ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -193
73-ఆంగ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డింగ్టన్
‘’మనిషి తర్కం అతని గొప్ప ఆయుధం ‘’అంటాడు బ్రిటిష్ ఖగోళ ,గణిత శాస్త్ర వేత్త ఆర్ధర్ ఎడ్డింగ్ట న్ .సంఖ్యలతో ప్రారంభమై సంఖ్యలతో అంతమయే తీరులో మధ్యలో ప్రభావిత సైంటిఫిక్ పాండిత్యం అని ఆర్ధర్ స్టాన్లీ ఎడ్డింగ్ట న్ ను విశ్లేషించ వచ్చు .చివర్లో నంబర్ల విషయం లో మేధస్సు తగ్గుతుందో , ,లేక భవిష్యత్తులో మేధస్సు గుర్తింపు తెస్తుందో చెప్పలేని స్థితి .ఏది ఏమైనా ఎడ్డింగ్ టన్ సూత్రంలోని కీలక భావన శాస్త్రీయ ఆలోచనలో కొత్త విధానానికి నాంది పలికింది . ఎడ్డింగ్ టన్ 28 12- 18 82న స్కాట్లాండ్ సరిహద్దుకు యాభై మైళ్ళ దూరం లోని కేండాల్లో జన్మించాడు ..రెండవ ఏటనే తండ్రి ఆ ఊళ్ళో ఒక స్కూల్ నడుపుతూ చనిపోయాడు .తల్లి అతన్ని సోమర్సెట్ కు తీసుకువెళ్ళి క్వేకర్ విధానం సరైన విద్య నేర్పి లో పెంచాలనుకోన్నది .సౌకర్యాలు ,నంబర్ల మీద ధ్యాసచిన్నప్పటి నుంచి ఉన్నాయి .24 వ ఎక్కం వరకు క్షుణ్ణం గా వచ్చేసింది .ఆరవ ఏట పెద్ద పెద్ద సంఖ్యలతో ఆడుకోవటం ఖగోళ శాస్త్రం వైపుకు ఆకర్షించింది .గణిత విషయాలన్నీ అప్పటికే హస్తగతమయ్యాయి .పదవ ఏట మూడు అంగుళాల టెలిస్కోప్ తో ఆకాశాన్ని అధ్యయనం చేశాడు .
గొప్ప విద్య అడ్వొకేట్ అయిన తల్లి కొడుకును ప్రత్యేకత కల బ్రిమిలిన్ బోర్డింగ్ స్కూల్ లో చేర్చింది .బోర్డింగ్ స్కూల్ లో చదివి౦ చేంత ఆర్ధిక స్తోమత లేదు .కాని ఈ స్కూల్ మాత్రమె మిగిలిన వాటి కంటే మంచి విద్య ఇస్తుందని నమ్మింది .కుర్రాడి ప్రత్త్యేక అభిరుచులను టీచర్లు బాగా ప్రోత్సహించారు .13 వయసులో కేంబ్రిడ్జ్ జూనియర్ లోకల్ పరీక్షలలో మంచి మార్కులు సాధించి ప్రశంసలు పొంది ,సోమర్సెట్ కౌంటి స్కాలర్షిప్180 పౌండ్లు పొందాడు .ఇది మాంచేస్టర్లో ఓవెన్స్ కాలేజి లో చేరటానికి వీలు కలిగించింది 1902లో కేంబ్రిడ్జ్ ట్రినిటి కాలేజ్ లో చేరి ట్రిపోస్ గణిత పరీక్షలో పాల్గొని మొదటి గౌరవం –సీనియర్ రాంగ్లెర్ సాధించాడు .దీన్ని మిగిలిన పోటీ దారులకంటే ఒక్క ఏడాదిలోనే సాధించటం అతని ప్రతిభా విశేషం .లెక్కలలో అపార పాండిత్యం ,ఆస్ట్రానమి మీద అభిరుచి అతన్ని గ్రీన్విచ్ అబ్సర్వేటరి చీఫ్ అసిస్టంట్ అవటానికి దోహదం చేసింది .అక్కడ సమగ్ర నక్షత్ర గమనాలపై అధ్యయనం చేశాడు .ఒక ఏడాది తరువాత 19 07లో ‘’స్టెల్లార్ మోషన్స్ ‘’పైన రాసిన వ్యాసంఅనేక నక్షత్ర సమూహాలతో ఏర్పడిన మన గెలాక్సీగమనాన్ని ,ఆకారాన్ని గురించి తెలిపింది .తన పరిశోధనల కేటలాగ్ ను 1910లో ప్రచురించాడు .దీనికి ‘’సిస్టెమాటిక్ మోషన్ ఆఫ్ స్టార్స్ ‘’అని పేరుపెట్టాడు .ఇందులో 6 ,188 నక్షత్రాల సైజు, స్థితి, గమనాలను విశ్లేషించి తెలియ జేశాడు .
31 వ ఏట ఆస్ట్రానమి లో ప్లూమియన్ ప్రొఫెసర్ అయ్యాడు .ఏడాది తర్వాత ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం పొంది కేంబ్రిడ్జ్ అబ్సర్వటరి డైరెక్టర్ అయ్యాడు .ఈ కాలం లో 12 ఏళ్ళు అక్షాంశాల తేడాలు ఖచ్చితమైన భూ గమనం తెలుసుకోవటానికి ఎలా ఉపయోగ పడతాయో ,కనిపెట్టాడు .నక్షత్ర గమనాలు ,నక్షత్ర అంతర్భాగ నిర్మాణ విశేషాలను అందరూ వదిలేసిన ఐన్ స్టీన్ సిద్ధాంతం ఆధారంగా వివరించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-16 –ఉయ్యూరు
