ధం తయారు చేయవచ్చు అని మాత్రమె చెప్పాను .అందుకనే ఆసమస్యపై పరిశోదిస్తున్నాను .అది సత్యంకాక పోవచ్చని ,సత్యాన్ని చెప్పాలని మాత్రమె నా తపన .అప్పుడే పెనిసిలిన్ అకస్మాత్తుగా ఒక చాన్స్ గా నాకు అబ్సర్వేషన్ లో కనిపించింది .నా గొప్పతనం ఏమిటి అంటే నా శోధనను అలక్ష్యం చేయక పోవటమే .అందుకే నిరంతర శోధన చేయటం తో నన్ను బాక్టీరియాలజిస్ట్అన్నారు ‘’అని చెప్పాడు .

   చాలా పరిశోధనలు లాగానే పెనిసిలిన్ చాలా కాలం ఉపేక్షకు గురైంది .’’ది సైన్స్ బుక్ ఆఫ్ వండర్ డ్రగ్స్ ‘’పుస్తకం లో డోనాల్డ్ జి.కూలే ‘making herbs extracts and so on was scarcely respectable in leading scientific circles  .it was all a bit too with witch –doctorish  ,savoring of superstition and folklore ,like the belief of some ignorant people that a poultice of molded bread made a wound heal more cleanly .The nature of pharmaceutical research was overwhelmingly along lines of laboratory synthesis of organic molecules and the impact of sulfas gave tremendous impettusto such directions .’’అని పూర్వ గాదాలహరి వివరించాడు .నిరంతర౦గా మోల్డ్ లను పెంచుతూ ఉన్నాడే కాని దానిపై ఏమీ చేయలేదు .పెనిసిలిన్ శక్తి తెలుసుకోవటానికి పదేళ్ళు పట్టింది .

   ఫ్లెమింగ్ పబ్లిష్ చేసిన పత్రం ఇద్దరు ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి స్పెషలిస్ట్ లు డాక్టర్ హోవార్డ్ ,ఫ్లోరీ లను ఆకర్షించింది .అతని జర్మన్ సహాయకుడు ఎర్నెస్ట్ బోరిస్ చిన్ నెలల తరబడి ఫ్లెమింగ్ మోల్డ్ నుంచి ఏదైనా పదార్ధాన్ని పొందచ్చునేమో నని ప్రయత్నించాడు .చివరికి చిక్కని గరిటెడు ఎల్లో బ్రౌన్ పౌడర్ ను పొందగలిగాడు .ఇదే పెన్సిలిన్ నుంచి పొందిన మొదటి లవణం ,దాన్ని అనేక తరహా బాక్టీరియా మైస్ లపై ప్రయోగించాడు  .12-2-1941న వేరు చేసిన పెనిసిలిన్ ను మొదటి సారిగా లండన్ లో స్టాఫిలో కొకి బాక్టీరియాతో బాగా ఇన్ఫెక్ట్ అయిన 105డిగ్రీల జ్వరం  తో  బాగా జబ్బు పడ్డ ఒక పోలీస్ కు  ఇంజెక్షన్ గా ఇచ్చాడు .అంతకు ముందు అతనికి చాలా పెద్ద డోసులో సల్ఫానిలమైడ్ఇచ్చారు కాని గుణం కనిపించలేదు .కాని ఇప్పుడు ఈ పెనిసిలిన్ తో క్రమంగా జ్వరం  తగ్గి౦ది కాని అప్పటికే చాలా ప్రమాదం అంచున ఉండటం వలన చనిపోయాడు .అతనిమూత్రం నుండి కొద్దిమోతాదు లో  పదార్ధాన్ని సేకరించి రెండు నెలలు సాంద్రత పరచి ,స్ట్రె ప్టో కాకి బాక్టీరియా తో చావు బతుకులమధ్య ఉన్న 15 ఏళ్ళ కుర్రాడికి దాన్ని ఇంజెక్షన్ గా ఇస్తే వాడు కోలుకొని బతికి బట్టకట్టాడు .కొన్ని నెలల తర్వాత ఫ్లెమింగ్ తన మిత్రుడు ప్రాణాపాయం లో ఉంటె వెన్నెముక ద్వారా మందు ఎక్కించి ప్రాణాలు కాపాడాడు .

   ఈ విధంగా పెనిసిలిన్ ప్రపంచ వ్యాప్త ప్రాణ సంజీవనిగా పేరు పొందింది .రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో యుద్ధం లో ఇరుక్కుని ,ప్రతి ప్రయోగ శాల ఆయుధాల కోసమే పని చేయటం తో తగినంత పెనిసిలిన్ ను తయారు చేయ లేక పోయింది .డాక్టర్ ఫ్లోరె అమెరికా వెళ్లి అక్కడ విస్తృత స్థాయిలో పెనిసిలిన్ తయారు చేసే ఏర్పాటు చేశాడు .1942నాటికి ఒక 100మందికి మాత్రమె సరి పడ పెనిసిలిన్ మందు ఉంది .మరు సటి ఏడాదికి లెక్క లేనంత మందికి ఆ మందు ఇచ్చి ప్రాణాలు కాపాడే స్థితికి వచ్చారు .1943లో ఫ్లెమింగ్ ను ఫెలో ఆఫ్ ది రాయల్ సోసైటీ ని చేశారు.తరువాత నైట్ హుడ్ ఇచ్చి గౌరవించారు .1945లో ఫ్లోరీ,చైన్లతో కలిపి ఫ్లెమింగ్ కు నోబెల్ పురస్కారం ప్రదానం చేశారు .

  అనేక మట్టి నమూనాలనుంచి మోల్డ్ లను వృద్ధి చెందించారు .రాట్జేర్స్ యూని వర్సిటి కి చెందినవాక్స్ మన్ న్యు జెర్సీ మట్టి నుండి ‘’స్ట్రెప్టోమైసిన్ ‘’కనిపెట్టాడు .ఎల్ యూని వర్సిటికి చెందిన పాల్ బార్క్ హోల్డర్ వెనిజుల దుమ్ము నుంచి’’ క్లోరోమైసిటిన్’’ మందు తయారు చేశాడు .అది దక్షిణ అమెరికా లో టైఫస్ బాక్టీరియాను నివారించి టైఫాయిడ్ నుంచి విముక్తి కలిగించింది . 75ఏళ్ళ బెంజమిన్ ద్రగ్గర్ అనే రిటైర్డ్ బాటనీ ప్రొఫెసర్ పుట్టగొడుగులపై తీవ్ర పరిశోధన చేసి మిస్సోరి బురద నుంచి బంగారపు పసుపురంగు మోల్డ్ పెంచి దాని నుంచి వచ్చిన మందుకు’’ ఆరో మైసిన్ ‘’అని పేరు పెట్టాడు .బ్రూక్లిన్ లోని ఒక సంస్థ ఇండియానా లో కుళ్ళిన సాయిల్ నుంచి’’ టేర్రామైసిన్’’ తయారు చేసింది .దీనితో వైద్య రంగం లో నూతన అధ్యాయం ఆరంభమైంది .దీనినే ‘’కేమో దెరపీ శకం ‘’అన్నారు .ఈ మందులన్నీ భూమి లోని మట్టి సారం నుంచి తీసినవే .

   ఎక్కువ డోస్ లో యాంటి బయాటిక్స్ వాడితే పేషెంట్ లకు ఎలర్జీ లు వచ్చి ఇబ్బంది పడతారు .ఫ్లెమింగ్ చలవ వలన వైద్య ప్రపంచం గణనీయమైన అభి వృద్ధి సాధించి జన జీవితం లో వసంతోదయాన్ని తెచ్చింది .చెవి ఎముక (మాస్టాయిడ్)ఆపరేషన్లు ఒకప్పుడు అతి ప్రమాదకరం .ఇప్పుడు ‘’వీజీ ‘’అయింది .పిల్లల చెవి బాధలుతగ్గాయి .మధ్య చెవిలో వచ్చే భయంకర ఇన్ఫెక్షన్ ఇప్పుడు యాంటి బయాటిక్స్ తో ఉష మాయం అవుతోంది .బోస్టన్ లోని పిల్లల ఆసుపత్రిలో మాస్టా యిడ్ఆపరేషన్లు మూడు వందలనుంచి ఒక దశాబ్దకాలం లో అయిదుకు తగ్గి గొప్ప మార్పు తెచ్చింది .ఎపెండి సైటిస్, మేనేంజేటిస్ (మజ్జా రోగం )టులారెమియా  (ప్లేగు వంటి వ్యాధి )ప్యూర్ పెరల్ ఫీవర్ (ప్రసూతి జ్వరం )ఇప్పుడు భయంకరమైనవి కానేకాదు .పూర్తిగా నివారింప దగినవే  .ప్రపంచం ఫ్లెమింగ్ కు ఎంతో రుణ పడి ఉంది .యువకులు ఉత్సాహంగా పని చేస్తూ 65ఏళ్ళకు హాయిగా రిటైరై   ధోకా లేకుండా జీవిస్తున్నారు .అంటే లైఫ్ స్పాన్ పెరిగింది అన్నమాటం .

         బాక్టీరియాలజీ లోనే కాక పెయింటంగ్ లోనూ సిద్ధ హస్తుడైన ఫ్లెమింగ్ తన ఇంటి గోడలపై జేర్మ్ కల్చర్ ను చిత్రించాడు .70వ పుట్టిన రోజురిటైర్మెంట్ పొందినా  మైక్రో బయాలజీ పై ఇంకా  పరిశ్రమ చేయాలని  నిర్ణయించాడు .అతని మాటల్లోనే ‘’I have still got a few useful years before me ,.The happy man keeps on working ‘’అన్నాడు .74వ ఏట ఫ్లెమింగ్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది .11-3-1955న కోట్లాది ప్రాణులకు పెనిసిలిన్ ద్వారా ప్రాణ దానం చేసిన ప్రాణదాత అలేక్సాందర్ ఫ్లెమింగ్ అమరుడయ్యాడు .ఆయన లండన్ ఇంటికి దగ్గరలో ఉన్న లాబరేటరి లో ఆయన వృద్ధి చెందించిన అసలు మోల్డ్ (ఏన్సేస్టర్ )గాజు మూసలో ఇంకా భద్రంగా ఉన్నది .దీనినుంచే ప్రపంచానికి అవసరమైన పెనిసిలిన్  ఆవిర్భ వించింది’

2000సంవత్సరం లోప్రవేశించే ముందు స్వీడన్ కు చెందినా మూడు పెద్ద మేగజైన్ లు ఆ శతాబ్దపు గొప్ప పరిశోధన ఏదని అభిప్రాయ సేకరణ చేస్తే పెనిసిలిన్ అనే అందరూ చెప్పారు .2002లో బి బి సి వందమంది ప్రసిద్ధ బ్రిటన్ల జాబితాలో ఫ్లెమింగ్ ను చేర్చింది .ఆయన కాంశ్య విగ్రహాన్ని మాడ్రిడ్ లో ఏర్పాటు చేశారు .ఆయన పేరుతొ బాంక్ నోట్లు ముద్రించారు .ఆస్టెరాయిడ్ బెల్ట్ లో ఒక దానికి ఫ్లెమింగ్ పేరు పెట్టారు .ఆయన లెక్కలేనన్ని అవార్డులు రివార్డ్ లు పొందాడు .1999లో టైం మేగజైన్ ఆయన పై ప్రత్యెక సంచిక తెచ్చింది .ధన్యజీవి ఫ్లెమింగ్ .  

  

It was a discovery that would change the course of history. The active ingredient in that mould, which Fleming named penicillin, turned out to be an infection-fighting agent of enormous potency. When it was finally recognized for what it was, the most efficacious life-saving drug in the world, penicillin would alter forever the treatment of bacterial infections. By the middle of the century, Fleming’s discovery had spawned a huge pharmaceutical industry, churning out synthetic penicillins that would conquer some of mankind’s most ancient scourges, including syphilisgangrene and tuberculosis.[32

 

Inline image 1Inline image 2Inline image 3Inline image 5Inline image 4

    సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -177

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -177

68-పెనిసిలిన్ ప్రదాత –అలేక్సాండర్ ఫ్లెమింగ్   

  అణుశక్తి పై విప్లవాత్మక పరిశోధనలను అడ్డుకొంటున్న కాలం లో ,మెడికల్ సైన్సులో విప్లవ పరిశోధనలను ప్రపంచ ప్రజలందరూ ఆహ్వానించారు .న్యూక్లియర్ పవర్ మానవ జీవితాలను కుంచింప జేస్తుంటే ,లేక పూర్తీ సర్వ నాశనం చేస్తుంటే కొత్తగా కని పెట్టిన అద్భుత మైన మందులు వ్యాధి నిరోధకతను పెంచి మానవ జీవితకాలాన్ని మరింతగా వృద్ధి  మేలు చేశాయి.శరీరం లో జబ్బు పడి పడిన కణాలను బాగా ఆరోగ్యంగా సజీవం గా ఉన్న కణాలకు నష్టం రాకుండా నాశనం చేసే సమస్య పరిష్కృతం కాలేదు .కాని ఆశ్చర్యకరమైన యాంటి బయాటిక్స్ , సల్ఫా డ్రగ్స్ ,హార్మోన్లు తో సమకాలీన విజయాలు సాధిస్తూ భద్రమైన మానవ భవిష్యత్తుకు భరోసా నిచ్చాయి .

             లూయీ పాశ్చర్ తర్వాత వైద్య విధానం లోవచ్చిన పెనుమార్పు  పెనిసిలిన్ ఆవిష్కరణ .దీని ప్రదాత స్కాట్లాండ్ దేశపు బాక్టీరియాలజిస్ట్ అలేక్సాండర్ ఫ్లెమింగ్ కే ఈ కీర్తి దక్కింది .స్కాట్ లాండ్ లోని అయిర్ షైర్ లో లోచ్ ఫీల్డ్ డార్వేల్ లో  6-8-1881న ఫ్లెమింగ్ జన్మించాడు .రైతు అయిన తండ్రి 8మంది సంతానం లో చివరి వాడు.రెండవ భార్యకొడుకు .తనలాగా వ్యవసాయమే చేస్తాడని తండ్రి ఆశించాడు .కొడుకూ అలాగే అనుకొన్నాడు .పొలం పని మాంచి హుషారుగా ఉండేది .చేపలు పడుతూ కుందేళ్ళను పెంచుతూ ,గొర్రెల్ని మేపుతూ సరదాగా గడిపాడు .తాము గ్రామం లో మిగిలిన వారికంటే కొద్దిగా బాగానే బతుకుతున్నామని అనుకొన్నాడు .తానూ బాగా వ్యవసాయం చేసి తండ్రి పేరు నిలబెట్టాలని ,అ గ్రామం లో తమకుటుంబంవ్యవసాయం లో  అగ్రగామి కావాలని ఆశించాడు .

   14వ ఏట అతని జీవిత నేపధ్యం అకస్మాత్తుగా తలకిందు అయింది .పెద్దన్నలతో పాటు చదువుకోమని లండన్ పంపారు  .కిల్ మార్ నాక్ అకాడెమి లోరాబర్ట్ బర్న్స్ ,రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ లు చదివిన చోట  చేరి,ఇంగ్లాండ్ తన దేశం ,లండన్ తన కేంద్ర స్థానం అయినా కూడా స్కాటిష్ ఆక్సేంట్ ను మాత్రం మార్చుకోలేదు .పాలిటెక్నిక్ లో చదువు పూర్తీ చేసి స్కాటిష్ వాలంటీర్ గా మేరు నమోదు చేయి౦చుకొని ఈతలో అద్భుతంగా రాణించాడు .ఈ ఈతే అతని గీత మార్చింది .మార్లేబోన్ రోడ్ లో అన్న ధామస్ జనరల్ ప్రాక్టీషనర్  ,మరిద్దరు అన్నలు జాన్ ,రాబర్ట్ లు ‘’ఆప్టోమెట్రి ‘’అంటే కంటి దోషాలు గుర్తించి నివారించే కోర్సు చదువుతున్నారు ‘’మా అన్న ధామస్ నన్ను మెడిసిన్ లోకి తోశాడు .నేను మెడికల్ స్కూల్ ను ఎంచుకోవాలి .అలాంటివి లండన్ లో డజన్ ఉన్నాయి .వాటి గురించి నాకేమీ తెలియదు .అయితే నేను సెయింట్ మేరీ స్కూల్ వాళ్ళతో వాటర్ పోలో ఆడాను కనుక అక్కడే చేరాను ‘’అని చెప్పాడు ఫ్లెమింగ్ .

     ఈ స్కూల్ లో చాలా ప్రసిద్ధి చెందిన బాక్టీరియాలజిస్ట్ ఆల్మత్ రైట్ వద్ద చదివాడు .నిశిత పరిశీలన ,మంచి జ్ఞాపక శక్తి ,పనిలో పొదుపరితనం ఈయన వలన నేర్చాడు .చివరి గుణం అయిన పొదుపరితనం గురించి ఫ్లెమింగ్ చెబుతూ ‘’నేను తెలివిగల స్కాట్ లాండ్ వాడిని కనుక ,మా దేశస్థులు దేన్నీ అనవసరంగా పార వేయరు కనుక ,చివరికి కలుషితమైన ఆహారాన్ని కూడా చూస్తూ చూస్తూ పారేసే లక్షణం మా జాతి లో లేదు కనుక పొడుపు రక్తగతమై అలవడింది ‘’అని చెప్పాడు .అన్ని ఆటలలోనూ పాల్గొనేవాడు .ఫిజియాలజీ,హైజీన్ ,మెడిసిన్ ,పాదాలజి ,ఫార్మకాలజీ మొదలైన అనుబంధ సబ్జెక్ట్ల  లో  ఏర్పరచిన ప్రతి ప్రైజ్ ను స్కాలర్ షిప్  నూ సాధించు కొన్నాడు .అప్రెంటిస్ పూర్తీ చేశాక లాబరేటరీ లో పని చేసి ,28ఏట తన పరిశోధనలకు ,రోగనిర్ణయ విధానాలకు ఒకదాని తర్వాత మరొక గౌరవాలు, ప్రశంసలు పొందాడు.

  మొదటి ప్రపంచ యుద్ధం ఫ్లెమింగ్ ను లండన్ కు దూరం చేసింది .1914లో 33వ పుట్టిన రోజున రైట్ తో కలిసి కాసినో లో తానె ఏర్పాటు చేసిన ‘’రాయల్ ఆర్మీ మెడికల్ కార్ప్స్’లో ఆఫీసర్ గా బోలోన్ వెళ్ళాడు .అక్కడ నిత్యం విపరీతంగా గాయపడిన ,బాధలతో అరుపులు ,కేకలు వేస్తున్న సైనికులతో మహా రద్దీగా ఉండేది .అందులో ఎక్కువ మంది  ‘’గాంగ్రీన్ ‘’అంటే కండరాల మాంసం కుళ్ళి వచ్చే జబ్బు తో బాధ పడేవాళ్ళే . మెరుగు పరచిన రెండు బాత్ రూమ్ లున్నా మురుగు వ్యర్ధ పదార్ధాలతో కంపుకోడుతూ ఉండేవి .యుద్ధం మాట దేవుడెరుగు .ఈ నరకం లోనే అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవటం ఎక్కువైందని గమనించాడు .గాయాలు నయం కాక  జరుగుతున్న చావులే అవి .బాగా శక్తి కలయాంటి సెప్టిక్ లను వాడినా బాక్టీరియా ను అరికట్ట లేక పోతున్నారు .అందుకే అవి తమ ప్రతాపం చూపిస్తూ సైనికులను బలి తీసుకొంటున్నాయి .పై అధికారులకు విషయాలు తెలియ జేస్తున్నా స్పందన లేక పోవటం తో కుంగి పోయాడు ఫ్లెమింగ్ .నయం చేయటానికి తాను  చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని బాధ పడ్డాడు .

  37వ ఏట కెప్టెన్ గా ప్రమోషన్ రాంక్ లభించింది .యుద్ధం పూర్తీ అయి౦ది కాని ఫ్లెమింగ్ ను అక్కడి నుంచి కదల్చ లేదు .లండన్ కు చేరాక ‘’ఇమ్యూనాలజి ‘’-వ్యాధి నిరోధక విజ్ఞానం పై పనిచేయాలని నిర్ణయించుకొన్నాడు .ఆరోగ్యకర టిస్యూ లకు హాని చేయకుండా బాక్టీరియాను పూర్తిగా నాశనం చేసే సమర్ధ బాక్టీరియా సంహారక పదార్ధాన్ని   కనిపెట్టాలని భావించాడు .ప్రయోగాలు ,అనుభవాల వలన శరీరం లోని కణాలే యాంటి బాక్టీరియా ఏజెంట్ లుగా పని చేస్తాయని గ్రహించాడు .అదే ‘’నేచురల్ ఇమ్యూనిటి’’అంటే సహజ రోగ నిరోధకం .అవి శరీరాన్ని సైనికులు లాగా నిత్యం కాపాడుతూ ఉంటాయి .వెంటనే ‘’ఎక్స్ పెరమేంట్ పాదాలజి ‘’పై అనేక పేపర్లు రాసి ప్రచురించాడు .అందులో ఒక ముఖ్యమైన పత్రం లో ‘’.స్రావాలు ,టిస్యూ లలో పులియజేసే బాక్టీరియా ఉంటుందని ,అది కొన్ని రకాల బాక్టీరియాపై దాడి చేసి సమర్ధంగా శక్తి హీనం చేస్తుందని గ్రహించాడు .ఇదే ‘’లైసోజైం’’దీన్ని కనిపెట్టన ఏడాది  ముందే ఫ్లెమింగ్ సారా మెరియన్ మేకేల్రాయ్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ట్విన్ సిస్టర్ ను అన్న జాన్ పెళ్ళాడాడు .

     సాత్వికంగా మాట్లాడే స్వభావం .బూడిద రంగు జుట్టు తో 47ఏళ్ళ సైంటిస్ట్  ఫ్లెమింగ్ కనిపించేవాడు .1928లో ఒక రోజు తన లాబ్ లో ఒక వింత విషయం గమనించాడు .ఒక పెట్రి డిష్ పై స్టాఫిలో కాకస్  జెర్మ్స్ కల్చర్ ఉన్న గ్లాస్ ప్లేట్ పై బూజు లాంటి పదార్ధం ఏర్పడినట్లు గుర్తించాడు .విడ్డూరం తోపరిశీలిస్తేఏర్పడిన  లైసోజై౦ తన చుట్టూ ఉన్న స్టాఫిలోకాకస్ బాక్టీరియాను నాశనం చేసిందని తెలుసుకొన్నాడు .సూక్ష్మ దర్శింతో నిశితంగా పరీక్షిస్తే ఏర్పడిన ఆకు పచ్చని బూజు పని చేయటం ప్రారంభించి బాక్టీరియాను క్రమంగా తొలగిస్తోంది .బాక్టీరియా క్రమంగా అదృశ్యమవటం చూస్తె తప్పక తాను బాక్టీరియా సంహారక పదార్ధాన్ని కనిపెట్టి చికిత్సా విధానం లో ఉపయోగించి మానవ శరీరం లో బాక్టీరియావలన  ఇన్ఫెక్షన్ రాకుండా చేయ గలుగుతాననే నమ్మకం కలిగింది .

Inline image 1Inline image 2

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -176

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -176

67-   జర్మన్ జాతీయ భావ సోషలిజం వ్యాప్తి చేసిన -ఆస్వాల్డ్ స్పెంగ్లెర్ -2(చివరి భాగం )

   స్పెంగ్లెర్ భవిష్యత్తును ఆనందమయ పెసిమిజం గా చూశాడు .నీషే చెప్పినభయ సంత్రుప్తులతో కూడిన  ‘’శాశ్వత పునరా వృత్తం ‘’(ఎటర్నల్ రికరెంస్ )కోసం ఎదురు చూశాడు .ఇప్పుడు ఆ వ్రుత్త౦ పూర్తయింది .ఇప్పుడు స్పి౦గ్లేర్  కొత్త ఆవ్రుత్త౦ జీర్ణించి నశించిపోయిన నాగరకత నుంచి ఆరోగ్యకర ఉత్సాహ పరచే బార్బేరిజం గా ఆవిర్భవిస్తుంది అన్నాడు .మరొక కొత్త ఉన్నత యువ క్రూర సంస్కృతీ ఏర్పడి వ్యాపించి రాజ్యమేలుతుంది అని ఊహించాడు .’’ఆస్వాల్డ్ స్పెంగ్లెర్ –ఎ కల్చరల్ ఎస్టి మేట్’’అనే పుస్తకం లో హెచ్ .స్టువార్ట్ హగ్స్ ‘’మానవాభివృద్ధిలో ఆయన చెప్పిన వృత్త సిద్ధాంతం ,సంశయ వాదం ,మానవ నైతిక శక్తి సామర్ధ్యాలు ఒక భ్రమ గా కొట్టిపారేశాడు .ప్రజాస్వామ్యం పవిత్ర మోసం  మాయ అన్నాడు .ప్రపంచ శాంతి సాధన అసాధ్యమేకాదు,అనవసరం కూడా అన్నాడు .20 వ శతాబ్దం శాంతికి,అభి వృద్ధికి ,ప్రజాస్వామ్యానికి  బహుదూరంగా తన సమకాలీనులు ఊహించిన  దానికి విరుద్ధంగా ఉండి భయ విహ్వలత ,ఇ౦ పీరియలిజం ,నిరంతర యుద్ధ ప్రమాద కర శకం గా ఉంటుందని భవిష్యత్తు చెప్పాడు ‘’అని రాశాడు .

  స్పెంగ్లెర్ చెప్పిన’’ మానవ తలరాత’’సిద్ధాంతం  నాశనమై ,మళ్ళీ తల ఎత్తిపుంజుకొన్న జర్మని విషయం లో నిజమైంది .జర్మన్లు తమ ఓటమి ప్రపంచ వ్యాప్త పతనం లో ఒక భాగమే నని ,పుట్టుకొచ్చిన నాజీలు ఆయన చెప్పిన భవిష్యత్తుకు ఉత్సాహపడి ,ప్రపంచం లో ఆర్య జాతి ఒక్కటే సర్వోత్క్రుస్టమైనదని నమ్మి ప్రచారం చేసి వినాశకర హి౦సాత్మకతను పెంపొందించారు .  అందువల్ల నాజీ నాయకత్వానికి స్పెంగ్లెర్ కొంతకాలం దేవుడే అయ్యాడు .కాని ఆయన నియంత్రణ ,స్వీయ ఆహ౦ కారాలపై ఉన్న అపనమ్మకం ఆయన్ను నేషనల్ సోషలిజం లో పాల్గొన నీయ కుండా చేసింది .ఆయన్ను వేది౦చకపోయినా ,కార్యక్రమాలు పరిమితమై  క్రూర పైశాచిక జర్మనీలో నిస్తబ్ద౦ గా ఉండి పోయాడు .మిగిలిన జీవితకాలం అంతా ఏకాంత౦ గా గడిపాడు .56వ ఏట అకస్మాత్తుగా అనారోగ్యం పాలై ,కొన్నేళ్ళు విపరీతమైన తలనెప్పి తో బాధ పడుతున్నా ఆరోగ్యంగానే ఉంటూ విపరీతమైన గుండె పోటు వచ్చి దార్శనికుడు స్పెంగ్లెర్ 8-5-1936న మరణించాడు .

  స్పెంగ్లెర్ తోపాటు మరికొందరు కూడా నాశనమఔతున్న నాగరకతను గూర్చి వ్యధ చెందారు .ఇటలికి చెందిన చరిత్ర కారుడు  జియాం బాట్టి స్టా వికో ‘’అనేక చారిత్రాత్మక పునరావ్రుత్తాలు జరిగి ,అనేక నాగరక దశలు దాటి ఒక అనాగారకతనుంచి మరొక అనాగారకతకు చేరుకొంటుంది ‘’అని చెప్పాడు .1890 లో అమెరికాకు చెందిన హెన్రి ఆడమ్స్ ‘’ప్రజాస్వామ్య భవిష్యత్తు ప్రమాదం అంచులో ఉంది .ఉన్న ఆధారాలను బట్టి మనం ఇంకా రెండు వందల ఏళ్ళకు పైగా మూర్ఖ స్తబ్దతలో ఉండి పోవాల్సి వస్తుంది ‘’అని చెప్పాడు .ఆయన సోదరుడు బ్రూక్స్ ఆడమ్స్ పడమటి నాగరకత శిదిలమౌతుందని ఊహించాడు .మనకున్న అధిక శక్తులు అనేక  టెన్షన్ లను  సృష్టించి ఆధునికమానవుని అస్తిత్వాన్ని భగ్న పరుస్తాయి .ఒత్తిడి ఇక తట్టుకోలేనప్పుడు ఒక స్తబ్ద కాలం ఆవరించి ,ఖర్చాయి ఖాళీ అయిపోయి కాని యుద్ధం వలన కానీ లేక రెండిటి వలనకూడా అంతమవుతుంది .లేక విచ్చిన్నమై నాగరక జనాభా నశించి ,మళ్ళీ వెనక్కి అడుగులు వేస్తూ ఆదిమ జీవ  సమాజం లోకి చేరుతుంది ‘’అని   ‘’ది లా ఆఫ్ సివిలిజేషన్ అండ్ డీకే’’లో రాశాడు బ్రూక్స్ .

‘’ ప్రజాస్వామ్యం  బలహీనతకు పర్యాయ పదం ‘’(డెమాక్రసి ఈజ్ అ సినానిం ఫర్ దిసల్యూషన్)అని,శాంతి మరణానికి పరచిన దారి అని ,జీవితం గురించి ఫిలాసఫర్స్ కు అవగాహనే లేదని ,ఫిలాసఫీ నిరర్ధకమైనదని ,అభ్యుదయం అనేది లేదని ,అది క్షీణతకు వృద్ధి అని  స్పెంగ్లెర్ తప్ప ఎవరూ చెప్పలేదు .ఆయన వ్యాసాలు కొన్ని మరణానంతరం ముద్రి౦పబడినాయి .’’ది డిక్లైన్ ఆఫ్ ది వెస్ట్ ‘’’’ది అవర్ ఆఫ్ డెసిషన్ ‘’లపై  .వయసు ముప్ఫై లో రాసిన వాటి పై వచ్చిన విమర్శలపై స్పందించలేదు .తన పాఠ కులు మరింత ఆశ్చర్య పోయేట్లు వారిని ఉత్తేజ పరుస్తూ మన నాగరకతను సుదీర్ఘ కాలంగా వర్ధిల్లిన చైనా ఈజిప్ట్ ,ఇండియా ,గ్రీక్ మరి కొన్ని దేశాల వాటితో పోల్చాడు .యూరప్ ,అమెరికాల మనసు ఆత్మను ముసలిదైపనికి రానిదైన ‘’ఫాస్టియన్’’అన్నాడు .అది అసాధ్యాన్ని కల కంటోంది అని చెప్పాడు .’’we have not the freedom to choose ,to reach to this or to that ,but only the freedom to do what is necessary or do nothing .And a task that historic necessity has set will be complished with the individual or against him ‘’

  చాలామంది చరిత్ర కారులు స్పెంగ్లెర్ సిద్ధాంతం ‘’తప్పని సరి వినాశనం ‘’మరియు,శతాబ్దాల పోరాటం ద్వారా సాధించుకొన్న  జ్ఞానోదయ అనాసక్తత సిద్ధాంతం లను ఒప్పుకోలేదు .కొద్దిమంది  ఆయన చెప్పిన దానికి అంతప్రభావం ,వ్యాప్తి ,శక్తి లేవన్నారు .క్విన్సీ హౌయీ ‘’ది వరల్డ్ బిట్వీన్ టు వార్స్ ‘’అనే గ్రంధం లో ‘’ఆయన్ను అర్ధం చేసుకొన్న వారికి తమవాడు అయ్యాడు .వాళ్ళందరూ జూలియస్ సీజర్  లు కాలేదు .కాని జరగ బోయే అనర్ధాన్ని తట్టుకొనటానికి సర్దుబాటు కు సంసిద్ధ మౌతారు ..విల్సన్ ,లెనిన్ ల ఆవిర్భావం స్పెంగ్లెర్ చెప్పిన భవిష్యత్తుకు మద్దత్తు ఇచ్చినట్లయింది .20వ శతాబ్ది లో గొప్ప వాళ్ళ పాత్ర ఏమిటో విడమర్చి చెప్పింది .విలియం జేమ్స్ చెప్పిన కార్య సాధక ఫిలాసఫీ ని నీరు కార్చింది .’’his worship for’’ technics ‘’suited the scientific temper of the times .He offered a fatalistic formula to replace Westeren man’s lost religious faith .His fame spread from defeated Germany to shell shocked Europe to the bewildered United States .it became more and more apparent that nobody had won the war and that everybody had won the war and that everybody had lost it ‘’అని విశ్లేషించారు .

   అతని పద్ధతులు శాస్త్రీయం కాకపోవచ్చు కాని ఆయన మెటాఫిజికల్ అనుమానాలు ,యదార్ధమైనవే .తూర్పు ,పడమర దేశాల మధ్య జాతి వర్ణ విభేదాలు ఆయన చెప్పిన నాటి కంటే ఇరవయ్యవ శతాబ్దం లో పూర్తిగా రుజువయ్యాయి .సమాజాలు యుద్ధాలవల్ల బలహీమమై పోతున్నాయి .ఆర్ధిక సంక్షోభం లో కూరుకు పోయాయి .ఆసియా ఆఫ్రికాలలోఅనిశ్చిత పరిస్థితులు ,ప్రపంచ వ్యాప్త జాతీయ నినాదాలు ,అంతర్జాతీయ యుద్ధోన్మాదం ,ప్రపంచం లో రష్యా పెత్తనం ,ఆయుధ పోటీ ,ఆటం ,హైడ్రోజెన్ బాంబ్ ల విధ్వంసక శక్తి అన్నీ పూర్తీ వినాశానానికే దారి చూపిస్తున్నాయి .’’The decline of the West remains a fearful and continuing portent (దుశ్శకునం )’’అన్నాడు అంటర్ మేయర్ .

   1938లో వరల్డ్ లీడింగ్ పర్సనాలిటీ పోటీలో మాల్కం కౌలీ మొదటి వాడుగా వస్తే స్పెంగ్లెర్ అయిదవ వాడుగా నిలబడ్డాడు .ఐరోపా ఫిలాసఫర్లు మార్టిన్ హీద్జేర్ ,లుడ్విగ్ విట్టేంగ్ స్టీన్ లపై ఈయన ప్రభావం ఎక్కువ .అమెరికా ఫిలాసఫర్ లలో హెమింగ్వే ,ఫిట్జెరాల్డ్ ,జాన్ డాస్ పాస్సో ,హెన్రి మిల్లర్ లపై అత్యధిక ప్రభావం చూపాడు . ఇంగ్లాండ్ లో హెచ్ జి వెల్ల్స్,మాల్కం లోరీ ,యేట్స్ లు జర్మనీ ఆస్త్రియాలలో అనేక మంది  లాటిన్ అమెరికా దేశాలలో చాలామంది ఆయన ప్రభావానికి గురైన వారే .వీరంతాస్పెంగ్లేర్ ను పునర్జీవితుడిని చేసినవారే .దాదాపు పదిహేడుగ్రంధాలు రచించాడు .

Inline image 1Inline image 2Inline image 3

    సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-16-ఉయ్యూరు   

  

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -175

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -175

67-   జర్మన్ జాతీయ భావ సోషలిజం వ్యాప్తి చేసిన -ఆస్వాల్డ్ స్పెంగ్లెర్

   ఫ్రీడ్రిక్ నీషే పూర్తిగా పిచ్చివాడు కాకముందే అనేక భవిష్యత్ విషయాల పుస్తకాలు చాలా దూర దృష్టి మేధస్సు తో  రాశాడు  అవి జనాలను మేలుకోనేట్లు చేశాయి .అతని నిగూఢ భావనలు హిట్లర్ రాజకీయ టెర్రరిజానికి దారితీస్తాయని ,సింగ్లేర్ పూర్తిగా నిరాశ చెంది ‘’ది డిక్లైన్ ఆఫ్ ది వెస్ట్ ‘’రాస్తాడని వినిఉంటే నిశ్చేస్టుడయ్యేవాడు.ఏది ఏమైనా కానీ 19వ శతాబ్దపు అసంబద్ధ ప్రవక్త ,20వ శతాబ్దపు శిష్యులకోసం మార్గం ఏర్పరచి ,నియంత హిట్లర్ మారణ దమన విద్వేష మంత్రాల భయాన్నుంచి ప్రజలను తప్పించి ప్రశాంత  భయంకర విపత్తును కళ్ళ ముందు నిలిపాడు .

   29-5-1980న మధ్య జర్మనీలోని హార్త్జ్ పర్వతాలలో ఉన్న చిన్నగ్రామం బ్లాన్కేన్ బర్గ్ లో ఆస్వాల్డ్ స్పెంగ్లెర్ జన్మించాడు .అతని వంశ౦  రెండు విభిన్న వ్యక్తిత్వాల సమ్మేళనం .తల్లి వంశం వాళ్ళు వాళ్ళ రక్త౦శ్రేష్టమైనదని అంటారు ,అతని పిన్ని సంప్రదాయ డాన్సర్ ,తండ్రి తండ్రి అంటే తాత బాలెట్ మాస్టర్ .తండ్రి పూర్వీకులు దక్షిణ జర్మనీ నుంచి మూడు వందల ఏళ్ళకు పూర్వమే వచ్చారు .వాళ్ళు ఇంజనీర్లు ,గనుల త్రవ్వక సాంకేతికతలో నిపుణులు .తండ్రి కూడా అదే బాటలో నడిచి గనులు వట్టి పోయి నష్టం కష్టం మిగిలాక మానేసి కుటుంబాన్ని హల్లే కు మార్చాడు .ఆస్వాల్డ్ కు ముగ్గురు చెల్లెళ్ళు .ఇతనొక్కడే మగ పిల్లాడు .హల్లే లో హైస్కూల్ చదువు పూర్తీ చేసి అక్కడే యూని వర్సిటి లో చేరి ,తర్వాత మ్యూనిచ్, బెర్లిన్ వర్సిటీలలో చదివాడు .బెర్లిన్ నుండిప్రాచీన గ్రీక్ ఫిలాసఫర్ హెరాక్లిటస్ పై పరిశోధన చేసి  పి.హెచ్ డిపొందినా,అతని అభిరుచి గణితం ,సైన్స్ లమీదే ఉండేది .

            23 వ ఏటనే గణితం తోపాటు చరిత్ర జాగ్రఫీలు  సారా బ్రికేన్ ,డీసెల్ డార్ఫ్ ,హాంబర్గ్ లలో బోధించాడు.30వ ఏట విశ్రాంతి కోసం సెలవు పెట్టి ,ఒక ఏడాది తర్వాత తనకేమీ రాలేదని గ్రహించాడు .  తన అవగాహనా లోపాన్ని గ్రహించి టీచింగ్ కు స్వస్తి చెప్పాడు .బెర్లిన్ వాతావరణం దారుణం గా ఉండటం టో మ్యూనిచ్ వెళ్ళాడు .ఇది అన్నివిధాలా అనుకూలమైన ప్రదేశమని అనుకొన్నాడు .వంశ పారంపర్య ఆస్తి కొంత చేతికి వచ్చింది. దానికి తోడుగా పత్రికలలో రివ్యూలు రాసి డబ్బు సంపాదించాడు .మొదటి ప్రపంచ యుద్ధం అతని ఆర్ధిక స్థితిని దెబ్బ తీసింది .మ్యూనిచ్ లో నీచ పరిసరాలలో  హీటింగ్ సౌకర్యం లేనిచిన్న  గదిలో ,ఉంటూ ,కూలీల విశ్రాంతి ప్రదేశాలలో దొరికినదేదో తింటూ ,ఎక్కువ భాగం టీ తాగి బతికాడు .చలి నుండి రక్షించుకొనే దుస్తులు లేవు .కొవ్వొత్తి కాంతిలో రాసుకోనేవాడు .అవసర రిఫరెన్స్ పుస్తకాలు కొనటానికి డబ్బులు ఉండేవికావు .తన గదిని వెచ్చ చేసుకోవటానికి బొగ్గులు కొనే తాహతు కూడా ఉండేది కాదు .బుగ్గల ఎముకలు బయటికొచ్చి ,కళ్ళు మొరటుగా మారి  తల బులెట్ షేప్ లో ఉండి,తలవెంట్రుకలన్నీ రాలిపోయి దాదాపు బట్ట తల వచ్చేసింది .అతనిది ఉత్తర జర్మనీ రక్తమే అయినా అందరూ స్వచ్చమైన ప్రష్యన్ రకం గా భావించారు .

   38వ ఏట స్పెంగ్లెర్ ఎవరో ఎవరికీ తెలియదు .కాని ఆయన రాసిన ‘’ది డిక్లైన్ ఆఫ్ ది వెస్ట్ ‘’పుస్తకం విడుదలై ప్రష్యనిజాన్ని ప్రభావితం చేయటమే కాక  ప్రపంచ వ్యాప్త ప్రకంపనలు సృష్టించింది . ఈ పుస్తకం 1918లో విడుదలై మొ. ప్ర .యు .లో జర్మనీ  అధికార౦ కోసం చేస్తున్న  పోటీ ఆఖరు రోజుల్లో వచ్చింది .డజను భాషల్లోకి అనువాదం పొంది ,అమెరికా ,జపాన్ యూరోపియన్ ,ల లోని చరిత్రకారుల్ని ,విద్యావేత్తలను కలవర పరచింది .ఈ పుస్తకం లో స్పెంగ్లెర్-వాగ్దాన భంగం చేసిన  నాగరకత పతనాన్ని ,సర్వ నాశనం చేసి ,పాత భావ సృష్టి చేసే ఒక కొత్త శక్తి ఆవిర్భ విస్తుందని తెలియ జేశాడు .ఫాసిజం ,నేషనల్ సోషలిజం లు పూర్తీ వినాశానానికి పూర్తీ విధానం తో ఉన్నాయని ,ఉపేక్ష చేస్తే ప్రగతి మార్గం మాట దేవుడెరుగు అధోగతి పాలవ్వటం తప్పదని ,దీనితో నాగరకత క్షీణించి పోతుందని హెచ్చరించాడు .ఇప్పుడు తాత్కాలిక విజయం పొందిన వారికి భవిష్యత్తు లేదని ,బహుశా తెల్లజాతి విజేతలను మంగోలియన్ లేక ఆసియాకు చెందినమరొక జాతి ప్రక్కకు తొలగించి అధికారం హస్తగతం చేసుకొంటుందని ,భవిష్యత్తు స్పష్టంగా చెప్పాడు .ఈ పుస్తకం ను మరింత నిర్దుష్టంగా మార్చి 1923లో మళ్ళీ ముద్రించాడు .ఇందులో నీషే చెప్పిన నాగరకత అంటే మానవ జాతి ముసలిదైపోయి ,అంతం చెందటమే అని గుర్తు చేశాడు .పాశ్చాత్య మనిషి నాగరకంగా అభి వృద్ధి చెంది ,బలహీనమై నీరసించి ,స్థిర నిశ్చయం లేక ,ఆత్మ రక్షణ చేసుకోలేని పరిస్థితికి  వస్తాడు కనుక తప్పక చావాల్సిందే ‘’అన్నాడు .

   ప్రాచీన ,ఆధునిక ప్రపంచాల మధ్య ఉన్న సమాంతర విషయాలను చర్చిస్తూ స్పెంగ్లెర్ తన కృషి ఒక కొత్త ఫిలాసఫీ అని చెప్పి ‘’ఈ కొత్త ఫిలాసఫీ భవిష్యత్తుకు చెందినది .మెటా ఫిజికల్ గా అంతా కోల్పోయి ఊసర క్షేత్రమైన పశ్చిమ దేశాలవారు భరించే టంత కొత్తది .’’అని అన్నాడు.స్పింగ్లేర్ అభిప్రాయం లో ప్రతి సంస్కృతీ వసంత ,వేసవి ,శిశిర ,శీత అనే నాలుగు ఋతువులను దాటాలి .పడమటి దేశాలలో సంస్కృతీ వసంతం అంటే  మధ్య యుగపు యుద్ధ పోరాటాలు గొప్ప కేధడ్రిల్ నిర్మాణాలు ,స్వేచ్చా కళా వికసనం ,అరిస్టోక్రసి సృజన లు . సాంస్కృతిక పునర్వికాసం అంటే రినైసేన్స్ ను వేసవి కాలం అన్నాడు .ఈ కాలం లో లియోనార్డో డావిన్సి ,గెలీలియో ,షేక్స్ పియర్ ,అజ్ఞానం నుండి నిరక్షరాస్యత  సూపర్ నేచురలిజం నుండి విజ్ఞానం లోకి అక్షరాస్యత లోకి ప్రవేశం .ఇక శిశిరం అంటే సంస్కరణలు ,అరిస్టోక్రాటిక్ కల్చర్ మారిపోయి మధ్యతరగతి సాంప్రదాయ ప్రవేశం ,లోతైన సహజ జ్ఞానాన్ని ఒక ప్రత్యేక మేధావి తనం ఆక్రమి౦చ టం ,విశ్వాసానికి బదులు బలహీనమైన హేతువు పై ఆధార పడటం .19వశతాబ్దిని శీతాకాలం అన్నాడు .ఇది అసంతృప్తి ,వినాశనం .నాగరకత పూర్తీ అయిపోయి దానంతటికి అదే ఆధునిక నగర ,ధన శక్తి ,మూక సమూహ పెత్తనం తో నాశనమై పోయింది అంటాడు .

                    పడమటి ప్రపంచం  విస్తృత నగరాల వలన తప్పనిసరి  నాశనాన్ని కోరి తెచ్చుకొన్నది అంటాడు .  వస్తువుల అసలు విలువను అది నాశనం చేసింది .కారణం అన్ని రకాల విలువలను డబ్బుతో కొలుస్తున్నారు .సాంస్కృతిక విషయాలు ,సాంఘికాచారాలను ఎక్కడో పట్టణం లో ఉండే జ్ఞానం ఉందనుకొంటున్న కొద్దిమంది వ్యతిరేకిస్తున్నారు .దీనితో అవగాహన లేని వారికీ మిగిలిన వారికి శత్రుత్వం కలుగుతోంది .సిటీ అంటే ఇ౦ పీరియలిజానికి విస్తృతి ,అదే నాగరకతకు అంతం .సంస్కృతీ సంపన్నుడు తన మేధస్సును ఆ౦తరింగికం గా ఉపయోగించుకొంటాడు ,నాగరకుడు బాహిరంగా తన శక్తి సామర్ధ్యాలను ప్రదర్శిస్తాడు .ఇతనిది స్వయంకృత  ఓటమికి విస్తృత పరిధి అవుతోంది .విస్తరణ ప్రవ్రుత్తి వినాశ హేతువు .అన్నిటినీ చేతిలో పెట్టుకొని శక్తులను సేవకు వినియోగించుకొంటున్నాడు  .ఈ పడమటి ప్రపంచ జనాలకు ఈ విషయం తెలుసో లేదోకాని వారి భవిష్యత్తు శీతాకాలం ,అతి విషాద భరితం ,అనూహ్యంగా ఉంది .మంచి కోరే హక్కు లేదు .కలలు కనే వారు మాత్రమె దీనికి ఏదో పరిష్కారం ఉందని అనుకొంటారు .ఆశావాది పిరికి వాడు .మనం ఈ కాలం లో పుట్టాం .కనుక కడదాకా ధైర్యంగా గమ్యానికి ఈ దారిలోనే ప్రయాణం చేయాలి .వేరే మార్గం లేదు .మన కర్తవ్యంచివరి దాకా కారణం లేకుండా ,ఆశ లేకుండా  పట్టుకొని వేలాడటమే’’అంటాడు స్పెంగ్లెర్ .

 ‘’ కళ  విషయానికి వస్తే మనం తూర్పు దేశాల వారి చేతిలో పరాజయమయ్యాం .పాశ్చాత్య సంస్కృతీ దాని నాగరకత తో పతనమైపోయింది .’’we have ruined classicism with soulless sentimentalities and destroyed pure form with multiple but meaningless decorations ‘’అని బాధ పడ్డాడు .’’ఇవాళ మనకేం మిగిలింది ? కృత్రిమ శబ్ద హోరుతో ,రణగొణ ధ్వనులు చెవులు బ్రద్దలయ్యే వాయిద్యాల హోరు  అరుపులు తో ఒక నకిలీ  సంగీతం, ఇతర దేశాల అసంబద్ధ ప్రభావం తో ,ప్రతి పదేళ్లకోసారి కొత్త శైలి పేరుతొ అసలు శైలే లేని నకిలీ పెయింటింగ్ తప్ప ఏం మిగిలింది మనకు ఏం మిగిలింది ?’’అని ఆవేదన చెందాడు అన్ని రంగాలలో దిగజారిపోతున్నవిలువలు, ప్రమాణాలను చూసి జీర్ణించుకోలేక బాధ పడ్డాడు .’’ఇప్పుడు మనకు అనుకరణ ,వక్రీకరణ ,పగిలిన అద్దం పెంకులు ,పరావర్తనాలకే పరావర్తనాలు మిగిలాయి. మనదైనదేదీ మనకు ఇప్పుడులేదు ‘’అన్నాడు .

   ఇవన్నీ అచ్చంగా మన కవిసామ్రాట్ శ్రీ   విశ్వనాధ సత్యనారాయణ గారి నోటి నుండి వెలువడిన వాక్కుల్లా ,వారి సాహిత్య సర్వస్వ0 లో  చెప్పిన విషయాలులాగా అనిపిస్తున్నాయి కదూ .”గ్రేట్ మైండ్స్ థింక్ అలైక్ ”అంటే ఇదే . 

      Inline image 1    Inline image 2  Inline image 3

                సశేషం

         మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -174 66-జీవిత చరిత్ర రచనలో కొత్త దారులు తొక్కిన బ్రిటిష్ రచయిత –లిట్ట

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -174

66-జీవిత చరిత్ర రచనలో కొత్త దారులు తొక్కిన  బ్రిటిష్ రచయిత –లిట్టన్ స్ట్రాచీ

చారిత్రిక జీవిత చరిత్రలను విప్లవాత్మకంగా మార్చి కొత్త ప్రమాణాలు సృష్టించిన బ్రిటిష్ రచయిత లిట్టన్ స్ట్రాచీ.సిగ్గరి అయిన ఆయన ఎప్పుడూ తల్లిని అంటి పెట్టుకొనే ఉండేవాడు .గడకర్రలాగా బారుగా పూచిక పుల్లలాగా అతి సన్నంగా ఉండేవాడు .తమాషాగా ఉండే వెలవెల బోయే చర్మం ,తీక్ష్ణమైన దృక్కులు విలక్షణంగా  ఉండి మరింత ఆశ్చర్యం కలిగించేవి .ఎడ్వర్డ్ లియర్ లిమరిక్కులు గుర్తుకొస్తాయి అతన్ని చూస్తె .కొందరు రచయితలతో ‘’బ్లూమ్స్ బరి గ్రూప్ ‘’ఏర్పడింది .అందులో సభ్యుడే అయినా పెద్దగా మాట్లాడకుండా ,శ్రద్ధగా వింటూ ‘’గూని వాడు ‘’లాగా ఒక మూల కూర్చునే వాడు .కళ్ళకు అద్దాలు గడ్డాలు మీసాలు తో ఎప్పుడూ వింటున్నా అవసరం వచ్చినప్పుడు యెగిరి గంతేసి అభిప్రాయం చెప్పేవాడు .కుటుంబ వ్యవస్థలో నే ఉండాలనుకోనేవాడే కాని అసలు పెళ్ళే చేసుకోలేదు  . 

     లండన్ లో 1-3-1880న లండన్ లో లిట్టన్ స్ట్రాచీ  ఒక అసాధారణ కుటుంబం లో జన్మించాడు .ఇండియన్ అడ్మిని స్ట్రెటర్అయిన జనరల్ సర్ రికార్డ్ స్ట్రాచీ కుమారుడు . ప్రఖ్యాత వ్యాస రచయిత అయిన లేడీ జెన్ స్ట్రాచీ ,స్పేక్టేటర్ పత్రిక సంపాదకుడు లో స్ట్రాచీ ,పొలిటికల్ ఎకనామిస్ట్ జాన్ స్ట్రాచీ ఆయన కజిన్స్ .కేంబ్రిడ్జి లో ట్రినిటి కాలేజి లో చేరి ,తాను రాసిన కవిత్వానికి బహుమతి రావటం తో ప్రసిద్ధుడయ్యాడు .అతని సంప్రదాయ బద్ధ కవిత్వం తో ముగ్ధులైన న్యాయ నిర్ణేతలు   భవిష్యత్తు లో ఆ సంప్రదాయాన్ని తుత్తునియలు చేస్తాడని ఊహించలేదు .గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే నాజూకైన సంప్రాదాయ కవిత్వాన్ని వదిలేసి  కత్తిపొట్ల వంటి వచనం రాయటం మొదలెట్టాడు .రాసింది ప్రతిదీ ఆలోచనాత్మకంగా ఉండేది.మొదటి పుస్తకం అచ్చు అయ్యే నాటికి అతనికి 32 ఏళ్ళు .40వ ఏట ఆతను రాసిన వ్యాసాలన్నీ కలిపి .’’ఎమినేంట్ విక్టోరియన్స్ ‘’పేరిట వెలువడ్డాయి .ఇది గోప్పకలవరాన్నే సృష్టించింది . వింత జీవిత చరిత్ర అధ్యయన వ్యాసాలే అవి .బాధాకర ,విచారణాత్మక ,కాపట్య ,ఆటవిక వ్యాసాలే .తిరుగు బాటు కుర్ర కారుకు హుషారు పుట్టించి ,ఆకర్షించాయి .ఇక్కడే ఆయనలోని విలక్షణ చరిత్రకారుడు బయటికొచ్చికళాత్మక జీవితచరిత్ర రచనకు ఆద్యుడయ్యాడు .సెన్సేషన్ సృష్టించి పాప్యులర్ అయ్యాడు .జీవిత చరిత్ర రచనా విధానానికి విస్తృత పరిధి కల్పించాడు .ఆతను  రాసిన ‘’క్వీన్ విక్టోరియ ‘’,పోప్’’,ఎలిజ బెత్ అండ్ ఎస్సెక్స్ ‘’రచనలు విప్లవాత్మక ,మానసిక విశ్లేషణాత్మక రచనలు .అంతకు ముందు ఎవరూ వీటి జోలికి వెళ్ళ లేదు .అందుకే జీవిత చర్తిత్ర రచనలో ‘’ట్రెండ్ సెట్టర్ ‘’అయ్యాడు .వ్యంగ్యం ,హాస్యం హేళనా,అవహేలణా దట్టం గా రంగరించి మహా ఆకర్షణ కలిగించాడు .క్షణం వదలకుండా విపరీతంగా చది వించే లక్షణం అతని ప్రత్యేకత.ఎవరి మీదో కోపం ద్వేషం తో రాసినవి కావు .’’It was not with  rude iconoclasm ,however but with a surgeon’s detachment and a scholar’s précision that he cut through the rigid pietism, the saddled sentiment and the prudish reticences ‘’అంటే ఒక శాస్త్ర చికిత్స వైద్యుడుగా తనకేమీ సంబంధం లేనట్లు ,ఒక విద్యా వేత్తకు౦ డాల్సిన ఖచ్చితత్వం తో,కఠిన పీటిజాన్ని,ఉయ్యాల లూగుతున్న సెంటి మెంట్ ను ,నంగనాచి అమాయకత్వాన్ని కోసి శుభ్రం చేశాడు .అనుమాన రహిత సత్యాలను వెలువరించాడు .ముగింపు బాధ్యతతీసుకోకుండా వదిలేశాడు .ఊహా గానాలకు ఎక్కువ అవకాశమిచ్చాడు .

        ఫిక్షన్ లాగా బయాగ్రఫీ కూడా విపరీతంగా చదివించేది గా ఉండాలని స్ట్రాచీ ముఖ్య  ఉద్దేశ్య౦.దీనితో ఆయన అనుకున్నది సాధించాడు .అతని నినాదాలు ‘’స్వచ్చ సంక్షిప్తత ‘’,నిష్పాక్షిక నిజం ‘’,విమర్శ విచారణకు స్వేచ్చ ‘’.ఇవి బాగా క్లిక్ అయ్యాయి .ఇవన్నీ ఒక కొత్త ఆలోచనా రచనా విధానానికి మానిఫెస్టో అయాయి  .కవిత్వం తో కూర్చిన రచనా విన్యాసం తో వ్యక్తిని పేజీ పై ఆవిష్కరింప జేశాడు .కవి పోప్ రాసిన సందర్భోచిత కవితా వాక్యాలను శీర్షికలుగా పెట్టి మాంచి ఊపు ,ఉత్సాహం కలిగించి చదివింప జేశాడు .

   అయితే స్ట్రాచీ పై చాలా అభియోగాలు వచ్చాయి  .చరిత్రను నవలలాగా తిరగ రాశాడుఅన్నది ఒక అభియోగం  .చని పోయిన వాళ్ళు రాసినట్లుగా ఉత్తరాలు అందులో రాసి ,వాళ్ళెవరూ డిఫెన్స్ చేసుకోలేరు కదా అనే ధర్యం తో పేజీలు  నింపాడు అన్నది మరొకటి .కలాన్ని క్రూర నిర్హేతుక ఇంకులో ముంచి గిలికాడు అన్నది వేరొకటి .అతనిది ద్వేషం కాదు ,వినాశనమూ కాదు .ఎక్కడ మంచి ఉన్నా గ్రహించాడు .దానిని గీటు రాయితో పరీక్షించి పదును పెట్టిరాశాడు .ఒక ప్రత్యేక శైలి కోసమే శైలి అవలంబించాడు .సాహిత్యం లో ప్రాణం చూశాడు .కేరక్టర్ లను కారి కేచర్(వ్యంగ్య పాత్రలు ) లుగా మార్చాడు .అదొక ఆర్ట్ . తాను  రాసిన ప్రతి పాత్రనూ అమితంగా అభిమానించి ప్రేమించి ఆరాధించి మాత్రమే రాశాడు .మొదట్లో క్వీన్ విక్టోరియా ను చాలా పొడి పొడి మాటలతో ,హేళనగా రాశాడు .తర్వాత  సరదాగా మొదలుపెట్టి ,క్రమంగా గౌరవ ,అభిమాన ఆరాధనలతో పూర్తీ చేశాడు .

     1944లో మాక్స్ బీర్ బొమ్  స్ట్రాచీ లోని రచనా సామర్ధ్యాన్ని గూర్చి మాట్లాడుతూ ‘’his pioneering irony ,his dramatic and at times melodramatic effectiveness ‘’బాగా ఆకర్షించింది అన్నాడు .చదివేప్పుడు గోప్పఆనందాన్ని కల్గించే లక్షణం  స్ట్రాచీ లో ఉందనటం పూర్తీ సత్యం .ఆతను ప్రవేశ పెట్టిన మేనరిజం లు కూడా తమాషా గా ఉంటాయి .అతని ‘’పోర్త్రైట్స్ అండ్ మినీ ఎచర్స్ అండ్ బుక్స్ అండ్ కేరక్టర్స్’’అనే చిన్న రచనలను చదవటానికి ఎక్కువ ఇష్ట పడతారు  .’లేడీ హెస్టర్ స్టాన్హాప్ మరో ప్రత్యేకమైనది .1932లో స్ట్రాచీ 52వ ఏట చనిపోయే నాటికి అతని ప్రభావం ప్రపంచమంతా వ్యాపించి ఉంది .’’Strachey ‘s power of revaluation ,incisive skepticism ,and challenging imagination ,he not only changed the biographers approach ,but also made the reader look for the living men and women too often buried in the solidly official biographies ‘’అని చెప్పిన రచయిత లూయీ అంటర్ మేయర్ మాటలు స్టాలు .

   ఫ్రాయిడ్ ప్రభావం స్ట్రాచీ రచనలపై బాగా ఉంది .డాస్టోవిస్కీ ప్రభావం మరీ ఎక్కువ .1916లో లండన్ తిరిగి వచ్చి తల్లితోనే ఉన్నాడు .తన గ్రూప్ బ్లూమ్స్ బెరీ సభ్యులతో తానూ హోమో సెక్సువల్ అని తరచుగా చెప్పుకోనేవాడు .పాట్రిడ్జ్ అనే వాడితో మరి కొందరితో ఆ సంబంధాన్ని సాగించాడు కూడా ..అందులో సభ్యురాలైనపెయింటర్ డోరాకారింగ్ టన్ తో అసాధారణ సాన్నిహిత్యం ఉండేది .ఇద్దరూ కలిసి నాలుగేళ్ళు స్ట్రాచీ1921 మరణం వరకు జీవించారు కూడా . 1921లో ఆమె రాల్ఫ్ ను పెళ్లి చేసుకోవాలను కొన్నది .ప్రేమ తోకాదు,రక్షణ కోసమే .స్ట్రాచీ చనిపోయిన రెండు నెలలకే ఆత్మా హత్య చేసుకొన్నది .

   స్ట్రాచీ బ్రతికి ఉండగానే ఆరుపుస్తకాలు –లాండ్ మార్క్స్ ఇన్ ఫ్రెంచ్ లిటరేచర్ ,ఎమినేంట్  విక్టోరియన్స్ ,క్వీన్ విక్టోరియ ,బుక్స్ అండ్ కారక్టేర్స్,ఎలిజబెత్ అండ్ ఎస్సెక్స్ ,పోర్త్రైట్స్ అండ్ మినీ యేచర్స్ ప్రచురింప బడ్డాయి .చనిపోయాక 8పుస్తకాలు –కారేక్టర్స్ అండ్ కామే౦టరీస్,స్పెక్టే టోరియల్ ఎస్సేస్ ,ఎర్మిట్రూడ్అండ్ ఎస్మేరాల్డా ,లిట్టన్ స్ట్రాచీ బై హింసెల్ఫ్ ,ది రియల్లీ ఇంటరెస్టింగ్ క్వేస్చన్ ,ది  షార్టర్ స్ట్రాచీ ,లెటర్స్ ఆఫ్ లిట్టన్ స్ట్రాచీ ,అన్ పబ్లిషేడ్ వర్క్స్ ఆఫ్ స్ట్రాచీ వచ్చాయి .

  His biographical creed was to paint a picture of the person from the author’s viewpoint—never mind the scholarly inhibitions, never mind the search to find “the truth” of any human situation so far as is possible. He had a “laughing admiration” for the satirists of the 18th century, like Voltaire (1694-1778). He saw religion as Voltaire saw it, as a “ludicrous anachronism.” Careers in public service were mainly full of political intrigue. But human relationships were the nexus of life itself. Strachey eschewed the standard “two fat volumes” of Victorian biographies (he saw these tomes as “hagiographies”: treatment of the illustrious dead). He favored for himself brief biographies, the art of which rested on the subject’s motive and personality as he saw it.

Inline image 1  Inline image 2Inline image 3Inline image 4

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-24-6-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -173 65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్ -3(చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -173

65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్ -3(చివరి భాగం )

 

 

అన్ని అధికారాలుస్టాలిన్ హస్తగతం  అయ్యాయి .సోవియెట్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో సంవత్సరానికి నాలుగు సార్లు పార్టీ మీటింగులు జరిగేవి .1925నుంచి 1939వరకు ఉన్న 14ఏళ్ళలో నాలుగు మీటింగ్ లే జరిగాయి .1939తర్వాత అసలు జరగనే లేదు .దేశ స్థిరత్వానికి స్టాలిన్ విపరీతంగా ప్రచారం నిర్వహించాడు .స్టాలిన్ కు  కమ్యూనిజాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశ్యం కంటే ప్రపంచానికి రష్యా నాయకత్వం కావాలని ప్రయత్నించాడు ..కార్పతో యుక్రెన్ రష్యాలో కలిసిపోయాక పోలాండ్ ,హంగేరి ,యుగోస్లోవియ బల్గేరియా జేకోస్లోవేకియాలు స్టాలిన్ నియంత్రణ లోకి వచ్చాయి .ఈ దేశాలలోని నాన్ కమ్యూనిస్ట్ పార్టీ లన్నిటి అస్తిత్వాన్ని దెబ్బతీశాడు .ఈ’’సాటిలైట్’’దేశాలను గ్రిప్ లో ఉంచుకోవటానికి కొంత హింస తప్పలేదు ,జెకోస్లోవేకియా విషయం లో ఇదే జరిగింది .1948లో మార్షల్ టితో స్టాలిన్ తో విభేదించి ఆ దేశం కమ్యూనిస్ట్ దేశమే అయినా క్రెమ్లిన్ ఆదేశాలను ‘’బే ఖాతర్’’ చేసింది.ఈ దేశాలు జారిపోకుండా ఉండటానికి   స్టాలిన్ ఆ దేశాదిపతుల మాట వినాల్సిన్దేనన్నాడు .ఇప్పటి దాకా ప్రాముఖ్యమున్న అగ్రశ్రేణి కమ్యూనిస్ట్ నాయకులైన రుమేనియా లోని అన్నా పాకేర్ ,జెక్ లోని స్లాన్కీ ,పోలాండ్ లోని గోముల్క హన్గేరిలోని రాజ్క్ బల్గేరియాలోని కొస్తోవ్ లను ప్రక్షాళనం చేశాడు .

   ఈ రకమైన అననుకూల పరిస్థితులు ‘’కోల్డ్ వార్ ‘’ప్రచ్చన్న యుద్ధానికి దారి తీశాయి .స్టాలిన్ అందుబాటులో ఉండక ,అవిధేయుడుగా ఉండిపోయాడు .మార్షల్ ప్లాన్ లో భాగ స్వామి కాలేదు .తన దేశానికి ఆర్ధిక సాయం చాలా అవసరం .ఎన్నో ఫాక్టరీల అస్తిత్వం ప్రశ్నార్ధక మౌతోంది .యుద్ధాలవల్ల నిత్యావసర వస్తువులు దొరకటం లేదు దొరికినా విపరీతమైన ధరలతోజనం అల్లల్లాడి పోతున్నారు .వ్యవసాయ ఉత్పత్తి అడుగంటింది .కాని రష్యా అద్భుతమైన విమానాలు ,సబ్ మేరీన్లు ,జెట్ యుద్ధ విమానాలు ,గైడెడ్ మిసైల్ ,అటామిక్ ,హైడ్రోజెన్ బాంబ్ లను తయారు చేసింది .పశ్చిమ దేశాలు దీన్ని వ్యతిరేకించాయి నిరసనలు తెలిపాయి .శాంతి సమావేశం స్టాలిన్ కు ఇస్టం లేదు .’’sincere diplomacy is no more possible than dry water or iron wood ‘’అన్నాడు .’’హౌ రష్యా ఈజ్ రూలేడ్ ‘’అనే పుస్తకం లో మిర్లీ ఫైన్సాడ్’’పార్టీలో  నాయకుల మధ్యఉన్న  పరస్పర ద్వేషం ,పార్టీ నాయకత్వం పై అవిశ్వాసం ,రహస్య పోలీస్ దళం ,పాలనా వ్యవస్థ ,సైన్యం పారిశ్రామిక నిర్వహణ స్టాలిన్ కు కలిసి వచ్చాయి .పార్టీలోని గ్రూపులు తోలు బొమ్మలాట వంటివికావు చాలా శక్తి వంతమైనవి .వీటిని నిర్వీర్యం చేసి పాలించాడు స్టాలిన్ .మరొక ఆయన ‘’Stalin’s workers state was a combination of the economic exploitation of early capitalism with the political terror of modern totalitarianism ‘’అని స్టాలిన్ పాలన లోని రష్యా గురించి అన్నాడు .రష్యా ప్రజలకు స్టాలిన్ పాలనకు మధ్య స్పష్టమైన విలక్షణత ఉంది .దీన్ని వివరిస్తూ స్టీవెన్ ‘’the problems created in a decent people by the forced maintenance of power will some how in the end destroy that power ‘’అని హెచ్చరించాడు .

  ‘’అధికారం అవినీతి కి నిలయమౌతుంది .పూర్తీ అధికారం పూర్తీ అవినీతికి నిలయమౌతుంది ‘’అని ఎప్పుడో లార్డ్ యాక్టన్  చెప్పాడు .స్టాలిన్ సర్వాధికారి అయ్యాడు .స్టాలిన్ చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాడు .స్టాలిన్ రెండో అభిప్రాయానికిఅవకాశం , విలువ ఇవ్వలేదు .విరుద్దాభిప్రాయమేర్పడితే దాన్ని ఫిరాయింపు అని ముద్ర వేసేవాడు .వారితో బహిరంగంగా క్షమాపణ చెప్పించేవాడు .కళ సంగీతం సాహిత్యం స్టాలిన్ దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడ్డాయి ఆయనకేవారు నచ్చితే వారికి సత్కారం .’’state is not meant to be of service to the individual ,but that ,on the contrary man was meant to serve the state’’అన్నది స్టాలిన్ అభిప్రాయం .

  70వ ఏడు వచ్చేసరికి స్టాలిన్  వ్యక్తీ నిష్ట పూర్తిగా పెరిగింది .ప్రతి మ్యూజియం ,ప్రభుత్వ ప్రతి బిల్డింగ్ అందులోని  , ప్రతిగది అయన చిత్రపటం వేలాడేట్లు చేసుకొన్నాడు .ఆయన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టించుకొన్నాడు ప్రతిస్కూల్ లోనూ ఆయన విగ్రహాలను విద్యార్ధులు చూసేట్లు ఏర్పాటు చేశాడు .ఆయన ఉద్దేశ్యం ఎక్కడ చూసినా స్టాలిన్ కనపడాలి ,ఆయన దృష్టికి రాని విషయం ఉండ కూడదు అని .ప్రపంచ జనాభాలో మూడవ వంతు ఉన్న రష్యా కు ఆయన సర్వాధికారి .కనుక ఆయన్ను అందరూ పొగడాలి .మెచ్చుకోవాలి .ఆప్రజల భాగ్య విధాత స్టాలిన్ అని అబ్బుర పడాలి .1953లో స్టాలిన్ కు మొదటి సారి గుండెపోటు వచ్చింది. దాన్ని రహస్యంగా ఉంచి అత్యధిక శ్రద్ధతో మందులతో నివారించారు .రెండవ సారి వచ్చింది బ్రెయిన్ హేమరేజ్ కు దారి తీసి చావు ముంగిట్లోకి వెళ్ళాడు .శక్తి వంతమైన వైద్య విధానాలేవీ పని చేయలేదు .నాలుగు రోజుల తర్వాత రక్త ప్రవాహం క్షీణించి 5-3-1953న నియంత స్టాలిన్ మృత్యు కౌగిలి చేరాడు .74వ ఏడు రాకుండానే ,29 ఏళ్ళు అధికారం చెలాయించి స్టాలిన్ మరణించాడు ..

    రష్యాలో స్టాలిన్ కంట్రోల్ లో సైన్స్ టెక్నాలజీ ఆర్ట్,సాహిత్యం అన్నీనడిచాయి .అగ్రానమిస్ట్ త్రోఫిం లిసేంకో మాటలకు విలువ ఇవ్వక ,మాన్దేలిన్ జెనెటిక్స్ ను కాదని లేమేర్కియాన్ ఇంహేరిటేన్స్ కు ప్రాధాన్యమిచ్చి హైబ్రేడేషన్ ను ప్రోత్సహించాడు .బయాలజీ పై పూర్తీ అవగాహన లేనందున రష్యా వ్యవసాయ ఉత్పత్తి బాగా తగ్గిపోయింది .సైంటిస్ట్ లందరూ వ్యతిరేకించి వీధిపోరాటం చేశారు. ఆధునిక జెనెటిక్స్ మార్గ దర్శి నికోలాయ్ వావిలోవ్ తో సహా అరెస్ట్ చేసి అంతం చేశాడు .

   మగపిల్లలతో సమానంగా ఆడపిల్లకు ఉచిత విద్య ,ఉద్యోగం సంక్షేమం కల్పించాడు .ఆరోగ్య రక్షణ కల్పించి జీవన పరిమితి పెంచాడు .టైఫాయిడ్ ,కలరా మలేరియాలు రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకొన్నాడు .వందలాది విదేశీ ఇంజనీర్లను ఆహ్వానించి దేశ పురోభి వృద్ధిలో భాగ స్వాములను చేశాడు .స్త్రీ సంక్షేమాన్ని పకడ్బందీ గా అమలు చేశాడు .స్త్రీలు హాస్పిటల్ లో కనే ఏర్పాటు చేసి ,సకల సౌకర్యాలు కల్పించాడు .రవాణా సౌకర్యాలు వృద్ధి చేసి అనేక కొత్త రైలు మార్గాలు నిర్మించాడు .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా మహిళ అన్నిటా అగ్ర గామి అయింది .

  పుట్ట్టుక తో జార్జియన్ అయినా రాజకీయం లో ఆరితేరి రష్యన్ జాతీయతనే అనుసరించాడు .రష్యా చరిత్ర,సంస్కృతీ నాయకుల వారసత్వాలను ను నిలబెట్టాడు . రష్యేతర మైనారిటీలకంటే రష్యా ప్రజలు పెద్దన్నయ్యలు అనేవాడు .పెయింటింగ్ శిల్పం సంగీతం ,సాహిత్యాలలో అప్పటిదాకా వ్యాపించిన  ఎక్స్ పెరి మెంటలిజం  ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్ మొదలైన వాటిని నిరుత్సాహ పరచి ‘’సోషలిస్ట్ రియలిజం’’ కు ప్రాదాన్యమిచ్చాడు .ఆయనకు బహు ఇష్టమైన నవల ‘’ఫారో ‘’.జార్జియన్ సాంప్రదాయ కుటుంబం లో జన్మించినా మతాన్ని కాదని ఎదీస్ట్ అయ్యాడు .ప్రభుత్వమూ దీనినే ప్రోత్సహించింది .మత సంబంధ కట్టడాలను ప్రోత్సహించలేదు .1945 ,48లలో రెండు సార్లు స్టాలిన్  నోబెల్ బహుమతి కి నామినేట్ అయ్యాడు .కాని రాలేదు .

   మూడు లక్షల పోలిష్ ప్రజలను బందీలను చేసి అందులో 25వేలమందిని చంపేశాడు .యుద్ధానికి చెందిన అనేక వివాదాస్పద ఆర్డర్లు జారీచేశాడు .జపాన్ చేతుల్లోంచి కొరియాను స్వాధీనం చేసుకొన్నాడు .స్టాలిన్ కు మావో కు విభేదాలు౦ డేవి.స్టాలిన్ చాగ్ కై షేక్ ను సమర్ధించాడు .చియాంగ్ ను మావో ఓడించాక స్టాలిన్ మావో ను సమర్ధించాడు .ఇస్రాయిల్ ఏర్పాటును బాగా సమర్ధించి ,అక్కడ ప్రభుత్వం ఏర్పడగానే దాన్ని మొదటి సారిగా గుర్తించాడు .గోల్డా మేయర్ మొదటి విదేశాంగ మంత్రిగా రష్యాలో పర్యటించింది .జెక్ ద్వారా ఇస్రాయిల్ కు ఆయుధ సామగ్రి అందించి ,తర్వాత’’ తూ నా బొడ్డూ ‘’అన్నాడు .రష్యా ప్రచ్చన్న యుద్ధం పై వచ్చిన ‘’ఫాల్సి ఫయర్స్ ఆఫ్ హిస్టరీ ‘’పుస్తకాన్ని ఎడిట్ చేసి కొంత తానూ అందులో రాశాడు . At the end of May 1945, Stalin proposed a victory toast to the Soviet people, and to the virtues of the Russian majority in particular:

I should like to propose a toast to the health of our Soviet people, and in the first place, the Russian people. (Loud and prolonged applause and shouts of ‘Hurrah!’)

I drink in the first place to the health of the Russian people because it is the most outstanding nation of all the nations forming the Soviet Union.
I propose a toast to the health of the Russian people because it has won in this war universal recognition as the leading force of the Soviet Union among all the peoples of our country.
I propose a toast to the health of the Russian people not only because it is the leading people, but also because it possesses a clear mind, a staunch character, and patience.[283]

   అని విక్టరీ టోస్ట్ తీసుకొన్నాడు .

    స్టాలిన్ చనిపోయాక ఏర్పడిన ‘’కిస్సా కుర్సీ కా ‘’ఆటలో ఎందరో పోటీ పడినా చివరికి1958లో పూర్తీ అధికారాలను దక్కి౦చు కోన్నవాడు కృశ్చెవ్ .’’మర్డరస్  టిరంట్ ‘’అని రష్యా ప్రజలు స్టాలిన్ ను అన్నా ఇప్పటికీ ఆయనకు వోటు వేసేవారి శాతం 35 ఉంది అంటే ఆశ్చర్య మేస్తుంది .2008 లో రష్యన్ టెలివిజన్ నిర్వహించిన ‘’నేం ఆఫ్ రష్యా ‘’పోటీలో స్టాలిన్ మూడవ వ్యక్తిగా ఎంపికయ్యాడు .

   తాను తాగుతూ చుట్టూ ఉన్న వాళ్ళతోబలవంతంగా  తాగించటం స్టాలిన్ వేడుక .రష్యన్ వోడ్కా కంటే జార్జియన్ వైన్ ఇష్టపడే వాడు .స్టాలిన్ కు అమెరికన్ కౌ బాయ్ సినిమాలు చాలా నచ్చేవి అని కృశ్చెవ్ చెప్పాడు .స్టాలిన్ పొందిన బిరుదులూ చాలా ఉన్నాయి అందులో కొన్ని –హీరో ఆఫ్ ది సోవియెట్ యూనియన్ ,హీరో ఆఫ్ ది సోషలిస్ట్ లేబర్ ,ఆర్డర్ ఆఫ్ విక్టరి ,ఆర్డర్ ఆఫ్ లెనిన్ ,మెడల్ ఫర్ విక్టరి ఓవర్ జర్మని ఆర్డర్ ఆఫ్ ది రెడ్ స్టార్ ,హీరోఆఫ్ ది మంగోలియన్ పీపుల్ రిపబ్లిక్ .స్టాలిన్ కవిత్వం తో పాటు 14రచనలు చేశాడు .ఏది ఏమైనా రష్యా లో స్టాలిన్ ఒక లెజెండ్ అన్నది మాత్రం యదార్ధం 

   Inline image 1   Inline image 2Inline image 5

.Inline image 3Inline image 4

    సశేషం                                                                      

         మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-6-16-ఉయ్యూరు

  

           

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -172

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -172

65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్ -2

ఉగ్రవాద పాలన(రీన్ ఆఫ్ టెర్రర్ ) 1930లో మొదలైంది .రెడ్ ఆర్మీ జనరల్ స్టాఫ్ కు చెందిన వేలాది మంది ,చిన్న రైతులు ,స్టాలిన్ ను విమర్శించేవారు అందరూ చంప బడ్డారు .అ౦తకు రెట్టింపు మంది ని జైల్లో పెట్టారు .లెనిన్ అనుకూలురులలో చాలామందిని ప్రక్షాళన చేశారు  .జినోవీవ్ తర్వాత వచ్చిన సెర్జీ కిరోవ్ హత్య చేయబడ్డాడు .కొద్దికాలానికి  తూతూ మంత్రంగా విచారణ(పర్జ్ ట్రయల్ ) 1937దాకా జరిపించారు .లెనిన్ అనుచరులు ,అభిమానులు ,రివల్యూషన్ లో పాల్గొన్నవారు ,ప్రచారకులు ,ఉన్నతాధికారులు అందరూ అవినీతి బూర్జువాలకు తొత్తులని ,నాజీ జర్మనీతో చేతులుకలిపి దేశం లో కేపిటలిజం తెచ్చే కుట్ర చేస్తున్నారని అభియోగం మోపారు .దేశ భక్తితో రివల్యూషన్ లో పాల్గొన్న వారిని ,వారి కుటు౦బాలవారినీ  ద్రోహులని ,దేశం లో అభద్రతా వాతావరణాన్ని సృష్టిస్తున్నారని నిందమోపి,విచక్షణా రహితంగా  ఏరి పారేస్తున్నారు .ప్రముఖ సైనికాదికారుల్ని ఉరితీస్తున్నారు .లక్షలాది ప్రభుత్వ అధికారుల్ని ,పార్టీ సభ్యులని కుట్రదారులు ,ఫాసిస్ట్ లూ అని ముద్రవేసి చడీచప్పుడూ కాకుండా చంపేసి (కోల్డ్ బ్లడేడ్ మర్డర్ ),ప్రవాసంలోకి చాలామందిని పంపేశారు .విచారణలన్నీ చాలా రహస్యంగా జరిగేవి .నేరాన్ని బలవంతంగా ఒప్పుకోనేట్లు చేసే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి .ట్రోట్స్కి నిఆయన పరోక్షం లో విచారణ జరిపి ,ఆయన్ను ,విధానాలను ఖండించారు .బోల్షెవిక్ విప్లవాన్ని మోస్తున్నట్లు ,సోవియట్ పాలనమొదలైనట్లు భ్రమ కలిగించి  దేశ ద్రోహుల సాయం తో దేశద్రోహులకోసం  నాటకమాడారని ‘’న్యూయార్క్ టైమ్స్ రాసింది ‘’.’’మిత్రత్వం ‘’(బ్రదర్ హుడ్ )అనేమాట పరిహాస పదమై పోయింది .వర్గ రహిత సమాజం అన్నది పగటికలే అయింది .కొన్ని ప్రక్షాళన విచారణల తర్వాత సమాజం లో అన్ని తరగతులవారు భయం ,క్రూరత్వం హింసలకు గురైపోయారు .

     ఈ హింసా దౌర్జన్యాలన్నీ స్టాలిన్ చేయి౦చినవే అని నమ్మకం కలిగినా ,ఆయన్ను చూస్తే మాత్రం అంతటి రక్త పిపాసి అని అనిపించడు.ముఖం లో ఆభావాలేవీ వ్యక్తీకరించడు .సాదుస్వభావమైన గుండ్రని ముఖం తో,తీగాల్లాంటి జుట్టుతో ,ప్రీతిపాత్రమైన వాల్రస్ లాంటి మీసం తో ,అయిదు అడుగుల ఆరంగుళాలు మాత్రమే ఉన్న  ఎత్తు తో బలిష్టంగా దాదాపు 190పౌండ్ల బరువుతో ఉండేవాడు .చేతులు ఆయన బుర్ర అంత గట్టిగా పొడవుగా ఉండేవి ..’’ఆకర్షణీయం కాని మనిషి .కాని కళ్ళల్లో ఏదో వెలుగు ,ముఖంలో స్పష్టత కనిపిస్తాయి .పొడగరికాకున్నా మహా బలవంతుడు అనిపిస్తాడు .ఆ మొగానికి నల్లని కళ్ళే అందం, ఆకర్షణ .అన్ని వేళలలోనూ సామాన్య సైనికుడి  దుస్తులనే వేసుకొనేవాడు .చాలా చౌక రకం పైప్ నె పీల్చేవాడు .చదరంగ ఘనాపాటి స్టాలిన్ .ఆట విడుపుకోసం చెస్ ఆడేవాడు .కాని ఆప్యాయత ప్రేమ ఉన్న తండ్రి. తన పిల్లలను సామాన్య పిల్లల్లాగానే పెంచాడు .’’స్టాలిన్ ఇంట్లో ఒక బెడ్ రూమ్ ,ఒక డైనింగ్ హాల్ ,పని చేసుకొనే గది ,స్నానాల గది మాత్రమె ఉన్నా డాబుసరిగా ఉంది ‘’అని చర్చిల్ చెప్పాడు .

           స్టాలిన్ వ్యక్తిగత జీవితం రహస్యమైనది .మొదటిభార్య ఎకటారినాస్వా౦డిజ్ ఒక కొడుకు జాకబ్ ను కన్నది .ఆతను రెండవ ప్రపంచ యుద్ధం లో జర్మన్ వార్ ప్రిజనర్ అయ్యేదాకా అతని గురించి లోకానికి తెలియనే తెలియదు .1907లో భార్య చనిపోతే పన్నెండు ఏళ్ళ తర్వాత నాడ్యాఅలిలూయేవా ను  రెండో పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఆయన తో రివల్యూషన్ లో పాల్గొన్న సహచరుని 19ఏళ్ళ అమ్మాయి .వీరికి పుట్టిన కొడుకు వాసిలి సోవియెట్ ఎయిర్ ఫోర్స్ లో లెఫ్టినెంట్ జనరల్ .అందమైన ఎర్ర జుట్టు కూతురు స్వెత్లానా .రెండోభార్య 1932లో మిస్టరీ గా ఆత్మ హత్య చేసుకొని చనిపోయింది .మూడో భార్య కగనోవిచ్ గురించి లోకానికేమీ తెలియదు .

     జరిగిన, జరుగుతున్నా హింస దౌర్జన్యాలకు స్టాలిన్ పైనే నెపం వేసినా , స్టాలిన్ వ్యతిరేకులు కూడా ఆయన కొన్ని మంచి పనులు చేశాడని అంటారు .పీటర్ ది గ్రేట్ తర్వాత సోవియెట్ యూనియన్ ను అంతగా అభి వృద్ధి చేసిన వారెవరూ లేరు .ఒక్క స్టాలిన్ మాత్రమే ఆపని చేయ గలిగాడు .పంచ వర్ష ప్రణాళికలు రచించి చక్కగా అమలు పరచి క్రూర అనాగరిక .దేశాన్ని సాంఘిక ఆర్ధిక రంగాలలో అభివృద్దిపరచి ఆధునిక రష్యాగా మార్చాడు .లెనిన్ కోరినట్లుగా విద్యుత్ అవసరాన్ని గుర్తించి ,వెయ్యిమంది నిపుణులతో అధ్యయనం చేయించి దాని సారాంశాన్ని కాచి వడపోసి ,టెక్నీషియన్ ల తో పని చేయించి గొప్ప విద్యుత్ ప్రణాళిక తో పారిశ్రామిక దేశంగా రష్యాను నిలబెట్టాడు .ఊసర క్షేత్రాలను సస్య శ్యామలం చేశాడు .ఎద్దుల బదులు ట్రాక్టర్ వ్యవసాయం ప్రవేశ పెట్టి ,పూర్వం డజన్ ఎకరాలలోపాత పద్ధతులలో  పండేపంటను ఆధునిక విధాన అవలంబన వలన ఒక్క ఎకరం లోనే పండేట్లు చేస్సి సస్య విప్లవమూ తెచ్చాడు. సమైక్య వ్యవసాయ నినాదం తో ముందుకు సాగుతూ దీన్ని వ్యతిరేకించే భూస్వామ్య ,రైతు ,వ్యవసాయ దారులను కఠినంగా శిక్షించాడు .వారి భూములను పేదరికం తోఅలమటిస్తున్న బడుగు రైతులను ఆక్రమించి దున్నుకోమన్నాడు .విద్యా ,మిలిటరీ విధానాలలో సమూలమైన మార్పులు తెచ్చాడు .జార్ రాజుల పాలనలో 79 శాతం ఉన్న నిరక్షరాస్యతను 10శాతానికి తగ్గించగలిగాడు .సాంకేతికత ఇస్తున్న సత్ఫలితాలకు ఆకర్షి౦ప బడి జనం సైన్స్ చదవటానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు .1916లోరష్యాలో కేవలం 200లాబరేటరీలు మాత్రమె ఉండేవి .ఇరవై ఏళ్ళ తర్వాత వాటి సంఖ్య గణనీయంగా 2,0 00 కు పెరిగింది .విప్లవ అభ్యుదయం శాంతిని ఇవ్వదు అని భావించి యుద్ధానికి  సన్నద్ధయ్యాడు స్టాలిన్ .

              ఈలోగా స్టాలిన్ పూర్తీ నియంత అయ్యాడు .ఖచ్చితమైన ఆటవిక సెమి ఒరిఎంటల్అయ్యాడు .ఆయన్ను అప్పుడు ‘’టెలిఫోన్ ఉన్న చెంగిజ్ ఖాన్ ‘’అన్నారు .రెం ప్ర.యు.వస్తుందని ఊహించి రష్యా దానిలో భాగ స్వామి కాకూడదని నిర్ణయించాడు .నాజీల బెదిరింపులు చూసి ,తన దౌత్యవేత్తలను పిలిపించి హిట్లర్ తో చర్చలు జరిపించి పరస్పర ఆక్రమణ దాడులకు స్వస్తి చెప్పే ఒడంబడిక పై సంతకం చేశాడు .కాని హిట్లర్ దీన్ని అతిక్రమించి అతి వేగం గా రష్యా పై దాడికి దిగటం తో జర్మన్లను ఆపటం అసాధ్యం అని గ్రహించాడు .హిట్లర్ వరుసగా నగరం తర్వాత నగరం ఆక్రమిస్తున్నాడు .రష్యా గుండెకాయ మాస్కో ముంగిట్లో వాలి దాడికి సిద్ధమయ్యారని తెలిసి అత్యంత ప్రతిభావంతంగా చురుగ్గా బెదురు లేని యుద్ధ నిపుణుడుగా  అవతారం ఎత్తాడు .ప్రభుత్వం రక్షణకోసం కూబి షేవ్ కు వెళ్ళగా స్టాలిన్ కొద్దిమంది అధికారులతో క్రెమ్లిన్ లోనే ఉండి పోయాడు . జర్మన్లు శీతాకాలం లో గోతులు త్రవ్వటానికి  ముందే  భూమిని మండించే విధానం అవలంబింప జేసి ,వాళ్లకు నిలువ నీడ లేకుండా చేసి గత్యంతరం లేక జర్మనీ సైనికులు వెనక్కి తిరిగి వెళ్లి పోయేట్లు గొప్ప వ్యూహం పన్ని దాదాపుగా నెపోలియన్ అనుభవించిన పరాజయ పరాభవాన్ని హిట్లర్ కూ జర్మనీకి కలిగించి బుద్ధి చెప్పాడు .రెండేళ్ళ తర్వాత హిట్లర్ కొత్త బలగాలతో స్టాలిన్ గ్రాడ్ ను చుట్టూ ముట్టాడు .ఎన్ని ఇబ్బందు లెదురైనా  తన సైన్యాన్ని వెనకడుగు వేయవద్దని చాలా కఠినంగా ఆదేశించాడు  దాదాపు మూడు లక్షల జర్మన్ శత్రు సైన్యం పై మెరుపు దాడులు జరిపి వెనక్కి నెట్టేసి స్టాలిన్ ప్రపంచ చరిత్రలోనే మహాద్భుత యుద్ధ విజయాన్ని సాధించాడు .ఈ విజయమే ఆ తర్వాత సంకీర్ణ దేశాల యుద్ధ విజయానికి దారి చూపింది .చరిత్రలో స్టాలిన్ ఉక్కు మనిషి అని నిరూపించుకొన్నాడు మళ్ళీ .హిట్లర్ పప్పులు స్టాలిన్ ముందు ఉడకలేదు .

   ‘’బిగ్ త్రీ ‘’అనబడే మూడు దేశాల ప్రెసిడెంట్ లు  టెహ్రాన్ ,యాల్టా,పాట్స్ డాం లలో జరిపిన చర్చలు ఫలించి పరస్పర సైన్య ఆర్ధిక సహకారం తో భవిష్యత్తులో కలిసిపని చేయాలని ఉక్కు తెరరష్యా మిగిలిన ప్రజాస్వామిక ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాయి .అలానే కలిసి పోరాడి జర్మనీ దాని అక్ష దేశాలపై పోరాటం జరిపి హిట్లర్ పతనాన్ని తెచ్చి నాజీ నియంతృత్వానికి మంగళ గీతం పాడాయి .యుద్ధం తర్వాత వీరిలో వీరికి పరస్పర అనుమానాలు అపనమ్మకం ఏర్పడి నమ్మకాలు సడలి చర్చిల్ చెప్పినట్లుగా రష్యా ‘’ఇనుప తెర’’ను వేసుకొని మిగిలినవారికి ప్రవేశం లేకుండా చేసింది .పశ్చిమ దేశాల శక్తి తోచేతులు కలపలేదు .తర్వాత సోవియెట్ రష్యా అమెరికాతో యాల్టా సమావేశం లో కలిసి రష్యాకు పూర్తీ వీటో హక్కు ఇవ్వాలని స్టాలిన్ గట్టి పట్టు పట్టాడు .దాన్ని సాధించి తరచుగా వీటో పవర్ తో గేములాడి అమెరికా ముందరి కాళ్ళకు బందం వేసి దాని అభి వృద్ధికి ఆటంక పరచాడు .ఇతర దేశాలపై అమెరికా దాని అనుచర దేశాలు అనవసరదాడులకు దిగకుండా కట్టడి చేయగలిగాడు .ప్రపంచ సమస్యలపై సహకార విధానానికి అడ్డుగా నిలిచాడు .

 

Inline image 1Inline image 2

                      సశేషం

      మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-6-16-ఉయ్యూరు

 

           

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-14

ఇది విన్నారా ,కన్నారా !-14

27-వైణిక సార్వ భౌమ –పొడుగు రామ మూర్తి

201-1871లో జన్మించి విజయనగరం లో నివాసమున్న పొడుగు రామ మూర్తిగారు విజయనగర సంస్థాన ఆస్థాన విద్వాంసులైన శ్రీ సాలగ్రామం గోపాలం గారి వద్దా ,కట్టు వీరన్న గారి వద్దా వీణ నేర్చారు .దక్షిణ దేశానికి వెళ్లి కొనే రాజాపురం వైద్యనాధయ్యర్ ,తిరుకోడి కావాల్ కృష్ణయ్యర్ లతో స్నేహం సాధించారు .మద్రాస్ వచ్చి సంగీత కచేరీ చేశారు .సభలో శ్రోతలైన బెంగుళూరు నాగ రత్నమ్మ ,తిరువత్తూర్ త్యాగయ్య ,సుమతి కృష్ణా రావు వీరి వీణా వైదుష్యాన్ని బాగా మెచ్చుకొన్నారు .

202-విజయనగర ఆనంద గజపతి ఆస్థాన విద్వాంసులై ,రాజావారితో మైసూర్ ,నిజాం తిరువాన్ కూర్,సింధియా మొదలైన సంస్థానాలు సందర్శించి కచేరీలు చేసి మెప్పు పొందారు .

203-విజయ నగర ఆస్థాన పదవి వదిలేసి శ్రీకాకుళం జిల్లాలో నరసన్న పేట లో కాపురముండి,ఒక గురుకులాన్ని స్థాపించి అనేక విద్యార్ధులకు వసతి భోజనాలు ఏర్పాటు చేసి  వీణ నేర్పారు .వీరి ఖ్యాతి విని ఉర్లాం ,పోలాకి ,బరంపురం ప్రజలు గాన సభలు ,సంగీతోత్సవాలుజరిపారు ..టెక్కలి ,పర్లాకిమిడి ,మందసా ,చీకటి ,జరతా ,సురంగి మొదలైన సంస్థానాలు దర్శించి సన్మానాలు పొంది వారిచ్చిన ధనం తో శిష్యులకు ఉచితంగా విద్య నేర్పించారు .

204-ఉర్లాం జమీన్దారిణి ,ఆదిభట్ల నారాయణ దాసు గారి ఆధ్వర్యం లో వీరికి సత్కారం చేసి బంగారు కంకణాన్ని తొడిగారు .1911లో దివాన్ బహద్దర్ కొమ్మారెడ్డి సూర్యనారాయణ మూర్తిగారు వీరని మహా ఆదరంగా నాలుగైదు ఏళ్ళు సకల సౌకర్యాలు కలిపించి తమ ఇంట్లోనే ఉంచుకొన్నారు .1912లో రామ మూర్తిగారిచే సరస్వతీ గాన సభ లోఏర్పరచిన  కచేరీ కి హరినాగ భూషణం ,మహారాజ పురం విశ్వనాధయ్యర్ శ్రోతలుగా ఉన్నారు .ఆ సభలో శ్రోతలు మైమరచేట్లు వీణ వాయించగా ‘’వైణిక సార్వ భౌమ ‘’బిరుదు ప్రదానం చేశారు .1942 వృష నామ సంవత్సరం పుష్య బహుళ పాడ్యమినాడు పొడుగు రామమూర్తి గారు నిర్యాణం చెందారు .

28-శ్రీ ములుగు శివానంద శాస్త్రి

205-ములుగు  నంద్యయ్య గారి కుమారుడు ములుగు  శివానంద శాస్త్రి .పెదగురాచార్యుల వారి శిష్యులు వేన పై ప్రతి రోజు నమక చమకాలను వాయించుకొని ఆనంద పడేవారు .రాగం వాయించటం లో అద్వితీయులు .వాద్యం లో ఠీవి వీరి ప్రత్యేకత .నిత్య రోగం దరిద్రం తో బాధ పడుతూ అవసాన కాలం లో తన వీణకు ప్రణమిల్లి శాస్త్రి గారు తనువు  చాలించారు .

206-ఆరభి రాగం లో త్యాగ బ్రహ్మ పై ‘’త్యాగ రాజ గురుదేవా ‘’అనే అందమైన కీర్తన రాశారు శాస్త్రి గారు .

పల్లవి -‘’త్యాగ రాజ గురుదేవ సాత్విక స్వభావ దేవ

అనుపల్లవి –భాగవతులలో నెల్ల త్యాగ రూపుడై వెలసిన

చరణం –అందముగా వేద శాస్త్ర మంత గూర్చి గాన ఫణితి

సుందరుడగు శ్రీ రాముని స్తోత్రముల నిల్పినారు

వందారు సమస్త జన బృంద శివానంద వినుత .

207-శాస్త్రి గారు వార్ వీణ కు వారే మేళం కట్టుకొనేవారు .కచేరీలలో కూడా వీణ మైనాన్ని కొవ్వొత్తి వెలిగించి వేడి చేసి మేళాన్ని సరి చూసుకోనేవారు.

29-వైణిక రత్న –కంభం పాటి అక్కాజీ రావు

208-కంభం పాటి ఆది నారాయణ రావు ,అనంత లక్ష్మి గారల కుమారుడే అక్కాజీ రావు గారు .తూ.గో.జి.అంతర్వేది పాలెం లో .కర్నాటక ,హిందూ స్తానీసంగీతాలలో ఎటు వంటి అపూర్వరాగాలైనా అవలీలగా వాయించేవారు .స్వర కల్పనా  కీర్తన లలో కర్నాటక సంప్రదాయాన్ని పాటించేవారు .రాగాలాపనలో ఔత్తరాహులైన పండిట్ రవిశంకర్ మొదలైన వారి పట్టు జాతులను ,వాటి లోని మృదు మధుర కంపితాలను ప్రత్యేకంగా వాయించే వారు .

209-రావు గారు శాస్త్రీయ సంగీతం లోనే కాక లలిత సంగీతం లో కూడా ప్రసిద్ధులు .విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం లలిత సంగీత విభాగం లో పని చేశారు

210-రావు గారు బాలమురళీ కృష్ణగారి తండ్రిగారు పట్టాభి రామయ్య గారి శిష్యులై తుదిమెరుగులు దిద్దుకొన్నారు .నూకల వారివద్దా శిష్యరికం చేశారు .

211-అనేక పట్టణాలలో సంగీత కచేరీలు చేసి సన్మానాలు పొందారు .విజయవాడలో జరిగిన సంగీతవిద్వాత్ సభ లో అక్కాజీ రావు గారికి ‘’వైణిక రత్న ‘’బిరుద ప్రదానం చేశారు .

212-అనేక బాల గేయాలకూ ,ప్రచార గీతాలకూ స్వర రచన చేశారు .వాటిని శ్రీ ఏం వి రమణ మూర్తి ,శ్రీమతి శ్రీరంగం గోపాల రత్నం ,వింజమూరి లక్ష్మి వంటి వారు  పాడారు .

30-వీణాచార్య తిరుమల నల్లాన్ చక్ర వర్తుల వెంకట నారాయణా చార్యులు

213-1902లో శ్రీనివాస రాఘవాచార్య ,లక్ష్మమ్మ ఫంపతులకు జన్మించారు .మద్రాస్ లో ఎన్నో కచేరీలు చేసి పేరు తెచ్చుకొన్నారు .

214-మద్రాస్ లోని తిరువల్లి క్కేణిదేవాలయం లో వీణ కచేరీ చేయమని కోరి స్వామి సన్నిధిలో చేయటం మర్యాదకాదని పూజారులు రెండు ఎత్తైన బల్లలపై రెండు బుర్రలను నిలిపి వాయి౦చమన్నారు .ఆచార్యులవారు వీణ ను బుజానికి కట్టుకొని అద్భుతంగా వాయించి ,ఆక్రిష్ణ లీలకు సమానమైన లీలా ప్రదర్శన చేశారు .

215-తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులైన ఆచార్యుల వారు అనేక గౌరవ సత్కారాలు పొందారు .అద్భుత సంగీత రచనా చేశారు వారి రచనలలో ముఖ్యమైనవి –జాతి భేద సప్త తాళ సహిత రాగ శతరాగ రత్నమాలిక ,అన్నమాచార్య సంకీర్తన స్వర కుసుమాంజలి ,గాంధర్వ వేదామృతం,పద్మావతీ రాగ నక్షత్రమాలిక ,శ్రీ వెంకటేశ్వర స్తోత్ర సహిత బంధ స్వరావళి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-6-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-14

ఇది విన్నారా ,కన్నారా !-14

27-వైణిక సార్వ భౌమ –పొడుగు రామ మూర్తి

201-1871లో జన్మించి విజయనగరం లో నివాసమున్న పొడుగు రామ మూర్తిగారు విజయనగర సంస్థాన ఆస్థాన విద్వాంసులైన శ్రీ సాలగ్రామం గోపాలం గారి వద్దా ,కట్టు వీరన్న గారి వద్దా వీణ నేర్చారు .దక్షిణ దేశానికి వెళ్లి కొనే రాజాపురం వైద్యనాధయ్యర్ ,తిరుకోడి కావాల్ కృష్ణయ్యర్ లతో స్నేహం సాధించారు .మద్రాస్ వచ్చి సంగీత కచేరీ చేశారు .సభలో శ్రోతలైన బెంగుళూరు నాగ రత్నమ్మ ,తిరువత్తూర్ త్యాగయ్య ,సుమతి కృష్ణా రావు వీరి వీణా వైదుష్యాన్ని బాగా మెచ్చుకొన్నారు .

202-విజయనగర ఆనంద గజపతి ఆస్థాన విద్వాంసులై ,రాజావారితో మైసూర్ ,నిజాం తిరువాన్ కూర్,సింధియా మొదలైన సంస్థానాలు సందర్శించి కచేరీలు చేసి మెప్పు పొందారు .

203-విజయ నగర ఆస్థాన పదవి వదిలేసి శ్రీకాకుళం జిల్లాలో నరసన్న పేట లో కాపురముండి,ఒక గురుకులాన్ని స్థాపించి అనేక విద్యార్ధులకు వసతి భోజనాలు ఏర్పాటు చేసి  వీణ నేర్పారు .వీరి ఖ్యాతి విని ఉర్లాం ,పోలాకి ,బరంపురం ప్రజలు గాన సభలు ,సంగీతోత్సవాలుజరిపారు ..టెక్కలి ,పర్లాకిమిడి ,మందసా ,చీకటి ,జరతా ,సురంగి మొదలైన సంస్థానాలు దర్శించి సన్మానాలు పొంది వారిచ్చిన ధనం తో శిష్యులకు ఉచితంగా విద్య నేర్పించారు .

204-ఉర్లాం జమీన్దారిణి ,ఆదిభట్ల నారాయణ దాసు గారి ఆధ్వర్యం లో వీరికి సత్కారం చేసి బంగారు కంకణాన్ని తొడిగారు .1911లో దివాన్ బహద్దర్ కొమ్మారెడ్డి సూర్యనారాయణ మూర్తిగారు వీరని మహా ఆదరంగా నాలుగైదు ఏళ్ళు సకల సౌకర్యాలు కలిపించి తమ ఇంట్లోనే ఉంచుకొన్నారు .1912లో రామ మూర్తిగారిచే సరస్వతీ గాన సభ లోఏర్పరచిన  కచేరీ కి హరినాగ భూషణం ,మహారాజ పురం విశ్వనాధయ్యర్ శ్రోతలుగా ఉన్నారు .ఆ సభలో శ్రోతలు మైమరచేట్లు వీణ వాయించగా ‘’వైణిక సార్వ భౌమ ‘’బిరుదు ప్రదానం చేశారు .1942 వృష నామ సంవత్సరం పుష్య బహుళ పాడ్యమినాడు పొడుగు రామమూర్తి గారు నిర్యాణం చెందారు .

28-శ్రీ ములుగు శివానంద శాస్త్రి

205-ములుగు  నంద్యయ్య గారి కుమారుడు ములుగు  శివానంద శాస్త్రి .పెదగురాచార్యుల వారి శిష్యులు వేన పై ప్రతి రోజు నమక చమకాలను వాయించుకొని ఆనంద పడేవారు .రాగం వాయించటం లో అద్వితీయులు .వాద్యం లో ఠీవి వీరి ప్రత్యేకత .నిత్య రోగం దరిద్రం తో బాధ పడుతూ అవసాన కాలం లో తన వీణకు ప్రణమిల్లి శాస్త్రి గారు తనువు  చాలించారు .

206-ఆరభి రాగం లో త్యాగ బ్రహ్మ పై ‘’త్యాగ రాజ గురుదేవా ‘’అనే అందమైన కీర్తన రాశారు శాస్త్రి గారు .

పల్లవి -‘’త్యాగ రాజ గురుదేవ సాత్విక స్వభావ దేవ

అనుపల్లవి –భాగవతులలో నెల్ల త్యాగ రూపుడై వెలసిన

చరణం –అందముగా వేద శాస్త్ర మంత గూర్చి గాన ఫణితి

సుందరుడగు శ్రీ రాముని స్తోత్రముల నిల్పినారు

వందారు సమస్త జన బృంద శివానంద వినుత .

207-శాస్త్రి గారు వార్ వీణ కు వారే మేళం కట్టుకొనేవారు .కచేరీలలో కూడా వీణ మైనాన్ని కొవ్వొత్తి వెలిగించి వేడి చేసి మేళాన్ని సరి చూసుకోనేవారు.

29-వైణిక రత్న –కంభం పాటి అక్కాజీ రావు

208-కంభం పాటి ఆది నారాయణ రావు ,అనంత లక్ష్మి గారల కుమారుడే అక్కాజీ రావు గారు .తూ.గో.జి.అంతర్వేది పాలెం లో .కర్నాటక ,హిందూ స్తానీసంగీతాలలో ఎటు వంటి అపూర్వరాగాలైనా అవలీలగా వాయించేవారు .స్వర కల్పనా  కీర్తన లలో కర్నాటక సంప్రదాయాన్ని పాటించేవారు .రాగాలాపనలో ఔత్తరాహులైన పండిట్ రవిశంకర్ మొదలైన వారి పట్టు జాతులను ,వాటి లోని మృదు మధుర కంపితాలను ప్రత్యేకంగా వాయించే వారు .

209-రావు గారు శాస్త్రీయ సంగీతం లోనే కాక లలిత సంగీతం లో కూడా ప్రసిద్ధులు .విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం లలిత సంగీత విభాగం లో పని చేశారు

210-రావు గారు బాలమురళీ కృష్ణగారి తండ్రిగారు పట్టాభి రామయ్య గారి శిష్యులై తుదిమెరుగులు దిద్దుకొన్నారు .నూకల వారివద్దా శిష్యరికం చేశారు .

211-అనేక పట్టణాలలో సంగీత కచేరీలు చేసి సన్మానాలు పొందారు .విజయవాడలో జరిగిన సంగీతవిద్వాత్ సభ లో అక్కాజీ రావు గారికి ‘’వైణిక రత్న ‘’బిరుద ప్రదానం చేశారు .

212-అనేక బాల గేయాలకూ ,ప్రచార గీతాలకూ స్వర రచన చేశారు .వాటిని శ్రీ ఏం వి రమణ మూర్తి ,శ్రీమతి శ్రీరంగం గోపాల రత్నం ,వింజమూరి లక్ష్మి వంటి వారు  పాడారు .

30-వీణాచార్య తిరుమల నల్లాన్ చక్ర వర్తుల వెంకట నారాయణా చార్యులు

213-1902లో శ్రీనివాస రాఘవాచార్య ,లక్ష్మమ్మ ఫంపతులకు జన్మించారు .మద్రాస్ లో ఎన్నో కచేరీలు చేసి పేరు తెచ్చుకొన్నారు .

214-మద్రాస్ లోని తిరువల్లి క్కేణిదేవాలయం లో వీణ కచేరీ చేయమని కోరి స్వామి సన్నిధిలో చేయటం మర్యాదకాదని పూజారులు రెండు ఎత్తైన బల్లలపై రెండు బుర్రలను నిలిపి వాయి౦చమన్నారు .ఆచార్యులవారు వీణ ను బుజానికి కట్టుకొని అద్భుతంగా వాయించి ,ఆక్రిష్ణ లీలకు సమానమైన లీలా ప్రదర్శన చేశారు .

215-తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులైన ఆచార్యుల వారు అనేక గౌరవ సత్కారాలు పొందారు .అద్భుత సంగీత రచనా చేశారు వారి రచనలలో ముఖ్యమైనవి –జాతి భేద సప్త తాళ సహిత రాగ శతరాగ రత్నమాలిక ,అన్నమాచార్య సంకీర్తన స్వర కుసుమాంజలి ,గాంధర్వ వేదామృతం,పద్మావతీ రాగ నక్షత్రమాలిక ,శ్రీ వెంకటేశ్వర స్తోత్ర సహిత బంధ స్వరావళి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-6-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in రచనలు | Tagged , | Leave a comment

శ్రీ తూములూరి దాక్షిణా మూర్తి గారి పద్య యోగ వైభవం – నా ముందు మాట

Yogavaibha10002

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -171

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -171

65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్

   ఆయన  అనుయాయులు ‘’మా తండ్రి ‘’’’మాజీవిత సూర్యుడు ‘’అంటూ దేవుడని ,సర్వజ్ఞుడని ,సర్వ శక్తి వంతుడని ,తప్పు చేయని మొనగాడని ‘’అంటారు .ఆయన వ్యతిరేకులు ‘’క్రూర మేధావి ,మనస్సాక్షి, యోగ్యతా లేని అయోగ్యుడని ,అమానుష వ్యక్తీ అని ,దయలేని మాకి విల్లీ అని ,చేసిన వాగ్దానాల ను ,నమ్మిన వారిని నట్టేట ముంచే రకమ’’ని అంటారు .ప్రపంచం లో చాలా మందికి 80కోట్లకు పైగా  జనాల భవిష్యత్తును చేతుల్లో పెట్టుకొని,చరిత్రలో యే నాయకుడూచలాయించని విశేషాధికారాలను చలాయించి  చర్చిల్ చెప్పినట్లు ‘’అస్పస్టత లో చుట్టబడిన రహస్యం ‘’(ఎ మిస్టరిరాప్పేడ్ ఇన్ ఎనిగ్మా )అయిన వాడు ఇనుప తెర అని పిలువ బడిన సోవియెట్ యూనియన్ కు ఉక్కు నియంత జోసెఫ్ స్టాలి న్.

  రష్యాలో చిన్న జార్జియాలోని  గోరి గ్రామం లో 21-12-1879 న జన్మించాడు .అసలు పేరు ‘’జోసెఫ్ విస్సారియోనోవిచ్ జుగాష్వి లి .వంశం సనాతనమైనదే అయినా కలగా పులగం .తండ్రి చదువులేని చెప్పులు కుట్టేవాడు .ఎప్పుడూ తాగి తందనాలడుతూ కొడుకును చితక్కోట్టేవాడు .తల్లి భక్తురాలైన చాకలి .తన గారాబు బిడ్డ ‘’జో జో ‘’ప్రీస్ట్ అవాలని కోరుకొనేది .చాలా ఎక్కువ కష్టపడుతూ కొడుకును ఒక చర్చి స్కూల్ లో చేర్చింది .అతనికి 15ఏళ్ళు రాగానేస్టాలిన్ కి టిఫ్ఫ్లిస్ దియోలాజికల్ సేమిటరి లో స్కాలర్షిప్ సాధించింది .అక్కడే నాలుగేళ్ళు చదివాడు .చర్చిలో ప్రార్ధన  భక్తితో భావోద్విగ్నంగా పాడుతుంటే గొంతు వణికేదఅని కొందరు రాస్తే , .ఇది అబద్ధం అని రికార్డ్ లు తెలియ జేశాయి .కాని’’ కరకు వీధి రౌడీ రాజు ‘’అని ,బయటి నుంచి వచ్చిన నిషేధించిన సాహిత్యాన్ని ఇష్ట పడి చదివే వాడని ఒక కదఉంది .మరొక దాని ప్రకారం ‘’లిటరరీ ఇవల్యూషన్ ఆఫ్ ది నేషన్స్ ‘’ను చర్చి మెట్ల పై కూర్చునిచదివేవాడని , అలాంటివి చదువుతున్నట్లుగా 13సార్లు గమనించినట్లు రికార్డ్ ఉంది . సేమిటరి లో సోషలిస్ట్ ఉద్యమ భాగమైన ‘’సీక్రెట్ సోసైటీ ‘’సభ్యుడయ్యాడు .అధికారుల పై తిరగబడి నందుకు స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు స్టాలిన్ ను .

       కుటుంబం తో సంబంధాలు తెంచుకొని టిఫ్లిస్ అబ్సర్వేటరిలో నైట్ డ్యూటీ చేస్తూ స్వంత కాళ్ళపై నిలబడ్డాడు .పగటి పూట రైల్వే ,రవాణా వర్కర్లకు మార్క్సిస్ట్ సిద్ధాంతం పై అవగాహన కల్పింఛి వారిని సంఘటిత పరచేవాడు . .21ఏళ్ళు రాక ముందే ఒక ఒక ప్రదర్శనలో పాల్గొని కోసాక్ ల చేత అడ్డు కో బడ్డాడు .రహస్య స్థావరాలలో దాక్కొని తనను  ‘’కోబా ‘’అనేజార్జియన్ పౌరాణిక హీరో పేరుతొ  పిలిపించుకోనేవాడు. 22ఏట సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు .బేటం వెళ్లి ఆయిల్ వర్కర్లు చేసే సమ్మెలో పాల్గొని అరెస్ట్ అయ్యాడు .లెనిన్ రాసిన ఇస్క్రా (ది స్పార్క్ )పుస్తకాన్ని దొంగ చాటుగా తెప్పించుకొని జైలు లో మార్క్స్ ను అతని సిద్ధాంతాన్ని లెనిన్ అమలు పరచిన తీరును  అధ్యయనం చేశాడు .పార్టీ బోల్షేవిక్కులు అనే వామ భావాలున్నవారు ,మితవాదు లైన మెంషెవిక్కులు గా   చీలినప్పుడు లెనిన్ ను,అతని అతివాదులను  సమర్ధించాడు .ఆ తర్వాత 12ఏళ్ళలో 6సార్లు జైలుకు వెళ్ళాడు .అరెస్ట్ అయిన ప్రతిసారి ఏదో రకంగా తప్పించుకొని బయటకు రావటం మళ్ళీ ఉద్యమకార్యం లో పని చేయటం జరిగేది .ఒక సందర్భం లో విప్లవ కార బృందానికి నాయకత్వం వహించి రెండు కారేజీలలో వస్తున్నా ప్రభుత్వ ధన౦340 000రూబుళ్ళ ను  కైవశం చేసుకొని బోల్షెవిక్ పార్టీకి అందజేశాడు .వయసు ఇరవైలలో ఉండగానే అతని భౌతిక ఆకారానికి ,ధైర్య సాహసాలకు ,సిద్ధాంత నిబద్ధతకు అందరూ మెచ్చి అతన్ని ఉక్కు మనిషి –అంటే స్టాలిన్ అన్నారు. అదేఆయన పేరై పోయింది .30వ ఏట జారిస్ట్ రాజుల పాలన లో రాజకీయ ఖైదీ గా ఉండిరెండు వరుసలలో ఉన్న  సైనికుల మధ్య ఒకే లైన్ లో ఆయనా, ఆయన అనుచరులనూ బలవంతంగా నడి చేట్లు చేసి రైఫిల్ బట్స్ తో కుళ్ళ బొడిచారు .దీన్ని సవాలుగా తీసుకొని సైన్యం వేగం గా వెళ్ళమన్నా ఉక్కు హృదయం తో గట్టిగా నిలబడి అతి నెమ్మదిగా కదులుతూఉంటే, వాళ్ళు  కింద పడేట్లుచేసి విపరీతంగా దెబ్బలతో రక్తంకారేట్లు హింసించి తల పగిలేట్లు చేస్తే నేల మీద పడిపోయి,నిజంగానే ఉక్కుమనిషి అంటే స్టాలిన్ అనిపించుకొన్నాడు .ఇంతటి నిబద్ధతను తన అనుచరులు అలవరచుకోవాలని స్టాలిన్ అభి మత౦ .వారు అలాంటి స్పందన కలిగించక పొతే మహా క్రూరంగా ప్రవర్తించేవాడు .

    జైలు నుంచి జైలుకు మాతుతూ ‘’ప్రావ్డా’’పత్రిక పెట్టటానికి తోడ్పడ్డాడు .అదే బోల్షేవిక్కుల అధికార పత్రిక అయింది .1912లో కామ్రేడ్ వేషం లో ఉన్న ప్రభుత్వ గూఢచారి   మాలినోవ్ స్కి చేత మోసగింప బడి  మళ్ళీ అరెస్ట్ అయి సైబీరియాకు పంపబడ్డాడు .అక్కడ యే రకమైన సమాచార వ్యవస్థాలేదు .ఇక స్టాలిన్ పని అయి పోయినట్లే అని అందరూ అనుకొన్నారు .మొదటి ప్రపంచ యుద్ధం రష్యన్ నిరంకుశత్వం ఎక్కువ కాలం నిలబడలేడనే ఆశ చిగురింప జేసింది .కాని 1917లోరష్యా విప్లవం జరిగి ,ప్రాంతీయ ప్రభుత్వమేర్పడి ,స్టాలిన్ తో పాటు మిగిలిన రాజ కీయ ఖైదీలను విడుదల చేస్తే   కాని, ఆయన ఆశలు నెరవేరలేదు . 40ఏళ్ళ వయసులో  జర్మనీ మీదు గా పెట్రోగ్రాడ్ వచ్చి,అమెరికా నుంచి వచ్చిన ట్రోట్ స్కి  తోకలిసి  లెనిన్ తో చేతులు కలిపాడు .ట్రోట్ స్కి లెనిన్ కు బాగా ఇష్టుడు .బాగా చదువుకొన్నవాడు మహా వక్త ,రచయితగా చాతుర్యం ఉండటం తో లెనిన్ అభిమానాన్ని సంపాదించాడు స్టాలిన్ ను యుద్ధ రంగానికి పంపారు .అక్కడక్లాస్ విజ్ ను అధ్యయనం చేసి ,ప్రష్యన్ సేనాని యుద్ధ తంత్రాన్ని అలవరచుకొని కౌ౦టర్ రివల్యూషన్ ను అణచేశాడు .

 1922లో లెనిన్ కు మొదటి సారి గుండె జబ్బు వచ్చినప్పుడు స్టాలిన్ ట్రోట్ స్కి లమధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకొన్నాయి .రె౦డేళ్ళతర్వాత లెనిన్ మరణం తో విభేదాలు తారా స్థాయికి చేరాయి .స్టాలిన్ సమర్ధత ,నిశ్చయ నిర్ధారణను లెనిన్ నమ్మినా అతని లక్ష్యాన్ని నమ్మలేకపోయాడు .తన విల్లు లో లెనిన్ ‘’కామ్రేడ్ స్టాలిన్ పార్టీకి జనరల్ సెక్రెటరీ గా ఉండి,అధికారాన్ని అంతా హస్త గతం చేసుకొన్నాడు .కాని ఆ అధికారాన్ని ఎలా సద్వినియోగం చేయవచ్చో అతనికి తెలియదు .అతను చాలా క్రూర మోటు మనిషి  .అతని తప్పుల్ని సమర్ధించ లేను .అతనిని తప్పించమని పార్టీ సభ్యులని కోరుతున్నాను .అతని స్థానం లో విధేయుడు ,నెమ్మదైనవాడు,చ౦చలత్వ౦ తక్కువగా ఉన్న మరొకరిని నియమించండి .కామ్రేడ్ ట్రోట్ స్కి ఇవన్నీ కలిగి ఉన్న వాడని ,పార్టీ ప్రెసిడెంట్ కు సమర్ధుడని ,ఆత్మ విశ్వాసం ఉన్న వ్యక్తీ అని ,నిర్వహణ బాధ్యత బాగా ఉన్నవాడని నా నమ్మకం ‘’అని రాశాడు .

  లెనిన్ మరణానంతరం స్టాలిన్ ,జినోవీవ్ ,కామేనోవ్ అనే త్రయం  ఏర్పడింది .ట్రోట్ స్కి కి ఇందులో చోటు లేదు .కాలం గడుస్తున్న కొద్దీ స్టాలిన్ ఒక గ్రూప్ ను మరొక గ్రూప్ పై ఉసి గొలుపుతూ వినోదం చూస్తూ ట్రోట్ స్కి సమ్మతిని విస్మరించాడు .చాలా బలీయమైనచురుకైన రాజకీయ వేత్త గా , నాయకుడై తనను ఎవరూ ధైర్యంగా ఎదిరించ లేని పరిస్థితి కలిగించాడు .ట్రోట్ విస్కీ  ప్రపంచ వ్యాప్త విప్లవం వస్తుందని కలలు కంటున్నాడని అది అసాధ్యమని ,అన్ని విప్లవాత్మక ప్రయత్నాలు  ఒక్క దేశం  యొక్క సోషలిజం వల్లనే సాధ్యమనీ జనాలకు చెప్పి ఒప్పించాడు .ఆ దేశమే రష్యా అన్నాడు .  ట్రోట్ స్కి కి అర్ధమై పోయింది స్టాలిన్ వ్యక్తీ గత సుగుణాలతో కాకుండా అవ్యక్త యంత్ర సామర్ధ్యం తోపూర్తీ అధికారాలను గుప్పిట్లో పెట్టు కొన్నాడని గ్రహించాడు .’’స్టాలిన్ ఆయ౦త్రాన్ని తయారు చేయలేదు,కాని దాన్ని స్వాధీనం చేసుకొన్నాడు ‘’అని’’స్టాలిన్ –యాన్ అప్రైసల్ ఆఫ్ ది మాన్ అండ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ ‘’పుస్తకం లో రాశాడు ట్రోట్ స్కీ . మనిషిని తెలివి తేటలతో   దగ్గరకు చేర్చు కోడనీ ,నీచ నికృష్ట ,హేయ నీతి బాహ్య విధానాలతో లొంగ దీసుకొంటాడనీ కూడా రాశాడు .బానిసత్వ దేశాన్ని విమోచనం చేయటానికి ఎంతో కృషి చేసిన ట్రోట్ స్కి ని దేశ బహిష్కరణ చేశాడు స్టాలిన్ .12ఏళ్ళ తర్వాత ట్రోట్ స్కి మెక్సికో లో హత్య చేయబడ్డాడు .ఇనుప తెర రష్యాలో ఉక్కు మనిషి స్టాలిన్ పాలన ప్రారంభమైంది .

Inline image 2Inline image 3Inline image 1

 సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విక్టోరియా యుగపు బ్రిటిష్ వేశ్యావృత్తి సంస్కరణోద్యమ నాయకురాలు -జోసేఫిన్ బట్లర్-విహంగ -జూన్

విక్టోరియా యుగపు బ్రిటిష్ వేశ్యావృత్తి సంస్కరణోద్యమ నాయకురాలు -జోసేఫిన్ బట్లర్

72సంవత్సరాల సార్ధక జీవితం గడిపి 13-4-1828న జన్మించి,30-12-1906న మరణించిన విక్టోరియా యుగానికి చెందిన బ్రిటిష్ స్త్రీవాద రచయితా ,సాంఘిక సంస్కరణ నాయకురాలు జోసేఫిన్ బట్లర్ .ఆమె జీవితాన్ని వేశ్యా వ్రుత్తి నిర్మూలనకే ఎక్కువగా అంకితం చేసింది .ఇవా౦జలిక్ క్రిస్టియన్ మతస్తురాలు .పూర్తిగా మత విశ్వాసాలకు కట్టు బడే ఉంది .ఎన్నో ధార్మిక సేవాకార్యక్రమాలు చేసింది .అన్నిటికంటే ఆమె 1869నుండి 1886వరకు 15సంవత్సరాలు ‘’అంటువ్యాధుల చట్టం ‘’ఉపసంహరణకు బ్రిటన్ లోను అంతర్జాతీయంగాను చేసిన సుదీర్ఘ పోరాటం చిరస్మరణీయమైనది ఆ చట్టమే అమలు లోకి వస్తే వేశ్యా వ్రుత్తి చేస్తున్నారనే అభియోగం తో అన్యాయంగా అరెస్ట్ అయిన వేలాది యువతుల భవిష్యత్తు ప్రమాదకరమౌతుందని ఎలుగెత్తి చాటింది .వారి పక్షాన పోరాడింది .

అసలు పేరు జోసేఫిన్ ఎలిజబెత్ గ్రే .బ్రిటన్ లోని నార్త్ అంబర్ లాండ్ లోని మిలీ ఫీల్డ్ లో ఉన్న మినీ ఫీల్డ్ హౌస్ లో జన్మించింది .తలిదండ్రుల సంతానం లో ఏడవ పిల్ల .తండ్రి జాన్ గ్రే .తల్లి మేరి బరన్ బ్రిటిష్ ప్రధాని ,సంస్కరణాభిలాషి ,బానిసత్వ నిర్మూలన కోరే చార్లెస్ గ్రే కు దగ్గర బంధువు .తండ్రి కేధలిక్ విముక్తికి కృషి చేశాడు .1832 సంస్కరణ చట్టం రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించాడు .కేంబ్రిడ్జ్ దగ్గర ఉన్న డిల్స్టన్ ఎస్టేట్ మేనేజరుగా ఉండి కుటుంబాన్ని ఇక్కడికి మార్చాడు .1857 నాటికి న్యు కాజిల్ బ్యాంక్ ధర్మమా అంటూ కూడ బెట్టినదంతా పోగొట్టుకొన్నాడు .

1852లో విద్యా వేత్త ,మత గురువు అయిన జార్జ్ బట్లర్ ను జోసేఫిన్ పెళ్లి చేసుకొన్నది .ఇద్దరూ కలిసి క్రైస్తవానికి ఇవా౦జెలిక్ విధానాన్ని జోడించే ప్రయత్నం చేశారు .ఇటలీలో సాంస్కృతిక అనుబంధం కోసం కృషి చేశారు .ఉదార సంస్కరణలకోసం ప్రయత్నించారు .భార్యను ప్రజా సంబంధాలలో చురుకుగా పాల్గొన మని బట్లర్ ప్రోత్సహించాడు .కొద్దికాలం లోనే ఆమెకు వస్తున్న కీర్తి ప్రతిస్టలను చూసి ఆశ్చర్య పోయాడు .వృత్తి రీత్యా భర్త బాగా వెనక పడి పోయాడు .ఈ జంట నలుగురు పిల్లలకు తలిదండ్రులైనారు .ఈ దంపతులు బలమైన తీవ్రవాద సానుభూతి ఉన్నవారే కాక అమెరికన్ అంతర్యుద్దం లో యూనియన్ ను బలపరచారుకూడా .ఒక్కగానొక్క కూతురు ఈవాప్రమాద వశాత్తు మెట్ల మీదనుంచి జారిపడి చనిపోయి తల్లికి శోకం మిగిల్చింది .దీన్ని ఉపశమింప జేసుకోవటానికి జోసేఫిన్ తన కంటే అధిక వేదనతో ఉన్న వారిని మాటలతో ,సహాయం తో ఓదారుస్తూ తన గుండె బాధను దూరం చేసు కొన్నది .లివర్ పూల్ లోని బ్రౌన్ లోవర్క్ హౌస్ ను సందర్శించటం తో ఆమె వేశ్య సేవాకార్యక్రమానికి అంకురార్పణ జరిగింది .అక్కడ విశ్రాంతి భవనం ,పారిశ్రామిక నిలయం నిర్మించింది .

ఇరవైవ ఏడు వచ్చిన దగ్గర్నుంచి జోసఫిన్ స్త్రీవాద కార్యక్రమాలలో లో చురుగ్గా పని చేసింది .దీనికి ముఖ్య కారణం తన అయిదేళ్ళ పాప ఆకస్మిక మరణమే .చెల్టన్ హాం లో ఈ దంపతులు ఉండగా భర్త ఆకాలేజి వైస్ ప్రిన్సిపాల్ గా పని చేశాడు .1866లో జార్జ్ బట్లర్ లివర్ పూల్ కాలేజ్ హెడ్ మాస్టర్ అయ్యాడు .అప్పుడు జోసేఫిన్ మహిళలకు ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రచారం చేసింది .1867లో అన్నా జెమీమా క్లఫ్ తో కలిసి ,తర్వాత కేం బ్రిడ్జ్ లోని మ్యూన్ హాం కాలేజి ప్రిన్సిపాల్ తో కలిసి ‘’నార్త్ ఆఫ్ ఇంగ్లాండ్ కౌన్సిల్ ఫర్ ప్రమోటింగ్ ది హయ్యర్ ఎడ్యు కేషన్ ఆఫ్ వుమెన్ ‘’ఏర్పాటు చేయటం లో ప్రముఖ పాత్ర వహించింది .దీనితో పాటు వేశ్యల సంక్షేమానికీ పని చేసింది .వేశ్యా వ్రుత్తి పాపమే అయినా ,వేశ్యల జీవితాలతో ఆడుకొంటూ మగ వారు వారిని అణచి వేస్తున్న విధాన౦ పై ఎదురు తిరిగింది .లైంగిక నైతికత పై ద్వంద్వ ప్రవ్రుత్తి ని నిందించింది .1869లో అంటువ్యాధుల చట్టం పై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరిగిన నిరసన ప్రదర్శన కు నాయకత్వం వహించింది .1860నుండి మూడు సార్లు ఈ చట్టాన్ని వేశ్యలలో లైంగిక వ్యాధి నిరోధించాలన్న ఆలోచనతో ప్రవేశ పెట్టారు .ముఖ్యంగా రాయల్ నేవీ ,బ్రిటిష్ ఆర్మీ లో దీన్ని అమలు చేయాలని ప్రభుత్వ సంకల్పం .ఈ చట్టం వలన మేజిస్ట్రేట్ లకు ఆడవారి మర్మాంగాన్ని పరీక్షించే వీలు కలిగించింది .లైంగిక వ్యాదుల్ని గుర్తించే అవకాశమేర్పడింది .ఈ వ్యాధిసోకిన స్త్రీలను నయం చేయటానికి మూడు నెలలు తాళం వేసిన హాస్పిటల్ లో ఉంచేవారు .దీన్ని కాదని ఎదురు తిరిగిన వేశ్యలను అరెస్ట్ చేసేవారు .ఒక పోలీస్ వేశ్యలపై ఒక్క రిపోర్ట్ ఇస్తే చాలు వ్యభిచారులను పరీక్షించాల్సిందే .కాదంటే అరెస్టే.ఇదీ పరిస్థితి .దీనితో వారి వృత్తిని కోల్పోయేవారు .ఒక స్త్రీ దీన్ని నిరసించి ఆత్మ హత్య చేసుకొన్నది కూడా .

ఈ ప్రభుత్వ విధానం పై పోరాడుతూ బహిరంగ సభలో జోసేఫిన్ దీన్ని ‘’సర్జికల్ రేప్’’అన్నది .వెస్ట్ లండన్ సూప రిండే౦ట్-హఘ్ ప్రైస్ హగ్స్ ఆమెను అదే వేదికపై అభినందించాడు .ఆమె కన్నీరు కారుస్తూ వేదిక దిగి వెళ్ళిపోయింది. ఈ సంఘటన దేశం లో గొప్ప సంచలనం సృష్టించింది .మొదట్లో పోర్టు లలో ,రక్షక దళం లో ప్రవేశ పెట్టారు .తర్వాత దేశమంతా ప్రవేశ పెట్టే ప్రయత్నం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం .దీన్ని క్రిస్టియన్లు ,స్త్రీవాదులు ,పౌర స్వేచ్చ కోరేవారూ పూర్తిగా వ్యతిరేకించారు .దీనితో ఆచట్టాన్ని ఉపసంహరించాల్సి౦దేనన్నధ్యేయం తో రెండు సంస్థ లేర్పడ్డాయి .ఒకటి జోసేఫిన్ నాయకత్వం లో ,మరొకటి డాక్టర్ల ఆధ్వర్యం లో పని చేశాయి .ఆమెను ఉద్యమం నుంచి తప్పించే ప్రయత్నం లో ప్రభుత్వం ఆమెను ఎన్నో విధాలుగా అణచటానికి ,భౌతికంగా హింసించే ప్రయత్నాలు కూడా చేసింది .అయినా మడమ త్రిప్పకుండా సర్వ శక్తులూ ధార పోసి ఉపసంహరణ కోసం పోరాడింది జోసేఫిన్ .చివరికి ప్రభుత్వమే దిగి వచ్చి 1886లో బిల్లును ఉపసంహరించు కొన్నది .
పాల్ మాల్ గజెట్ పత్రికా సంపాదకుడు విలియం ధామస్ స్టెడ్ అనేక ధారావాహిక వ్యాసాలను ‘’ది మోడరన్ ట్రిబ్యూట్ ఆఫ్ మోడరన్ బాబిలన్ ‘’పేరిట రాస్తూ లండన్ లో ఉన్న ‘’బాల్య వేశ్యావృత్తి’’ గురించి కూడా రాశాడు .దీని పై స్పందిస్తూ జోసేఫిన్ ఎడిటర్ ను సమర్ధిస్తూ ప్రదర్శనలు నిర్వహించింది .దీని ఫలితంగా యునైటెడ్ కింగ్డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ లోను , ఐర్లాండ్ లోను ‘’అనుమతి వయసు ‘’(కన్సేంట్ ఏజ్ )ను 13నుండి 16ఏళ్ళకు పెంచుతూ ఆ ఏడాది నుండే అమలు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం .అ౦తర్జాతీయం గా దీనిపై పోరాటానికి ఆమె స్విట్జెర్లాండ్ ,ఫ్రెంచ్ ధర్డ్ రిపబ్లిక్ లలో పర్యటించింది .కాని అధికారులు సహకరించలేదు .కాని స్త్రీవాద సంస్థలు పూర్తి మద్దతునిచ్చాయి .తన ఆధ్వర్యం లో ఏర్పడిన ‘’ఇంటర్నేషనల్ అబాలిషన్ ఫెడరేషన్ ‘’తో బాటు మిగిలిన అంతర్జాతీయ సంస్థలు మహిళా వేశ్యల ,పిల్లల చట్టాలపై అవగాహనా సదస్సులు నిర్వహించి మార్పుల కోసం ఉద్యమించింది .1897లో బ్రిటిష్ పాలన లో ఉన్న ఇండియా లో ‘’అంటురోగ చట్టం ‘’తెస్తే ,దాన్ని వ్యతిరేకిస్తూ జోసేఫిన్ పెద్ద ఉద్యమమే నడిపింది .జోసేఫిన్ భర్త జార్జ్ రిటైర్ అవగా వి౦చెస్టర్ కేధడ్రిల్ కు’’ కానన్ ‘’గా నియమించారు .అయన 1900లో మరణించాడు .అయినా జోసేఫిన్ తన ఉద్యమాన్ని కొనసాగించి అలసి సొలసి 1906లో డిసెంబర్ 30న మరణించింది .

ఎంతటి స్త్రీవాదియో జోసేఫిన్ అంతటి మతాచార పరురాలు .’’దేవుడు ,ఒక మహిళా కలిస్తే చాలు మెజారిటీయే ‘’అనేది .’’సామాజిక విచారణ ‘’అనే కొత్త జర్నలిజాన్ని స్టెడ్ ప్రతిపాదిస్తే జోసేఫిన్ దాన్ని వ్యాప్తి చేసింది .చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ లో తక్కువ మోతాదు ఉత్సవాలు నిర్వహించేది .లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉన్న లైబ్రరీలో ఆమె కు సంబంధించిన అనేక విషయాలు భద్ర పరచారు.అందులో నీతికి,సాంఘిక పరిశుభ్రతకు సంబంధించినవి చాలా ఉన్నాయి .ఈ సంస్థపేరును ఆమె గౌరవ చిహ్నంగా ‘’జోసేఫిన్ బట్లర్ సొసైటీ లైబ్రరీ ‘’గా మార్చారు .దర్హాం యూని వర్సిటి ఆమెపేరు మీద కాలేజి ని ఏర్పరచింది .లివర్ పూల్ యూని వర్సిటి పేరును ’’జోసేఫిన్ బట్లర్ హౌస్ ‘’గా మార్చారు .లండన్ లోని కెంసాల్ సేమెటరిలో దక్షిణ భాగాన ఉన్న రిఫార్మర్స్ మెమోరియల్ లిస్టు లో జోసేఫిన్ బట్లర్ పేరును చేర్చి గౌరవించారు .
జోసేఫిన్ వ్రాసిన పుస్తకాలలో ‘’విద్యా –ఉద్యోగం ‘’,జాన్ గ్రే జ్ఞాపకాలు ‘’స్వీయ జీవిత చరిత్ర ‘’వంటివి ఉన్నాయి .

–గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Share on Facebook – See more at: http://vihanga.com/?p=17278#sthash.HCFCzeOU.dpuf

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-13

ఇది విన్నారా ,కన్నారా !-13

26-షట్కాల వీణ వెంకట రమణ దాసు

193-రమణయ్య గారి పూర్వీకులు 7తరాలవారూ వైణికులే.దాసుగారు 1864-లో జన్మించి 1948లో మరణించారు .వీరు వాయించే వీణకుండే కకుభం (కుండ )చాలా చిన్నది .దండం కూడా చాలా ఇరుకైనది .కాని సొరకాయ బుర్ర మాత్రంచాలా పెద్దది .ఇదీ వీరి వీణ ప్రత్యేకత .వీణను నిలబెట్టి వాయించటం దాసు గారి ప్రత్యేకత .ఒక్క బొటన వ్రేలును తప్ప అన్ని వ్రేళ్ళ తోనూ రోజుకు 10గంటలు  సాధన చేసేవారు .మహా వేగంగా వాయించటం మరో విశేషం .

194-ఆనంద గజపతి దాసుగారిని ఆస్థాన విద్వాంసునిగా నియమించి గౌరవి౦చటమే కాక తన సింహాసనం లో సగ భాగం లో వారిని కూర్చో పెట్టుకొనేవారు ..వీరితండ్రి చిన గురాచార్యులుగారు .దాసు గారు విజయనగర ఆనంద గజపతి మహా రాజుకు శిష్యులు అవటం మరో ప్రత్యేకత .గజపతి వీణా ,సితార్ లలో ప్రవీణులు .

195-దాసు గారి వీణా వాదనలో ప్రత్యేకతలు మరిన్ని తెలుసు కొందాం .భైరవి రాగ ద్రుత తాళ గీతాన్ని మూడవ స్వరాన్ని అదిమి పట్టి పంచమ తంత్రిని మీటుతూ శ్రోతలను ఉర్రూత లూగించేవారు .సితార్ లోనూ ప్రావీణ్యం సాధించి వీణపై ‘’ఝాలా ‘’ను తానం లో కలిపి వాయించేవారు .మృదంగ సహకారం లేకుండానే కచేరీ చేసేవారు .

196-దాసుగారి వద్ద ఆనంద గజపతి వాయించిన దంతపు వీణ ఉండేది .మాయవరం వీణ వైద్య నాద అయ్యర్ ఒక సారి దాసు గారిని ఆహ్వానించి అయ్యర్ గారి వీణ పై వాయించమని కోరారు. అలా వద్దు అని దాసుగారు చెప్పినా వినక పట్టు బట్టారు .తాను  ఆ వీణ వాయిస్తే అది పగిలి పోతుంది అని కూడా చెప్పారు .కాని అయ్యర్ వినక వాయించమంటే వాయించారు .అది విరిగి పోయింది .’’నా వీణ మొగ వీణ .మీది ఆడ వీణ ‘’అన్నారట .

197-ఒక సారి మద్రాస్ సెనేట్ హాల్ లో వీణ వాయిస్తుంటే బయట ఉరుములు ,మెరుపులతో కుంభ వృష్టి కురుస్తోంది .నిర్వాహకులు తలుపులు కిటికీలు మూసేస్తుంటే ,వద్దని దాసు గారు వారించి ,తన వాయిద్యం అందరికీ వినబడుతుందని చెప్పి ,వర్ష ధ్వనికి ఏమాత్రం తీసి పోకుండా వీణ వాయించి వర్షానికే ఆశ్చర్యం హర్షం కలిగించారు .ఘన రాగ పంచకం లో తానం వాయి౦చేసరికి వర్ష ఘోషను మించిన ధ్వని ఆ భవనం అంతా వ్యాపించింది .వర్షాన్ని  దాసుగారి వీణా స్వనంను ఓడించింది .అంత గొప్ప ధ్వని ఎలా సృస్టించ గలిగారని అడిగితే వీణ’’ తుంబ’’ లలో గడియారపు స్ప్రింగ్ లాంటి స్ప్రింగ్ లను బిగించానని చెప్పారు . ఆస్ప్రింగులు కుడి తుంబ లో ఉండేవి .ఆ తుంబ ను కొట్టి వీణ కు శ్రుతిపెట్టేవారట .ఇలాంటి వీణను మైసూర్ మహా రాజు  దాసు గారికి బహూకరించారు .

198-రమణయ్య గారు పొట్టిగా ఉండేవారు .ఆది భట్ల నారాయణ దాసుగారి కంటే పెద్దవారు .కాషాయ బట్టలు కట్టుకొనేవారు .పిలక ఉండేది .వారికి మంత్రం పీఠం ఉండేది దానిలో వేద పాఠ శాల ఏర్పాటు చేశారు .పీఠాది పతులు ఎవరొచ్చినా అక్కడే వారి విడిది .

199-దాసు గారు వాయి౦చి నంత  స్పీడుగా ఎవరూ వాయించ గలిగే వారు కాదు ..1888లో మద్రాస్ సభలో మైసూర్ మహా రాజును మెప్పించి పారితోషికం పొందారు .మద్రాస్ పౌరులు రత్న ఖచిత స్వర్ణ కంకణాన్ని తొడిగి గౌరవించారు .లార్డ్ కర్జన్ బంగారు తోడా బహూక రించాడు .బరోడా వెళ్లి  ఆ మహా రాజ ఆస్థానం లో వీణ వాయించి ప్రశంసలు పొందారు .ఆ కచేరీలో ‘’స్కాచ్ ట్యూన్ ‘’వాయిస్తే సభలోని  యూరోపియన్లు మహదానందం పొందారు .సహాజీ విహార్ క్లబ్ వీరి కచేరీ ఏర్పాటు చేసి మెచ్చి  సువర్ణ పతకం ,వెయ్యి నూటపదహారు రూపాయలు అందించారు .కలకత్తా ,కాశీలలో నూ ప్రశంసల౦దు కొన్నారు .

200-వీణ వెంకట రమణ దాసుగారు సంగీతానికి మరొక అమోఘ కానుక అందించారు .అదే వారు రచించిన ‘’వీణా రహస్య ప్రకాశిక ‘’గ్రంధం .అందులో 16 శ్లోకాలలో గుచ్చ ,నాగబంధ ,తాన విశేషాలను వివరించారు .1926దాసుగారికి జర్మన్ సింఫనీ మాంత్రికుడు బీదోవెన్ కు వచ్చినట్లు మహా చెవుడు వ్యాధి వచ్చింది .భార్యా వియోగామూ కలిగి 8-2-1948న 84వ ఏట దాసుగారు మరణించారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-6-16-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -170

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -170

 64-మహా మేధావి ,సాపేక్ష సిద్ధాంత కర్త –ఆల్బర్ట్ ఐన్ స్టీన్-4(చివరిభాగం )

    75వ ఏట తాను  రాసిన అనుబంధం లో ‘’క్షేత్ర భావన సాధారణ సాపేక్ష సిద్ధాంతానికి తప్పని సరి .అటామిక్ శక్తి ప్రవర్తన గురించి వివరించటం చాలా కష్టమైన పనే .స0పూర్ణ విశ్వ సిద్ధాంతానికి రుజువులకోసం ఐన్ స్టీన్ ఉపయోగించిన సంకేతాలు (సింబల్స్ )గణితం లో తలపండిన వేత్తలకు  ప్రయోగాత్మకం గా రుజువు చేయటానికి సంవత్సరాల కాలం పడుతుంది .ఈ గణిత సూత్రాలను యంత్రాలకు అనువర్తింప జేయటానికి బుర్రలు బద్దలు కొట్టుకొవాల్సి వచ్చింది .అప్పటిదాకా ఐన్ స్టీన్ భావనలు సమాప్తం అని చెప్పటానికి వీలు లేదు .

  వయసు 75వచ్చే ముందే ఐన్ స్టీన్ ను ప్రపంచమంతా గుర్తించి గౌరవించింది .ఎశ్వివా యూని వర్సిటిలో  ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఏర్పరచటానికి నిధుల సేకరనకోసం ఆయనతో డిన్నర్ పార్టీలు నిర్వహిస్తే అనేక మిలియన్ల డాలర్లు వర్షం లాకురిసింది . స్థల ,కాల శక్తులపై ఉన్న ప్రతి పాత భావనలన్నీతన మేధా సంపత్తి తో  మార్చేసిన మేధావి శాస్త్రజ్ఞుడు ఐన్ స్టీన్ ముసలి వాడై పోతున్నాడు .కాని అతి గౌరవాలకు అంగీకరించలేదు .ఊహా తీత భావనలతో చూసే ఆ కళ్ళు ఆశ్చర్య చకితులను చేసే మేధస్సున్న వాడు ‘’ఆబ్సేంట్ మైండ్ ప్రొఫెసర్ ‘’అని పించుకొన్నాడు .పండిన జ్ఞానంతో మరింత పండిన తెల్లని జుట్టు తో ఆయన ఒక రుషి తుల్యుడు అనిపించేవాడు .

   గణిత పజిల్స్ పై ఆసక్తి ఎక్కువ ఆటలపై ఆసక్తి లేదు. అసలు చదరంగం ఆట గురించే తెలియదు .గుర్రపు పందాలు ఎరుగడు .బాస్కెట్ బాల ఫుట్ బాల ఆటలు చూసేవాడు కాదు .బోటింగ్ అంటే మహా ఇష్టం .ఆయన అనుభవజ్ఞుడైన  నావికుడు .ఆయనకు అమితాసక్తి కలిగించే ఆట ఒక్కటే ఉంది అదే నడక . క్లై౦బింగ్ అసలు ఇష్టం లేదు .పర్వతాలను చూడగానే నిరుత్సాహం వస్తుంది .అవి తనపై పడతాయేమో ననుకోనేవాడు .పైప్ తాగటం మహా ఇష్టం .విడతలు విడతలుగా తాగటం ఇష్టం .పుస్తకాలు చదవటం మహా ఇష్టం .సైన్స్ తర్వాత ఆయనకు అమితాసక్తి కలిగించింది చరిత్ర ,జీవిత చరిత్రలు ,వ్యాసాలుమాత్రమే .మంచి చిత్రాలు అంటే బాగా ఇష్టం కాని వాటిని కొని సేకరించలేదు .మత సంబంధ కార్యాలకు వెళ్ళే వాడు కాదు .ధర్మందానం ఇష్టమే .నెత్తిన కాప్ పెట్టుకొని యూదుల ప్రార్ధనలలో వయోలిన్ వాయించేవాడు .

    మతానికున్న ప్రాముఖ్యతను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదాయన .ఫిలాసఫర్ ,ఫిజిసిస్ట్ కూడా అయిన ఐన్ స్టీన్ భౌతికత ఆది భౌతికత ల మధ్య విభజన రేఖ గీయలేము అని చెప్పాడు .’The most beautiful thing we can experience is the mysterious .It is the source of all true art and science .To know that what is impenetrable to us really exists manifesting itself as the highest wisdom and the most radiant beauty which our dull faculties can comprehend only in the most primitive forms –this knowledge ,this feeling ,is at the center of true religiousness .In this sense I belong in the ranks of devoutly religious men ‘’అని స్పష్టం చేశాడు .ఐన్ స్టీన్  విశ్వాసానికి ,సైన్స్ కూ సంబంది౦చి నవాడే అయినా ‘’సైంటిఫిక్ రిసెర్చ్ కి విశ్వ మత అనుభవం అతి శక్తివంతమైన ,ఉన్నత మైన ముఖ్య సూత్రం ‘’అంటాడు .విశ్వ రహస్యాలను శోధించి చెప్పిన మహా తత్వ వేత్త లందరూ ఆయనకు ఇస్టులే అయినా ముఖ్యంగా స్పినోజా అంటేమరీ ఆరాధన .అతనిది ‘’జామేట్రిక్ ఫారం ఆఫ్ ఆర్గ్యు మెంటేషన్ ‘’అని సంతోషిస్తాడు .ఈ డచ్ ఫిలాసఫర్ ఆలోచనలే తనను పదార్ధం శక్తి ఒకటే అనే సూత్రం కనిపెట్టటానికి తోడ్పడింది అన్నాడు .స్పినోజాలో ఆలోచన ,దాని విస్తృతి అనే భావన ఉత్తమం గా ఉంది .ఒకే వస్తువు వివిధ రూపాలలో కనిపిస్తుంది ఆయన చెప్పింది గొప్ప విషయం అన్నాడు .నిత్య జీవితం లో ఓర్పు చాలా ముఖ్యం అనేవాడు .దానికి తోడు ఆరోగ్యకరమైన హాస్యం అవసరం అన్నాడు .’’We scientists will not change the hearts of other men by mechanism ,but by changing our own hearts and speaking bravely .We must be generous in giving to the world the knowledge we have of the forces of nature ,after establishing safe guards against abuse .We must realize  can not simultaneously plan for war and peace . When we are clear in hearts and mind –then only shall we find courage to surmount the fear which haunts the world ‘’అన్న దార్శనికుడు ఐన్ స్టీన్ .

  కొద్ది కాలం చిన్న అనారోగ్యానికి గురై ,76వ ఏట రక్తనాళాలు గట్టిపడి పగిలి 18-4-1955న మహా మేధావి శాస్త్ర వేత్త ఐన్ స్టీన్ మరణించాడు .ఆయనకు అత్యుత్తమ నోబెల్ బహుమతితోపాటు లెక్కలేనన్ని పురస్కారాలు లభించాయి .30కి పైగారచనలు చేశాడు .ఆయన అనేక సినిమాలు నవలలు నాటకాలు సంగీతానికి స్పూర్తి .’’మాడ్ సైంటిస్ట్ ‘’,ఆబ్సేంట్ మైండెడ్ ప్రొఫెసర్ ‘’పాత్రలకు ఆదర్శం కూడా .ఆయనకు ప్లంబరింగ్ బాగా వచ్చు .ప్లంబర్ అండ్ స్టీం ఫిట్టింగ్ యూనియన్ లో  సభ్యుడయ్యాడు కూడా .1912నుంచి 1955వరకు ఆయన జరిపిన3 ,500 ఉత్తర ప్రత్యుత్తరాలు హీబ్రూ యూని వర్సిటి ఆర్కైవ్స్ లో చూడచ్చు .ఐన్ స్టీన్ కు నీల్స్ బోర్ శాస్త్ర వేత్తకు మధ్య అనేక వాదోపవాదాలు క్వాంటం మెకానిక్స్ పై జరిగాయి .అవి ఫిలాసఫీకి ,సైన్స్ కు బాగా ఉపయోగ పడ్డాయి .ఐన్ స్టీన్ ,రోడో వస్కి-రోజెన్ పారడాక్స్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది .

  1926లో ఒక స్టూడెంట్ తో కలిసి ‘’ఐన్ స్టీన్ రిఫ్రిజిరేటర్ ‘’కనిపెట్టాడు .దీనికి 19 30లో పేటెంట్ పొందాడు .స్క్రాడిన్జర్కు సలహా ఇచ్చి ‘’బోస్ ఐన్ స్టీన్ గాస్ ‘’తయారు చేయించాడు .సెకండ్ క్వాన్టై జేషన్ తో స్క్రాడిన్జర్ ‘’ధర్మో డైనమిక్ ‘’సూత్రాలను సాధించాడు .మాగ్నేటిజంలో ఐన్ స్టీన్   డీ హాస్స్ ప్రయోగం ప్రసిద్ధమైనది .

  Inline image 3Inline image 4Inline image 1  Inline image 2

             సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-12

ఇది విన్నారా ,కన్నారా !-12

24-వీణ వాయిస్తూ గానం చేసే నందిగాన వెంకయ్య

186-1852-1916కు చెందినా నందిగాన వెంకయ్య గారు విశాఖ జిల్లాబిటువాడ అగ్రహారీకులు .వాసా అప్పయ్య గుమ్మలూరి వెంకట శాస్స్త్రి గారలవద్ద వీణ నేర్చారు .వీణ వాయిస్తూ పాడటం వీరి ప్రత్యేకత .అనుమంద్ర స్థాయిలో పాడేవారు .ఇలా పాడగలిగే వారు బహు అరుదు .

187-నాభి స్థానం నుంచి నాదాన్ని పూరించిపాడగలిగే వీరి నేర్పు అద్వితీయం .తెల్లవారుజామునననే లేచి గొంతు వరకు నీటి  ప్రవాహం లో మునిగి ఉండి మంద్రస్థాయిలో సాధన చేసేవారు .వీరి ముఖ్య శిష్యులే కాక బావ మరిది  వీణ విద్యా సార్వ భౌమ శ్రీ తుమురాడ సంగమేశ్వర శాస్త్రి గారు .

25-వీణ విద్యా సర్వ భౌమ శ్రీ తుమురాడ సంగమేశ్వర శాస్త్రి

188-‘’పిఠాపురం సంగమేశ్వర శాస్త్రి’’ గా ప్రసిద్ధులైన శ్రీ తుమురాడ సంగమేశ్వర శాస్త్రిగారు ‘’మెలకువ తో ఉన్నంత కాలం వీణ సాధన’’ చేస్తూండేవారు .పిఠాపుర సంస్థాన ఆస్థాన విద్వాంసులుగా ఉన్న వీరు రాగం ,తానం ,పల్లవి వాయించటం లో దిట్ట ‘’.His music was profound and magnificient ,though not inspired ‘’అన్నారు శ్రీ రంగ రామానుజ అయ్యంగార్ .కాని ఇన్స్పైర్ చేయలేదు అన్నది మాత్రం  శుద్ధ అబద్ధం అంటారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

189-శాస్త్రిగారి గూర్చిన ఘనత ఒకటిఉంది .ఒకే మెట్టు పై సప్తస్వరాలనూ (ఒకే స్థాయి మొత్తాన్ని )పలికి౦చ గలగటం-He  specialized in producing a whole octave on a fret .తీగను వెనక్కి లాగి రెండు మూడు స్వరాలు పలికించ వచ్చు కాని ఒకస్థాయికి స్థాయినే పలికించటం దుస్సాధ్యం .దుస్సాధ్యాన్ని శాస్త్రిగారు సుసాధ్యం చేశారు .వీరి తర్వాత బాలచందర్ గారు చేశారు ..అందుకే ‘’గా౦ధర్వం అంటే సంగమేశునిదే ‘’అనే మాట లోకం లో ప్రచారమైంది .వీరికి వాయులీనం లోనూ మంచి ప్రవేశం ఉంది .

190-‘’వీణ గోముఖ వ్యాఘ్రం లాంటిది .ప్రవేశం తేలికే కాని పోను పోను అందాలు పట్టించటం లో కస్టాలు ఎదురవుతాయి .ఒకరకం గా ‘డంబుల్స్ కసరత్తు ‘’లాంటిది ‘’.

191-శాస్త్రి గారు ఒక రాగం వాయించటం మొదలు పెడితే గంటలకొద్దీ వాయించేవారు .ఒక వేళ రాత్రి గడిచి తెల్లారితే ,మళ్ళీ దాన్నే విని పించే వారు .రాత్రి 10గంటలనుండి తెల్లవారుజామున 4 గంటల వరకు సాధన చేసేవారు .విపరీతమైన త్రిస్థాయి సాధన చేసేవారు .శిష్యులు కూడా అలాగే ఉండి పోయేవారు .

182-‘’రాముని మరువకే మనసా ‘’అనే శంకరాభరణ పల్లవి తరచుగా వాయించేవారు .ప్రాణం పోయేవరకూ  కూడా శాస్త్రిగారు ఆనంద భైరవి రాగం వీణపై వాయిస్తూ ప్రాణోత్క్ర్మమణం చేశారు .

183-దక్షిణాదిలోనే కాక కాశీ ,కలకత్తా బరోడా లలోనూ కచేరీ చేశారు .ప్రసిద్ధ హిందూస్తానీ గాయకులను ,సితార్ ,దిల్ రుబా ,ఇస్రాజ్ ,సారంగి వాద్యకారులను కలిసి మెళకువలు గ్రహించి వీణ పై వాటిని వారికంటే గొప్పగా వాయించే వారు .

184-ఒక సారి దర్భంగా మహారాజు పాద గయా క్షేత్రమైన పిఠాపురం వచ్చి ,రాజాగారికి మూడు రోజులు అతిధిగా ఉండి,,శాస్త్రి గారి హిందూస్తానీవీణ  కచేరీ విని ‘’ఉత్తరాది గవయాలును అంత మనోహరంగా బింకంగా ,దురితంగా ,నాద పూరితం గా పాడటం అరుదు ‘’అని ప్రశంసించారు .

185 –శాస్త్రి గారి శత జయంతినాడు’’ గానకళ’’ పత్రికలో శిష్యుడు శ్రీ ఆకొండి రాజా రావు ‘’వీణా చార్య సంగ మేశ్వరులు ‘’అనే వ్యాసం రాస్తూ ‘’శాస్త్రిగారి చేతిలో వీణ వీణ కాదు కీలు బొమ్మ .వెన్నవలె కరిగి మధురస మొలికిస్తుంది .నారదుని మహతి వీణ అప్రయత్నంగా పాడినట్లు ,వీరి వీణ కూడా అంతే .

186-పిఠాపురం మహా రాజా ఆహ్వానాన్ని అందుకొని రవీంద్ర నాద టాగూర్ వారి ఆస్థానానికి అతిధిగా వచ్చాడు ఆయనా సంగీత రసజ్ఞుడే .ఆయన పేర’’ రవీంద్ర సంగీతం’’ ఉన్నది .కొందరు దాక్షిణాత్యగాయకుల చేత రాజావారు కచేరీలు ఏర్పాటు చేయించారు .ఒక రోజు సంగమేశ్వర శాస్త్రి గారు కూడా వీణ కచేరీ చేశారు .ఆ కచేరీకి పరవశించిన రవి కవి ‘’దయ చేసి మేము కోరినపుడల్లా శాస్త్రిగారిని శాంతినికేతన్ కు పంపించండి ‘’’అనికోరాడు .అలాగే అన్నారు రాజావారు .

187-‘’శాస్త్రి గారు నా గురు దేవులు .ఆయన గానం నాకు అపూర్వ అలౌకికానందాన్ని అందించింది ‘’అన్నాడు గీతా౦జ లికర్త .,దక్షిణాది వాయులీన విద్వాంసుడు శ్రీ తిరుక్కోటి కావలి కృష్ణయ్య శాస్త్రిగారి వీణావాదన విని ఆనంద బాష్పాలు రాలుస్తూ కౌగిలించుకొని ‘’శాస్త్రీజీ !నేను వీణ నేర్చుకొని ఉంటె ,నా ప్రతిభ మరింత రాణిందేమో ? ‘’అని శ్లాఘించాడు .

188-శ్రీ వీణ శేషన్నగారు ‘’శాస్త్రి గారి ప్రతిభ దేవతలకు మాత్రమే సాధ్యం .మానవ మాత్రులు అలా వాయించ లేరు ‘’అన్నారు .ప్రముఖ నాద స్వర విద్వాంసుడు ‘’శాస్త్రి గారిలాగా సన్నాయి పై కల్యాణి రాగాన్ని వాయించటం నా జీవిత లక్ష్యం ‘’అన్నాడు .కృష్ణా జిల్లాకి చెందిన ప్రఖ్యాత సన్నాయి విద్వాంసుడు శ్రీ దాలి పర్తి పిచ్చి హరి ‘’శాస్త్రి గారు తోడి రాగాలాపన  చేయగా విని ముగ్దుడనయ్యాను .గంటలకాలాన్ని నిమిషాలుగా మార్చే సమర్ధత వారిది .ఆ మాధుర్యం లో పిసరంతైనా మేము సన్నాయి పై వాయి౦చగలిగితే ధన్యులం ‘’అన్నాడు .

189-శాస్త్రిగారు పాశ్చాత్య సంగీతం వాయించటం లోనూ దిట్టలే.గురువు వెంకన్నగారు ,వీణ వెంకట రమణ దాసు గారు సంగమేశ్వర శాస్త్రిగారల సాధనా పద్ధతిలో ఒక గొప్ప విశేషం ఉంది .అది ‘’త్రిస్థాయిలో వెయ్యి సార్లు స్వరాలను వాయించటం .మూడు కాలాలలోనేకాకుండా ఇంకా పై కాలాల్లోనూ ఈ ముగ్గురూ వీణ సాధన చేసేవారు .

190-శాస్త్రి గారి వీణకు 6వ మెట్టుశ్రుతి గా  పెట్టుకొనేవారు .అంత హెచ్చు శ్రుతికి తీగను బిగిస్తే వేళ్లకీ గమకాలకూ బాదే .అయినా అంత శ్రుతి లోనూ అతి సునాయాసంగా వాయించటం శాస్త్రి గారి ప్రత్యేకత . మైకులు ,సౌండ్ ట్రాకులూ లేని ఆ కాలం లో స్పష్టతా మాధుర్యం యే మాత్రం తగ్గేవికావు .ప్రతి సంగతి గుండెకు పట్టినట్లు ,రస నిష్య౦దమై ,భావ యుతంగా ఉండటం వారి ప్రత్యేకత .

191-శ్రీ లలితోపాసకులైన శాస్త్రి గారు సన్మానాల్లో కప్పిన శాలువాలను ఎప్పుడూ కచేరీలో పైన వేసుకోలేదు .వచ్చిన పారితోషికాలు ,నగదు కూడా ,ఆభరణాలు వాడుకోలేదు ‘’ఇవన్నీ శ్రీ తిరుపతి వెంకన్న సొమ్ములు .నేను ఉపయోగించ రాదు .మొక్కు బడి సొమ్ములు వాడుకో వచ్చా ?’’అని ప్రశ్నించేవారు .

192-ఆశించకుండా వచ్చే ధనాన్ని మాత్రమే తీసుకొనేవారు .గాయకులకు శిష్యులకు తృప్తి కలిగేట్లు దానితో వారికి విందులు ఇచ్చేవారు .తాను ధన్యులై ఆంద్ర లోకాన్ని ధన్యులను చేసిన వారు శ్రీ తుమురాడ సంగమేశ్వరశాస్త్రి గారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -169

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -169

 64-మహా మేధావి ,సాపేక్ష సిద్ధాంత కర్త –ఆల్బర్ట్ ఐన్ స్టీన్-3

అంతర్జాతీయ బృందం ఏర్పాటు చేసిన సభలో అతని విజయాలను ప్రస్తుతి౦చాక ఐన్ స్టీన్ చాలా పొడి హాస్యపు మాటలతో జవాబు చెప్పాడు .సాపేక్ష సిద్ధాంతానికి మరో తమాషా నిరూపణగా ’’ఇవాళ జర్మనీలోనన్ను జర్మనీ దేశపు సైంటిస్ట్ గా  గౌరవిస్తున్నారు ఇంగ్లాండ్ లో ఇతర దేశీయ జ్యూగా గుర్తిస్తున్నారు .కాని నా సిద్ధాంతాన్ని నిరాకరిస్తే జర్మన్లు నన్ను విదేశీ జ్యూ అని ఇంగ్లిష్ వాళ్ళు నన్ను జర్మనీ వాడుకాదు అని దూషిస్తారు ‘’అన్నాడు .జర్మనీలోని ప్రేగ్ యూని వర్సిటీ లో దీరిటికల్ ఫిజిక్స్ లో ప్రొఫెసర్ గా ఉన్న ఐన్ స్టీన్ ,ప్రష్యన్ అకాడెమి సభ్యుడై బెర్లిన్ కు వెళ్లి ఉన్నాడు .ఇద్దరు సంతానం తర్వాత భార్యకు విడాకులిచ్చాడు .1917లో తన మొదటి కజిన్ ఎల్సా ఐన్ స్టీన్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమె 1936లో చనిపోయేదాకా ఆయనకు చాలా అనుకూల వతిగా ఉన్నది .40వ ఏట ప్రపంచ యాత్రికుడయ్యాడు .ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అమెరిక ,చైనా ,జపాన్ ,పాలస్తీనాలు సందర్శించాడు .

   రాజకీయం లో ఎప్పుడూ లేడుకాని ఐన్ స్టీన్ హింస ప్రజ్వలిస్తే మాత్రం తప్పక దానికి వ్యతిరేక శిబిరం లో ఉంటాడు .శాంతి ప్రేమికుడు బీదజన సంక్షేమాభిలాషి . తనకు వచ్చిన నోబుల్  ప్రైజ్ మనీ ని తన దేశం అనుసరిస్తున్న అతితీవ్ర వాదవిధానాలకు వ్యతిరేకంగా పోరాడేవారికి చారిటీ ద్వారా అందించాడు .నాజీలు ఆయన్ను ద్వేషించారు .హిట్లర్ అధికారం లోకి రాగానే ఐన్ స్టీన్  ను జాతి శత్రువుగా ప్రకటించాడు .1933లోబలాత్కారం గా అకాడెమీ నుంచి తొలగించగానే ఐన్ స్టీన్ అమెరికా చేరాడు .అక్కడ న్యూ జెర్సీ లోని  ప్రిన్ స్టన్ లోఉన్న   అడ్వాన్సేడ్ స్టడీలో ఆయన ఆ జీవిత ఆచార్యుడుగా (లైఫ్ టైం ప్రొఫెసర్ )నియమించ బడ్డాడు .1940కి అమెరికా పౌరసత్వం పొందాడు .ఆయన లోని స్వాతంత్రేచ్చను అనేక పేపర్లలో రాసి తెలియ జేశాడు .ఇవన్నీ ‘’ది వరల్డ్ యాజ్ ఐ సీ ఇట్ ‘’మరియు ‘’అవుట్ ఆఫ్ మై లేటర్ లైఫ్ ‘’పుస్తకాలలో వచ్చాయి .నీతి పతనం ,టుడే మొదలైన వ్యాసాలలో తన భావాలను విస్పష్టంగా చెప్పాడు .’’ఈరోజు నాగరక మానవ అస్తిత్వ పునాదులు  కదిలి పోయి  స్థిరంగా లేవు .ఒకప్పటి మహా సామ్రాజ్యాలు ఇప్పుడు’’మాకు సేవ చేసేదే సరైనది ‘’అని ప్రకటించే  దౌర్జన్యకారులకు  తల వంచుతున్నాయి .భావ ప్రకటన మత స్వేచ్చ లు కబళింపబడ్డాయి. సామాన్య మానవుని జీవితం తో ఆడుకొంటున్నారు .వీటివలన ఆటవికత ప్రబలి పోయింది .కనుక మనం విలువల విషయం లో రాజీ పద వద్దు .హక్కు ,మానవ గౌరవాలకు భంగం కలిగే యే చర్యనైనా కలిసి కట్టుగా ఎదిరించాల్సిందే .ఈఆలోచనే పసిఫిస్ట్ అయిన ఐన్ స్టీన్ ను మానవ సేవకు యుద్ధ వీరునిగా మార్చింది .

    ఆయన స్పెషల్ జనరల్ దీరీ ఆఫ్ రిలేటివిటి సైన్స్ లో విప్లవం తెచ్చి ఆందరి  సైంటిస్ట్  లకన్నా ముందు నిలబెట్టినా ఐన్ స్టీన్ విశ్వ రహస్య విషయాలనూ  మరింత నిర్దుష్టంగా చెప్పే కృషి చేస్తూనే ఉన్నాడు .1921లో ప్లాంక్ శాస్త్రజ్ఞుని క్వాంటం సిద్ధాంతానికి సంబంధించిన రెడిఎంట్ ఎనర్జీ విషయం పై మార్పులు తెచ్చాడు .దీని భావం ఏమిటి ?  అంటే రెడిఎంట్ ఎనర్జీ క్వాంటా అనే చిన్న చిన్న విభాగాలుగా విడిపోయి వెలువడుతుంది .దీనికే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది .1906నుంచి 1920వరకు ఆయన చేసిన అరిశోధనా ఫలితంగా ‘’ఐన్ స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ లా’’ఏర్పడి ఫిజిక్స్  స్పెక్ట్రోగ్రఫీ లను సమూలంగా మార్చేసింది .తరువాత ఇదేటేలివిజన్ ఆవిష్కరణకు దారి చూపింది కూడా . దీని అనుబంధం 35ఏళ్ళ  కృషి ,ఏకీకృత సిద్ధాంత పరిశోధన .ఆధునిక శాస్త్రవిజ్ఞానం అతి సాధారణ సిద్ధాంతం కోసం సైంటిస్ట్ ల మధ్య పోటీ గా మారింది .సమ్మేళన(కాన్గ్రోమేరేట్ )పదార్ధం 92మూలకాలకు కుదింప బడింది .ఈ మూలకాలు మరింత సూక్ష్మ పదార్ధాలుగా విభజింప బడ్డాయి .బాగా మారిపోయే ప్రక్రుతి శక్తులను కుదించి కొన్ని శక్తి క్షేత్రాలుగా అంటే కాంతి ఉష్ణం ,మొదలైనవికిరణ శక్తులన్నిటినీ కలిపి వేర్వేరు పొడవు ఫ్రీక్వెంసి ఉన్న  విద్యుదయస్కాంత తరంగాలుగా వర్గీకరించారు .ఐన్ స్టీన్ పూర్వపు శోధన వీటిని మరింత తక్కువ చేసింది ..  స్పేస్ అండ్ టైం లు నిరంతర ప్రవాహం లో కలిసిపోతాయనిఐన్ స్టీన్  చెప్పిన సిద్ధాంతాన్ని ఆయన జనరల్ దీరీ ఆధారంగా ప్రత్యక్షంగా అనుభవించి రుజువు చేశారు .దీనితో విశ్వం యొక్క వక్రత పై ఉన్న కీలక  భావనలు ,నక్షత్రాల పుట్టుక ,గ్రహాలూ ,గెలాక్సీల స్థితి గతులపై వివరించే చెప్పే అవకాశమొచ్చింది . 20వేల టన్నుల టి .యెన్ టి ప్రేలినప్పుడోచ్చే శక్తి కంటే ఎక్కువ శక్తి, ఒక చిన్నపదార్ధం  ఆటం బాంబ్ గా ప్రేలినప్పుడు విడుదలౌతుంది .అంటే పదార్ధం అంటే తనలో దాచుకొన్న అనంత శక్తి అని అర్ధం .కనుక ఒకే విశ్వ తత్త్వం (కాస్మిక్ ఎంటిటి )యొక్క    రెండు విభిన్న అభివ్యక్తులే (మాని ఫెస్టే షన్స్ )పదార్ధం ,దాని శక్తి .

    కాని ఐన్ స్టీన్ సంతృప్తి పడలేదు .ఆయన ఇంకా సాధ్యం కాని సాధారణ సూత్రం కోసమే ప్రయత్నిస్తున్నాడు .ఆ సూత్రం –భౌతిక ప్రపంచమంతా ఒక నిరంతర ,అనంత ప్రవాహ శీలతే .కాని ఆయన సహ సైంటిస్ట్ లందరూ విశ్వం అంతా ఆగిపోయిన అనంత  అణుమాత్ర కణాలు ,అణువులె .అంటే క్వాంటా శక్తికణాలే .క్వాంటం శాస్త్ర వేత్తలు ప్రతిదీ తరంగాలు ,కణాలు కనుక విశ్వం ద్విగుణాత్మకమైనది  అన్నారు .అది అంతు చిక్కని పదార్ధమని కనుక అది సంభావ్యత పైనే ఆధార పడి ఉందని అంటారు .దీనినే ‘’అనిశ్చిత సూత్రం ‘’(అన్ సర్టెన్ ప్రిన్సిపల్ )అంటారు .ప్రమాదం కాని నిశ్చయత్వం కాని (కాజువాలితటి ,డిటెర్మినిజం )విశ్వావిర్భానికి కారణం కాదని తేల్చారు .విలియం లారెన్స్ యూని ఫైడ్ దీరీ ని ‘’ది న్యూ యార్క్ టైం ‘’లో  సమీక్ష చేస్తూ ‘’క్వాంటం దీరీకి ఒకే ఒక్కడు ఎదురు నిలిచాడు .అది విశ్వం లోని అనేక సమస్యల పరిష్కారం తో పాటు  ,అణువు అంతర్నిర్మాణం,రేడియేషన్ ప్రభావంలను కూడా  పరిష్కరించింది  .విశ్వం సంభావ్యత  నిశ్చయత్వం వలన ఏర్పడలేదు .అది ఒక అనంత ప్రవాహమే .’’అని రాశాడు .అంతకు ముందే ఐన్ స్టీన్ పూర్తీ తార్కిక విశ్వ రూపాన్ని గురించి చెప్పాడు .అందుకే ఆయన ‘’దేవుడు విశ్వం తో పాచికలు ఆడతాడు అని నేను నమ్మను ‘’అన్నాడు .

Inline image 1

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-6-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-11

ఇది విన్నారా ,కన్నారా !-11

22-వీణ పెదగురాచార్యులు

176-18,19శతాబ్దాలలో జీవించిన పెద గురాచార్యులు తమిళనాడులోనూ గొప్ప వైణిక విద్వాంసులుగా పేరుపొందారు .పాశ్చాత్యులను కూడా మెప్పించిన మహా విద్వాంసులు .షట్కాల వీణ వెంకట రమణ దాసుగారికి తాతగారు కూడా .

177-మైసూర్ ప్రాంతం నుంచి విజయనగరానికి వలసవెళ్లి, గాన విద్యా పీఠాన్ని ,వీణ సంప్రదాయాన్ని నెలకొల్పారు .అప్పటికి త్యాగరాజ కీర్తనలు ఆంద్ర దేశం లో ప్రచారం లోలేవు .అప్పటికి కృష్ణ లీలా తరంగాలు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు ,మువ్వ గోపాల పదాలు ,దరువులే బాగా వ్యాప్తిలో ఉండేవి .

178-గురాచార్యులుగారు సంగీత జ్ఞానం తో రచించిన గీతాలు ,తానవర్ణాలు ,తిల్లానాలు ,స్వర పల్లవులు ,శృంగార పదాలు ,కొణుగు శబ్దాలు ,జక్కిణ దరువులు ,సల౦దర్వులు వారి ప్రతిభకు గీటు రాళ్ళు .కొన్ని కాశీ రాజుపైనా ,నారాయణ గజపతి పైనా ,మాడుగుల కృష్ణ భూపతి పైనా రాసి తిరువాన్కూర్ మహా రాజుకు అంకిత మిచ్చారు .

179-పచ్చి మిరియం ఆది అప్పయ్య అనే ప్రసిద్ధ వైణికుని వంశంలో మరో సుప్రసిద్ధ వైణికుడు వీణ శేషన్న గారితాత గారికి సహోదరుడే పెద గురాచార్యులు .

180-పెద గురాచార్యులా వీణ సంప్రదాయమే శాఖోపశాఖలై ఆంద్ర దేశం లో విస్తరించింది .ఈ సంప్రదాయం లోని వారే పట్రాయని నరసింహ శాస్త్రి దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు ,కట్టు సూరన్న ,పొడుగు రామ మూర్తి ,రంగడు ,సర్వప్ప మొదలైన వారు .

23-శ్రీ దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు

181-శ్రీ దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులుగారు (1842-1896)శ్రీ వీణ వెంకట రమణ దాసు ,శ్రీ ములుగు శివానంద శాస్త్రి గారి తండ్రి శ్రీ ములుగు సుందరయ్య ,శ్రీ ఆనంద గజపతి గార్లకు గురువు .వీరితండ్రిగారు విజయనగరాస్థాన విద్వాంసులు .

182-సంగీత త్రయ రచనలు ఆంధ్ర దేశం లో వ్యాప్తి చెందటానికి ముఖ్య కారకులు సోమయాజులుగారే .వీర్రి దగ్గర వీణ నేర్చుకోమని ఆనంద గజపతిని తండ్రి విజయ రామ గజపతి కోరగా ఆయనకు సితార్ పై మోజేక్కువ అవటం తో  నేర్వలేదు .సితార్ పై పలికించే ప్రతిదీ వీణపై పలికించవచ్చని చెప్పినా కొడుకు వినలేదు .అప్పుడు తండ్రి తమ ఆస్థానం లోని మహాబత్ ఖాన్,కొడుకు మనవర్ ఖాన్ లను పిలిపించి సితార్ వాదన చేయించి వాటిని దూర్వాసులవారిని వీణపై పలికించమంటే పలికించారు. కాని వీరు వీణ పై పలికి౦చినవాటిని ఖాన్ సోదరులు సితార్ పై పలికించ లేక పోయారు .అప్పటికి జ్ఞానోదయమై ఆనంద గజపతి దూర్వాసుల వారి వద్ద వీణనేర్వటం ప్రారంభించారు

183-ఒక సారి1931లో  మద్రాస్ లో మైసూర్ ,పుదుక్కొట వంటి 7 సంస్థాన వీణగాయకుల మధ్య పోటీ జరిగింది .విజయనగరం సంస్థానం చిన్నది కనుక ఏడవ స్థానం ఇచ్చారు .అదిఅవమాన౦ గా భావించి గజపతికి కోపం వచ్చింది .దూర్వాసుల వారు నచ్చచెప్పి పోటీలో పాల్గొన్నారు .పోటీలో ఒక్కొక్కరికి ఇచ్చిన సమయం 20నిమిషాలు మాత్రమే . .దూర్వాసులవారు కల్యాణి ,వసంతరాగాలను అనేక ఇతర సంప్రదాయాలతోను ,పాశ్చాత్య సంప్రదాయం తోనూ  మేళవించి గంటన్నర సేపు వాయించారు .సభలోని తెల్ల దొరలూ దొరసానులు ఆనందం తో లేచి నిల్చుని డాన్స్ చేశారు .సోమయాజులుగారు గెలిచినట్లు ప్రకటించి సత్కరించి గౌరవించారు .వైస్రాయ్ ఎల్జిన్ ఆప్పుడిచ్చిన సర్టి ఫికేట్ ఆయన మునిమనవ రాలి ఇంట్లో ఇంకా భద్రంగా ఉంది .

184-సోమయాజులు గారు  72మేళ కర్త రాగాలలో పూసపాటి  వంశస్థుల దిగ్విజయాలను క్రుతులుగా రాశారు .అందులో ఒక్కటే లభ్యం గా ఉంది .ఆనంద గజోపతి పై కాంభోజి రాగం లో ‘’ఎందుకీ తొందర ‘’,మోహన రాగం లో ‘’నెరనమ్మినాను’’కృతులు రాసి ఆయనకే అంకితమిచ్చారు .

185-దూర్వాసులవారు స్వర్గస్తులైనప్పుడు  శ్రీ దూర్వాసుల రామూర్తి చెప్పిన పద్యం –

‘’వీణయుం జేత బూని కడు విస్మయ ముప్పతిలంగ భైరవిన్ –తానము మేళవించి ,అమృతంబును జిల్కెడు మిమ్ము జూచుచున్

‘’గాణలు హూణు లొక్క గతిగా నుతి జేసిరి గాని ,యంతలో –వీనుల పుణ్యమీ కరణి వీడెను గానము నస్తమించగా’’.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-6-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -168

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -168

 64-మహా మేధావి ,సాపేక్ష సిద్ధాంత కర్త –ఆల్బర్ట్ ఐన్ స్టీన్-2

   ఏక కాలం లో జరిగిన సంఘటనలు ఒకరికి కనిపించినట్లుగా మరొక పరిశీలకుడికి కనిపించటం లేదు .ఉదాహరణకు ఒక గడియారం చూసేవాడికి దానికీ  సాపేక్ష వేగం లో ఉన్నట్లయితే నెమ్మదిగా నడుస్తుంది అనిగమనించారు.ఇప్పుడు పొడవు కాలాలను మార్చే వీలు కలిగింది .ఈ రెండిటిని కలిపి ఐన్ స్టీన్ ‘’స్పేస్ టైం ఇంటర్వల్ ‘’ను గుర్తించి దూరం ,వ్యవధి చూపరులకు స్థిరంగా ఉంటుందని కనిపెట్టాడు .దీనివలన విశ్వం లోని స్థల,కాల సమస్యలు పరిష్కారమైనాయి .వీటన్నిటి వలన తేలిన విషయ౦ ఏమిటీ అంటే –అతి వేగంగా కదిలే ద్రవ్యరాశి తాను స్థిరంగా ఉన్నప్పటికంటే ఎక్కువ బరువుగా ఉంటుంది అని .ఈ ద్రవ్య రాశి మార్పు కాఫ్ మన్ శాస్త్రజ్ఞుని ప్రయోగాల వలన ద్రవ్యరాశి ,శక్తికి మధ్య ఉన్నప్రఖ్యాత ‘’ పరస్పర అంతర సంబంధం ‘’కు దారి చూపింది .

   న్యూటన్ గారి ఫిజిక్స్ లో ఒక కదిలే వస్తువును తోస్తే ,ఆ తోపు దాని వేగాన్ని పెంచి ,దాని చోదక శక్తి (ఎనర్జిఆఫ్ ప్రొపల్షన్ )కదిలేవస్తువులో గతి శక్తిగా మారుతుంది .తోపులు ఎక్కువైతే స్పీడ్ కూడా ఎక్కువౌతుంది .దీనికి పరిమితి లేదు .కాని ఐన్ స్టీన్ .ద్రవ్య రాశిని వేగవంతం చేస్సినా స్పీడ్ కాంతి వేగాన్ని మించలేదు అని చెప్పాడు .దీనర్ధం –కాంతి వేగం దగ్గర ద్రవ్య రాసిపై ఇచ్చిన తోపు కొద్దిగా మాత్రమె స్పీడ్ పెంచటానికి తోడ్పడి ,మిగిలినది అంతా ఆ  వస్తు ద్రవ్య రాశిని పెంచాటానికే తోడ్పడుతుంది .ద్రవ్య రాశిలో పెంపు ,ఇచ్చిన తాపు శక్తికి అనులోమానుపాతంగా ఉంటుంది .దీనినే ఐన్ స్టీన్ ప్రఖ్యాత సూత్రం E=mc2 అంటారు .ద్రవ్య రాసి అంతా కేంద్రీకృత శక్తి అనే అభిప్రాయాన్ని చెప్పాడు .ఇదొక విప్లవాత్మక సిద్ధాంతం .దీని అర్ధం –వస్తువులోని గుప్త శక్తి (లేటెంట్ ఎనర్జీ )E,దాని ద్రవ్య రాశి ,(M),కాంతి వేగం యొక్క వర్గం (స్క్వేర్ )తో C2తో హెచ్చి౦చగా వచ్చిన లబ్దానికి సమానం .ఇదే తర్వాత రేడియో యాక్టివ్ విచ్చిన్నానికి దారి చూపించింది .

 క్యూరీల  ఈ భావాలు ఎక్కువ ద్రవ్య రాశుల కోసం చేసే అన్వేషణకు దారి చూపింది .ఇదే అత్యంత శక్తికి నిలయమైన ఆటంబాంబు నిర్మాణానికి అవకాశం కల్పించింది .’’నేను అటామిక్ ఎనర్జీ విడుదల పిత ను కాను ‘’అని ఐన్ స్టీన్ చెప్పుకొన్నాడు .’’అటామిక్ వార్ ఆర్ పీస్ ‘’అనే తన గ్రంధం లో ఐన్ స్టీన్ ‘’అందులో నాపాత్ర  పరోక్షమైనది .అంతటి మహా శక్తి నా జీవితకాలం లో విడుదల అవుతుందని నేను ఊహించలేక పోయాను .అది సిద్ధాంత రీత్యా సాధ్యం అనే నేను చెప్పాను .అకస్మాత్తుగా కనుగొన బడిన చైన్ రియాక్షన్ అది త్వరలోనే సాధ్యమైపోయింది .అయితే నేను చైన్ రియాక్షన్ ను ముందుగా ఊహించలేక పోయాను .’’అని రాశాడు .1939లో అమెరికా భౌతిక శాస్త్రవేత్తలు అమెరికా ఆర్మీ, నేవీ అధికారులను అటామిక్ ప్రాజెక్ట్ ప్రాధాన్యత ను గురించి ఒప్పించ లేక పోయారు .ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ కు ఐన్ స్టీన్ అణుశక్తి విస్మరించలేనిదని,ఒక ఉత్తరం రాశాడు .దీనితో శత్రు దేశమైన జర్మనీకంటే ముందే అటామిక్ బాంబ్ ను తయారు చేసే పనిలో అమెరికన్ సైంటిస్ట్ లు ముందడుగు వేశారు .ఇవన్నీ ఐన్ స్టీన్ పూర్వమే చెప్పిన స్పెషల్ రిలేటివ్ దీరీకి పుట్టిన కొమ్మలే .1915లో ఆయన చెప్పిన జనరల్ రిలేటివిటి యే విశ్వం పై ఉన్న అనేక భావాలను కొత్తగా ఆవిష్కరించింది .గణితంలో రోజు రొజుకూ ఆవిష్కా రమౌతున్న నూతన సిద్ధాంతాలు ,తన స్వంత సాంకేతిక పరిజ్ఞానాలతో ఐన్ స్టీన్ ‘’ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వివలేన్స్ ‘’అంటే సమానార్ధక సూత్రం ను సాధించాడు .దీనివలన గురుత్వాకర్షణ శక్తికి ,వేగ వృద్ధి లేక త్వరణం లకు మూల విభేదం లేదని తెలిసింది .’’కాని త్వరణం యొక్క శక్తి అసలు శక్తి కాదని ,ఒక కారు అకస్మాత్తుగా స్టార్ట్ ఆయే టప్పుడు,ఆగేటప్పుడు ,ప్రక్కలకు తిరిగేటప్పుడు  దాన్ని అనుభవించగలం ,అదే కదలికల స్థితి లో మార్పు .అంతరిక్షం ధర్మాలు అతి పెద్ద ద్రవ్య రాశుల దాగ్గర మరిపోతాయిఅని ఐన్ స్టీన్ కనిపెట్టాడు .దీన్ని వంపు లేక వక్రత అన్నారు .ఇదే నాలుగవ పరమాణం (ఫోర్త్ డైమెన్షన్ ).ఇది న్యూటన్ చెప్పిన గురుత్వాకర్షణశక్తిని సమర్ధిస్తుంది .కాని సమీకరణం లో ఉన్న అదనపు పదం మనకు దగ్గరున్న సూర్యుడు లాంటి అతి భార వస్తువుల విషయమై కొద్ది తేడాలు కనిపించాయి . ఇదే సూర్యునికి దగ్గరున్న బుధ గ్రహ విషయం లో ఉన్న తేడాలను పరిష్కరించింది .

 అంతరిక్ష లక్షణమైన  గురుత్వాకర్షణ శక్తి అనుకొంటే ,అది ఒక శక్తి కాకపొతే ,కాంతి కూడా గురుత్వాకర్షణకు గురవ్వాలి ,కాంతి కిరణం గురుత్వాకర్షణ క్షేత్రం లోకి ప్రవేశిస్తే , అది తన దారి నుంచి ప్రక్కకు తొలగిపోతుంది లేక వంగుతుంది .ఇదంతా సాధారణ భౌతిక శాస్త్ర వేత్తలకు కల లాగా అనిపించింది .కాని ఐన్ స్టీన్ మాత్రం తన సిద్దాంతాన్ని ప్రయోగ పూర్వకంగా రుజువు చేయచ్చునని చెప్పాడు .సూర్యుని గురుత్వాకర్షణ లో ఉన్న ఒక నక్షత్రం యొక్క మార్గాన్ని పరీక్షించి చేసి చూడమని సలహా ఇచ్చాడు .సాధారణంగా నక్షత్రాలు రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి . కాని గ్రాహణం రోజున మాత్రమె నక్షత్రాలను సూర్యుడిని ఒకే సారి చూడగలం .ఈ విషయాన్ని గురించి ‘’ది యూనివర్స్ అండ్ డాక్టర్ ఐన్ స్టీన్ ‘’పుస్తకం లో లింకన్ బార్నెట్ ‘’గ్రహణం సమయం లో సూర్యుని నలుపు వైపునుంచితీసిన  నక్షత్రాలఫోటోలను ,మిగాతాకాలం లోనినక్షత్రా ఫోటోలను పరీక్షించి చూడమన్నాడు .సూర్యుని చుట్టూ ఉన్న నక్షత్రాలనుండి వచ్చే కాంతి లోనికి అంటేసూర్యుని వైపుకుఆయన గురుత్వాకర్శనశక్తి క్షేత్రం ద్వారా ప్రయాణించినపుడు  ఒంగుతుంది   .భూమి మీది వీక్షకులకు అ నక్షత్రాల ప్రతి బింబాలు వాటి యదార్ధ స్థితి నుంచి బయటికి తొలగినట్లు కనిపిస్తుంది .ఐన్ స్టీన్ ఈ విక్షేపం (డిఫ్లేక్షన్ )యొక్క ప్రమాణం ను గణి౦చాడు.సూర్యుని దగ్గరున్న నక్షత్ర కాంతి విచలనం (డీవిఏషన్)1.75సెకన్లు అని ఖచ్చితంగా గుణించి చెప్పాడు .ఐన్ స్టీన్ చెప్పిన విషయాలను గుర్తించిన శాస్త్ర వేత్తలు ప్రపంచ వ్యాప్తంగా 29-5-1919 నాడు భూ మధ్య రేఖ పై చేరి ఫోటోలు తీశారు .వాటిని తర్వాత డెవలప్ చేసి పరీక్షించి చూస్తె సూర్య గురుత్వాకర్షణ క్షేత్రం లో నక్షత్ర కాంతి విక్షేపం సరాసరి 1.64 సెకనులు అని గణించి తెలిపారు .ఇది ఐన్ స్టీన్  ఊహించి చెప్పిన దానికి అతి దగ్గరలో ఉండటం విశేషం .ఆయనది ఊహ తో చెప్పింది .ఇది ప్రయోగాత్మకం గా రుజువు చేసి చెప్పింది .అంతటి మేధావి ఐన్ స్టీన్ .

Inline image 2Inline image 1

      సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-6-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-10 21-వీణ వైభవం

ఇది విన్నారా ,కన్నారా !-10

21-వీణ వైభవం

167-‘’వీణా వాదన తత్వజ్ఞః శ్రుతి జాతి విశారదః –తాళజ్ఞశ్చా ప్రయాసేన మోక్ష మార్గం స గచ్చతి ‘’

అని యాజ్న్య వల్క్య స్మృతిలో ఉంది .వీణా వాదన తెలిసి శ్రుతి జాతులలో విశారడుడై తాళం తెలిసినవాడు  మోక్షానికి తేలికగా వెడతారు  అని భావం .వీణ వేదకాలం నాటిదని ‘’రుక్కుల వలన  తెలుస్తోంది .ఆ నాడు తంత్రులున్న యే వాయిద్యానయినా  వీణ అని అనిఉంటారు .ఇప్పుడు మనం వాడే ‘’సరస్వతి వీణ ‘’ఆ నాడు లేదు.24సారికలతో (మెట్లు ) తో మైనపు మేళం తో అన్ని రాగాలను వాయించే వీలున్నదే సరస్వతి వీణ ) .ఇదే తంజావూరు రఘునాధ నాయక భూపాలుని ‘’స్వర రాగ మేళ వీణ ‘’.దీనిపై మునులు ,మేధావులు ఎన్నో ప్రయోగాలు చేశారు . దీనికి ముందున్న వీణలు వాదనకు అనుకూలంగా ఉండేవికావు .’’అనురాగము లేని మనసున సుజ్ఞానం రాదు ‘’అన్నాడు త్యాగ బ్రహ్మ .భ్రుంగి ,నటేశ ,సమీరజ ఘటజ ,మతంగ నారదాదులు పాసించే సంగీత జ్ఞానము ,భక్తీ వినా సన్మార్గము కలదే మనసా ‘’అన్నారు త్యాగరాజ స్వామి .చివరగా ‘’వీణా వాదన లోలుడౌ-శివ మనోవిధ మెరుగరు ‘’అన్నారు త్యాగయ్య చివరగా .శివుని మనసు ఎలా ఉంటుందో ముక్తుడైన వాడి మనసూ అంత శుద్ధంగా ఉంటుంది అని చెప్పారు .

168-వీణకు 24మెట్లు ,వాటిపై నలుగు తంత్రులు ,ప్రక్కన మూడు తంత్రులు ఉంటాయి .పైనున్న నాలుగు తంత్రులు సారిణి-ఋగ్వేదాన్ని ,మంద్ర త౦త్రి సామ వేదాన్ని ,అను మంద్ర త౦త్రి అధర్వణ వేదాన్ని సూచిస్తాయి .ఈ నాలుగు తంత్రులు శుద్ధ సాత్విక గుణాన్ని కలిగి ఉంటాయి .ఈ 24మెట్లకు ప్రాధాన్యం కలిగేది వాటిల్లోంచి జనించే నాదం వల్లనే తప్ప ప్రాణం లేని లోహం వలన కాదు .ఈ 24తంత్రులు 24అక్షరాల గాయత్రి మహా మంత్రాన్నిచూపిస్తాయి .

169-మానవ శరీరాన్ని వీణ గా పోల్చారు .మూలాధారం నుంచి శిరస్సు ఊర్ధ్వ భాగం వరకు మానవ శరీరం లోని వెన్ను పూస దీర్ఘంగా నిలిచి ఉంది .శిరస్సు పైభాగమే బ్రహ్మ రంధ్రం .వీణకు 24మెట్లున్నట్లే వెన్నుపూసకూ 24పూసలున్నాయి .వెన్నెముకలో పై నుంచి కింది వరకు 7సెర్వికల్ ,12దోరాసిక్ ,5లు౦బర్ వేర్తిబ్రే లున్నాయి వీణలో పై మెట్లకు వెడుతుంటే దూరం తక్కువగా ఉంటుంది .అలాగే మూలాధారం వైపు వెన్ను పూసలు దట్టంగా  బ్రహ్మ రంధ్రం వైపు సన్నగా ఉంటాయి .మంద్రస్థాయి స్వరం శరీరం అడుగు భాగాన చివరలో జనిస్తుంది ..బ్రహ్మ రంధ్రం వైపు వెళ్ళే కొద్దీ శ్రుతి పెరుగుతుంది .బ్రహ్మ రంధ్రం సహస్రారం లో ఉంటుంది .అక్కడే సంగీతం యొక్క జీవం ఉంటుంది .

170-ప్రాణాగ్ని సంయోగం చేత నాదోత్పత్తి జరుగుతుంది .తక్కువ శ్రుతిలోమూలాధారం లో అది మొదలై పైకి పోయే కొద్దీ స్వాదిస్టాన,మణిపూర,అనాహత ,విశుద్ధ ,ఆజ్న అనే ఆరు చక్రాలను దాటి సహస్రాన్ని చేరేతంతవరకు శ్రుతి పెరుగుతుంది .

171-‘’సర్వ దేవా మయీ తస్మాద్వీణేయం సర్వ మంగళా –పునాతి విప్రహత్యాది పాథకైః పతితాన్ జనాన్ ‘’

భయంకర పాతకాలను పోగొట్టే వీణలో సర్వ దేవతలూ ఉండటం చేత వీణ ‘’సర్వ మంగళ ‘’అయిందని భావం .

172-వీణ అనే ఆంగ్ల గ్రంధం లో శ్రీ జి యెన్ సుబ్రహ్మణ్యం వీణను అనేక దేవతలు స్వాధీన పరుచుకోన్నారని –దండిలో శంభువు ,త౦త్రి లో ఉమా ,కుండ (కకుభం )లో కమలాపతి ,పత్రిక లో లక్ష్మి, తుంబ లో బ్రహ్మ ,నాభి లో సరస్వతి ,దోరికలో వాసుకి ,జీవల లో చంద్రుడు ,మెట్లు (శారికలు )లో సూర్యుడు ఉంటారని తెలియ జేశారు .ఇంతటి దైవ భావం మరే వాద్యనికీ చెప్పలేదు .దేవతలు ఏదైనా వాయిద్యాన్ని వాయించి ఉండచ్చుకాని వాద్యమే దైవం కావటం వీణ విశేషం .

173-120 గంటలు వీణ వాయిస్తే,అది మన శరీరం లో భాగమై పోతుందని సద్గురు శ్రీ శివానంద మూర్తి గారన్నారు .ముత్తు స్వామి దీక్షితులుగారు ‘’మీనాక్షీ ముదం దేహి ‘’కీర్తనను వీణ పై వాయిస్తూ ,నాదైక్యమయ్యారు .’’నాదతనుమనిశం శంకరం ‘’అనేది త్యాగయ్య గొప్ప సాధనా రహస్యాన్ని తెలిపే ఉపనిషద్వాక్యం .

174-‘’మూలాదారజ  నాద మెరుగుటే –ముదమగు మోక్షమురా –కోలాహల సప్తస్వర గృహముల –గురుతే మోక్షమురా ఓ మనసా ‘’అన్న త్యాగరాజ స్వామి కీర్తనలో బ్రహ్మ సూత్ర భాష్యం ఉంది .అంటూ వీణపై విశేషాలనన్నిటినీ తెలియ జేశారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

175-పూర్వం  వీణను నిలబెట్టేవాయి౦చేవారు .శ్రీ సంగమేశ్వర శాస్త్రి గారి వరకూ ఇలాగే జరిగింది .తరువాత శయన వీణా విధానం వచ్చి నిలిచిపోయింది .అయినా శ్రీ అక్కాజీ రావు గారు నిలబెట్టే వాయించేవారు ..శిరసుపై నిమ్మకాయ ఉంచుకొని ఘన రాగ పంచక తానాన్ని  నిమ్మకాయ పడిపోకుండా గంటల తరబడి వాయించేవారు శ్రీ వాసా పెదకామయ్య .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-13-6-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -16

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -16

 64-మహా మేధావి ,సాపేక్ష సిద్ధాంత కర్త –ఆల్బర్ట్ ఐన్ స్టీన్

‘’ఈ విశ్వం తో దేవుడు పాచికలాట ఆడతాడని నేను అనుకోను ‘’అని చెప్పిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 26వ ఏటనే సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రచురించాడు .అప్పటికున్న మేధావులలో 12మందికి మాత్రమే దాని అంతరార్ధం తెలిసి ఉంటుంది అనుకొనేవారు .40ఏళ్ళ తర్వాత అమెరికన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ హీరోషీమా  పై  6-8-1945న ఆటం బాంబు వేసినప్పుడు 80వేలమంది ప్రజలు దాని ప్రభావం తో చనిపోయారు .అది ఆయన ప్రతిపాదించిన జటిల సూత్ర తార్కిక ప్రభావం .ఇప్పుడు ప్రపంచానికి అర్ధమైనది ఆయువ లెక్చరర్ సిద్ధాంతాలు విజ్ఞాన శాస్త్రం లో విప్లవాన్ని ప్రముఖ ఖగోళ శాస్త్ర వేత్త గెలీలియో తర్వాత తీసుకొచ్చాడని .

    ఐన్ స్టీన్ 14-3-1879న బవేరియన్ జర్మనీలో విట్టెం బెర్గ్ సిటీ లో జన్మించాడు .వారిది ధనిక కుటుంబం .తండ్రి ఇంజనీర్ .అక్కడ ఎలెక్ట్రో టెక్నికల్ సంస్థల అధిపతి .ఈ బిజినెస్ వలన కుటుంబం ఇటలీ లోని మిలన్ కు1894 లో .మారింది .కుర్రాడి చదువు ఎక్కువ భాగం మ్యూనిచ్ లో జరిగింది .కొత్త జర్మనీ మిలిటరీ బూట్లు ,గొప్పలు నచ్చేవికావు .వీటికి దూరం గా బీతొవెన్ ,మొజార్ట్ ల సంగీతానికీ ,తత్వ శాస్త్ర గ్రందాలకే   ఆకర్షితుడయ్యాడు .15వ ఏటికే యూక్లిడ్ ,న్యూటన్ ,స్పినోజా లపుస్తకాలను  కాచి వడపోసేశాడు .దీని వలన ‘’ఓల్డ్ ఫాదర్ బోర్ ‘’అనే నిక్ నేం తో పిలిచేవారు సహాధ్యాయులు .17వయసులోస్విట్జెర్లాండ్ లోని  జూరిచ్ పాలిటేక్నికల్ స్కూల్ లో చదువు పూర్తీ చేశాడు తండ్రి తనలాగే వ్యాపారం లో స్థిరపడటానికి ఏలెక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవమని అంటే పోటీ తో ఎప్పుడూ ఒడిదుడుకులతో ఉండే వ్యాపారం కంటే సైన్స్ లోతులు పరిశీలించాటానికే నిర్ణయించుకొన్నాడు . అప్పటికే ఆయనకు ప్రముఖ అమెరికన్ రచయిత ఎమర్సన్  ప్రవచించిన ‘’If a man plant himself indomitably on his instincts ,the world will come round to him ‘’అన్నది వేద మంత్రమై స్పూర్తినిచ్చింది .దానినే అనుసరించాడు .గణితం ఫిజిక్స్ లలో  ప్రత్యేక కృషి చేయాలనుకొన్నాడు .జూరిచ్ యూని వర్సిటీలో చదువుతూనే ,అక్కడి సిటీ హై స్కూల్ లోను తర్వాత స్కాఫాసేన్ లోను విద్యార్ధులకు పాఠాలు బోధించాడు .22వ యేట స్విస్ సిటిజన్ అయ్యాడు .తన తోటి గణిత విద్యార్ధిని మిలీవామారేక్  ను  పెళ్లి చేసుకొన్నాడు .బెర్నే పేటెంట్ ఆఫీస్ లో పనిచేశాడు .అందంగా హుషారుగా ఉండే కుర్రాడు .నల్లని దువ్విన మీసం ,చక్కగా దువ్వుకొన్న నల్ల జుట్టు తో హీరోలాగా ఉండేవాడు .విశాలమైన కళ్ళు ,అందులో విశ్వా౦త రాళాలను శోదిస్తున్నట్లు ఉండే చూపు ఆకర్షణీయంగా అనిపించేవి .

  1905లో ‘’అన్నలెన్ దీర ఫికిక్ ‘’అనే 30పేజీల పేపర్ ను కదిలే ఎలక్ట్రో డైనమిక్ వస్తువులపై రాసి ప్రచురించాడు .ఈమహా వ్యాసం వస్తు గుణాలను ,విశ్వ నిర్మాణం లో ఉన్న అభిప్రాయాలను పూర్తిగా మార్చేసింది .దాని విప్లవాత్మక భావం మొదట్లో ఎవరికీ తెలియలేదు గుర్తి౦చనూలేదు .ఇది 1920కి ఆయన సిద్ధాంతం యొక్క ఆంగ్లానువాదం ‘’ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ,ఎ స్పెషల్ అండ్ జనరల్ దీరీ’’గా ముద్రింపబడి  గోప్పవిలువను సంతరించుకొన్నది .ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫిజిక్స్ ,గనణితాలను సవాలు చేసింది .న్యూటన్ అనుచరులు –గతి, స్తిరత్వాలు సంపూర్నమని వాటిని కొలవ వచ్చునని నమ్మారు .కాని ఇప్పుడీ కుర్రాడు ఐన్ స్టీన్ ఆ రెండూ సాపేక్షాలు అని చెప్పి సవాలు విసిరాడు .వేర్వేరు మనుషులు వాటిని వేర్వేరుగా గణి౦చగలరు అన్నాడు .దీనితో ఇప్పటిదాకా అందరూ నమ్మిన పొడవు ద్రవ్య రాశి ,కాలం యొక్క సంపూర్ణత్వం గంగలో కలిసిపోయింది .ఈ మూడిటి ఆధారంగానే మిగిలినవన్నీ కొలిచే విధానం లో పెను మార్పే వచ్చింది .

  ఇది అంతగా కొత్తదేమీకాదు .హెర్బర్ట్ స్పెన్సర్ తూర్పు వెళ్ళేస్టీమర్  మీద అదే వేగం తోకెప్టెన్ పడమరకు నడుస్తుంటే వచ్చే సమస్యను అందరి దృష్టికి తెచ్చాడు .అతడు కడదుల్తున్నాడా లేదా అని ప్రశ్నించాడు .పడవ మీద ఉన్నవాళ్ళకు ఆతను కదులుతున్నట్లే అనిపిస్తుంది .కాని ఒడ్డునుండి చూసేవాడికి అతనిలో కదలిక కనిపించదు .కనుక ఐన్ స్టీన్ కు ముందు నుంచే ఇలాంటి సాపేక్ష కదలిక విషయాలు చర్చలలో ఉన్నాయి .దీనికి విశ్వం లో ఎక్కడో ఒక బిందువు నుండి గణన చేయాలని అనుకొన్నారు .ఇలాంటి గందర గోళ భావాలు ఎన్నో ఉన్నాయి .ఎన్ని లెక్కలు వేసినా బుధ గ్రహం తన మార్గం నుండి పక్కకు తొలగినట్లున్యూటన్ ఆకర్షక  సిద్ధాంతాలలతో  గమనించారు ‘కాని మైకెల్సన్ ,మోర్లీ శాస్త్రవేత్తలు 1887లో భూమి కక్ష్యా మార్గం లో ఒక స్థిర బిందువు ఆధారం గా మార్పుని కనిపెట్ట లేక పోయారు .క్యూరీ దంపతులు రేడియం లోహం నుండి కంటికి కనపడని  శక్తి ప్రవాహం వెలువడుతోందని చెప్పారు .1901లో కాఫ్మన్ శాస్త్రజ్ఞుడు వేగంగా కదిలే ఎలక్ట్రాన్ల భారం స్థిరంగా ఉన్న వాటి కంటే ఎక్కువగా ఉంటుందని తెలియ జేశాడు .వీటన్నిటికీ ఐన్ స్టీన్ సిద్ధాంతం తిరుగు లేని సమాధానం చెప్పి చరిత్ర సృష్టించింది .ప్రకృతి ధర్మాలపైనూతన భావావిష్కరణ జరిగింది .ఈ ఖ్యాతి అంతా ఐన్ స్టీన్ దే

  గణిత శాస్త్ర సింబల్స్ ప్రకారం ప్రతి పరిశీలకుడు తానూ స్థిర బిందువు పై ఉన్నానని భావించే హక్కు ఉన్నదని అన్నాడు .సెకనుకు ఒక లక్షా ఎనభై ఆరు వేల మైళ్ళ వేగం తో ప్రయాణం చేసే కాంతి చూసేవారికి పరిమాణం లో సంకోచి౦చినట్లు గమనిస్తారు .ఈ సంకోచాన్ని 1885లో గుర్తించి లోరెంజ్ –ఫిట్జెరాల్డ్ సంకోచం అని పేరు పెట్టారు ఇది ‘’గణితకృత్రిమత ‘’  .(మేధమాటికల్ ఆర్టి ఫీషియాలిటి’’అన్నారు .కాని ఐన్ స్టీన్ దీన్ని భౌతిక సత్యంగా రుజువు చేశాడు .ఉదాహరణకు ఒక బంతి నిమిషానికి 161000మైళ్ళ వేగం తో కదులుతుంటే గమని౦చేవాడికి దాని మందం సగానికి సగం తగ్గి,ఒక ఫ్లాట్ డిస్క్ లాగా చివరికి అసలు  మందమేలేనట్లుగా  గమనిస్తాడు  .అంటే కాంతి వేగానికి మించిన వేగం తో యే వస్తువూ ప్రయాణి౦చలేదు అని అర్ధం .

Inline image 1

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-9

ఇది విన్నారా ,కన్నారా !-9

18-మాధుర్య వైదుష్య కలబోత శ్రీమతి మండా సుధారాణి

156-ఈ తర౦ అగ్ర గాయకులలో అగ్రశ్రేణిలో ఉన్నవారు శ్రీమతి మండా సుధారాణి .ఒకే సమయం లో రెండు చేతులతో రెండు వేరు వేరు తాళాలనువేసి ‘’తాళావధానం’’చేసిన విద్వాంసురాలు .విశాఖ కళా సమితి లో ఈ విన్యాసం చేసిఅబ్బుర పరచారు .

157-గతి ,తాళాలపై మహాదికారం ఉన్నందు వలననే సుదారాణిగారిని 18ఏళ్ళ చిన్నవయసులో మద్రాస్ సంగీత అకాడెమి నిర్వహించిన పల్లవి పోటీలలో బహుమతి పొందారు .

158-‘’మనో ధర్మ సంగీతానికి కల్పిత సంగీతం ఆధారం ‘’గ్రంధం రాసి భారత ప్రభుత్వం చేత ఫెలోషిప్ అందుకున్నారు .అనేక సభలలో ,సెమినార్లలో సంగీత విషయ పరిశోధన పత్రాలను సమర్పించారు ,సోదాహరణ ప్రసంగాలూ చేశారు .ముత్తు స్వామి దీక్షితుల విలక్షణత పై ప్రత్యేక పత్రం సమర్పించారు .’’షట్ కాల పల్లవి ‘’పై సోదాహరణ ప్రసంగం చేశారు .ఆమెకు వచ్చిన అవార్డులు ,రివార్డులు లెక్కలేనన్ని .ప్రతిభకు పట్టాభిషేకమే అవన్నీ .

159-అమెరికాలో చాలా రాస్ట్రాలలో కచేరీలు చేశారు .1984లో సంగీతం లో డిప్లమో ,1993లో మాస్టర్స్ చేసి సర్వ ప్రధమంగా నిలిచారు .

160-‘’వాగ్గేయ కారుల సంగీత ,సాహిత్య సౌరభాన్ని గాయకుడు తానుస్వయంగా  అనుభవించి గానం చేస్తే ఆ వాగ్గేయకారుని అనుభూతి శ్రోతలకు చేరుతుంది ,కచేరీ అప్పుడే రక్తి కడుతుంది ‘’అంటారు సుధా రాణి .

161-అగ్రశ్రేణి గాయకులైన అరియ కుడి ,శెమ్మంగుడి వంటివారు రస ద్రుష్టి తో చేసిన కృషి వలన సంగీతం తరతరాలుగా వ్యాపిస్తూ ,భాషా ,ప్రాంతీయ తత్వాలకు అతీతంగా దక్షిణ దేశమంతా ‘’ఒకే సంగీత కుటుంబం ‘’గా నిలబడింది ‘’అన్నారు .బౌద్ధిక సంగీతం కంటే హార్దిక సంగీతం వైపు మొగ్గుతారు

19-ప్రయోగ శీలి శ్రీ వైజర్స్ సుబ్రహ్మణ్య౦

162-  వైజర్స్ జానకీ, శేషగిరిరావు దంపతుల కుమారుడే శ్రీ బాల సుబ్రహ్మణ్యం .ఎన్నో ఏళ్ళ క్రితం శ్రీ నారు మంచి సుబ్బారావు గారు రచించిన పుస్తకం తప్ప ఆంద్ర సంగీతకారుల చరిత్ర మనకు లేదు. ఆ లోటు తీరుస్తూ బాల గారు ‘’తెలుగు సంగీత విద్వాంసులు ‘’పేరుతొ 200మంది కి పైగా వయోలిన్ ,గాత్ర,వీణవిద్వాంసుల చరిత్ర రాసి లోటు తీర్చారు  .భార్య శ్రీమతి పావని తోకలిసి ‘’ప్రణవం ‘’పత్రికను నడుపుతూ మహోపకారం చేస్తున్నారు .

163-‘’భైరవి సంగీత అకాడెమి ‘’స్థాపించినెలకు వందమందికి పైగా సంగీత శిక్షణ నిస్తున్నారు .ఆడియో స్టూడియో తోపాటు విద్యార్ధుల కచేరికి వీలుగా చిన్న ఆడిటోరియం  కూడా నిర్మించి ప్రోత్సహిస్తున్నారు .

164-సంగీతం లో ఎంత దక్షులో ,పరిశోధనలోనూ అంతే.’’సంగీత౦-భౌతిక శాస్త్రం ‘’అనే మోనోగ్రాఫ్ రాశారు .తిరు వెంకట కవి సంగీత సార సంగ్రహం ‘’పరిశోధన గ్రంధం రాసి ఏం .ఫిల్.పొందారు .’’అజ్ఞాత వాగ్గేయ కారులు ‘’పేరుతొ పరిశోధాత్మక డాక్యుమెంటరి శ్రీ వెంకటేశ్వర భక్తీ చానల్ కు చేసిచ్చారు .

20-బహుభాషా గాయని –శ్రీమతి ద్వారం లక్ష్మి

165-భగవద్దత్తమధురాతి మధుర కంఠ స్వరం తో ద్వారం భావనారాయణ ,వెంకట లక్ష్మి దంపతులకు జన్మించిన శ్రీమతి ద్వారం లక్ష్మి యెన్ సి ఇ ఆర్ టి లో శిక్షణ పొంది 14 భాషలలో పాడిన ఘనత సాధించారు .

166-ఏం ఎల్ వసంత కుమారి లక్ష్మిగారిని ఆవహించారా అన్నట్లు లక్ష్మిగారి గాత్రం ఉంటుంది .నేషనల్ టీచర్స్ కోర్ కు నాయకత్వం వహించి పార్లమెంట్ భవనం లో ప్రధాని సమ్ముఖం లో కార్య క్రమం చేశారు .భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా 20వేల మంది గాయకులతో కార్యక్రమాన్ని చేశారు .

Inline image 1 Inline image 2

మండా సుధా రాణి                               ద్వారం లక్ష్మి

సశేషం

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -166

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -166

 63-ఆధునిక సమకాలీన నృత్యానికి ప్రాణం పోసిన –ఇసడోరా డంకన్-3(చివరిభాగం )

    వియన్నా వాళ్ళు వీళ్ళని అర్ధం చేసుకోలేదు .ఈమె ఏశిలస్ కన్నా వాళ్ళ స్ట్రాస్ కె ప్రాముఖ్యమిచ్చారు .కాని ‘’బ్లూ డాన్యూబ్ ‘’ప్రదర్శన వారికి బాగా నచ్చింది .టూర్ సాగుతుండగా వెంటవచ్చిన గ్రీకు కుర్రాళ్ళు  సమస్యలు కల్గించారు .బెర్లిన్ చేరే సరికి వాళ్ళ అలవాట్లు గొంతులూ మారిపోయాయి .అమాయకత్వం పోయి స్థాయికోల్పోయారు .గత్యంతరం లేక వాళ్ళను ఎదేన్స్ కు పంపింది ఇసడోరా .యాత్ర సాగిస్తూనే ఉంది .బేరూట్ లో కొత్త విధానంగా డాన్స్ చేసింది .జర్మన్ రచయితహీన్రిచ్ దోడ్ పై మరులుకొన్నది .అతని ప్రతిస్పందన పారవశ్యంతో  అది ఆధ్యాత్మికం గా ఉంది .సెయింట్ పిట్స్ బర్గ్ చేరిస్టానిస్లవిస్కి పై వ్యామోహపడింది .ఆయన మర్యాదగా తిరస్కరించాడు .బెర్లిన్ లో ఆమె కలల్లో ఒకటి నిజమైంది .సోదరి తోకలిసి ‘’ఇసడోరా డంకన్ స్కూల్ ‘’పెట్టింది .శిష్యులుగా చేరిన ప్రతిభగలవారు వాస్తవ నాట్యకళను తమకంటే తక్కువ స్థాయి పిల్లలకు నేర్పాలి .ఉల్లిపొర లాంటి దుస్తులు కట్టి స్టేజి మీదకు ఇసడోరా రాగానే కొంతమంది పేరెంట్స్ అభ్యంతరం చెప్పారు .పాద రక్షలు లేకుండా స్టేజి పై ఆమె నర్తించటం స్పాన్సర్లకు నచ్చలేదు .మేజోళ్ళు వేసుకొన్న దానికంటే అదే చాలా  బాగుంటుంది అని వారికి నచ్చ చెప్పింది .ఒక ఏడాది తర్వాత ఒక పెద్ద కుంభకోణం బయట పడి స్కూలు మూతపడింది .

  27ఏళ్ళ వయసులో ఇసడోరా గార్డెన్ క్రెయిగ్ అనే ఆర్టిస్ట్ సీనిక్ డిజైనర్  ప్రముఖ నటి ఎల్లెన్ టెర్రీ కొడుకు ను చూసి వలచింది .తామిద్దరం వేరు వేరుకాదని ఒకే ఆత్మ యొక్క రెండు సగాలమని భావించింది.రెండు వారాలు ఆమె క్రెయిగ్ స్టుడియోలో బందీ గా ఉంది .మంచం లేకపోవటం తో ఇద్దరూ నేలమీదే పడుకొన్నారు .క్రెయిగ్ సామాన్య వ్యక్తికాదు .బజారులో ఆతను నడుస్తుంటే ఇసడోరాకు దేబ్స్ లో సమాధి చేయబడిన గొప్ప ప్రీస్ట్ అనిపించాడు .కొన్ని రోజులకే ఇద్దరి మధ్యా మాటల యుద్ధం అపోహలూ ,నిందలు వ్రుత్తి పరమైన దృష్టీ ,అరుపులు కేకలు బొబ్బలూ పెరిగిపోయి ఒక రోజు అకస్మాత్తుగా అతడు తలుపు బద్దలు కొట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు .భంగ పడిన ఇసడోరా హాలండ్ చేరింది .వారం నేల పడక దోర్లాటలో వచ్చిన గర్భం తోఒకపిల్లను కని,తన ఉదంతానికి గుర్తుగా విషాద ఐరిష్ క్వీన్ డీర్డ్రే   పేరు పెట్టుకొన్నది .

  క్రెయిగ్ తో ఉండటం అసాధ్యం అని తెలిసి ,ప్రేమ లేకుండా బతకలేనని గ్రహించి ఒక ఏడాదంతా కోపం తో గడిపేసింది .హోమియో పతి వైద్యం తో కొంత ఉపశమనం పొందింది ‘18వ శతాబ్దపు ముక్కు పొడుం డబ్బా లను సేకరించే చీకు చింతా లేని డచ్ కుర్రాడి తో రష్యా పారిపోయి ‘’కొద్ది సుఖమైనా విషాదాన్ని దూరం చేస్తుందని ‘’అనుకొంటూ తన డాన్స్ లలో తేలిక రకమైన  ‘’మూమెంట్ మూజికల్ ‘’ప్రదర్శించింది .ఏడాది తర్వాత న్యూయార్క్ చేరి అక్కడి మేధావులను ,గ్లఫ్ వాళ్ళ ‘’ఇఫీ జీనియా ‘’డాన్స్ సభ్యులనూ కలిసి మాట్లాడింది .ఆమె చేసిన ప్రదర్శనలపై  మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమైనాయి .’’అశ్లీలం ,అపవిత్రకళ,అసభ్య  అంగాంగ ప్రదర్శన ‘’అని ఫిలి స్టీన్ లు ఈసడించారు .చెప్పులు లేకుండా ప్రదర్శన వాళ్ళు అంగీకరించలేదు .బోస్టన్ లో ప్రదర్శన పై నిషేధం విధించారు .విమర్శకుడు కారల్ వాన్ వేచ్ టన్’’మన గ్లక్ డాన్స్ లు కూడా కొద్దో గొప్పో అపవిత్రంగా అశ్లీలంగానే   ఉన్నాయి కదా ‘’అన్నాడు .ఆమె బీదోవెన్ ఏడవ సింఫనీ ని తప్పుదోవ పట్టించింది .ఆమె డాన్స్ లో చాంతాడు లాంటి పొడవైన స్పీచెస్ ఉండటం ,అవి మూడ్ ను పాడు చేయటం ,’’స్వంత డబ్బా ‘’వాయి౦చు కోవటం నచ్చలేదు .’’నేను మస్తిష్కాన్ని ;;(సెరిబ్రల్ )అని చెప్పుకొన్నది .కాని తప్పులను చెప్పి సరిదిద్ది దారిలో పెట్ట గల  స్నేహితులు ఆమెకు లేక పోయారు.

  ఫ్రాన్స్ లో 32వ ఏట మళ్ళీ ప్రవేశించి బిచ్చ గత్తె అయింది ఒక మిలియనీర్ అయిన పారిస్ సింగర్ ను కలిసింది .పొడవుగా ఉన్న అతన్ని తనను రక్షించటానికి వచ్చిన యుద్ధ వీరుడు గా భావించి లోహేన్ గ్రీన్ అని పేరు పెట్టింది .అతని పడవ ఇద్దర్నీ మధ్యధరా సముద్రం మీదుగా ఇటాలియన్ రేవీరా  కింది నైలునది పైగా బ్రిటాన్ని చేర్చింది .నైస్  లో బ్రహ్మాండమైన పార్టీలు ,పారిస్ లో విందులు వేర్సల్లీస్ లో చిందులు ,ఈ జంటలోనికి ప్రవేశిస్తుంటే ఆర్కెస్ట్రా స్వాగత గీతాలతో అదిరి పోయింది .ఇసడోరా లోని ఆడంబరం పై తిరుగు బాటు ధోరణి ని బలవంతం మీద అణచు కొన్నది .అడపా దడపా వీటిని తప్పించుకోవటానికి ఆమె ఇంజిన్ రూమ్ లోకి వెళ్లి లోహెన్ గ్రీన్ ఎలాంటి ఉడుకు విప్లవం పరాయి దేశం లో తెస్తున్నాడో అర్ధం అవుతోందా అనుకొన్నది .క్రమంగా మధురమైన వైన్ ,సువాసన దవ్యాలు ,జిగ్ జిగేల్ మనిపించే పాల్ పారిట్ గౌన్లు కు అలవాటు పడింది .అందమైన అమ్మాయికి అత్య౦తసు౦దరమైన దుస్తులు చూసి ముచ్చట పడింది .1911లో ఇద్దరూ న్యు యార్క్ చేరారు .అతి పెద్ద విలాస వంతమైన నౌకలో భోగ భాగ్యాల గదిలో ఉన్నారు  .జాయ్,జాయ్గా  సాగిన ఈ ప్రేమ యాత్ర గర్భ వతి అయిన ఇసడోరా వలన అర్ధంతరం గా ఆగి పోయింది .ఫ్రాన్స్ కు  తిరిగి వస్తూ  మిలియనీర్ గారి కొడుకును  సముద్ర తీరం మీదే కని పాట్రిక్ అని పేరుపెట్టుకోన్నది .

    హేన్గ్రిన్ ఇసడోరా ను పెళ్లి చేసుకోవటానికి ముందుకొచ్చాడు .కాని ఆమె చాలా రెస్ట్ లెస్ గా ఉంది .సోమరిగా సృజనకు దూరంగా ఉండాలని అనిపించలేదామెకు .పూర్వం క్రేగ్ లాగానే ఇప్పుడూ ఈయనతో గొడవలు కొట్లాటలు ఛీ ఛీ ఛాఛాలు జరిగాయి .ఆమెలోని వ్యక్తిత్వం  స్వాతంత్రేచ్చ నిజంగా ఆమెలో నిలకడైనవి కాదని గ్రహించాడు .ఇతరులపై ఆధార పడాల్సి వస్తుందనే పెళ్లి వద్దన్నది .ఆమెకు అకస్మాత్తు పరిచయాలలో ధ్రిల్ ఉంటుంది .డబ్బున్నఆడవాళ్ళు డబ్బు బాగా ఖర్చు పెట్టే మగాళ్ళు అంటే తానూ ఎవరిని ద్వేషిస్తుందో వారే కావాలి .

 35వ ఏట ఇసడోరాకు పెద్ద దుఃఖ సంఘటన జరిగింది  .తాత్కాలికంగా భర్తతో కలిసి కాపురం చేస్తూఒక రోజు ఇద్దరు పిల్లల్ని నర్స్ ను కారులో షికారు  పంపింది .అది అదుపుతప్పి బ్రేకులు ఫెయిలయి కారు సీన్ నదిలో పడి పోయింది .ఇసడోరా తనభర్త తనను ఊరడిస్తాడనుకొంటే ‘’పిల్లలు ,పిల్లలు చచ్చిపోయారు ‘’అని ఏడ్చాడు .

  ఈ సంఘటన దిగ్భ్రాంతి కలిగించి ఆమె జీవితాన్ని మార్చేసింది .జీవితం సాగుతూనే ఉంది. కాని మారిన మరో స్త్రీగా .ఆత్మ వినాశకరం గా మరి జీవితాన్ని సర్వ నాశనం చేసుకొన్నది .లావు పెరిగి ,పని మందగించింది .అప్పుడప్పుడు నరాల ఉద్రేకం వచ్చేది .మళ్ళీ ప్రేమికుల వేటాడి ఒక ‘’బకరా’’ను పడేసింది .అతను పెళ్లికావాల్సిన ఇటాలియన్ యువ శిల్పి.ఒక డాక్టర్ గమనించి ఆమె ఆత్మ జబ్బు పడిందని తేల్చాడు  .ఆమెకు కావాల్సింది ప్రేమ ,మరింత ప్రేమ అన్నాడు .అందమైన ఒక హోమో సెక్సువల్ ,ఒక దక్షిణ అమెరికా టాంగో డాన్సర్ ,ఒక పియానిస్ట్ ఆమె ప్రేమ మంటలకు ఆహుతయ్యారు .కవులు కళాకారుల సంఖ్య చెప్పనే అక్కర్లేదు .దీన్ని అంతటిని ఆమె ‘’love might be  a pastime as well as tragedy ,and I gave myself to it with pagan innocence ‘’అన్నది .

   మొ ప్ర .యు .వచ్చాక ఇసడోరా డాన్స్ విజేత అయి ,ఎన్నో హింసలను ఎదుర్కొన్నది అనుకోని ఎదురు దెబ్బలు తిన్నది .ఆమె ఆదర్శ పాఠ శాల  ఒక హాస్పిటల్ గా   మారింది .దాన్నే ఆమె ‘’a charnel house  of bloody wounds and death ‘’అన్నది .తర్వాత అదివిషవాయువు తయారు చేసే  ఫాక్టరీగా మారింది .తన చనిపోయిన పిల్లల బదులు వారసురాలిగా చేసుకొందామన్న  ఒక పిల్ల పుట్టిన వెంటనే చనిపోయింది .అయినా  అకాడెమి ఆలోచన మానలేదు .1921లో రష్యా ప్రభుత్వ ఆహ్వానంపై  మాస్కో లో ఒక స్కూలు పెట్టాలని వెళ్ళింది .

 మరో ఏడాది దాటాక ఆదర్శాలన్నీ తుంగలో తొక్కి సెర్జ్ ఎస్సేనిన్ ను పెళ్లి చేసు కోన్నది .అతను  27ఏళ్ళు .అందగాడు .క్రూర ,సగం వెర్రి వెంగళప్ప,నీతిలేని రష్యన్ కవి .అతనికి ఇంగ్లీష్ రాదు .నేర్చుకోవటానికి ఇష్టపడేవాడు కాదు .తప్పతాగి ఇసడోరాను హింసించేవాడు .ఆమె డాన్స్ ను అవహేళన చేసేవాడు .ఆమె ఎదురు తిరిగితే కాల్చి చంపేస్తానని బెదిరించే శాడిస్ట్ .అతడిని అమెరికా తీసుకొని వెళ్ళింది అక్కడ ఆమెకు అనేక విశేషణాలతో స్వాగతం పలికారు .తర్వాత ఆమెను ఎల్లిస్ ఐలాండ్ లో నిర్బంధం లో ఉంచితే అతడే ప్రదర్శన చేశాడు .పెద్దగా లాభాపడింది ఏమీ  లేదక్కడ .

    యూరప్ తిరిగి  రాగానే మళ్ళీ ఎస్సిన్ దురుసుగా ప్రవర్తించి ,ఫర్నిచర్ విరగ్గొట్టి భీభత్సం సృష్టించేవాడు .మూర్చ రోగి అని సానుభూతి చూపేది .ఒక పెద్ద విలాస వంతమైన హోటల్ గది సామాను పగలగొడితే అతన్ని  శాని టోరియం  లో చేర్చింది .అతని స్వేచ్చకోసం ప్రాధేయ పడి కంట్రోల్ లో అతన్ని ఉంచుతానని వాగ్దానం చేసింది .కాని మణి కట్లు విరగ్గొట్టుకొని ఒక కవిత రాసి రక్తం తో సంతకం చేశాడు .చివరికి ఉరేసుకు చచ్చాడు .ఇసడోరా తీవ్ర దుఖం లో కూరుకు పోయింది .అతని మరణం తర్వాత ఆమె ఎక్కువ కాలం జీవించలేదు .49వ ఏట 1927జులై లో ఆమెఅభిమానులు మహా గొప్పది అని మెచ్చిన కచేరీ చేసింది .అందులో వేసుకొన్న స్కార్ఫ్ అందరికీ గుర్తుండి పోయింది .జీవిత మాధుర్యాన్ని బాగా రక్తి కట్టించింది అన్నారు .రెండు నెలల తర్వాత సెప్టెంబర్ 14న ఒక ఆటో మొబైల్ లో వెడుతుండగా  తాను  ఇష్టం గా వేసుకొన్నసిల్క్ స్కార్ఫ్ ను తాను  మామూలుగాస్వేచ్చా చిహ్నంగా ఊపు తుండగాదాని అంచులు  కారు చక్రాల స్పోక్స్ లో  ఇరుక్కు పోయి ,అదిక్రమంగా బిగుసుకు పోయి మెడను ఒరుసుకు పోయి మెడ తెగి రోడ్డుమీద పడి   చనిపోయింది .ఈ విధంగా ఆ కళ(ల )ల రాణి,దైవాంశ సంభూతురాలు ,మేధో విలసితురాలు దారుణ మరణానికి గురైంది .

  ఇసడోరా జీవిత ధ్యేయం ఆశ్చర్యాన్ని ప్రసారం చేయటమే .డాన్సులతో దాన్ని చేసి చూపించింది .అందానికి సామాన్యతకు భేదం ఆమె ఎన్నడూ నేర్వ లేదు .ఆమెది లోకాచారానికంటే ఎక్కువైనది .ఆమెది ఒక ప్రక్షాళన శక్తి .కదలికలను స్టేజ్ ని విప్లవాత్మకంగా మార్చింది .డాన్స్ లోనే కాక ఆధునిక మనసును విప్లవాత్మకంగా మార్చేసింది .ఆరోగ్య వంతమైన ఆర్ట్ కు మార్గ దర్శి అయింది .నటి గా ,ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలు ధరించి ఒదిగిపోయింది .కోరస్ పాడింది విషాద రాణి అనిపించింది .ఆమె చంచల మానస౦తో మెలోడ్రామ పండించిది  .’’ఏఅమెరికా మహిళా ఇసడోరా అంత పేరు ప్రఖ్యాతులు పొంది ,ప్రభావం చూపిన వారు లేరు ‘’అని బోలి ధియో 1929లో రాసిన మాట పూర్తీ యదార్ధం .

  యూరప్ లో ఇసడోరా స్థాపించిన ‘’మదర్ ఆఫ్ డాన్సేస్ స్కూల్ ‘’ఎక్కువకాలం ఉండకపోయినా ఆమె కళాప్రాభవం,ప్రభావం పెరిగాయి .ఆమె శిష్యురాళ్ళు అన్నా ,లిసా ,ఇర్మా మొదలైన వారు ఆమె తీర్చి దిద్దిన బాటలో  నడిచి ఆమె ఆలోచనలను మరింతగా ప్రచారం చేశారు .ఆమె భావాలన్నిటినీ ‘’ఇసడోరా డంకన్ సంప్రదాయం ‘’గా చరిత్రలో నిలిచిపోయింది .వైద్య వ్రుత్తి లో ఒక గాయానికి (ఇంజురి )’’ఇసడోరా డంకన్ సిండ్రోం ‘’అని పేరు పెట్టారు . కోరియోగ్రఫీ లో ఇసడోరా కొత్త పుంతలు తొక్కింది

  • . The movement of the waves, of winds, of the earth is ever in the same lastingharmony. We do not stand on the beach and inquire of the ocean what was its movement of the past and what will be its movement of the future. We realize that the movement peculiar to its nature is eternal to its nature. The dancer of the future will be one whose body and soul have grown so harmoniously together that the natural language of that soul will have become the movement of the body.
  • Thedance of the future will have to become again a high religious art as it was with the Greeks. For art which is not religious is not art. It is mere merchandise.
  • Theharmony of music exists equally with the harmony of movement in nature.
    Man has not invented the harmony of music. It is one of the underlying principles of life.
     Neither could the harmony of movement be invented: it is essential to draw one’s conception of it from Nature herself, and to see the rhythm of human movement from the rhythm of water in motion, from the blowing of the winds on the world, in all the earth’s movements, in the motions of animals, fish, birds, reptiles, and even in primitive man, whose body still moved in harmony with nature…..All the movements of the earth follow the lines of wave motion. Both sound and light travel in waves. The motion of water, winds, trees and plants progresses in waves. The flight of a bird and the movements of all animals follow lines like undulating waves. If then one seeks a point of physical beginning for the movement of the human body, there is a clue in the undulating motion of the wave.
  • “I have the right to choose the father of my own children,” Isadora declared, and then wrote to George Bernard Shaw: “Will you be the father of my next child? A combination of my beauty and your brains would startle the world,” but he replied: “I must decline your offer with thanks, for the child might have my beauty and your brains.”.
  • ఈ జోక్ ప్రపంచ వ్యాప్తమైనదని మనకు తెలిసిన విషయమే .

This great artist is no longer in our world. The sun has set: the cycle is finished. In her art and in her life Isadora Duncan seemed to be an incarnation of all the energies of Nature.

In those moments where beauty and emotion fuse and climax, something of the immortal floats about the dancer; she wanders in a divine ray, in a mist where all works of art circle in unison with her.

Perhaps the greatest personality who has ever devoted herself to developing the art of the dance …  Her interests ranged over a wide field of activities. There was a time when she wished to initiate a reform of human life in its least details of costume, of hygiene, of morals. But gradually she came to concentrate her interest upon the dance. For her the dance is not merely the art which permits the spirit to express itself in movement; it is the base of a whole conception of life, a life flexible, harmonious, natural. I

Her dances were hymns to freedom — of sensibility, of passion, of the transcendentally convinced and convincingEmersonian soul … Today it is hard to picture convincing interpretations of JoyHope, Immortality, the Soul. But at the turn of the century an American girl, incarnating these and more, coincided with historical promise

The dancing of Isadora Duncan is great symbolic art; now, when perhaps we have seen it for the last time, we must unhesitatingly re-affirm our conviction that it is one of the superlative artistic expressions of eternal spiritual glories. Her endowment is no mere talent for the consummation of exterior beauties; it is genius. She is a seer and a prophet, fulfilled of understanding and wisdom.

ఇప్పుడు ఇసడోరా కవిత ఒకటి చూద్దాం

The wind?
I am the wind.

The sea and the moon?
I am the sea and the moon.
Tears, pain, love, bird-flights?
I am all of them.
I dance what I am
.

 

Whenever you feel the evil influence of the middle class muddling your soul, you’ll say these two words and you’ll be a free spirit again: “Isadora Duncan.”

Nor must we forget the liberating force which sprang from the art of Isadora Duncan, whose heroic practice has done more than any precepts of philosophy to widen our ideas as to the intellectual and spiritual possibilities of the dance.

Inline image 1Inline image 2

 

Inline image 3Inline image 4

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-16-ఉయ్యూరు

 

 

 

 

   

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment