ఆ అక్షరాలు… రుధిరాశ్రుస్వేద మిశ్రమాలు

ఆ అక్షరాలు… రుధిరాశ్రుస్వేద మిశ్రమాలు

  • – ఎన్. బద్రి, 9154421505
  • 12/01/2015
TAGS:

టంచన్‌గా నెలజీతం జేబులో వేసుకునే ఉద్యోగ కవులే మనకు ఎక్కువగా కనిపిస్తారు. అందులో కొందరు కేవలం సత్తాలేని చలామణీ కవులు. మరికొందరు సామాజిక, ఆర్థిక హోదాలను అనుభవిస్తున్న పాండిత్వ కవులు. ఇంకొందరు కష్టాల నేపథ్యంలోంచి ఎదిగి స్థిరపడి గతాన్ని నెమరువేసుకునే కవులు. మనసా వాచానే కాకుండా కర్మనా నమ్మిన బాటను, నచ్చిన మాటను ధైర్యంగా ప్రతిఫలింపజేసే కవులు మాత్రం తక్కువగానే ఉన్నారు. వారే కాలాతీత కావ్య స్రష్టలుగా మిగిలిపోతారు. అభిమానుల గుండెల్లో ఆత్మీయ స్థాయిని అందుకుంటారు. అందుకే అలిశెట్టి ప్రభాకర్ అంటే ఇంత అలజడి. ఆయన కవిత్వంలో ఓ విద్యార్థి, ఓ శ్రామికుడు. ఓ అబల తమను తాము చూసుకుంటారు. అలిశెట్టిది కేవలం కంటితో చూసిన అవగాహనా కవిత్వం కాదు. అది అనుభవ సారం. కఠోర జీవన మధనంలోంచి చిలికిన ఘర్మజలాల వెల్లువ. ఆ కవిత్వమంతా రక్తాక్షరాలే. అభాగినుల వెచ్చని అశ్రుధారలే. శ్రామికుడి ఆరని చెమట బిందువులే.
కష్టజీవి గురించి రాయడానికి ఆ కష్టాన్ని రుచి చూశాడు. అందుకే ‘నను / తొలిచే / బాధల ఉలియే / నను మలిచే / కవితా శిల్పం’ అన్నాడు. సమిష్టి బాధల / సుదీర్ఘ శ్వాసే / ఒక ఊరేగింపు’ అని అన్నాడు. ఆకలి గురించి రాయాలంటే ఆకలీ తెలియాల్సిందే. ఆకలిగొన్న వానిపట్ల సానుభూతితో రాసే కవిత్వం ఆకలి కవిత్వమే కాదు. ఆకలి తెలిసిన కవి మాత్రమే – ‘అందంగా / తోకాడించే / కుక్కపిల్లలాటిది / కాదు / కుట్టిన / ఎర్రతేలు / మంటలాంటిది ఆకలి’ అనగలడు. మానవ జాతి చరిత్ర యావత్తూ సామాన్యుడి రోదనామయమేనని నమ్మిన కవి అలిశెట్టి. అందుకే ‘చరిత్రకు రక్తపాతమే ఉపోద్ఘాతం / చిరత్రకు చెమట బొట్టే ఆధారం / చరిత్రకు ఆకలి ప్రేరణ’ అని ఏ రాణీ ప్రేమ పురాణం చరిత్రసారం కాదన్న శ్రీశ్రీకి తోడయ్యాడు. పోరుబాటను అమితంగా ప్రేమించిన కవి అలిశెట్టి. తన కవిత్వాన్ని అదే మార్గాన నడిపిన ధీశాలి. ‘అనంతాకాశ క్షేత్రంలో / అక్షరాన్ని / సూర్యబింబంగా నాటగలిగిన వాణ్ణి / ఒక పోరాట కెరటాన్ని / యుద్ధనౌకగా / తీర్చిదిద్దలేనా’నని ధీమా వ్యక్తం చేస్తాడు. తన కలమూ కుంచె పీడితుల పక్షాన నిలవాలని కాంక్షించి – ‘అసలు నువ్వెప్పుడన్నా / నా ఆలోచన ఆయుధాగారం / తెరిసి చూసైనా / లక్షలాది పీడితుల పిడికళ్ళే / నా అక్షరాలని’ మాట నిలబెట్టుకున్నాడు. విద్యాధికుడు కాని ప్రభాకర్ కవిత్వంలోని ఆర్థికశాస్త్రం అబ్బుర పరుస్తుంది. ఇంత లోతైన ఆలోచన ఎలా తట్టిందో ఆయన జీవన సరళికే తెలుసు. ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకునే ‘పారిశ్రామికీకరణ’ను ‘కమిలిపోయిన / కార్మికుడి దేహమీద వాలి / యంత్రాల / ఇనుపగోళ్లతో / రక్కెయ్యడమే’నని ఏకి పారేశాడు. ఆర్థిక శాస్త్రంలో శ్రమ విలువ తేల్చడం మామూలుగా ఓ బ్రహ్మపదార్థం. రెండు ముక్కల్లో ప్రభాకర్ ‘అన్నం మెతుకునీ / ఆగర్భ శ్రీమంతున్నీ / వేరు చేస్తే / అసలు / శ్రమ విలువేదో / తేలిపోదూ’ అని విప్పిచెప్పాడు. సామ్రాజ్యవాద లక్షణాలను పాతికేళ్లముందే పసిగట్టిన, చదువు పట్టాలముందు పసిపిల్లవాడు అలిశెట్టి. సులభ శైలిలో పిడుగుల్లాంటి విషయాల్ని పేల్చి చెప్పాడు. ‘ఏ దేశం శిరసు మీద / మోపిన / పాదాలైనా / హోదాలైనా / సామ్రాజ్యవాదాలే’. ఇంకేముంది మనలనేలుతున్న ప్రభుత్వాలు కీలుబొమ్మలని కొత్తగా చెప్పడానికి. అనుమానం ఏమైనా ఉంటే ఇదీ చదవండి – ‘దాహం దాహంగా / డాలర్ నాలుక చాచిన / బహుళ జాతి కుక్కా / దేశం దేశమంతా / వాగ్దానాల ఊళ పెడుతున్న / అరాజకీయాల నక్కా / రెండూ బహు ప్రమాదకరమైనవి…’ అంటూ ప్రపంచంలోని దొంగలంతా ఒక్కటయ్యారని హెచ్చరించాడు. శ్రామిక పక్షపాతి అయిన ప్రభాకర్ కవిత్వం నిండా చెమట వాసన సచాలిస్తుంది. రక్త వర్షం చెమట నదిగా రూపాంతరం చెందడం దర్శిస్తాడు. ‘నల్ల రేగడి నేలమీద నాగళ్ళ లిపిని’ చదువుతాడు. ‘కణకణ మండే కండరాల ఎరుపు నూకను – గొంటాడు. అందుకే ‘పాలరాతి బొమ్మయినా / పార్లమెంటు భవనమైనా / వాడు చుడుతేనే శ్రీకారం / వాడు కడితేనే ఆకారం’ శ్రామికుడిని తలనెత్తుకుంటాడు. బతికిన 39 ఏళ్ళలో 20 ఏళ్లకు పైగా జీవితాన్ని కవిత్వానికే కేటాయించాడు. తన కవితలు వెలుగు విరజిమ్మేందుకు తన ఆస్తిని, ఆరోగ్యాన్ని ధారపోశాడు. చివరి రోజుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో సైతం ‘మున్సిపాలిటీ వాళ్ళెత్తని చెత్తలా / నెత్తిమీద జుత్తు పెరిగిపోతే / నన్ను నేను పోల్చుకుంటానో లేదోనని / అద్దంలో చూసుకొని / అచ్చు అలిశెట్టి ప్రభాకర్‌నే అనిపించి / సంతృప్తిగా నవ్వుకుంటాను’ అని తనపైనే సెటైర్లు వేసుకున్నాడు. కష్టజీవికి ఇరువైపులా నిలబడే వాడే కవి అనుకుంటే ఆ కవి అలిశెట్టి ప్రభాకర్.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మానవ సంబంధాల మాధుర్యం ఇలా..

మానవ సంబంధాల మాధుర్యం ఇలా..

  • -పాలంకి సత్యనారాయణ
  • 10/01/2015
TAGS:

రెల్లు
– బి.పి.కరుణాకర్
వెల: రూ.80/-
పుటలు: 128;
మనోప్రియ
ప్రచురణలు
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

జీవితాన్ని తేలికగా, ఆనందంగా, నవ్వుతూ తీసుకునే మనస్తత్వం గల బండారు కరుణాకరప్రసాద్ రచించిన ‘రెల్లు’ కథల పుస్తకం పాఠకుల ముందుకు వచ్చింది. ఈ పుస్తకంలో ఇరవైఒక్క కథలున్నాయి. విశాలాక్షి, ఆంధ్రజ్యోతి, తేజ వారపత్రిక, సాహితీ స్రవంతి, వార్త, ప్రజాశక్తి ఆదివారం అనుబంధం, సాక్షి ఫన్ డే, నవ్య, విపుల, చిత్ర, ఆంధ్రప్రభ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం ఇతివృత్తంగా అనేక కథలు వచ్చాయి. తాజా ప్రియుడితో ఉన్నపుడు మాజీ ప్రియుడు ఎదురైతే ఇబ్బందికరమైన పరిస్థితే. వారిద్దరు స్నేహితులన్న సంగతి తెలియని కథానాయికకి ఎదురైన అనుభవం తెలుసుకోడానికి ‘హార్ట్‌గేలరీ’ కథ చదవాలి.
ఆఫీసులో సహోద్యోగి గంగాధర్‌తో ప్రేమలోపడిన తర్వాత, అతను పెళ్లై పిల్లలుకలవాడన్న సంగతి తెలుసుకుని, సంబంధం తెంచుకుంటుంది కథానాయిక. అదే ఆఫీసులో రామానుజాన్ని పెళ్లిచేసుకుని పిల్లవాడికి తల్లి అవుతుంది. దురదృష్టవశాత్తూ కొడుకు చనిపోవడమేకాకుండా రామానుజం చెప్పాపెట్టకుండా ఎటో వెళిపోతాడు. ఈ పరిణామాలకి గంగాధర్ కారణమని భావించిన కథానాయిక శ్రీమతి గంగాధర్‌కి అన్ని విషయాలు చెప్పి పగ తీర్చుకున్నాననుకుంటుంది. చెప్పాల్సిన వ్యక్తి, చెప్పిన వ్యక్తి ఒకరు కాదన్న కొసమెరుపుతో ‘ఎదురునీడ’ కథ ముగుస్తుంది.
బోగస్ రేషన్‌కార్డుల సమస్య ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఇబ్బందికరమైనదే! ఏరివేత కార్యక్రమం ద్వారా ఓట్లు నష్టపోతామన్న భయం ఏలికలకుండడం సహజం. ఉన్న కుటుంబాలకన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఇవ్వాల్సిరావడం ఆడిట్‌లో ప్రభుత్వానికి అక్షింతలు పడడం మనకు తెలిసినదే! రేషన్‌కార్డుల ఏరివేత పర్యవేక్షక అధికారి, లచ్చుమమ్మని కార్డులో రాయించిన పేర్లతో ఎంతమంది లేరో చెప్పమంటారు. లచ్చుమమ్మ ఇచ్చినది తప్పుడు సమాచారం అన్న సంగతి అధికారికి ఎలా తెలిసింది? అన్న విషయం ‘ఏరివేత’ కథ ఇతివృత్తం. ఆఖరివాక్యం ఉత్కంఠ భరితంగా ఉంది.
రత్తయ్య, భార్య పోయిన తర్వాత కొడుకు, కోడలు ఇంట్లో ఉండడానికి ప్రయత్నించి, ఉండలేక ఒంటరి జీవితానికే అలవాటుపడతాడు. రిక్షా తొక్కి జీవితం కొనసాగిస్తూంటాడు. ఆ ఊళ్లో రామిరెడ్డి తోటకి, రాత్రి ఎనిమిది దాటితే విటుల తాకిడి ఎక్కువ వుంటుంది. రత్తయ్య ఆ తోటలో ‘సావిత్రి’ని వెతుక్కుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న వారెవరూ సరైన చిరునామా చెప్పరు. ఇక ప్రయత్నం విరమించి వెళిపోదామనుకుంటున్నపుడు, రిక్షా చెయిను ఊడిపోతుంది. చెయిను సరిచేసి ఎదురుకుండా ఉన్న పాకవైపు చూసేసరికి ‘సావిత్రి’ కనబడుతుంది. సావిత్రి, రత్తయ్యతో అన్న మాట ఎందుకు దుఃఖం కలిగించిందో ‘కన్నీటి నురుగు’ కథలో తెలుస్తుంది.
ఆకలిని తట్టుకోడం సులభసాధ్యం కాదు. ప్రేమించినవారి ఆకలిని తీర్చడంకోసం తన ఆకలిని మరిచిపోయే వ్యక్తిచుట్టూ తిరిగిన కథ ‘దోసెడు ఆకలి’ కథానాయకుడి కారు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని ఉంటుంది. భాగ్యనగరంలో రోడ్డు దాటడానికి ఆగిన కార్ల మధ్యనుంచే వెళ్లాలి. కథానాయకుడు- ఓ పాదచారి రోడ్డు దాటే ప్రయత్నాన్ని గమనిస్తూంటాడు. తన కారుని ముందుకెళ్లనివ్వకుండా దాటే ప్రయత్నం చేసిన పాదచారిని ఢీకొడతాడు. దెబ్బతగిలినా పట్టించుకోకుండా- ‘అయ్యా ఈ కవర్లో ఉన్న అన్నం మా ఇంట్లో ఇవ్వండి నేను కారు కింద పడ్డట్టు చెప్పద్దు’ అన్న పాదచారి అభ్యర్థన చదువరుల హృదయాలను ద్రవింపచేస్తుంది. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదనుకున్న పద్మారావు, సుధ తమ పెళ్లికి ముందు ప్రేమించినవారి గురించి వివరాలు చెప్పుకుంటారు. పద్మారావులో అనుమాన బీజం పడి మహావృక్షమవుతుంది. మాజీ ప్రియుడింటికి వెళ్ళిందన్న సంగతి తెలుసుకున్న పద్మారావు, సుధ శీలాన్ని శంకిస్తాడు. వెళ్లిన కారణం తెలిసిన తర్వాత పద్మారావు ‘ఎంత నీచంగా ఆలోచించాను’ అనుకోడానికి దారితీసిన పరిస్థితి ఇతివృత్తంగా రాయబడిన కథ ‘కలికి కడలి.’ మిగతా కథలుకూడా నిజజీవితంలో జరిగినట్టుగా అనిపిస్తాయి. మారిపోతున్న మానవ సంబంధాలని నిశితంగా గమనించిన రచయిత, ఏకపక్షంగాకాక విశాల దృక్పథంతో రాసిన కథలు పాఠకాదరణకు పాత్రమవుతాయనడానికి సందేహించనక్కరలేదు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవన సంఘర్షణకు ప్రతీకలు.. ‘రంజని కథలు’

జీవన సంఘర్షణకు ప్రతీకలు.. ‘రంజని కథలు’

  • -మానాపురం రాజా చంద్రశేఖర్
  • 10/01/2015
TAGS:

బహుమతి కథ-2
వెల: రూ.120/-
చీఫ్ ఎడిటర్: చీకోలు సుందరయ్య
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్,
హైదరాబాద్ మరియు అన్ని బ్రాంచీలు
నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్
ప్రజాశక్తి బుక్‌హౌస్, హైదరాబాద్
తెలుగు బుక్‌హౌస్,హైదరాబాద్-27

కథలు వర్తమాన సమాజానికి దర్పణం పడతాయి. వీటిలో వ్యక్తమయ్యే పలు రకాల కోణాలు సహజత్వానికి దగ్గరగా నిలుస్తాయి. అలా ఊపిరి పోసుకున్నవే సంఘర్షణాత్మక జీవితాలకు ప్రతీకగా రూపుకడతాయి. ఇలాంటి ఇతివృత్తాలకు జీవం పోసిన కథల సంకలనమే ‘బహుమతి కథ-2’. ఇందులో 17 కథలుదాకా ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటీ ఒక్కొక్క సందర్భాన్ని విడమర్చి విశే్లషించి చెబుతాయి. ఇవన్నీ 2013 సంవత్సరంలో రంజని బహుమతిని పొందినవే. కథావస్తువు ఎంపిక దగ్గర్నుండి శైలిలో శిల్పంలో సరళత్వంలో ఒకదానితో మరొకటి పోటీపడినట్టు కనిపిస్తాయి. వీటి ప్రత్యేకత కారణంగా విలక్షణంగా వైవిధ్యపూరితంగా రాసిన చెయ్యి తిరిగిన తనం తారసపడుతుంది. ఇందులో రాసికంటే వాసికే అధిక ప్రాధాన్యమివ్వడం రూపుకడుతుంది. ఈ నేపథ్య మూలాలను అక్షరాలతో తడిమి, మనసు కళ్ళతో ఒడిసిపట్టుకోవాలంటే లోతైన దృష్టితో అధ్యయనం చెయ్యాలి.
టీవీ ఛానెల్స్‌లో ప్రసారమవుతున్న పాటల పోటీలలో ఓడిపోయిన సెలబ్రెటీల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజెప్పేదే ఈ ‘ఎగిరిపోతే… ఎంత బాగుంటుందీ’ కథ. పిల్లల పట్ల వ్యాపారదృష్టి కలిగిన తల్లిదండ్రులు అవినాశ్ లాంటివాళ్ళను ఎలా బలిపశువులను చేసి ఆడిస్తున్నారో.. ఎంత చిత్రవధకు గురిచేస్తున్నారో వివరిస్తుంది. చాలా ఆర్ద్రపూరితంగా సాగి మనసుని హత్తుకుంటుంది. మనుషులను ఆలోచింపజేస్తుంది. దీని రచయిత రామదుర్గం మధుసూదనరావు. ‘మార్జినోళ్ళు’ కథలో పి.శ్రీనివాస్‌గౌడ్‌ది ఒక ప్రత్యేకమైన నిర్మాణశైలి కనిపిస్తుంది. చిరకాలంగా రైల్వే మార్జినులో పాకలేసుకుని బతుకుతున్న మార్జినోళ్ళకి నాయకుడు లాంటి కోటేశంటే గొప్ప భరోసా. ప్రభుత్వ భూమిని ఖాళీచేసి వెళ్ళాల్సిందిగా నోటీసులు పంపితే, స్వామినాయుడి ప్రైవేటు స్థలంలో తిరిగి అంతా పాకలు వేసుకుంటారు. ఇంతలో గూండాల దాడి జరిగి.. విషయం పత్రికలకీ మీడియాకీ చేరిపోతుంది. ఈ వాస్తవాన్ని ముందే పసిగట్టిన కోటేశు ముందుచూపుకి, వ్యవహార శైలికి నిలువెత్తు దర్పణం ఈ కథ. ఇది తిరుగుబాటుతనంలోని భిన్నత్వంలోని ఏకత్వం ఆవశ్యకతను నొక్కిచెబుతుంది.
ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణచేసిన వ్యక్తి- కొడుకూ కోడలు దగ్గరికెళ్లి కాలం వెళ్ళదీసినా.. సొంత వూరు, ఇంటిపై వున్న మమకారం తిరిగి అతణ్ణి వెనక్కి తెస్తుంది. పార్కులో పరిచయమైన కుర్రాడితో స్నేహంలోపడి, వాళ్ళమ్మ చనిపోగానే తనింట్లోకి తెచ్చిపెట్టుకొని.. విద్యాబుద్ధులు నేర్పించి.. చాలామందికి విద్యాదానం చేసిన ఓ వ్యక్తి కథ ‘తోడొకరుండిన’. రంగనాథ రామచంద్రరావు రాసిన ఈ కథ- మనసుని కదిలించి, మనిషిలోని కర్తవ్య బాధ్యతను తట్టి లేపుతుంది. ‘జ్ఞాపకం’ కథలో రాచమళ్ల ఉపేందర్ కథనం చివర్లో మెలికతో మలుపుతిప్పిస్తుంది. క్రైం విభాగంలో ఇనె్వస్ట్‌గేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శివుడుకి బాల్యమిత్రుడు పరమేశం ఫోన్‌చేసి, తన అవసరంకోసం రమ్మనమని ప్రాధేయపడతాడు. సొంత ఊరిలోకి అడుగుపెడుతూనే.. మిత్రుడు కుటుంబాన్ని పరామర్శించి, కష్టనష్టాలు తెలుసుకుంటాడు. అమ్మకంకోసం వచ్చిన ఇంటిలో- గతంలో గొడవపడి వెళ్ళిపోయిన తండ్రి.. ఓ వింత నల్లటాకారంలో వచ్చి, బెదరగొట్టి, బేరాన్ని చెడగొడతాడు. శివుడి ద్వారా జ్ఞానోదయం పొంది, అతనికిచ్చిన సొమ్ముతో వ్యాపారంచేసి, కొడుకు పెళ్ళికి పిలవడానికి రావడంతో కథ ముగుస్తుంది. స్నేహ పరిమళం ఇందులో తొంగిచూస్తుంది.
‘నీకూ నాకూ ఒక వేకప్ కాల్’ కథలో వయసుమళ్ళిన ఓ కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి ‘మానవతా ప్రవాహ’ అనే స్వచ్ఛంద సేవాదళ సంస్థవాళ్లు స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్‌లో పాల్గొంటాడు. ఆ సందర్భంలో ‘సుగంధి ఆస్పత్రి’లో తారసపడిన దృశ్యానికి చలించిపోయి.. ఓ ముగ్గురు మిత్రుల సహకారంతో ఓ రాత్రి కాపువేస్తాడు. తుపాకీతో బెదిరించి అక్కడ జరుగుతున్న దురాగతాన్ని ప్రజోపయోగ వ్యాజ్యంలో ఎదుర్కొంటాడు. కోర్టు కేసుల ఆధారంతో ఆర్థికశాఖ ద్వారా గ్రాంట్లు మంజూరుచేయించి, అనాధ వృద్ధుల తరపున సాధించిన విజయం ఈ కథకు స్ఫూర్తి. దీనిని చూసి వేరేచోట వున్న, కుమారులు అడిగిన ప్రశ్నలకు తగిన రీతిలో జవాబిచ్చి, కథను చాలా అర్థవంతంగా ముగిస్తారు రచయిత పాండ్రంకి సుబ్రమణి. అవసరానుగుణంగా వ్యవహరించే మనుషుల తీరూ.. దూరమైపోతున్న మానవ సంబంధాల విలువలకు అద్దంపట్టే కథ ‘మెమరీ కార్డు’. దీనిని రచయిత్రి అల్లూరి గౌరీలక్ష్మి చాలా హృద్యంగా చిత్రించారు. ‘్ధనమూలమిదం జగత్’ కథలో మూర్తి ఒక రచయిత. అతని రచనలంటే గిట్టని భార్య- ‘ఇంటర్‌నెట్ క్యాష్ ఇన్‌కమ్’ వివరాలతోకూడిన వెబ్ పత్రికను చూపించి అతన్ని ప్రోత్సహిస్తుంది. అలా మొదలైన అనేకరకాల కంపెనీల ప్రకటనలు ఇతరుల ఈ-మెయిల్‌కి పంపిస్తూ.. డాలర్ల చెక్కుల్ని, అందుకుని, భార్య పిల్లల మెప్పును పొందుతాడు. పది లక్షలదాకా సంపాదిస్తాడు. ఒక రచయిత తన ఇష్టాయిష్టాల్ని, రచనలోని సృజనాత్మకతని ఎలా చంపుకొని బలవంతంమీద ధన సంపాదనాపరుడిగా మారిపోతాడో రచయిత కె.బి.కృష్ణ ఈ కథలో విడమర్చి చెబుతాడు.
ఒక చిన్న సినిమా తియ్యగల ఇతివృత్తాన్ని ‘సారా’జ్యం కథలో రచయిత రామదుర్గం మధుసూదనరావు జొప్పించారు. ఊర్లో సారాబట్టీలు తయారుచెయ్యడం మొదలుకొని… దాన్ని తిరిగి ఒళ్లుగుల్ల చేసుకునే సంజన్న లాంటోళ్ళు… ఈరేసప్పలాంటి వ్యాపారికి పోలీసు- వైద్యుల లంచగొండితనాన్ని ఎరగావేసి, లాకప్ డెత్‌లో చనిపోయిన సంజన్న చావుని సారాచావుగా మలచడంతో.. అతని పెళ్ళాం పిల్లలు ఏకాకులుగా మిగిలిపోతారు. దీనితోపాటు గవర్నమెంట్ ఆస్పత్రి అవినీతిని, టీవీ రిపోర్టర్ల సహజప్రవృత్తిని ఎండగడుతూ చక్కని కథగా మలిచారు రచయిత. ఇలాంటిదే- డా.ఎం.సుగుణరావు రాసిన ‘అంతరంగం అట్టడుగున’ కథ ఓ ముగ్గురు వ్యక్తుల కథ. సతీష్ ఓ కార్డియాలజిస్ట్. తన తండ్రి చావుకి కారకుడైన తాడిపర్తి జమీందారు చెంగల్రాయుడుని పథకం ప్రకారం చంపాలనుకుని.. అనుకోని పరిస్థితుల్లో అతను గుండెనొప్పితో మెలికలు తిరిగిపోతుంటే- తానే స్వయంగా ట్రీట్‌మెంట్‌చేసి, టాబ్లెట్లిచ్చి రక్షిస్తాడు. మధ్యలో ఓ సర్దారు కూతురికి హార్ట్‌హోల్ ప్రాబ్లెం. దాని ఆపరేషన్‌కోసం వాళ్ళ ప్రయాణం. చివర్లో తాతకి మంచిని బోధించి వదిలేస్తాడు సతీష్. ఇదీ స్థూలంగా కథ. చాలా సున్నితంగా అర్థవంతంగా సాగిపోతూ మానవతా దృక్పథంతో సందేశాత్మకంగా మిగిలిపోతుంది. సంపాదన మత్తులో పడిపోయి విద్యాధికుడైనప్పటికీ… ఒక్కగానొక్క కూతురు వౌనికను నిర్లక్ష్యం కారణంగా పోగొట్టుకున్న వైనం మంత్రవాది మహేశ్వర్ కథ ‘వౌనాక్షరాలు’లో కనిపిస్తుంది. వౌనికతో అనేక కారణాల సాకుతో గడిపినట్టు గడిపి- ఇతరులు జరిపే పైశాచిక చేష్టలు ఈ కథలో రూపుకడతాయి. చివరికి తనపై జరుగుతున్న ఈ ఆగడాలను తల్లికి చెప్పుకున్నా, పెద్దగా ప్రయోజనం కనిపించలేదు వౌనికకి. అందుకే భాస్కర్రావు అనే పెద్దమనిషి తనను శారీరకంగా మానభంగం చెయ్యడంతో ఆత్మహత్య చేసుకుంటుంది. రవీంద్ర- ప్రమీలల ఏకైక కూతురు వౌనిక. చివరికి ఆమె పేరున పిల్లల సంక్షేమంకోసం సేవలందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ఈ కథ ముగుస్తుంది. పిల్లల జీవితాలపై తగిన శ్రద్ధతీసుకోకపోతే దాని పర్యవసాన పరిస్థితులు దీనిలో మన కళ్ళకి కట్టిస్తారు.
ఇలా మంచి శిల్పనిర్మాణాన్ని ప్రదర్శించిన ఈ కథలన్నీ జీవితపు లోతులను అనే్వషిస్తూ వాటికి పరిష్కారమార్గాలను కనుక్కునే ప్రయత్నం చేస్తాయి. ఆధునిక సమాజానికి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. వీటిలో చాలా పాత్రలు నిత్యం మన కళ్ళముందు తిరుగాడుతున్నవే. అందుకే వీటిలో ఆ బలమూ, ఆర్ద్రత, ఆవేశమూ శక్తియుక్తులుగా ప్రదర్శితమవుతాయి. ఇవి చిరకాలం నిలబడాల్సిన కథలు. భవిష్యత్తును నిలదీసే కథలు. చాలా మంచి ప్రయత్నంచేసి వడబోసిన కథలు కాబట్టే అందరికీ ఆదర్శప్రాయంగా మిగిలాయి. ఈ కృషి వెనుక రంజని చూపించిన ఆసక్తిని, అభిమానాన్ని, మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవచైతన్య దీప్తి సంక్రాంతి

నవచైతన్య దీప్తి సంక్రాంతి

  • 11/01/2015
  •  -సుధామ

కేవలం- మతంతో ముడిపడి కాకుండా ప్రకృతితో, పర్యావరణంతో ముడివడి సకల మానవాళీ సమాదరించదగిన అసలు సిసలు పండుగ సంక్రాంతి. సంక్రాంతికి ‘పెద్ద పండుగ’ అని వ్యవహారం. భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజులకు విస్తరించిన పర్వం కావడంవల్లనే ఇంత పెద్ద పండుగ మరొకటి లేదు అంటారు. నిత్యం కనబడే కర్మసాక్షి సూర్యుడు. సూర్యుడు అటు ఆధ్యాత్మికంగానూ, ఇటు వైజ్ఞానికంగానూ సకల చరాచర ప్రపంచంలో అస్తిత్వం కలిగి, గ్రహగతులకు, కాలచక్ర పరిభ్రమణకు మూలాధారమై నిత్య నూతన ప్రకృతిగా ఉదయాస్తమయాలతో ఉనికి, మనికి గలవాడు. ఖండఖండాంతరాలలో కూడా రీతులూ, రివాజులూ వేర్వేరయినా జన హృదయాలను దోచుకున్న ఆనందహేల సంక్రాంతి. రవి దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పథ ప్రవేశం చేసే శుభ ముహూర్తం మకర సంక్రమణం. నవ జీవన సమ్యక్ క్రాంతి సంకేతంగా ‘సంక్రాంతి’ అంటున్నాం. ప్రాచీన కాలంలోనే ఖగోళ విజ్ఞానాన్ని మన భారతీయం అనితర సాధ్యంగా అందిపుచ్చుకుంది. గ్రహగతులు, గ్రహణాలు ఆయన క్రమం, ఋతువుల విశే్లషణం ప్రకృతిని అవలోఢనం చేసి అభివ్యక్తీకరించింది భారతీయులే. నిజానికి ఏడాదిలోని పనె్నండు నెలల్లోనూ సంక్రమణాలుంటాయి. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రమణంగా పేర్కొంటాం. కర్కాటక రాశి ప్రవేశ సంక్రమణం దక్షిణాయనం కాగా మకర సంక్రమణం ఉత్తరాయణం. మకర రేఖ నుండి ఉత్తర దిశగా సూర్యుడు పయనించే పుణ్యకాలమే ఉత్తరాయణంగా, మకర సంక్రమణంగా, సంక్రాంతిగా సంభావించడం జరుగుతోంది. ఇదంతా ప్రకృతి పరిణామ మూలమే. తమో గుణ ప్రధానమైన మనిషి మనస్సును ఉజ్జ్వల భావ అంతర్లోకాల వైపు దృష్టిపెట్టమని వైజ్ఞానిక ఆధ్యాత్మిక సందేశం ఇచ్చే అసలు సిసలు ప్రకృతి పండుగ సంక్రాంతి. ఉత్తరాయణ మార్గం జ్యోతిర్మయం అనీ, దక్షిణాయణ మార్గం తమోమయం అనీ భగవద్గీత పేర్కొంటోంది. ఉత్తరాయణా గమనం అంటే సంకల్ప వికల్పాలు లేని అమనస్క యోగ సిద్ధి. అదే ఉత్తమగతి అని యోగశాస్త్ర నిర్వచనం. అమనస్క యోగ సిద్ధి పొందిన ఆత్మ ఉత్తరాపథంలో పయనించి, ‘స్వాదిష్ఠాన’మనే వైతరణి నదిని దాటి, ‘పింగళనాడి’ అనే మార్గంలో ముందుకు సాగి, ‘సోహం’ అనే విమానం ఎక్కి, సూర్య ద్వారంగా చెప్పబడే ‘సుషుమ్న’లో లీనమై, అనంతత్వాన్ని పొందుతుంది. ‘ఉత్తరాయణం’ అనే దానికి ఇంత అర్థం ఉంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించాలని, పరమాత్మను చేరగోఱే జీవాత్మ ఆరాటపడుతుందిట! దివి భువి కలిసిన పవిత్ర ప్రాంతం ఉత్తర దిశలోనే ఉందంటారు పెద్దలు. అంపశయ్య మీద వున్న భీష్ముడు ఉత్తరాయణం కోసం నిరీక్షించి ప్రాణాలు వదిలింది అందుకేనట! సంక్రాంతి పెద్ద పండుగే కాక, పెద్దల పండుగ అనీ ఎందుకంటారంటే- ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతల ఆత్మలు సుషుమ్నా వికాసం కలిగి, విశ్వవ్యాప్తమైన ‘ఈథర్’ రూపంలో ఉంటాయని ఆర్య వాక్యం. ఆధ్యాత్మిక, వేదాంతపరమైన అంశాల కోణంలో కాక, వైజ్ఞానిక ఉపపత్తులతో చూడగోరే ఆధునికులైనా- ‘సంక్రాంతి’ వైశిష్ట్యాన్ని అంగీకరిస్తారు. ఉత్తరాయణమనే ఈ కాలంలో ఉత్తర దిక్కోణం నుండి ప్రభవించే సూర్య కిరణాలు ‘ఆల్ట్రా వయొలేట్ రేస్’ అనబడుతున్నాయి. ఈ కిరణాలకు సమస్త రోగనాశక శక్తి ఉంది. ‘ఉద్యాసద్యా మిత్రమః అహోరున్నుత్తరాం దినం హద్రోగం మమసూర్యాహరి మాణాంచ హరయ…’ అని సాగే వేద మంత్రం – ఉత్తర దిక్కోణం నుండి ఉదయిస్తున్న బాలభాస్కరుని కిరణాలు మా యొక్క బాహ్యాభంతర రోగాలను హరించుగాక, అన్న అర్థం వలనే! ఉత్తరాయణంలోనే బహిరాకాశంలో సూర్యుడితోబాటు, ‘అగస్త్యోదయం’ అనే నక్షత్ర సముదాయం వస్తుంది. ఈ నక్షత్ర కాంతిపుంజాలలోని రేడియో ధార్మిక శక్తితో, సూర్యశక్తి కలిసి, మన భూమి మీదున్న జల నిదులను, గాలినీ, నదీనదాలను నూతన జవసత్త్వాలతో నింపుతుంది. గత మాలిన్య రహితమై, నవ్య క్రాంతి పరిఢవిల్లుతుంది. ఈ భౌతిక ప్రక్రియ మన చర్మచక్షువులకు అందేది కాదు. కానీ ఆధునిక వైజ్ఞానిక ఉపకరణాలు ఈ మార్పును గుర్తిస్తున్నాయి. సంక్రాంతి అంటే ఇలా భౌతిక, ఆధ్యాత్మిక, యోగశాస్త్ర యుతమైన నవ్యతా పరిణామం. అందుకే చైత్రశుద్ధ పాడ్యమి కాక, సంక్రాంతియే నిజానికి కొత్త సంవత్సరంగా సంభావించదగిన విశిష్టమైన పండుగ. చలిని తరిమివేసి, రోగకారకాలైన క్రిమికీటకాల నాశనానికై వేసే మంటయే ‘్భగిమంట’. నిజానికి ఆవు పిడకలతో వేసే భోగిమంటయే ఆరోగ్యదాయకం. ఆవు పిడకలతో వేసే భోగిమంటతో వెలువడే పొగ, వేడి, ఆరోగ్య కారకాలని శాస్తజ్ఞ్రులు అంగీకరించిన విషయం. సంక్రాంతి పెద్ద పండుగ. దీని వేడుకలు అపారం. సంక్రమణం పర్వం పితృకార్యానికి శ్రేష్ఠం. కనుమరోజు గ్రామ దేవతలకు నివేదనలు చేస్తారు. పాడి పశువులతోబాటు ధాన్యలక్ష్మి పసిడి చిందులు వేస్తుంది. ఈ మూడు రోజులూ బొమ్మల కొలువులు పెట్టడం ఆచారం. సంక్రాంతి పర్వం ధాన్య లక్ష్మి పూజాపర్వం. ఎడ్ల పందాలు, కోడి పందాలు, ఆవుపేడతో కళ్లాపుజల్లి రంగవల్లులు అలంకరించడాలు, కేవలం సరదాతో కూడినవే కాదు, ఆచారం వెనుక వైజ్ఞానిక సూత్రం, పర్యావరణ పరిరక్షణం ఇమిడి వున్నాయి. ఇది భారతీయ దార్శనికుల విశిష్ఠత. సంక్రాంతి రోజుల శోభ వర్ణనాతీతం. జానపద కళారీతుల నిదర్శనాలుగా రంగవల్లులతో ముంగిల్లు, ధాన్యరాశి దరహాస చంద్రికలు, వైభవోపేత ఆలయాలు, గొబ్బిళ్లు, భోగిమంటలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, కొత్త అల్లుళ్ల సంబరాలు ఆబాలగోపాలం అష్టాదశ వర్ణాల వారూ జరుపుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి గురించి కథలకూ కొరతేమీ లేదు. అపార దాన గుణ పరాయణుడైన బలి చక్రవర్తి, వామనుడికి మూడడుగులు దానం చేసి, పాతాళవాసి అయ్యాడు. అయితే తన సామ్రాజ్య వైభవాన్ని తిలకించడానికి ఏడాదికి ఒకసారి భూలోక దర్శనానికి ఆ మహావిష్ణువు అనుమతినిచ్చాడు. మహాదాత అయిన తమ చక్రవర్తి రాక సందర్భంగా ఏటేటా భూలోక పౌరులు రంగవల్లులతో, ధన ధాన్య, దాన కార్యాలతో చేసుకునే పండుగే సంక్రాంతి అంటారు. అలాగే మకర సంక్రాంతికి చేసే ‘పితృకల్పం’ మనిషికి పూర్వజన్మ స్మృతులతో ఉత్తమ పథగామిని చేయగలదని హరివంశంలో ప్రస్తావించబడింది. ముందే చెప్పినట్లు – ఈ పండుగ కొన్ని ప్రాంతాలకే పరిమితం అనుకోనక్కర్లేదు. పేర్లు, పద్ధతులు భిన్నమైనా, దేశదేశాల్లో మానవ నాగరికతలో వైవిధ్యభరితమై అలరారుతోంది ఈ ప్రకృతి పర్వం. ‘నామ్ ఫెస్టివల్’ అని ఈజిప్టులో ఈ సంక్రాంతి పండుగ ఉంది. నామ్ అంటే మకర రాశితో సాన్నిహిత్యంగల ఈజిప్టు వారి జల దేవత. ఈ సంక్రమణ సమయంలో నైలునది పొంగి, తమను సజీవులను చేస్తుందని వారి విశ్వాసం. జలదేవతారాధనం చేసిన నదికి ఫల పుష్పాలు సమర్పించి, వారు ఈ పండుగ సంబరాలు చేస్తారు. గ్రీకు దేశంలో మకర రాశి అనగా సగం చేప, సగం మేక ఆకారం వున్న జలదేవత. పైభాగం మేక, క్రింది భాగం చేప రూపున వుండే ఈ దేవత ఒక రాక్షసుని బారి నుండి రక్షించుకోవడానికి ఈ రూపం ధరించిందట. విచిత్ర రూపంగల ఈ జలదేవత ‘మకర రాశి’ అని గ్రీకుల విశ్వాసం. ఈ దేవతను వీరు ‘చౌకన్’ అంటారు. సంక్రమణ దినాన వారు ఈ దేవత ప్రీత్యర్థం ఉత్సవాలు, ఊరేగింపులు చేస్తారు. రోమ్‌లో ‘బేకన్’ పర్వంగా సంక్రాంతి చేస్తారు. సంతానార్థులు, అవివాహితులు మన్మధ పూజాపర్వంగా మన కాముని పున్నమ, వసంతోత్సవం రీతిలో కాలపురుషుడి ఆశీర్వాదంకై ఉత్సవం చేస్తారు. యూరప్‌లో మన భోగిమంట తరహాలో సంక్రాంతిని ‘అగ్ని ఉత్సవం’గా చేస్తారు. పెద్దపెద్ద మంటలు వేసి, అంతా నృత్యగానాలు చేస్తారు. మనం ఎలా పితృకార్య పర్వంగా సంభావిస్తామో, అలాగే స్వీడన్‌లో దీనిని అమర వీరుల సంస్మరణ దినంగా జరుపుతారు. ఖండఖండాంతరాలలోనూ మకర సంక్రమణ పండుగ – మనుష్యులు సర్వతోముఖాభివృద్ధి చెంది ఉత్తమ జీవన విలసితమైన ఉత్తరపథ మార్గులు కావాలనే సంకల్పంతోనే వివిధ రూపాలలో సంక్రాంతి పండుగ చేసుకుంటారు. ‘ఇది మా పండుగ కాదు’ అని మానవాళిలోని ఏ ఒక్కరూ అనుకోనవసరం లేని ప్రకృతి పర్వం సంక్రాంతి అని గ్రహించవలసిన విషయం. చపలచిత్తులైన మనుషుల్లో ధార్మిక ప్రవృత్తిని, దాన ధర్మాది సుగుణ సంపత్తిని, తమ పుట్టుకకు హేతువైన పితృ, మాతృగణం పట్ల కృతజ్ఞతాబద్ధతను పెంపొందింపచేయడానికి, సంక్రాంతి పర్వం సంకల్పించబడి నట్లుంటుంది. అలాగే పరిశ్రమోపజీవులైన మన పూర్వులు, తాము పండించుకున్న పంటలను, పెంపు చేసుకున్న పాడిని, సంతోషంతో పంచభూతాలకర్పించి, తామూ, తమపై ఆధారపడి జీవిస్తున్న వారూ, కలిసి చేసుకునే పర్వంగా రూపుదిద్దుకున్న పర్వం సంక్రాంతి. దక్షిణాయనపు జీవితపు క్లేశకాలం పరిసమాప్తి చెంది, దేవతలకు సైతం ప్రీతిపాత్రమైన ఉత్తరాయణ ఆగమనమైన సంక్రాంతి – నిజంగా సంతోషాల కాలం. పంటలు పండి, గాదుల నిండా ధాన్యం నిండి, ఆరోగ్యం ఐశ్వర్యం తాండవించే కాలం. ఉత్తరాయణంలో మార్గశిర మాసం మరీ శ్రేష్ఠమైనదిగా, మాసాలలో తాను మార్గశిర మాసాన్ని అని గీతాకారుడు చెప్పుకున్నాడు. ప్రకృతిలో విశేషమైన మార్పులు గోచరించే అభ్యుత్థాన కాలం ఇది. తొలకరిలో మొలకెత్తిన సజ్జ, జొన్న, నువ్వు, పెసర, కంది, సెనగ వంటి మెట్టపైర్లు, రాగి, వరి వంటి మాగాణి పంటలు, కార్తీక, మార్గశిర మాసాలకు పండి, భూమి పంట బరువుతో కళకళలాడుతూ, ఎటు చూసినా కాంతులీనుతూంటుంది. చేమంతి, బంతి నిండార పూలతో నేత్రపర్వంగా హేమంత కాంతులీనుతూంటాయి. జీవితం నవ్య భావోన్మీలనంగా ఉంటుంది. బ్రతుకంతా ఎలా వున్నా ‘మూడునాళ్ల ముచ్చట’ అన్న కారణం భోగి, సంక్రాంతి, కనుమల వైభోగ పర్వం వల్లనే. పంట రక్షణకై రాత్రిళ్లు కాపలాకాచి, వేసుకునే చలిమంటల జాగరూకత చిహ్నంగానే భోగిమంట వెలసిందని అనేవారున్నారు. రైతు బ్రతుకు ఆనంద రమణీయమయ్యే కాలం సంక్రాంతి. దేశానికి రైతు వెనె్నముక అయినట్లే. సకల పర్వాల ప్రకృతికి వెనె్నముక పండుగ, సంక్రాంతియే! ధనుర్మాసంలో ‘రంగడే దైవంగా – పొంగలే ప్రసాదం’గా స్వార్థం పరమార్థం రెండంచులుగా భాసిస్తాయి. కనుమ పండుగ పూర్తిగా కర్షక జీవిత సంబంధియే. పశు పూజ ప్రాధాన్యమానాడు. ‘పాల పొంగలి – పశువుల పొంగలి’ అనే నానుడి వచ్చింది అందుకే. పొంగలి ‘బలి’ చక్రవర్తి సంకేతంగా భావించేవారున్నారు. పొంగలిని దేవతలకు నైవేద్యం పెట్టాక, పొలానికి వెళ్లి పొంగలి మెతుకులు చల్లేవారు. ‘దీనినే ‘పొలి చల్లుట’ అనేవారు. అలా చేయడం వలన పంట పొల్లుపోక, గింజ రాలుబడి హెచ్చుతుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. ఎర్ర గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొట్టేవారు. అది బలిపశువు శిరస్సుకి ప్రత్యామ్నాయం! అలా జీవహింసకూ దూరంగా వున్నారు. పశువుల సంబరంలో భాగమే గంగిరెద్దుల హంగులు డూడూడూడూ బసవన్నా డూడూడూడూ వెంకన్నా అయ్యగారికీ దండం పెట్టూ అమ్మగారికీ దండం పెట్టూ అని గంగిరెద్దుల వారు సన్నాయి మేళాల సవ్వడిలో అడుగగా, గంగిరెద్దులు తల ఆడించడం, వాని మూలాన భావి శుభాలను తెలియచెప్పడం, పశుగణం పట్ల గౌరవ బుద్ధికి తార్కాణాలు మరి! ప్రకృతికి, జానపదులకూ విడదీయలేని సంబంధం. అందుకే ప్రకృతిపర్వమైన సంక్రాంతిరోజుల్లో, ముఖ్యంగా పల్లెసీమల్లో జీరేనుగాళ్లు, గంగిరెద్దుల వాళ్లు, మలిపోని కాసులోళ్లు, బేరటోపిగాళ్లు, జంగమ దేవరలు, బారెమూరెండోళ్లు, శీర్లాశిల్పులు, హరిదాసులు అసంఖ్యాకంగా కనపడేవారు. పండుగ మూడు రోజులూ పనీపాటలకు సెలవిచ్చి, ఆనందించడమే ప్రధానంగా సంబరాలతో గడిపేవారు. సంక్రాంతి రోజు మన్నానికి అంటే పొలానికీ, గోవులకాయనూ పోరట! మన్నానికీ పోను మన్ననీ రోజూ నా వనె్నల వీరన్న బావా సంక్రాంతి పండుగా సరసరా వచ్చేరా సల్లంగా నేనైతే సూడాలోయి సంక్రాంతి వేళల్లో వెనె్నల సెంద్రున్ని సక్కగా ముద్దిడుచు మక్కువతో నుంటాను ఓ నా వనె్నల వీరన్న బావా.. అన్న జానపద గీతం – పల్లె పడుచులు తమతమ భర్తలతో సరస సల్లాపాల్లో మునిగి, సంక్రాంతి రోజుల్లో కాలక్షేపం చేస్తారని చెప్పకనే చెబుతోంది. క్రొత్తగా పండిన రాగులను కోడిపుంజులకు తినిపించి, సంక్రాంతి కనుమ వేళకు కోడిపందేలు ఆడేవారు. నా కోడి భీమన్నరా ఓహో నా కోడి హనుమన్నరా నా కోడి నీ కోడి ఏకమై కలబడితె సాకెండ్ల సిన్నదే సంకలే ఎగరేసి మ్రుక్కుపై వ్రేలిడి సక్కగా సూచురా అన్న గీతం రాయల కాలం నాటి నుంచి ప్రసిద్ధి. రాయల కాలంలో దివిటీల పట్టే చాకలి పిల్లయే సాకెండ్ల సిన్నది. సంక్రాంతి రోజు విరూపాక్ష స్వామి దేవాలయంలో, ప్రాంగణంలోనూ, మండప స్తంభశాలలోనూ, మూడు రోజులపాటు, వేయి వత్తులతో, అఖండ దీపాలను ఆరిపోనీక వెలిగించే వాడుక వుండేదట. అందుకు ఆ సిన్నది మూలకందంగా నిలిచేదట. ఉయ్యాలవాడ నివాసి, ధర్మదాత అయిన బుడ్డా వెంగళరెడ్డి – సంక్రాంతినాడు పండి, అప్పుడే తన ఇంటికి చేరిన ధాన్యరాశిలో – సగానికి పైగా దానంగా పంచిపెట్టేవాడట. బ్రాహ్మణులందరికీ గోదానం చేసేవాడట. ఇప్పటికీ మహాదాతగా వెంగళరెడ్డిని తలచేవారున్నారు. జానపద గీతాలూ వున్నాయి. ఇలా సంక్రాంతి పర్వం ప్రకృతితో, జనపదాలతో భౌతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అంశాలతో పెనవేసుకున్న అసలు సిసలు పెద్ద పండుగ. ఒక విధంగా సంక్రాంతియే నవహర్షారంభం. నవ వత్సరారంభం! కీ.శే.బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గారన్నట్లు- చేరువైన సంక్రాంతి గూర్చిన తలంపు చాలుననె తోచు రమ్య దృశ్యములు వేలు హృదయమున పూలజల్లులై, ఇంద్రచాప శబల వర్ణమ్ములై, నవాశలను పెంచె! ఆశావహ అభ్యుదయ అభ్యుత్థాన మానవాళి సర్వం – సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!! * ………. ** …………….** ……………… నీరు చల్లిన ముంగిట్లో -ప న్నీరు చల్లిన వాకిట్లో దారి పొడుగునా ముగ్గుల్లు! ము త్యాలు పోసినా ముగ్గుల్లు నారుపోసిన ముంగిట్లో గ నే్నరు పూచిన వాకిట్లో జారు జడలా కనె్నల్లూ – ఒ య్యారి నడలా కనె్నల్లూ – ఒ య్యారి నడలా జారు జడలా కనె్నలుంచినా గొబ్బిళ్లూ -కృష్ణశాస్ర్తీ ‘వేయి పాదముల్ మకర ప్రవిష్టము లయి తడబడుట లేక చక్కగా నడువు పూష అవ్యయమ్మైన యుత్తరాయణము వెలయ నవ్య మార్తాండకేళీ సనాథమగుచు’ -నాయని సుబ్బారావు చెలి చూపులు చలిమంటలుగా చెలి నవ్వులు తొలి పంటలుగా అరుదెంచెను నవసంక్రాంతి విరబూసెను చిరు చేమంతి ఈ ధాన్యపు రాసుల మాటున ఈ వాగుల వరదల చాటున ఏదో ఒక నవ చైతన్యం ఎదలో చిలికించును హర్షం పులకించిన తొలి సంక్రాంతివి దిగి వచ్చిన తీయని శాంతివి ఈ చలిలో నీ కౌగిలిలో ఇమిడిపోయె లోకాలన్నీ పాత సంప్రదాయపు గోడలు పడద్రోసెద వెలుతురు కోసం తరుణత్వం మెచ్చకపోతే తిరుగబడెద దేవుని మీద నవచేతన కాలంబనగా అవతరించినావే నీవు రవికరముల రాగిల్లెడు నీ నవహృదయం నాదైపోనీ -దాశరథి జీవితంలో కళాభిజ్ఞత చేర్చి కూర్చిన పాటగా కాలం మార్పు సూచించే సూర్యదేవుని కొత్త బాటగా అందంగా హాయిగా ఆనందానికి స్థాయిగా సాగిపోతుంది సంక్రాంతి! -కుందుర్తి ఆంజనేయులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అందరికీ శుభం…శుభం

అందరికీ శుభం…శుభం
మకర సంక్రాంతి చాలా పెద్ద పండగ. మన పెద్దలు పండగలను చాలా గొప్పగా ఆచరిస్తారు. ఆ పండగలలో అంతరార్ధం ఉంది. అంతేగాని రకరకాల పిండివంటలు చేసుకుని తినడానికి కాదు. ‘పండుగ’ అనే శబ్దం కాలక్రమంగా పండగ అయింది. ‘పండా ఆత్మ విషయ బుద్ధిః’ అని శ్రీ శంకరులు చెప్పారు. ఆత్మ విషయమైన బుద్ధియే పండా. ‘గ’ అంటే పొందడం. అది దేనివలన పొందబడుతుందో అదే పండగ. ఆత్మ ఙ్ఞానాన్ని పొందడమే మన పండగల ముఖ్య లక్ష్యం.
ఇంకొక దృష్టితో చూస్తే సంక్రాంతి పండగ అనేది ప్రకృతిలో కలిగే మార్పును సూచించేది. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభదినం. సంక్రాంతి పర్వదినంనాడే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణంలో చనిపోయిన వారికి ఉత్తమ జన్మగాని, ఉత్తమ లోకాలుకానీ లభిస్తాయి అని పురాణం. భీష్మాచార్యులు అంపశయ్యపై ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ ఆ పుణ్యకాలంలోనే బ్రహ్మైక్యమైనట్లు మహాభారతం చెబుతుంది.
వేదాల్లో, పురాణాల్లో సూర్యుడిని భగవంతుడిగా ఆరాధించాలని చూపాయి. భారతీయులు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆర్ఘ్యం వదిలి సూర్యుడిని ఆరాధిస్తారు. సూర్యుడే లేకపోతే ఎవరికీ అన్నం, నీరు లేదు కదా? కాబట్టి సూర్యుడు సకల జీవులకు ప్రాణదాత. అందుకే సూర్యుడని సూర్యనారాయణుడని ఆరాధిస్తున్నాం. ‘భా’ అంటే ప్రకాశం లేక సూర్యుడు. ‘రతం’ అంటే క్రీడ. సూర్యపాసనలో క్రీడించే దేశం కాబట్టి మనది భారతదేశం. ఈ సూర్యోపాసనయే క్రమంగా ఆత్మోపాసనకు ఆత్మక్రీడకు దారితీస్తుంది.
దక్షిణాయనం కంటే ఉత్తరాయణం శ్రేష్టం. ఎందుకంటే దేవతలకు దక్షిణాయణం రాత్రి. ఉత్తరాయణం పగలు. సామాన్యంగా శుభకార్యాలను ఉత్తరాయణంలో ప్రారంభిస్తారు. దక్షిణాయణం దేవతలకు రాత్రి కాబట్టి వాళ్లు నిద్రపోతూ ఉంటారు. ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారు. కాబట్టి మనం చేసిన శుభ కర్మలు, యఙ్ఞయాగాదులు, వ్రతాలు, వివాహాలు, ఉపనయనాలను దేవతలు చూస్తారు. వారి అనుగ్రహం, ఆశీస్సుల వల్ల మన కార్యాలు సఫలమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఉత్తరాయణం శ్రేష్ఠకాలం. దీని ప్రారంభదినం కాబట్టి సంక్రాంతి పర్వదినాన్ని వైభవంగా జరుపుకుంటున్నాం. అంతేకాకుండా గీతలో (8- 25,24) దక్షిణాయన మార్గాన్ని భగవంతుడిలా ఉపదేశించాడు. ధూమోరాత్రిః తథాకృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్‌ఃతత్ర చాస్ద్రమసం జ్యోతిర్యోగీపాప్య నివర్తతేః. ధూమం, రాత్రి, కృష్ణపక్షం, ఆరునెలలు గల దక్షిణాయనం – ఈ మార్గంలో వెళ్లిన జీవుడు స్వర్గంలో పుణ్యఫలాన్ని అనుభవించి మరల జన్మ ఎత్తుతాడు. కానీ అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్యాసా ఉత్తరాయణమ్‌ః తత్రప్రయాతాగచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదోజనాః! అనగా అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం ఆరునెలలు గల ఉత్తరాయణం. ఇలాంటి అర్చిరాదిమార్గంలో బ్రహ్మలోకం చేరుకున్నవాడు బ్రహ్మమును పొందుతాడని భావం. ఈ ఉత్తరాయణ మార్గంలో పయనించినవాడు బ్రహ్మలోకంలో బ్రహ్మతో ఉపదిష్టుడై క్రమముకిని పొందగలడు. కాబట్టి ఈ మార్గమే శ్రేష్ఠం. భీష్ముడు లోకసంగ్రహబుద్ధితో ఉత్తరాయణం శ్రేష్ఠమైన మార్గమని చూపించడానికై ఉత్తరాయణం కోసం ఎదురుచూశాడు. కానీ ఙ్ఞాని ఎప్పుడైనా చనిపోవచ్చు. అతడు దేశకాలాతీతుడు కదా! ఇక్కడ ఉత్తరాయణం చనిపోయిన తర్వాత జీవులు వెళ్లే ఇతర మార్గాలకు ఉపలక్షణంగా ఉంది. జీవులు శరీరం వదిలాక వారు పాపాత్ములైతే అధోమార్గంలో – పాయువు, ఉపస్థలం ద్వారా ప్రాణం వదిలి అథోలోకాలను, నీచ జన్మలను పొందుతున్నారు. పుణ్యకర్మలు చేసినవారు అర్చిరాది మార్గం ద్వారా బ్రహ్మలోకానికి (వైకుంఠానికి, కైలాసానికి) వెళ్లి అక్కడ బ్రహ్మతో ఉపదేశం పొంది క్రమముక్తిని పొందుతారు. ఇక బ్రహ్మైకమార్గంలో అంటే నేతినేతిమార్గంలో (ఇది ఒక మార్గం కాదు, విచార విధానం మాత్రమే) పయనించినవారు ఇక్కడే, ఇప్పుడే స్వరూపంలో ఉండిపోతారు. వీరే జీవన్ముక్తులు. ఉత్తరాయణం అంటే ఉన్నతోన్నతంగా (సాధనమార్గంలో సాగిపోయి) స్వరూపనిష్ఠ పొందటం. ఇదే సంక్రాంతి. క్రాంతి అంటే మార్పు. సం అంటే సమ్యక్‌ అంటే గొప్ప క్రాంతియే సంక్రాంతి. మన పాపాలు, ఈర్ష్య, అసూయ, అవిద్య, వివిధ వికల్పాలు, జన్మజన్మాంతరాల నుంచి మన హృదయంలో తిష్ఠ వేసినాయి. కర్మ, ఉపాసన, ఆత్మవిచారం అనే సాధనాలను అనుష్టించి వాటిని తరిమి మహాక్రాంతిని కలుగజేసి మన జీవితంలో మహాశాంతిని నెలకొల్పడం మన విధి. ఇదే సంక్రాంతి. పండుగ మొదటిరోజు భోగి. తెల్లవారుఝామున భోగిమంటలు వేస్తారు. ఈర్ష్య, ద్వేషం, వికల్పాలు మొదలైనవాటిని ఙ్ఞానాఙ్ఞిలో దగ్ధం చేయటం ముముక్షువు కర్తవ్యం. ఙ్ఞానాఙ్ఞి సర్వకర్మాణి భస్మసాత్కురుతేర్జున అని కదా గీత. రెండో దినం సంక్రాంతి. ఆనాడు త్రివేణీసంగమంలో స్నానం చేయడం విధి. గీతయే గంగ. ఉపనిషత్తే సరస్వతి. బ్రహ్మసూత్రాలే యమున. ఈ ప్రస్థాతత్రయ బోధవాహినిలో స్నానం చేయటమే త్రివేణిసంగమస్నానం. ఆడపిల్లలు ఆనాడు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ముగ్గుల మధ్య అందంగా అమరుస్తారు. గంగిరెద్దుల మేళతాళాలు, గుమ్మడి, నువ్వులు, సజ్జల దానం, పిండివంటలు బెల్లం, నువ్వులు కలిపిన చిమ్మిలిని బంధుమిత్రులకు పంచుతారు. నాల్గోరోజు ముక్కనుమ. ఆరోజు సీ్త్రలు బంకమట్టితో గౌరీదేవి విగ్రహం చేసి పూజించి, ఊరేగించి, నదిలో కలపటం – ఇదంతా మూర్తి పూజ, దానం, గోపూజ, భగవర్తణం, వ్రతం మొదలైన ప్రవృత్తిధర్మాన్ని తెలుపుతుంది. సంక్రాంతినాడు వేలమంది భక్తులు శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లెక్కి అయ్యప్పస్వామిని దర్శించుకుని వెనుదిరిగి వచ్చేవేళ వెనక్కితిరిగి చూడకుండా కిందికి దిగివస్తారు. తర్వాత సాయంత్రం ఆకాశంలో కనిపించే జ్యోతిని చూస్తారు. శరీరం ఒకటి, ఙ్ఞానేంద్రియాలు ఐదు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ప్రాణం, దేశం, కాలం – ఈ పదునెనిమిది తత్వాలే సోపానాలు. వీటిని అవస్థలో వినుదిరగకుండా అంటే నేరుగా నిలవటమే పదునెనిమిది మెట్లు దాటి పోవటంలో జ్యోతిని దర్శించుకోవడంలోగల ఆంతర్యం. ఇదే సంక్రాంతిలోని నివృత్తిధర్మ రహస్యం!
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంక్రాంతి జ్ఞాపకాల్లో -ఆంధ్రజ్యోతి

సంక్రాంతి… ఓ జ్ఞాపకం

జ్ఞాపకాల్లో జీవించేవారికి జరామరణాలు ఉండవు.
దీపావళికి చలి దివ్వెల దగ్గరకు వస్తుంది. సంక్రాంతికి చంకల్లోకి వస్తుంది. శివరాత్రికి శివశివా అని పోతుందనేది అమ్మ. ఆ మాట నిజం. సంక్రాంతి రోజులు కావడంతో చలి బాగా ఉంది. చేతుల్ని గుండెల చుట్టూబిగించుకుని నడుస్తున్నాడతను. స్వెట్టర్‌ వేసుకున్నాడు. మఫ్లర్‌ చుట్టుకున్నాడు. అయినా చలి వణికించేస్తోంది. సిగరెట్‌ తాగితే బాగుణ్ణనిపించింది. రాత్రి పన్నెండు దాటింది, సిగరెట్లు ఇప్పుడెక్కడ దొరుకుతాయి? సినిమా థియెటర్ల దగ్గర దొరుకుతాయి. అటుగా నడిచాడతను. తెల్లారితే బోగి. త్వరగా మంటలు వేస్తే బాగుణ్ణు. వెచ్చగా కాచుకోవచ్చనిపించింది. 
‘‘అత్తారింటికా? అలా పరిగెడుతున్నావు?’’

‘‘అవును గురూ! అదృష్టం బాగుంది, పాసింజర్‌ లేటట! వస్తాను.’’ ఎవరో ఎవరినో అడిగితే, ఆ ఎవరో ఎవరికో సమాధానం చెప్పి, పరుగుదీస్తున్నాడు. పరిగెడుతున్న ఆ వ్యక్తిని చూసి, అతనికీ పరిగెత్తాలనిపించింది. పరుగుదీశాడు. కొద్దిదూరం పరిగెత్తాడో లేదో అలసిపోయాడు. ఆగిపోయాడు. గబగబా శ్వాసించసాగాడు. ఒళ్ళంతా వేడెక్కినట్టనిపించింది. తల మీది మఫ్లర్‌ను తొలగించాడు. తేరుకున్నాడు కాస్సేపటికి. అప్పుడు అనుకున్నాడు.
అనుమానం లేదు! తను ముసలివాడే! 
గత నెల డిసెంబర్‌ పద్నాలుగు వరకూ ముసలితనం, ముసలివాడు అన్న మాటల్ని పెద్దగా పట్టించుకోలేదతను. వాటి ఊసేలేదు. డిసెంబర్‌ పద్నాలుగు, ఆఫీసులో పని చేసుకుంటున్నాడు. హెచ్‌.ఆర్‌. దగ్గర నుంచి ఓ లెటర్‌ వచ్చింది. తెరిచి చూశాడు. నేటితో మీకు అరవై ఏళ్ళు నిండుకున్నాయి. మీరు రిటైరయ్యారంటూ…ఏదేదో ఉంది అందులో. దిగ్ర్భాంతి చెందాడు. లెటర్ని మడచి జేబులో పెట్టుకున్నాడు. బాత్‌రూంలోకి పరుగుదీశాడు. అక్కడ అద్దంలో తన ముఖాన్ని ఆత్రంగా చూసుకున్నాడు. ఈ ముఖానికి అప్పుడే అరవై ఏళ్ళా అనుకున్నాడు. ముఖాన్ని ప్రేమగా నిమురుకున్నాడు. చేతికి ఎలాంటి ముడతలూ తగల్లేదుగాని, ఎందుకో బాధనిపించింది. సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు.
‘‘ఇవాళ్టికి సరిగ్గా నెలరోజులుంది సంక్రాంతి.’’ వినవచ్చింది. కిటికీ దగ్గరగా నిలబడి ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
కాలం కరిగిపోతోంది. అప్పుడే తనకి అరవై ఏళ్ళు. మిగిలేది కొద్దికాలమే! ఈ కాలాన్ని సద్వియోగం చేసుకోవాలి. అంటే… జ్ఞాపకాలని ఒడిసి పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. రేపు అవే తనని రక్షిస్తాయి అనుకున్నాడతను. పరుగుదీశాడు. అయిదువందల కిలోమీటర్ల దూరంలో గల పుట్టి పెరిగిన ఊరికి చేరుకున్నాడు. అక్కడ అమ్మలేదు, నాన్నలేడు, ఎప్పుడో పోయారు. అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళు కూడా లేరు. చెదరిపోయారంతా. మరి ఎవరికోసం, ఎందుకోసం అంటే గుప్పెడు జ్ఞాపకాలకోసం, పట్టెడు అనుభూతులకోసం పరిగెత్తుకుని వచ్చాడు. చిన్న హోటల్లో దిగాడు. దిగి, ఇదిగో ఇలా రోడ్డున పడ్డాడు.
థియెటర్ల దగ్గరకు చేరుకున్నాడతను. పాన్‌షాప్‌లో సిగరెట్‌ అడిగి తీసుకున్నాడు. ముట్టించేందుకు ప్రయత్నిస్తుంటే…
‘‘బోగిమంట అప్పుడే ఏసీశారేట్రా? ఒంటి గంట కూడా కాలేదు.’’
‘‘చలి బాబాయ్‌! తట్టుకోలేకపోతున్నాం.’’

అంతెత్తున లేస్తూ ఎర్రగా కనిపించింది మంట. పాన్‌షాప్‌కి వెనుకగా వేశారు. అతనటుగా నడిచాడు. కాచుకుని వెచ్చనయ్యాడు. సిగరెట్‌ ముట్టించాడు. గుండెనిండుగా పొగపీల్చి, వదిలాడు. ముక్కులోంచి వచ్చింది పొగ. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దగ్గు వచ్చింది. గట్టిగా దగ్గాడు. కళ్ళంట నీళ్ళొచ్చాయి. ఆ నీళ్ళలో సుభద్ర అస్పష్టంగా కనిపించింది. గుర్తు వచ్చిందామె.
ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు తను. దొంగతనంగా సిగరెట్లు కాల్చడం అలవాటైంది. అలాగే సుభద్రను చాటుగా ముద్దు అడగడం కూడా అలవాటు చేసుకున్నాడు. సుభద్ర తన క్లాస్‌మేటే! ఇద్దరూ ‘ప్రేమించుకుంటున్నాం’ అనుకుంటున్న రోజులవి. ప్రేమంటే ముద్దులూ, కౌగిలింతలనుకున్నారు. బోగిరోజు ముద్దు కావాలన్నాడతను. లంగా ఓణీకొత్తబట్టల్లో కావాలన్నాడు. ముందు ఒప్పుకోలేదు, బత్రిమలాడగా…ఆడగా సరేనంది సుభద్ర. సెలవులు కదా, కాలేజీ వెనుకనున్న గుబురుల్లో కలుసుకుందామంది. కలుసుకున్నారిద్దరూ. ముద్దు పెట్టుకోడానికి ముందు ధైర్యం కోసం సిగరెట్‌ తాగాడు. ఆతృత. తెలియని ఒత్తిడి. పొగ గుండెల్ని ఎగదన్నింది. ముక్కులోంచి బయటికి వచ్చింది. ఒకటే దగ్గు. కళ్ళంట గిర్రున నీళ్ళు తిరిగాయి. పెద్దగా దగ్గాడు.
‘‘ఎవరక్కడ? ఎవరదీ?’’ కేకేసుకుంటూ, చేత్రికర్రను నేలకు కొడుతూ వాచ్‌మాన్‌ పరిగెత్తుకొస్తోంటే, భయంతో గోడదూకి పారిపోయింది సుభద్ర. అలా పారిపోయిన సుభద్ర ఏదీ? ఎక్కడ? ఎవరికి తెలుసు?
తెల్లారిపోయింది. హోటల్‌కి చేరుకున్నాడతను. తలంటుపోసుకున్నాడు. కొత్తబట్టలు వేసుకున్నాడు. టిఫిన్‌ చేసి, ఊరికి అటు వెళ్దామా? ఇటు వెళ్దామా? అని ఆలోచనలో పడ్డాడు. అటు వెళ్తే కోడిపందాలు ఆడవచ్చు. ఇటు అయితే లాటరీ, పేకాటలూ ఆడుకోవచ్చు. కోడిపందాలు తర్వాత, ముందు పేకాడుదాం అనుకున్నాడతను. ఇటుగా నడిచాడు. కొబ్బరితోటలో గుంపులు గుంపులుగా పేకాడుతున్నారంతా. పిల్లలు లాటరీలు ఆడుతున్నారు.
‘‘పెద్దబజార్‌! చిన్నబజార్‌! లక్కీసెవెన్‌’’ అరుస్తున్నారు. 
అతను లక్కీ సెవెన్‌ మీద వందరూపాయలు కట్టాడు. ఓడిపోయాడు. నవ్వుకుని ఆనందించాడు. ఓడిపోవడం ఇంత ఆనందంగా ఉంటుందని ఇప్పుడిప్పుడే తెలుస్తోందతనికి. ఆ ఆనందం కోసం అతను వెయ్యి రూపాయలు వరకూ ఓడిపోయి వెను తిరిగాడు. రాత్రి నిద్రలేదేమో! నిద్ర ముంచుకొచ్చింది. భోజనం చేసి పడుకున్నాడు. లేచేసరికి సాయంత్రం అయింది. ఫస్ట్‌షో సినిమా వేళయిందంటే థియెటర్‌కి పరిగెత్తాడు. పెద్దహీరో సినిమా. దిగువ తరగతి టిక్కెట్లకోసం కొట్టుకుంటున్నారక్కడ. బాల్కనీ టిక్కెట్ల కౌంటర్‌ దగ్గర పెద్దగా జనం లేరు. అయినా అక్కడ టిక్కెట్టు తీసుకోవడం అతనికి ఇష్టం లేదు. దిగువతరగతి టిక్కెట్టే కావాలి. చూస్తే అభిమానులతోనే, అభిమానుల మధ్యనే సినిమా చూడాలి. ఆ థ్రిల్లే వేరు. వయసు మరచి కౌంటర్‌లోకి దూసుకుపోయాడు. ముందు వెనుకలయ్యాడు. కిందు మీదులయ్యాడు. గింజులాడాడు. ఆఖరికి టిక్కెట్టు సాధించాడు. చేతిలోని టిక్కెట్టును ఆనందంగా చూసుకుంటూ, చిరిగిన షర్టును పట్టించుకోలేదతను. సినిమా బాగా లేదు. కాని, అభిమానుల కేరింతలు బాగున్నాయి. ఈలలూ, చప్పట్లూ బాగున్నాయి. ఇంటర్వెల్‌లో సోడా తాగుతోంటే, పద్మనాభం దగ్గరగా వచ్చాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు.
‘‘నువ్వు మా కృష్ణమూర్తివి కదూ? హైదరాబాద్‌లో ఉంటున్నావు కదూ?’’ అడిగాడు. తను పద్మనాభాన్ని గుర్తుపట్టాడుగాని, వాడు తనని గుర్తుపట్టలేదు. అనుమానంతో చూస్తున్నాడు.
‘‘రారా! ఈయన కృష్ణమూర్తేంటి? వాడేంటీ? వాడి హోదా ఏంటీ? ఇలా చిరిగిన షర్టూ, నేలక్లాసు టిక్కెట్టూ…’’ అంటూ పద్మనాభాన్ని లాక్కుపోయాడు వాళ్ళ బావమరిది. వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి సన్నగా నవ్వుకున్నాడతను. పద్మనాభం ఇంటర్లో ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. కాకపోతే బొజ్జ పెంచేశాడు. జుత్తు పూర్తిగా నెరసిపోయింది. తనలా రంగు వేసుకోవడం లేదనుకున్నాడతను.
సంక్రాంతి. సరికొత్త దుస్తులు వేసుకున్నాడు మళ్ళీ. రామాలయానికి వెళ్ళాడు. చిన్పప్పుడు అదే రాముడు బొమ్మ చాలా పెద్దదిగా అనిపించేది, ఇప్పుడదే బొమ్మ చిన్నదిగా అనిపిస్తే, ఏదోలా అయిపోయాడు. పులిహోర ప్రసాదం అందుకుని స్తంభాన్ని ఆనుకుని కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. అప్పట్లో పండగపూటా అమ్మా, తనూ వచ్చేవారు ఆలయానికి. ఇలాగే ప్రసాదం తీసుకునేవారు. అమ్మ స్తంభాన్ని ఆనుకుని కూర్చుంటే, తానేమో స్తంభం చుట్టూ పరిగెడుతూ తిరిగేవాడు. అది గుర్తు రావడం ఆలస్యం, ప్రసాదాన్ని పిడికెట బిగించి, స్తంభం చుట్టూ పరుగుదీశాడతను.
‘‘ఏంటండీ చిన్నపిల్లాడిలా?’’ నవ్వాడు పూజారి. సిగ్గుపడ్డాడతను. సంక్రాంతి పూటా పెరుగుగారెలు తినాలనేది అమ్మ. వెళ్ళి హోటల్లో మూడు ప్లేట్లు పెరుగుగారెలే తిన్నాడు. భోజనం చెయ్యలేదు. అమ్మ గుర్తు రావడంతో ఊరిలో ఇల్లు గుర్తు వచ్చింది. అమ్మేశారప్పట్లో. పుట్టి పెరిగిన ఇల్లు చూడాలనిపించింది. నడిచాడటు. ఊరు వదలిపెట్టి, నలభై ఏళ్ళయింది. సినిమా ధియోటర్లలోనూ, దుకాణాల్లోనూ మార్పు వచ్చిందిగాని, వీధుల్లోనూ, అక్కడి ఇళ్ళల్లోనూ ఎలాంటి మార్పూ లేదు. పైగా శిథిలమైపోతున్నాయి. శిథిలమవ్వడం మార్పు కాదుకదా? అనుకున్నాడతను. నాలుగైదు వీధులు తిరిగాడు. అయిదారు మలుపులు తిరిగాడు. ఇంటికి చేరుకున్నాడు. అప్పట్లో పెంకుటిల్లు. కొన్నవాళ్ళు దాన్ని డాబా చేశారు. నిలబడి చూస్తోంటే, తనని గమనించిన, ఆ ఇంటాయన-
‘‘రండి, లోపలికి వచ్చి చూడండి.’’ అన్నాడు.
‘‘మీకు మా బావమరిది చెప్పినట్టున్నాడు, ఇల్లు అమ్మకానికి పెట్టాను. పిల్లలిద్దరూ అమెరికాలో సెటిలయ్యారు. మా ఆవిడపోయి మూడేళ్ళయ్యింది. ఒంటరిగా నేనిక్కడ ఉండడం పద్ధతి కాదంటున్నారు పిల్లలు, అక్కడికి రమ్మని ఒకటే గోల. వెళ్ళిపోదామనుకుంటున్నాను, ఇల్లు చూడండి.’’
ఇల్లు కొనుగోలు చేసేందుకు వచ్చాననుకుంటున్నాడు. అనుకోనీ, అవకాశం దొరికిందని ఇంట్లోకి ప్రవేశించాడతను. చూడసాగాడు. అంతా అయోమయంగా ఉంది. అప్పట్లో పెద్దహాలు ఉండేది. హాల్లో వాలుకుర్చీలో నాన్న కూర్చుని ఉత్తరరామాయణం పారాయణం చేసేవారు. రామాయణం పారాయణం చేస్తే వర్షాలు కురుస్తాయనేవారు. కురిశాయో లేదో గుర్తు లేదుగాని, నాన్న చదివిన వాక్యాలూ, వర్ణనలూ బాగా గుర్తున్నాయి. వాటిని గుర్తు చేసుకుంటూ నడుస్తున్నాడతను. అటు చావిడిని అలాగే ఉంచారు. చావిడిలో నేలలో పాతినరోలు అలాగే ఉంది. వాడుతున్నట్టు లేరు. మట్టికూరుకుపోయి నల్లగా ఉందది. కూర్చున్నాడక్కడ. దగ్గరగా ఉన్న కర్ర ముక్క అందుకున్నాడు. దానితో పొడిచి పొడిచి రోటిలోని మట్టిని పెళ్ళగించసాగాడు. రోటిని తవ్వుతోంటే ఎగిరి వచ్చి పడిందో నాణెం. వాలులోకి అది పరుగుదీస్తోంటే అందుకుని చూశాడు. 1975నాటి రూపాయినాణెం. అక్క కూతురికి బోగిపళ్ళుపోసినప్పటి నాణెం. పళ్ళతోపాటు నాణెలు కలిపి పోశారిక్కడే! అప్పట్లో దొరకలేదు పిల్లలకి. ఇప్పుడు దొరికిందనుకున్నాడు. రూపాయినాణెన్ని తేరిపారజూస్తూంటే ఇంటాయన వచ్చాడు. అతన్నీ, రోటి నుంచి తవ్వి తీసిన మట్టినీ, అతని చేతిలోని నాణె న్నీ చూసి భయాందోళనలు చెందాడు.
‘‘ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? అసలు ఎవరు మీరు? లేవండి, లేవండిక్కణ్ణుంచి. నడవండి, బయటకు నడవండి.’’ కసిరాడు. అతను రూపాయినాణెన్ని పట్టుకుని పరుగులాంటి నడకతో ఇంటి బయటికి వచ్చాడు. మలుపు తిరిగి, తప్పించుకున్నాడక్కణ్ణుంచి. రాత్రంతా ఆ
నాణెన్ని చూస్తూ గడిపేశాడు. 
తెల్లారింది. కనుము. ఒళ్ళంతా నొప్పులనిపించాయి. జ్వరం వచ్చినట్టనిపించింది. హోటల్‌ ఖాళీ చేసి వెళ్ళిపోదామనిపించింది. ఆ మాటే అంటే…హోటల్‌ కుర్రాడు నవ్వాడు. అన్నాడిలా.
‘‘కనుముపూటా కాకికూడా బయల్దేరదు సార్‌! రేపెళ్ళండి.’’ అన్నాడు. ఉండిపోయాడతను. సాయంత్రం రూంలో ఉండలేక బయటపడ్డాడు. పశువులన్నీ పచ్చని ముఖాలతో, బొట్లతో చూడముచ్చటనిపించాయి. పరిగెత్తుకుని వెళ్ళి, వాటిని చేత్తో నిమిరి వచ్చాడు. రోడ్డు మీద రథం ముగ్గు వేస్తున్నారు అమ్మాయిలు. చూసుకోలేదు, తొక్కబోయాడు.
‘‘చూసుకుని నడవండిసార్‌.’’ హెచ్చరించారు.
‘‘సారీ’’ చెప్పాడతను. 

చేతులు వెనక్కి కట్టుకుని, గతంలోకీ, భవిష్యత్తులోకీ తొంగి చూస్తూ నడవసాగాడు. జ్ఞాపకాల చిరుగంటలు గుండెల్లో మోగుతోంటే, వాటికి అనుగుణంగా చిందేయాలనిపించింది. వేశాడతను, సిగ్గుపడలేదు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయవాడలో మంగళం పల్లి ,అన్నవరపు కామ్ష్య విగ్రహాల ఆవిష్కరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాకాలు లేని,అడ్రస్ లేని కాంగ్రెస్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హస్తినలో వెంకయ్య ఇంట మోడీసంక్రాంతి సందడే సందడి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జనవరి 11వతేదీ ఆదివారం నాడు సరసభారతి ఉయ్యూరు ఆధ్వర్యంలో దర్సనియ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ

జనవరి 11వతేదీ ఆదివారం నాడు సరసభారతి ఉయ్యూరు ఆధ్వర్యంలో దర్సనియ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంక్రాతి సందడి ఉయ్యురులో

సంక్రాతి సందడి ఉయ్యురులో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సంక్రాంతి శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు -భోగి మకర సంక్రాంతి శుభా కాంక్షలు -దుర్గా ప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

క్షేత్రాలు -ఆవిష్కరణ సభ – ఈ నాడు వార్తా కధనం

sarasabharathieenadu 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్‌ ఇక లేరు

నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్‌ ఇక లేరు
అస్వస్థతతో కన్నుమూత.. నేడు అంత్యక్రియలు
మంచి జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లారు: జగపతిబాబు

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నిర్మాత, దర్శకుడు, సినీ ప్రముఖుడు వీబీ రాజేంద్ర ప్రసాద్‌ (82) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అభిమానుల సందర్శనార్థం రాజేంద్ర ప్రసాద్‌ భౌతిక కాయాన్ని మంగళవారం ఉదయం ఫిలిమ్‌నగర్‌లోని ఆయన నివాసంలో ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎర్రగడ్డ శ్మశాన వాటికలో తమ తండ్రి అంత్యక్రియలు జరుగుతాయని రాజేంద్ర ప్రసాద్‌ కుమారుడు, సినీ నటుడు జగపతిబాబు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్‌ మృతికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, మురళీ మోహన్‌, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర తదితరులు తమ సంతాపం తెలిపారు.
నటుడు కావాలని వచ్చి…
రాజేంద్ర ప్రసాద్‌ పూర్తి పేరు వీరమాచినేని బాబూ రాజేంద్ర ప్రసాద్‌. ఆయనను సన్నిహితులు ‘వీబీ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. కృష్ణా జిల్లా డోకిపర్రులో జన్మించారు. రంగస్థల నటుడిగా తన ప్రతిభ చాటిన వీబీ సినిమాల్లోనూ నటుడిగా తన సత్తా చాటాలనుకున్నారు. కానీ… అనేక సూపర్‌ హిట్‌ చిత్రాల నిర్మాతగా మారారు. 1960లో ‘అన్నపూర్ణ’ నుంచి 1998లో ‘పెళ్లి పీటలు’ వరకు మొత్తం 25 చిత్రాలను ఆయన నిర్మించారు. వీటిలో… అంతస్తులు, ఆత్మబలం, ఆరాధన (ఏఎన్నార్‌), దసరా బుల్లోడు వంటి 16 సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించారు. ‘దసరా బుల్లోడు’తోపాటు మొత్తం 9 చిత్రాలకు వీబీ స్వయంగా దర్శకత్వం వహించారు. రెండు చిత్రాలకు రచయితగా కూడా వ్యవహరించారు.తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ‘సింహస్వప్నం’ సినిమాతో కుమారుడు జగపతి బాబును వెండితెరకు పరిచయం చేశారు. ఫిలింనగర్‌లోని ‘దైవసన్నిధానం’ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేవస్థానంలోనే అధిక సమయం గడిపేవారు. రఘుపతి వెంకయ్య జీవితకాల సాఫల్య పురస్కారం సహా అనేక అవార్డులు వీబీ సొంతమయ్యాయి.
రాజులా బతికారు: జగపతి బాబు

‘‘ఆయన బతికినంత కాలం రాజులా బతికారు. ఎవరినీ బాధపెట్టలేదు. తను కూడా ఎలాంటి బాధ పడకుండా ప్రశాంతంగా కన్ను మూశారు’’ అని జగపతిబాబు తన తండ్రికి నివాళులు అర్పించారు. సినిమాల్లో తన కెరీర్‌ బాగలేదని చివరిలో కొంత బాధపడేవారని ఆ తర్వాత తనకూ మంచి సినిమాలు రావడంతో సంతోషించారని తెలిపారు. ‘‘నా కూతురికి పెళ్లి కావాలని అనుకునే వారు. మా అమ్మాయి పెళ్లి కుదిరింది. మా సోదరుడి కుమార్తె పెళ్లి కూడా ఖాయమైంది. ఇలా ఆయన చివరి రోజుల్లోనూ అన్నీ మంచి వార్తలను విన్నారు. మాకూ మంచి జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయారు’’ అని జగపతిబాబు తెలిపారు.
దసరా బుల్లోడు
జగమెరిగిన నిర్మాతగా, జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ అధినేతగా వీబీ రాజేంద్రప్రసాద్‌ది ఒక ప్రత్యేక శకం. ఆయన నిర్మించిన చిత్రాలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. కథకు న్యాయం చెయ్యడం కోసం నిర్మాణ పరంగా ఏనాడు ఆయన రాజీపడలేదు. దసరా బుల్లోడుగా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు. అక్కినేని, ఎన్టీఆర్‌, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగార్జున, బాలకృష్ణ ఇలా మూడుతరాల హీరోలతో చిత్రాలు నిర్మించిన ఘనత ఆయనది. సినిమా హీరో కావాలనే కోరికతో పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన నిర్మాత అయ్యారు. తరువాత దర్శకుడిగా మారారు. జనరంజకమైన ఎన్నో చిత్రాలను నిర్మించారు. ప్రముఖ తారాగణంతో భారీ సెట్‌లతో లావిష్‌గా సినిమాలు తీసి తన సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
బాల్య మంతా గ్రామీణ ప్రాంతంలో గడిపినందున ఆయన తన చిత్రాల్లో పల్లెటూరి పాత్రలు, గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే దృశ్యాలను చూపే వారు. అలాగే తను పుట్టి, పెరిగిన ఊళ్లనే ఎక్కువగా తన చిత్రాల్లో చూపేవారు. దసరాబుల్లోడు చిత్రానికి ఆయన దర్శకత్వం వహించిన క్రమంలో గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో అప్పటి ప్రజల ఆప్యాయతలు, బంధుత్వాలను తెరకెక్కించిన విజయవంతమైనట్టు కూడా ఆయన సన్నిహితులు చెబుతారు. కృష్ణాజిల్లాలోని భట్లపెనమర్రును దసరాబుల్లోడు సినిమాకు లోకేషన్‌గా ఎంచుకుని జనరంజకంగా చిత్రీకరించారు. పలు సినిమాల్లో ఆయన సగటు రైతు, శ్రామికుడు పడుతున్న కష్టాలను, ఉమ్మడి కుటుంబం ప్రాధాన్యాన్ని కూడా చూపించారు. కాకినాడ పి.ఆర్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు నాట్యాలు వేసేవారాయన. ఇంటర్‌ కాలేజీలో ‘కప్పలు’ నాటకంతో తొలిసారి ఆడవేషం వేసి నాటక ప్రియులను అలరించారు. ఆంధ్రా యూనివర్శిటీలో ఉత్తమ హీరోయిన్‌గా ప్రశంసలందుకున్నారు. ఈయన నాటకాల్లో ఉన్నప్పటి నుంచే అక్కినేని నాగేశ్వరరావుగారితో పరిచయముంది. ‘దేవదాసు’ చిత్రం షూటింగ్‌కి అక్కినేని కాకినాడ వచ్చినప్పుడు రాజేంద్రప్రసాద్‌ తన రూమ్‌కి ఆహ్వానించారు. నాక్కుడా సినిమా హీరో కావాలనుందని ఆయన మనసులో కోరికను అక్కినేని ముందుంచారు. నటుడు కావడం తప్పు కాదు. డిగ్రీ లేక సినిమాల్లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్నాను. సరే డిగ్రీ పూర్తి చేసి నువ్వు ఇందులోకి రా.. నేను చేయగలిగిన సాయం చేస్తానని ఆయనిచ్చిన మాటతో వీబీకి కాస్త ధైర్యం వచ్చింది. చదువు పూర్తి చెయ్యగానే వీబీ తండ్రి కొంతకాలం వ్యవసాయం చెయ్యమని ఆదేశించారు. ఈయనకు పుట్టుకతోనే ఉబ్బసం. పొలం పనులు, కుప్ప నూర్పుళ్లు అక్కడి ధూళి ఈయనకు పడలేదు. దాంతో వ్యవసాయానికి పనికిరాడని బందరులో రైస్‌మిల్‌కి ఇన్‌ఛార్జ్‌ని చేశారు. అక్కడ కూడా అదే పరిస్థితి కావడంతో తనకి ఇష్టమైనది చేసుకోమని తల్లిదండ్రులు పర్మిషన్‌ ఇచ్చారు.

ఆ రోజుల్లో సినిమాల్లోకి వెళ్ళడం అంటే మాటలు కాదు. అయినాగానీ ఏం చెయ్యలో తోచని పరిస్థితిలో కొంత డబ్బు ఇచ్చి వీబీ తండ్రి సినిమాల్లోకి పంపారు. పరిశ్రమలో అడుగుపెట్టిన కొంత కాలానికే ఆయన తెచ్చిన డబ్బు సగం ఖర్చయిపోయింది. కానీ ఛాన్స్‌ రాలేదు. డబ్బింగ్‌ సినిమాలు తీద్దామని పూనె వెళ్లారు. అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనకడుగు వెయ్యాల్సి వచ్చింది. మిగిలిన డబ్బుతో ఏం చెయ్యాలో తెలియక, ఇంటికి తిరిగి వెళ్లడం ఇష్టం లేక జెమిని స్టూడి యోస్‌లో సౌండ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న రంగారావుని కలిసి సమస్యను వివరించారు. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు ఖాళీ లేకపోవడంతో వి.మధుసూధనరావు దర్శకత్వంలో జగ్గయ్య, జమున నటీనటులుగా ‘అన్నపూర్ణ’(1960) సినిమాతో నిర్మాతగా మారారు వీబీ. ఆ సినిమాల్లో ఆ రోజుల్లో పెద్ద హిట్‌ కావడంతో నిర్మాతగా నిలబడి 16 సినిమాలు నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా ‘దసరాబుల్లోడు’ సినిమాతో మెగా ఫోన్‌ పట్టి 14 సినిమాల కు దర్శకత్వం వహించారు. హిందీ, తమిళంలో కూడా ఆయన సినిమాలు నిర్మించారు. 1965లో వచ్చిన ‘అంతస్థులు’ సినిమాకు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశిష్ఠ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2003లో రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.
అక్కినేనితో, ఆయన తనయుడు నాగార్జునతో, అలాగే ఎన్టీఆర్‌తో ఆయన తనయుడు బాలకృష్ణతో సినిమాలు నిర్మించిన ఘనత రాజేంద్రప్రసాద్‌ది. సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగానే కాకుండా మంచి వ్యక్తిగా రాజేంద్రప్రసాద్‌ పేరు సంపాదించుకున్నారు. హీరో దగ్గర నుంచీ బాయ్‌ వరకు అందరినీ ఒకే రీతితో ఆదరించి గౌరవించిన మంచి మనస్తత్వం ఆయనది. అలాగే తన దగ్గర పనిచేసే వర్కర్స్‌ కోసం ఒక సినిమా నిర్మించిన ఖ్యాతి రాజేంద్రప్రసాద్‌కి దక్కుతుంది. ఆ చిత్రం ‘పిచ్చిమారాజు’. ఇందులో వచ్చిన లాభాలను వర్కర్స్‌కే పంచిపెట్టి తన విశాలహృదయాన్ని చాటుకున్నారు. తన కుమారుడు జగపతిబాబును ‘సింహస్వప్నం’ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు. అయితే ఎంతోమంది హీరోలకు హిట్లు ఇచ్చిన తను కుమారుడికి మాత్రం హిట్‌ ఇవ్వలేకపోయాననే బాధ ఆయనలో చివరి వరకూ ఉండేది.

‘పెళ్లిపీటలు’ చిత్రం తర్వాత ఆయన చిత్రనిర్మాణరంగానికి దూరంగా జరిగి ఆధ్యాత్మిక రంగంవైపు మళ్లారు. ఫిలింనగర్‌లో ధైవ సన్నిధానం ఏర్పాటు కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. తన శేష జీవితాన్ని భగవంతుని సేవకే అంకితం చేశారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తిరుపతిలో భాగవత ఆణిముత్యాల ఆవిష్కరణ కార్యక్రమానికి సాదర ఆహ్వానం

http://bhagavatamanimutyalu.org/IBamC1.html

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో

తిరుపతిలో

పవిత్రమైన అఖండ ఆవిష్కరణ కార్యక్రమానికి సాదర ఆహ్వానం

(January 15,16, 17, 2015 సంక్రాంతి పండుగ రోజులు)

మన చరిత్రలో, తెలుగు సాహిత్య పురోగతిలో, హిందూ మత సంస్కృతిలో మొదటి సారిగా ఒక నూతన ప్రక్రియ కు ఈ సంక్రాంతి పండుగ పుణ్యక్షేత్రమైన తిరుపతి లో  శ్రీకారం చుట్టనున్నది.  పోతనామాత్యులవారి భాగవతం నుండి కొన్ని ఆణిముత్యాలని ఏరి, వాటిని రాగ యుక్తంగా పాడించి, అర్థం వివరిస్తూ అటు ప్రాచీన , ఇటు అత్యానుధిక ఆధునిక సాంకేతిక పరికరాలు, అంతర్జాల మాధ్యమాలలో కొద్ది క్షణాలలోనే అందుబాటులో ఉండే ఒక సమగ్ర ప్రణాళిక పూర్తి అయిన సందర్భంగా ఆ పర్వదినాలలో ఆయా ఉత్పత్తులని యావత్ ప్రపంచానికి అందించే ఒక పవిత్రమైన ఆవిష్కరణ కార్యక్రమానికి, మూడు రోజుల భాగవత ప్రవచనానికి అందరూ ఆహ్వానితులే.

సంధాన కర్త, నిర్వాహకులు:

iBAM Org (భాగవత ఆణిముత్యాల పేరిట నెలకొల్పబడ్డ లాభాపేక్ష లేని అమెరికా సంస్థ)

ప్రత్యేక సహకారం:

హిందూ ధర్మ ప్రచార పరిషత్ (తిరుమల తిరుపతి దేవస్థానం) & వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

తేదీలు: జనవరి 15, 16 & 17, 2015 (సంక్రాంతి పండుగ రోజులు)

మొదటి రోజు: (జనవరి 15):

సూర్యోదయం సమయం:  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాలకు పోతన భాగవత ఆణిముత్యాల నూతన తాళపత్ర గ్రంధ సమర్పణ, ప్రత్యేక పూజ

సాయంకాలం: సుమారు 4: 00 నుండి 5:00 వరకూ:  తిరుపతి నగర వీధులలో గజేంద్రుడి అంబారీ పై స్వామి ఆశీర్వదించిన పోతన తాళ పాత్ర గ్రంధాల ఊరేగింపు.

VenueTirumala Tirupati Devasthanams Administrative Building Pranganam, Tirupati.

కార్యక్రమం

(5:30 నుండి 9:00 వరకూ)

“పోతన ఆణి ముత్యాల ఉత్పత్తులు” ఆవిష్కరణ.   (తాళ పత్ర గ్రంధం, వెబ్ సైట్, ఐ ఫోన్, ఐ పాడ్ వంటి పరికరాలలోకి డౌన్ లోడ్ చేసుకునే డిజిటల్ టెక్నాలజీ అప్లికేషన్స్, జి MP 3 సీడీ మొదలైనవి) మరియు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిచే మూడు రోజుల భాగవత ప్రవచన ప్రారంభం.

ప్రధాన అతిథులు:  Dr. D. Sambasiva Rao Garu, IAS, Chief Executive Officer, TTD

శ్రీ బి.వి. పాపారావు (తెలంగాణా ప్రభుత్వ సలహాదారు)

ప్రత్యేక అతిథులు: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, శలాక రఘునాథ శర్మ గారు, ఊళపల్లి సాంబశివ రావు గారు, ఎల్.వి. సుబ్రమణ్యం గారు, నేమాని పార్థ సారధి గారు, డా. చొదిమెళ్ళ చంద్ర శేఖర్,  TTD  అధికార బృందం,  భాగవతుల ఆనంద మోహన్ (హ్యూస్టన్), దువ్వూరి అరుణ్ కాంత్ (హ్యూస్టన్), రమణి విష్ణుభొట్ల (ఆస్టిన్)

పూర్తి వివరాలకు iBAM సంస్థ అధ్యక్షులు పుచ్చా మల్లిక్ (ఇండియా ఫోన్ నెంబర్  82206-30540) ని పిలవండి.

(రాజమండ్రి లో జరిగిన తొలి విడత ఆవిష్కరణ సభ)- మల్లిక్ పుచ్చా గారు, jజొన్నవిత్తుల గారు, శలాక రఘునాథ శర్మ గారు, సాంబశివ రావు గారు, నేమాని పార్థు తదితరులు

సంకల్ప ప్రేరణలు: “ఐ – భాగవతం ఆణి ముత్యాలు” కి ముఖ్య ప్రేరణ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలలో తరచూ ప్రస్తావించే “పోతనామాత్యుల పద్యాలు ముత్యాలు. వాటిలో కొన్నైనా రోజూ పఠించడం ఎంతో మంచి అలవాటు. అంతే కాకుండా జీవితంలో వచ్చే ఒడుదుడుకులను తట్టుకునే మానసిక బలాన్ని , రక్షణను ఇస్తాయి. ఆ ఒడుదుడుకులను దాటే చక్కటి దారిని, దైవ బలాన్ని అందిస్తాయి. ఇది తథ్యం “ అనే హిత వాక్యాలు. ఆ భావ వీచికపోతన భాగవతం లోని 7012  పద్యాలలో అతి చక్కని 324  పద్యాలని ఆని ముత్యాలుగా ఎంచుకునే మా సత్సంకల్పాన్ని ప్రేరేపించాయి.

మా ముఖ్యోద్దేశ్యం:  324 పోతన భాగవత ఆణి ముత్యాలను సుప్రసిద్ధ పండితుల చేత  ఎంపిక చేయించి, టీకా , తాత్పర్యాలతో సహా తరతరానికి పెరుగుతున్న అనంత అద్భుత జ్ఞాన పిపాస సామర్ధ్యాలతో అలరారుతున్న మన నవతరానికి అందించడమే కాక, అత్యాధునిక విభిన్న బహుళ సాంకేతిక సంచారణులు మొదలైన అంతర్జాల సాధనాలతో అలవోకగా ఆడేసుకుంటున్న ఈ నాటి , భావి తరాల పిల్లల చురుకుతనం స్థాయికి దీటుగా ఈ క్రింది నాలుగు విధాలుగా సర్వులకు, సర్వవేళలా,  సర్వేత్రా సర్వ సిద్దంగా పోతన భాగవత ఆణిముత్యాలను …..ముఖ్యంగా వీనుల విందైన ఆడియో రూపంలో కూడా అందుబాటులో ఉంచడం.

మా ఉత్పత్తులు

  • iBAL : భాగవత ఆణి ముత్యాలు పట్టిక (ప్రత్యేకంగా ఎంపిక చేసిన 324 పద్యాలు)
  • iBAP: వెబ్ సైట్ లో భాగవత ఆణి ముత్యాలు తెలుగు యూనికోడ్ లిపి లో పొందు పరచడం.
  • iBAPP: వెబ్ సైట్ లో ఆణి ముత్యాల ప్రతి పదార్ధం యూనికోడ్ తెలుగు  లిపి లో పొందు పరచడం.
  • iBAT వెబ్ సైట్ లో ఆణి ముత్యాల తాత్పర్యం  యూనికోడ్ తెలుగు లిపి లో పొందు పరచడం.
  • iBAA: 324 భాగవత ఆణి ముత్యాలు పద్యాలు  భావ గర్భితంగా గానం చేసి ఆడియో రూపొందించడం
  • iBAB:  ప్రతి పదార్థ, తాత్పర్య సహిత “పోతన ఆణి ముత్యాలు” గ్రంధ ప్రచురణ.
  • iBATP: ప్రతి పదార్థ, తాత్పర్య సహిత “పోతన ఆణి ముత్యాలు” తాళ పత్ర గ్రంధ విశిష్ట ప్రచురణ

 

సాధించిన ప్రగతి: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, శలాక రఘునాథ శర్మ గారు మొదలైన  పండితులు ఆధ్యాత్మిక సౌరభాలు, భక్తీ తత్త్వం, నీటి బోధలు, ఋజు మార్గ నిర్దేశం , భగవత్ లీలల ఔన్నత్యాన్ని ప్రమాణంగా తీసుకుని 324  ఆణి ముత్యాల ఎంపిక, ప్రతి పదార్థము, తాత్పర్య రచన పూర్తీ అయింది.  సుప్రసిద్ధ గాయకుడు నేమాని పార్థ సారధి ప్రధాన గాయకుడిగా ఆయన సంగీత నిర్దేశకత్వంలో అనేక మంది సహా గాయనీ గాయకులూ, వాద్య సహకారాలతో రికార్డింగ్ ఇంచుమించు పూర్తి అయింది.

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శ్రీ కోగంటి సుబ్బారావు గార్కి పుస్తకం అంకితం ఇచ్చిన మైనేని గోపాలకృష్ణ గారు.

సరసభారతి – ఉయ్యూరు ఆధ్వర్యంలో ది 11-1-2015  ఆదివారం నాడు ఉయ్యూరు లో జరిగిన దర్సనీయ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ దృశ్యాలు . శ్రీ కోగంటి సుబ్బారావు గార్కి పుస్తకం అంకితం ఇచ్చిన మైనేని గోపాలకృష్ణ గారు.
గ్రంధకర్త : గబ్బిట దుర్గాప్రసాద్ సరసభారతి అధ్యక్షులు . గ్రందావిష్కర్ణ  శ్రీ జలదంకి ప్రభాకర్, ఆత్మీయ అతిధులు చలపాక ప్రకాష్, రామినేని భాస్కరేంద్ర -శ్రీదేవి దంపతులు ,శ్రీ కోగంటి శివ ప్రసాద్ – పుష్పవతి , కోగంటి కుటుంబ సభ్యులు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మా గబ్బిటవారి రామారావు గూడెం అగ్రహారం ,ద్వారకా తిరుమల దర్శన 12-1-15 సోమవారం -మా కుటుంబం తో చిత్ర మాలిక 

12-1-15 సోమవారం -మా కుటుంబం తో మా గబ్బిటవారి రామారావు గూడెం అగ్రహారం ,ద్వారకా తిరుమల దర్శన చిత్ర మాలిక

Posted in సమయం - సందర్భం, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి – ఉయ్యూరు ఆధ్వర్యంలో ది 11-1-2015 ఆదివారం నాడు ఉయ్యూరు లో జరిగిన దర్సనీయ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ దృశ్యాలు

సరసభారతి – ఉయ్యూరు ఆధ్వర్యంలో ది 11-1-2015  ఆదివారం నాడు ఉయ్యూరు లో జరిగిన దర్సనీయ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ దృశ్యాలు . శ్రీ కోగంటి సుబ్బారావు గార్కి పుస్తకం అంకితం ఇచ్చిన మైనేని గోపాలకృష్ణ గారు.
గ్రంధకర్త : గబ్బిట దుర్గాప్రసాద్ సరసభారతి అధ్యక్షులు . గ్రందావిష్కర్ణ  శ్రీ జలదంకి ప్రభాకర్, ఆత్మీయ అతిధులు చలపాక ప్రకాష్, రామినేని భాస్కరేంద్ర -శ్రీదేవి దంపతులు ,శ్రీ కోగంటి శివ ప్రసాద్ – పుష్పవతి , కోగంటి కుటుంబ సభ్యులుDSCN6089 DSCN6090 DSCN6091 DSCN6092 DSCN6093 DSCN6095 DSCN6097 DSCN6098 DSCN6099 DSCN6100 DSCN6101 DSCN6102 DSCN6103 DSCN6106 DSCN6107 DSCN6108 DSCN6109 DSCN6111 DSCN6112 DSCN6113 DSCN6114 DSCN6115 DSCN6116 DSCN6117

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

క్షేత్రాలు లో కోగంటి వారిపై మైనేనిగారి వ్యాసం

క్షేత్రాలు లో కోగంటి వారిపై మైనేనిగారి వ్యాసంmyneni1 001 myneni2 001 myneni3 001 myneni4 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దర్శనీయ దైవ క్షేత్రాలు – అంకిత వ్యాసం

దర్శనీయ దైవ క్షేత్రాలు – అంకిత వ్యాసంkoganti1 001 koganti2 001 koganti3 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి గారి 80 వ జనమదినోత్సవ వేడుక -ఉయ్యూరు శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం -10-1-15 శనివారం సాయంత్రం 6-30 గం లకు 

ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి  80 వ జనమదినోత్సవ వేడుక -ఉయ్యూరు శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం -10-1-15 శనివారం సాయంత్రం 6-30 గం లకు

సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80 వ జన్మ  దినోత్సవ (10-1-15)సందర్భం గా మా కుటుంబం తరఫునా సరసభారతి తరాఫునా శుభాకాంక్షలు అంద  జేస్తున్నాం మంచి ఆరోగ్యం తో ఆనందం గా జీవితం కొన న సాగాలని అందరి వాంచితం ..

 మరో శుభ వార్త కూడా -నేను అంతర్జాలం లో 140 మంది సంస్క్రుతకవులపై రాసిన ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”ను ఆన్ లైన్ లో శ్రీ గోపాల కృష్ణ గారికి అంకితమిచ్చిన సంగతి మీకు తెలిసిందే . దాని సి డి ని రేపు  అంటే 11-1-15 ఆదివారం సరసభారతి 74 వ సమావేశం గా నిర్వహిస్తున్న ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”గ్రంధా విష్కరణ సందర్భం గా మైనేని వారి మెంటార్ ,మార్గ దర్శి సచివులు సన్నిహితులు సారధి ప్రియ నేస్తం,  కపటమెరుగని సౌశీల్య సౌజన్య మూర్తి శ్రీ కోగంటి సుబ్బారావు గారు  ఆవిష్కరిస్తారు
 మరొక  శుభ వార్త”గీర్వాణ కవుల కవితా గీర్వాణం  ”గ్రంధానికి స్పాన్సర్ గా ఉండి ముద్రణ ఖర్చులు  భరించి సరసభారతి తరఫున  పుస్తకం  ముద్రించటానికి సౌజన్యం తో స్వచ్చందం గా ముందుకొచ్చి, మేనమామ శ్రీ గోపాలకృష్ణ గారిపై ఉన్న ఆదరాభిమానాలకు  నిదర్శనం గా నిలిచిన డాక్టర్ శ్రీమతి జ్యోతి (అమెరికా)గారికి సరసభారతి కృతజ్ఞత తెలియ జేస్తూ అభినందనలను అంద  జేస్తోంది
ఇంకొక శుభవార్త -ఈ గ్రంధాన్ని సరసభారతి15-3-15 బుధవారం సాయంత్రం  నిర్వహించే శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలలో ఆవిష్కరింప జేస్తామని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాం  మేము కోరిన వెంటనేముద్రణ బాధ్యతలు స్వీకరించటానికి అంగీకరించిన  శ్రీ చలపాక ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటు న్నాం .
 అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
            మీ -గబ్బిట  దుర్గాప్రసాద్ -ఉయ్యూరు

Watch Live
దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ –
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం త్యాగరాజస్వామికి లో ప్రాతః కాల పూజ 

10-1-15 శనివారం పుష్య బహుళ పంచమి -సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం త్యాగరాజస్వామికి లో ప్రాతః కాల పూజ

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పుట్టిన రోజు శుభాకాంక్షలు

సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80 వ జన్మ  దినోత్సవ (10-1-15)సందర్భం గా మా కుటుంబం తరఫునా సరసభారతి తరాఫునా శుభాకాంక్షలు అంద  జేస్తున్నాం మంచి ఆరోగ్యం తో ఆనందం గా జీవితం కొన న సాగాలని అందరి వాంచితం ..

 మరో శుభ వార్త కూడా -నేను అంతర్జాలం లో 140 మంది సంస్క్రుతకవులపై రాసిన ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”ను ఆన్ లైన్ లో శ్రీ గోపాల కృష్ణ గారికి అంకితమిచ్చిన సంగతి మీకు తెలిసిందే . దాని సి డి ని రేపు  అంటే 11-1-15 ఆదివారం సరసభారతి 74 వ సమావేశం గా నిర్వహిస్తున్న ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”గ్రంధా విష్కరణ సందర్భం గా మైనేని వారి మెంటార్ ,మార్గ దర్శి సచివులు సన్నిహితులు సారధి ప్రియ నేస్తం,  కపటమెరుగని సౌశీల్య సౌజన్య మూర్తి శ్రీ కోగంటి సుబ్బారావు గారు  ఆవిష్కరిస్తారు
 మరొక  శుభ వార్త”గీర్వాణ కవుల కవితా గీర్వాణం  ”గ్రంధానికి స్పాన్సర్ గా ఉండి ముద్రణ ఖర్చులు  భరించి సరసభారతి తరఫున  పుస్తకం  ముద్రించటానికి సౌజన్యం తో స్వచ్చందం గా ముందుకొచ్చి, మేనమామ శ్రీ గోపాలకృష్ణ గారిపై ఉన్న ఆదరాభిమానాలకు  నిదర్శనం గా నిలిచిన డాక్టర్ శ్రీమతి జ్యోతి (అమెరికా)గారికి సరసభారతి కృతజ్ఞత తెలియ జేస్తూ అభినందనలను అంద  జేస్తోంది
ఇంకొక శుభవార్త -ఈ గ్రంధాన్ని సరసభారతి15-3-15 బుధవారం సాయంత్రం  నిర్వహించే శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలలో ఆవిష్కరింప జేస్తామని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాం  మేము కోరిన వెంటనేముద్రణ బాధ్యతలు స్వీకరించటానికి అంగీకరించిన  శ్రీ చలపాక ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటు న్నాం .
 అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
            మీ -గబ్బిట  దుర్గాప్రసాద్ -ఉయ్యూరు

Watch Live
దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ –
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా దొడ్లో పండిన అరటి గెల

DSCN0351 DSCN0352 DSCN0353 DSCN0354 DSCN0355 DSCN0356

మా దొడ్లో పండిన అరటి గెల

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నవల ,కదా విమర్శకు కొత్త రాచ మార్గాలు వేసిన రాచపాలెం – నిజాం తో ఎదిరించిన సురవరం ప్రతాప రెడ్డి -మూసి -జనవరి

rachapalem 1 001rachapalem 2 001rachapalem 3 001suravaram 1 001 suravaram2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహాభారత యుద్ధంలో అస్త్రాలన్నీ మిస్సైల్సే!

మహాభారత యుద్ధంలో అస్త్రాలన్నీ మిస్సైల్సే!

ANDHRAPRABHA –   Sat, 3 Jan 2015, IST

మహాభారత యుద్ధంలో గ్రహాంతరవాసుల కారణంగా లభించిన అస్త్రాలు మహాభీకర యుద్ధానికి దారితీశాయి. దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావించారు. ధనస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?

దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయో గించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు? అత్యంత ఆసక్తికరమైన ఈ అంశాలపై ప్రత్యేక కథనమిది…

హరివంశం చారిత్రాత్మక గ్రంథం. చారిత్రాత్మకంగా ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో ఇదమిద్ధంగా తెలియచెప్పేదే చరిత్ర. చారిత్రాత్మక సంఘటనలకు రుజువులు లభ్యమవుతాయి. కుణాలుడు రాసిన మాగధ (మగధరాజ్య) చరిత్ర, కల్హణుడు రాసిన రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి లాంటి చారిత్రాత్మక గ్రంథమే. 16,374 శ్లోకాలు వున్న ఈ గ్రంథంలో సూర్యవంశపు రాజుల చరిత్ర చంద్రవంశపు రాజుల చరిత్రలో వున్నాయి.

క్రీ.పూ. 7536 సంవత్సరంలో శ్రీకృష్ణ ద్వైపాయనుడు హరివంశం రాసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. హరప్పా మొహంజదారో నాగరికతకన్నా దాదాపు మూడువేల సంవత్సరాల క్రితం హరివంశం రాసినట్లు తెలుస్తోంది. వ్యాస పీఠానికి ఆద్యుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడని అంటారు. హరివంశ చరిత్రలో సరస్వతీనదిని గురించిన ప్రస్తావన వుంది. ఎటొచ్చీ హరివంశం ఒక చారిత్రాత్మక గ్రంథం. క్రీ.పూ. 22 డిసెంబర్‌ 5561న ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణత్యాగం చేసినట్లు వ్యాసుడు రాశాడు. హరివంశం శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాయటం ప్రారంభించిన తర్వాత ఆ హరివంశ చరిత్రలో వ్యాసపీఠాధిపతులు చారిత్రాత్మక సంఘటనలను నమోదు చేస్తూ వచ్చారు.

మహాభారత యుద్ధ కాలం

దీని ప్రకారం భీష్ముడు 58 రాత్రులు అంపశయ్యపై శయనించి జీవించాడని తెలుస్తుంది. భీష్ముడు సైన్యాధిపతిగా పదిరోజులు యుద్ధం చేశాడు. పదోరోజు సాయంత్రం శిఖండితో యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో అస్త్ర సన్యాసం చేశాడు. అంటే 68 రోజుల పూర్వం మహాభారత యుద్ధం ప్రారంభమైందన్నమాట. 22 డిసెంబర్‌ 5561లో భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు గనక మహాభారత యుద్ధం సరిగ్గా క్రీ.పూ. 16.09.5561న ప్రారంభమైంది. 18 రోజులు జరిగిన ఈ అత్యంత భీకరమైన యుద్ధంలో 92 లక్షలమంది మరణించినట్లు హరివంశంలో వుంది. మహాభారత యుద్ధ చరిత్రలో సైతం దాదాపు ఈ సంఖ్యనే (89 వేలు) నమోదు చేశారు.

గ్రహాంతర వాసుల ద్వారా మిస్సైల్స్‌

దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చాలామంది చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావిస్తారు. కోల వేంకట చలపతి రాసిన మహాభారత యుద్ధకాలం అనే గ్రంథంలో ఈ యుద్ధం అత్యంత భీకరంగా జరిగినట్లు వర్ణించారు. ధనస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?

దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు? ఈ సాంకేతిక పరిజ్ఞానం గ్రహాంతర వాసుల చేత వాళ్లకి లభించి వుండవచ్చని పరిశోధకులు అంటున్నారు. శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశంలో సూర్యవంశపు రాజులు, చంద్ర వంశపు రాజులు అని పేర్కొన్నారు. సిరియాలో లభించిన పురాతత్వ అవశేషాల్లోనూ గుహల్లోని రాతిగోడలపై చెక్కిన బొమ్మల్లో అంతరిక్ష యాత్రికులు ధరించినట్లుగా శిరస్సుపై అంటినా కలిగిన బొమ్మలు వున్నాయి.

భారతదేశంలో అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కాలం వరకూ నారదుడు భూలోకంలో సంచరించినట్లు భాగవతంలో వుంది. ఈ నారదుడు 372 కాంతి సంవత్సరాల దూరంలో ఎబ్సులా అనే నక్షత్ర మండలంలోని బర్హోస్‌ అనే గ్రహానికి చెందినవాడుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాంతికన్నా వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానం ఈ గ్రహాంతరవాసులకు వుండేదనీ అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన గ్రహాంతరవాసులు భూలోకంలోకి వచ్చేవారని సిరియాలోని పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలింది. మహాభారతంలో అతి అరుదుగా పేర్కొన్న దుంధుమ గాల్వి యయాతి గ్రహాంతర వాసులేనని భావిస్తున్నారు.

అస్త్ర శస్త్ర తయారీలో వీరు నిపుణులు. వివిధరకాలైన అస్త్రాలు (మిస్సైల్స్‌) వైవిధ్యమైన ధనుస్సులు (లాంచర్స్‌) పరిజ్ఞానం శ్రీకృష్ణుని సహకారంతో పాండవులకు లభించినట్లుగా తెలుస్తోంది. ఖాండవ దహనం సందర్భంలో అగ్నిదేవుడనే గ్రహాంతరవాసి శ్రీకృష్ణునికి అర్జునునికి ఇచ్చిన సుదర్శనచక్రం గాండీవం (లాంచర్‌) అక్షయ బాణ తూణీరాలు (మిస్సైల్స్‌) రసాయనికి ఆయుధాలుగానే పరిగణిస్తున్నారు. ఖాండవ దహనం సందర్భంగా అర్జునునికి ఇంద్రునికీ జరిగిన యుద్ధం ఒకరకంగా స్టార్‌వార్‌గానే భావించవచ్చు. దాదాపు 3వేల ఎకరాల్లోని ఖాండవ వనం యావత్తూ ఈ రసాయనిక అస్త్రాల వినియోగం వల్ల కాలి బూడిదైపోయింది.

గ్రహాంతరవాసులే దేవతలు

మహాభారతంలో పేర్కొన్న దేవతలందరూ గ్రహాంతరవాసులే. భూమి మీద నివసించే అలనాటి మానవులకన్నా ఈ గ్రహాంతరవాసులకు అధిక శక్తి సామర్థ్యాలు వుండడం వల్ల సహజంగానే గ్రహాంతరవాసులను దైవాలుగా భావించి పూజించారు. కాగా ఈ అస్త్రాలను వినియోగించేందుకు పాస్‌వర్డ్‌లాంటి టెలిపతిక్‌ అక్షరాలను (మంత్రాలను) ఉచ్ఛ రించేవారని కొందరు పరిశోధకులు విశ్లేషి స్తున్నా రసాయనిక అస్త్రాలను ట్రిగ్గర్‌లాంటి ఒక పరికరాన్ని వొత్తిడికి గురిచేసి భయానక విస్ఫోటం కలిగించేవారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. కాగా ఒక పాస్‌వర్డ్‌లాంటి పదాన్ని ఉచ్ఛరించినంత మాత్రానా ఆ పదం (అక్షరం) గ్రహాంతరవాసి కర్ణపుటాలకు చేరి ఆ గ్రహాంతర వాసి తన సాంకేతిక విజ్ఞానంతో (రిమోట్‌ కంట్రోల్‌తో) ఆ అస్త్రాన్ని పేల్చేవాడని కూడా కొందరు భావిస్తున్నారు.

మహాభారత యుద్ధంలో ఇతర గెలాక్సీల్లో ఇతర సూర్య కుటుంబంలోని గ్రహాంతరవాసులు తమ రిమోట్‌ కంట్రోల్‌తో పాస్‌వర్డ్‌ను గ్రహించి విస్ఫోటనం కలిగించేవారని కూడా కొందరు శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు. రష్యాకు చెందిన మార్విల్‌ సెనెటోవ్‌ తను రాసిన (1976) ఎస్‌ వొయేజ్‌ టు అదర్‌ యూనివర్స్‌ అనే గ్రంథంలో భూమిపైకి 6 వేల సంవత్సరాల క్రితం వరకూ గ్రహాంతరవాసులు వచ్చినట్లు ఆధారాలు వున్నాయని పేర్కొన్నాడు. భూమిపై నిర్మలమైన ఆక్సిజన్‌ కలిగి ఓజోన్‌ పొర నిష్కల్మషంగా వున్నంతవరకు గ్రహాంతరవాసులు భూమిపైని మానవులతో సంబంధాలు కలిగి వుండేవారని పేర్కొ న్నాడు. ఆ తర్వాత భూమిపైకి వచ్చిన కొందరు గ్రహాంతరవాసులు కల్మషమైన వాతావరణానికి తట్టుకోలేక మరణించారని మార్విల్‌ సెనెటోవ్‌ అన్నారు. 3వేల సంవత్సరాల కాలం నాటి కొన్ని గ్రహాంతరవాసుల అవశేషాలు సైతం లభ్యమైనట్లు, వాటిపై పరిశోధనలు జరుగుతున్నట్లు ఆయన తను రాసిన పుస్తకంలో ప్రస్తావించాడు. ఈ మార్విల్‌ సెనెటోవ్‌ 2001లో తన 79వ యేట మరణించాడు.

రిమోట్‌ ద్వారా అస్త్రాల ప్రయోగం

మహాభారత యుద్ధంలో గ్రహాంతర వాసుల కారణంగా లభించిన అస్త్రాలు మహా భీకర యుద్ధానికి దారి తీశాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణునికీ భీష్ముడికీ అర్జునునికి కర్ణుడికీ అభిమన్యుడులాంటి 36 మంది మహారధులకు మాత్రమే వుండేదని భావిస్తున్నారు. అయితే ఇతర గెలాక్సీలో ఇతర సూర్య కుటుంబంలోని గ్రహాంతరవాసులచే రసాయనిక అస్త్రాల ప్రయోగం ఎలా నియంత్రించబడేవో అనే అనుమానం కలగవచ్చు. అయితే ఈ నియంత్రణ సాధ్యమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. గ్లోబల్‌ పొసిషనింగ్‌ సిస్టమ్‌ (జిపిఎస్‌) ద్వారా ఈ నియంత్రణ రిమోట్‌ వ్యవస్థ ఏర్పాటైవుండేందుకు అవకాశం వుంది.

జిపిఎస్‌ పరిజ్ఞానం గ్రహాంతర వాసులకు వుండడంలో ఆశ్చర్యంలేదు. 7వేల సంవత్సరాల క్రితమే రసాయన ఆయుధాలను తయారుచేయగల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన గ్రహాంతరవాసులకు జిపిఎస్‌ అడ్వాన్స్‌డ్‌ జ్ఞాన సంపత్తి తెలిసి వుండడంలో ఆశ్చర్యంలేదు. అస్త్రాలను ఉపయోగించడంలో నైపుణ్యం సాధించిన వ్యక్తికి గ్రహాంతరవాసులు వేరువేరు పాస్‌వర్డ్‌ కేటాయించేవారు.

ప్రతి అస్త్రాన్ని ఉపయోగించ దలచుకొన్నా ఆ అస్త్రం కోడ్‌ నెంబరూ తనకు కేటాయించిన పాస్‌వర్డ్‌ ఉచ్ఛరించి నంత మాత్రాన టెలీపతీ ద్వారా గ్రహాంతర సాంకేతిక యుద్ధ నిపుణునికి క్షణాల్లో చేరటంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆ అస్త్రం (మిస్సైల్‌) శత్రువులను నాశనం చేయగలిగేదని ఊహిస్తున్నారు. ఇలాంటి ఊహ నిజం అనుకోవడానికి గల మౌలిక కారణం ఈ మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది మూకుమ్మడిగా హతం కావడమే!

అయితే కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసే వాడికే వుండేది. ఈ విద్యలో సైతం గ్రహాంతరవాసులే శిక్షణను ఇచ్చినా మరీ భీకర అస్త్రాల నియంత్రణ గెలాక్సీ నివాసుల చేతుల్లోనే వుండివుండాలి. కొన్ని అస్త్రాలకు ఐపీ అడ్రసులు సైతం వుండి వుండవచ్చని జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌ అంటు న్నారు. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి పి.హెచ్‌.డి. పట్టా పొందాడు. అయితే ఈ అస్త్రాలన్నీ (మిస్సైల్స్‌) ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా వుండే అవకాశాలు వున్నాయి.

మహాభారత యుద్ధంలో ఉపయోగిం చిన శస్త్రాల్లోనుంచి భయానక గామా కిరణాలు సైతం వెలువడి వుండవచ్చు. ఈ గామా కిరణాలకు శత్రువు శరీరాన్ని తుత్తునియలు చేసే అవకాశం వుంది. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాభారత యుద్ధం గురించి ప్రత్యక్షంగా వివరిస్తూ కౌరవుల తరఫున, పాండవుల తరఫున చాలామంది యోధులు తుత్తునియలై పడిపోతున్నారని చెపుతాడు. మహాభారత యుద్ధంలో అస్త్రాలను ఎదుటివాడిపై ప్రయోగించడానికి మాత్రమేకాక స్వీయ రక్షణకు సైతం వినియోగించినట్లు వ్యాస మహాభారతంలో వుంది.

ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువు ప్రయోగిం చిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది. మహాభారత యుద్ధంలో కోటికి పైగా యోధులు మరణించారంటే ఈ యుద్ధం మహాభీకరమైన అస్త్ర శస్త్రాలతో కొనసాగిందనే చెప్పాలి.

18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పనికాదు. సామ్రాట్‌ అశోకుడు చేసిన కళింగయుద్ధంలో 16వేల మందే మరణించారని చరిత్రకారులు రాశారు. మహాభారత యుద్ధంలో చాలా భయానకమైన న్యూక్లియర్‌ ఆయుధాలను వినియోగించి వుండాలని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు.

ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజిదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే మొహం జదారో నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.

క్రీస్తుకు పూర్వం భూమిపైని మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన ‘అటామిక్‌ డిస్ట్రక్సన్‌ ఇన్‌ 3000 బి.సి’ అనే పుస్తకంలో పేర్కొన్నాడు. కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఎపి సెంటర్‌ (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనపడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు.

అస్త్రాల వివరాలు

మహాభారతంలోని మౌసుల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రు కలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు.

మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల భూమి యావత్తూ నాశనం కావడమేకాక సముద్రాలు సైతం ఎడారులుగా మారతాయి. మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు.

శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడు అవునో కాదో కాని యుద్ధ చాతుర్యం కలిగినవాడు. అంతటి భీకర యుద్ధంలో తాను ఎలాంటి అస్త్ర్రాన్ని ప్రయోగించకుండా పాండకులకు విజయం సాధించి పెట్టి కౌరవులను భూమిపై లేకుండా చేయగలిగాడు.

– రమాకాంత్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు కావ్యాలలో చితక్రళ

తెలుగు కావ్యాలలో చితక్రళ

andhraprabha –   Sun, 4 Jan 2015, IST

కళా జీవితమన్నది వాస్తవిక జీవితానికి పూర్తి దూరమైనది కాదు. దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో నేర్పు, ప్రతి కూర్పు కళగా చూస్తే సమస్తం సృజనాత్మకంగానే ఉంటుంది.

కళారూప సృష్టిలో బాహ్యరూపాలు వేరైన, కళాధర్మాలు మాత్రం ఒక్కటే. ఒకరు రాయిని శిల్పంగా మలుస్తారు. మరొకరు చిత్రాన్ని సృజిస్తారు. మరొకరు నాట్యం చేస్తారు. మరొకరు గానం చేస్తారు. కవి అయినపుడు భాష తన స్వాధీనంలో ఉంటుంది కాబట్టి కావ్యరూపంలో మన ముందుంచుతారు. అందుకే ప్లూటార్క్‌ అంటాడు ‘పెయింటింగ్‌ ఈజ్‌ మ్యూట్‌ పోయిట్రీ, పోయిట్రీ ఈజ్‌ స్పీకింగ్‌ పిక్చర్‌’.

ఒక దృశ్యాన్ని చూసి తదనుభూతిని పొందగలిగిన వారందరూ ఆ అనుభూతిని మరొకరి చేత భావింప చేసి, వారుపొందిన స్థితిని మరొకరు పొందేటట్లు చేయడమన్నది కత్తిమీద సాములాంటిది. ఇది కవులకు, కళాకారులకే సాధ్యమనవచ్చు. కవి అనుభవ భావాన్ని భాషలో చదివి మనం ఆనందించగలుగుతున్నాం. అందుకే ఇది కవిత్వ కళ. కవులు గీస్తున్న చిత్రాలు కావ్యాలు.

ప్రతిభావంతుడైన కవి సృష్టిలో ఏ వస్తువునైనా స్వీకరించి సుందర కవితా స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయగలడు. మరి అలాంటి కవికి సుందరమైన ప్రకృతి, ఎదురుగా ఉంటే మరింత సుందర కావ్యాలను సృష్టించగలరు.

హృదయాన్ని తట్టిలేపినంత మాత్రాన అది ఉత్తమ కావ్యం కాదు. ఉత్తమ సంస్కృతిని కూడా పాఠకునికి ఇచ్చినపుడు అది ఉత్తమ కావ్యం కాగలదు. మేథ్యూ ఆర్నాల్డ్‌ ఈ విషయమై ప్రస్తావిస్తూ మానవునిలో కల పశుత్వ లక్షణాలు పోగొట్టి ఉత్తమునిగా చేయగలిగినదే ఉత్తమ సంస్కృతి అంటాడు.

భోజుడు చిత్రకారుని లక్షణాన్ని పేర్కొంటాడు.

నవేత్తి శాస్త్ర విత్కర్మ / న శాస్త్ర మపి కర్మవిత్‌/ యోవేత్తి ద్వయ మప్యేతత్‌/సహి చిత్ర కరోవర:’- శాస్త్రం తెలిసిన వారికి కర్మజ్ఞానం అరుదు. కర్మజ్ఞానం కలవానికి శాస్త్ర జ్ఞానం అరుదు. కర్మ, శాస్త్రం రెండింటిలోనూ సమాన ప్రజ్ఞకలవాడే ఉత్తమ చిత్రకారుడు అంటాడు.

కావ్యానికి ఆరు లక్షణాలు చెప్పబడ్డాయి. అవి వస్తువు, వాస్తవికత, ప్రకృతి నేపథ్యం, కళాత్మకత, తాత్త్వికత, లక్ష్యం వీటితో కవి ప్రతిభ చేత సృజన దృష్టి, మానవీయ భావనతో కావ్యం సంపూర్ణత పొందుతుంది.

భీష్మ పర్వం ప్రధమాశ్వాసం లోని పద్యంలో అర్జునుడు కురుక్షేత్రలో శ్రీకృష్ణుని విశ్వరూపం సందర్శించి ప్రకృతి యొక్క వివిధ తత్వాలు శ్రీకృష్ణునిలో చూసిన విషయాన్ని కవి వర్ణించిన విధము

”అంబు పవమాన సూర్యచంద్రాన లాది

వివిధ తత్త్వంబులును నవీ విశ్వలోక

సంప్రవర్తన కరుడవు శాశ్వతుండ

వచ్యుతుండవు పుండరీకాక్షనీవు”

సముద్రం అన్నది అత్యంత పురాతనమైనది. సృష్టిలోనూ సముద్రం మొదటిది. గ్రీకుల తాత్వికులు నీట తేలుతున్న గ్రహంగా భూమిని పేర్కొన్నారు. తెలుగులోనూ సముద్ర వర్ణన మొదటగా చెప్పబడుతుంది. ఆదికవి నన్నయ చెప్పిన ప్రకృతి వర్ణనలో, కడి వర్ణన మొదటిది.

కద్రూ వినతలు సాయంకాల విహారం చేస్తూ, సముద్ర ప్రాంతానికి వచ్చి, వారు దర్శించిన సముద్ర దృశ్యాన్ని మహాభారతం లోని ఆదిపర్వం, ద్వితీయాశ్వాసం లోని 27,28,29,30 పద్యాలలో చిత్రకారుని వలే చిత్రిస్తాడు నన్నయ.

ఆకాశం వైపు ఉవ్వెత్తుగా లేచే కడలి తరంగాలలోనూ, ఆ అలల తాకిడికి చలిస్తున్న తీరం, ఆపరిసరాల్లోని వనాలు, మనోహర దృశ్యాన్ని తన భాషా చమత్కృతితో చిత్రిస్తాడు. ఈ వర్ణనలలో నన్నయ మూడు విధాలు అనుసరించాడు. చిత్రకారుడు రేఖలతో రంగులతో చిత్రాన్ని చిత్రించినట్లుగా, పదాలతో దృశ్యచిత్రణ చేస్తాడు. ఇది మొదటి అంశం. ఇక రెండవ అంశంగా చెప్పబడేది ఇతర వస్తువులతో పోలిక చెప్పడం ఇందులో సాధారణ ఉపమాన శబ్దాలలోనే కాక, పోలిక లేని వస్తువులలో, సముద్రాన్ని వర్ణిస్తాడు. సముద్రం నాటక రంగం వలె ఘన రసపాత్ర శోభితమంటాడు. మూడవ అంశంగా సమయ కాలాల ద్వారా వర్ణించి చెప్పడం. సముద్రం రత్నగర్భ అని, అందులో బడబాగ్ని ఉన్నది అనడం. ఇలా నన్నయ కవి అయినా చిత్రకారునిలో పరకాయ ప్రవేశం చేసి దృశ్యాన్ని చిత్రించగలిగాడు.

నదిని స్త్రీతో పోలిక చెప్పారు. ”రసరేఖలు’ లోని ప్రకృతి చిత్రాలు అన్నవ్యాసంలో సంజీవదేవ్‌ గారంటారు భారతీయ చిత్రకళలో కేవలం దృశ్యచిత్రాలు కొన్ని దొరికి నప్పటికీ, కేవల దశ్య చిత్రణ వ్యాప్తి చెందలేదు. పర్వతాలను కలిపి మూర్తి కల్పన చేసిన మానవ వ్యక్తిగాను, అదే విధంగా ప్రవాహ రూపంలో నదిని స్త్రీ రూపంలో చిత్రించడం; అయినా భావ రూపాత్మకమైన భారతకళ యొక్క ఔన్నత్యానికి భంగం ఏమి వాటిల్లలేదు అంటారు.

దృశ్య చిత్రాన్ని కంకంటి పాపరాజు ”ఉత్తర రామాయణ’ కావ్యంలో గంగానది వర్ణనలు చేస్తూ

”చెంగటం గనెన్‌ లతాంగి శీతలా నిలాహతో

త్తుంగ భంగ తీరసంగ తుంగ నాగరంగ నా

రంగ రంగ దంబు జాంగ రంగ నృత్త చంగ సా

రంగ రంగ నంత రంగ మంత బొంగగాన్‌”

సీతాదేవి వాల్మీకి ఆశ్రమానికి వెళుతూ దారిలో గంగానదిని దర్శించిన దృశ్యాన్ని పాపరాజు వర్ణనలో గంగానది నీటివలె అలలతో లయలతో కదులుతూ నదీ ప్రవాహాన్నీ స్ఫురిస్తుంది.

గోదావరిని అడవి బాపిరాజు ఉగ్రకాళిగా చిత్రించారు. ఉప్పొంగి పోయింది గోదావరీతాను/ తెప్పన్న ఎగసింది గోదావరీ/ కొండల్లు ఉరకింది కోనల్లు నిండింది/ ఆకాశ గంగతో హస్తాలు కలిపింది” స్వాభావిక వర్ణనతో దృశ్యాన్ని చిత్రించారు బాపిరాజు.

పర్వతాలను కవులు మనోహరంగా వర్ణించారు. శ్రీశ్రీ ”మహాప్రపంచం” కవితలో సమాజ మార్పును, మానవ హృదయ సంక్షోభాన్ని చిత్రిస్తూ ”సింహాచలం కదిలింది/హిమాచలం కరిగింది/వింధ్యానగరం పగిలింది/ సింహాచలం హిమాచలం/వింధ్యాచలం సంధ్యాచలం/మహానగాలెగరుతున్నాయి/” ఇలా ఉంటుంది శ్రీశ్రీ దృశ్య చిత్రణ.

సూర్యోదయాన్ని వర్ణించిన మొదటి కవి నన్నెచోడుడు అంటారు టి.వి. నారాయణరెడ్డి, కుమార సంభవం, అష్టమాశ్వాసంలోని 184వ పద్యంలో సూర్యోదయానికి ముందు కోడి కూత వినిపిస్తుంది. దీన్ని దృశ్యమానం చేశారు.

తొలుకొని కుక్కుట రవములు

చెలగుడు దదనంతరంబ చెఱువుల నదులం

గొలకుల వనముల సత్యవి

రలమై బహు విహగని వహ రవములు సెలగెన్‌

ప్రకృతిని విపులీకరించి వర్ణించిన మొదటి కవి నన్నెచోడుడు.

ప్రాచీన కవులు చంద్రుని ఆకాశాన సముద్రంలో తేలిపోవు ఓడగాచిత్రించారు. దువ్వూరి రామిరెడ్డి వెన్నెలను జాజి తీవగా చిత్రించారు. తన ”ప్రణయాహ్వానము” నందు-

చదుల పందిట వెన్నెల జాజితీవ

చుక్కలను పూలు పూచి యో సుందరాంగి

ప్రణయ మోహన మైన యీ ప్రకృతి నెల్ల

సురభిళోచ్ఛ్వాస వీచుల సొగయ సూచు

అనాది నుండి అన్ని దేశాలలోనూ చిత్రకారుని ప్రతిభకు గీటురాయి స్త్రీ చిత్రం. కవుల భావనకు, చిత్రకారుల ఊహలకు అందని అపురూపం స్త్రీ. ప్రకృతిలోని అనేకానేక వస్తువులను సేకరించి బ్రహ్మదేవుడు స్త్రీ రూపాన్ని సృష్టించాడంటారు.

అదే విధంగా స్త్రీని శక్తి స్వరూపిణిగాను, సమరాంగణగానూ, చదువుల తల్లిగా, సంపదలిచ్చే సిరుల లక్ష్మిగానూ, వర్ణించి చెప్పారు. పూర్ణచంద్ర మనోరమ, సుందర హాస శోభితగా చిత్రించారు కవులు, చిత్రకారులు.

ఆధునికుల అభిప్రాయం ప్రకారం కళ అన్నది ఏదైనా కావచ్చు. అది పదిమందికి అర్థమవుతూ నలుగురికి మంచికి దోహదపడుతూ మనలో బలమైన భావోద్రేకాన్ని కలిగించే సృజన మాత్రమే కళగా చెప్పబడుతుంది.

ఇలా తెలుగు కావ్యాలలో అనేక మంది కవులు, చిత్రకారులు వలే వర్ణనలను భాషద్వారా పదచిత్రాలు, భావచిత్రాల ద్వారా అందించారు. సాహిత్యాన్ని వర్ణమయం చేశారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచీన భారతీయ విద్యాలయాలు

ప్రాచీన భారతీయ విద్యాలయాలు

andhraprabha –   Sun, 21 Dec 2014, IST
ప్రాచీన భారతీయ విద్యాలయాలు

ఇక్కడ ‘ధర్మగంజ్‌’ అనే పెద్ద గ్రంథాలయం ఉండేది. ‘ధర్మ గంజ్‌’ అనగా ధర్మం కావలసిన వారు దానిని స్వీకరించ టానికి సిద్ధంగా వుంచిన చోటని అర్థం. ఇందులో రత్నసాగరం, రత్నోదధి, రత్నరంజయ అనే మూడు అంతస్థుల భవనాలు ఉండేవి. ఇక్కడ 10 సరోవరాలుండేవి.

తక్షశిల వైదిక విద్యాలయాలలోకెల్లా ప్రసిద్ధమైనది. ఇది అతి పెద్ద వైదిక విశ్వవిద్యాలయం. దేశంలోని వివిధ ప్రాంతాలలోని విద్యాకేంద్రాలు తక్షశిల విశ్వకళా పరిషత్తుకు అనుబంధంగా ఉండేవి. వైద్యవిద్యను సంపూర్ణం కావించుటకు జీవకుడు తక్షశిలలో ఏడు సంవత్సరాలు నివసించాడు. వైద్యశాస్త్రం, యుద్ధ విద్య, వేదవిద్యలు, తర్కశాస్త్రం వంటివి ఇక్కడ బోధించేవారు.

భారతదేశంలో రామాయణం, వి జ్ఞాన నిలయలు జరిగిన కాలం నుండీ ప్రసిద్ధ విద్యాలయాలుండేవి. బదరిక, నైమిశార్యం కాశీ, తక్షశిల వైదిక విద్యాకేంద్రాలు. నలంద, వల్లబి, విక్రమశిల, బదంతపురం బౌద్ధవిద్యాకేంద్రాలు. ఈ విద్యాలయాలు ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతి గాంచినవి. అందువల్ల వీటిని విశ్వవిద్యాలయాలుగా పేర్కొనవచ్చు.

బ్రాహ్మణ గురువులు వైదిక విద్యాకేంద్రాలలో విద్యాబోధన చేసేవారు. ఈ విద్యాకేంద్రాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్వవ ర్ణాల వారికి మాత్రమే ప్రవేశం ఉండేది. శూద్రులను విద్యార్జ నకు నాడు అనర్హులుగా పరిగణించేవారు. బ్రాహ్మణ విద్యార్థు లకు మతం, తత్త్వ విచారం, వేదాలు – బ్రాహ్మణికాలు, ఉపని షత్తులు బోధించేవారు.

క్షత్రియులకు రాజనీతి, యుద్ధ విద్యలు బోధించేవారు.

విద్యార్జన దశలో విద్యార్థులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తొలుత పండిత గృహంలో తరువాత వనభూములలోని ఆశ్రమాలలు విద్యాబోధన జరిగేది. వీరికి ఖగోళశాస్త్రం శబ్ద ఉత్పత్తి శాస్త్రం, వ్యాకరణం వేదాధ్యయనంతో పాటు నేర్పించే వారు. అధ్యయనంతోపాటు ఆశ్రమ విద్య నియమాల ననుస రించి శారీరక శ్రమ చేయాలి. మత ఉత్సవాలు నిర్వహించాలి సామాన్యజీవనం గడపవలసి వుంటుంది.

పరిషత్‌లు అని పిలువబడే వైదిక విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, ధర్మశాస్త్రాలు, తత్త్వశాస్త్రాలను విద్యార్ధులు అధ్యయనం చేసేవారు.

బదరిక విద్యాలయం హరిద్వార్‌ వద్ద ఉండేది. వేదాంత విద్య లకు ఈ విద్యాలయం ప్రసిద్ధి చెందినది. బ్రహ్మసూత్రాలలోని వేదాంత సారాన్ని ఇచట బోధించేవారు. వ్యాసమహర్షి మహాభారతాన్ని ఈ ప్రాంతం నుంచే ప్రచారం చేసారని, శంకరాచార్యుల వారు క్రీ.శ. 8వ శతాబ్దంలో రామానుజా చార్యులు ఇక్కడికి వచ్చి విశిష్టాద్వైత మతాన్ని ప్రచారం చేసి ప్రాచు ర్యంలోకి తెచ్చారు. తరువాత కాలంలో మధ్వాచార్యుల వారు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శిం చారు.

వైదిక విద్యాల యాలలో ప్రసి ద్ధిగాంచి నది కాశీ. ఆయు ర్వేద విద్యారహస్యాలు తెలి సిన జీవకుడు ఇక్కడ ఉండే వాడు. చరకుడను వైద్యశాస్త్రవేత్త

కూడా ఇక్కడ ఉండేవాడు. అష్టాంగ వైద్య శాస్త్రాన్ని ఇతడు వ్యాప్తిచేసాడు. బించి సారుడు, బుద్ధుడు మొదలగు వారు ఇక్కడ చికిత్సలు చేయించుకొనేవారని ప్రతీతి. స్వదేశీ విద్యార్థులతోపాటు విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడ విద్యను అభ్యసించేవారు.

తక్షశిలవైదిక విద్యాలయాలలోకెల్లా ప్రసిద్ధమైనది. ఇది అతిపెద్ద వైదిక విశ్వవిద్యాలయం. దేశంలోని వివిధ ప్రాంతాలలోని విద్యాకేంద్రాలు తక్షశిల విశ్వకళా పరిషత్తుకు అనుబంధంగా ఉండేది. వైద్యవిద్యను సంపూర్ణం కావించుటకు జీవ కుడు. తక్షశిలలో ఏడు సంవత్సరాలు నివసించాడు. వైద్య శాస్త్రం, ఆయుద్ధ విద్య, వేదవిద్యలు, తర్కశాస్త్రం ఇచట బోధించేవారు.

ఈ విద్యాలయంలో ప్రవేశా కి విద్యార్థులు 1000 నాణలు చెల్లించి అనుమతి పొందేవారు. ధనం చెల్లించలేని విద్యార్థులు పగలు గురువుకు చేసి, రాత్రిపూట విద్యాభ్యాసం చేసేవారు.

రాజులు విద్యాలయ పోషణకు ధనాన్ని విరాళాలుగా ఇచ్చేవారు.

బౌద్ధయుగంలో నలంద ప్రసిద్ధి పొందిన విద్యాలయం. పాట్నా జిల్లాలోని బౌరగాన్‌ ప్రాంతంలో ఈ విశ్వవిద్యా లయం ఉండేది. దీనిని శక్రాదిత్యుడను రాజు నిర్మించగా తరు వాత కాలంలో ఇచట బుధగుప్తుడు, తధాగత గుప్తుడు, బాలా దిత్య, వజ్ర అనే రాజులు అనేక భవనాలు నిర్మించారు.

ఇక్కడ ‘ధర్మగంజ్‌’ అనే పెద్ద గ్రంథాలయం ఉండేది. ‘ధర్మ గంజ్‌’ అనగా ధర్మం కావలసిన వారు దానిని స్వీకరించ టానికి సిద్ధంగా వుంచిన చోటని అర్థం. ఇందులో రత్నసాగరం రత్నోదధి, రత్నరంజయ అనే మూడు అంతస్థుల భవనాలు ఉండేవి. ఇక్కడ 10 సరోవరాలుండేవి.

ఇందులో ప్రజ్ఞాపారమితా సూత్రాలు, దివ్యగ్రంథాలు, తాంత్రిక విద్యాగంథ్రాలు వుండేవి. ఈ విశ్వవిద్యాలయంలో 18 బౌద్ధ దర్శనాలు, మహాయానము, హేతువిద్య, శబ్ద విద్య చికిత్సా విద్య, తంత్రశాస్త్రం, సాంఖ్య, వ్యాకరణ శాస్త్రాలు అధ్యయనం చేసేవారు.

సూత్రాలకు వ్యాఖ్యానం చేసేవారు 1000మంది, 30 రకాల శాస్త్రాలను బోధించేవారు 500 మంది, 50 శాస్త్రాలను బోధించ గలవారు 10 మంది ఉండే వారు. సర్వశాస్త్రాలను బోధించగల ఆచార్యుడు ఒక్కడు ఉండేవాడు. అతనే శీలభద్రుడు ఇతనినే ధర్మనిధి అని అంటారు.

ఈ విశ్వవిద్యాలయంలో 8 కళాశాలలు 300లకు పైగా భవనాలు ఉండేవి. ఇక్కడ నాగార్జునుడు, అశ్వఘోషుడు వసు బంధు, దిజాగుడు, కమల శీల, సంఘమిత్ర, శాంతి రక్షిత, వీరదేవ, మంజ శ్రీదేవ మొదలైగు ప్రసిద్ధ ఆచా ర్యులుండేవారు.

ఇక్కడ విద్యాకార్యక్రమాలు నిర్ణీత కాల బద్ధమై ఉంటాయి. దినానికి ఎనిమిది జాములుగ నుండేది. ప్రతిజాముకు నాలుగు సార్లు ఢంకానినాదం, ఖారావము చేసేవారు.

మొదటి జాము ఢంకా నినాదానికి అందరూ స్నాన మాచరిచేవారు. రెండవ జాముకు ముందే భోజనం పూర్తి చేసేవారు.

విద్యాభ్యాసం కోసం బొఖారా, కొరియా,చైనా, టిబెట్టు దేశాల నుండి విద్యార్థుల ఇక్కడికి వచ్చేవారు.

ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు శాంతి రక్షితుడు. పద్మ సంభవుడు టిబెట్‌లో బౌద్ధ సంస్కృతిని వ్యాప్తి చేసేవారు.

విక్రమశిల విశ్వవిద్యాలయం బీహార్‌ లోని భగల్‌ పూర్‌ సమీపంలో ఉండేది. క్రీ.శ. 9వ శతాబ్దంలో ధర్మపాలుడను రాజు దీనిని స్థాపించాడు. ఈవిశ్వవిద్యాలయంలో విద్యా భ్యాసం చేసిన వారికి ప్రత్యేక గౌరవ సూచకమైన బిరుదు నిచ్చేవారు. పండిత అనే బిరుదుతో వారిని పిలిచేవారు. ఇక్కడ ఆరు కళాశాలలు ఉండగా, ఒక్కొక్క కళాశాలలో 108 మంది ఉపాధ్యాయులుండేవారు. ఇందులో 800 మంది ఉపాసకులు ఒకేసారి సమావేశమగుటకు ఒక సమావేశ ప్రదేశం ఉండేది. రాజుల పోషణతో ధర్మ సత్రాల ద్వారా ఇచటి వారికి భోజన సదుపాయాలు ఏర్పరచారు.

ఇచట బౌద్ధతంత్రం, వ్యాకరణం, వేదాంతం తర్కం శాస్త్రా లను బోధించేవారు, చాణిక్యుని కాలంలో ఆరుగురు తార్కి కులు ద్వారపాలకులుగా ఉండేవారు. తూర్పు ద్వారం వద్ద రత్నాకర శాంతి, పశ్చిమ ద్వారం వద్ద, వాగీశ్వర కీర్తి, ఉత్తర ద్వారం వద్ద నరోపుడు, దక్షిణ ద్వారం వద్ద ప్రజ్ఞాకర మతి, ప్రధమ సింహ ద్వారం వద్ద రత్న వ్రజుడు, గర్భద్వారం వద్ద జ్ఞాన శ్రీమిత్రుడు ఉండేవారు. ధర్మపాలుని కాలంలో ఈ విద్యా లయానికి కులపతిగా జ్ఞాన పాదుడు ఉండేవాడు. జ్ఞానపాదు డు రాసిన తంత్ర శాస్త్రం టిబెట్‌ భాషాసాహిత్యంలో ముఖ్యమైన గ్రంథాలు. వైరోచన రక్షితుడు వంజిక, రత్నవాద చక్రం వంటి సంస్కృత గ్రంథాలను రాసాడు. మైత్రిక రాకు మారి దుడ్డాదేవి వల్లభి విహారాన్ని నిర్మించినది క్రీ.శ. 6వ శతాబ్దంలో ధారానేనుడు శబప్ప పాదవిహారాన్ని నిర్మించడానికి ధనం సహాయం చేసాడు. దీని నిర్మాణం బాధ్యాతలు భదంత స్థిరమతి నిర్వహించాడు. స్థిరమతి, గుణమతి అనే ఆచార్యులు ఈ విశ్వవిద్యాలయంలో ఉండేవారు. ఇచట విద్యార్థులు మూడు సంవత్స రాల కాలం వుండి విద్యాభ్యాసం చేసేవారు. ఇచట 10,000 మంది భిక్షకులు వుండేవారని తెలుస్తున్నది. పాలవ వంశీకుడైన గోపాలుడు క్రీ.శ. 8వ శతాబ్దంలో బదంత పురం విద్యాలయాన్ని నిర్మించారు. ఇది బిహార్‌లో ఉండేది. ఈ విద్యాలయంలో బౌద్ధ, బ్రాహ్మణ విద్యలు రెండూ నేర్పించే ఏర్పాటు ఉన్నందున ఈ విద్యాలయానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఈ విద్యాలయాల వల్ల భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఆసియాఖండమంతటా వ్యాపించాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్‌లో గవర్నర్‌ పాలన అనివార్యం? అక్షర సత్యాలకు పట్టం గట్టిన విమర్శకుడు

అక్షర సత్యాలకు పట్టం గట్టిన విమర్శకుడు

adhraprabha –   Mon, 29 Dec 2014, IST
  • అతడు అక్షరాల ఆకాశంలో అభ్యుదయ నక్షత్రాలను మెరిపించిన ప్రగతిశీల భావాల కవి.
  • అతడు ఆధునిక తెలుగు సాహితీ విమర్శను కొత్తపుంతలు తొక్కించిన విమర్శ
  • కుడు.

మార్క్సిజం కన్నుతో కథను నవలను కవిత్వాన్ని నిశితంగా పరిశీలించిన పరిశోధకుడు

ప్రాచీన సాహిత్యానికి ఆధునిక భాషలో, వర్తమాన సామాజిక స్పృహతో భాష్యం చెప్పిన ఆధునికుల్లో అత్యాధునికుడు

అతడు ఒక చేత్తో అభ్యుదయ భావాల లావాలను అక్షరాల్లో వెదజల్లి కవిత్వపు మంటల్లో గుండెల్ని రగిలించగలడు

మరో చేత్తో కలాన్ని బలంగా కదిలిస్తూ నిర్భయంగా తన భావాలను వెల్లడిస్తూ సాహితీ విమర్శ రాయగలడు.

అతడొక కవి, సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, అటు విద్యార్థులను ఇటు సమాజంలోని ప్రజలను ఏకకాలంలో చైతన్యవంతం చేసే ఉపన్యాసకుడు, అన్నింటికీ మించిన మానవతావాది. ఆయనే రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి..

తెలుగు సాహిత్య విమర్శారంగంలో రాయలసీమ సాహితీ విమర్శకులకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక రాళ్ళపల్లి ఒక పుట్టపర్తి, ఒక కట్టమంచి, ఒక రాచమల్లు ఇలా ఎందరెందరో సాహితీ విమర్శకులు రాయలసీమనుండి పుట్టుకొచ్చారు. వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, సాహితీ విమర్శను కొనసాగిస్తూ 2014 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కైవసం చేసుకున్నారు మార్క్సిస్టు విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. నిబద్ధతకు, నిజాయితీకి, నిలువెత్తు నిదర్శనం ఆయన. నిర్మొహమాటంగా నిక్కచ్చిగా, సాధికారికంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఆయన ఏనాడు వెనకడుగు వేసిందేలేదు. కవిత్వంతోపాటు విమర్శరాసి అందరి ప్రశంసలు అందుకున్న విమర్శకుడాయన. అందుకు కారణాలు లేకపోలేదు. సీమలో వేమన, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, సర్ధేశాయ్‌ తిరుమలరావు, లాంటి ఎందరో విమర్శకులను ప్రేరణగా తీసుకుని ఆయన విమర్శారంగాన్ని ఎన్నుకున్నారు. రా.రా. తర్వాత శూన్యత ఏర్పడిన సంధికాలంలో తెలుగు విమర్శవినీలాకాశంలో తళుక్కున మెరిసిన వేగుచుక్క ఆయన. తెలుగు సాహిత్య విమర్శకు మార్క్సిజం సొబగులద్దిన నిబద్ధత కలిగిన సద్విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి. పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడే పింగళి సూరన ప్రభావతీ ప్రద్యుమ్నం కావ్యాన్ని డాక్టరేట్‌ పట్టాకోసం ఎంచుకుని శిల్పప్రభాతి అన్న అంశంపై సాధికారికమైన పరిశోధన చేశారు. దీని మూలంగా ఆయన తదనంతరకాలంలో కథ, నవల, కవిత్వంపై సాధికారిక విమర్శనా గ్రంథాలెన్నో వెలువరించగలిగారు. ప్రాచీన సాహిత్యాన్ని బాగా చదువుకున్న రాచపాళెం, ఆ సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో చూసే ఒక అరుదైన దృష్టిని అలవరచుకున్నారు. అంతేకాదు దాన్ని తన విమర్శలో ప్రవేశపెట్టారు. అందుకే కచదేవయాని లాంటి చర్చలకు తెలుగు సాహిత్యంలో తెరతీశారు. సర్దేశాయ్‌ తిరుమలరావు రాసిన నూరేళ్ల కన్యాశుల్కమంటే రాచపాళెం గారికి ఎంతో ఇష్టం. అందుకేనేమో గురజాడ కథలపై ఒక మంచి విమర్శాగ్రంథాన్ని వెలువరించారు. అలాగే దళిత, స్త్రీవాద, ముస్లిం అస్తిత్వ ఉద్యమాలను విపరీతంగా ప్రేమించారు. ఆయా ఉద్యమాల, కవులను, రచయితలను ఎక్కువగా అభిమానించారు. వారి రచనలపై ఎన్నో సమీక్షలు, వ్యాసాలు రాసి ప్రోత్సహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన విమర్శలో మార్పులు మనం గమనించవచ్చు. అభ్యుదయం ఆయన హృది, మార్క్సిజం ఆయన విమర్శకు పునాది. అయినప్పటికీ స్థలకాలాను దృష్టిలో ఉంచుకుని విమర్శలు రాశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న మార్పులను పసిగడుతూనే రచయితల వస్తుశిల్పాల్లో వచ్చిన పరిణామాలను కూలంకషంగా పరిశీలించారు. విమర్శలో సంయమనం పాటిస్తూ రాగద్వేషాలకు అతీతంగా విమర్శలు రాసిన ఏకైక విమర్శకుడాయన. ఒకేభావజాలానికి కట్టుబడిన విమర్శకుడైనప్పటికీ ఇతరులను భావజాలపరంగానే విభేదించి, విమర్శించినప్పటికీ ఏ భావజాలం కలిగిన వ్యక్తులనైనా గౌరవించే సంస్కారం రాచపాళెంలో ఉంది. అందుకే ఆయన అజాత శత్రువుగా అందరి ఆదరాభిమానాలు అందుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరంగా సాహిత్య కృషిచేస్తున్న రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డిగారు ఇప్పటివరకు 36 గ్రంథాలు వెలువరించారు. ప్రాచీన ఆధునిక కవులు రచయితల గ్రంథాలపై, వారి జీవిత సాహిత్యాలపై అరుదైన సాహిత్య విమర్శాగ్రంథాలెన్నో వెలువరించారు. ఆయన కలం నుండి వెలువడిన ప్రతి గ్రంథం ఏదో ఒక కొత్త కోణాన్ని, నూతన సత్యాన్ని, ఆవిష్కరించిందంటే అందులో అతిశయోక్తి లేదు. ప్రగతి శీలభావాలు, హేతువాదం, సామాజికస్పృహ, శాస్త్రీయ విజ్ఞానం, ప్రపంచ పరిణామాలు, అభ్యుదయ దృక్పథం, ఆర్థిక సాంఘిక రాజకీయ సాంస్కృతికరంగాల్లో వచ్చిన మార్పులు ఆయన విమర్శలో చూడవచ్చు. ఆ నేపథ్యంలోనే ఒక రచననుగాని, రచయితనుగాని అంచనావేస్తూ వారి రచనలను సమగ్రంగా పరిశీలించి వస్తుశిల్ప రహస్యాలను వింగడిస్తూ, సత్యాసత్యాలను ఆవిష్కరించడం రాచపాళెం విమర్శలో ఉన్న ప్రత్యేకతగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో రచయిత దృక్పథంలో, ఆలోచనా విధానంలో ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానంలో అభివ్యక్తీకరించే నైపుణ్యంలో ఏవైనా లోపాలుంటే సున్నితంగా రచయితల మనసులు గాయపడకుండా సలహాలు సూచనలను ఇస్తూ ప్రోత్సహించడం ఆయన నైజం. అందువల్లనే ఆయన ఒక మంచి విమర్శకునిగా, మార్క్సిస్టు విమర్శకునిగా అన్నివర్గాల మేధావుల మన్ననలు అందుకున్నారు. మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు మంచి విమర్శకుడవుతారనటానికి రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డిగారే ప్రత్యక్ష నిదర్శనం. ఇక ఆయన జీవిత విశేషాల్లోకి వెళితే చిత్తూరుజిల్లా కుంట్రపాక గ్రామంలో 1948 అక్టోబర్‌ 16న ఒక సాధారణ మధ్యతరగతి రైతుకుటుంబంలో రామిరెడ్డి మంగమ్మ దంపతులకు రాచపాళెం జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తల్లి ప్రేమకు దూరమయ్యారు. అయితే పినతల్లి రాజమ్మ ఆయనకు అవ్యాజమైన ప్రేమను పంచిపెట్టి తల్లిలేని లోటును తీర్చింది. అందుకే ఆయన హృదయం దయాపూరితంగా ఉంటుందనీ ఆయన గురించి తెలిసినవారంటారు. సహజంగా ఆయన మృదుస్వభావి.

మానవతావాది. యూనివర్సిటీ ఆచార్యులకున్న అకడమిక్‌ అహంకారం ఆయనలో ఏకోశానా కనిపించదు, అయితే విమర్శలో మాత్రం ఆయన నిజాలు నిర్భయంగా వెలువరించడానికి ఏమాత్రం సంకోచించడు. అదే సుగుణం ఆయనను విమర్శకునిగా అగ్రభాగాన నిలబెట్టింది. కరవు సీమలో చదువుకోవడం చాలాకష్టం. అందునా రైతుకుటుంబాల పిల్లలుచదువుకోవడం మరీ కష్టం. అయితే ఆ కష్టాలే ఒక్కోసారి కసిని, పట్టుదలను పెంచి బతుకు భయంవల్ల బాగా చదువుకోడానికి కారకాలు ప్రేరకాలు కూడా అవుతాయి. రాచపాళెం విషయంలో అదే జరిగింది. ఆయన ఎంతో కష్టపడి చదువుకున్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో తెలుగు సాహిత్యం చదువుకుని అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో లెక్చర్‌గా, ప్రొఫెసర్‌గా, ఆంధ్ర భారతి శాఖాధిపతిగా పనిచేసి 2008లో పదవీ విరమణ చేశారు. అటు తర్వాత 2008 నవంబర్‌ నుండి కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో పనిచేస్తున్నారు. 31 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన పర్యవేక్షణలో 25 మందికి డాక్టరేట్లు, 18 మందికి ఎంఫిల్‌ పట్టాలందుకున్నారు. రాచపాళెంలో ఉన్న మరో పార్శ్వం సంగతి చాలామందికి తెలియదేమో! ఆయన రాసింది జీవితంలో ఆచరించాడు. సామాజిక ఉద్యమాల్లో స్వయంగా పాల్గొన్నారు. తన ఇంట్లోని వారికి కులాంతర మతాంతర వివాహాలు చేసి కులమతాలు లేవని చాటిచెప్పారు. విశ్వవిద్యాలయాల్లో స్మశానాల్లాంటి నిఘంటువులు చూపి, వ్యాకరణాల సర్ప పరిష్వంగంలో విద్యార్థులను బంధించి, పాత భావాల పాతర్లో వేసి పాఠాలు బోధిస్తున్న బోధగురువుల బారినుండి విద్యార్థులను తప్పించారు. తన ఆధునిక భావజాలాన్ని వారిలో ఇంజెక్టుజేసి, వారిని అభ్యుదయ వాదులుగా మలిచారు. ఆధునిక సాహిత్యబోధనా పద్ధతులు ప్రవేశపెట్టారు. అకడమిక్‌ సిలబస్‌లో ఆధునిక సాహిత్యానికి పెద్దపీట వేశారు. అంతకుమించి శిష్యులను అమితంగా ప్రేమించారు. నిరాడంబరంగా జీవించారు. అంతే కాదు వారిలో తానొక చేతనా దీపమై, చైతన్యకెరటమై, అభ్యుదయ ఉద్వేగ తరంగమై ఎగసిపడ్డారు. ప్రగతిశీల భావనా తటాకమై విద్యార్థుల జీవితాలను పచ్చని సాహితీ క్షేత్రాలుగా పల్లవింప జేశారు. రాచపాళెం కేవలం విశ్వవిద్యాలయాలకే పరిమితం కాలేదు. ఆయన సామాజిక బాధ్యతతో అనేక సామాజిక, సాంస్కృతిక దళిత ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి జిల్లా రచయితల సంఘం కవులు రచయితలతో కలిసి జిల్లా అంతటా పర్యటించి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు.

జనవిజ్ఞాన వేదికద్వారా ప్రజల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి కృషి చేశారు. దళిత ఉద్యమాలను బలపరిచారు. ఉద్యమకారులకు తన మద్దతును ప్రకటించారు. ఆయన మంచి వక్తకూడా. ప్రభుత్వ విధానాలను, మేధావులు, కుహనా సంఘసేవకుల అశాస్త్రీయ భావజాలాన్ని తూర్పారబడుతూ ఆయన ఉపన్యసిస్తుంటే సామాన్య ప్రజలు కూడా ఆసక్తితో ఆలకించేవారు. వాస్తవాలను కళ్లముందు నిలిపి, బొమ్మకట్టించి, నిజాలను మార్క్సిజం అద్దంలో చూపించి, ఆయా వర్గాలవారిని నొప్పించక ఒప్పించే విమర్శనాత్మక ధోరణి ఆయన ఉపన్యాసాల్లో ఉండేది.

ఆధునిక కవులపై శ్రీశ్రీ ప్రభావం ఉన్నట్టే అనంత కవులపై రాచపాళెం ప్రభావం ఉంది. అవధాన సీమలో జూపల్లి, ప్రేమ్‌చంద్‌ లాంటి అభ్యుదయ అంగార పుష్పాలు వికసించాయంటే అందుకు రాచపాళెం భావజాల ప్రభావమే కారణం అనడంలో ఎట్టి సందేహం లేదు. శిల్ప ప్రభావతిపై పరిశోధన చేసినా, గుర్రం జాషువాలాంటి కవులపై విమర్శాగ్రంథాలు వెలువరించినా సాహిత్యంపై సాధికారికంగా చర్చలాంటి పుస్తకాలు రాసినా, మన నవలలూ మన కథానికలూ లాంటి విమర్శనా గ్రంథాలు వెలువరించినా… కవులు ఉద్యమాల గురించి ఇంకా అనేకమంది సాహితీ వేత్తలపై వారి రచనలపై వ్యాసాలు రాసినా, ఫ్యాక్షనిజం వస్తువుగా కవిత్వం రాసినా అది ఆయనకే చెల్లుచుంది. సాహిత్యంలో పునర్‌ మూల్యాంకనం అన్నపదానికి ఉన్నవ మాలపల్లె, వట్టికోట ఆల్వారుస్వామి ప్రజల మనిషి, లాంటి నవలలపై, రాచపాళెం రాసిన వ్యాసాల వల్లనే ప్రాచుర్యం వచ్చిందంటే అతిశయోక్తి లేదు. కాళీపట్నం యజ్ఞం, కొలకలూరి ఊరబావి లాంటి కథలపై ఆయన రాసిన వ్యాసాలు సంచలనాత్మక విమర్శాకథనాలుగా భావించవచ్చు. ఇక సాహితీ విమర్శకునిగా రాచపాళెం ఎంత గుర్తింపును పొందారో వ్యక్తిత్వమున్న ఒక మంచి వ్యక్తిగా, మానవతామూర్తిగా ఆయన అంతే కీర్తి గడించారు. వ్యక్తిత్వం లేనివాడు ఎంత గొప్ప కవిత్వం రాసినా విమర్శరాసినా కథలూ నవలలు రాసినా అది శిల్పశోభితం, కీర్తిదాయకం, కావచ్చునేమోగాని సామాజికామోదం పొందదు, అయితే అటు గొప్ప వ్యక్తిత్వంతో పాటు నిఖార్సయిన విమర్శరాసినందుకు రాచపాళెంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు రావడం అందరికీ ఆనందదాయకం. ఆ అవార్డుకు నూటికి నూరుపాళ్లు ఆయన అర్హుడని సాహితీ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. నా రాతలలో రాచపాళెం భావజాల ప్రభావముంది.

 

సాక్షి

andhraprabha –   Mon, 29 Dec 2014, IST

ఒకరు విహారి -జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిరెండోవారు శాలివాహన -త్రిపురారిభట్ల నారాయణమూర్తి

ఇద్దరూ ఎల్‌ఐసిలో పనిచేశారు. ఇద్దరూ కలిసి కథలు రాసి ప్రసిద్ధులయ్యారు. ఇద్దరూ కలిసి ”సాక్షి” అనే కవితా సంపుటి తీసుకువచ్చారు. అయితే ఎవరు ఏ కవిత రాశారో తెలీదు. ఎవరు రాసినా అది ”తిర్పతి వేంకటేయమే” అన్నట్టుగా వీరిద్దరూ రాశారు.

”అక్కడ. శాంతి కపోతాల్ని రాకాసిగద్దలు రక్కుతున్నాయి

అక్కడ న్యాయం ధర్మం తూటాలుగా తుపాకీ గొట్టాల్లో దట్టింపబడుతున్నాయి

అక్కడ పాలకుడు ఆవేశవశువై, పశువై, రాకాసియై వికట నాట్యం చేస్తున్నాడు.

అక్కడ భూతల నరకం సృష్టింపబడుతోంది

అక్కడ నరమేధం వడివడిగా సాగిపోతోంది”

అనే పంక్తులు చదవగానే ఏ దిగంబర కవో విప్లవకవో రాసి ఉంటాడను కొనేలా ఉన్నవి. విహారి శాలివాహనలవే. ”ఖండించడం, పండించడం కవికే చేతనవును. కవి చెడును ఖండిస్తాడు. మంచిని పండిస్తాడు. వీరి కవితల్లో నేను కాంతిమయ భవిష్యత్తు అడుగు జాడలు చూశాను. వీరికలాలు గళాలు జలపాత జలాలవలె చైతన్యవిద్యుత్తును ఉద్భవింపజేస్తున్నాయి.” అన్నారు దాశరథి, అప్పట్లో అభ్యుదయ కవుల్లో, కథకులలో కొందరు మధ్యతరగతి జీవులపై బాగా రచనలు చేశారు. ఈ జంట వచన కవులు కూడా ”మధ్యమ పురుషలో కథనం” అనీ కవి తను ఆంగ్లపదాలలో, వినూత్న శైలిలో రాశారు—

”ఇంక్రిమెంట్‌’కు ‘స్టాగ్నేషన్‌’ వచ్చింది నాకు తెలుసు నువ్‌ ఆడుతున్న రమ్మీలో నీకు ఎక్స్‌టెన్షన్‌ అందటం లేదు.

పదమూడో ముక్క పండటంలేదు

‘ప్రమోషన్‌’ కోర్టులపాలై పోయింది

నాకు తెలుసు

నువ్‌ చేస్తున్న ప్రయోగానికి

ఇదమిత్థమైన ‘ఫార్ములా’ లేదు”

చీట్లపేక గురించి జాషువా నుంచి చాలామంది కవితల్లో పేర్కొన్నారు. ‘నాకు తెలుసు’ అనేది పునరావృతం కావడం నొక్కి చెప్పే శిల్పం (తిలక్‌ నేను చూశాను నిజం.. గా లాగా) బడిపంతుళ్ళ జీవితాలు ఒకప్పుడు ”రూపాయి జీతం పన్నెండు రూపాయల ఖర్చు” లాగా ఉండేది. ఈ వస్తువు పై కవిత రాస్తూ

”జాతికి వెన్నెముక ఉపాధ్యాయుడు

మాట్లాడకుండా కాంపోజిషన్‌ వ్రాయి”

అని ముగించటం విశేషం. ఇలా అలనాడు వచన కవిత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. విహారి శాలివాహనలు వినూత్నంగా ”పద చిత్రాలు” కవిత రాశారు. ఇది ఒక ప్రయోగం. ”నారు పోసిన వాడు నీరు పొయ్యకపోడు” అనే సామెతవుంది. దీన్ని ఆధారంగా చేసుకొని రాసిన కవిత ఇలా ప్రారంభమవుతుంది.—

”నువ్వు చెప్పేది నిన్నటి నీతికావచ్చు

సామెత కావచ్చు

కానీ

ఈనాటి నిజం మాత్రం కానేకాదు

తాతలనాడు పోసిన నీ నారుకు

ఇవ్వాళ నీరందటం కష్టం

ఇండియా -దటీజ్‌ భారత్‌లో

నీటిఎద్దటి లేని పట్నమూలేదు. పల్లెలేదు

క్యూలో కాళ్ళను చచ్చుపరచుకున్నా

అందిన నీరు నీ నారుకు అక్కరకురాదు”

మానవుడు చిరంజీవి అంటూ అక్రమాల చీకటిని చించుకొని వెలుగులోకి వస్తాడనీ ఈ కవులు ఆశించారు.

కాశ్మీర్‌లో గవర్నర్‌ పాలన అనివార్యం?

andhraprabha –   Fri, 9 Jan 2015, IST

కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తావించకుండా బిజెపి జాగ్రత్తపడినా, దానిపైనా,రాష్ట్రంలో అమలులో ఉన్న సైనికులకు ప్రత్యేకాధికారాలు కల్పించే చట్టం ఉపసంహరణపైనా బిజెపి మెత్తబడింది. అయితే ఢిల్లిd ఎన్నికల ప్రచారంలో ఇది బెడిసికొట్టవచ్చు

కనుక పీడీపీతో పొత్తు వాయిదావేయడమే బిజెపి ప్రస్తుత వ్యూహం అయివుండవచ్చు.

కాశ్మీర్‌లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం ఏ పార్టీకీ లేకపోవడం,సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు యత్నాలు ఈసారి సంక్లిష్టంగా మారడంతో గవర్నర్‌ పాలనకు రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వొహ్రా కేంద్రానికి సిఫార్సు చేశారు. రాష్ట్రానికి సంకీర్ణ ప్రభుత్వం కొత్త కాకపోయినా, ఈసారి ఉత్పన్నమైన సంక్లిష్ట పరిస్థితి ఇంతకుముందు ఎన్నడూ కనీవినీ ఎరుగునిది. ప్రభుత్వం ఏర్పాటుకు గత నెల 24వ తేదీ నుంచి జరుగుతున్న కసరత్తు ఒక కొలిక్కి రాకపోవడం,ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఒమర్‌ అబ్దుల్లా విముఖత వ్యక్తం చేయడంతో తప్పని పరిస్థితుల్లో గవర్నర్‌ సిఫార్సు చేశారు. రాజ్యాంగంలో నిర్దేశించిన గడువు ప్రకారం పార్టీలకు గడువు ఇవ్వడం తప్ప గవర్నర్‌ చేయగలిగిందేమీ లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా కాశ్మీర్‌ విషయంలో ఏమాత్రం తొందరపాటును ప్రదర్శించకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం,ఇండిపెండెంట్లకు ఎరవేయడం వంటి చర్యలకు పాల్పడకుండా తమతో జత కట్టేందుకు ముందుకు వచ్చిన పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ)తోనే సంప్రదింపులు సుదీర్ఘంగా జరిపింది.ఈ సంప్రదింపుల్లో పీడీపీ కోరిన వరాల్లో చాలా మటుకు అంగీకరించినా ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కాలేదంటే,పైకి చెప్పని కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమోనన్న అనుమానం కలగడం సహజమే.

ముఖ్యంగా,కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తావించకుండా బిజెపి జాగ్రత్తపడినా,దానిపైనా, రాష్ట్రంలో అమలులో ఉన్న సైనికులకు ప్రత్యేకాధికారాలు కల్పించే చట్టం ఉపసంహరణపైనా బిజెపి మెత్తబడింది. అయితే ఢిల్లిd ఎన్నికల ప్రచారంలో ఇది బెడిసికొట్టవచ్చు కనుక పీడీపీతో పొత్తు వాయిదావేయడమే బిజెపి ప్రస్తుత వ్యూహం అయివుండవచ్చు.

పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బిజెపి వివాదాస్పద విషయాలను పక్కన పెట్టాలని నిర్ణయించినా ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీకీ,పీడీపీకి వచ్చిన సీట్ల తేడా మూడు మాత్రమే.బీజేపీకి 25 సీట్లు,పీడీపీకి 28 సీట్లు వచ్చాయి. అయినప్పటికీ,పీడీపీ సీనియర్‌నాయకుడు ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌కి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు,కీలకమైన మంత్రి పదవులను ఆ పార్టీకి ఇచ్చేందుకు బిజెపి సిద్ధపడింది.కాశ్మీర్‌ లోయలో పీడీపీకి ఎక్కువ సీట్లు రావడం వెనుక వేర్పాటువాద సంఘాల సమాఖ్య అయిన హురియత్‌ కాన్ఫరెన్స్‌ మద్దతు ఆ పార్టీకి ఉందన్న విషయం బహిరంగ రహస్యమే.కనుక,పీడీపీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేదనీ,పైగా ఎప్పటికప్పుడు కొత్త షరతులు పెడుతుందని ఊహించడం కష్టమేమీ కాదు.గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరడుకట్టిన ఉగ్రవాదులను జైళ్ళ నుంచి విడుదల చేసింది.ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ఉభయ కాశ్మీర్‌లకు ఉమ్మడి కరెన్సీ ఉండాలని డిమాండ్‌ చేసేవారు. ఆక్రమిత కాశ్మీర్‌కు బస్సు సర్వీసును ప్రవేశపెట్టడంలో ఆయన ఒత్తిడి ఉందన్న వార్తలు అప్పట్లోవచ్చాయి.సరిహద్దురాష్ట్రం కనుక కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు పట్టువిడుపుల వైఖరిని ప్రదర్శించాలని అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది.అప్పట్లో పీడీపీ కన్నా కాంగ్రెస్‌కి ఎక్కువ సీట్లు వచ్చినా,ముఖ్యమంత్రి పదవిని వంతులవారీగా పంచుకునేందుకు అంగీకరించడమే కాకుండా,మొదటి అవకాశం ముఫ్తీకే ఇచ్చింది.ఇప్పుడు కూడా పీడీపీతో బిజెపి చర్చల్లో ఇలాంటి సర్దుబాట్ల ప్రతిపాదనలు వచ్చినట్టు,వాటిలో చాలా మటుకు బిజెపీ అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి.పీడీపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ,బిజెపి తరఫున ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి రాం మాధవ్‌లు అనేక దఫాలు చర్చలు జరిపారు.గవర్నర్‌ని తమ మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో సహా కలుసుకున్నారు.వారు కోరిన గడువును గవర్నర్‌ ఇచ్చారు.ఆ గడువు లోగా ప్రభుత్వాన్ని వారు ఏర్పాటుచేయలేకపోయారు.మరో వంక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్‌ వైదొలగేందుకు ఒత్తిడి తెచ్చారు.సరిహద్దుల్లో ఆవలి వైపు నుంచి పాక్‌ సైనికులు ఈనెల ఒకటవ తేదీ నుంచి నిరవధికంగా కాల్పులు జరుపుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో పటిష్టమైన, శాశ్వతమైన ప్రభుత్వం అధికారంలో ఉండాల్సిన అవసరంఎంతైనా ఉంది,ఈ విషయాన్ని కూడా ఒమర్‌ అబ్దుల్లా గవర్నర్‌తో తాను జరిపిన చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించినట్టు చెప్పారు.

అంతేకాక, ప్రస్తుత అసెంబ్లిd కాలపరిమితి ఈనెల 19వ తేదీతో ముగియనున్నందున ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. పీడీపీ,బీజేపీల మధ్య ఈలోగా పొత్తు కుదిరే అవకాశాలు కనిపించకపోవడం వల్ల గవర్నర్‌ పాలనకు వొహ్రా సిఫార్సు చేసి ఉండవచ్చు.రెండు పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏర్పాటుకు చొరవ చూపిన పార్టీపై ఉందంటూ పీడీపీని పరోక్షంగా ఒమర్‌ ఎత్తిపొడిచారు.పీడీపీతో వ్యవహారం తొందరగా తేలదని కూడా ఆయన పరోక్షంగా ఎద్దేవా చేశారు.

పీడీపీ,నేషనల్‌ కాన్ఫరెన్స్‌ల మధ్య రాజకీయ వైరం సంగతి అలా ఉంచితే,రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉన్న మాట నిజమే.పాక్‌ కవ్వింపు కాల్పుల వ్యవహారం అటుంచి,రాష్ట్రంలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల కొనసాగింపు కోసం పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడాలి.ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ పార్టీలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశాయి.వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు గవర్నర్‌ పాలనలో అమలు జరపగడమూ వాంఛనీయం కాదు.ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలోనే అవి అమలు జరిగినప్పుడే, బాధితుల గోడు పట్టించుకున్నట్టు అవుతుంది.ఈ నేపధ్యం నుంచిచూస్తే,గవర్నర్‌ సిఫార్సు చేసింది రాష్ట్రపతికే అయినప్పటికీ,కేంద్రాన్ని సంప్రదించకుండా ఆయన నిర్ణయం తీసుకోరు కనుక,కేంద్రం ఎటువంటి వైఖరి తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.ఈ విషయమై కేంద్రం రేపోమాపో నిర్ణయం తీసుకోవచ్చు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అస్పృశ్యత-బ్రాహ్మణిజం శ్రీ అరవిందరావు –

అస్పృశ్యత-బ్రాహ్మణిజం
ప్రపంచంలోని రెండు బలీయ సంస్కృతుల మధ్య పోటీతత్త్వం. దానిలో భాగంగా మతమార్పిడులు, దేశభద్రతపై దాని ప్రభావం అనే విషయాన్ని గత వ్యాసంలో కొంత చూశాం. మతమార్పిడులపై ప్రస్తుతం జరుగుతున్న వివాదాల జోలికి పోకుండా వాటి కారణాలను పరిశీలించి మనం ఆత్మవిమర్శ చేసుకోవల్సిన విషయం ఒకటి ప్రముఖంగా కనిపిస్తుంది. ఇదే అస్పృశ్యత, సామాజిక, ఆధ్యాత్మిక అసమానత.
మనిషికి ఆహారం, నీరు ఎంత నిత్యావసరాలో మత విషయంలో సమానత కూడా అంతే అవసరం. తానున్న వ్యవస్థలో ఈ సమానత దొరకనప్పుడు అతడు తన వ్యవస్థ నుండి మరొక వ్యవస్థలోకి వెళతాడు. మతమార్పిడిపై ఇతరుల ప్రచారం కొన్ని వర్గాలపైనే ఎక్కువ ప్రభావం ఎందుకు చూపగలిగింది అనడానికి కారణం ఆ వర్గాలు ఈ సంస్కృతిలో భాగంగా భావించుకోకపోవడమే.
అస్పృశ్యత, వర్ణవ్యవస్థ గురించి ఎలాంటి వివరణ ఇవ్వడానికి ముందు మొట్టమొదటగా హిందూసమాజం అసమానతకు గురైన ఈ వర్గాలతో క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం మతమార్పిడుల దృష్టితో కాదు. మన ఉపనిషత్తులలో చెప్పిన సంస్కారం దృష్ట్యా ఇది అవసరం. ఇతర సంస్కృతుల వారు మనల్ని తప్పుపట్టడానికున్న ఒకే ఒక అంశమిది. దురదృష్టవశాత్తూ మన సంస్కృతికి వ్యవస్థాగత నిర్మాణం (Organizational structure)లేకపోవడం వల్ల ఈ పనిని ఎవరు చేయాలి అనే ప్రశ్న వస్తుంది. దీన్ని బహుశా హిందూ సమస్యల్ని గూర్చి చర్చించే వి.హెచ్‌.పి. లాంటి సంస్థలు సాధు పరిషత్తుల ద్వారా చేయించడంపై ఆలోచించాలి.
అస్పృశ్యత అనే పేరు మనుస్మృతిలో కానీ, భారతం, రామాయణంలలో కానీ మరే ఇతర స్మృతిలో కానీ కనిపించడం లేదు. చండాలుడు అనే పదం ఉంది కానీ అది ఈనాడు మనం ఎస్‌.సి.లుగా భావించే వర్గాన్ని ఉద్దేశించి చెప్పింది కాదు. బ్రాహ్మణసీ్త్రకి, శూద్రుడితో కలిగిన సంబంధం వల్ల పుట్టినవాళ్లని చండాలురనీ, వారిని దూరంగా పెట్టాలనీ స్మృతుల్లో చెప్పారు. వీరిని శూద్రులలో భాగంగానే చెప్పారు. ఇది క్రమక్రమంగా ఇప్పుడు మనం చెప్పుకునే ఎస్‌.సి. వర్గాలకు ఎలా అన్వయించడం జరిగిందో చరిత్రకారులు పరిశీలించాల్సి ఉంది. భరతఖండంలో ఒకే సంస్కృతి ఉన్నంతకాలం ఈ వర్గాలవారు ఈ సంస్కృతిలో ఉన్నా ఇతర సంస్కృతులతో సంపర్కం కలిగిన తర్వాత వాటిలోకి క్రమక్రమంగా వెళ్ళడం జరిగింది. ఒకవైపు నుండి వెలివేత. మరోవైపు నుండి ఆహ్వానం- దీని పరిణామం చెప్పాల్సిన పనిలేదు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాంఘిక అసమానతలను తొలగించడానికి చట్టాలు వచ్చాయి. హిందూ మత పెద్దలు కానీ, సమాజం కానీ ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. చరిత్రలో ఏ శతాబ్దంలో గమనించినా సంఘంలో సంస్కరణల్ని మొట్టమొదట ప్రవేశపెట్టినవారూ, సమర్థించిన వారూ బ్రాహ్మణవర్గాలే. ప్రస్తుత వ్యవస్థలో ఎస్‌.సి. అధికారుల్ని ఎలాంటి అభ్యంతరం లేకుండా పూర్ణకుంభాలతో స్వాగతం చెప్పేది బ్రాహ్మణ పూజారులే. సామాజిక మార్పును పూర్తిగా అవగాహన చేసుకున్నవి బ్రాహ్మణ వర్గాలే. నగర ప్రాంతాల్లో అసమానతలు పూర్తిగా అంతరించినా, గ్రామాల్లో ఇలాంటివి దేవాలయ ప్రవేశం మొదలైన సందర్భాల్లో ఇంకా ఉంది. గ్రామాల్లో కూడా మార్పు తేవడానికి చాలా సంస్థలు కృషి చేస్తున్నాయి.
అస్పృశ్యతకూ, బ్రాహ్మణవర్గాలకూ సంబంధాన్ని కల్పించడం, కేవలం బ్రాహ్మణ వర్గాన్ని మాత్రమే గురిపెట్టి నిందించడం, ఒక వ్యూహంలో భాగం. హిందూమతాన్ని అంతో ఇంతో ఆచరిస్తూ ఇతరులతో ఆచరింపజేస్తున్నది బ్రాహ్మణవర్గమే. ఈ కొద్దిపాటి అడ్డంకి కూడా తొలగిపోతే చాలా సులభంగా తమ సంస్కృతిని వ్యాపింప చేయవచ్చనే భావంతో ఈ వ్యూహాన్ని అమలు చేయడాన్ని స్పష్టంగా గమనించవచ్చు. ఈ ప్రణాళికతోనే కొందరు మేధావులు ‘బ్రాహ్మనిజం’ అనే పదాన్ని ప్రతి సందర్భంలోనూ వాడుతూ ఒక వర్గం పట్ల ద్వేషం రెచ్చగొట్టే రచనలు చేయడం బాధాకరం.
చరిత్ర పాఠ్యపుస్తకాలు వ్రాసేవాళ్లు ఎన్ని విషయాలను దాచినా అనేకమంది మేధావులు చరిత్రలోని అన్ని కోణాలనూ పరిశీలించి వాస్తవాలు వ్రాసారు. భారతదేశ చరిత్రలో ముఖ్యంగా పదవ శతాబ్దం తర్వాత సమాజంలోని అన్ని వర్గాలకంటే ఎక్కువ హింసను ఎదుర్కొన్నవారు బ్రాహ్మణులు, రాజులు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నా కేవలం రెండింటిని మాత్రం చెబుతాను. హిందుత్వవాదుల రచనల్ని పక్కనబెట్టి అంబేద్కర్‌ వ్రాసిన “Revolution and Counter-Revolution in india ‘ అనే పుస్తకాన్ని చూస్తే ఇస్లాం దండయాత్రల ప్రారంభ కాలంలో పురోహిత వర్గాలపై దాడి ఎలా జరిగింది. బౌద్ధం ఎలా నశించింది. హిందూమతం ఎలా నిలదొక్కుకుంది అనే విషయంపై ఆయన ఇలా వ్రాశారు. “The Buddhist priesthood perished by the sword of islam and could not be resusciated.On the other hand it was not possible for islam to annihilate the brahmanic proesthood”.
బౌద్ధపండితులు ముఖ్యంగా ఒకేచోట, అంటే వాళ్ళ ఆరామాలలో ఉండటం వల్ల చాలామంది హతమయ్యారు. పుస్తకాలు కాల్చివేయబడ్డాయి. కొందరు టిబెట్టుకు పారిపోయారు. హిందూమతంలో వేదాల్నీ, మిగతా శాసా్త్రల్నీ పుస్తకరూపంలో వ్రాయకపోవడం, కేవలం కంఠతాపెట్టడం, ప్రతి బ్రాహ్మణుడూ తన వేదశాఖను నేర్చుకోవడం వల్ల గ్రామగ్రామాల్లో ఉన్న పండితులందరినీ నిర్మూలించలేకపోయారని ఇదే సందర్భంలో అంబేద్కర్‌ వివరించారు.
“Donald lach ‘  వ్రాసిన “Asia in the Making of Europe” అనే పుస్తకం మూడు వాల్యూముల్లో ఉంది. మొదటి వాల్యూములో పదహారవ శతాబ్దం చివర్లో ఫ్రాన్సిస్‌ జేవియర్‌ అనే మత ప్రచారకుడు గోవాలో బ్రాహ్మణులపై సాగించిన హింసాకాండ వర్ణింపబడింది. ఈ వర్గాన్ని నాశనం చేస్తే తప్ప తమ మతాన్ని వ్యాపింపజేయలేమంటూ ఈయన స్పెయిన్‌లో ఉన్న రాజుకు లేఖ పంపాడు. బ్రాహ్మణుల్ని చాలామందిని చంపడం, చేతులు తెగకొట్టడం జరిగింది. దాని స్మృతిచిహ్నంగా ఈనాటికీ పాత గోవాలో ఒక స్తూపం ఉంది. ఈ వివరాలు చాలా మటుకు ఇంటర్నెట్‌లో కూడా లభిస్తాయి. ‘బ్రాహ్మనిజం’ అనే భావనకి ఇతడే మూలం. తర్వాతి కాలంలో ఈ వ్యూహాన్నే ఇతరులు అనుసరించారు. మాసిన పంచ కట్టుకుని షర్టు లేకుండా పగలంతా గుడిలో నిల్చుని ఉండే బ్రాహ్మణుడంటే అందరికీ కనికరమే ఉంటుంది. ఈ బ్రాహ్మణులకు పెళ్లిళ్లు కూడా కావడం లేదు. ఇలాంటి పేద బ్రాహ్మణుడు మన మేధావికి వర్గ శత్రువు. భారతదేశంలో వెనుకబడ్డ వర్గాలవ్యక్తి ప్రధానమంత్రి కావచ్చు కానీ పూజారి కాలేడు అంటూ వ్రాస్తూంటారు. ఇది చాలా బాధాకరం.
ఇటీవలి వరకూ బ్రాహ్మణుడికి అంటరానితనం ఇంట్లోనే మొదలయ్యేది. మడిబట్ట కట్టుకుని వంటచేసే తల్లిని లేదా పూజచేస్తున్న తండ్రిని పిల్లలు ముట్టడానికి వీలులేదు. తాము పవిత్రంగా ఒక పనిని చేస్తున్నామనే భావన వారిలో ఉండటమే దీనికి కారణం. అలాగే తాము ఎవరినైనా ముట్టుకున్నపుడు ఇంటికి వెళ్ళి చన్నీళ్ళ స్నానం చేసారే కానీ మరేమీ చేయలేదు. ప్రస్తుతం ఇలాంటి వాతావరణం కూడా లేదు. ప్రపంచంలో మిగతా దేశాల్లో అంటరానితనం పాటించలేదు గానీ మతప్రచారంకోసం ఇతర దేశాలపై దాడులు చేసి మనుషుల్ని బానిసలుగా బంధించి తీసుకెళ్ళారు. మార్కెట్‌లో వేలం వేశారు. కాళ్ళకు సంకెళ్లు వేసి కొరడాలతో హింసించారు. తమ సిద్ధాంతాన్ని నమ్మని లక్షలాదిమందిని మంటల్లో కాల్చివేశారు. చరిత్ర చదవకపోవడం మనకు ప్రమాదకరం.
అనాదిగా సమాజంలో పేదరికాన్ని అనుభవిస్తూ చరిత్రలో ఎన్నో హింసల్ని అనుభవించిన నేపథ్యంలో అంటరానితనాన్ని బహిష్కరిస్తే మొట్ట మొదటిగా స్వాగతించేది బ్రాహ్మణవర్గాలే.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నైజీరియాలో నర మేధం- ఫ్రాన్స్ లో కల్లోలం – ధోనీ మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దర్శనీయ దైవ క్షేత్రాలు -కవర్ పేజీలు

Watch Live
దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ –

inner cover3 001 inner cover4 001 kshetra book 1 001 kshetra book2 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గాడ్సే గుడి – గొల్లపూడి మారుతీరావు

గాడ్సే గుడి

గాడ్సే గుడిగొల్లపూడి మారుతీరావు

జీవన కాలమ్
గాడ్సే జాతిపితని హత్య చేశాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది.
శిక్ష అమలయింది. సమాజమంతా సమర్థించని నెగిటివ్ దేవుళ్లు వీరు.
మరి కుష్బూ గుడినీ సమాజమంతా సమర్థించదు కదా!
అఖిల భారత హిందూ పరి షత్ ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూ ర్‌లో జాతిపిత హంతకుడు గాడ్సే స్మృతికి ఒక దేవాలయా న్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించా రు. గాడ్సే మేనకోడలు హిమా నీ సావర్కర్ దాచిపెట్టిన గాడ్సే చితాభస్మాన్ని పుణే నుం చి తీసుకువచ్చి ఈ ఆలయం లో భద్రపరుస్తారని ఉన్నావ్ నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు సాక్షి మహరాజ్ ప్రకటించారు.
జాతిని నడిపించే నాయకుడిని ‘దేవుడి’ని చేయడం ఈ దేశపు ప్రాథమిక విశ్వాసాలకు మూల సూత్రం. దీనికి న్యూరో-సోషియో కాంప్లెక్స్ అని ఒకాయన నామ కరణం చేశారు.
ఒక దశలో విశ్వాసం, అభిమానం కూడా మైకమే. ప్రశంసించి, అభిమానించి, ఆరాధించి, ఆఖరికి దేవుడిని చేసి, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ట చేసి సంతోషపడతాం. మన దేశంలో గుడులు బోలెడు. శంబల్‌పూర్‌లో గాంధీ జీకి గుడి ఉంది. కర్ణాటకలో రజనీకాంత్‌కి గుడి ఉంది. తిరుచినాపల్లిలో కుష్బూకి గుడి ఉంది. తిరునల్వేలిలో నమితా అనే నటీమణికి గుడి ఉంది. బుందేల్‌ఖండ్‌లో మాయావతికి గుడి ఉంది. దక్షిణ కలకత్తాలో అమితాబ్ బచ్చన్‌కి గుడి ఉంది. ఇందిరాగాంధీకి బోలెడు గుడులు ఉన్నాయి. తెలంగాణను ప్రసాదించినందుకు నాటి శాస నసభ్యులు శంకరరావుగారు సోనియాను ‘తెలంగాణ దేవత’గా అభివర్ణిస్తూ గుడి నిర్మించారు. మన దేశంలో సచిన్ తెండూల్కర్ దేవుడు. ఒక ప్రాంతాన్ని సస్యశ్యా మలం చేసి, తరతరాల జీవన ధోరణినే మార్చిన సర్ ఆర్థర్ కాటన్ దేవుడు. ఓట్లతో గెలిచిన రాజకీయ నాయ కుడు దేవుడు.
అయితే రాజీవ్‌గాంధీ మారణహోమానికి కారణమ యిన శివరాసన్‌ని మహా త్యాగమూర్తి అని తమిళ నాడులో ఊరేగింపులు జరిపారు. ఇందిరాగాంధీని కాల్చి చంపిన బియంత్‌సింగ్, సత్వంత్‌సింగ్‌లను అమృత్ సర్‌లో అఖల్‌తఖ్త్ (సిక్కుమత ప్రధాన పీఠం) అమర వీరులుగా గుర్తించి, అక్టోబర్ 31న అంటే, బియంత్ సింగ్‌ను ఉరి తీసిన రోజును స్మారకదినంగా పండుగ చేస్తోంది.
ఒక మతం అంగీకరించి, హత్యని ఆత్మత్యాగంగా గుర్తించిన సందర్భమది. ఒక ప్రధాని మారణహోమాన్ని ఒక వర్గం నెత్తిన పెట్టుకుని కుట్రదారుడిని వీరుని చేసిన సందర్భం శివరాసన్ అనే హంతకుడికి నివాళి. గాడ్సే జాతిపితని హత్య చేశాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది. శిక్ష అమలయింది. సమాజమంతా సమ ర్థించని నెగిటివ్ దేవుళ్లు వీరు. మరి కుష్బూ గుడినీ సమా జమంతా సమర్థించదు కదా! వీరు మైనారిటీ దేవుళ్లు. మొదటిరకం దేవుళ్లు వ్యవస్థ మీద తిరుగుబాటు దేవుళ్లు.
ఒక ఉదాహరణ.
గురువుగారు సిగరెట్లు కాల్చడం నేరం అని బోధించారు. మీకు గురువుగారి మీద అంతులేని కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఎలా ప్రకటించాలి? గబగబా నాలుగు సిగరెట్లు కాల్చి, సిగరెట్లు కాల్చానని గురువుగారి ముందు బోర విరిచారు. ఇప్పుడేం చేస్తారు? పర్యవసానం కాదు, కేవలం ఆ చర్యే తన ‘తిరుగుబాటు’కి ఉపశమనం. ఈ నెగిటివ్ గుడుల లక్ష్యం అదే.
మాయావతి, కుష్బూ, అమితాబ్ బచ్చన్, రజనీ కాంత్‌ల గుడులు కూడా ఒక వికారమే. శివరాసన్, బియంత్‌సింగ్, గాడ్సేల గుడులు వికారానికి ఆవలిగట్టు.
కొందరికి దేవుడు ఆరోగ్యకరమైన ఆలోచనల పర్య వసానం. మరికొందరికి తమ ఆలోచనలకు అద్దం పట్టని వ్యవస్థని నిర్మూలించినందుకు దేవుడు. ఏ దేవుడు మీకిష్టం?
విశ్వాసానికి ఏది అంగీకరించడానికి యోగ్యమైన కొలమానం? నలుగురి నమ్మకాన్ని ఆకాశంలో నిలిపిన మెజారిటీ విలువా? పదిమంది కోపానికి కారణమయిన ఒక మైనారిటీ భావించే అన్యాయమా?
శిష్ట సమాజానికి ఒక నియతి ఉంది. నలుగురితో చావు- అది అవాంఛనీయమైనా- అది పెళ్లి. ఒక్కడితో చావు- అది అతనికి సహేతుకమైనా- ప్రమాదకరమైన చావు. ఈ కొలబద్దతో చూస్తే గాంధీని చంపిన గాడ్సే నేరాన్ని‘పొరపాటు’ అని సరిపెట్టుకుని గుడి కట్టే సాక్షి మహరాజుల చర్య భయంకరమైన, ప్రమాదకరమైన అవినీతి. నీకు నచ్చకపోతే వేంకటేశ్వరస్వామికి దండం పెట్టకు. రజనీకాంత్‌కి గుళ్లో హారతి ఇవ్వకు. ఇబ్బంది లేదు. కాని సమాజం- అది నీకు సబబుగా కనిపించక పోయినా- తిరస్కరించిన హంతకుడిని ‘దేవుడి’ని చేసే హక్కు నీకులేదు. ఇది బియంత్‌సింగ్‌కీ వర్తిస్తుంది. శివ రాసన్‌కీ వర్తిస్తుంది. గాడ్సేకీ వర్తిస్తుంది. మా మిత్రుడి మాటల్లో ఇది న్యూరో- సోషియో డిజార్డర్. గుడి సంగతి తర్వాత- ముందు ఈ గుడి నిర్మాతలకి వైద్య సహాయం కావాలి.

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

పి.ఆర్. జూనియర్ కళాశాల (కాకినాడ) పునరుద్ధరణ కార్యక్రమం రెండవ విడత ఈ నెల ప్రారంభం

పి.ఆర్. జూనియర్ కళాశాల (కాకినాడ) పునరుద్ధరణ కార్యక్రమం రెండవ విడత ఈ నెల ప్రారంభం

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

ఇటీవల మేము ప్రకటించినట్లుగా పి.ఆర్. జూనియర్ కళాశాల (కాకినాడ) రెండవ విడత భవన పునర్నిర్మాణ కార్యక్రమం ఈ నెలాఖరులోగా  ప్రారంభం అవుతుంది అని మీకు తెలియజేయడానికి ఆనందంగా ఉంది. మా విన్నపాలని మన్నించి సహృదయంతో భారత దేశంలోనూ, అమెరికాలోనూ అనేక ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ రెండు విడతల రిపేర్ల పనులకూ కలిపి సుమారు  20 లక్షల రూపాయల విరాళాలను అందించిన ఈ క్రింది దాతలకు మా బృందం తరఫునా, కళాశాల యాజమాన్యం, విద్యార్థినీ, విద్యార్థుల తరఫునా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా వారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం.

ఇప్పుడు మొదలుపెడుతున్న Quadrangale Hall పునర్నిర్మాణం పనులలో అనుకోని అదనపు ఖర్చులు, రాబోయే మూడు నెలల “బీద విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం” అమలుకూ అదనపు విరాళాలని స్వాగతిస్తున్నాం. (సుమారు $5000). ఈ పథకాన్ని ప్రిన్సిపాల్ గారి కోరిక మీద మొదలుపడుతున్నాం. ఏ దేశం నుంచి అయినా విరాళాలు on-line లో ఈ క్రింది లంకె ద్వారా పంపించవచ్చును.

https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=MSV3XK94WDYRE

We sincerely thank the following kind hearted donors for their generosity & support for this PRGC Junior College Renovation Project ( As of January 5, 2015)

  • Grand Sponsors: (సార్వభౌమ పోషకులు): సుమారు $5000 ( Rs. 3 Lacs)

నల్లపరాజు బంగార రాజు (New Delhi), యండమూరి రవీంద్ర నాథ్ (హైదరాబాద్), ధూళిపాళ సీతారామయ్య (బెంగుళూరు)

  • Grand Benefactors: (చక్రవర్తి పోషకులు) : సుమారు $2500 (Rs. 1 Lac)

కూనపులి వారి కుటుంబం, ఇవటూరి సోదరులు , భారతి సిద్దవరపు, దేశరాజు కృష్ణబాబు & సీత (Houston, TX), చావలి రామసోమయాజులు & బాల (Houston, TX), చెరుకూరి పద్మనాభం (Bloomfield Hills, MI), సూర్యనారాయణ గొర్తి (Redmond, WA) & రావు భమిడిపాటి.

  • Grand Patron (మహారాజ పోషకులు): సుమారు $1000 (Rs. 50000)

వేణుగోపాలరావు కలపటపు & లక్ష్మి (Houston, TX), శంకర్ ప్లంజేరి & రాజ్యలక్ష్మి (Houston, TX), శ్రీనివాస్ చావలి (Redmond, WA), రమాకాంత్ చలికొండ (North Brunswick, NJ),

ప్రొఫెసర్ రవీంద్ర విప్పర్తి.

  • Patron (రాజ పోషకులు) సుమారు $500 (Rs. 25000)

(స్వర్గీయ) ములుకుట్ల అచ్యుత రామయ్య, ప్రకాశ రావు అనంతనేని  (Richmond, TX), కృష్ణ ఆర్జా  (Samamish, WA), మధు పెమ్మరాజు (Houston, TX),

ఉమా భారతి కోసూరి & మురళి (Houston, TX), టి. ప్రసాద్

  • Grand Supporters (యువరాజ పోషకులు) : సుమారు $250 (Rs.10000)

చంద్రశేఖర్ బాదం, సుందర రావు బాదం, శ్రీరామారావు అడబాల, Esather Caroline

రవికాంత్, బి. సత్యనారాయణ, U. శ్రీనివాస్, ఇ.వి.ఎస్. రామకృష్ణ , జే.ఎస్.ఆర్. శేఖర్, మాధవ్ దుర్భా (Atlanta, GA), హరి & సవిత మద్దూరి (Austin, TX),  కృష్ణ కామాక్షి శిష్ట్లా (Henderson, NV), డా. షణ్ముఖ రామ్, కే. సత్యానందం, శ్రీమతి వాణి.

  • Supporters (సామంత రాజ పోషకులు) : సుమారు $100 (Rs.5000)

కె. నాగేశ్వర రావు, ఎస్. లలితా దేవి, ఆర్. శేషు, డా. ఎస్.వి. రమణ, బాదం నాగేశ్వర రావు, ద్రోణంరాజు శ్రీరామకృష్ణ (Woodridge, IL.), సత్యవాణి వాడ్రేవు (Chicagao, IL), మాధురి, రామలింగ శర్మ దంతుర్తి (Elizabeth Town, KY),వేముల రావు,  రమేష్ వడ్లమాని, కట్టా మూర్తి, బాబు మారెళ్ళ ,  సురేష్ వేమూరి,        నారాయణ గరిమెళ్ళ,      రాయవరపు ఆదినారాయణ రావు,  జే. పెద్దిరాజు, సుభద్ర & సత్యనారాయణ గవరసాన,  పాండురంగా రావు & రమ తడికమళ్ళ, వై.వి. భాస్కర్, డా. ఆర్. మధు, డా. పి. ఎస్. రామకృష్ణ.

ఈ పట్టికలో ఏమైనా పొరపాట్లు దొర్లినా, ఎవరి పేరు అయినా మర్చి పోయినా మమ్మల్ని మన్నించి, ఆ సమాచారం మాకు తెలియపరచండి…

భవన పునర్నిర్మాణం పూర్తి అయిన తరువాత ఫొటోలు, దాతల సూచించిన విధంగా కళాశాల ప్రాంగణంలోనూ, భవనాల మీదా గుర్తింపు వివరాలతో మరొక నివేదిక సమర్పిస్తాం.

దాతల సత్వర స్పందనకు, దాతృత్వానికి  మరొక్క సారి ముందుగానే మా ధన్యవాదాలు.

For more information, please contact any of the following volunteers.

 

Sincerely,

 

వంగూరి చిట్టెన్ రాజు: (Houston, TX)

Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com

Chandra Turaga (Kakinada):

e-mail: cturaga@nhsiusa.com,  Phone: 093913-87368

YSN Murthy: (Kakinada)

E-mail: murtyyenamandra@yahoo.com

Dr. Murty Mutyala (Houston, TX.),

E-mail: mutyala41@yahoo.com

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శుభ్రతపై ప్రజలలో మొదటిసారిగా అవగాహన కలిగించడానికి ప్రయత్నించినది శ్రీ యన్ టీ రామారావు !

శుభ్రతపై ప్రజలలో మొదటిసారిగా అవగాహన కలిగించడానికి ప్రయత్నించినది శ్రీ యన్ టీ రామారావు !

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ  ‘తెలుగు వెలుగు” మాస పత్రిక  మార్చి, 1986 (సంచిక 1 సంపుటి 3) నుంచి :

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గుంటుపల్లి బౌద్ధ క్షేత్రం -బుద్ధభూమి -జనవరి

guntupalli3 001 guntupalli4 001 guntupalli5 001 guntupalli6 001 undavalli1 001 undavalli2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాపకాల కవులు… వాయనాల రచయితలు – –”సాహిత్య తలంటి ”-జయధీర్ తిరుమలరావు

ప్రాపకాల కవులు… వాయనాల రచయితలు

  • – జయధీర్ తిరుమలరావు, 9951942242
  • 05/01/2015
TAGS:

సాహిత్యం – విమర్శ : కొన్ని ఆలోచనలు

వర్తమానంలో సాహిత్యానికి కాలం దగ్గరపడుతోందా అనిపిస్తుంటుంది. దూరం కానున్నదా అనికూడా అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది కొందరికి.
వాస్తవానికి ఎన్నడూ లేనంతగా సాహిత్యం ఎక్కువగా ప్రచారం అవుతున్న కాలం కూడా ఇదే. అచ్చు అనే చట్రంలోంచి బయటపడి అక్షరం అంతరిక్షయానం చేస్తున్నది. క్షణాలలో లోకంలోని కోటానుకోట్ల మంది జేబు ఫోనుల్లో ప్రత్యక్షం అవుతున్నది. వెబ్‌సైట్లలో, బ్లాగుల్లో, చివరకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతున్నది. ఒక అతిపెద్ద దినపత్రిక తప్ప రెండు రాష్ట్రాలలో ఏడు ఎనిమిది దినపత్రికల సాహిత్య పేజీలు వెలువడుతున్నాయి. ఓ అతి పెద్ద దినపత్రికలో సాహిత్య పేజీ లేని లోటు తీర్చడానికా అన్నట్లు ఒక మాసపత్రిక ప్రారంభించి భాషా సాహిత్య రంగాలకు తనదైన రీతిలో ఊతం ఇస్తున్నది. ఆదివారం ఆంగ్ల దినపత్రికల ప్రత్యేక సంచికలలో సాహిత్యం గురించి, పుస్తకాల గురించి చాల వ్యాసాలు వెలువడుతున్నాయి. ఐనా చాలామందికి సాహిత్యానికి రోజులు దగ్గరవుతున్నాయా అని ఎందుకు అనిపిస్తున్నది? అందుకు గల కారణాలు ఏమిటి?
ప్రింట్ మీడియాతో పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే వెబ్‌సైట్లు, ఇ-పత్రికలు, బ్లాగులు, చివరకు సోషల్ మీడియాలో సైతం లక్షల సంఖ్యలో సాహిత్య పేజీలు పాఠక లోకానికి అందుతున్నాయ. ఇవేకాకుండా పుస్తకావిష్కరణలు, సాహిత్య సభల వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి. అన్ని పత్రికల ఆదివారం ప్రత్యేక సంచికలలో పుస్తక సమీక్షలు నిరాటంకంగా వెలువడుతునే ఉన్నాయి. ఆంధ్రభూమి దినపత్రికలో ప్రతి శనివారం సమీక్షల కోసం ప్రత్యేకంగా ఒక పూర్తి పేజీనే కేటాయించారు. ఐనా సాహిత్యం తన అస్తిత్వం కోసం ఊగిసలాడుతున్నదా?
ఈ పత్రికలే కాకుండా ఎన్నో ఇ-పత్రికలు వెలువడుతున్నాయి. వివిధ సాహిత్య సంస్థలు ఏర్పాటుచేసిన ఇ-పత్రికలూ ఉన్నాయి. ఇతర రూపాలలో సాహిత్య ప్రచారం జరుగుతునే ఉంది. కొన్ని ఆన్‌లైన్ పుస్తక విక్రయ సంస్థలు సైతం తమ వెబ్‌సైట్లలో మంచి పుస్తకాల గురించి రాస్తూనే ఉన్నాయి. వ్యక్తులు, రచయితలు తమ వెబ్‌సైట్లలో వ్యాసాలు రాస్తున్నారు. సాహిత్యం గురించి వ్యాసాలు అభిప్రాయాలు, చర్చలు సోషల్ మీడియాలో తగినంతగానే కనువిందు చేస్తున్నాయి. కొందరు రచయితలు వ్యక్తిగత సమాచారం, పుస్తకాలు, ముందుమాటలు, మొత్తం పుస్తకాలను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. ఇదొక ప్రత్యేక సాహిత్య లోకం. ఎందుకంటే డబ్బున్న, సాంకేతిక పరిచయం ఉన్నవారే ఈ సమాచారం చూడగలరు. దానిని అందిపుచ్చుకోగలరు. కాగితంపై కాకుండా కంప్యూటర్ తెరపై మాతమే కానవచ్చే సాహిత్యం ఇది. ఈ సాహిత్యానికి కాయినేజి మారకం ఎక్కువ. ఒక వేలు ఒత్తుతో వేల మందికి రచనలను పంపవచ్చు. ఏక కాలంలో వేలాది మంది దానిని చదవగలరు. లోగడ ‘దూరం’వల్ల సాహిత్యానికి అంతగా ప్రచారం ఉండేది కాదు. కాని ఇవ్వాళ రచనకీ-పాఠకుడికీ మధ్య దూరం తగ్గిపోయింది. నిజానికి లేదు కూడా. ఐనా ఏదో కానరాని దూరం కానవస్తున్నది.
లోగడ సమాజంలో సాహిత్యానికి తగినంత గౌరవం ఉండింది. ఇప్పుడు అది తగ్గిపోయినట్లు అనిపిస్తున్నది. సాహిత్య గౌరవం సమాజం అంతటా ప్రతిబింబించేది. ప్రచార పటాటోపం తక్కువైనా సమాజంలో సాహిత్యానికి ‘స్థానం’, ‘గౌరవం’ ఎక్కువ. సృజనకారులకు సామాజిక స్థాయి, అంతరాలు తక్కువగా ఉండేది. విభిన్న వర్గాలనుండి వచ్చినవారు సైతం సాహిత్యస్థాయి అనే కొలబద్దముందు నిలిచినప్పుడు పాండిత్యంతో, సాహిత్య విలువలతో పోటీకి నిలిచేవారు. ఐతే ఆనాడు కూడా సాహిత్య రాజకీయాలు లేవని కాదు. కాని అవి సాహిత్య తత్వాన్ని, పాండిత్యాన్ని దాటిపోలేదు. ఎంతోమంది ‘ప్రాపకం’ కవులు, రచయితలు ఆనాటికి ప్రచారం పొందినా తదుపరి కాలంలో వారిని తలిచేవారు లేరు. కాని ఇవ్వాళ అలాకాదు. మొత్తం వ్యవస్థని అస్తవ్యస్తం చేసి ధనం వెదజల్లి, అధికారం ఆసరాతో పేరుప్రఖ్యాతులు అవార్డులు, రివార్డులు పొందాలని పథక రచన చేయడం గమనించవచ్చు. అలాంటివారి పట్ల సమాజం ఓ కనే్నసి ఉంచుతున్నది. ఇలాంటి వాతావరణాన్ని చూసి చాలామంది సాహిత్యం పట్ల ఏవగింపు కలిగి ఉంటున్నారు. కేవలం మామూలు కవులూ రచయితలే కాదు సమాజంకోసం త్యాగాలు చేసే పార్టీలు, వామపక్ష భావజాలం కలిగిన కవులు కూడా ఇలాంటి చర్యలు చేపట్టడం సాహిత్య విలువను మరింత దిగజార్చుతున్నది.
లోగడ సాహిత్య సంస్థలు ఒకే లక్ష్యంతో, ధ్యేయంతో ఏర్పడ్డాయి. ఇప్పుడు వ్యక్తుల ప్రచారం కోసం ఏర్పడుతున్నాయి. నాకో అవార్డు ఇవ్వు, నీకోటి ఇస్తాను అన్న చందంగా తయారయ్యాయి. నా సంస్థకు నిన్ను ముఖ్యఅతిథిగా పిలుస్తాను. నీ సంస్థ సమావేశానికి అదే హోదాతో వస్తాను వంటి కనబడని ఒడంబడికల వల్ల కూడా సంస్థల కీర్తి తగ్గిపోతున్నది. అమెరికాలోనే కాదు, మన రాష్ట్రంలో కూడా కొన్ని సంస్థలు కులాలవారీగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వాలలో కీలక హోదాల్లో ఉన్న వ్యక్తులు రోజుకో సంస్థ ఏర్పాటుచేసి సాహిత్యేతరులతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సాహిత్య సంస్థలు వ్యక్తుల జేబు సంస్థలు అయ్యాయి. ముఖ్యమంత్రుల కార్యాలయాలనుండి కొన్ని సంస్థలు ఆరంభం కావడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది. ప్రభుత్వమే సాహిత్య సంస్థలు నడిపితే ఇకముందు ఎలాంటి సాహిత్యం వెలువడుతుందో ఊహించవచ్చు. ఏర్పాటుచేసిన ఆ సభలలో ఎలాంటి ఉపన్యాసాలు చేస్తారో తెలుసుకోవచ్చు.
సాహిత్యంలో పెడధోరణులు, అపసవ్య సాహిత్యం ఎక్కువ మొత్తంలో వెలువడితే ఆ సమాజాన్ని బాగుచేయడం సాధ్యంకాదు. కళాసాహిత్యం ప్రజల తరఫున నిలిచినప్పుడే ఆ సమాజం సమతౌల్యంగా ఉంటుంది. అక్షరం ప్రజల తరఫు ఆయుధం. పాలక పక్షాలకది ప్రతిపక్షం. ఈ సరిహద్దు గీత చెరిగిపోతున్న వేళ, ప్రజల తరఫున నిలిచిన కవిగాయక సమాజం జీ హుజూరంటూ చేతుల చాచి నిలబడడం చూస్తుంటే బాధేస్తుంది. లోగడ కొద్దిమంది మాత్రమే ప్రభుత్వ బాకా ఊదేవారు. వారు దానిని దాచేవారు కాదు. ఇప్పుడు ప్రభుత్వం అలాంటి వారితో ఒక బాకా సైన్యం ఏర్పాటుచేయబూనడం ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయంలో ప్రగతిశీల సమాజం యావత్తూ చూసీచూడనట్లు నటిస్తున్నది. తమతమ చంచాలు అలాంటి బాకా పనులు చేస్తుంటే చూసి ఊర్కోవడం వింత కలిగించే పరిణామం. ఓ ప్రగతిశీల విప్లవ అభిమాని ఒక పత్రిక వెలువరించి రాజకీయ అధి నాయకుడితో ఆవిష్కరింపచేయడం విచిత్రం కాదు. కాని దానిని ఆమోదించే విప్లవ సాహిత్య శిబిరం నేతల చేష్టని గమనించాల్సిన సందర్భం ఇది.
***
ఇక మరికొందరు రచయితలు కేవలం జయంతులు, వర్ధంతులు ఎప్పుడా అని ఎదురుచూస్తూ నిరంతరం వాటిపైనే వ్యాసాలు రాయడం చూస్తుంటే సాహిత్య విషయకంగా వీరు మరేమీ రాయలేరా అనే అనుమానం వేస్తున్నది. ప్రతి ఏడాది అదే కవిది జయంతో, వర్ధంతో వస్తుంటుంది. శత జయంతి సందర్భంగా ప్రారంభం, ముగింపులు ఉంటాయి. ఈ రచయితలు పుంఖానుపుంఖంగా ఆ సందర్భాల్లో – రాసిన వ్యాసాలనే మరోసారి రాయడమే వారి పని. మరొక ధోరణి ఏమంటే, ఒక రచయిత పైనో, కవిపైనో వ్యాసాలు రాయడం. ఆ తరువాత ఈ కవి మళ్ళీ రాసిన ఆయనపై తిరిగి రాయడం. ఇచ్చుకుంటి వాయనం- పుచ్చుకుంటి వాయనం అన్న రీతిలో వ్యాసాలు ఎక్కువగా వస్తున్నాయి. పాత కవులు, రచయితలపై ఇతర పుస్తకాలనుండి సమాచారం గ్రహించి, తరగతి గదిలో చెప్పిన పాఠాలను వ్యాసాలుగా రాసి పత్రికలకు పంపుతున్నారు. నిజానికి వారి వ్యాసాలలో చాలావరకు లోగడ ముద్రితమైన వ్యాసాల నుండి, పుస్తకాలనుండి గ్రహించిన విషయాలే ఎక్కువ. ఎవరైనా చూస్తారు అనే ఆలోచన లేకుండా రాయడం జరుగుతున్నది.
సాహిత్య పేజీలను రచయతలు వ్యక్తిగతంగా వాడుకోవాలని చూసే దృక్పథం ఎక్కువగా కనుపిస్తోంది తప్ప, సాహిత్య విశే్లషణ, చర్చ, విలువలు వంటి అంశాలపై అంత ఆశించిన రీతిలో వ్యాసాలు రావడం లేదన్నది వాస్తవం. అలాంటి వ్యాసాలు రాసే విమర్శకులు తగ్గిపోయారా? అలాంటి విమర్శ అవసరంలేదని భావిస్తున్నారా? నిజానికి సాహిత్య విమర్శ స్థాయి దిగిపోవడానికి కారణాలు వేరే ఏమైనా ఉన్నాయా అని ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది.
అవును. ఇదివరకటిలా సాహిత్యరూపం ఒకే మొత్తంలో ఘనీభవించి లేదు. అంటే ఏక ఖండంగా లేదు. వర్తమానంలో అది భిన్న శకలాల్లా విభాజితమై ఉంది. అది ప్రవాహంలా కనుపిస్తోంది. అస్తిత్వ ఉద్యమసాహిత్య ప్రవాహాలు అనేకం. అవి ఏకశిలా సదృశంగా లేవు. మన సమాజం కూడా అలాగే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటువల్ల తెలుగు సాహిత్య స్వరూపం, స్వభావం గురించి మాట్లాడ్డం కొంత క్లిష్టతకు గురిచేస్తున్నది. నిర్దిష్టతకు లొంగడం లేదు. ఐనా సాహిత్య విలువలు, ఆలోచనలు ఒక రకంగానే ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. కన్నడ, మరాఠీ, తమిళ సాహిత్యాల కథలు, నవలలు, నాటకాల గురించి మాట్లాడుకున్నప్పుడు వాటి రచనాశక్తి, ఇతివృత్తం, శైలి, భాషల గురించి మాట్లాడుతాం. రచన ప్రాశస్థ్యం, శక్తి, రచయిత ప్రతిభల గురించి చూస్తాం. ప్రక్రియాపరంగా పరిశీలించడం ఎక్కడైనా ఒక్కటే. దేశ కాల పరిస్థితిని బట్టి ఐదు పది శాతం తేడాలు ఉంటే ఉండవచ్చును. అది ఎక్కువగా ఇతివృత్తానికి సంబంధించినదై ఉంటుంది.
తెలుగులో మంచి రచనలు రాకపోవడంవల్ల మంచి విమర్శ రావడం లేదని ఒక అభిప్రాయం. కాని మంచి సాహిత్యం వెలువడడానికి బలమైన విమర్శ అవసరం. సద్విమర్శ నవ్యసాహిత్య సృజనకు ఊతం ఇవ్వగలదు. స్తబ్దుగా ఉన్న సాహిత్య సమాజంలో ఆలోచనలు రేకెత్తించడం విమర్శకులు బాధ్యత.
సాహిత్య విమర్శకుల మీద విమర్శ చేయడం అవసరం అనిపిస్తోంది. వృత్తి, ప్రవృత్తి విమర్శకులు తగ్గిపోయిన కాలంలో ఎవరిని ఏమి అనగలరు. అది సమాజం ఇచ్చిన అనధికార బాధ్యత. దానిని ధైర్యంగా, సమర్థంగా పాటించడం విమర్శకుని ధర్మం. నిజానికి అస్తిత్వ సాహిత్య పాయలు పెరిగాక విమర్శ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఆ సాహిత్యాల అంతర్గత విమర్శ, బాహ్య విమర్శల మధ్య ఏకీభావం కుదరలేదు. దళిత, స్ర్తివాద సాహిత్యాలపై ఇతర వర్గాలవారు విమర్శ చేసినప్పుడు ‘వ్యక్తి’ కేంద్రంగా ప్రతి విమర్శ జరిగింది. దానివల్ల అసలు విమర్శ చేయడమే తగ్గిపోయింది. ఒక్కొక్కప్పుడు కేవలం మెప్పుకోలుకే విమర్శ పరిమితం అయింది. ఇలాంటి విమర్శ పుస్తకాల ముందు మాటలలో, సభలలో ఉపన్యసించినప్పుడో బయటపడింది. అంటే విమర్శేతర మార్గాలలో వ్యక్తం అయ్యింది. అంతే తప్ప ఒక విమర్శ చట్రంలోంచి నిశజూజఔళశజూళశఆగా వెలువడ లేకపోవడం గమనించాలి. దృక్పథ విమర్శ అంటే, మార్క్సిస్టు విమర్శ, దళితవాద సాహిత్య విమర్శ, స్ర్తివాద సాహిత్య విమర్శ, ప్రాంతీయవాద సాహిత్య విమర్శ దేనికది విడివడిగానైనా సమగ్రంగా ఎదగలేదు. కలగలసిన అస్తిత్వ సాహిత్య దృక్పథం అయినా ఒకటి ఏర్పాటుకాలేదు. ఇకపోతే ప్రక్రియాపరంగా విమర్శ కూడా ఎదగవలసినంత ఎదగలేదు. ప్రక్రియ గురించి మాట్లాడితే రూప విమర్శ అని కొట్టిపడేసిన ప్రగతిశీల సాహిత్యకారులు ప్రతిగా దానిని తాత్వికంగా ఎలా చూడాలో చెప్పలేకపోవడం కూడా ఒక లోటే. నిజానికి పాత విమర్శసూత్రాలు, చూపు, దృక్పథాలు ఇవ్వాళ పాతపడిపోయాయి. ఏ విమర్శకుడైనా సమాజాన్ని ముందుకు నడపగలిగే ఆలోచనతో విమర్శ విధానాన్ని తనకైతాను రూపొందించుకోవలసి వస్తున్నది. మార్క్సిస్టు పడికట్టు పారిభాషిక పదాలతో చేసిన విమర్శకూడా బలహీనపడింది. ప్రత్యామ్నాయ సాహిత్య రంగాన్ని గుర్తించని ఆ విమర్శకులు మెల్లిమెల్లిగా ఆ రంగంనుండి నిష్క్రమించి ఘనీభవించిపోయారు. కొత్త తరం, కొత్తతరహా విమర్శ అప్పుడప్పుడు కనుపించినా అదీ స్థిరం కాలేదు. ఈ నేపథ్యంలో తెలుగు విమర్శ దిక్కుతోచక బలహీనపడింది. తన చేతగానితనం వలలో తానే చిక్కుకుపోయింది.
ఇప్పుడు విమర్శక రక్షకులు లేని సాహిత్యం బలహీనపడింది, దిగాలుగా కానవస్తున్నది. యువతరం పట్టించుకోని తల్లిదండ్రుల మాదిరి సాహిత్యం సుక్కి వడలిపోతోంది. ఎక్కువగా పాత తరం, అతి కొద్దిమంది యువతరం కనిపిస్తూ ఉన్నా భావితరం సాహిత్యానికి దగ్గర కారేమో అనే ఆలోచన అందరిలోనూ పెనుగులాడుతున్నది. అందుకే సాహిత్య భవిష్యత్తు గురించి నిరాశాజనకమైన అభిప్రాయాలు వినవస్తున్నాయి. వాటిని అబద్ధం అని కొట్టిపారేయగలిగే రోజులు రావాలి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గ్రంథాలయ సాహితీమూర్తి వెలగా వెంకటప్పయ్య

గ్రంథాలయ సాహితీమూర్తి వెలగా వెంకటప్పయ్య

  • – సన్నిధానం నరసింహశర్మ, 9292055531
  • 05/01/2015
TAGS:

–స్మృతి–
వెలగా వెంకటప్పయ్య పేరు వినగానే గ్రంథాలయ రంగం ఠకీమని గుర్తుకు రావడమే ఆ రంగంతో ఆ వ్యక్తి శక్తి ఎంతగా మమేకమయిందో తెలుస్తుంది. అందుకు ఎన్ని నాళ్ళు ఎన్ని ఏళ్ళు సేవ చేస్తే దక్కుతుంది ఆ యశస్సు. అయ్యంకి వెలగా ‘నా వారసుడు’ అని ప్రకటించారు. ‘విజ్ఞాన వికాస’ విధానంలో వెలగా సిద్ధ‘హస్తు’డని వావిలాల శ్లాఘించారు. ‘విజ్ఞానం, కృషి ఈ రెండింటి దృష్ట్యా వెలగా స్థానం అగ్రశ్రేణిలో ఉన్నదనే దేవులపల్లి రామానుజరావు ప్రశంసలో ఆలోచనాత్మక విశే్లషణ ఇమిడి వుంది. కొందరు ఉద్యమపు పెద్దలు, కొందరు శాస్ర్తియ రంగపు పెద్దలూ వున్న కాలంలో గ్రంథాలయ ఉద్యమానికి ఆధునిక గ్రంథాలయ శాస్త్ర విజ్ఞానానికి వారధిగా నిలవడం వెలగా ప్రత్యేకత. తెలుగు సాహిత్యశాఖల్లో గ్రంథాలయ సాహిత్యశాఖ కూడా సరస్వతీ నదిగా సాక్షాత్కరిస్తుంది. ఎప్పుడో కాశీనాధుని నాగేశ్వరరావు ఆంధ్ర వాఙ్మయ సూచిక ఇప్పటికీ సాహితీ పరిశోధకులకు మార్గదర్శిగా ఉంటున్నట్లే వెలగావారి గ్రంథ సూచులు గ్రంథాలయ సాహితీ పరిశోధకులకు నూతన శాస్ర్తియ పద్ధతుల్లో మార్గదర్శకాలవుతాయి.
1956లో గుంటూరు జిల్లా రేపల్లె శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ పాలకునిగా చేరికనుండి తీరిక లేకుండా ఒక ప్రక్క సాంకేతిక సంబంధ గ్రంథాలు వ్రాస్తూ మరోప్రక్క తెలుగు సాహితి వెలగాలని తమవంతు సేవలు ఆయన అందిస్తూనే వున్నారు అని ఆయన దినచర్యా విశేషాలయ్యాయి. చిన్న స్థాయినుండి పెద్ద స్థాయివరకు గ్రంథాలయ పాఠ్యగ్రంథాల రచయితగా ఆయన వనె్నకెక్కారు. ఆంగ్లంలో కూడా గ్రంథ రచన చేయడంతో దేశీయంగానూ పేరుపొందారు. కడపలో సి.పి. బ్రౌను గ్రంథాలయానికి నిర్మాణ పథక రూపకల్పన వెలగావారే చేశారని జానుమద్దివారే ప్రకటించారు. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వాషింగ్టన్, భారత ప్రభుత్వాలు కలసి చేబట్టిన భారతీయ ప్రచురణల మైక్రో ఫిల్ముల పథకానికి వెలగా సహకారమందించారు.
నార్ల వెంకటేశ్వరరావు శత జయంతి స్మరణిక సంపాదకుని ఆయన ‘సాహిత్య రంగంలో నార్ల’ అనే ప్రకరణాన్ని ప్రయోజనవంతంగా తీర్చారు. భావ విప్లవకారుడు నార్ల వంటి విశేష వ్యాసాలను ఆయన సాహితీ లోకానికందించారు. సాహితీ పరిశోధకులకు ఆయన గాంధీ వాఙ్మయ సూచి, రవీంద్ర వాఙ్మయ సూచి వంటివి వినియోగార్హతను తెలిపాయి. దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత చక్రపాణిపై ఆయన సంపాదకుడుగా వచ్చిన చక్రపాణీయం పసగల వైవిధ్య భరిత ‘చక్రపాణి’ రుచుల్ని ఎన్నో అందించింది. చక్రపాణి అనువాదకథా రచనలు సినిమా సాహిత్య రచనా నైపుణ్యాలపై ఆ గ్రంథం ఉత్తమోత్తమ గ్రంథం అని అందలి వింగడింపులు హేమాహేమీ రచనల సేకరణలే చెబుతాయి. చక్రపాణిపై వెలగావారు రాసిన గ్రంథాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించి రచయిత ప్రతిభని తెలిపింది. మహీధర జగన్మోహనరావుతో కలిసి వెంకటప్పయ్య తయారుచేసిన ఆంధ్ర వాఙ్మయ సంగ్రహ సూచిక శ్రమైక సాధ్యఫలం ‘తెలుగు చదువు చాలా తేలిక’ అనే వెలగా వయోజన విద్యాపుస్తకం ప్రయోజనదాయకమై పలు పునర్ముద్రణల్ని చూసింది. మూడువేల పైచిలుకు పొడుపు కథల్ని సేకరించి, వింగడించి శాస్ర్తియ దృష్టితో మనకందించిన సాహిత్య సేవకుడు వెలగా. రాయలసీమ పొడుపు కథల్ని ప్రత్యేకంగా ఆయన సేకరించారు. తెలుగు బాల సాహితీ వికాసం ఆయన నుండి వచ్చిన మంచి సిద్ధాంత గ్రంథం. పెద్దగా లోతులు లేకపోయినా ఆయన ‘తెలుగు ముద్రణ వికాసం’ గ్రంథం సేకరణాధిషణత్వం కలిగి వెలిగింది. సి.పి.బ్రౌను నిఘంటువుల్ని పునర్ముద్రింపజేయడంలో శంకర నారాయణ తెలుగు- ఇంగ్లీషు, ఇంగ్లీషు తెలుగు నిఘంటువులను పునర్ముద్రింపజేయడంలో ఆయన పరిశ్రమ ప్రశంసనీయం. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన తెలుగు నిఘంటు వికాసం గ్రంథాన్ని రాసి నిఘంటు పరిణామాల్ని అక్షరబద్ధం చేశారు. తెనాలి చరిత్ర- సంస్కృతి వంటి ఎన్నో గ్రంథాలకు ఆయన సంపాదకుడయ్యారు. విశిష్ట గ్రంథ సంపాదకులలో ఆయన ఒకరుగా నిలద్రొక్కుకున్నారు.
పొడుపు కథలకు ఆయన ‘పర్యాయ పదాలిస్తూ’ అడ్డుకతలు, ఒడ్డుకతలు, కథ కట్టు పద్యాలు, చిక్కుముళ్ళు, చిట్కాలు, చిటుకులు, మారుతట్లు, యక్ష ప్రశ్నలు, విడుపు కథలు అని ఇస్తూ శాత్రాలు (శాస్త్రాలు), సమచ్చలు (సమస్యలు) అని ఇవ్వడంలో ప్రజావ్యవహారాన్ని కాదనక పోవడంలో కొంచెం ముందుకు వచ్చారనే అనిపిస్తుంది. బాల గేయాలు ఇవ్వడంలోనూ, క్రైస్తవ బాలగేయాలు ప్రత్యేకంగా ఇవ్వడంలో ఆయన విశాల దృష్టి తెలుస్తోంది. విజయవాడ నవరత్న బుక్‌హౌస్ వారిచే ఆయన పాత బంగారం పేర ధారావాహిక ఉద్గ్రంథ ప్రచురణలు జాతి మరువలేనివి వేయించారనిపిస్తుంది.
పాత బంగారం/ తెలుగు శతక మంజరి ఉద్గ్రంథం. ఇందులో మూడువేల పద్యాలుంటాయి. వేమన భాస్కరాది శతకాలతోపాటు గుమ్మా సాంబశివరావు రాసిన సెల్‌ఫోన్ శతకంలో కొన్ని పద్యాల్ని ప్రచురించడం ఆయన ఆధునిక కాలజ్ఞాన ఉదాహరణం.
‘‘శిశువు ఏడ్చుచుండ చెంత జేరిన తల్లి/
జోలపాట లేక లీలగాను/ సెల్లుఫోను తెచ్చి
చెవిలోన మోగించె/ సెల్లుఫోను మహిమ చెప్పతరమె – వంటివి అందులో ఉన్నాయి.
పాత బంగారం-2గా పొడుపు కథల పెద్ద పుస్తకం తయారుచేశారు. పొడుపు కథల తాత్త్విక భూమికలందులో ఇచ్చారు. పాత బంగారం-3గా తెలుగు సామెతల పెద్ద పుస్తకం ప్రకటింపజేశారు.
తమకు ముందు వచ్చిన పరిశోధనా గ్రంథాల్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ స్వీయ సేకరణల్నీ, శాస్ర్తియ సమాచారాన్ని చేర్చి ప్రజలకందించాలనే ఆయన నిత్యతపన ప్రతి సాహితీ గ్రంథంలో కనబడుతుంది. వంద పరిశోధనలకు ఇంద సమాచారం, విజ్ఞానం అంటూ స్వాగతిస్తాయి ఆయన గ్రంథాలు. తెనాలి, ఐతానగరంలో గ్రంథాల మధ్యలో వెలిగే వెలగా ఇప్పుడు మన మధ్యలో లేరు. కాలధర్మమైనా వెలితే. ఆయన భౌతిక కాయానికి వీడ్కోలు పలికామే కాని, ఆయన గ్రంథాలకి గ్రంథాలయాలు స్వాగతాలాపనలు చేస్తూనే వున్నాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వంద సినిమాలకు ”పాత్రోచిత ”రచన చేసిన గణేష్ పాత్రో

ప్రముఖ సినీ రచయిత గణేష్‌ పాత్రో కన్నుమూత

కేన్సర్‌తో చెన్నైలో మృతి
కేన్సర్‌తో చెన్నైలో కన్నుమూత

చెన్నై, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): దేవుడు సర్వాంతర్యామి అని మనం అనుకుంటాం. కానీ.. అసలు సిసలు సర్వాంతర్యామి ఆకలి అని చెప్పిన మాటల మాంత్రికుడు.. గణేష్‌ పాత్రో(69)! మరోచరిత్ర.. ఇది కథ కాదు.. ఆకలి రాజ్యం.. అంతులేని కథ.. రుద్రవీణ.. స్వాతి.. సీతారామయ్యగారి మనవరాలు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఇలా ఎన్నో హిట్‌ చిత్రాలకు సంభాషణలు సమకూర్చిన ఆ ప్రముఖ రచయిత ఇక లేరు! సముద్రమంత లోతున్న జీవితసత్యాలను సైతం అలతి అలతి పదాల్లో అల్లి సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా.. గుండె ఆర్ద్రమయ్యేలా.. రాసిన ఆ కలం ఆగిపోయింది!! చాలాకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. తొలుత నోటి కేన్సర్‌కు గురైన పాత్రో దాన్నుంచి బయటపడినా తర్వాత అది ఎముకలు, కాలేయానికి కూడా వ్యాపించడంతో కొన్ని రోజుల క్రితం స్థానిక నందనంలోని వెంకటేశ్వర ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. పాత్రోకు భార్య లక్ష్మీకుమారి, ఇద్దరు కుమార్తెలు కనకమహాలక్ష్మి, సంయుక్త, కుమారుడు సీతారాం పాత్రో ఉన్నారు. కెనడాలో ఉంటున్న సీతారామ్‌.. నాలుగురోజుల క్రితమే చెన్నైకి వచ్చారు. స్థానిక టి.నగర్‌ కన్నమ్మపేట శ్మశానవాటికలో సోమవారం మధ్యాహ్నం 3గంటల తర్వాత ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
పార్వతీపురంలో పుట్టి..
బీఎస్‌ గణేష్‌ పాత్రోగా అందరికీ సుపరిచితులైన ఆయన అసలు పేరు బెహర సత్య గణ గంగ వెంకట రమణ మహా పాత్రో. విజయనగరం జిల్లా పార్వతీపురం ఆయన స్వస్థలం. 1945 జూన్‌ 22న పాత్రో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు.. ఆదిలక్ష్మి నారాయణ పాత్రో, సూర్యకాంతం. ఆ దంపతులకు 17 మంది పిల్లలు. తొలుత ఐదుగురూ ఆడపిల్లలే కావడంతో మగబిడ్డ కోసం ఎందరో దేవుళ్లను ప్రార్థించాక పుట్టిన బిడ్డ కావడంతో పాత్రోకి అంత పెద్ద పేరు పెట్టినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గణేష్‌ పాత్రో విద్యాభ్యాసమంతా పార్వతీపురంలోనే సాగింది. బి.ఎ. పూర్తయ్యాక విశాఖపట్టణంలో పోస్ట్‌ అండ్‌ టెలిగ్రాఫ్స్‌ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా కొన్నాళ్లు పనిచేశారు. చిన్నతనం నుండే ఆయనకి నాటకాలు, రచనలపై మక్కువ ఏర్పడింది. క్రమేపీ నాటక రచనలో ఆయనకి పట్టు దొరికింది. ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’, ‘లాభం’, ‘అసుర సంధ్య’, ‘ఆలోచించాలి’ వంటి అద్భుతమైన నాటకాలను రాశారు. ఆ సమయంలోనే ఆనాటి ప్రముఖ రంగస్థల నటుడు కుప్పిలి వెంకటేశ్వర రావుతో పాత్రోకి పరిచయం కలిగింది. ఇద్దరూ కలిసి నాటకాలు వేసేవారు. ‘‘అయితే రచన లేదా నటన ఏదో ఒకదానినే ఎంచుకుంటే అద్భుతంగా రాణించగలవు. రచయితగా నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావని నాకు నమ్మకముంది’’ అని వెంకటేశ్వరరావు సలహా ఇచ్చారు. దాంతో పాత్రో పూర్తిగా రచనపైనే దృష్టి సారించారు. కుప్పిలి కుమార్తెనే పాత్రో పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి, పెద్దల అంగీకారంతో లక్ష్మీ కుమారిని జీవిత భాగస్వామిగా చేసుకొన్నారు. అక్కినేని అంటే ఇష్టపడే పాత్రో.. ఆయన సినిమాలు చూసి చిత్రరంగంపై మక్కువ పెంచుకున్నారు. విశాఖ నుంచి చెన్నైకి చేరుకుని సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పట్లో బాలచందర్‌ పరిచయంతో ఆయన తీసిన చిత్రాలకు తెలుగులో తానే మాటలు రాశారు. మొత్తం తన కెరీర్‌లో 100కి పైగా సినిమాలకు మాటలు రాశారు. అందులో ఎక్కువ భాగం సూపర్‌ హిట్‌లే. వెంకటేష్‌, మహేష్‌బాబుల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (2013లో) పాత్రో ఆఖరి సినిమా. ఇక అతికొద్ది సినిమాల్లో నటుడిగానూ మెరిశారు పాత్రో. వడ్డే నవీన్‌ నటించిన ‘శ్రీ బాలాజీ’ చిత్రంలో కీలకపాత్ర పోషించి మెప్పించారు.

మాటల సవ్యసాచి (03-Jan-2015)
నాటక రంగం నుంచి తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి, కె. బాలచందర్‌ వంటి దిగ్దదర్శకుడిని మెప్పించి, ఆయన తెలుగు చిత్రాల ఆస్థాన సంభాషణల రచయితగా పేరుపొందడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి చరిత్రను సాధించిన రచయిత గణేశ్‌ పాత్రో. ఆయన సంభాషణలు రచించిన సినిమాలే రచయితగా ఆయన గొప్పతనమేమిటో తెలియజేస్తాయి. ఫ్యామిలీ సినిమాలైనా, సీరియస్‌ సినిమాలైనా, ప్రేమకథలైనా.. ఏదైనా సరే, తనదైన ప్రత్యేకశైలి సంభాషణలతో మెప్పించిన మాటల సవ్యసాచి పాత్రో. విశాఖ నుండి చెన్నైకి వచ్చారు. 100కిపైగా సినిమాలకు మాటలు రాశారు. 1976లో కె. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ‘అత్త వారిల్లు’ చిత్రంతో సినీ మాటల రచయితగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. 1978లో వచ్చిన కె. బాలచందర్‌ సినిమా ‘మరోచరిత్ర’ ఆయన కెరీర్‌ని మలుపుతిప్పింది. అక్కడ నుండి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. బాలచందర్‌ తీసిన తెలుగు సినిమాలన్నింటికీ పాత్రోనే మాటల రచయిత. వాటిలో ‘గుప్పెడు మనసు’, ‘ఇది కథ కాదు’, ‘తొలికోడి కూసింది’, ‘ఆకలి రాజ్యం’, ‘రుద్రవీణ’ వంటి ఎన్నో అపురూ పమైన సినిమాలున్నాయి. ఇక 1984లో వచ్చిన ‘మనిషికో చరిత్ర’, ‘మయూరి’, ‘మంగమ్మగారి మనవడు’, ‘స్వాతి’, 1985లో వచ్చిన ‘ప్రేమించి పెళ్లాడు’, ‘మా పల్లెలో గోపాలుడు’, 1988లో వచ్చిన ‘మురళీకృష్ణుడు’, 1989లో వచ్చిన ‘ముద్దుల మావయ్య’, 1991లో వచ్చిన ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘నిర్ణయం’, ‘జానకిరాముడు’, 2001లో వచ్చిన ‘9 నెలలు’ చిత్రాలు పాత్రోకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ‘9 నెలలు’ తర్వాత పన్నెండేళ్ల విరామంతో 2013లో వచ్చిన వెంకటేశ్‌, మహేశ్‌ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, పాత్రో ఆఖరి సినిమా. ‘అందమైన అనుభవం’, ‘నిర్ణయం’ చిత్రాల్లో పాటలు రాశారు. ఇక అతికొద్ది సినిమాల్లో నటుడిగాను మెరిశారు పాత్రో. వడ్డే నవీన్‌ నటించిన ‘మా బాలాజీ’ చిత్రంలో కీలకపాత్ర పోషించి మెప్పించారు.
అవార్డులు…
పాత్రో ప్రతిభకి పలు అవార్డులు పాదాక్రాంతమయ్యాయి. ‘స్వాతి’, ‘మయూరి’, ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘ఆకలిరాజ్యం’ చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో సంస్థల సన్మానాలు అందుకున్నారు.
‘మనవడా.. నీతో సినిమా
చెయ్యాలి అనేవారు
‘‘గణేష్‌ పాత్రోగారు నాకు తాతయ్య వరుస. ఆయ నకి గొల్లపూడి మారు తీ రావుగారు క్లోజ్‌ ఫ్రెండ్‌. వారిద్దరూ గంటలు గంటలు మాట్లాడుకునే వారు. మధ్యలో ఆయన ఫోన్‌ చేసి ‘మనవడా… నీ సంగీతం, సినిమాల గురించే డిష్కషన్‌ చేసుకుంటున్నాం’ అనే వారు. ఆ సమయంలో చాలా గర్వంగా అనిపించేది. పనిమీద ప్రేమ ఉండే వ్యక్తి. చేసే పనికి వందశాతం న్యాయం చేయాలనే ఆయన ఆలోచన నాకు స్ఫూర్తి. చిన్న డైలాగ్‌తో సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేట్లు చెప్పగల ఇంటెలెక్చువల్‌ ఆయన. ‘ఆకలిరాజ్యం’, ‘రుద్రవీణ’ చిత్రాల్లో ఆయన రాసిన సంభాషణలంటే నాకు ఆరాధన. నేను చేసిన ‘బ్రోకర్‌’ చిత్రం చూసి ‘మనవడా… నీతో సినిమా చెయ్యాలి, నీ థాట్‌ నాకు చాలా బాగా నచ్చింది… నీ తదుపరి చిత్రానికి నేను వర్క్‌ చేస్తా… ఏమంటావ్‌?’ అన్నారాయన. చాలాసార్లు ‘నేను నీ తాతను కాబట్టి పొగడకూడదు కానీ.. గ్రేట్‌ మనవడా’ అనటం నా మనసుకి మంచి అనుభూతి కలిగింది.
చాలామందికి తెలీని విషయం కృష్ణ, రామ్మోహన్‌ను హీరోలుగా పరిచయం చేస్తూ ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ‘తేనె మనసులు’ చిత్రానికి మిగతావాళ్లతో పాటు పాత్రో సైతం ఓ పాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్ర్కీన్‌ టెస్ట్‌కు సైతం ఆయనను పిలిచారు. అయితే ఆ ఉత్తరాన్ని అందుకున్న వాళ్ల నాన్న దీనికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో వెళ్లలేకపోయారు.
పాత్రో దర్శకత్వంలో ‘ప్రతిమ’ అనే చిత్రం 1986లో ప్రారంభమైంది. విశాఖపట్నంలో కొంత షూటింగ్‌ జరిగాక, ఆగిపోయింది. అది పూర్తయివుంటే, నటి గౌతమికి అదే మొదటి సినిమా అయ్యేది. ఉషాకిరణ్‌ మూవీస్‌ తలపెట్టిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పనిచేశారు. తెలీని కారణాల వల్ల సినిమా ఆగిపోవడంతో దీని కోసం రికార్డ్‌చేసిన పాటలను ఆ తర్వాత వేరే సినిమాలకు ఉపయోగించుకున్నారు.
ఆత్రేయ – పాత్రో
ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ (పీఏపీ) నిర్మించిన ‘అత్తవారిల్లు’ చిత్రానికి రచయితగా పాత్రోకు అవకాశమిచ్చారు, దాని దర్శకుడు కె. ప్రత్యగాత్మ. ఆ రోజుల్లో పాత్రో వద్ద పెద్దగా డబ్బులు లేవు. స్కూల్లో చదువుకుంటున్న ఆయన ఇద్దరు పిల్లలకు ప్రవేశ రుసుము కూడా కట్టలేని దుస్థితి! పెద్ద బేనర్‌లో అవకాశం వచ్చిందన్న ఆనందం ఓ వైపు, తన పారితోషికాన్ని ఎలా అడగాలనే సంశయం మరోవైపు. అప్పుడు ఆత్రేయ ఆయనను ఆదుకున్నారు. పీఏపీ సంస్థ నుంచి పారితోషికం డబ్బులేవైనా అందాయా, లేదా అని పాత్రోని అడిగారు. అందలేదని పాత్రో చెప్పడంతో, ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని వాకబుచేసి, తన అసిస్టెంట్‌ను పంపి, పిల్లల స్కూలు ఫీజులు కట్టేశారు. మరికొంత డబ్బు పాత్రో చేతుల్లో పెట్టారు. అయితే ఆ తర్వాత పీఏపీ నుంచి ఆయనకు పారితోషికం అందింది. ఈ విషయం చెప్పి, ఆత్రేయ సాయం చేసిన డబ్బును తిరిగివ్వబోయారు పాత్రో. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్‌కు పాత్రోను పరిచయం చేసింది కూడా ఆయనే. మలయాళంలో హిట్టయిన ఓ సినిమాని ఈరంకి శర్మ తెలుగులో ‘చిలకమ్మ చెప్పింది’ పేరుతో రూపొందించారు. దానికి బాలచందర్‌ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. సెట్స్‌ మీద కూడా దర్శకుడితో ఎక్కువ సమయం వెచ్చించగల రచయిత కావాలని బాలచందర్‌గారు అనుకున్నారు. అప్పట్లో ఆత్రేయ బాగా బిజీగా ఉన్నారు. బాలచందర్‌ అసిస్టెంట్‌ అయిన అనంతుకు పాత్రోని పరిచయం చేశారు. పాత్రో రంగస్థల నేపథ్యం తెలుసుకున్న అనంతు ఆయనను బాలచందర్‌ వద్దకు తీసుకుపోయారు. అలా ‘చిలకమ్మ చెప్పింది’ చిత్రానికి పనిచేశారు పాత్రో. ఆయన పనితనం బాలచందర్‌కు బాగా నచ్చింది. కమల్‌హాసన్‌ హీరోగా ‘మరో చరిత్ర’ను తెలుగులో తీయాలని బాలచందర్‌ సంకల్పించారు. ఆత్రేయతోటే సంభాషణలు రాయించాలని ఆయన అనుకున్నారు. అయితే ఆరోగ్య కారణాలతో ఆయనతో పాటు సెట్స్‌పై పూర్తి సమయం వెచ్చిం చే స్థితిలో ఆత్రేయ లేరు. అందుకని ఆయన స్థానంలో రచయితగా పాత్రోని తీసుకుంటానని ఆత్రేయకు చెప్పారు బాలచందర్‌. ఆత్రేయ ఏమాత్రం నొచ్చుకోకుండా పాత్రోని మనసారా ఆశీర్వదించారు. అలా బాలచందర్‌తో పాత్రో అనుబంధం మొదలైంది. అందుకే చిత్రసీమలో రచయితగా తను ఎదగడానికీ, పేరు తెచ్చుకోవడానికీ ఆత్రేయ ఆశీస్సులే కారణమని పాత్రో ప్రగాఽఢంగా నమ్మేవారు.
బాలచందర్‌ – పాత్రో
చిత్రసీమలో బాలచందర్‌తో దాదాపు ఇరవై ఏళ్లపాటు కలిసి ప్రయాణించారు పాత్రో. సున్నిత మనస్కుడిగా పేరున్న బాలచందర్‌ తన చుట్టూ ఉన్న మనుషుల పట్ల చాలా శ్రద్ధ చూపుతారు. అయితే నిర్లక్ష్యాన్ని ఆయన ఏమాత్రం సహించరని పేరు. అలాంటి ఆయన ముందు సిగరెట్‌ తాగడానికి అనుమతి ఉన్న ఏకైక వ్యక్తి పాత్రో అనేది నిజం. ఆ రోజుల్లో పాత్రో చైన్‌ స్మోకర్‌గా పేరుపొందారు. బాలచందర్‌ ముందు సిగరెట్లు తాగడానికి ఎవరూ ధైర్యం చేసేవాళ్లు కాదు. షూటింగ్‌ మధ్యలో సిగరెట్‌ తాగడం కోసం సెట్స్‌ బయటకు వెళ్లేవారు పాత్రో. ఆయన కంటిముందు కనిపించకపోవడంతో వాకబు చేసేవారు బాలచందర్‌. పాత్రో సెట్స్‌ మీదకు వచ్చాక, ఎక్కడికెళ్లావని అడిగేవారు. సిగరెట్‌ తాగడానికి వెళ్లానని పాత్రో చెప్పేవారు. ఓ వారం రోజుల పాటు ఇదే కొనసాగడంతో ఆయన పాత్రోని పిలిచి ‘‘ఇక్కడున్న వాళ్లలో దాదాపు అందరూ సిగరెట్‌ తాగేవాళ్లే. కానీ అలాంటి అలవాటే లేని మంచివాళ్లుగా నా దృష్టిలో పడాలని ప్రయత్నిస్తుంటారు. నువ్వొక్కడివే ధైర్యంగా సిగరెట్‌ తాగుతున్నానని చెప్తున్నావ్‌. షూటింగ్‌ జరిగే టైమ్‌లో నువ్వు సెట్స్‌ మీదే ఉండటం నాక్కావాలి. కాబట్టి, నా ముందే నువ్వు నిరభ్యంతరంగా సిగరెట్‌ తాగొచ్చు. దానివల్ల ఇద్దరికీ సమయం కలిసొస్తుంది’’ అన్నారు. షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పాక తర్వాత తీయాల్సిన సన్నివేశాల గురించి చర్చించుకుని, ఎవరి వెర్షన్‌లో వాళ్లు డైలాగ్స్‌ రాసేవాళ్లు ఆ ఇద్దరూ. మరుసటి రోజు షూటింగ్‌ మొదలుపెట్టే ముందు మాత్రమే వాళ్లు ఒకరి డైలాగ్స్‌ను మరొకరు చూసుకునేవాళ్లు. ఇక్కడ విశేషమేమంటే, పాత్రో సంభాషణల స్థాయిలో తన తమిళ వెర్షన్‌ డైలాగ్స్‌ లేవని భావించిన బాలచందర్‌, వాటిని మరింత బాగా రాయడం కోసం షూటింగ్‌ను వాయిదా వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఓ ద్విభాషా చిత్రం తమిళ వెర్షన్‌కు ‘నూల్‌ వేలి’ (దారపు హద్దు) అనే టైటిల్‌ పెట్టారు బాలచందర్‌. తెలుగుకు ఆ టైటిల్‌ నప్పదని చెప్పిన పాత్రో, ‘గుప్పెడు మనసు’ టైటిల్‌ సూచించారు. దాన్నే తెలుగు సినిమాకు పెట్టారు బాలచందర్‌. ఆ టైటిల్‌ ఆయనకు ఎంత నచ్చిందంటే తర్వాత కాలంలో తను తీసిన ఓ టీవీ సీరియల్‌కు ‘గుప్పెడు మనసు’ అనే పేరు పెట్టారు. అదీ పాత్రోకు ఆయనిచ్చిన గౌరవం, విలువ!

డెభ్బై – తొంభైలలో సినిమాలు చూసిన వాళ్లకు –
సినిమాల పేర్లు గుర్తుకున్నాయో లేదో తెలియదు కానీ.. ‘కథ, మాటలు – గణేష్‌పాత్రో’ అనే టైటిల్‌ మాత్రం కళ్లకు కట్టినట్లు మిగిలుంది. ఎందుకంటే ఆయన డైలాగులు నవరసాల నైవేద్యం కాబట్టి! పదుల సంఖ్యలో నాటకాలు, వందకు పైగా సినిమాల రచయితగా కీర్తిగడించిన ఆయన నిన్ననే కన్నుమూశారు. ఆ సందర్భ్బంగా పాత్రో జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు ప్రముఖ తెలుగు సినీ రచయిత దివాకర్‌బాబు..
‘‘కథకు పొంతన లేకుండా, పాత్రలకు సంబంధం లేకుండా రాసే రైటర్‌ కాదు ఆయన. ఒక క్యారెక్టర్‌కు ఒక మాట రాశాడంటే.. ఆ మాట సినిమా చూస్తున్న ప్రేక్షకుడి గుండెలోతుల్లోకి దూసుకెళ్లేది. కదిలించేది. నవ్వించేది. ఏడిపించేది. ఎంతటి విషయాన్నైనా వీలైనంత క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా చెప్పడం గణేష్‌పాత్రోకు వెన్నతోపెట్టిన విద్య. ఆయన పాత్రలతో మాట్లాడించే ప్రతీమాట కథతో మమేకం అయ్యుండేది. హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ రోజు రాయలేదు. అందుకే పాత్రో మాటలు పాత్రోచితంగానే మురిపిస్తాయి.
కదిలించిన నాటకాలు..
గణేష్‌పాత్రో నాటకాలు ఈ తరానికి తెలియకపోవచ్చు కాని.. మా తరాన్ని కదిలించాయవి. ఆయన ఎంత వేగవంతమైన రైటర్‌ అంటే- అప్పటికప్పుడు అనుకుని చకచకా రాసేయడంలో దిట్ట. ఒకసారి ఢిల్ల్లీలో నాటక పోటీలు జరుగుతున్నప్పుడు.. ఒక నాటకాన్ని రాయాలనుకున్నారు. అనుకున్నదే తడువు రాసి పోటీలకు పంపించి.. బహుమతి సాధించడం ఆయనకే చెల్లింది. పాత్రో రాసిన నాటకాల్లో నన్ను బాగా ఇన్‌స్పైర్‌ చేసింది ‘త్రివేణి’ నాటకం. జాతీయ భావాన్ని పెంపొందించే ఇతి వృత్తంతో వచ్చిందది. ఆ రోజుల్లో నేను కూడా అందులో ఒక పాత్ర వేసి స్టేజీ మీద నటించాను. దర్శకత్వమూ వహించాను. నన్ను నేను రైటర్‌గా తీర్చిదిద్దుకునేందుకు ఆ నాటకం ఎంతో ప్రేరణనిచ్చింది. ‘త్రివేణి’తో పాటు ‘కొడుకు పుట్టాలా?’, ‘పావలా’ వంటి నాటకాలు సైతం యువతను బాగా ఆకట్టుకున్నాయి.
మాటలు కాదు.. తూటాలు..
‘మరో చరిత్ర’ సినిమాను మనం ఎప్పటికైనా మరిచిపోగలమా? అది సాధ్యం కాదు. ప్రతి తరం ఆ సినిమాను చూస్తుంది. సినిమాతో పాటు దాని రచయిత గణేష్‌ పాత్రోను గుర్తుపెట్టుకుంటుంది ప్రేక్షకలోకం. ఆ చిత్రంలో ఒక సీను – హీరోయిన్‌ను వేధిస్తుంటాడు దుకాణం నడిపే విలన్‌. హీరోయిన్‌ ఆ షాపుకు వచ్చినప్పుడు ఒక ఫోటో ఆల్బమ్‌ తెరిచి.. నగ్నంగా ఉన్న అమ్మాయిల బొమ్మలు చూపిస్తాడతను. ఆ సందర్భంలో హీరోయిన్‌ వైపు అదోలా చూస్తూ ‘‘ఎలా ఉన్నాయ్‌?’’ అని అడుగుతాడు విలన్‌. అప్పుడు ఆ అమ్మాయి ‘‘చాలా బాగున్నాయ్‌! ఎవరివి మీ అమ్మవా?’’ అంటుంది. వాడికి అంతకంటే తగిన సమాధానం ఇక ఏ మాటలో దొరుకుతుందో చెప్పండి? ఇలా ప్రతీ డైలాగు ఎంత శక్తివంతమైనదో సినిమా చూసినవాళ్లకు అర్థం అవుతుంది.
ఇదే సినిమాలో మరోచోట – హీరోయిన్‌ను ‘‘అమ్మా, నీ బొట్టు ఏమైంది?’’ అనడుగుతాడు వాళ్ల అన్నయ్య. అప్పుడామె ‘‘కన్నీటి బొట్టు అయ్యింది’’ అంటుంది. అతను అడిగిన ప్రశ్నకు, ఆమె ఇచ్చిన సమాధానంతో ఆ సన్నివేశపు భావం ప్రేక్షకులకు సులువుగా అర్థం అవుతుంది.
రచయితలంటే గౌరవం..
నేడు రచయితలకు తోటి రచయితల మీద ఏమాత్రం గౌరవం ఉంటున్నదో అందరికీ తెలిసిందే! ఎవరో రాసిన కవితలను, పాటలను సినిమాల్లో వాడుకుని పేర్లు వేసుకునేవాళ్లున్న కాలం ఇది. ఆ రోజుల్లో గణేష్‌పాత్రోకు తోటి రచయితలంటే గౌరవం ఉండేది. ‘ఆకలిరాజ్యం’ తీస్తున్నప్పుడు- బాలచందర్‌, కమల్‌హాసన్‌లు ఇద్దరు తమిళులు. తెలుగులో ఏమి రాసినా వారేమీ పట్టించుకోరు. అలాంటిది.. ఈ సినిమాలో కమల్‌హాసన్‌కు శ్రీశ్రీ కవితలను మాటలుగా పెట్టారు గణేష్‌పాత్రో. ప్రతిచోట గమనిస్తే.. ‘శ్రీశ్రీ అన్నట్లు’ అంటూ రచయితను గుర్తుచేస్తూనే కవితను ఎత్తుకుంటాడు హీరో. అంతటి గొప్ప రచయితతో నేను కలిసి పనిచేయలేదు కానీ.. చాలాసార్లు కలిసే అవకాశం వచ్చింది. నేను రాసిన ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’ చిత్రాలు కూడా ఆయనకు బాగా నచ్చాయి..’’

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుట్టుకతో అంతా ముస్లింలే! అసదుద్దీన్ ఉవాచ

పుట్టుకతో అంతా ముస్లింలే!

  ఇతర మతాలవారు ఇస్లాంను ఆశ్రయించడమే అసలైన ఘర్‌వాపసీ
ఈ దేశం మా తాతముత్తాతల గడ్డ: అసద్‌

తల్లిదండ్రులే పిల్లల మతాన్ని మార్చేస్తున్నారు
అన్ని మతాలకూ అసలైన ఇల్లు ఇస్లామే
ఇస్లాంను ఆశ్రయించడమే అసలైన ఘర్‌వాపసీ
ఆరెస్సెస్‌ వాళ్లూ వినండి.. మీరే వాపస్‌ రండి
భారతదేశం మా తాతముత్తాతల గడ్డ: అసద్‌

భారతదేశంలో పుట్టిన వారంతా హిందువులేనని.. ముస్లింలు, 
క్రైస్తవులు ఘర్‌వాపసీలో భాగంగా హిందూమతంలోకి రావాలని ఆరెస్సెస్‌, వీహెచ్‌పీ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ బదులిచ్చారు. ‘ఆరెస్సెస్‌ వాళ్లూ వినండి..’ అని పేరు పెట్టి
ప్రస్తావించి మరీ సమాధానమిచ్చారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పుట్టుకతో ముస్లింలేనని, ఇతర మతాల వాళ్లంతా ఇస్లాంను ఆశ్రయించడమే అసలైన ఘర్‌ వాపసీ అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌, జనవరి 5: సెగలు పుట్టిస్తున్న ‘ఘర్‌వాపసీ’ వివాదానికి ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత ఆజ్యం పోశారు. మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘‘(మతం మార్చుకున్న) ముస్లింలకు రూ.5 లక్షలు.. క్రైస్తవులకు రూ.2లక్షలు ఇస్తారా? ఐదు లక్షలు కాదు.. ఐదు కోట్లు కాదు.. ఐదువేల కోట్లు కాదు.. ఐదు వందల కోట్ల డాలర్లు కాదు.. ప్రపంచంలో ఉన్న సంపదనంతా తెచ్చి మన కాళ్ల మీద పడేసినా అప్పుడు కూడా మనం ఇస్లాంను వదిలిపెట్టం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ.. వినండి ఆరెస్సెస్‌ వాళ్లల్లారా.. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ముస్లింగానే పుడతారు. పరిస్థితులు, వారి తల్లిదండ్రులు వారిని ఇతర మతాల్లోకి మారుస్తారు. అది మీ ఇష్టం. మీ విశ్వాసం ఏదైనాగానీ.. మా విశ్వాసం ప్రకారం ప్రతి ఒక్కరూ ముస్లింగానే పుడతారు. మీరే రండి వాపస్‌’’ అన్నారు. తమ విశ్వాసం ప్రకారం ప్రపంచంలోని అన్ని మతాలకూ అసలైన ఇల్లు ఇస్లామేనని.. ఇస్లాంలో బలవంతపు మతమార్పిడులు ఉండవని అన్నారు. అన్ని మతాలకు చెందినవారినీ మళ్లీ ఇస్లాంలోకి ఆహ్వానిస్తున్నామని, అయితే ఇందులో బలవంతం మాత్రం ఏమీ లేదని ఆయన అన్నారు. ‘‘తిరిగొస్తే మేం మీకేం పైసలివ్వం. ఇవ్వడానికి మా దగ్గరేం లేవు. కానీ, ఆ తర్వాతి కాలంలో మీరు ప్రపంచాన్నే జయిస్తామన్న గ్యారెంటీ మాత్రం ఇస్తాం. రండి’’ అన్నారు. ఇతర మతాలవారందరూ ఇస్లాంను ఆశ్రయించినప్పుడు మాత్రమే అసలైన ఘర్‌వాపసీ జరిగినట్టని పేర్కొన్నారు. అల్లా పంపితే ఆదం హిందుస్థాన్‌కు వచ్చారని.. ఇది తమ తాతముత్తాతల గడ్డ అని, మొత్తం దేశమే తమదైనప్పుడు తాము ఎవరి ఇంటికి తిరిగి రావాలని వ్యాఖ్యానించారు. కాగా, దేశవ్యాప్తంగా పలు పార్టీల నాయకులు ఒవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంకు కోసమే ఒవైసీ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మజీద్‌ మెమన్‌ అన్నారు. హిందూ, ముస్లిం ఛాందసవాదులు ఒకే నాణేనికి రెండు ముఖాల వంటివారని, ఇలాంటి వారి వ్యాఖ్యలు యావద్దేశానికీ హాని చేస్తాయని జేడీ(యు) నేత అలీ అన్వర్‌ అన్నారు. అసదుద్దీన్‌ ఒవైసీని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, వీహెచ్‌పీ నేత ప్రవీణ్‌ తొగాడియాలకు ముస్లిం ప్రతిరూపమంటూ జేడీ(యు)కే చెందిన మరో నేత కేసీ త్యాగి అభివర్ణించారు. ఒవైసీ, ఆయనలాంటి వారు చేసే వ్యాఖ్యలను ప్రజాస్వామ్యంమీద నమ్మకం ఉన్నవారెవరూ లక్ష్యపెట్టరాదని సీపీఐ నేత అతుల్‌ అంజాన్‌ అన్నారు. ఇక ఆరెస్సెస్‌, ఎంఐఎం నేతలను ఒకే గదిలో పెట్టి తాళం వేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా అన్నారు. కాగా… తన వ్యాఖ్యలపై జాతీయస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో అసదుద్దీన్‌ వివరణ ఇచ్చారు. మహ్మద్‌ ప్రవక్తకు సంబంధించిన ఉత్సవంలో తాను ఆ మాటలు చెప్పానని, మొత్తం గంటన్నర ప్రసంగంలో ఇంకా చాలా విషయాలతోపాటు అదీ చెప్పానని పేర్కొన్నా రు. ప్రజాస్వామ్యంలో తన అభిప్రాయాలు చెప్పుకొనే హక్కు తనకూ ఉందని, అవతలివాళ్లు నమ్మొచ్చు లేదా నమ్మకపోవచ్చని వ్యాఖ్యానించారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెనాలిలో లక్షా పదకొండు వేల భక్తులతో మహా హనుమాన్ పారాయణ -31-1-15 శనివారం -ఉదయం 6 గం లకు

tenali chalisa2 001 tenalichalisa1 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గోదారిలో యెన్ టి ఆర్

 

ఆహుతి ప్రసాద్‌కు చిత్రసీమ నివాళి (03-Jan-2015)

విలక్షణ శైలి
‘‘ఎన్నో మంచి పాత్రలకు తన విలక్షణ శైలితో ప్రాణం పోసిన నటుడు ఆహుతి ప్రసాద్‌. అనారోగ్యం పాలైన అతను త్వరగా కోలుకుంటారనుకున్నాను. కానీ అంతలో ఘోరం జరిగిపోయింది. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు.’’ – మోహన్‌బాబు
తీరని లోటు
‘‘ఆహుతి ప్రసాద్‌గారు కన్నుమూయడం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. చాలా మంచి సపోర్టింగ్‌ ఆర్టిస్ట్‌ ఆయన. వాళ్ల కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.’’ – ఎన్టీఆర్‌
వద్దన్నారు
‘‘రెండు రోజుల క్రితం ఫోనులో మాట్లాడా. వచ్చి కలుస్తానంటే వద్దన్నారు. ఆయన పోయారన్న వార్త విని షాక్‌లో ఉన్నా.’’ – వి.వి.వినాయక్‌
ఇటీవల కలిశా
‘‘ఆహుతి ప్రసాద్‌గారి ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెళ్లి పరామర్శించా. ఇతర థెరపీలను కూడా సజెస్ట్‌ చేశా. ఈ మధ్య ఆయన నాకు బాగా దగ్గరయ్యారు. అంతలోనే ఇలా జరిగింది.’’ – రాజశేఖర్‌
మంచి కుటుంబం
‘‘‘ఆహుతి’ సినిమాలో కలిసి నటించాం. అప్పటి నుంచీ ఫ్రెండ్లీగా ఉండేవారు. వాళ్లది అందమైన కుటుంబం. ఆయన లేని లోటును భరించే ధైర్యాన్ని ఆ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలి. ఇటీవల కూడా ఆసుపత్రికి వెళ్లి కలిశాం. తనకున్న వ్యాధిని గురించి పెద్దగా లెక్కచేయకుండా నవ్వుతూ మాట్లాడారు. ఆయన ఎప్పుడూ మరణాన్ని చూసి భయపడలేదు. చాలా ధైర్యవంతుడు.’’ – జీవిత
కలుపుగోలు వ్యక్తి
‘‘ఆహుతి ప్రసాద్‌ కలుపుగోలుగా ఉండే వ్యక్తి. ‘మా’ అసోసియేషన్‌కు కార్యదర్శిగా పనిచేశారు. ఎప్పుడూ పేద నటీనటులకు సాయం చేయాలన్న సంకల్పంతో పనిచేసేవారు. గతేడాది పలువురు సినీ ప్రముఖులు పోయారనే బాధతో ఉన్నాం. ఈ ఏడాది మొదలైన నాలుగు రోజుల్లోపే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు.’’  – మురళీమోహన్‌
ఒదిగిపోయే నటుడు
‘‘ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల అరుదైన నటుడు ఆహుతి ప్రసాద్‌గారు. ‘తులసి’, ‘దమ్ము’, ‘లెజెండ్‌’ సినిమాల్లో ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలను మర్చిపోలేను’’ – బోయపాటి శ్రీను
టిపికల్‌ కామెడీ
‘‘టిపికల్‌ కామెడీని పండించగలిగిన వ్యక్తి ఆహుతి. తను నవ్వకుండా ఎదుటివారిని నవ్వించగలిగే సత్తా ఆయన సొంతం. ఎన్ని సీరియస్‌ పాత్రల్ని చేసినా ఆఫ్‌ స్ర్కీన్‌లో చాలా జోవియల్‌గా ఉండేవారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో పలు కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించే వారు.’’ – శ్రీకాంత్‌
పలు పాత్రల్లో..
‘‘కమెడియన్‌గా, క్యారక్టర్‌ ఆర్టిస్టుగా రకరకాల పాత్రల్లో నటించిన నటుడు ఆహుతి ప్రసాద్‌గారు. హీరోగా తప్ప అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పించారు.’’ – అలీ
అద్భుత నటుడు
‘‘నవ్వించడం, ఏడిపించడం, విలనిజం… ఏ పాత్రనైనా అద్భుతంగా పండించగల నటుడు ఆహుతి ప్రసాద్‌. ఆయనతో కలిసి నటించిన ప్రతి సినిమా నాకు మెమరబుల్‌ మూవీనే. అందరినీ కలుపుకుని పోయే ఆయన లేరని తెలిసి షాక్‌తిన్నాను.’’ – అల్లరి నరేష్‌
రెండు సినిమాలు
‘‘‘రైడ్‌’, ‘జండాపై కపిరాజు’ సినిమాల్లో నేను ఆహుతిప్రసాద్‌గారితో కలిసి నటించాను. వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌ ఆయన. ఆయన్ని పోగొట్టుకున్నందుకు బాధగా ఉంది.’’ – నాని
హృదయాల్లో ఉన్నారు
‘‘భౌతికంగా మనకు దూరమైనప్పటికీ అద్భుతమైన పాత్రలతో మన హృదయాల్లో ఉన్న వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌ ఆహుతి ప్రసాద్‌గారు.’’ – పీవీపీ
అన్నయ్య అనేవాడిని

‘‘మధు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఫస్ట్‌ బ్యాచ్‌ స్టూడెంట్‌ ఆహుతి ప్రసాద్‌. నేను రెండో బ్యాచ్‌లో ఉండేవాడిని. అన్నయ్యా అని పిలిచేవాడిని. కొన్ని చిత్రాల్లో ఆయన పాత్రలకు డైలాగులు కూడా రాశా. ఎప్పుడు కనిపించినా ‘త్వరగా సెటిలవ్వండ్రా’ అంటూ ఆప్యాయంగా చెప్పేవారు.’’ – ఉత్తేజ్‌
విశిష్ట వాచకం విలక్షణ అభినయం (03-Jan-2015)
‘ఇతనితో డిఫరెంట్‌ కేరక్టర్లు చేయించొచ్చు’, ‘ఇతనిని పెట్టుకున్నామంటే ఆ పాత్రకు ప్రాముఖ్యం ఉండాలి’ అని దర్శకులు భావించే నటునిగా తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ‘ఆహుతి’ ప్రసాద్‌ కేన్సర్‌ వ్యాధితో బాధపడుతూ అర్ధంతరంగా కన్నుమూయడం తెలుగు చిత్రసీమను విచారంలో ముంచేసింది. సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకుని పేరు సంపాదించుకున్న అతి కొద్దిమంది నటుల్లో ఆయన ఒకరు. చొరవగా ముందుకెళ్లే మనస్తత్వం లేకపోవడంతో కెరీర్‌ మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ మితభాషి మరణం తర్వాతే ఆయన ఎంతమంది స్నేహితుల్ని సంపాదించుకున్నారో లోకానికి తెలిసింది. ‘ఆహుతి’ చిత్రంతోటే మొదటిసారిగా అందరి దృష్టిలో పడి, ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నప్పటికీ, ‘చందమామ’ చిత్రంలో చేసిన రామలింగేశ్వరరావు పాత్రే ఆయనకు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.
ఆహుతి ప్రసాద్‌ అసలు పేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్‌. కృష్ణాజిల్లా, ముదినేపల్లి పక్కన కోడూరు గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రంగారావు, హైమావతిల దంపతులకు నలుగురు అమ్మాయిల తర్వాత కలిగిన మగ సంతానం వరప్రసాద్‌. ఆయన తండ్రికి కర్ణాటక ట్రాన్స్‌ఫర్‌ కావడంతో మూడో తరగతి వరకు ఆయన చదువు అక్కడే సాగింది. నాలుగో తరగతి నుండి ఆరవ తరగతి వరకు కర్నూలులో ఆయన అక్క దగ్గర చదువుకున్నారు. తర్వాత కోదాడ, మిర్యాలగూడలో పదో తరగతి వరకు చదివి, అక్కడే ఇంటర్‌లో చేరారు. ఇంట్లో ఒక్కడే మగబిడ్డ కావడంతో కుటుంబం ఆయనను ఎంతో గారాబంగా పెంచింది. స్కూల్‌ రోజుల్లోనే ప్రసాద్‌కు నటన అంటే పిచ్చి. క్లాసులు ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసేవారు. నాగార్జున సాగర్‌లో చదువుతున్న
సమయంలో ‘అభినయం’ అనే నాటకం వేసి ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. అలాగే ఆయన వేసిన రెండో నాటకం ‘అన్నాచెల్లెళ్లు’ కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. దానికిగాను నాగార్జున సాగర్‌ డ్యామ్‌ ఛీప్‌ ఇంజనీర్‌ అప్పట్లో విదేశాల నుండి తెప్పించిన ఓ పెన్నును బహుమతిగా ఇవ్వడం ఎప్పటికీ మరువలేని అనుభూతిగా ఆహుతి ప్రసాద్‌ చెప్పేవారు. చదువులో బిలో ఏవరేజ్‌గా స్టూడెంట్‌గా ఉన్న ఆయనకు నాటకాల్లో ప్రశంసలు దక్కడంతో సినీ నటుడు కావాలనే ఆశ మరింత బలపడింది. సినిమాల్లోకి వెళ్తానంటే కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో చదువుపై అంతగా దృష్టిసారించక కోదాడలో డిగ్రీ మధ్యలో వదిలేశారు. పెళ్లి చేస్తే సినిమాల గొడవ పక్కన పెడతాడనే ఉద్దేశ్యంతో విజయనిర్మలతో పెళ్లి చేశారు పెద్దలు.
కెమెరా ముందుకు… 
పెళ్లి తర్వాత 1983 జనవరిలో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అందులో ఈయనదే మొదటి బ్యాచ్‌. రాంజగన్‌, శివాజీరాజా, అచ్చుత్‌, సుబ్బారావు ఈయనకు కొలీగ్స్‌. ఏడాది తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కి షిప్ట్‌ చేశారు. మధుసూధనరావుగారి ద్వారా తాతినేని ప్రకాశరావుగారితో పరిచయాన్ని పెంచుకున్నారు. ఆ పరిచయంతో ప్రకాశరావు ‘మీరు ఆలోచించండి’ సీరియల్‌లో నటించే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ప్రతాప్‌ ఆర్ట్స్‌లో ఓ సినిమాకు డబ్బింగ్‌ చెప్పడానికి వెళ్తే రాఘవగారబ్బాయి తీస్తున్న ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమాలో మెయిన్‌ విలన్‌గా బుక్‌ చేశారు. ఈలోగా మధుసూధనరావుగారికి మరో రెండు సినిమాలొచ్చాయి. ఒకటి ఉషాకిరణ్‌ మూవీస్‌లో ‘మల్లెమొగ్గలు’, రెండోది నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్‌’. ఈ రెండింటికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ నటించారు. ఆయన మొదట తెర మీద కనిపించిన సినిమా ‘విక్రమ్‌’. ఆ తర్వాత ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమా విడుదలైంది. మద్రాస్‌లో ఆ సినిమా చూసిన శ్యాంప్రసాద్‌ రెడ్డి ‘ఆహుతి’ సినిమాలో అవకాశమిచ్చారు. 1987 డిసెంబర్‌ 3న విడుదలైన ‘ఆహుతి’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో, రాజశేఖర్‌, జీవితతో పోటీపడుతూ హోమ్‌ మినిస్టర్‌ శుంభుప్రసాద్‌ పాత్రను ప్రసాద్‌ ఎంత బాగా చేశారో అందరికీ తెలిసిందే.
నష్టం తెచ్చిన ‘ఆహుతి’ పేరు
ఆహుతి ప్రసాద్‌ సినిమా కెరీర్‌ను పరిశీలిస్తే ‘చందమామ’ ముందు, ‘చందమామ’ తర్వాత – అని విభజించవచ్చు. ‘ఆహుతి’తో తొలి బ్రేక్‌ వచ్చినా, దానిని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు. మంచి మంచి అవకాశాలు వస్తున్న టైమ్‌లో మిత్రులైన నటులు రఘుబాబు, హరిప్రసాద్‌తో కలిసి కన్నడంలో సినిమాలు నిర్మించే పనిలో మునిగిపోయారు. దీంతో ఆయన నటించడం మానేశాడేమోనని అడగడం మానేశారు. పైగా జనార్దన వరప్రసాద్‌ పేరు కాస్తా, ‘ఆహుతి’ ప్రసాద్‌గా మారడంతో, ఆ పేరే ఆయనకు మైనస్‌గా మారింది. ‘ఆహుతి’ అనే పదాన్ని నిర్మాతలు నెగటివ్‌గా భావించడం వల్ల కూడా ఆయనకు అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడారు. ఏదైనా పాత్రకు ఆయనను తీసుకుందామని దర్శకులు అంటే, ‘ఆహుతా.. వద్దు లేవయ్యా. ఆ సౌండే బాగాలేదు’ అని నిర్మాతలు అనడం వల్ల పెద్ద పెద్ద సినిమాలే చేజారిపోయాయి. పైగా ఆయనది చొరవ తీసుకునే మనస్తత్వం కాదు. మొహమాటం, తనను తాను బూస్టప్‌ చేసుకునే తెలివితేటలు లేకపోవడం వల్ల కూడా అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ టైమ్‌లో కృష్ణవంశీ నుంచి ఆయనకు మంచి ఆఫర్‌ వచ్చింది. అది నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’లో హీరోయిన్‌ టబు తండ్రి కేరక్టర్‌. ఆ పాత్ర ఆయన కెరీర్‌కు రెండో బ్రేక్‌.

‘చందమామ’తో దశ తిరిగింది

‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత నుంచి ఆయన అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకపోయింది. అనేక కుదుపులతో అతలాకుతలమైన ఆయన కెరీర్‌ను ఆ సినిమా మంచి మలుపు తిప్పింది. చాలా సినిమాల్లో చేసిన పాత్రల్లో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. కానిస్టేబుల్‌ నుంచి ఐజీ దాకా అన్ని రకాల పోలీస్‌ పాత్రలను ఆయన చేశారు. దాదాపు తొంభై సినిమాల్లో పోలీస్‌ పాత్రలను పోషించిన రికార్డ్‌ ఆయనది. అయితే ‘ఆహుతి ప్రసాద్‌ ఇట్లా కూడా చేస్తాడు’ అనే పేరు తెచ్చిపెట్టిన చిత్రం ‘చందమామ’. దాని దర్శకుడూ కృష్ణవంశీయే. అందులో గోదావరి యాసతో మాట్లాడే రామలింగేశ్వరరావు పాత్ర ఆయన కెరీర్‌కు బోనస్‌లా మారింది. ఆలస్యంగానైనా ఆ కేరక్టర్‌ ఆయన సినీ జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. అప్పటివరకూ విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా సీరియస్‌గా కనిపిస్తూ వచ్చిన ఆయన కామెడీ కూడా గొప్పగా చేయగలడని ఆ సినిమా నిరూపించింది. రామలింగేశ్వరరావు పాత్రలో ఆహుతి ప్రసాద్‌ నటనను, ఆయన డైలాగ్స్‌ను ఆస్వాదించడానికే ఆ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు చాలామందే. ‘చందమామ’తో ఆయనకు ఎంత పేరొచ్చిందనేదానికి నిదర్శనం – విజయవాడలో ఆ సినిమా ఆడుతున్న థియేటర్‌ వద్ద నలభై అడుగుల ఆహుతి ప్రసాద్‌ కటౌట్‌ పెట్టడం. ‘‘ఈ సినిమాలో రామలింగేశ్వరరావు కేరక్టర్‌ వల్ల రిపీట్‌ ఆడియెన్స్‌ ఎక్కువగా ఉన్నారు కాబట్టే ఆయన కటౌట్‌ పెట్టాం’’ అని డిసి్ట్రబ్యూటర్లు చెప్పారు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో చేసినప్పట్నించీ, కృష్ణవంశీకి సన్నిహితుడు కావడం, ఆయన వద్ద గోదావరి యాసలో జోకులు చెప్తుండటం వల్లే రామలింగేశ్వరరావు పాత్ర ఆయనకు లభించింది. కృష్ణవంశీ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు.
రెండు నందులు
ఇరవై ఏడేళ్ల కెరీర్‌లో 250కి పైగా చిత్రాలు చేసిన ఆయన నటనా ప్రతిభకు గుర్తింపుగా రెండు నంది అవార్డులు లభించాయి. మొదట ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ చిత్రానికి ఉత్తమ ప్రతినాయకుడిగా అవార్డు పొందిన ఆయన, రెండోసారి ‘చందమామ’లోని రామలింగేశ్వరరావు పాత్రను పోషించిన తీరుకు ఉత్తమ కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా అవార్డు అందుకున్నారు. ‘విక్రమ్‌’ సినిమాకి సంబంధించిన రెమ్యూనరేషన్‌ను శివాజీ గణేశన్‌ చేతులు మీదుగా అందుకోవడం, హిందీ ‘సూర్యవంశ్‌’లో అమితాబ్‌తో పద్దెనిమిది రోజులు కలిసి పనిచేయడం, కమల్‌హాసన్‌తో ఓ తమిళ సినిమా చేయడం తన జీవితంలో మరపురాని క్షణాలని ఓ సందర్భంగా ఆయన చెప్పుకున్నారు. అలాగే విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీ రామారావుతో కలిసి నటించకపోవడం తీరని లోటుగా ఆయన భావించేవారు. తెరపై నటుడు కావాలనే కోరికను తీర్చుకుని, స్వయంకృషి, పట్టుదలతో ఓ చక్కని నటునిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వరప్రసాద్‌ మరణంతో తెలుగు చిత్రసీమ ఓ నిఖార్సయిన తెలుగు నటుణ్ణి అర్ధంతరంగా కోల్పోయినట్లయింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముక్కలవుతున్న మగ్గం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుస్తక సరస్వతీ సం ”దర్శనం ”-అనే 26 వ విజయవాడ పుస్తక మహోత్సవం అనే బుక్ ఫెస్టివల్ 4-1-15-ఆదివారం

This gallery contains 40 photos.

More Galleries | Tagged | Leave a comment

ఇండస్ట్రీని నిలబెట్టిన ఘనత వాళ్ళదే! దర్శకుడు తాతినేని రామా రావు

ఇండస్ట్రీని నిలబెట్టిన ఘనత వాళ్ళదే!

తెలుగు, తమిళ, కన్నడ వంటి దక్షిణాది భాషల్లో సినిమాలు తీసేవాళ్లకు.. 
బాలీవుడ్‌లో అడుగుపెట్టడం ఒక కల! ఇప్పటికీ ముంబయికి వెళ్లి హిందీలో సినిమా చేయడం ప్రిస్టీజ్‌గానే భావిస్తారు సినీ నిర్మాతలు, దర్శకులు. అలాంటిది ఆ రోజుల్లోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి – బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, అనీల్‌కపూర్‌, రాజ్‌బబ్బర్‌, జితేంద్ర, ధర్మేంద్ర, రేఖ, హేమమాలిని వంటి హేమాహేమీలతో కలిసి పనిచేసిన స్టార్‌ దర్శకులు తాతినేని రామారావు. తెలుగు, హిందీలలో సుమారు నాలుగు దశాబ్దాలపాటు కొనసాగి ముప్పావు వంతు సినీ విజయాలు సొంతం చేసుకున్న ఆయన తన జ్ఞాపకాలను ‘నవ్య’తో పంచుకున్నారు..
‘‘మాది కృష్ణా జిల్లా, వ్యవసాయ కుటుంబం. కపిలేశ్వరపురంలో పుట్టాను నేను. ఏలూరులో ఇంటర్‌ వరకు చదువు సాగింది. ఇంజనీరింగ్‌ చేయాలనుకున్నాను కానీ, ముల్కీ నిబంధనల వల్ల సీటు రాలేదు. ఇతర కోర్సుల్లో చేరడానికి సమయం ముగిసిపోయింది. దీంతో ఏడాదంతా ఖాళీగా ఉండాల్సిన పరిస్ధితి. అలా 18 ఏళ్ల వయసులో 1957లో చెన్నై చేరుకున్నాను. మా వూరి మనిషి, మాకు బంధువు కూడా అయిన తాతినేని ప్రకాశరావు అప్పట్లో పెద్ద పేరున్న దర్శకుడు. ఎల్‌వి ప్రసాద్‌ దగ్గర పనిచేశారాయన. ప్రసాద్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ (పిఎపి)లో ‘ఇల్లరికం’ సినిమాను నాగేశ్వరరావుతో తీస్తున్నారప్పుడు. ఆ సినిమాకు నేను తొలిసారిగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను. ఆ సమయంలో నా నెల జీతం రూ.100 మాత్రమే. దాంతోనే తిండీతిప్పలన్నీ నడిచిపోయేవి. నాతో పాటు ప్రత్యగాత్మ, సుబ్బారావు కూడా దర్శకత్వ శాఖలో పనిచేసేవారు. అవకాశం రావడంతో ప్రత్యగాత్మ ‘భార్యాభర్తలు’ సినిమాకు దర్శకుడయ్యాడు. ఆయన నన్ను అసోసియేట్‌ దర్శకునిగా తీసుకున్నారు.
టర్నింగ్‌ పాయింట్‌
అలా 1964 వరకు ‘భార్యాభర్తలు’, ‘కులగోత్రాలు’, ‘మనసులు-మమతలు’, ‘పునర్జన్మ’ వంటి చిత్రాలకు పనిచేసే అవకాశం చిక్కింది. తమిళంలో వచ్చిన ‘నవరాత్రి’ చిత్రాన్ని సావిత్రి కొనుగోలు చేశారు. తెలుగులో తీయాలనుకున్నారు ఆవిడ. ఈ సినిమా రీమేక్‌లో సావిత్రితో పాటు పిఎపి కూడా భాగం పంచుకుంది. సావిత్రి కుమార్తె పేరు మీద ‘విజయచాముండేశ్వరి’ బ్యానర్‌పై తెరకెక్కింది. దర్శకునిగా ఇదే నా తొలి సినిమా. ఇందులో నాగేశ్వరరావువి తొమ్మిది పాత్రలు. ఒక్కో పాత్రకు ఒక్కో భావం, భాష, రంగు, రుచి ఉంటాయి. నవరసాలతో నిండిన అన్ని భావాలను ఆయన అలవోకగా పండించారు. మళ్లీ నాగేశ్వరరావు-జయలలితలతో ‘బ్రహ్మచారి’ చిత్రాన్ని తెరకెక్కించాను. తరువాత కృష్ణ, శోభన్‌బాబులతో ‘మంచి మిత్రులు’ తీశాను. ఇందులో విజయనిర్మల కథానాయకి. వరుస విజయాలు రావడంతో వరుసగా సినియాలు వచ్చాయి. అవకాశాల కోసం వెతుక్కోనవసరం లేకపోయింది. 1964లో ‘మంచి మనిషి’ చిత్రానికి ఫస్ట్‌ అసిస్టెంట్‌గా ఉన్నపుడే వివాహం జరిగింది. పెళ్లి అయ్యాకే దర్శకునిగా నిలదొక్కుకున్నాను. హరనాధ్‌తో కూడా ‘నడమంత్రపు సిరి’ అనే సినిమా చేశాను. శోభన్‌బాబుతో ‘జీవనతరంగాలు’ తీస్తే చాలా బాగా ఆడింది. ఆ సినిమా పాటలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి.
ఎన్‌టీఆర్‌ నుంచి పిలుపు..

మొదటి నుంచీ పిఎపి వారితో కలిసి ఉండడంతో అక్కినేని నాగేశ్వరరావుతో సినిమాలు తీయగలిగాను. ఆయనతో చేసిన సినిమాలు పదిహేను. అలా ఉండగా 1978లో ఎన్‌టిఆర్‌తో సినివ ూ తీసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. కెమెరామెన్‌ వెంకటరత్నానికి సినిమా చేస్తానని ఎన్‌టీఆర్‌ మాట ఇచ్చి ఉన్నారు. ఆ సినిమా పుండరీకాక్షయ్య తీయాల్సి ఉంది. కానీ ఆలస్యం అవుతోంది. ఇలా ఏవో డేట్లు సర్ధుబాటులో భాగంగా 28 రోజులు కాల్షీట్లు ఉన్నాయి. ‘‘త్వరగా సినిమా తీస్తానంటే చెప్పు, నేను సిద్దం’’ అని ఎన్‌టిఆర్‌ అనగానే, వెంకటరత్నం ఒప్పేసుకుని, సరే అన్నాడు. దీనితో డివి నరసరాజుగారి కథ ఆధారంగా ‘యమగోల’ తీశాం. 28 రోజుల్లో తీసిన సినిమా అది. పరుగు పరుగున చిత్రీకరణ జరిపాం. నెల్లూరు సమీపంలోని ఓ గ్రామంలో నాలుగు పాటలు పూర్తి చేశాం. అదే సమయంలో ఎన్‌టీఆర్‌ మరో సినిమా రీ రికార్డింగ్‌తో బిజీగా ఉండేవారు. ఉదయం మాకు కాల్షీట్‌ ఇచ్చేవారు. ఆయన రాగానే ఆయన సీన్లు అన్నీ తీసేసే వాణ్ని. 12 గంటల తరవాత ఆయన రికార్డింగుకు వెళ్లి 3 గంటల ప్రాంతంలో వచ్చే వారు. తిరిగి సాయంకాలం వరకూ ఆయనతో ఉన్న కాంబినేషన్‌ సీన్లు చిత్రీకరించే వాణ్ని. ఎంత హడావుడిగా తీసినా, నాణ్యతలో రాజీ లేదు. అన్నీ పక్కా, రాసి పెట్టుకుని, జాగ్రత్తగా తీసేవాళ్లం. ఆ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. అప్పటి రాజకీయాలపై సెటైర్లు ఎన్‌టీఆర్‌ నోట బాగా పండాయి. ఆ తరువాత ఎన్‌టీఆర్‌తో ‘ఆటగాడు’, ‘అనురాగదేవత’ వంటి మూడు సినిమాలు చేశాను.
హిందీలో హవా..
అక్కినేని నాగేశ్వరరావు, వాణీశ్రీ జంటగా తీసిన ‘ఆలుమగలు’ పెద్ద హిట్‌. దీన్ని హిందీలోను తీయాలనుకున్నాం. అంతకు ముందు ‘ఇల్లరికం’, ‘భార్యభర్తలు’ వంటి సినిమాలను కూడా హిందీలో రీమేక్‌ చేశాను. అవన్నీ 25 వారాలకు పైగా ఆడి, ఘనవిజయం సాధించాయి. ఒక దశలో జితేంద్ర ఈ రీమేక్‌లలో నటిస్తూ, మద్రాసులోనే ఉండిపోయారు. ‘ఆలుమగలు’ జితేంద్ర- రేఖ జంటగా హిందీలో తీశాను. విజయం సాధించింది. అయితే ‘యమగోల’ మాత్రం అక్కడ నిరాశ పరిచింది. ఈ దశలో డూండి, సునంది, పిఎపి, జగపతి, నా స్వంత సంస్థ లక్ష్మీ ప్రొడక్షన్స్‌ వంటి తెలుగు నిర్మాతలకే వరుసగా పలు హిందీ సినిమాలు చేశాను. దీనితో పరిశ్రమ హైదరాబాదుకు మారుతున్న సమయంలో నేను ముంబైలో ఉండిపోయా. హైదరాబాద్‌ షూటింగ్‌లకు వెళ్లినా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోలేకపోయాను. ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమాను ‘అంధాకానూన్‌’ పేరుతో హిందీలో చేశాను. ఇందులో అమితాబ్‌ పాత్ర నిడివి పెంచా. అలాగే రజనీకాంత్‌కి ఇదే తొలి హిందీ సినిమా. అతనితో హిందీ సినిమా ఏమిటని చాలా మంది వారించారు. అయినా సరే తీశాను. విజయం వరించింది. 1979-2000 మధ్య హిందీలో 30 సినిమాలు చేశాను. అందరూ అప్పట్లో ప్రముఖ తారలే, ఎవరితోనూ ఇబ్బంది కలగలేదు. రెండేళ్ల క్రితం కుటుంబంతో ముంబై వెళ్లినపుడు అమితాబ్‌ని కలిశాను. ఆయనలో మునుపటి ఆదరణే కనిపించింది.
పరుగు ఆపడం ఒక కళ..
‘‘మనం ఎక్కడ పరుగు ఆపాలో తెలుసుకుంటే, జీవితంలో ఏ చింత ఉండదు. తెలుగు, హిందీ సినిమా రంగంలో 40 ఏళ్లకు పైగా కొనసాగాను. 65 చిత్రాలకు దర్శకత్వం చేశాను. ఎన్నడూ హద్దు దాటలేదు. నిత్యం వ్యాయామం చేయడం, మితాహారం తీసుకోవడం వంటి నియమాలు పాటిస్తున్నాను. 43 సంవత్సరాల సుదీర్ఘసినీ ప్రస్థానంలో 65 సినిమాలే చేశాను..’’
రేటు తగ్గించుకున్నారు..
‘‘ఒక సందర్భంలో – సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న అగ్రనటులు ఎన్‌టిఆర్‌-ఏఎన్‌ఆర్‌లు తమ పారితోషికాలను సైతం భారీగా తగ్గించి నిర్మాతలకు సహకరించిన రోజులున్నాయి. అక్కినేని గారు అయితే, చాలా అరుదుగా తన రేటును పెంచే వారు. రేటు పెంచుతానంటే, దుక్కిపాటి మధుసూధనరావే నాగేశ్వరరావుని కసురుకునేవారు. ‘నీవు రేటు పెంచితే, నిర్మాత ఎలా భరిస్తాడు? పెంచవద్దు’ అని స్నేహపూర్వకంగానే వారించేవారు. ఆ వాతావరణం ఇప్పుడు ఎక్కడుంది?’’
అలా బయటపడ్డాను..
‘‘అనిల్‌కపూర్‌, రవీనాటాండన్‌, రేఖలు ప్రధాన పాత్రల్లో ‘బులంది’ సినిమా చేశాను. అది పోయింది. పెద్దగా ఆడలేదు. ఆ తరువాత ఇక సినిమాలు మనకు పనికిరావని తెలుసుకున్నాను. గౌరవంగా విరమించుకోవడం మంచిదని భావించా. చెన్నై సమీపంలో గుమ్మడిపూండి వద్ద ఒక పరిశ్రమ ఏర్పాటు చేశాను. నా కుమారుడు ఇంజనీర్‌. అతనే ఆ వ్యాపారం చూస్తాడు. ప్రస్తుతం ఆ సంస్థలో 200పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇంతమందికి పని కల్పించడం కాస్త గర్వంతో కూడిన సంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది..’’
మన్నవ గంగాధర ప్రసాద్‌, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాసులు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment