ముతక కథనం మూలింటామె – తెలకపల్లి రవి

ముతక కథనం మూలింటామె – తెలకపల్లి రవి
పచ్చనాకు సాక్షిగా జీవిత సత్యాలను చెప్పే నామిని తాజా నవల ‘మూలింటామె’పై చాలా చర్చలే జరిగాయి. మూలింటామె నవలపై చర్చలో అధిక భాగం అందులో వున్నది వాస్తవమా కాదా పల్లెల్లో అలాటి వారు వున్నారా లేదా అనే నైతిక కోణంలోనే నడిచినట్టు కనిపిస్తుంది. రచనగా, రచయిత దృక్పథ సూచికగా దాన్నెలా చూడవలసి ఉంటుందనేది నా పరిశీలన.
చెప్పాలంటే పచ్చనాకు సాక్షిగా నుంచి నామిని నెంబర్‌ వన్‌ పుడింగి రాసేనాటికి ఈ రచయితలో మార్పు అంతకంతకూ ప్రస్ఫుటమవుతూ వచ్చింది. జీవిత సత్యాలను సహజ భాషలో చెబుతాడన్న ప్రశంస కాస్త వికటించింది. ప్రకృతిలో ప్రపంచంలో ప్రథమ సత్యమైన అమ్మ ప్రేమను చెప్పినంత వరకూ ఆయన శైలి అంత స్వచ్ఛంగానూ ఉంది. ఆ పైన మిట్టూరులో మట్టి మనుషుల గురించి చెప్పినప్పుడు కూడా జీవన భాష్యంలానే అనిపించింది. ఒక దశ తర్వాత రచనా శైలి ఇంకా చెప్పాలంటే రచయిత శైలి మారుతూ వచ్చింది. వీరారాధనలూ విచక్షణారహితమైన స్వీయారాధనల దుష్పలితంగానే ఇది కనిపిస్తుంది. ఇలా జరక్కూడదంటే రచయితలకు చాలా స్వీయ నిబద్ధత లేదా నియంత్రణ ఉండాలి. నీతి రీతి ఎవరి ఇష్టం వారిది అని చెప్పడానికి నియతి నిజాయితీ ఉండాలి.
ఏ పల్లెల్లో ఏఏ పదాలతో తిట్లతో బూతులతో ఆడజనం మాట్లాడుకుంటారో తెలియదు గాని నామిని ఎంచుకున్న ఈ మూలింటామె కథ పొడుగునా ప్రతి పేజీకి కనీసం పది పలకలేని మాటలుంటాయి. మూలింటామె మొదటామెతో సహా ఆడవాళ్లందరూ లోలోపల చాలా చేశామని చెప్పుకుంటుంటారు. మరోవైపున వయసులో చాలా చిన్నదైన పందొసంతను పెళ్లి చేసుకున్న నారాయుడు మాత్రం ఇవేవీ పట్టకుండా ఆమెతో ‘సహజీవనం’ చేస్తున్న గుడుగుడు చంద్రుడికి తోకలా వ్యవహరిస్తుంటాడు. ఈ ముగ్గురూ ఒక జట్టుగా మెలగడం, ప్రత్యేకించి వసంత చంద్రుల పోకడలు రచయిత విపులంగా వివ రంగా పొందుపరుస్తాడు. మూలింటామె నవల (నిజానికి పెద్ద కథ) పల్లెటూళ్ళలో మారుతున్న పరిస్థితులను చిత్రించిందని కొంతమంది చేస్తున్న సమర్థన వాదనకు నిలవదు. కథ ప్రకారమే చూసినా ఇవన్నీ ఈ రోజునే జరిగినవి కావు. చెట్లు కొట్టేయడం, సేద్యం మానేయడం వంటివి పందొసంతలే గాక అన్ని రకాల వారూ చేస్తారు. ఇక సహజ భాష అన్న మాటకొస్తే ఇంతకంటే పచ్చిగా మాట్లాడుకోవడం అందరికీ తెలుసు. ఆమె కన్నా ఘోరమైన పాత్రలూ తెలుసు. అయితే వాటిని ఏ మేరకు ఏ తీరుగా చిత్రిస్తామన్నదే ప్రశ్న. పందొసంత-గుడుగుడు చంద్రుడు-నారాయుడు త్రయం చుట్టూనే కథ తిప్పడం ద్వారా నామిని అదనంగా చెప్పిన కొత్త విషయమేమీ లేదు. ఇలాటి వ్యవహారాలు వుంటాయని ఎవరికీ తెలియదనీ కాదు. ఒక ఆర్థిక సామాజిక కథాక్రమాన్ని చెప్పే సందర్భంలో ఎలాటి ఘటనలనైనా పాత్రలనైనా రచయితలు పొందుపర్చవచ్చు. మాలపల్లి నుంచి మైదానం వరకూ తెలుగు సాహిత్యంలో అర్ధశతాబ్ది కిందటే ఇలాటి అంశాలు వచ్చాయి. అయితే ఏ నేపథ్యంలో ఏ సందేశంతో చెప్పారన్నదే కీలకం. మూలింటామె చదివితే మాత్రం రచయిత అక్రమం అనుకున్న రాసలీలలపైనే కలం నడిపించారు. పోనీ పల్లెల్లో అది సహజం అని చెప్పడానికి రాశాడనుకుందామా అంటే జనం అలా అనుకున్న ప్రతి సందర్భాన్ని వ్యంగ్యంగా చిత్రించారు. పైగా అనేక ముఖ్య ఘట్టాల్లో పరస్పర విరుద్ధమైన కథనాలు ఇస్తూ ఏది వాస్తవమో తేల్చకుండా వదిలేశారు. వ్యభిచారం అన్న భావన ఆధారంగా ఉద్భవించిన అనేక జుగుప్సాకర పదాలను అదే పనిగా గుప్పించి వదిలిపెట్టారు. అవన్నీ మహిళను కించపర్చేవిగా వుండగా గుడుగుడు చంద్రుడి వంటి పాత్రలను మాత్రం ఘనంగానే వర్ణించారు.
నామిని హఠాత్తుగా సీ్త్రల నైతికతపై ఈ కాలంలో ఇంత కథనం వదలడం ఆశ్చర్యకరం. పైగా అనైతికత వారిలో సార్వత్రికమన్నట్టు చెప్పే అనేకానేక సంభాషణలనూ సన్నివేశాలనూ గుప్పించి వదలిపెట్టారు. వాటిని బేఖాతరు చేసినట్టుగాక సమాజమే నీతి బాహ్యమైందన్నట్టు చిత్రించారు.ఆయనకు ఆధారమైన ఉదాహరణలు ఏమిటో తెలియదు గాని మన సమాజం ఇంత అస్తవ్యవస్తంగా అనాగరికంగా లేదని మాత్రం చెప్పొచ్చు. ఆయన అలా అనుకున్నా మహిళలను మాత్రమే ఆడిపోసుకోవడం సంస్కారం కాదనీ చెప్పకోవాలి. నామిని మీద ప్రేమతోనో ఆయన భాషపైన మోజుతోనో కొందరు ఈ నవల ప్రపంచీకరణకు ప్రతిబింబం అన్నట్టు పల్లెలు నిజంగానే పాడైపోయినట్టు సమర్ధించడం కూడా పాక్షికంగానే నిలబడుతుంది. ఎవరు ఏ కథ రాసినా అందులోని వైరుధ్యాలను భిన్న శక్తుల సంఘర్షణను చెబితే అప్పుడు సమాజీకులు పరిణామక్రమాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంతా పాడై పోయిందనీ పాడై పోవడం మామూలేననీ సాధారణీకరణ చేసిపారేస్తే వాస్తవికత కాదు. పిల్లులను తీసుకొస్తేనో మొక్కల కోసం విచారిస్తేనో ఒక రచన ప్రకృతి సిద్ధమై పోదు, వికృతి మాసిపోదు.
తెలుగునాట అమ్మపైన నాకు పేటెంటు వుందని గర్వపడిన ఒక రచయిత ఆడాళ్లందరిలోనూ అదే అమ్మతనం చూడలేకపోవడం బాధాకరం. లావుగా ఉన్న వారిని పంది అంటారు గనక పుస్తకం పొడుగునా పందొసంత అని రాయడం, కుల సీ్త్రల కులటతనాన్ని పేజీల కొద్ది చిత్రించడం సహజత్వం ముద్రతో నడిచిన మనో చాపల్యం మాత్రమే. రచయిత తన కులం పేరే వాడుతున్నారు గనక దీనిపై ఏది రాసినా చెల్లిపోయినట్టేనా? కొడవటి గంటి కుటుంబరావు కూడా చాలా దశాబ్దాల కిందటే పతివ్రత అనే కథ రాశారు. అయన కథలు నవలలు చాలా వాటిలో శారీరక సంబంధాల ప్రస్తావనలుంటాయి. బాలచందర్‌ చిత్రాల్లోనూ నైతిక విలువల ఘర్షణను, జీవితపు వికార పార్శ్వాన్ని చూపించే పాత్రలు ఎన్నో ఉంటాయి గాని ఆ తరహా వేరు. సమాజంలో పౌరుల్లాగే రచయితలు కూడా ఐచ్ఛికంగా కొన్ని ప్రమాణాలు పాటించడం రచనా శిల్పంలో భాగం తప్ప ప్రత్యేక నైతిక సూత్ర బోధన కాదు. రచయిత అనుకున్నా లేకున్నా కొంతమంది ఇందులో ప్రపంచీకరణ ప్రభావాలను చూడటానికి ప్రయత్నించడం కృత్రిమ సమర్థన కోసమే అక్కరకు వస్తుంది. మూలింటి మొదటామె గురించిన కథ నాటికి ఏ ప్రపంచీకరణ ఉంది? నెంబర్‌ వన్‌ పుడింగిలో కేవలం ఆత్మస్తుతి, అనుచితమైన పరనింద, ఆదరించినవారిపట్ల అపహాస్యం వుంటే మూలింటామెలో మొత్తం సమాజాన్ని చులకన చేసే జుగుప్సాకర ధోరణి ఉంది. ఇందుకు విచారిస్తూ తొలినాటి సహజ వాస్తవికతకు తిరిగి వస్తారని ఆశిస్తున్నాను.
– తెలకపల్లి రవి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కేన్సర్ కు”ఆహుతి ” ప్రసాద్

కేన్సర్ కు”ఆహుతి ” ప్రసాద్

విశిష్ట వాచకం విలక్షణ అభినయం (03-Jan-2015)
‘ఇతనితో డిఫరెంట్‌ కేరక్టర్లు చేయించొచ్చు’, ‘ఇతనిని పెట్టుకున్నామంటే ఆ పాత్రకు ప్రాముఖ్యం ఉండాలి’ అని దర్శకులు భావించే నటునిగా తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ‘ఆహుతి’ ప్రసాద్‌ కేన్సర్‌ వ్యాధితో బాధపడుతూ అర్ధంతరంగా కన్నుమూయడం తెలుగు చిత్రసీమను విచారంలో ముంచేసింది. సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకుని పేరు సంపాదించుకున్న అతి కొద్దిమంది నటుల్లో ఆయన ఒకరు. చొరవగా ముందుకెళ్లే మనస్తత్వం లేకపోవడంతో కెరీర్‌ మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ మితభాషి మరణం తర్వాతే ఆయన ఎంతమంది స్నేహితుల్ని సంపాదించుకున్నారో లోకానికి తెలిసింది. ‘ఆహుతి’ చిత్రంతోటే మొదటిసారిగా అందరి దృష్టిలో పడి, ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నప్పటికీ, ‘చందమామ’ చిత్రంలో చేసిన రామలింగేశ్వరరావు పాత్రే ఆయనకు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.
ఆహుతి ప్రసాద్‌ అసలు పేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్‌. కృష్ణాజిల్లా, ముదినేపల్లి పక్కన కోడూరు గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రంగారావు, హైమావతిల దంపతులకు నలుగురు అమ్మాయిల తర్వాత కలిగిన మగ సంతానం వరప్రసాద్‌. ఆయన తండ్రికి కర్ణాటక ట్రాన్స్‌ఫర్‌ కావడంతో మూడో తరగతి వరకు ఆయన చదువు అక్కడే సాగింది. నాలుగో తరగతి నుండి ఆరవ తరగతి వరకు కర్నూలులో ఆయన అక్క దగ్గర చదువుకున్నారు. తర్వాత కోదాడ, మిర్యాలగూడలో పదో తరగతి వరకు చదివి, అక్కడే ఇంటర్‌లో చేరారు. ఇంట్లో ఒక్కడే మగబిడ్డ కావడంతో కుటుంబం ఆయనను ఎంతో గారాబంగా పెంచింది. స్కూల్‌ రోజుల్లోనే ప్రసాద్‌కు నటన అంటే పిచ్చి. క్లాసులు ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసేవారు. నాగార్జున సాగర్‌లో చదువుతున్న
సమయంలో ‘అభినయం’ అనే నాటకం వేసి ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. అలాగే ఆయన వేసిన రెండో నాటకం ‘అన్నాచెల్లెళ్లు’ కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. దానికిగాను నాగార్జున సాగర్‌ డ్యామ్‌ ఛీప్‌ ఇంజనీర్‌ అప్పట్లో విదేశాల నుండి తెప్పించిన ఓ పెన్నును బహుమతిగా ఇవ్వడం ఎప్పటికీ మరువలేని అనుభూతిగా ఆహుతి ప్రసాద్‌ చెప్పేవారు. చదువులో బిలో ఏవరేజ్‌గా స్టూడెంట్‌గా ఉన్న ఆయనకు నాటకాల్లో ప్రశంసలు దక్కడంతో సినీ నటుడు కావాలనే ఆశ మరింత బలపడింది. సినిమాల్లోకి వెళ్తానంటే కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో చదువుపై అంతగా దృష్టిసారించక కోదాడలో డిగ్రీ మధ్యలో వదిలేశారు. పెళ్లి చేస్తే సినిమాల గొడవ పక్కన పెడతాడనే ఉద్దేశ్యంతో విజయనిర్మలతో పెళ్లి చేశారు పెద్దలు.
కెమెరా ముందుకు… 
పెళ్లి తర్వాత 1983 జనవరిలో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అందులో ఈయనదే మొదటి బ్యాచ్‌. రాంజగన్‌, శివాజీరాజా, అచ్చుత్‌, సుబ్బారావు ఈయనకు కొలీగ్స్‌. ఏడాది తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కి షిప్ట్‌ చేశారు. మధుసూధనరావుగారి ద్వారా తాతినేని ప్రకాశరావుగారితో పరిచయాన్ని పెంచుకున్నారు. ఆ పరిచయంతో ప్రకాశరావు ‘మీరు ఆలోచించండి’ సీరియల్‌లో నటించే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ప్రతాప్‌ ఆర్ట్స్‌లో ఓ సినిమాకు డబ్బింగ్‌ చెప్పడానికి వెళ్తే రాఘవగారబ్బాయి తీస్తున్న ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమాలో మెయిన్‌ విలన్‌గా బుక్‌ చేశారు. ఈలోగా మధుసూధనరావుగారికి మరో రెండు సినిమాలొచ్చాయి. ఒకటి ఉషాకిరణ్‌ మూవీస్‌లో ‘మల్లెమొగ్గలు’, రెండోది నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్‌’. ఈ రెండింటికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ నటించారు. ఆయన మొదట తెర మీద కనిపించిన సినిమా ‘విక్రమ్‌’. ఆ తర్వాత ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమా విడుదలైంది. మద్రాస్‌లో ఆ సినిమా చూసిన శ్యాంప్రసాద్‌ రెడ్డి ‘ఆహుతి’ సినిమాలో అవకాశమిచ్చారు. 1987 డిసెంబర్‌ 3న విడుదలైన ‘ఆహుతి’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో, రాజశేఖర్‌, జీవితతో పోటీపడుతూ హోమ్‌ మినిస్టర్‌ శుంభుప్రసాద్‌ పాత్రను ప్రసాద్‌ ఎంత బాగా చేశారో అందరికీ తెలిసిందే.
నష్టం తెచ్చిన ‘ఆహుతి’ పేరు
ఆహుతి ప్రసాద్‌ సినిమా కెరీర్‌ను పరిశీలిస్తే ‘చందమామ’ ముందు, ‘చందమామ’ తర్వాత – అని విభజించవచ్చు. ‘ఆహుతి’తో తొలి బ్రేక్‌ వచ్చినా, దానిని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు. మంచి మంచి అవకాశాలు వస్తున్న టైమ్‌లో మిత్రులైన నటులు రఘుబాబు, హరిప్రసాద్‌తో కలిసి కన్నడంలో సినిమాలు నిర్మించే పనిలో మునిగిపోయారు. దీంతో ఆయన నటించడం మానేశాడేమోనని అడగడం మానేశారు. పైగా జనార్దన వరప్రసాద్‌ పేరు కాస్తా, ‘ఆహుతి’ ప్రసాద్‌గా మారడంతో, ఆ పేరే ఆయనకు మైనస్‌గా మారింది. ‘ఆహుతి’ అనే పదాన్ని నిర్మాతలు నెగటివ్‌గా భావించడం వల్ల కూడా ఆయనకు అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడారు. ఏదైనా పాత్రకు ఆయనను తీసుకుందామని దర్శకులు అంటే, ‘ఆహుతా.. వద్దు లేవయ్యా. ఆ సౌండే బాగాలేదు’ అని నిర్మాతలు అనడం వల్ల పెద్ద పెద్ద సినిమాలే చేజారిపోయాయి. పైగా ఆయనది చొరవ తీసుకునే మనస్తత్వం కాదు. మొహమాటం, తనను తాను బూస్టప్‌ చేసుకునే తెలివితేటలు లేకపోవడం వల్ల కూడా అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ టైమ్‌లో కృష్ణవంశీ నుంచి ఆయనకు మంచి ఆఫర్‌ వచ్చింది. అది నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’లో హీరోయిన్‌ టబు తండ్రి కేరక్టర్‌. ఆ పాత్ర ఆయన కెరీర్‌కు రెండో బ్రేక్‌.

‘చందమామ’తో దశ తిరిగింది

‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత నుంచి ఆయన అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకపోయింది. అనేక కుదుపులతో అతలాకుతలమైన ఆయన కెరీర్‌ను ఆ సినిమా మంచి మలుపు తిప్పింది. చాలా సినిమాల్లో చేసిన పాత్రల్లో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. కానిస్టేబుల్‌ నుంచి ఐజీ దాకా అన్ని రకాల పోలీస్‌ పాత్రలను ఆయన చేశారు. దాదాపు తొంభై సినిమాల్లో పోలీస్‌ పాత్రలను పోషించిన రికార్డ్‌ ఆయనది. అయితే ‘ఆహుతి ప్రసాద్‌ ఇట్లా కూడా చేస్తాడు’ అనే పేరు తెచ్చిపెట్టిన చిత్రం ‘చందమామ’. దాని దర్శకుడూ కృష్ణవంశీయే. అందులో గోదావరి యాసతో మాట్లాడే రామలింగేశ్వరరావు పాత్ర ఆయన కెరీర్‌కు బోనస్‌లా మారింది. ఆలస్యంగానైనా ఆ కేరక్టర్‌ ఆయన సినీ జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. అప్పటివరకూ విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా సీరియస్‌గా కనిపిస్తూ వచ్చిన ఆయన కామెడీ కూడా గొప్పగా చేయగలడని ఆ సినిమా నిరూపించింది. రామలింగేశ్వరరావు పాత్రలో ఆహుతి ప్రసాద్‌ నటనను, ఆయన డైలాగ్స్‌ను ఆస్వాదించడానికే ఆ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు చాలామందే. ‘చందమామ’తో ఆయనకు ఎంత పేరొచ్చిందనేదానికి నిదర్శనం – విజయవాడలో ఆ సినిమా ఆడుతున్న థియేటర్‌ వద్ద నలభై అడుగుల ఆహుతి ప్రసాద్‌ కటౌట్‌ పెట్టడం. ‘‘ఈ సినిమాలో రామలింగేశ్వరరావు కేరక్టర్‌ వల్ల రిపీట్‌ ఆడియెన్స్‌ ఎక్కువగా ఉన్నారు కాబట్టే ఆయన కటౌట్‌ పెట్టాం’’ అని డిసి్ట్రబ్యూటర్లు చెప్పారు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో చేసినప్పట్నించీ, కృష్ణవంశీకి సన్నిహితుడు కావడం, ఆయన వద్ద గోదావరి యాసలో జోకులు చెప్తుండటం వల్లే రామలింగేశ్వరరావు పాత్ర ఆయనకు లభించింది. కృష్ణవంశీ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు.
రెండు నందులు
ఇరవై ఏడేళ్ల కెరీర్‌లో 250కి పైగా చిత్రాలు చేసిన ఆయన నటనా ప్రతిభకు గుర్తింపుగా రెండు నంది అవార్డులు లభించాయి. మొదట ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ చిత్రానికి ఉత్తమ ప్రతినాయకుడిగా అవార్డు పొందిన ఆయన, రెండోసారి ‘చందమామ’లోని రామలింగేశ్వరరావు పాత్రను పోషించిన తీరుకు ఉత్తమ కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా అవార్డు అందుకున్నారు. ‘విక్రమ్‌’ సినిమాకి సంబంధించిన రెమ్యూనరేషన్‌ను శివాజీ గణేశన్‌ చేతులు మీదుగా అందుకోవడం, హిందీ ‘సూర్యవంశ్‌’లో అమితాబ్‌తో పద్దెనిమిది రోజులు కలిసి పనిచేయడం, కమల్‌హాసన్‌తో ఓ తమిళ సినిమా చేయడం తన జీవితంలో మరపురాని క్షణాలని ఓ సందర్భంగా ఆయన చెప్పుకున్నారు. అలాగే విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీ రామారావుతో కలిసి నటించకపోవడం తీరని లోటుగా ఆయన భావించేవారు. తెరపై నటుడు కావాలనే కోరికను తీర్చుకుని, స్వయంకృషి, పట్టుదలతో ఓ చక్కని నటునిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వరప్రసాద్‌ మరణంతో తెలుగు చిత్రసీమ ఓ నిఖార్సయిన తెలుగు నటుణ్ణి అర్ధంతరంగా కోల్పోయినట్లయింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు కవితలు –

— 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అపరాధ శాతం -డా యు ఏ అనంత మూర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవితమే సఫలం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చినుకు -జనవరి

katyayani1 001katyayani2 001katyayani3 001sripada1 001 sripada2 001katyayani1 001 katyayani2 001 katyayani3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాటి ఏకచక్రపురమే నేటి బోధన్‌ – శంకరుల వాణి విశ్వవాణి

నాటి ఏకచక్రపురమే నేటి బోధన్‌

andhraprabha –   Sun, 7 Dec 2014, IST

తెలంగాణాలోని పుణ్య క్షేత్రాల్లో ఏకచక్రపురం ప్రముఖమైంది. ఈనాటి బోధన్‌ పట్టణమే అలనాటి ఏకచక్రపురం. ఈ ప్రాంతంలో వరి ధాన్యం అధికంగా పడటం వల్ల బహుధాన్యపురమనే పేరు కూడా వాడుకలో ఉంది. అదే క్రమంగా బోధన్‌గా మారింది. పాండవులు అజ్ఞాత వాసంలో బ్రాహ్మణులుగా ఈ పురంలో నివసించారన్నది పౌరాణిక కథనం.

బోధన్‌లో చక్రేశ్వరాలయం, రేణుకాదేవి ఆలయం ప్రసిద్ధమైనవి. ఇవి 12 వందల సంవత్సరాల క్రితం నాటివి. చక్రేశ్వరాలయంలో అతి పెద్ద లింగం దర్శనమిస్తుంది. దక్షిణ భారతంలోనే ఇది అతిపెద్ద శివలింగం. ఇది స్వయంభూ శివలింగం. దీని ప్రస్తావన శివలీలామృతంలో ఉంది. ఈ ఆలయం ప్రాంగణంలో శాండిల్య మహర్షి తన శిష్యులకు వేదవిద్యను బోధించాడట. ఈ ఆలయం నెలకొనడంతో ఏకచక్రపురాన్ని దక్షిణ కాశిగా కూడా పిలుస్తారు.

రేణుకాదేవి ఆలయంతో పాటు కార్తికేశ్వర ఆలయం, నాగేశ్వరస్వామి ఆలయం, రామాలయం, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం, బొజ్జ గణపతి ఆలయం, హనుమాన్‌ టేకడీ, ఆనంద హనుమాన్‌, దక్షిణ ముఖి హనుమాన్‌ వంటి పేర్లతో ఎన్నో హనుమాన్‌ ఆలయాలు ఉన్నాయి. ఇవి కాక సాయిబాబా ఆలయాలు కూడా ఉన్నాయి.

బోధన్‌లోని చక్రేశ్వరాలయాన్ని కాకతీయులు బాగా అభివృద్ధి పర్చారు. మహ్మదీయుల దండయాత్రల కాలంలో ఈ ఆలయాన్ని కాపాడేందుకు భూస్థాపితం చేశారనీ, 1959లో త్రవ్వకాలు జరిపినప్పుడు పెద్ద శివలింగం బయటపడిందని చెబుతారు.

జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌కి 27 కిలో మీటర్ల దూరంలో ఉన్న బోధన్‌ బౌద్ధ. జైన ధర్మాల సంగమం. తమిళకవి పంపకవి ఇక్కడే నివసించాడని చెపుతారు. ఈ చక్రేశ్వరస్వామివారికి మొక్కుకుంటే సంతానహీనులు సంతానవంతులవుతారని నమ్మకం. స్వామివారికి క్రమం తప్పకుండా, దీక్షగా ప్రదక్షిణాలు చేస్తే, సంతానవంతులు అవుతారన్నది భక్తుల నమ్మకం. చక్రేశ్వరాలయాన్ని సందర్శించేందుకు హైదరాబాద్‌, నిజామాబాద్‌ల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుంచికూడా భక్తులు వస్తుంటారు. చక్రేశ్వరాలయం, రేణుకాదేవి ఆలయాలను సందర్శించే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఇక్కడ ప్రతిపర్వదినంలోనూ ఉత్సవాలు జరుగుతాయి. ఇరుగుపొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రాంతం పర్యాటక పరంగా కూడా ప్రసిద్ధి చెందింది. పాండవులకాలం నాటి ఏక చక్రపురమే నేటి బోధన్‌. పౌరాణిక, చారిత్రక ప్రశస్తి చెందిన బోధన్‌లో బౌద్ధ, జైన మందిరాలు కూడా ఉండటం వల్ల ఆ మతాలకు చెందినవారు కూడా ఈ పట్టణానికి వస్తూంటారు. హిందువులకూ, బౌద్ధ, జైనులకు పవిత్రమైన క్షేత్రంగా బోధన్‌ విరాజిల్లుతోంది.

– స్వామి అనంత

 

శంకరుల వాణి విశ్వవాణి

andhraprabha –   Sun, 4 Jan 2015, IST

ఉదయనుడు, కుమారిలభట్టుక, వీరి పిదప ఆదిశంకరులు, బౌద్ధజైనములను పండితులతో వాదించి ఎదుర్కొన్నారు. ఇందులో ఆదిశంకరులు చేసిన కార్యం అద్వితీయం. అయితే ఆదిశంకరుల అద్వైతం ఎవరో పండితులే అర్థంచేసుకోగలరు. దానిని అనుభవంలోనికి తెచ్చుకొనగలిగినవారు కోటికి ఒక్కరు. బౌద్ధజైనములను ఖండించుటతో బాటు వారొక మహోన్నతమైన కార్యం చేశారు. ఆ కాలంలో దేశంలో ప్రబలిన దుర్మతములను వారు ఖండించి వైదిక కర్మానుష్ఠానములను మరల వాడుకలోకి తెచ్చి బ్రాహ్మణ్యమును, దాని నాయత్వాన్ని పున: స్థాపనం చేశారు.

నాయత్వం అంటే ఈ కాలంలో మాదిరిగా జెండాలు పట్టుకొని ఊరేగింపులూ, సభాధిపత్యములూ పూలమాలలై. బంగారుశాలువలూ కాదు. ఆ నాయత్వం మౌనంగా జరిగింది. అహింస, భక్తీ, ప్రేమ, అపరిగ్రహం, స్వార్ధరాహిత్యం మొదలైన ఆత్మగుణములతో బ్రాహ్మణులు ఉన్న చోటుననే డంభాచారాలకు పోక ప్రజలలో నిర్భయత్వం పెంపొందారు. ఇతరులకు వారు ఆదర్శంగా వున్నారు. భారత దేశమంటే ఏమి? భారతం అంటే ధఱ్మం, భక్తీ, అత్మైశ్వర్యమూ శంకరుల విషయంలో ఆచార్యపదం అర్థవంతమైనది. వారి బోధలు ఒక్క భారతదేశానికీ కాదు. ప్రపంచమంతటికీ.

వారు దేశమంతా విజయ యాత్రలు చేశారు. దుర్మతాలు దేశాన్ని వదలి పారిపోయినవి. వారి విజయం. వారు ధర్మాన్ని పున: ప్రతిష్ట చేశారు. ప్రజలలో జ్ఞానం, భక్తీ, అద్వైతం, పున: స్థానం చేశారు. కర్మం ధర్మమూ ఎప్పుడూ ఇస్తున్నాడు. అంతేకాదు. పాపలక్షణానికి వలసిన సదుపాయాలు అయిన గురువు, శాస్త్రాలను క్షేత్రం కలిపించి సాయపడుతున్నాడు. పాపి కూడస్వర్గానికి పోతాడన్న ఇతర మతస్థుల నమ్మకం కంటే, మన మతంలోచెప్పిన విధానమే చక్కగా వున్నదని వివేచన చేసేవారికి విశదమౌతుంది. ఇందులో పురుషయత్నానికి సమకూర్చటం అతని కరుణావిశేమని చెప్పాలి.

సైన్స్‌ ప్రకారం పునర్జన్మ ఉందా? అని చాలామంది పరిశోధనలు చేయటానికి ప్రారంభించారు. ఈ శాస్త్ర విభాగాన్ని పారా సైకాలజీ వారి పరిశోధనల వల్ల తేలింది ఏమంటే పునర్జన్మ ఉందని. గడిచిన జన్మలో వృత్తాంతాలు మరువక కొందరు ఏకరువు పెట్టగా, వారు చెప్పిన ప్రదేశాలకు వెళ్లి పరిశోధిస్తే, ఆ వృత్తాంతాలు జరిగినట్లే ఆ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. ఇట్టు పూర్వజన్మ స్మృతులున్నవారు అందరు పోయిన జన్మలో సాధారణంగా చనిపోక ఆకస్మిక దుర్మరణ ప్రాప్తిచేత చనిపోయారని కూడా ఆ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత రత్నాలు

భారత రత్నాలు

  • 04/01/2015
  • -మాధురి

ఏదైనా ఘనత సాధించిన పిల్లల్ని చూస్తే ఏ తల్లి అయినా మురిసిపోతుంది. రత్నాల్లాంటి పిల్లలని గర్వపడుతుంది. ఇప్పుడు భరతమాత కూడా మురిసిపోతోంది. దేశ సేవలో వెన్నుచూపని రత్నాల్లాంటి వాజపేయి, మదన్‌మోహన్ మాలవ్యలకు భారతరత్న పురస్కారం ప్రకటించడంతో జాతి యావత్తు గర్వపడుతోంది. ‘రైట్ మేన్ ఇన్ రాంగ్ పార్టీ’గా ప్రతిపక్ష నేతల ప్రశంసలు పొందిన గొప్ప రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజపేయి. ప్రధానిగా కీలక బాధ్యతలు నిర్వహించిన కాలంలోనూ, సుదీర్ఘ రాజకీయ జీవితంలోనూ ఎలాంటి వివాదాలకు లోనుకాకుండా విజ్ఞతతో ఎదిగిన విలక్షణ నేత ఆయన. ప్రధానమంత్రిగా ఆయన పాలన దేశాన్ని సమూలంగా మార్చలేకపోయిందన్న వాదనల సంగతి పక్కన పెడితే- పాకిస్తాన్‌కు స్నేహహస్తం అందించడంలోనూ, జమ్ము కాశ్మీర్ విషయంలోనూ, అణ్వస్త్ర పరీక్షల సమయంలోనూ, కార్గిల్ యుద్ధం వేళ ఆయన తీసుకున్న నిర్ణయాలు సర్వజన ఆమోదాన్ని పొందాయన్నది కాదనలేని వాస్తవం. లౌకిక వాదం, ప్రజాస్వామ్యం పట్ల వాజపేయికి ఉన్న అచంచల విశ్వాసం, గౌరవం ఆయన కీర్తిని పెంచాయి. జనసంఘ్ పుట్టుక, జనతా పార్టీ ఆవిర్భావం- దాని వైఫల్యం, ఆ తర్వాత అది భారతీయ జనతాపార్టీగా రూపాంతరం చెందడం వంటి పరిణామాలతో పాటే ఆయన రాజకీయ జీవితం అంచెలంచెలుగా ఎదిగింది. సొంతపార్టీలో సహచర నాయకులను విభేదించిన సందర్భాలు లేకపోయినా, అవసరమైన సమయంలో ఆయన విభిన్నంగా వ్యవహరించి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో దాదాపు అర్ధ శతాబ్దం పాటు అత్యంత క్రియాశీలకంగా ఉండడం, సంకీర్ణ శకంలో ప్రధాని పదవిని అధిష్ఠించడం, అత్యున్నత పదవిలో అందరి మన్ననలు పొందడం ఆషామాషీ కాదు. ఆ అరుదైన ఘనతను పొందడం ఆయనకే సుసాధ్యమైంది. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్నప్పటికీ ఆయనను ‘ఉదారవాది’గా అభిమానించి విపక్షాలు అక్కున చేర్చుకున్నాయి. సొంత పార్టీలో నిరసన సెగలు రాజుకుంటాయని తెలిసినా- ‘బాబ్రీ మసీదు కూల్చివేతను ఓ చీకటి ఘడియ’గా అభివర్ణించిన సాహసం ఆయనకే చెల్లింది. ‘సంఘ్ పరివార్’తో సన్నిహితంగా ఉంటూనే స్వతంత్రంగా వ్యవహరించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను ఎవరూ తప్పుపట్టలేకపోయారు. లోక్‌సభలో వాజపేయి సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు విపక్ష నేతలంతా ప్రభుత్వ వైఫల్యాలపై దుమ్మెత్తిపోసినా- వ్యక్తిగతంగా ఆయనను కీర్తించక తప్పలేదు. బహుముఖ ప్రతిభ.. ఎన్నికలు, రాజకీయాలంటేనే ప్రజల్లో విరక్త్భివం కలిగిన సమయంలో వాజపేయి ఓ ఆదర్శనేతగా కనిపించారు. ప్రభుత్వాధినేతగా, పాలనాదక్షుడిగా, కవిగా, పాత్రికేయుడిగా, దౌత్యదూతగా, స్వయం సేవకుడిగా, దేశభక్తుడిగా.. ఇలా ఎనె్నన్ని పాత్రలు పోషించినా వాజపేయిది ఓ విభిన్న శైలి. విపక్షంలో ఉన్నా, అధికార పగ్గాలు చేపట్టినా పదవులకే వనె్న తెచ్చి, జాతి జనుల మనోఫలకాలపై బలమైన ముద్ర వేసుకోవడం ఆయనకే సాధ్యమైంది. సున్నిత సంస్కారం, మృదుభాషణ, విలక్షణ వ్యక్తిత్వం ఆయన సొంతం. మితవాదిగా ఉంటూ పార్టీలో సమన్వయ గళం వినిపించిన విజ్ఞుడు.. పొరుగు దేశాలతో స్నేహం కోసం పరితపించిన ఆత్మీయ మిత్రుడు.. ఇన్ని విశిష్టతలున్నందునే కాంగ్రెసేతర ప్రధానిగా సుదీర్ఘకాలం పాటు దేశానికి సేవలందించిన నేతగా కీర్తి గడించారు. ‘స్వయం సేవకుడు..’ సువిశాల భారత దేశానికి పదకొండో ప్రధానిగా సేవలందించిన వాజపేయి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న క్రిస్మస్ పర్వదినాన కృష్ణ బిహారీ వాజపేయి, కృష్ణాదేవి దంపతులకు జన్మించారు. బ్రిటిష్ వలస పాలకుల నియంతృత్వ పోకడలను వ్యతిరేకించి కౌమార దశలోనే ఆయన జైలుశిక్ష అనుభవించారు. తొలుత కమ్యూనిజం పట్ల ఆసక్తి ఉన్నా, ఆ తర్వాత ఆయన ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ (ఆర్‌ఎస్‌ఎస్) పట్ల ఆకర్షితుడై ‘జనసంఘ్’ నేతగా ఎదిగారు. 1950 ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్ పత్రికలో పనిచేసేందుకు లా కాలేజీలో చదువుకు స్వస్తి పలికారు. దేశ స్వాతంత్య్రం కోసం 1942-45 మధ్య జరిగిన ‘క్విట్ ఇండియా’లో పాల్గొన్నారు. హిందూత్వ, హిందూ జాతీయత మాత్రమే రాజకీయాలకు సరైన వేదిక అని భావించి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. కాశ్మీర్‌ను సందర్శించే భారతీయ పౌరులు ప్రత్యేక అనుమతి పత్రాలు కలిగి ఉండాలంటూ అప్పటి పాలకులు విధించిన ఆంక్షలను నిరసిస్తూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1953లో చేసిన ఆమరణ దీక్షకు వాజపేయి బాసటగా నిలిచారు. ముఖర్జీ దీక్ష ఫలితంగా అనుమతి పత్రాల నిబంధన రద్దు కావడమే కాకుండా, కాశ్మీర్‌ను అఖండ భారత్‌లో కలిపేందుకు అప్పటి పాలకులు అంగీకరించక తప్పలేదు. నిరాహార దీక్ష ఫలితంగా ఆరోగ్యం క్షీణించి ముఖర్జీ మరణించడం యువనేత వాజపేయి మనసును తీవ్రంగా కలచివేసింది. ముఖర్జీ భావాలను, నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న వాజపేయి 1957లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2009 వరకూ ఆయన ఎం.పీగా 11సార్లు గెలిచారు. మిత్రపక్షాల మద్దతుతో అయిదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగిన ఘనత ఆయనకే దక్కింది. నాలుగు దశాబ్దాల పాటు ప్రతిపక్షంలో కొనసాగి, 1996లో తొలిసారి ప్రధాని పదవిని చేపట్టారు. పార్లమెంటులో తగినంత సంఖ్యాబలం లేనందున ఆయన 13 రోజులు మాత్రమే ( 1996 మే 16 నుంచి 31 వరకూ) ప్రధాని పదవిలో కొనసాగారు. 1998లో రెండోసారి ప్రధాని పదవి చేపట్టినా 13 నెలలు మాత్రమే అధికారంలో కొనసాగారు. అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన రెండోసారి ప్రధాని పదవిని కోల్పోయారు. 1999లో మూడోసారి ప్రధాని పదవిని చేపట్టి మిత్రపక్షాల మద్దతుతో అయిదేళ్ల పూర్తికాలాన్ని సునాయాసంగా పూర్తి చేశారు. ఎమర్జెన్సీ అనంతరం కేంద్రంలో జనతాపార్టీ అధికార పగ్గాలు చేపట్టాక మురార్జీ దేశాయ్ మంత్రివర్గంలో వాజపేయి విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో హిందీలో ప్రసంగించిన తొలినేతగా రికార్డు సృష్టించారు. మన దేశంలో ప్రధాని పదవిని చేపట్టిన వారిలో చాలామంది కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమో లేదా ఆ పార్టీ మద్దతు తీసుకోవడం వల్లో అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించారు. అయితే, వాజపేయి మాత్రం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ కాంగ్రెస్‌లో చేరలేదు, ఆ పార్టీ మద్దతుతో అధికారం చేపట్టలేదు. అనేక ఏళ్ల పాటు విపక్ష నేతగా వ్యవహరించి ప్రధాని పదవిని చేపట్టిన నేతగా ఆయనది అరుదైన రికార్డు. ప్రధానిగా ఉన్న కాలంలో జాతీయ భద్రత, సామాజిక ఆర్థికాభివృద్ధి, విదేశాంగ విధానంలో ఆయనది విలక్షణమైన పంథా. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అంతటి రాజనీతిజ్ఞుడిగా దేశంలోనూ, విదేశాల్లోనూ కీర్తిప్రతిష్ఠలు సాధించిన నేత వాజపేయి మాత్రమే. అవివాహితుడైన ఆయన రాజకీయాలతో మమేకమై ఉంటూనే తీరిక వేళల్లో పుస్తక పఠనం, కవితలు రాయడంలో కాలాన్ని గడిపేవారు. నెహ్రూ ఏమన్నారంటే… జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం కాశ్మీర్ వ్యవహారంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వైఖరిని దునుమాడుతూ వాజపేయి దేశమంతటా పర్యటించి ప్రసంగాలు చేశారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు ప్రధాని పదవులు ఉండరాదంటూ ముఖర్జీ సిద్ధాంతాన్ని విస్తృత ప్రచారం చేశారు. ఆ తరువాత లోక్‌సభకు ఎన్నికై తొలి ప్రసంగంతో యావత్తు పార్లమెంటును ఆకట్టుకున్నారు. నెహ్రూ అయితే వాజపేయి ప్రసంగానికి తన్మయత్వం చెందారు. ఆ సమయంలో వచ్చిన ఓ విదేశీ ప్రతినిధికి- ‘యువకుడైన వాజపేయి .. ఈ దేశానికి భవిష్యత్తులో కాబోయే ప్రధానమంత్రి’ అని పరిచయం చేశారు. అంటే వాజపేయిలోని నాయకత్వ లక్షణాలను 1957 నాటికే నెహ్రూ గుర్తించారన్నమాట. అప్పటి ఆయన మాట 1996లో నిజమైంది. భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన సమయంలో వాజపేయి తన అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పేవారు. నెహ్రూ అవలంబించిన కొన్ని విధానాలను ఆయన మెచ్చకపోయినా స్ఫూర్తిదాయక నేతగా ఆయనను గౌరవించేవారు. ఆ మాటే బయటకూ చెప్పేవారు. అంతెందుకు..? 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేసి నెగ్గిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ‘అపర దుర్గ’గా అభివర్ణిస్తూ పార్లమెంట్‌లో వాజపేయి చేసిన ప్రసంగం ఆయన ఔన్నత్యాన్ని చాటిచెప్పింది. మహాత్ముడు మాలవ్య భారతరత్న పురస్కారంతో బహుముఖ ప్రతిభావంతుడు మదన్ మోహన్ మాలవ్య ఈ తరం వారికి మరోసారి స్ఫురణకు వచ్చారు. మాలవ్య, వాజపేయి డిసెంబర్ 25నే జన్మించడం, ఇద్దరికీ ఒకేసారి అవార్డులు ప్రకటించడం యాదృచ్ఛికమే అయినా విశేషం. మహా విద్వాంసుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ నేత, పాత్రికేయుడు, న్యాయకోవిదుడు అయిన మదన్‌మోహన్ మాలవ్యను జాతిపిత గాంధీజీ ‘మహామన’ అని సంభోదించేవారు. అంతటి గౌరవం పొందిన వ్యక్తి మాలవ్య. హిందూమత వ్యాప్తికి ఆయన ఎంతో కృషి చేసినా కుల, ప్రాంతీయ అసమానతలు, అంటరానితనాన్ని వ్యతిరేకించి పోరాడారు. ఆయన తొలుత కాంగ్రెస్‌వాది. మధ్యప్రదేశ్‌లోని మాల్యా ప్రాంతం నుంచి అలహాబాద్‌కు వలస వచ్చిన కుటుంబం వారిది. అలహాబాద్‌లో ఆయన 1861 జన్మించారు. 1911లో మనదేశంలో ఉంటున్న విదేశీ పిల్లల కోసం ‘్భరత్ స్కౌట్స్ అండ్ గైడ్స్’ (బిసిజి) సంస్థ ఉండేది. భారతీయులకూ ఆ సౌకర్యం కావాలని ఆయన గట్టిగా పోరాడి 1913లో సాధించారు. ఆయనకు లాలాలజపతి రాయ్, అనిబిసెంట్ వంటివారు తోడ్పాటును అందించారు. 1933 నాటికి పూర్తిగా భారతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభమైంది. అంటే మనదేశంలో బిఎస్‌జి వ్యవస్థాపకుల్లో ఆయనొకరన్నమాట. అందులో పిల్లలను చేర్పించేలా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సేవాసమితిని నడిపారు. 1915లో కళలు, సాహిత్యం, విద్య బోధించేందుకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని వారణాసి (కాశీ)లో స్థాపించారు. ప్రస్తుతం ఈ విద్యా సంస్థ ఆసియాలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం. ఇప్పుడక్కడ 30వేల మంది యువతీ యువకులు విద్యను అభ్యసిస్తున్నారు. వారిలో 15వేలమంది వర్శిటీ హాస్టళ్లలోనే ఉంటున్నారు. కాశీలోని పవిత్ర గంగానదీ తీరంలో ఇప్పుడు అత్యంత ఆదరణ పొందుతున్న ‘హారతి’ ఆనవాయితీని హిందూ ధర్మంగా ప్రారంభించినది మాలవ్యే. గంగానదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఓ చిన్నదీవికి ‘మాలవ్య దీవి’గా పేరుందంటే ఆయనకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఊహించొచ్చు. హిందూధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా, ప్రాచుర్యం, వ్యాప్తికి తోడ్పడిన నేతగా చెప్పుకునే మదన్‌మోహన్ మాలవ్య కాంగ్రెస్‌లో పనిచేశారు. ఆ పార్టీకి నాలుగుసార్లు అధ్యక్షునిగా వ్యవహరించారు. మోతీలాల్ నెహ్రూ సహకారంతో లీడర్ అనే ఆంగ్లపత్రికను నడిపారు. అంతకుముందు సొంతంగా హిందీ పత్రికను నడిపారు. హిందూస్థాన్ టైమ్స్‌కు ఎడిటర్‌గా, అధిపతిగా వ్యవహరించారు. మర్యాద, హరిశ్చంద్ర చంద్రిక, మకరంత్, అభ్యుదయ వంటి పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు. న్యాయవాదిగానూ ప్రాక్టీసు చేశారు. గాంధీజీ, లాలాలజపతి రాయ్, మోతీలాల్‌నెహ్రూ వంటి ప్రముఖులతో కలసి పనిచేశారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాడారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి కొన్ని నెలల ముందు 1946 నవంబర్ 12న 84 ఏళ్ల వయసులో ఆయన తనువు చాలించారు. వీరికెందుకు ఆలస్యం..? దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన ‘్భరతరత్న’ను 1954లో ప్రవేశపెట్టాక- ఆ అవార్డులిస్తున్న తీరుపై వివాదాలు, విమర్శలకు అంతులేకుండా పోతోంది. ఇప్పటి వరకూ 45 మంది విశిష్ట వ్యక్తులకు ఆ గౌరవాన్ని ప్రకటించారు. అయితే, కేంద్రంలో అధికారం పగ్గాలు చేపట్టిన రాజకీయ పార్టీలు కొన్ని ప్రయోజనాలను ఆశించి ‘్భరతరత్న’ ఇవ్వడంలో వివక్ష చూపుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. అవార్డు గ్రహీతలను ఎంపిక చేయడంలో రాజకీయ కోణాలున్నాయన్న విమర్శలూ లేకపోలేదు. కారణాలు ఏమైనా 2002 నుంచి 2008 వరకూ ఈ అవార్డును ఎవరికీ ఇవ్వకపోవడం గమనార్హం. కొంతమంది నాయకులకు ఈ అవార్డు ప్రకటించకపోవడంతో వివిధ వర్గాల నుంచి ఇప్పటికీ నిరసన ధ్వనులు వినపడుతూనే ఉన్నాయి. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి అరుదైన రికార్డు నెలకొల్పిన దివంగత నేత జ్యోతి బసు (పశ్చిమ బెంగాల్), సినీనటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు (ఆంధ్రప్రదేశ్), చరణ్ సింగ్, దళిత నేత కాన్షీరామ్, సంచలన హాకీ క్రీడాకారుడు, ఒలింపిక్స్ విజేత ధ్యాన్ చంద్, ప్రపంచ చెస్ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ వంటి ప్రముఖులకు ‘్భరతరత్న’ ప్రకటించకపోవడం పట్ల నిరసన ధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ అత్యున్నత అవార్డును ఇప్పటి వరకూ ఇద్దరు విదేశీయులకు ప్రకటించినా, సొంత గడ్డపై కీర్తిశిఖరాలకు చేరుకున్న కొందరిని అలక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 1987లో పాకిస్తాన్‌కు చెందిన ‘సరిహద్దు గాంధీ’ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు, 1990లో దక్షిణాఫ్రికా పోరాట యోధుడు డాక్టర్ నెల్సన్ మండేలాకు ఈ అవార్డులు దక్కాయి. రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సైతం ఈ అవార్డును కొందరికి ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కొంతమందికి మరణానంతరం ఈ అవార్డును ప్రకటించడంలో రాజకీయ కారణాలున్నాయన్న విమర్శలూ ఉన్నాయి. తమిళనాడులో సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్‌కు మరణానంతరం ఈ అవార్డు ప్రకటించగా, మరో నట దిగ్గజం, తెలుగువారి కీర్తిని ఖండాంతరాలకు చాటిచెప్పిన ఎన్‌టిఆర్‌కు ఇంతవరకూ ‘్భరతరత్న’ ప్రకటించక పోవడం వివాదాస్పదమైంది. అన్ని అర్హతలున్నప్పటికీ రాజకీయేతర రంగాలకు చెందిన కొందరు ప్రముఖులకు ఈ అవార్డు దక్కలేదన్న వాదనలు ఉన్నాయి. 1928, 1932, 1936 ఒలింపిక్ పోటీల్లో మన దేశానికి బంగారు పతకాలు సాధించిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌కు ఈ అవార్డు ఇంతవరకూ దక్కలేదు. గత ఏడాది ధ్యాన్‌చంద్‌కు అవార్డు ప్రకటిస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ, సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాలను ఆశించి క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ఆఖరి నిమిషంలో హడావిడిగా ఎంపిక చేయడంలో యుపిఎ ప్రభుత్వం అత్యుత్సాహం చూపిందన్న విమర్శలు చెలరేగాయి. హిందీ చలనచిత్ర సీమలో ఆరు దశాబ్దాల పాటు సేవలందించిన నటుడు దిలీప్‌కుమార్‌కు ఈ అవార్డు ప్రకటించకపోవడం సినీ అభిమానులను నిరాశకు గురి చేసింది. కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఆ దేశంలోని అత్యున్నత అవార్డు ’నిషాన్ -ఇ- ఇంతియాజ్’తో దిలీప్‌కుమార్‌ను గతంలోనే సత్కరించింది. 2007 నుంచి 2013 వరకూ ప్రపంచ చెస్ చాంపియన్‌గా భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన విశ్వనాథన్ ఆనంద్‌కు, ప్రముఖ అంతరిక్ష శాస్తవ్రేత్త విక్రమ్ సారభాయ్‌కు, ఇరవై భారతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లో పాటలు పాడిన ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లేకు, క్షీర విప్లవం సాధించిన వర్గీస్ కురియన్‌కు, సామాజిక కార్యకర్త బాబా ఆమ్టేకు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్తవ్రేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు, సంస్కరణల పర్వంతో దేశ ఆర్థిక రంగాన్ని పరుగులెత్తించిన దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ‘్భరతరత్న’ ప్రకటించాలన్న వాదనలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. అవార్డు రద్దు.. ఒక్కసారే.. స్వాతంత్య్ర సమర యోధుడు, ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు ‘్భరతరత్న’ అవార్డు ఇస్తున్నట్లు 1992లో వచ్చిన ప్రకటన వివాదాస్పదమైంది. పురస్కారాన్ని స్వీకరించేందుకు ఆయన కుటుంబ వారసులు తిరస్కరించారు. ఈ అవార్డుపై వివాదం సుప్రీం కోర్టుకు చేరగా, ప్రభుత్వం తన ప్రకటనను రద్దు చేసుకుంది. ఈ ఏడాది అవార్డు గ్రహీతల జాబితాలో వాజపేయి, మదన్‌మోహన్ మాలవ్యతో పాటు బోస్ పేరు కూడా చేర్చాలని ప్రయత్నించినా కుటుంబ సభ్యులు అందుకు నిరాకరించారన్న కథనాలు వెలువడ్డాయి. 1945 ఆగస్టులో విమానంలో ప్రయాణిస్తుండగా విదేశాల్లో బోస్ ‘అదృశ్యం’ అయ్యారన్న ప్రచారాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ నమ్మడం లేదు. ఆ సంఘటన జరిగి 70 ఏళ్లు గడిచినా, బోస్ ఇంకా బతికే ఉన్నారని ఆయన వారసులు భావిస్తున్నారు. ఆయన మరణం గురించి ఎలాంటి స్పష్టత లేనందున ‘మరణానంతరం’ భారతరత్న అవార్డు ఎలా ఇస్తారని వారు వాదిస్తున్నారు. ఒకటి, రెండు సందర్భాల్లో వివాదాలు వచ్చినా మొత్తమీద భారతరత్న ఓ సమున్నత పురస్కారమే. పతకం విశిష్టత భారతరత్న పతకానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వం ఆదేశం మేరకు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని తన మింట్‌లో తయారు చేయిస్తుంది. భారతదేశంలో ఇదే అత్యున్నత పౌర పురస్కారం. ఇది బిరుదు కాదు. ఓ గౌరవం మాత్రమే. అవార్డు గ్రహీతలు తమ పేరుకు ముందుగానీ, వెనుక గానీ ‘్భరతరత్న’ పదాన్ని వాడరాదు. ఈ పురస్కారాన్ని అందుకునేవారికి పతకం, రాష్టప్రతి ఇచ్చిన ధ్రువపత్రం అందజేస్తారు. ఎటువంటి నగదు బహుమతి లేదు. ఫలానా కాలానికి అంటూ ఏడాదికో, రెండేళ్లకో ఇవ్వాలనేం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇవ్వవచ్చు. ఒక విడతకు ముగ్గురికి మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఉంది. 1954లో ఈ పతకం వృత్తాకారంలో 35 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో బంగారంతో తయారు చేసేవారు. పతకంపై ఓ వైపు మధ్యలో సూర్యుడు, కిరణాల వ్యాప్తి బొమ్మలా ఉంటుంది. దేవనాగరి లిపిలో సంస్కృతంలో రాసిన భారతరత్న అన్న అక్షరాలుండేవి. పతకం అంచున వెండిలైన్ ఉండేది. ఆ పతకానికి రెండోవైపు మధ్యలో ప్లాటినంతో చేసిన నాలుగు సింహాల చిహ్నం, దానికింద ‘సత్యమేవ జయతే’ వాక్యం ఉండేవి. ఏడాది తరువాత దానిని సమూలంగా మార్చారు. ప్రస్తుతం ఈ పతకాన్ని రావి ఆకు ఆకారంలో 59 మిల్లీమీటర్ల పొడవు, 48 మిల్లీమీటర్ల వెడల్పు, 3.2 మిల్లీమీటర్ల మందంతో పూర్తిగా ప్లాటినంతో తయారు చేస్తున్నారు. పతకం మధ్యలో ప్లాటినంతో చేసిన కిరణాలు ప్రసరించే సూర్యుని బొమ్మ ఉంటుంది. ఈ కిరణాలు పొడవు, 16, 13 మి.మీ. చొప్పున ఉంటాయి. దేవనాగరి లిపిలో సంస్కృతంలో ‘్భరతరత్న’ అన్న అక్షరాలు ముద్రించి ఉంటాయి. పతకం రెండోవైపు నాలుగు సింహాల గుర్తు, సత్యమేవ జయతే నినాదం కన్పిస్తాయి. ఈ పతకానికి 51 మిల్లీమీటర్ల పొడవున్న తెల్లటి రిబ్బన్ ఉంటుంది. మెడలో ధరించడం కోసం ఇది ఇస్తారు. 1957లో ఈ పతకంపై ఉండే వెండిలైనింగ్‌ను కాంస్యంతో చేయడం మొదలైంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈశ్వర వశం విశ్వం -రామకృష్ణ ప్రభ -జనవరి -2015 మతసామరస్యం

eesvara vasham 2 001 esvara vasham1 001kalam 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయ వాద బ్రాహ్మణ సంఘం చే సామూహిక ఉచిత ఉపనయన మహోత్సవం 26-1-2015

విజయ వాద బ్రాహ్మణ సంఘం చే సామూహిక ఉచిత ఉపనయన మహోత్సవం 26-1-2015uchitaupanayanam -1 001 uchitaupanayanam 2 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం

(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 12015)                          

 

గత 19 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే “మన్మధ ” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 21, 2014) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు.భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” మూడు విభాగాలు ఉన్నాయి.

ప్రధాన విభాగం – 20వ సారి పోటీ నిర్వహణ

ఏ వయస్సు వారైనా, ఏ దేశంలో ఉన్నా, తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $58

 

మొట్ట మొదటి రచనా విభాగం” –6 వ సారి పోటీ నిర్వహణ

కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆరవ సారి ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ “పోటీ” లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.

“నా మొట్ట మొదటి కథ”: (ఉత్తమ కథ):  $116

“నా మొట్టమొదటి కవిత”: (ఉత్తమ కవిత): $58

యువతరం విభాగం- 2 వ సారి నిర్వహణ

ఈ నాటి యువతరంలో సృజనాత్మకతని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయస్సుగల యువ రచయితలని ఈ నూతన విభాగంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచనతో పాటు మీ వయస్సు ధృవీకరణ పత్రం నకలు ఏదైనా (పుట్టిన తేదీ పత్రం, కళాశాల వారు జారీ చేసిన పత్రం వగైరా ..) జతపరచాలి.

ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $58

 

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు

  • ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. వ్రాత ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.
  • తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
  • రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీ లో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి.
  • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు www.koumudi.net లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
  • విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు కాని, అంతకు ముందు కానీ  (మార్చ్ 21, 2015) ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితల ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
  • విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

Last Date to receive entries is:  March  1, 2015

Please send entries by e-mail attachments (PDF, JPEG or Unicode fonts)

sairacha2012@gmail.com  &  vangurifoundation@gmail.com

 

భవదీయులు,

వంగూరి చిట్టెన్ రాజు, (అధ్యక్షులు) & శాయి రాచకొండ (సంపాదకులు)

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

హ్యూస్టన్ & హైదరాబాద్

Phone: 832 594 9054

E-mail: vangurifoundation@gmail.com

www.vangurifoundation.blogspot.com

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

రాగాల తోట.. వీటూరి పాట

రాగాల తోట.. వీటూరి పాట
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి… (దేవత-1965), బలేబలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు (భక్తతుకారాం-1973), మబ్బే మసకేసిందిలే, పొగమంచే తెరగా నిలిచిందిలే (వయసు పిలిచింది-1978), నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా (మల్లెపువ్వు-1978)… తెలుగువారు ఏనాటికీ మరిచిపోలేని గీతాలు ఇవి. కానీ ఈ మధుర గీతాలు రాసిన మహాకవి ‘వీటూరి’ని మాత్రం చాలామంది మరిచిపోయారు. కారణం… ఆయన పేరు మరో మహాకవి వేటూరి పేరును పోలి ఉండడం! వీటూరి రాసిన గొప్ప పాటల వల్ల అప్పుడప్పుడూ ఆ పేరు వినిపించినా, దానిని వేటూరిగా భ్రమపడే అవకాశమే ఎక్కువ. వేటూరి, వీటూరి – ఇద్దరూ పాటలు రాసిన ‘యమగోల’ చిత్రం (1977) పాటల పుస్తకంలో చివరి పాటకు కవి పేరు ‘వీటూరి సుందరరామమూర్తి’ అని పొరబాటుగా ప్రచురించడం ఇలాంటి ప్రమాదానికి ఓ ఉదాహరణ!
వీటూరి పూర్తిపేరు వీటూరి వేంకట సత్యసూర్య నారాయణమూర్తి. 1934 జనవరి 3న విజయనగరం జిల్లా ‘రెల్లివలస’లో ఆయన జన్మించారు. భీమిలిలో ఉపాధ్యాయ శిక్షణను పూర్తిచేసి స్వల్ప కాలం ఆ వృత్తిలో ఉన్నారు. ‘అక్కాచెల్లెలు’ చిత్రానికి రచనా సహకారం అందించడానికి సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఆయన పేరు వెండితెరకెక్కింది మాత్రం శ్రీ మురళీకృష్ణా ఫిలింస్‌ వారి డబ్బింగ్‌ చిత్రం ‘శ్రీ కృష్ణ లీలలు’(1956)తోనే! ఆ చిత్రంలో ‘మురళీధరా కృష్ణయ్య, నిన్నే నమ్ముకొంటినయ్యా’ అనే చివరి పాటను వీటూరి రాశారు. ఆ తర్వాత ‘మహారథి కర్ణ’, ‘జగదేకసుందరి’ అనువాద చిత్రాలకు ఇతరులతో కలిసి పాటలందించినా, 1962లో ‘ఏకైక వీరుడు’(మన్నాది మన్నన్‌) డబ్బింగ్‌ చిత్రానికి రచనతోనే పరిశ్రమలో స్థిరపడ్డారు. అదే ఏడు కృష్ణకుమారి, కాంతారావు జంటగా నటించిన ‘స్వర్ణగౌరి’ చిత్రానికి కూడా మాటలు, పాటలూ రాసే అవకాశం వచ్చింది. వీటూరి ప్రతిభను గుర్తించి విఠలాచార్య, పద్మనాభం, హీరో కాంతారావు ఆయనను ఎక్కువగా ప్రోత్సహించారు.
ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినీ గాయకుడిగా పరిచయమైన ‘ఓ! ఏమి ఈ వింత మోహం…’ (శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న 1967) గీతం వీటూరి (సు)కృతమే! అద్భుతమైన భావాలు కలిగిన ఎన్నో మధుర గీతాలతోపాటు నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన (బంగారు తిమ్మరాజు-1964), గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు (ఇదాలోకం-1973), గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను (యమగోల 1977) వంటి హుషారైన పాటలూ రాసి ఆయన శభాష్‌ అనిపించుకున్నారు.
వీటూరి రచన చేసిన శతాధిక చిత్రాలలో దాదాపు సగం డబ్బింగ్‌ చిత్రాలే! తెలుగులో తీసిన నాలుగు భాషల (హిందీ, తమిళ, కన్నడ, మలయాళ) డబ్బింగ్‌ చిత్రాలకూ రచన చేసిన ముగ్గురు కవుల్లో వీటూరి ఒకరు. ‘ఏకైక వీరుడు’ (మన్నాదిమన్ననే), మన్మథలీల’ (మన్మదలీలై), ‘ఎర్ర గులాబీలు’ (సిగప్పురోజాక్కళే), ‘ధనమే ప్రపంచలీల’ (తాయిక్కుతలైమగనే), ‘అమరగీతం’ (పయనంగళ్‌ ముడివదిల్లె), ‘పట్నంపిల్ల’ (మనిదరిల్‌ ఎత్తనయో నిరంగళ్‌) మొదలైనవి వీటూరి ప్రసిద్ధ అనువాద చిత్రాలు.
తమిళ చిత్రం ‘మన్నాది మన్నన్‌’లో ఎంజీఆర్‌ కథకూ, తన అన్నాడీఎంకే పార్టీకి రెంటికీ అన్వయించేలా ‘కణ్ణదాసన్‌’ చేత ఒక పాట రాయించారు. ‘అచ్చమ్‌ ఎలేబదు మడమైయడా, అంజామై ద్రావిడర్‌ ఉడమైయడా, ఆరిలుమ్‌ సావు నూరిలుమ్‌ సావు తాయగమ్‌ కాప్పదు కడమైయడా’ అనే ఈ పాటకు ‘‘భయమనేది మూర్ఖత్వం. సాహసం ద్రావిడ లక్షణం. ఆరేళ్లకు చచ్చినా, నూరేళ్లకు చచ్చినా మాతృభూమిని కాపాడడం మన కర్తవ్యం. చేర, పాండ్య రాజులు తమ వీరత్వంతో జన్మభూమిని పునీతం చేశారు. తమిళ తల్లులు తమ బిడ్డలకు పుట్టుకతోనే వీరత్వాన్ని నూరిపోస్తారు. ఆ తల్లి గౌరవానికి భంగం కలిగితే ఆ పుత్రులు శూరులై పైకి లేస్తారు’’ అని భావం. దీని తెలుగు డబ్బింగ్‌ ‘ఏకైక వీరుడు’ లో ‘న్యాయం ధర్మం మరువకురా, ఏనాడూ ఎవరికి వెరువకురా, ఆంధ్రుల త్యాగం, ఆంధ్రుల శౌర్యం అవనిలో స్థిరముగ నిల్పుమురా…’ అంటూ ప్రాంతీయ భావాన్ని ప్రభోదిస్తూ స్వేచ్ఛానువాదం చేశారు వీటూరి. చరణాల్లో రుద్రమదేవి, మాంచాల, బ్రహ్మన, బాలచంద్రుడు మొదలైన వారి వీర ప్రశంస చేయడం ద్వారా ఈ పాటకు పూర్తి తెలుగుదనాన్ని అద్దారు.
‘మన్మదలీలై’లోని ‘హలో మైడియర్‌ రాంగ్‌ నంబర్‌, కేట్కవే ఉందన్‌ కురల్‌ సొర్గమే, నెరితే పార్తాల్‌ ఎన్న వెట్కమే’ అనే మూల గీతానికి ‘హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌, గొంతుకే వింటే ఎంత మధురం, చెంతకే వస్తే ఎంత స్వర్గం’ అనే పాట తెలుగుదనం ఉట్టిపడే వీటూరి అనువాద ధోరణికి మరో నిదర్శనం. సె్ట్రయిట్‌ చిత్రాల్లోని పాటలతో సమంగా ప్రాచుర్యాన్ని పొంది నేటికీ చెవిమరుగు కాని వీటూరి అనువాద గీతాలకు మరికొన్ని ఉదాహరణలు 1. ఎదలో తొలి వలపే, విరహం జత కలిసే, మధురం ఆ తలపే నీ పిలుపే (ఎర్రగులాబీలు-1979) 2. నెలరాజా, పరుగిడకు, చెలి వేచే నా కొరకు (అమరగీతం-1982) 3. పయనించే చిరుగాలీ, నా చెలి సన్నిధిలో చేరి (పట్నం పిల్ల-1980), 4. త్రిపుర సుందరీ, దర్శనలహరీ (జగద్గురు శంకరాచార్య- 1981).
అనువాదకవిగా తన సత్తా నిరూపించుకున్న వీటూరి పట్ల ఆ రంగానికి చెందిన నిర్మాతలకు గల గురికి నిదర్శనమైన ఓ ఉదంతాన్ని గుర్తు చేసుకోవాలి. ‘శుభలేఖ’ చిత్రానికి ముహూర్త గీతంగా రికార్డు చేసిన వీటూరి పాట కారణాంతరాల వల్ల ఆ చిత్రంలో చోటుచేసుకోకపోతే – ఆ పాట నచ్చిన ‘బందిపోటు విప్లవ సింహం’ (తమిళంలో ‘రాణువవీరన్‌’) నిర్మాతలు దానిని తమ చిత్రంలో అదనపు పాటగా (మూలంలో లేదు) వినియోగించుకున్నారు. శ్రీదేవి, రజనీకాంత్‌, చిరంజీవి ప్రముఖపాత్రల్లో నటించిన ఈ భారీ చిత్రంలో దీనిని ఓ ఐటం సాంగ్‌గా చిత్రీకరించారు. వ్యక్తిగతంగా వీటూరి ఎలాంటి భేషజాలు లేని నిరాడంబరుడు, సహృదయుడు. ‘దేవత’ చిత్రానికి ‘సింగిల్‌ కార్డ్‌’ పడాల్సిన ఆయన నిర్మాత పద్మనాభం కోరిక మేరకు తను రాసిన బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, మావూరు మదరాసు, నా పేరు రాందాసు… అనే పల్లవులను ప్రసిద్ధులైన సహకవులకిచ్చి వారిచేత పాటలను రాయించారు. పై రెండింటిలో మొదటి పాటను రాసిన శ్రీశ్రీ వీటూరి ఔదార్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు కూడా! (‘పాడవోయి భారతీయుడా’ పుస్తకంలో).
వీటూరి చివరి అనువాద చిత్రం 1985 డిసెంబరు 6 న విడుదలయిన ‘యవ్వనం పిలిచింది’. ఆ చిత్రం విడుదల కాకుండానే వీటూరి 1985 సెప్టెంబర్‌ 21న అనారోగ్యంతో అకాల మరణం పాలయ్యారు. చనిపోయే నాటికి ఆయన పేరు తప్ప ఏమీ మిగుల్చుకోలేదు. అటు అనువాదాల్లోనూ, ఇటు నేరుగా తీసిన తెలుగుచిత్రాల్లో నేటికీ నిలిచిన ఆణిముత్యాల్లాంటి పాటలెన్నిటినో రచించిన వీటూరి ప్రతిభకు తగ్గ గుర్తింపు మాత్రం లభించకపోవడం బాధాకరం.
ఫ డా. పైడిపాల
సెల్‌:9989106162
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాజమహేంద్రి వైభవానికి ప్రతిబింబం..

రాజమహేంద్రి వైభవానికి ప్రతిబింబం..

  • -సన్నిధానం నరసింహశర్మ
  • 03/01/2015
TAGS:

నరసింహావలోకనం (స్వీయ చరిత్ర)
-యాతగిరి శ్రీరామనరసింహారావు;
366 పుటలు; వెల: రూ.125/-లు
ప్రతులకు: ఎమెస్కో బుక్స్, 1-2-7,
భానూకాలనీ, గగనమహల్‌రోడ్,
దోమలగూడ, హైదరాబాదు- 500 029
మరియు సాహితీ ప్రచురణలు,
29-13-53, కాళేశ్వరరావురోడ్, విజయవాడ-2

ధారణాశక్తిగల బుద్ధిమంతుణ్ణి మేధావి అంటారు. ఇది శబ్దసంబంధ అర్థం. మేధావి వావిలాల వారు రాజమహేంద్రిలో పురపాలక సంఘ ప్రాంగణ వేదికపై ఓ సందర్భంలో ప్రకాశంపై అనర్గళ ఉపన్యాసం ఇస్తున్నారు. వేదికపై తెనే్నటి విశ్వనాథం, క్రొవ్విడి లింగరాజు మొదలైన వారున్నారు. తమ ప్రకాశ ప్రసంగధారలో వావిలాల వారు మధ్యమధ్య కొన్ని తేదీల వంటివి వచ్చినపుడు- కరెక్టే కదండీ అని వేదికపైనున్న ఓ వ్యక్తితో చూపుల సంప్రతింపులు చేసుకునేవారు. ఆ సంప్రతించబడిన వ్యక్తే శ్రీయాతగిరి శ్రీరామనరసింహారావు. ఆయన స్వీయచరిత్రే ఈ ‘నరసింహావ లోకనం’.
ఆంగ్లంలో స్వీయచరిత్ర రాసుకున్న మొదటి భారతీయుడు డీన్‌మహమ్మద్ (1759-1851). వెనె్నలకంటి సుబ్బారావు తమ ఆత్మకథను ఆంగ్లంలో రాసుకున్న ఆంధ్రుడు, శతక ప్రక్రియలో మండపాక పార్వతీశ్వర శాస్ర్తీ రాసిన దినచర్యారూప గ్రంథం ‘హరిహరేశ్వర శతకము’ లేక ఆత్మపర్యాయ- కార్యసపర్య తెలుగులో మొదటి ఆత్మచరిత్ర. ఇటువంటి పెద్దలు అనుకునేవి వకుళాభరణం రామకృష్ణ- చిలకమర్తి స్వీయచరిత్ర పీఠికలో విశే్లషణా పూర్వకంగా ఇచ్చారు.
వచనంలో వచ్చిన తెలుగు స్వీయచరిత్ర మొదటిది కందుకూరి వారిదనేది చారిత్రక వాస్తవం. ఒకనాటి కాలంలో కందుకూరి, చిలకమర్తి, ప్రకాశం వంటివారి స్వీయ చరిత్రలు వచ్చి ఎందరికో స్ఫూర్తినిచ్చి సామాజిక సాంస్కృతిక, రాజకీయ కాలనాళికలుగా వెలుగొంది ప్రథమశ్రేణి స్వీయచరిత్రలై పరిఢవిల్లాయి.
చిత్రమేమిటంటే- కందుకూరి, ఆంధ్రకేసరి వంటి స్వీయచరిత్రలు కంఠోపాఠం అన్నంతగా అధ్యయనం చేసిన ఒకనాటి యువకుడు శ్రీ నరసింహారావువారి సేవా చైతన్యస్ఫూర్తులతో, సాంస్కృతిక చారిత్రక సామాజిక కార్యకలాపాలతో ఎదిగి డెబ్భై ఏళ్ళు దాటిన వాడయి తానూ స్వీయచరిత్ర రాసుకునే స్థాయికి, రాయమని అడిగించుకునే స్థాయికి ఎదగడం! ఇందులోగల పట్టుదల, దీక్ష, సేవాతత్త్వం వంటి వాటిని వర్తమాన తరంవారు గ్రహించడానికి ఈ నరసింహావలోకనాన్ని అవలోకించాలి.
కర్ణాటకలోని యాదగిరినుండి 1703లో రాజమహేంద్రికి వలస వచ్చిన మధ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు శ్రీరావు. వీరేశలింగం స్వగృహం, ప్రకాశం అద్దెయిల్లూ వీరింటికి దగ్గరలో ఉండడంతో తమ తాతలకూ వారికీ రాకపోకలుండేవి. చిననాట నాటిన స్ఫూర్తిబీజాలు జీవన వృక్షాల్ని పెంచుతాయి. పనిచెయ్యని కొందరు ప్రజాప్రతినిధుల్ని కూడా ఇంద్రుడూ, చంద్రుడూ అని పొగడే కొందరి మధ్యకు వృద్ధ స్వాతంత్య్రయోధుల్ని తీసుకువచ్చి ఇదిగో మనం అర్చించుకోవలసిన వారు, వీరు. వీరి వీరగాథా ఘటనల్ని వినండి అంటూ వారిని రప్పించడం, ఉపన్యాసాలిప్పించడం, వారిని సత్కరించడం జీవితం నిండా చేసిన వీరి స్వీయ చరిత్ర నిండా ఏముంటాయో మనం వూహించుకోవచ్చు. ఆంధ్రకేసరి యువజన సమితి స్థాపించి నిత్య సంచలన సంస్థగా పెంచారు. ఆంధ్రకేసరి జూనియర్ కళాశాల, ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలను స్థాపించారు. గౌతమీ గ్రంథాలయ ప్రభుత్వ స్వీకరణ ఉద్యమాన్ని చేబట్టి సఫలత చెందారు. రాజమహేంద్రవరంలో మార్కండేయేశ్వరస్వామి దేవాలయం ఉందనేది అందరకూ తెలుసు. మార్కండేయేశ్వరస్వామి తండ్రి పేర మృకండేశ్వర దేవాలయం వుండేదని, సంబంధ శివలింగం వంటి చారిత్రక పరావస్తు త్రవ్వకాల ద్వారా వెల్లడయ్యాయంటే దానికీ ఓ స్థానిక ఉద్యమం వచ్చింది. ఉద్యమాలనేవి ఏ ఒక్క వ్యక్తివల్ల మాత్రమే జరిగేవి కావు నిజమే. కానీ, వీటన్నిటికి ‘పిల్లిమెడలో గంటకట్టే వారెవరంటే శ్రీ నరసింహారావే. ఆ ఉద్యమాల్లో తన పాత్ర, సహకరించినవారి పాత్ర, ప్రసిద్ధులదీ, అప్రసిద్ధులదీ కూడా వుండడం ఈ గ్రంథ విశేషం.
ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రాజమహేంద్రవరంలో ప్రభుత్వ సమగ్ర బోధనాభ్యసన కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేసేటప్పుడు ఆయన తానున్న వీరభద్రపురం పేట నుండి కళాశాలకు గుర్రంమీద వెళ్ళేవారట. ఈ సంగతి తొంభై ఆ పేట వాసి జనమంచి కామేశ్వరరావు చెప్పారని ఈ పుస్తకంలో ఆయన రాశారు. ఇటువంటి చెప్పుడు మాటలు- మంచివి ఇంకా ఇందులో ఎన్నో వున్నాయి.
14 ప్రకరణాలుగా ఈ గ్రంథం సాగింది. ఇందులో స్వాతంత్య్ర సమరవీరులు, సత్రాలు, చెరువులు, ఆదర్శమూర్తులు, టౌన్ హాలు, ఇతర సంస్థలు, వివిధ రంగాల ప్రముఖులు వంటి శీర్షికల్లోని అంశాలు అత్యంత ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఇందులో స్వీయాంశాలతో, ఎంతోమంది హేమాహేమీలైన వారి చారిత్రక సంఘటనా స్పర్శలుండడంవల్ల బంగారానికి తావి అబ్బింది. ‘సమాచారమ్’ అనే స్థానిక దినపత్రికలో గుర్తుకొస్తున్నాయ్ పేర రాసిన ధారావాహికల సమాహారమే ఈ ‘స్వీయ నది’.
362వ పుటలో ఒక ఛాయాచిత్రం క్రింద శ్రీశ్రీ, మధునాపంతుల, దామెర్ల, పోతుల, వై.యస్.ఎన్‌లతోపాటు శ్రీ మద్దూరి అన్నపూర్ణమ్మ ఉన్నట్టు రాశారు. అది పొరపాటు. ఆయన లేరు. ఉన్నవారు మద్దూరి శివరామకృష్ణయ్య. తరువాత అచ్చులో మార్చుకోవాలి. ముఖ్యమైన ఛాయాచిత్రాలు కూడా చారిత్రక ఘటనల్ని చూపించాయి.
రాజమహేంద్రిలో కోటిపల్లి బస్‌స్టాండుకు ఎదురుగా ‘ఫ్రీడం పార్కు’ అనేది నరసింహ స్వప్న దృశ్యంగా ఉంది. అందులో స్వాతంత్య్రయోధుల విగ్రహాలు, ఛాయాచిత్రాలు, వస్తువులు భద్రపరుస్తున్నారు. స్వా.స. యోధుల జీవిత చరిత్రల వంటితో ఓ గ్రంథాలయాన్నీ నడపడం నగర కీర్తికి ఓ హెచ్చింపు.
రాజరాజనరేంద్ర పట్ట్భాషేక సంచికలో ముఖచిత్రంపై అలనాటి చాళుక్య ద్వారం చూపి అటువంటి ద్వారాన్ని గోదావరి గట్టుపై తమకు చెందిన నరసింహస్వామి దేవాలయ ముఖద్వారంగా కట్టించి ఏర్పాటుచేసుకున్నారంటే సామాన్యమా?
రాజమహేంద్ర చరిత్రను ప్రశ్నోత్తరాల రూపంలో ‘నృసింహ ప్రశ్నోపనిషత్’గా రాశి స్థానిక చరిత్ర రాశికి ఓ రూపకల్పన చేశారు.
వీరేశలింగ సంస్థలను ఎంతగానో సేవించిన ఈయన విగ్రహారాధకుడే కాక, నిరీశ్వర, హేతువాద ప్రముఖులతో స్నేహం చేయడం ఒక సహజీవనాంశం.
రాష్టప్రతులందర్నీ కొందరు ప్రధానమంత్రుల్నీ- ఇంకా ఎంతోమందిని ఈయన కలిసేటప్పుడు స్థానిక నగర సమస్యల్ని సైతం వారిదృష్టికి తీసుకువచ్చేవారు.
1962 అక్టోబరు 2వ తేదీన రాజమండ్రి వాసి- భారత రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో ఇరవై రెండు నిముషాలు సంభాషించడం.. ఇటువంటి సంఘటనలున్న వ్యక్తి స్వీయచరిత్ర ఇది. ఇందులో అయిదు దశాబ్దాల సేవాసంచలనాలు, ఎంతోమంది చారిత్రక వ్యక్తుల సంఘటనా పరిమళాలూ నిండి వున్నాయి. ఈ గ్రంథం సాంతం చదివితే ‘‘ఇది గతానికి, అగతానికీ లోచనం. ఇంతెందుకూ రాజమహేంద్రి నగరం తనను తాను అద్దంలో చూసుకుంటే శ్రీనరసింహారావే కన్పిస్తారని చెప్పిన డా. అరిపిరాల నారాయణరావు వెనుక అట్టహాస వాక్యం అక్షరాలా నిజమనిపిస్తుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచీన కళల విశిష్టతపై సమగ్ర శోధన

ప్రాచీన కళల విశిష్టతపై సమగ్ర శోధన

  • -జిఆర్కె
  • 03/01/2015
TAGS:

భారతీయ స్వతంత్ర
కళాశాస్త్రం
– ప్రథమభాగం –
కళాబ్రహ్మ

హిందీ మూలం:
డా.కాంతి చంద్రపాండె
తెలుగు అనువాదం: డా.బొద్దుల వేంకటేశం
పుటలు: 282;
వెల: రూ.280/-
ప్రతులకు: శ్రీమతి బి.సరోజ
9-8-49, రాంనగర్
కరీంనగర్- 505001

చాలా ప్రపంచ దేశాలలో నాగరికత ప్రాథమికంగానైనా రెక్కతొడగకముందే భరతభూమి సముజ్వల నాగరికతా నిలయంగా భాసించింది, అనేక కళలకు కాణాచిగా నిలిచింది. ప్రాచీన వాఙ్మయం, చారిత్రక ఆధారాలు, పురాతన అవశేషాలు, వస్తుసామగ్రి వంటివి దీనిని నిరూపిస్తున్నాయి.
సమీక్షిస్తున్న గ్రంథం ఒక అనువాదకృతి. అనువాదకులు డా.బొద్దుల వేంకటేశం బహుభాషావేత్త. తెలుగు, హిందీ, ఆంగ్లంలో స్నాతకోత్తర పట్టాలు పొందిన విద్యాధికులు. సంస్కృతంలో కూడా మంచి పాండిత్యం సముపార్జించారు. ‘‘అన్యభాషల్లో సాహిత్య- కళాశాస్త్ర విషయంలో డి.లిట్. పట్టాలను సాధించిన సిద్ధాంత వ్యాసాలను ఇతర విశిష్ట గ్రంథాలను అనువదించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారాయన. ఈ క్రమంలో లోగడ కొన్ని ప్రామాణిక గ్రంథాలు తెనిగించారు. ప్రస్తుత గ్రంథం ‘్భరతీయ స్వతంత్ర కళాశాస్త్రం (ప్రథమభాగం)’ డా.కాంతిచంద్రపాండె హిందీ మూలానికి అనువాదం. డా.పాండె 1950లో డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పర్యవేక్షణలో లక్నో విశ్వవిద్యాలయం నుంచి డి.లిట్.కోసం ‘కంపెరెటివ్ ఈస్థెటిక్స్’పైన బృహత్ సిద్ధాంత గ్రంథం సమర్పించారు. ఇందులో డా.పాండె ఎన్నో విషయాలు ఆవిష్కరించారని ప్రశంసిస్తూ డా.రాధాకృష్ణన్ ఇలా అంటారు. ‘‘హీజ్ వర్క్ డీల్స్ విత్ ఎ రిలెటివ్‌లీ అన్ ఎక్స్‌ప్లోర్డ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ థాట్.’’ సిద్ధాంత గ్రంథంలో ‘ఇండియన్ ఈస్థెటిక్స్’, ‘వెస్టర్న్ ఈస్థెటిక్స్’అనే రెండు భాగాలున్నాయి. ప్రథమభాగాన్ని డా.పాండె హిందీలో భారతీయ ‘స్వతంత్ర కళాశాస్త్రం’అన్నారు. అనువాదకులు ఈ ప్రయోగానే్న స్వీకరించారు. అనువాదం కళాబ్రహ్మ, శబ్దబ్రహ్మ, రసబ్రహ్మ అనే మూడుభాగాలలో సాగింది. ఏడు అధ్యాయాలలో మొదటి భాగం వాస్తు కళ, సంగీత కళ, నాట్యకళ గురించి సర్వ సమగ్రంగా వివరిస్తుంది. డా.పాండె ‘అధ్యేయ గ్రంథ సూచిక’లో 92 అత్యంత ప్రామాణిక కృతులను పేర్కొన్నారు. ఇవిగాక తమ గ్రంథంలో అనేక ఇతర కృతులు ప్రస్తావించారు. ‘ఈస్థెటిక్స్’ పదాన్ని ‘సౌందర్యశాస్త్రం’ బదులు ‘స్వతంత్ర కళాశాస్త్రం’ అనడానికి కారణం రచయిత ఇలా చెప్పారు.
‘‘స్వతంత్ర కళాకృతులు వ్యంజించే సౌం దర్య స్వరూపమేమి? దాని రచనా విధి ఎట్టిది? ఉత్కృష్టతమ రూపంలో దాని ప్రభావమేవిధంగా ఉంటుంది?- ఈ ప్రశ్నలు మన ప్రతిపాద్య విషయానికి ఘనిష్ఠంగా సంబంధించి ఉన్నాయి’’. ప్రతి అంశాన్ని కూలంకషం గా చర్చించారు. వేదోపనిషత్తులు, స్మృతులు, సూత్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, మహాకావ్యాలు, అనేక మహాకావ్యాలు, ప్రామాణిక శాస్త్రగ్రంథాలు ఇత్యాదుల నుంచి ఆధారాలు చూపారు. ‘వాస్తుకళ’లో వాస్తు శబ్దార్థమిచ్చి నిర్మాణం, వివిధ రీతులు, చిత్రశిల్ప విశేషాలు, ఇతర దేశాలలో భారతీయ వాస్తుప్రభావం మొదలైన పెక్కు సంగతులు విశదీకరించారు. ఈ కళపై ‘అధర్వవేదం’ అత్యంత ప్రాచీన ప్రమాణమని చెప్పి- అర్థశాస్త్రం, శుక్రనీతి, నాట్యశాస్త్రం, మత్స్యపురాణం, కామికాగమనం, అంశుమద్భేదం, తంత్ర సముచ్ఛయం, సమరాంగణ సూత్రధార, విష్ణ్ధురోత్తర పురాణం, రామాయణం, భారతం, మానసార వంటి ఎన్నో గ్రంథాలను ఉటంకించారు. సామవేదం సంగీతపరంగా ప్రాచీన ప్రమాణమని వివరిస్తూ పూర్వం ‘‘స్వర సమూహం మూడుగా ఉండేది. ఎందుకనగా వేదాలన్నింటిలో మూడు రకాలైన స్వరాలే అంగీకరింపబడినాయి’’ అని తెలియజేశారు. తర్వాత సప్తస్వరాలను గురించి విశదీకరించారు. ప్రామాణిక గ్రంథాలు, మూర్ఛనలు, ఉచ్చారణ కాలం, శాస్తక్రారులు, గీతకర్తలు, సంగీత సంప్రదాయాలు, ఇస్లాం ప్రభావం మున్నగు అంశాలు విపులీకరించారు. ‘‘నాట్యకళాకృతికి మించి వేరే ఏ స్వతంత్ర కళాకృతిని కూడా రసానుభవ విషయంగా పేర్కొనడం సముచితం కాదని అభినవగుప్తుని మతం’’తో ‘నాట్యకళ’ చర్చ ఆరంభమవుతుంది.

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ముక్కోటి ,మహా పర్వదినమ్1-1-2015 నూతన సంవత్సరంసందర్భం గా లడ్డూలతో పూజ మరియు ఉత్తర ద్వార దర్శనం 

http://wp.me/p1As8O-1Aj

laddu puja 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు

Posted on 01/01/2015 by అరసి

1mucchatlu-001వృత్తి రీత్యా సైన్స్ లో ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నా , ప్రవృత్తిగా సాహిత్యంలో విశేషంగా కృషి చేస్తున్న వారు గబ్బిట దుర్గా ప్రసాద్ .ఇప్పటి వరకు 800 లకు పైగా వ్యాసాలూ , 500లకు పైగా కవితలు అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి . సరసభారతి అధ్వర్యంలో స్వీయ సంపాదకత్వంలో 13 పుస్తకాలను ప్రచురించారు .గబ్బిట దుర్గాప్రసాద్ ఎనిమిదవ రచన ఈ “ పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు” . ఈ పుస్తకంలో సుమారుగా 123 మంది ఆంగ్ల కవుల చరిత్ర , వాళ్ల రచనలు , సాహిత్య విశేషాలు వ్యాసాల రూపంలో ఈ పుస్తకంలో పొందుపరిచారు .

మొదటి వ్యాసం ‘జియోఫ్రీ చాసర్’ 1340 లో ఇంగ్లాండు లో పుట్టాడు . ఇంగ్లాండు దేశపు మొదటి నవలగా గుర్తింపు పొందిన Troilur and Criseyde” నవల రచయిత ఈయనే . ఆంగ్ల నాటక పితామహుడుగా పేరు పొందిన విలియం షేక్స్ పియర్ . ఆయన చనిపోయిన 100 సంవత్సరాలకు కాని విలియం షేక్స్ పియర్ జీవిత చరిత్ర రాకపోవడం నిజంగా దురదృష్టకరం . అప్పుడే ఈయన రాసిన రచనలు సమగ్ర నాటకాలు ముద్రించారు . మొట్టమొదటి రాజస్థాన కవి బెన్ జాన్సన్ . అసలు పేరు బెంజమిన్ జాన్సన్ . ఈయన రాసిన చారిత్రక ట్రాజెడీలను సీజనాస్ , హిస్ ఫాల్ అండ్ కార్తిలిన్ , హిస్ కాన్స్పిరసీ విజయవంతమయ్యాయి .

కొంటెతనం , చిలిపిదనంతో తన తరాన్ని ప్రభావితం చేసిన వాడు రాబర్ట్ హీర్రిక్ . లండన్ లో 1591 లో వజ్రాలకు నగిషీ చేసే కంసాలి కుటుంబంలో జన్మించాడు . తన చుట్టూ ఉన్న పల్లె వాతావరణాన్ని, తనని ఆకట్టుకున్న వాటిని ప్రేరణగా కవిత్వం రాయడం మొదలుపెట్టాడు .జాన్ డ్రైడేన్ హేతువాద యుగంలో అగ్రగామి కవిగా నిలిచాడు . అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్న నేర్పరి . లాటిన్ కవి పెర్సియాస్ రచనను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసాడు .

స్త్రీవాద రచయిత్రుల ప్రస్తావన కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు రచయిత . మార్గ రెట్ లూకాస్ కేవండిష్ . ఈమె కవిత్వంలో ప్రాధమికంగా ఉన్న మహిళా ప్రభావం కన్పిస్తుంది . హాబ్స్ “ ఏ నీతి పుస్తకంలోను లేననంత నీతి మార్గ రెట్ దగ్గర ఉంది “ అన్నాడు . కవిగా అంత గుర్తింపు లేకపోయినా సామ్యూల్ జాన్సన్ ఆగస్టస్ కాలంలో విశేష ప్రాభవం ఉన్న వ్యక్తి . ఈయన విశేషాలు కూడా తెలుసుకోవచ్చు .

చిత్ర , శిల్ప కవి విలియం బ్లేక్ రాసిన “ది లాంబ్ ‘, “ ది లిటిల్ బ్లాక్ బాయ్ ‘, ‘ యాన్ అనదర్ సారో నైట్ వివరాలు అందించారు రచయిత . ప్రకృతి కవిగా పిలవబడే విలియం వర్డ్స్ వర్త్ కంబర్ లాండ్ లో జన్మించాడు . తన స్వీయ చరిత్రని ప్రిల్యుడ్ పేరుతో రచించాడు . తన విపరీత ధోరణులకు తానే బాలి అయినవాడు , 90 ఏళ్ల జీవితంలో ఎన్నో పోరాటాలు , తగాదాలతో గడిపిన వాల్టర్ సావేజ్ లాండర్ జీవిత విశేషాలు , ఆయన రాసిన రచనలు వివరాలు తెలుసుకోవచ్చు . 19 వశతాబ్దంలోని చీకటి వెలుగుల్లో ఆల్ర్ఫేడ్ లార్ట్ టెన్నీస్ , మాధ్యూ ఆర్నోల్డ్ , ప్రిరా ఫెలై ట్స్, పాట్ మోర్ రచయితల వివరాలు పొందుపరిచారు . ఇంకా ఈ పుస్తకంలో అమెరికా కవులు వాల్డో ఎమర్సన్ , జాన్ గ్రీల్ లీఫ్ విట్టర్ , లాంగ్ ఫెలో చరిత్ర విశేషాలు కన్పిస్తాయి. ఇంగ్లీష్ షార్ట్ స్టోరీస్ రచయితలలో కిప్లింగ్ మొదటి తరం వాడు . నియో రొమాంటిక్ కవి డైలాన్ థామస్ చరిత్రతో ఈ కవుల ముచ్చట్లు ముగుస్తాయి .

19 ,20 శతాబ్దాలకు వారధిగా నిలిచే ఆంగ్ల కవి ఎవరు ? అతని కవితలకు , నవలలకు నేపథ్యం ఏమిటి ? ,పునరుజ్జీవనం , రొమాంటిక్ కవిత్వాలకి మధ్య వారధిగా నిలిచిన వాడు ఎవరు ?, బ్రిటన్ జాతీయ గీతాన్ని రచించిన కవి ఎవరు ?, జంగిల బుక్ రచయిత ఎవరు ? అతని జీవితానుభవాలు ఏమిటి ?, మొదటి నోబెల్ బహుమతి అందుకున్న ఐర్లాండు కవి ఎవరు ?ఇటువంటి ఆసక్తి కరమైన విషయాలు గురించి తెలుసుకోవాలంటే ఈ పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు చదవాల్సిందే .

ఈ పూర్వాంగ్ల కవుల జీవిత విశేషాలున్న ఈ వ్యాసాలలోని ప్రతి రచయిత ఒక ప్రత్యేకతని కలిగినా వారే . ఆంగ్ల సాహిత్యం పై ఆసక్తి , అభిమానం ఉన్న వారికి , ఆంగ్ల సాహిత్యం గురించి తీసుకోవాలి అనుకునేవారికి ఆ పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ఒక మంచి కరదీపిక అనడంలో అతిశయోక్తి లేదు .

ప్రతులకు :
రచయిత : గబ్బిట దుర్గా ప్రసాద్
వెల :200 /-
ఇంటి సంఖ్య: 2-405 , శివాలయం వీధి ,
రాజుగారి తోట దగ్గర , ఉయ్యూరు ,
కృష్ణా జిల్లా -521165,
సంచార వాణి – 9989066375 .

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged , | Leave a comment

దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన – శ్రీమతి చుండూరి రత్నమ్మ

దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన – శ్రీమతి చుండూరి రత్నమ్మ

దేశం అంటే వీరాభిమానం మహాత్మా గాంధీ అంటే గొప్ప ఆరాధనా భావం ఉండి ,భారత దేశ స్వాతంత్ర్యం కోసం మహిళాభ్యున్నతికోసం సర్వం త్యాగం చేసిన మహిళా మాణిక్యం శ్రీమతి చుండూరి రత్నమ్మగారు .

బాల్యం –వివాహం – దేశ సేవ :
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ,రావు బహదూర్ పైండా వెంకట చలపతి అనే జమీందార్ గారి పుత్రికా రత్నం రత్నమ్మ ..7-2-1891 న కాకినాడలో జన్మించింది .ప్రముఖ ఏలూరు వ్యాపారి చుండూరి సుబ్బారాయుడు గారి కుమారుడు ,విద్యాధిక సంపన్నుడు అయిన శ్రీరాములుగారితో 1901 ఫిబ్రవరి పది న వివాహం జరిగింది . చిన్నతనం నుండి దేశం పరాయి వారిపాలన నుండి విముక్తం కావాలని కలలు కనేది .అప్పటికే దేశమంతా స్వాతంత్రోద్యమ కాంక్షతో రగిలిపోతోంది .తానూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని ఈ మహిళా మాణిక్యం భావించింది .సరైన సమయం వచ్చింది .1932లో సమిష్టి శాసనోల్లంఘనలో ఉత్సాహం గా పాల్గొని అరెస్ట్ అయి ,ఆరు నెలలు కారాగార శిక్ష ,రెండు వందల రూపాయల జరిమానా అనుభవించిన నిష్కళంక దేశ భక్తురాలు .

ఉద్యమ నాయకురాలు :
మహిళను కదా అని రత్నమ్మ ఏనాడూ నిరుత్సాహ పడలేదు .మరింత ఉద్వేగం గా ఉద్యమాలలో పాల్గొని చరిత్ర సృష్టించింది .1940లో జరిగిన వ్యక్తీ సత్యాగ్రహం లో పాల్గొని ఫలితం గా మళ్ళీ అర్ధ సంవత్సరం జైలు శిక్ష అనుభవించింది .అయినా ఆమె కుంగిపోలేదు .రెట్టించిన ఉత్సాహం తో దేశ స్వాతంత్ర్య సిద్ధికోసం ,ఆంగ్ల దొరల పెత్తనాన్ని తిరస్కరిస్తూ ,సత్యాగ్రహాలు చేస్తూ, చేయిస్తూ, స్పూర్తినిస్తూ మన రాష్ట్రం లోనే కాక దేశం లో పలు ప్రాంతాలు బళ్ళారి,సేలం మొదలైన ప్రదేశాలు పర్యటించి ఉత్తేజ పరిచి అందరినీ ఉద్యమ భాగస్వాములను చేసిన నేర్పు రత్నమ్మ గారిది.

త్యాగ శీలి –సేవా పరాయణి –వితరణ శీలి :
మహాత్ముడు ఏలూరు పర్యటనకు వచ్చినప్పుడు సందర్శించి ప్రేరణ పొంది తన ఒంటి మీది బంగారు నగలన్నీ సమర్పించిన త్యాగ మూర్తి మహిళా రత్నం రత్నమ్మ .భోగరాజు పట్టాభి సీతారామయ్య ,సర్ విజయ వంటి మహా దేశ భక్తులైన జాతీయ నాయకులే రత్నమ్మ గారిని చూడటానికి ఆమె ఇంటికి ఏలూరు వచ్చేవారు. అంతటి ప్రభావ శీలి .ఆ రోజుల్లో కొల్లేరుకు వరద వచ్చి అంతా భీభత్సం చేసినప్పుడు ,స్వంత కారులో ఆ ప్రాంతాలన్నీ పర్య టించి వరద బాధితులను పరామర్శించి ,వారికి కావాల్సిన ఆహార ధాన్యాలు బియ్యం ఉప్పు ,పప్పు ,కూరలు ,వంట సామాగ్రి స్వయం గా పంపిణీ చేసిన ఉదార హృదయ ,వితరణ శీలి .

స్త్రీ –జీన జనోద్దరణ :
ప్రముఖ గాంధేయ వాది ,సంఘ సేవకురాలు ,సంస్కర్త అయిన రత్నమ్మ 1940లో ఎన్నో వితంతు వివాహాలు జరిపించి సంస్కరణను ఆచరణ లోకి తెచ్చిన ఉద్యమ శీలి .స్త్రీలు స్వతంత్రం గా తమ కాళ్ళ మీద నిలబడాలన్నది ఆమె ధ్యేయం .అందుకోసం వారి ఉపాధికోసం ‘’మహిళా పారిశ్రామిక సంఘం ‘’ఏర్పరచింది .ఇందులో కుల మత విచక్షతను పాటించకుండా దళిత ,హరిజన ,అనాధ మహిళలకు స్థానం కల్పించి వారికి కుట్టుపని లో శిక్షణ నిప్పించి ,కుట్టు మిషన్లు కొని అంద జేసిన దీన జన బాంధవురాలు .

ఇంకొక అడుగు ముందుకు వేసి ఆనాడు విపరీతం గా ఉన్న వేశ్యా వ్రుత్తి లో మగ్గి పోతున్న మహిళలకు మార్గోపదేశం చేసి వారి దృష్టిని మరల్చి ,జన జీవన స్రవంతిలోకి మళ్లించిన పుణ్యాత్మురాలు .వేశ్యా జీవితం గడిపిన వారికి మంచి సంబంధాలు చూసి వివాహం చేసి వారి జీవితాలలో వెలుగులు నింపిన మహోదయురాలు .రత్నమ్మ గారు చేస్తున్న మహిళాసేవకు ,ఆ రంగం లో తల పండిన ప్రముఖ సంఘ సేవకులు ,మహిళా ఉద్యమ నాయకులు దుర్గా బాయి దేశ ముఖ్ ,కమలాదేవి చటోపాధ్యాయ మొదలైన వారు స్వయం గా వచ్చి చూసి ఆమె సంకల్ప బలానికి. సేవాతత్పరతకు బహు ప్రశంసలను అంద జేశారు ఇందరి హృదయాలను చూర గొన్న సేవా రత్నం రత్నమ్మ గారు .

విద్యా సేవ :
విద్య అందరి హక్కు అని రత్నమ్మ నమ్మారు .అందుకోసం విద్యా,గ్రంధాలయాలు ఏర్పరచారు .సంస్కృతం తెలుగు నేర్పటమే కాక సంగీతం ,నృత్యం మొదలైన కలలలో ఆసక్తి ఉన్న బాల బాలికలకు ,ఆర్ధిక సాయం అందించారు .తనలాగే స్త్రీ జనాభ్యుతి కోసం కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థలను గుర్తించి వారికి కావలసిన ఆర్దికాది అన్ని సదుపాయాలూ అందజేసి చేయూత నిచ్చి వికాసానికి తోడ్పడ్డారు .సమాజం లో అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి ఇతోధికం గా ఆర్ధిక సహకారం ఇచ్చారు .విద్యార్ధినులను ప్రోత్సహించటానికి స్వర్ణ పతకాలు వెండి షీల్డులు ,రజత పతకాలు తయారు చేయించి బహూకరించి మహిళాభ్యుదయానికి ఎన లేని సేవచేశారు .

ప్రధమ మహిళా చైర్మన్ :
ఏలూరు లోని స్వగృహం లో భర్త తోడ్పాటుతో ప్రశస్ట మైన స్వంత ‘’గ్రంధ భాండాగారా’న్ని ‘’ 1920లోనే ఏర్పాటు చేసుకొని అందరికి ఆదర్శం గా నిలిచారు .ఏలూరు కాంగ్రెస్ కమిటీలో ఎక్సి క్యూటివ్ సభ్యులుగా ,యువజన కాంగ్రెస్ సంఘాధ్యక్షులుగా బాధ్యతలను నిర్వహిస్తూనే శాసనోల్లంఘన ఉద్యమాలకు నాయకత్వం వహించారు . బాపూజీ పిలుపు నను సరించి ఖద్దరు, ధారణా.హిందీ భాషా వ్యాప్తి ,మద్య పాన నిషేధం ,హరిజనాభ్యుదయం , మహిళాభ్యుదయం వంటి అనేక నిర్మాణ కార్యక్రమాలు చేబట్టి ,విస్తృత ప్రచారం చేశారు . 1937ఏలూరు పురపాలక సంఘ సభ్యురాలుగా ఎన్నికై ,మూడేళ్ళ తర్వాత 1940పురపాలక సంఘ చైర్మన్ అయ్యారు .ఒక మహిళ ఇలాచైర్మన్ గా ఆంద్ర దేశం లో మొదటి సారిగా ఎన్నికవటం చరిత్ర కెక్కి, గొప్ప సంచలనమే సృష్టించింది .

నెల్లూరు లో జరిగిన ఆర్య వైశ్య మహిళా జన సభ లో రత్నమ్మకు ‘’సంఘ సేవా పరాయిణి’’ బిరుదు నిచ్చి సత్కరించారు .నిరంతర సేవాకార్యక్రమాలలో జీవితాన్ని సార్ధకం చేసుకొన్న స్త్రీ మాణిక్యం మహిళా రత్నం చుండూరి రత్నమ్మ డెబ్భై నాలుగు సంవత్సరాల ఫల ప్రద జీవితాన్ని గడిపి ,స్వాతంత్ర్యానంతరం పది హేదేళ్ళు బ్రతికి స్వాతంత్ర్య ఫలాలను కళ్ళారా చూసి సంతృప్తి చెంది 4-8-1965 న ఏలూరు లో పార్ధివ దేహాన్ని వదిలి కీర్తి శరీరాన్ని ధరించింది .ఆమె మరణానంతరం ‘’ఇండో ఇంగ్లీష్ హైస్కూల్ లో ‘’శ్రీమతి చుండూరి రత్నమ్మ స్మారక గ్రంధాలయం ‘’ను వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఏ.వి రాజు గారు ప్రారంభించారు .రత్నమ్మ చేసిన అపూర్వ త్యాగం,సేవా నిరతి చిరస్మరణీయం .భావి తరాలకు స్పూర్తి దాయకం,ఆదర్శం .

– గబ్బిట దుర్గా ప్రసాద్

“~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీమతి భవానిగారికి భర్త రాంబాబు గారు కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఉదయం ఇంటికి దంపతులిద్దరూ వచ్చి సంతోష పడిన దృశ్యమాలిక –

శ్రీమతి భవానిగారికి భర్త  రాంబాబు గారు  కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఉదయం  మన శ్రీ ఆంజనేయస్వామి temple ,   ఇంటికి దంపతులిద్దరూ వచ్చి సంతోష పడిన దృశ్యమాలిక –  DSCN0248 DSCN0249 DSCN0251 DSCN0252 DSCN0253

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నూ తన సంవత్సర మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు .

సాహితీ బంధువులకు శుభకామనలు .నూ తన సంవత్సర మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు .Ramya's rangoli - 1 Ramya's rangoli - 2 Ramya's rangoli - 3 Ramya's rangoli - 4 Ramya's rangoli - 5 Ramya's rangoli - 6

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ వెలగా వెంకటప్పయ్య శ్రీ గూడపాటి కోటేశ్వర రావు గార్ల మృతికి సంతాప సభ

శ్రీ వెలగా వెంకటప్పయ్య శ్రీ గూడపాటి కోటేశ్వర రావు గార్ల మృతికి సంతాప సభ

సరసభారతి ఈ రోజు 31-12-14బుధవారం సాయంత్రం అర్గంతలకు ఏ సి లైబ్రరీలో ప్రత్యెక సమావేశం జరిపి డా శ్రీ వెలగా వెంకటప్పయ్య గారు శ్రీ గూడపతి కోటేశ్వర రావు గార్ల మృతికి సంతాపం ప్రకటించి శ్రద్ధాంజలి ఘటించింది .సభాధ్యక్షునిగా నేను మాట్లాడుతూ ముందుగా వెలగా వారి బహుముఖీన సేవను ,ఉయ్యూరు సాహితీ మండలి నిర్వాహకులు శ్రీ గూడపాటి కోటేశ్వరా రావు గారిగురించి మాట్లాడాను .తర్వాత శ్రీ పెదప్రోలు విజయ సారధి శ్రీ సి హెచ్ భవానీ శంకరరావు ,శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి ,శ్రీ వీరమాచనేని బాల గంగాధర రావు తమ ప్రసంగాలలో వారిసేవాలను ప్రస్తుతించారు .వారిద్దరి ఆత్మలకు శాంతికలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించాం .వారి చిత్రపటాలకు పూలు సమర్పించి నివాళులు అర్పించాము .నాప్రసంగా విషయాలు

శ్రీ వెలగా వెంకటప్పయ్య

గ్రంధాలయ శాస్త్ర పారంగత ,ఉత్తమ గ్రంధ పాలక ,బాల బంధు ,గ్రంధాలయ గాంధి ,గ్రంధాలయ బోధనాశాస్త్ర పితామహ నడిచే విజ్ఞానసర్వస్వం ,పలికే పుస్తకం అయిన డా .వెలగా వెంకటప్పయ్య గారు ఎనభై రెండవ ఏట 29-12-14-సోమవారం రాత్రి స్వగ్రామం తెనాలిలో మరణించారు .సాహిత్య అకాడెమీ అడ్వైజరీ బోర్డు సభ్యులుగా సాహిత్య అకాడెమీ మెంబర్ గా సేవలందించారు .ఇండియన్ లైబ్రరీ లేజిస్లేషన్ ,పబ్లిక్ లైబ్రరిలేజిస్లేషన్ దిన్యు మిలీనియం మోడల్ లైబ్రరి లేజిస్లేషన్ వంటి పుస్తకాలు రాశారు .వీరి గ్రంధాలు అమెరికాలోని వాషింగ్టన్ లైబ్రరీలో  భద్రపరచిగౌరవించారు .లైబ్రరీ టేర్మినాలజీ మీద రంగ నాధన్ డిక్షనరీ రాశారు. ఇరవై వ శతాబ్దపు తెలుగు వెలుగులు ను స్వీయ సంపాదకత్వం లో రెండుభాగాలుగా తెచ్చారు  వీటిని  పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది .రష్యా ఆహ్వానం పై వెళ్లి లెనిన్ గ్రంధాలయ విధానం లైబ్రరి  సైంటిఫిక్  అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గ్రంధాలు రాశారు .తెలుగుప్రముఖుల జీవిత చరిత్రలను రాశారు .పౌర గ్రందాలయ చట్ట రూప శిల్పి .గ్రంధాలయ శాస్త్ర పాఠ్య గ్రంధ రచయిత .భారత గ్రంధాలయోద్యమం ,మార్చ్ ఆఫ్ లైబ్రరి సైన్స్ గ్రంధాలకు ఎడిటర్ గా ఉన్నారు .సామాన్య లైబ్రేరియన్ గా ప్రవేశించి వివిధ హోదాలలో సేవ చేశారు .

గ్రామీణ ఆటలు  బాలల కృష్ణ శతకం ,వేమన బొమ్మల శతకం ,బాలానంద బొమ్మల దాశరధీ శతకం సుమతీ సహ్టకం తెలుగు సామెతలు ,మన గ్రంధాలయాలు  గ్రంధా లయ సేవానిరతులు తలుగు ముద్రణ ,ప్రచురణ తెనాలి మహా వైభవం చక్రపాణి మొదలైన రచనలు చేశారు దాదాపు 60,000పేజీలు  రాశారు .ఎనభైకి పైగా గ్రంధాలు రచించారు .మూడు వందల వ్యాసాలూ రచించారు .అనేక ప్రత్యెక సంచికలను స్మారక సంచికలను సంపాదకత్వం లో వెలువరించారు .

వెలగా పై ప్రముఖులు గొప్ప ప్రశంసల జల్లు కరిపించారు.గ్రంధాలయోద్యమం లో నా వారసుడు వెంకటప్పయ్య అని  అయ్యంకి వారు ,ఆయన ఊపిరి ,ప్రాణం ఆహారం  గాలి అంతా గ్రందాలయమే అని ఆవుల సాంబశివరావు అన్నారు .గ్రంధాలయానికి మారుపేరు వెలగా అన్నారు శ్రీ నాగ భైరవ కోటేశ్వర రావు  నిర్వహణ దక్షత ఉన్నవాడు అని వావిలాల గోపాల క్రిష్నయ్య గారు సంచార గ్రంధాలయం అని రేడియో అన్నయ్య న్యాయ పతి రాఘవరావు గారు వెలగా లాఅందరూపని చేస్తే దేశం ఎప్పుడో బాగుపడేది అని పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు కీర్తించారు .కృషి రూపెత్తిన రుషి  నవ్వే తెలుగు అక్షరం ,హిత ,మిత భాషి అని బాలసాహిత్య రచయిత్రి శ్రీమతి డి సుజాతా దేవి మెచ్చారు .సమాచార నిధి ,నడిచే విజ్ఞాన సర్వస్వం అని శ్రీ రావి నూతల శ్రీరాములు అన్నారు .

గ్రంధాలయోద్యమాన్ని ఆచరణ లోకి తెచ్చిన వారు వెలగా .అయ్యంకి ,సర్వోత్తమ రావు ,వావిలాల కోదాటి వంటి మొదటి తరం గ్రందాలయోద్యం నాయకులైతే రెండో తరానికి ముఖ్య ప్రతినిధి వెలగా .కోదాటి నారాయణ రాగారు గ్రంధాలయ చైర్మన్ గా ఉండగా ,తానూ సెక్రెటరీగా ఉండి పబ్లిక్ లైబ్రరీలతో బాటు ప్రైవేట్ లైబ్రరీలకూ ఆర్ధిక సాయం ప్రభుత్వం చేసేలాగా కృషి చేశారు.

కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో 2013లో ఆలూరి బైరాగి స్మారక పురస్కారాన్ని పాతిక వేల రూపాయలను అందుకొన్నారు.విజయ వాడలో టాగూర్ గ్రంధాలయం ఏర్పడటానికి ప్రముఖ పాత్ర వహించారు .అదొక రిసెర్చ్ సెంటర్ గా మార్చారు. వివిధ గ్రందాలయాలావు ఉన్న రిసెర్చ్ పుస్తకాలను సేకరించి ఇక్కడ మూడు బీరువాలో భద్ర పరచారు .వెలగా వారి జీవితం పై శ్రీ పావులూరి శ్రీనివాసరావు గ్రంధం రాశారు. .పుస్తకానికి ప్ర్ప్రత్యామ్నాయం లేదని చెప్పేవారు . ఆయన చూడని పరిశీలించని పుస్తకమే లేదు అంటే అతిశయోక్తి కాదు .

ప్రముఖ గ్రంధాలను మైక్రో ఫిలిం లుగా తీయటం డిజిటలైజ్ చేయటం లో ముందడుగు వేశారు .ఆధునిక పద్ధతిలో గ్రంధాలను భద్రపరచే చర్యలు చేబట్టారు .బాలల రచయితల సంఘాన్ని స్థాపించి కార్య దర్శిగా పని చేశారు బాలల ఆకాడేమీలో సభ్యులుగా ఉన్నారు .జానపద సాహిత్యం లోనూ కృషి చేశారు .హాలంత శబ్దాలు ఇష్టపడే వారుకాదు డుము వులు చేర్చి రాయాలని చెప్పేవారు .పనికి రాని పుస్తకం  అంటూ లేదుఅనేవారు.ఇన్ని సుగుణాలున్న వ్యక్తీ నడిచే పుస్తకం పలికే గ్రంధం శ్రీ వెలగ వెంకటప్పయ్య గారు .

వెలగా వారికి ఉయ్యూరుకు గొప్ప సంబంధం ఉంది  .ఉయ్యూరులోఅమెరికా లోని  శ్రీమైనేని గోపాల కృష్ణ గారి భూరి ఆర్ధిక సహాయంతో ఏ సి లైబ్రరీ ఏర్పాటు చేయటానికి వెలగా వారి కృషి ఏంతోఉంది .ప్రతి నేలా వాచ్చి పని తీరును పర్య వేస్క్షించేవారు ఆనాటి జిల్లా గ్రంధాలయ చైర్మన్ గొర్రెపాటి గోపీ చంద్ గారితోను  యై విబి రాజేంద్ర ప్రసాద్ తోనూ వచ్చి. ఆ నిర్మాణ కమిటీ కన్వీనర్ గా నేను వారిని అప్పుడు కలిసి మాట్లాడేవాడిని. 2004జూలైలో లైబ్రరీ ప్రారంభోత్సవానికీ వచ్చి కార్యక్రమం నిర్వహించారు .తరచు  సభల్లో కలిసేవారు .రెండుమూడు సార్లు సరసభారతి సభలకు ఆహ్వానించినా రాలేదు .ఆలూరి బైరాగి అవార్డ్ ప్రదానం నాడు వెలగా వారిని సభకు పరిచయం చేసే అవకాశం నాకు కల్పించారు కృష్ణ జిల్లా రచయితల సంఘం వారు . సరసభారతి ప్రచురించిన పుస్తకాలన్నీ వారికి పంపేవాడిని. అందుకొని బాగుందని మెచ్చుకొంటూ జవాబు రాశారు ‘ .ఈ మధ్యనే ‘’పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’అందుకొని ఉత్తరం రాసి అభినందించి అయ్యంకి వారి పై సభ జరుపమని కోరారు .ఎందుకో చేయలేకపోయాం .

శీ గూడపాటి కోటేశ్వర రావు

గరిక పర్రు వాసి ఉయ్యూరు హైస్కూల్ విద్యార్ధి మొదటి ఎస్ ఎస్ ఎల్ సి బాచ్ వారు గూడపాటి .సాహితీ మండలిని మా గురువుగారు స్వర్గీయ లంకా బసబా చారి గారు పాతికేళ్ళ క్రితం ప్రారంభించినపుడు నాతోబాటు వ్యవస్తాపక సభ్యులు .నిత్య సాహితీ వ్యాసంగం అయన హాబీ .మంచిమనిషి క్షేత్రయ్య పదాలపై రసోల్లాసం రాశారు. నన్ను చదివిఅభిప్రాయం రాయమంటే ముప్ఫై  ఏళ్లక్రితమే రాశాను నాటకాలు  రాసి వేసి దర్శకత్వం చేసేవారు. రేడియోలో చాలా ప్రసంగాలు చేశారు .తామాషాగా మాట్లాడే నైజం .కుండ బద్దలు కొట్టినట్లు మొహమాటం లేకుండా మాట్లాడే వారు ద్వర్ది త్ర్యర్దికావ్యాలన్నా ,చేమకూర వేంకటకవి కవిత్వం అన్నా మహా మోజు .చేతిలో యాభై గ్రాముల క్రేన్ వక్కపొడి పొట్లం ఎప్పుడూ ఉండేది తానూ నములుతూ పక్కనున్న వారికీ ఆఫర్ చేసేవారు .సహృదయులు స్నేహ శీలి  .శ్రీ గూడ పాటి కోటేశ్వర రావు .ఈ ఇద్దరు లేని లోటు తీరనిదే .

2015 నూతన సంవత్సర శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-14-ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వైకుంఠ ఏకాదశి మరియు 2015నూతన సంవత్సర శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఈ ఉదయం పది గంటలకు సరసభారతి బ్లాగ్ ఒక్క దానికే రెండు లక్షల యాభై వేల యాభై అయిదు మంది వీక్షకులు ఉన్నట్లు చూసి నాటో బాటూ మీరూ ఆనందాన్ని పంచుకోవాలని తెలియ జేస్తున్నాను .ఏఏ విజయం మీది మాది మనందరిదీ అని మరొక్క మారు  తెలుపు కొంటున్నాను  సరసభారతి కొత్త సంవత్సరం లో మరింత అభి వృద్ధి చెందటానికి మీ అందరికి సహకారం అభ్యర్ధిస్తూ శుభా కాంక్షలు అంద జేస్తున్నాను  .మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ -29-12-14-ఉదయం 10-14

0001

  
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పలికే పుస్తకమే వెలగా వెంకటప్పయ్య -బుద్ధ ప్రసాద్

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సరసభారతి ఈరోజు 31-12-14- బుధవారం సాయంత్రం 6గం.లకు స్థానిక శాఖా గ్రంధాలయం లో ప్రత్యెక సమావేశం -స్వర్గీయ వెలగా ,గూడపాటిలకు శ్రద్ధాంజలి

స్వర్గీయ వెలగా ,గూడపాటిలకు శ్రద్ధాంజలి

సరసభారతి ఈరోజు 31-12-14- బుధవారం సాయంత్రం 6గం.లకు స్థానిక శాఖా  గ్రంధాలయం లో ప్రత్యెక సమావేశం జరిపి గ్రంధాలయ గాంధి ,పలికే పుస్తకం బాల సాహిత్య సృష్టికర్త ,రామ మోహన ఫౌండేషన్  సభ్యులు ,ఉయ్యూరు ఏ సి లైబ్రరీ నిర్మాణం లో సూత్ర ధారి స్వర్గీయ వెలగా వెంకటప్పయ్య గారి మరణానికి ,,ఉయ్యూరు సాహితీ మండలి వ్యవస్థాపక సభ్యులు ,ప్రస్తుత నిర్వాహకులు ,క్షేత్రయ్య సాహిత్య పరి శోధకులు ,సాహితీ మూర్తి  శ్రీ గూడపాటి కోటేశ్వర రావు  గారి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తోంది .సాహిత్యాభిమానులు ,గ్రంధాలయాభిమానులు  మిత్రులు కుటుంబ సభ్యులు  శ్రద్ధాంజలి కార్యక్రమం లో పాల్గొన వలసినదిగా అభ్యర్ధిస్తున్నాం .

జోశ్యుల శ్యామలా దేవి  మాదిరాజు శివలక్ష్మి  గబ్బిట వెంకట రమణ   వి బి.జి.రావు   గబ్బిట దుర్గా                                                                                                                ప్రసాద్

గౌరవాధ్యక్షులు           కార్య దర్శి              కోశాధికారి         సాంకేతిక నిపుణులు   అధ్యక్షులు –సరసభారతి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆరడి నేస్ ల మోడీ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ చిన జీయర్ ఆధ్వర్యం లో మహా గోదా కల్యాణం -14-1-2015 జింఖాన గ్రౌండ్స్ విజయవాడ

godakalyanam 1 001 godakalyanam 2 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మర్చిపోలేనివ్యక్తి శ్రీ సి సుబ్బా రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆందోళన లో తిరుమల భద్రత-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

2014 in review

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 90,000 times in 2014. If it were an exhibit at the Louvre Museum, it would take about 4 days for that many people to see it.

Click here to see the complete report.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తిరుప్పావై ప్రవచనం కరపత్రం

Inline image 1

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పెద్దింటి అశోక్ కుమార్ ,పై కధనం జూకంటి కవిత ,విరాగి కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి తెలుగు కదా మూలాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రికార్డుల వేటలో కూచి భొట్ల – హరప్పా కంటే ముందే యు.పి .లొ నాగరకత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా తెలుగు తల్లి ”శంకరంబాడి శతజయంతి

Untitled

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సుమంగళి -తెలుగు సినిమా -28-12-14ఆంధ్రజ్యోతి మరియు స్టేట్ బాంక్ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య –

sbi chairperson 001 sumangali 1 001 sumangali2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా తెలుగు తల్లి గేయ రచయితస్వర్గీయ శంకరంబాడి సుందరాచారి గారి శత జయంతి సభ సరసభారతి, ఫ్లోరా స్కూల్ సంయుక్త ఆధ్వర్యం లోఫ్లోరా స్కూల్ లో శనివారం 27-12-14

This gallery contains 53 photos.

More Galleries | Tagged | Leave a comment

మహారాజ‘యోగ’ం

మహారాజ‘యోగ’ం (ఈ వారం స్పెషల్)

  • 28/12/2014
  •  ఆదిత్య

యోగా.. ఇప్పుడు అందరికీ ఓ ఆరోగ్యసూచిక యోగా.. ఇప్పుడు అన్ని సమస్యలకూ ఓ పరిష్కారం. యోగా… ఇప్పుడు అందరి అవసరం. ‘యోగా.. ఒంటికి మంచిదేగా..’- అంటూ ఆ మధ్య ఓ సినిమా పాట చెవుల్లో మారుమోగింది. అది నిజమే కూడా. ఇది ఇప్పటిమాటకాదు. భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన రహస్యం ఇది. అంతకుముందే కొన్నివేల ఏళ్లక్రితం వేదాలూ ఆ మాటే చెప్పాయి. ఆ పాయింట్‌నే పతంజలీ పవర్‌ఫుల్‌గా చెప్పాడు. ఆ తరువాత బుద్ధుడూ అదే చెప్పాడు. కానీ, యోగాపై హిందూమతం ముద్రవేసి దూరంగా ఉంచేశారు. కొన్ని దశాబ్దాలుగా క్రమంగా యోగాకు పూర్వవైభవం వస్తోంది. ప్రత్యేకించి ఓ పదేళ్లుగా మరింత ప్రాధాన్యం పెరిగింది. ఆధునిక జీవనశైలి తెచ్చే అనర్థాల నుంచి తెరిపిన పడేందుకు మేలైన, సులువైన మందుగా యోగాను గుర్తించడం ప్రారంభమైంది. భారతీయ యోగాను పశ్చిమ దేశాలు ప్రేమించడం మొదలైంది. సెలబ్రిటీలు, ప్రముఖులు యోగాతో యోగ్యమైన స్థానాలకు చేరుకోవడంతో, ఉత్తమ ఫలితాలు పొందడంతో, మానసిక, శారీరక ఆరోగ్యం సాధించడంతో యోగాకు మంచిరోజులొచ్చాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగాపై చేసిన ఓ కసరత్తు సత్ఫలితాన్నిచ్చింది. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డేగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. భారతీయ యోగాకు అంతర్జాతీయ గౌరవం దక్కింది. **** ఇంటర్నెట్ పుణ్యమాని ఇంట్లో కూర్చుని ఒక్క ‘క్లిక్’ కొడితే చాలు.. కిరాణా దుకాణం, బట్టల కొట్టు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల షాపు అన్నీ మన కళ్లెదుట ప్రత్యక్షం.. ‘ఆన్‌లైన్ షాపింగ్’ అందుబాటులోకి రావడంతో మనం కాలు కదపకుండానే అన్నీ నేరుగా ఇంటికే వచ్చేస్తాయి.. ఆఫీసుకెళితే సమయం తెలియకుండా పనిలో పడిపోవడం.. ఇంటికెళ్లాక కాలక్షేపం పేరుతో గంటలకొద్దీ టీవీకి అతుక్కుపోవడం.. శరీరానికీ, మనసుకూ ఏ మాత్రం పని లేకుండా అంతా యాంత్రికంగా గడిచిపోవడం… *** ఉదయం లేవగానే తప్పదు కనుక- కొన్ని పనుల్ని మొక్కుబడిగా ముగించడం.. బైకో, కారో ఉంటో ‘స్టార్ట్’ చేసి ఎక్కేయడం.. ‘లిఫ్ట్’లో పనిచేసే చోటకు చేరుకోవడం.. నడకను కూడా దూరం చేసుకోవడం.. అనేకానేక అనారోగ్యాలకు దగ్గర కావడం.. వినూత్న జీవనశైలితో రాజీపడిపోవడం.. ఒత్తిడి పెరిగిపోయిందని అనుక్షణం విసుగెత్తిపోవడం… మార్కులు, ర్యాంకుల ధ్యాసలో పిల్లలు, ఇంటి బాధ్యతలతో గృహిణులు, ఆఫీసు వ్యవహారాల్లో ఉద్యోగులు.. నేటి నవ నాగరిక కాలంలో అందరిదీ ఉరుకులు,పరుగుల జీవనమే.. ఒత్తిళ్లు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు నిత్య జీవితంలో అంతర్భాగమయ్యాయి.. ధనిక, పేద తేడా లేదు.. చిన్నా పెద్దా వ్యత్యాసం లేదు.. ఎవరిని కదిపినా కష్టాలు, కలతలే.. సాంకేతిక విజ్ఞానం విస్తరించినా, ఆధునిక సౌకర్యాలు ఎంతగా సమకూరినా అన్నీ సజావుగా సాగుతాయన్న నమ్మకం లేకుండా పోయింది… పరిపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యం ప్రశ్నార్థకం కావడంతో అనేక దుష్ఫలితాలను చవిచూడక తప్పడం లేదు.. అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, మనోవైకల్యం వంటివి సర్వసాధారణమై పోయాయి.. .. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శారీరక, మానసిక ఉత్తేజానికి ‘యోగా’ ఓ ఆశాకిరణమైంది. వ్యక్తిత్వ దీపాన్ని వెలిగించుకోవడానికి, జీవన రథాన్ని ముందుకు నడిపించడానికి, అనుబంధాలను పెంచుకుంటూ నిత్యం ఆనందం పొందడానికి ‘యోగా’ దోహద పడుతోంది. మానసికంగా సర్వోన్నత స్థితికి చేరేందుకు ‘ఆధ్యాత్మికత’ ఓ మార్గమైతే.. ఆ దారిలో గ మ్యాన్ని చేరుకోవడానికి ‘యోగా’ కూడా అవసరమే. ‘ఆధ్యాత్మిక ప్రజ్ఞ’ సాధించేందుకు సత్యసంధత, నీతి, నిజాయితీ, ఇంద్రియ నిగ్రహంతో పాటు యోగా, ధ్యానం, ప్రార్థన వంటివి ఎంతగానో సహకరిస్తాయి. వ్యాపారం, ఉద్యోగం, చదువు.. ఎందులో రాణించాలన్నా- చేసే పనిమీదే మనసంతా కేంద్రీకృతం కావాలి. ఏకాగ్రతతో విజయపథంలో పయనించాలంటే యోగా ఓ దిక్సూచిలా పనిచేస్తుంది. అందుకే- ఒత్తిళ్లను జయించే సాధనంగా నేడు దేశవిదేశాల్లో చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. యాంత్రిక జీవనంలో యోగా ఓ దివ్యౌషధంలా పనిచేస్తుందని అనేక అధ్యయనాల్లో తేలడంతో ఇపుడు అందరి దృష్టి దీనిపైనే పడింది. ‘యోగా’ చరిత్ర… ప్రపంచానికి ‘యోగా’ను పరిచయం చేసిన ఘనత మన దేశానిదే. వేద కాలానికి పూర్వమే ‘యోగా’ భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైంది. వేల సంవత్సరాల క్రితం ఇది మన దేశంలో పుట్టి అనతికాలంలోనే విశ్వవ్యాప్తమైంది. సంస్కృత పదమైన ‘యోగా’కు ‘విజ్ఞానం’ అనే అర్థం ఉందని విజ్ఞులు చెబుతారు. నాలుగు వేదాల్లో ఒకటైన రుగ్వేదంలో యోగాకు సంబంధించిన అంశాలెన్నో కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ‘్భగవద్గీత’లోనూ దీని ప్రస్తావన ఉంది. ‘యోగా’ను ఆచరించిన వాడే- కోర్కెలపై మమకారం లేకుండా కర్మలపై దృష్టి కేంద్రీకరించగలడన్నది ‘గీతా’ సారాంశం. ‘యోగా’ అన్నది మతసంబంధమైన అంశం కాదు. శారీరక, మానసిక సమస్యలను జయించి ‘ఆధ్యాత్మిక ప్రజ్ఞ’ సాధించేందుకు ఇది ఓ అద్భుత సాధనం. ఈ స్థితికి చేరుకునేందుకు యోగాలో అనేక పద్ధతులను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. వ్యాయామం, ధ్యానం, ఆసనాలు, ప్రాణాయామం వంటివి ఇందులో ప్రధానాంశాలు. మూడు రకాల ఆరోగ్యాలను చేకూర్చే శక్తి ఉన్నందునే దీనికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది. వ్యాయామం, ఆసనాలతో శారీరక ఆరోగ్యం, ప్రాణాయామంతో మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, ధ్యానంతో ఆధ్యాత్మిక ఆరోగ్యం సిద్ధిస్తాయి. యోగాలో కనిపించే ‘శిక్షణ, క్రమశిక్షణ’ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఎల్లలు లేనిది.. నిజానికి యోగా ఓ మహా సముద్రం లాంటిది. లోతుకు వెళ్లేకొద్దీ ఇందులో అన్నీ అద్భుతాలే. నేర్చుకున్నకొద్దీ ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది. సాధకుడి శరీరంపై, మనసుపై ఇది ఎంతో ప్రభావం చూపుతుంది. యోగ శాస్త్రంలో నిగూఢమైన అంశాలను అవగతం చేసుకుంటే – ఆధునిక జీవితంలో అనేక సమస్యలకు, సవాళ్లకు సమాధానాలు లభిస్తాయి. యోగాకు సంబంధించిన ప్రతి ఫలితాన్ని శాస్ర్తియ దృక్పథంతో విశే్లషించుకుంటే దీనిపై తప్పకుండా నమ్మకం ఏర్పడుతుంది. యోగాను ఆచరిస్తే మనం ఆలోచించే పద్ధతుల్లోనే కాదు, జీవన విధానంలోనూ మార్పును గమనించవచ్చు. మానసిక రుగ్మతలతో పాటు అనేక శారీరక సమస్యలను అధిగమించేందుకు యోగా తోడ్పడుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. వెన్నునొప్పి, ఆస్తమా, కీళ్ల సమస్యలు, ఒత్తిళ్లు, జ్ఞాపకశక్తి మందగించడం వంటి అనేక సమస్యల నుంచి విముక్తి ప్రసాదించే దివ్యశక్తి యోగాలో ఉందని ఇప్పటికే పలు పరిశోధనలు ఘోషిస్తున్నాయి. ‘ఎనిమిది మెట్ల’తో ఎంతో ఉన్నతికి.. ‘యోగా’ అంటే శరీరాన్ని విల్లులా వంచడం, ముద్దలా చేసి మెలికలు తిప్పడం కాదు. ఇలాంటి విద్యలన్నీ సాధారణ వ్యాయామం కింద వస్తాయి. ‘యోగా’కు ఉన్న అర్థం ఎంతో విస్తృతమైనది. యోగా సాధనలో ఎనిమిది సోపానాలు అధిగమిస్తే శారీరక, మానసిక వికాసం పొందవచ్చు. ‘యమ’ ( అహింస, సత్యసంధత, ఇంద్రియ నిగ్రహం వంటివి), ‘నియమ’ ( తపస్సు, దైవ చింతన), ఆసన ( పలు రకాల ఆసనాలు), ప్రాణాయామం (శ్వాసను నియంత్రించడం), ధ్యానం ( ఒక లక్ష్యం మీద మనసు కేంద్రీకరించడం), ప్రత్యాహారం ( బాహ్య సంబంధ విషయాల నుంచి మనసును తప్పించడం), ధారణ ( ఒకే విషయంపై మనసు పెట్టి ఏకాగ్రతతో పనిచేయడం), సమాధి ( సాధనలో అత్యున్నత స్థితి ఇది. దీన్ని చేరాలంటే మిగతా ఏడు మెట్లనూ ఎక్కి రావాలి) ..అనే 8 సోపానాలు యోగాలో కీలకాంశాలుగా పేర్కొంటారు. యోగా యోధులు.. ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువులు ఎవరంటే మనదేశానికి చెందిన ఇద్దరి పేర్లు చెబుతారు ఎవరైనా. ఆ ఇద్దరూ కర్నాటకకు చెందినవారే. మొదటి స్థానం బికెఎస్ అయ్యంగార్‌కే దక్కింది. పతంజలి చెప్పిన యోగాకు ప్రాచుర్యం కల్పించి, తన ఆలోచనల మేరకు చిన్నచిన్న మార్పులు చేసి అందరికీ నేర్పించారు. ప్రత్యేక శిక్షణ సంస్థను నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేశారు. మైసూరు సమీపంలోని బెల్లూరులో పుట్టి చిన్నతనంలోనే తన బావ సూచనతో యోగా నేర్చుకున్నారు. జిడ్డు కృష్ణమూర్తివంటి వారితో కలిసి బోధనలు చేశారు. ఈయన చెప్పే యోగాకు ‘అయ్యంగార్ యోగా’గా కీర్తి దక్కింది. 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ అవార్డులతో భారత ప్ర భుత్వం సత్కరించింది. ఆయన రాసిన పుస్తకాలు ‘లైట్ ఆన్ యోగా’, ‘లైట్ ఆన్ ప్రాణాయామ’, ‘లైట్ ఆన్ ది యోగసూత్ర ఆఫ్ పతంజలి’ వంటివి జనాదరణ పొందాయి. 90 ఏళ్ల వయసులోనూ రోజూ 3 గంటలపాటు యోగా, ఒక గంటపాటు ప్రాణాయామం చేసిన ఆయన 95 ఏళ్ల వయసులో, ఈ ఏడాది ఆగస్టు 20న పరమపదించారు. ప్రఖ్యాత యోగా గురువు రామ్‌దేవ్ బాబా యోగాశైలిని ఆయన విభేదించారు. పట్ట్భా జాయిస్ ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువుల్లో రెండోస్థానం కె.పట్ట్భా జోయిస్‌దే. సంప్రదాయ యోగాకు భిన్నంగా కొన్ని మార్పులు చేసి, జిమ్నాస్టిక్స్ తరహాలో అష్టాంగ విన్యాస యోగను ఆయన సృష్టించి బోధించారు. ఈ రంగంలో పరిశోధన, శిక్షణ కోసం కె.పట్ట్భా జోయిస్ అష్టాంగ యోగా ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించారు. మైసూరు మహారాజు కృష్ణ రాజేంద్ర వడయారు తీవ్ర అస్వస్థతకు గురైనపుడు ఎవరి చికిత్సా పనిచేయనప్పుడు తన యోగావిద్యతో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయడంతో ఇక జోయిస్‌కు తిరుగులేకుండాపోయింది. 1916లో పుట్టిన ఆయన 93 ఏళ్ల వయసులో సహజ మరణం పొందారు. ఆయన రాసిన ‘యోగమాల‘ పుస్తకం అత్యంత ప్రజాదరణ పొందింది. రామ్‌దేవ్ ప్రచారం.. బాబా రామ్‌దేవ్ ‘యోగా’ సృషికర్త కానప్పటికీ- ఆ విద్యకు నేడు బహుళ ప్రచారం తెచ్చిన వ్యక్తిగా ప్రఖ్యాతి పొందారు. వేల ఏళ్లకు పూర్వమే పతంజలి మహర్షి యోగా సూత్రాలను సంకలనం చేసి అనేక విషయాలను సూత్రీరించారు. ఆ తర్వాతి కాలంలోనూ ఎంతోమంది యోగులు, రుషులు యోగాను జనబాహుళ్యంలోకి తెచ్చారు. జీవనశైలి, దృక్పథం, ప్రవర్తన వంటివి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నది కాదనలేని వాస్తవం. యోగాను జనం భాషలో బోధించడం, ఆరోగ్యానికి అనుసంధానించడంలో బాబా రామ్‌దేవ్ ఇపుడు విభిన్న శైలిలో కృషి చేస్తున్నారు. ఆధునిక జీవితంలో మృగ్యమైపోతున్న ఆరోగ్య భాగ్యాన్ని తిరిగి అందించేందుకు యోగా ఓ అద్భుత సాధనమని ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రాణాయామంలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టిన రామ్‌దేవ్ యోగాకు సంబంధించిన అనేక అంశాలపై లోతుగా అధ్యయనం చేశారు. జనం మధ్యకు వెళ్లడమే కాదు, ఆధునిక ప్రసార మాధ్యమాలను ఆయన విస్తృతంగా వినియోగించుకుంటూ దేశవిదేశాల్లో యోగాకు ఒక ‘క్రేజ్’ సంపాదించిపెట్టారు. యోగాకు సంబంధించిన అనేక పుస్తకాలు, వీడియో సీడీలే కాదు, అంతర్జాలాన్ని, టీవీ చానళ్లను ఆయన సమర్థవంతంగా వాడుకుంటున్నారు. యోగాతో పాటు ఆయుర్వేద వైద్యానికి ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. నియంత్రణ, చట్టబద్ధత ఏదీ..? ఏ వస్తువుకైనా డిమాండ్ పెరిగితే దానికి మార్కెట్ మరింతగా విస్తరిస్తుందనే ఆర్థిక సూత్రం ‘యోగా’కు కూడా వర్తిస్తుంది. అన్ని వర్గాల వారిలో ఆసక్తి రానురానూ పెరగడంతో ‘యోగా’లో మెళకువలు నేర్పేందుకు ఎన్నో సంస్థలు తామరతంపరగా వెలుస్తున్నాయి. యోగా శిక్షకులూ అందుబాటులో ఉంటున్నారు. యోగా తరగతులు నిర్వహిస్తామంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. రోజూ ఉదయానే్న టీవీ చా నళ్లలో యోగా క్లాసులు ప్రసారం కావడంతో వాటిని చూసేవారే కాదు, నేర్చుకోవాలనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరో వైపు- తగినంత అనుభవం, అర్హతలు లేని వారు సైతం ‘యోగా టీచర్ల’ అవతారం ఎత్తుతూ దీన్ని వ్యాపార మయం చేస్తున్నారు. ‘్ఫన్ చేస్తే చాలు.. మీ ఇంటి ముంగిటకు వచ్చి ఆసనాలు, వ్యాయామం నేర్పుతాం..’ అంటూ ప్రచారం చేసుకునేవారూ రంగ ప్రవేశం చేశారు. అయితే, మిగతా చదువులకు ఉన్నట్లు యోగ విద్యకు సంబంధించి ప్రభుత్వం ఆమోదించిన సిలబస్ గానీ, ధ్రువీకరణ పత్రాలు గానీ లేకపోవడంతో మిడిమిడి జ్ఞానంతో ప్రమాదకరమైన ఆసనాలను నేర్పేవారూ పుట్టుకొస్తున్నారు. సరైన రీతిలో యోగాను అభ్యసిస్తే- ఆ పాఠాలు, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఉన్నత విలువలు వంటివి జీవితంలో ఎదగడానికి తోడ్పడతాయి. యోగాకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని- ఇదో మంచి ఆదాయ మార్గంగా భావించేవారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. విలువైన కాలాన్ని, ధనాన్ని వృథా చేసుకోకుండా సరైన శిక్షకుడి వద్ద తమకు అనువైన పద్ధతుల్లో దీన్ని నేర్చుకోవాలి. శిక్షకులపై అవగాహనతో పాటు ఆచితూచి నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. అనుభవజ్ఞులను ఆశ్రయిస్తే మనకు అవసరమైన యోగా పద్ధతులను నేర్చుకుని మంచి ఫలితాలను సాధించవచ్చు. ‘పేటెంట్’ దక్కేలా… యోగా విద్య ఇపుడు మంచి ‘కెరీర్’గానూ రూపొందుతోంది. గనుక ప్రభుత్వమే తగినన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో దీన్ని ఒక కోర్సుగా ప్రవేశ పెట్టేందుకు, నిష్ణాతులైన వారిచే తగిన సిలబస్ రూపొందించేందుకు ప్రయత్నాలు జరగాలి. ఏవో కొన్ని ఆసనాలను నేర్పిన వారు యోగా గురువులు కాలేరు. సుశిక్షితులైన యోగా నిపుణులను తీర్చిదిద్దడానికి పటిష్టమైన వ్యవస్థ ఏర్పడాలి. గుర్తింపు పొందిన శిక్షకులు మాత్రమే యోగా నేర్పేలా ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ ఉండాలి. అపుడు ఈ రంగంలోనూ ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఈ విద్య మన దేశానికే చెందినందున అంతర్జాతీయ స్థాయిలో ‘యోగా’పై మనకు ‘పేటెంట్’ దక్కేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. యోగాకు విశ్వవ్యాప్త గుర్తింపు, ఆదరణ లభించడం హర్షణీయమే అయినప్పటికీ.. ఈ విద్యపై చట్టపరంగా సర్వహక్కులూ మన దేశానికే ఉండాలి. ఆద్యుడు పతంజలి ఇప్పుడు అందరూ ఆరాధిస్తున్న యోగాకు ఆది గురువు పతంజలి. యోగా భారతదేశంలో పుట్టింది. యోగాను కనుగొన్నది, శాస్తబ్రద్ధం చేసినది ఆయనే. క్రీ.పూ. 200 సంవత్సరంలో ఆయన జీవించారని, శ్రీకృష్ణుని కాలానికి అటూఇటూగా జీవించారని చెబుతున్నప్పటికీ 5వేల ఏళ్లనాటికే పతంజలి యోగాను బోధించాడని అందరూ అంగీకరిస్తున్నమాట. యోగశాస్త్రం, యోగా సూత్రాలను ఆయన రచించారు. పాణిని రాసిన అష్ట్ధ్యాయికి పతంజలి భాష్యం రాశారు. మనిషి శరీరంలో ఉండే ప్రాణశక్తికి ఉత్తేజం కలిగించడం ద్వారా కుండలినీ శక్తి ఉద్భవిస్తుందని, దానివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం, బుద్ధి వికాసం కలుగుతాయని ఆయన భావించారు. అది సాధించడానికి యోగా ఉపకరిస్తుందని సూత్రీకరించారు. 195 యోగా సూత్రాలతో ఓ గ్రంథాన్ని వెలువరించారు. ఈ శాస్త్రాన్ని నాలుగు పాదాలు (సమాధి, సాధన, విభూతి, కైవల్య)గా వర్గీకరిస్తూ 26 తత్వాలు రాశారు. మొత్తంమీద యోగ శాస్త్రాన్ని 8 అంగాలుగా (యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి) వర్గీకరించారు. ఆహారపు అలవాట్లు, శరీరస్థితి, మానసిక స్థితి, ఏకాగ్రత సాధన, భక్తి, చక్కటి శ్వాస, స్థిరచిత్తం వంటివి సాధించడం ద్వారా అలౌకిక స్థితికి చేర్చేది యోగా. దీనివల్ల నాడీవ్యవస్థ చేతనమై మానసిక, శారీరక, ఆధ్యాత్మికంగా శక్తిసంపన్నులై ఒత్తిడిని తట్టుకోగలిగి, ఆరోగ్యంగా ఉండగలిగేలా మనిషి తీర్చిదిద్దబడతాడని యోగా నిరూపించింది. మనసు, స్పృహ, చైతన్యం యోగాకు కీలకం. పతంజలి చెప్పిన సూత్రాలలో రాజయోగ, హఠయోగ విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. యోగా డే…ప్రత్యేకత జూన్ 21 తేదీని ‘అంతర్జాతీయ యోగా డే’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వినతికి స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ తేదీనే ఎందుకు ‘యోగా డే’గా గుర్తించారో తెలుసా..? సూర్యుడి గమనం ఆధారంగా సంవత్సరంలో అత్యంత సుదీర్ఘమైన పగలు జూన్ 21నే ఉంటుంది. ఆ రోజునే యోగా డేగా గుర్తించాలని మోదీ కోరారు. సెప్టెంబర్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మోదీ ఈ ప్రతిపాదన చేశారు. ఆ తరువాత కేవలం మూడు నెలల్లో అది అమల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితిలో ఇంతవరకు మరే ప్రతిపాదనా ఇంత తక్కువ వ్యవధిలో కార్యరూపంలోకి రాలేదు. అలాగే ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తరువాత మరే తీర్మానానికి యోగా డే తీర్మానానికి దక్కినంత మద్దతు లభించలేదు. ఈ సమితిలో 195 దేశాలుంటే ఇప్పటివరకు 177 దేశాలు యోగా డేను సమర్థించాయి. భద్రతామండలిలోని ఐదు దేశాలూ దీనికి మద్దతు తెలిపాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించినందువల్ల ఏటా జూన్ 21న ఆయా దేశాల్లో యోగాపై అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు, పోటీలు సాధికారికంగా నిర్వహిస్తారు. కరీనా…శిల్పా.. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వ్యాయామంగా యోగాను చెప్పుకోవాలి. మనిషి ఒత్తిడిని తట్టుకుని, శరీరాకృతిని మెరుగుపరుచుకుని, సంయమనంతో ప్రశాంతంగా జీవించడానికి యోగా ఉపయోగపడుతుంది. భారతదేశంలో పుట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న యోగా ఇటీవలి కాలంలో జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోవడానికి సినీతారలు, ఇతర సెలబ్రిటీలు, ప్రసార మాధ్యమాలు కారణం. జనంలో వచ్చిన చైతన్యమూ అందుకు తోడవుతోంది. పతంజలి మహర్షి చెప్పిన యో గాను ఆధునిక యుగానికి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసుకుని ఎవరికివారు ప్రత్యేకతలతోకూడిన యోగాను అనుసరిస్తున్నారు. ప్రాణాయామం, యోగాను రోజువారీ కార్యక్రమంగా, క్రమం తప్పకుండా చేస్తూ ఈ రంగంలోనూ రాణించిన సినీతారలు ఎందరో ఉన్నారు. బాలీవుడ్ తార కరీనాకపూర్‌కు యోగా అంటే ప్రాణం. టీవీ,సినీ వ్యాపార ప్రకటనల్లో తళుక్కున మెరిసే ఈ తార తన సౌందర్య రహస్యమంతా యోగాయే అంటోంది. ఆ మధ్య ఒళ్లు బాగా పెరిగిపోయినప్పుడు జీరోసైజ్ రావడానికి యోగాను ఆమె ఆశ్రయించి సత్ఫలితం సాధించారు. అయితే, సంప్రదాయ యోగాకు బదులు ఆమె ‘పవర్ యోగా’ను పాటిస్తారు. అంటే- ఓ గదిలో 105 డిగ్రీల ఫారన్‌హీట్ వేడి, 40 శాతం తేమతోకూడిన వాతావరణంలో ఆమె రోజూ గంటన్నర పాటు యోగా చేస్తారు. ప్రాణాయామం అందులో భాగమే. ఆరారా ఆహారం, వేడిచేసి చల్లార్చిన మంచినీళ్లు తరచూ తాగడం ఆమె హాబీలు. కరీనా యోగాపై వచ్చిన పుస్తకం ‘ఫ్రమ్ ఎక్సెల్ టు ఎక్సెస్’ మార్కెట్లో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయింది. భారతీయ సెలబ్రిటీల్లో శిలాశెట్టి కూడా యోగాలో ట్రెండ్ సెట్టరే. మెడనొప్పి, స్పాండిలైటిస్, వెన్ను సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బందిపడ్డప్పుడు యోగాను ఆశ్రయించారు. అద్భుతమైన ఫలితాలు సాధించారు. చూడముచ్చటైన శరీరాకృతి, మేని సౌందర్యం ఆమె సొంతమయ్యాయి. ఆమె విడుదల చేసిన ‘శిల్పాస్ యోగా’ అనే పుస్తకం సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రతీరోజు కనీసం గంటపాటు ఆమె యోగా చేస్తారు. ఇక ప్రముఖ నటీమణులు సోనమ్‌కపూర్, లారాదత్తా కూడా యోగా అంటే ఇష్టపడేవారే. వారు చేసిన యోగాకు సంబంధించి డివిడిలు మార్కెట్లో లభిస్తున్నాయ. పిల్లల్ని కన్న తరువాత శరీరం కొన్ని మార్పులకు లోనవుతుందని, వాటినుంచి తేరుకుని మళ్లీ నాజూకుగా తయారవడానికి యోగా తోడ్పడుతుందని అంటారు లారాదత్తా. తొలికాన్పు తరువాత యోగాతో మళ్లీ నాజూకుగా తయారయ్యాయని చెబుతున్నారు. అయితే సోనమ్‌కపూర్ మాత్రం బిక్రమ్ యోగాను అనుసరిస్తారు. ఇక ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని మడోన్నా అష్టాంగ, హఠ యోగ చేయడంలో దిట్ట. తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి యోగాతో ఉపశమనం పొందుతున్నట్లు ఆమె చెబుతారు. హాలీవుడ్ ప్రముఖులు మెగారియాన్, జెన్నిఫర్ అనిస్టిన్ సహా లెక్కలేనంతమంది తారలు ఇప్పుడు యోగాకు దాసులయ్యారు. ……………………………. ‘అనారోగ్యం, పేదరికం.. ఇవే మన దేశంలో ప్రధాన సమస్యలు. యోగాతో అనారోగ్యాన్ని, నల్లడబ్బు వెలికితీతతో పేదరికాన్ని దూరం చేయవచ్చు.’ – బాబా రామ్‌దేవ్ …………………………… మార్చిలో ప్రపంచ యోగా వీక్ ఉత్తరాఖండ్‌లోని రిషీకేష్‌లో ఏటా అంతర్జాతీయ యోగా వారోత్సవాలు నిర్వహిస్తారు. వేలాదిమంది యోగా అభ్యాసకులు, బోధకులు అక్కడికి వస్తారు. వచ్చే ఏడాది మార్చి 1నుండి 7వరకు ఈ వారోత్సవాలను నిర్వహించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. యోగాశిక్షణ, ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, గంగాహారతితో వేడుకలు ముగుస్తాయి. గంగానదీతీరంలో ఉండే ఏకైక యోగా శిక్షణ కేంద్రం ఇక్కడ ఉంది. దీనిని రిషీకేష్ యోగా పీఠ్ నిర్వహిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ వారోత్సవాలకు సహకరిస్తోంది. …………………………….

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు బొమ్మ’ పెద్ద కాంప్లిమెంట్‌..!

బాపు బొమ్మ’ పెద్ద కాంప్లిమెంట్‌..!

మానవ జీవితంలో మధుర ఘట్టమైన పెళ్లి తాలూకు జ్ఞాపకాల దొంతర బాపు సృష్టించిన ‘పెళ్లి పుస్తకం’. ఈ సినిమాతో తన కెరీర్‌కీ, వెండితెరకి సొబగులు దిద్దిన బాపు బొమ్మ దివ్యవాణి. తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరమై, క్రీస్తు సేవలో తరిస్తున్నారు. మళ్లీ నటించాలన్న ఆశ ఉన్నా, ఇకపై నటించనని, నటించలేనని చెబుతున్న దివ్యవాణి అంతరంగం ఇది…
‘‘మా ఊరు తెనాలిలోని ఆదినారాయణపురం. అమ్మ విజయలక్ష్మి, నాన్న కె.ఆదినారాయణరావు. నేను పుట్టి, పెరిగిందంతా తెనాలిలోనే. అమ్మ తరపుగానీ, నాన్న తరపునగానీ ఆర్టిస్ట్‌లు, నాటకాల్లో నటించినవాళ్లు ఎవరూ లేరు. అయితే అమ్మకి చిన్నప్పటి నుండి డ్యాన్స్‌ అంటే ఆసక్తి ఉండేది. మా అక్క హరిప్రియ నటించాలని ఆశపడితే ఆమెకోసం చెన్నైకి వచ్చాము. నేను అప్పుడు తెనాలిలోనే 9వ తరగతి చదువుతున్నాను. 10 వ తరగతి పరీక్షలు రాసేసి, అమ్మ, అక్కని చూద్దామని నేనూ చెన్నైకి వచ్చాను. ఊర్వశి శారదగారు అమ్మకి మంచి ఫ్రెండ్‌, తెనాలి అవ్వడం వల్ల. శారదా ఆంటీ నన్ను చూసి, ‘ఈ అమ్మాయికి మంచి ఆర్టిస్ట్‌ అయ్యే లక్షణాలున్నాయి’ అని అమ్మకు చెప్పారు. తరువాత ఫోటోసెషన్‌ చేయడం, అవి చాలా బాగా రావడం, నేను ఆర్టిస్ట్‌ని కావడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇదంతా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది, అలా నేను సినిమా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టాను.
ఏమీ తెలియని వయసులోనే…
నిజానికి అప్పటికి ఇండస్ర్టీ గురించి నాకేమి తెలియదు. 14 ఏళ్లంటే ఏం తెలుస్తుంది చెప్పండి? మన గురించే మనకి అవగాహన ఉండని వయసు అది. కేవలం అమ్మ, అక్కల ఇంట్రస్ట్‌తోనే నేను సినిమాల్లోకి రావడం జరిగింది. చాలామంది ‘నేను అలా అవ్వాలి, ఇలా అవ్వాలి’ అని ఒక తపనతో వస్తుంటారు. నా వరకైతే అప్పటి వరకు స్కూల్‌కెళ్లడం, చదువుకోవడం, ఆడుకోవడం, తినడం తప్పించి ఇంకేమీ తెలియవు. అయితే నటన నాకు దేవుడిచ్చిన వరం. స్వతహాగానే నేర్చుకోగలిగాను. ఏ రోజూ నేను ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లింది లేదు. డ్యాన్స్‌ కూడా అంతే. మామూలుగా ఇంట్లో సరదాగా నేర్చుకున్నదే తప్పితే ప్రత్యేకంగా శిక్షణ ఏమీ పొందలేదు. మొదట అవకాశం కోసం అమ్మ, నేను పరుచూరి గోపాలకృష్ణ దగ్గరకి వెళ్లాం. నా సినిమా కెరీర్‌కి ఆద్యం పోసింది శారద ఆంటీ, పరుచూరి బ్రదర్సే. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వర్ణించలేనిది. ఇప్పటికి కూడా కష్టాలు వాళ్లవి, విజయాలు నావి.
సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్‌ అనేవారు…
నాకు అన్నయ్య కూడా ఉన్నాడు, రవిచంద్ర బాబు. ముగ్గురం చాలా ఆత్మీయంగా ఉండేవాళ్లం. అక్క తనకంటే ముందు నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషపడింది. కృష్ణగారి అమ్మాయిగా తొలిసారి కెమెరా ముందు నిలబడ్డాను. నా తొలి సినిమా ‘సర్దార్‌ కృష్ణమనాయుడు’. కృష్ణగారు డ్యూయల్‌ రోల్‌, శారద ఆంటీ కూడా ఉన్నారు. నేను చాలామంది పెద్ద పెద్దవాళ్ల ఇంటర్వ్యూలు చదివాను, దాదాపు అందరూ కూడా తొలి రోజు చాలా భయపడ్డామని, టెన్షన్‌గా ఉండేదని చెప్పారు. కానీ, నిజంగా చెబుతున్నాను నాకు అటువంటిదేమి లేదు. ధైర్యంగా వెళ్లి కెమెరా ముందు నిలబడ్డాను, తొలి షాట్‌ సింగిల్‌ టేక్‌లో ఓకే అయిపోయింది. అందులో – కృష్ణగారు ఆసుపత్రిలో మంచం మీద వుంటారు, ఆయన నాకు తండ్రి అని తెలియదు. శారద ఆంటీ లోపలే ఉంటారు. నేను తలుపు తెరచి ‘ఆంటీ’ అని పిలవాలి. అదీ నా తొలి సన్నివేశం. ఆ సినిమాలో అందరూ హేమాహేమీలే. బాగా నటించానని నన్ను మెచ్చుకున్నారు. ఎంతైనా అందరం తెనాలివాళ్లమే కదా. కళలకు పుట్టినిల్లు అది. దివ్యవాణి అంటే సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్‌ అని పేరు వచ్చింది. అది దేవుడి వరమే అనుకోవాలి.
ఇక సినిమాలు వద్దనుకున్నా… కానీ!
తరువాత కేఎస్‌ఆర్‌ దాస్‌ దర్శకత్వంలో ‘అడవిలో అర్ధరాత్రి’ చేశాను. ఇంకా ‘మా తెలుగు తల్లి’; రవిరాజాగారి ‘ముత్యమంత ముద్దు’.. హీరోయిన్‌గా నా తొలి సినిమా కన్నడంలో చేసిన ‘డ్యాన్స్‌ రాజా డ్యాన్స్‌’. చాలా పెద్ద హిట్‌. అప్పటికి తెలుగులో హీరోయిన్‌గా చేయలేదు. అవకాశాలు వచ్చేవి, కానీ హీరోయిన్‌గా ఓకే అయ్యాక కూడా చేజారిపోయేవి. ఇలా కొన్ని సినిమాలు చేసిన తరువాత నటన వరకు ఓకేగానీ, ఎందుకో ఇండస్ర్టీలో ఇమడలేకపోయాను. ఇండస్ర్టీ అంటే ఏంటో అర్ధమయ్యాక, ఇక సినిమాలు వద్దు, తెనాలి వెళ్లిపోయి చదువుకుందాం అని నిర్ణయానికి వచ్చేశాను. ఆ సమయంలో బాపుగారి దగ్గర నుండి కాల్‌ వచ్చింది.
నీ సొంత జుట్టేనా అనడిగారు…
‘అబ్బ.. ఈయన కూడా అందరిలాగే చూస్తారు. ఏవేవో అంటారు. మనం కాంప్రమైజ్‌ కాలేం. హీరోయిన్‌గా తీసుకోకపోతే మళ్లీ ఏడ్వాలి’ అనుకుని తలంతా నూనె పెట్టుకుని, మామూలుగా తెనాలిలో ఎలా ఉంటామో అలా జడ వేసుకుని వెళ్లాను. బాపు సహజత్వాన్ని బాగా ఇష్టపడే దర్శకులు. ఆయన దగ్గరకి వెళ్లగానే ఆయన ‘ఇది నీ సొంత జుట్టేనా’ అనడిగారు. అవునండి అన్నాను. కాళ్లు చూపించమ్మా అన్నారు. చూపించాను. వెంటనే ఇప్పుడు ఎలా ఉన్నావో, సినిమాలోనూ అలాగే ఉండాలి. మేకప్‌ అంతా నేను వేయను అన్నారు. చేస్తానని చెప్పాను. వెంటనే అగ్రిమెంట్‌ కూడా అయిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆంధ్రజ్యోతిలో ‘బాపు బొమ్మ – దివ్యవాణి’ అని న్యూస్‌ వచ్చింది. అది చూసి పెద్దపెద్ద దర్శకులు నాకు ఫోన్‌ చేశారు. దాసరిగారు ఫోన్‌ చేయడం నాకు బాగా గుర్తు. ఉదయం 6 గంటలకి, నేను ఇంకా నిద్రపోతున్నాను. ల్యాండ్‌లైన్‌కి ఫోన్‌ చేసి ‘బాపు బొమ్మ-దివ్యవాణి’ అని పేపర్‌లో వేశారు. నువ్వేనామ్మ? అని అడిగారాయన. అవునని చెబితే శుభాకాంక్షలు చెప్పారు.
సావిత్రిని చూసినట్టుందన్నారు…
‘పెళ్లి పుస్తకం’ మొదలుకావడానికి ముందు బాపుగారు ‘మిస్సమ్మ’ సినిమా చూశావా?’ అనడిగారు. నాకు సినిమా జ్ఞానం అస్సలు లేదు. క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ పరీక్షలు అయిపోతే, అదీ బ్రతిమిలాడితే ఎప్పుడైనా ఒక సినిమాకి పంపించేవారు. ‘చూడలేదండి’ అని చెప్పాను. ‘మిస్సమ్మ’లో ఉన్న క్యారెక్టర్‌ లాంటిదే నీది, చూడమని చెబితే, చూశాను. అప్పటికి బాపు విలువగానీ, బాపు బొమ్మ అంటే ఒక ఆడదానికి ఇంత గౌరవం ఉంటుందని గానీ తెలీదు. అటువంటి సమయంలో ‘పెళ్లి పుస్తకం’లో నటించడం నా భాగ్యం. దేవుడు కొన్ని అడిగితే ఇస్తాడు, కొన్ని అడక్కుండానే ఇస్తాడంటారు!! అలా నేను అడగకుండానే దేవుడు నాకిచ్చిన వరం ‘పెళ్లి పుస్తకం’. నాకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌ అంటే, ప్రివ్యూకి ఆరుద్రగారు వచ్చారు. సినిమా అయిపోయాక ఆరుద్రగారు ‘ఎవరు హీరోయిన్‌?’ అనడిగితే, నేను వెళ్లి ‘సార్‌ నమస్కారం’ అన్నాను. అప్పుడు ఆయన చెప్పిన మాట ‘మళ్లీ సావిత్రిని చూస్తున్నట్టుందమ్మ’ అని. ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను.
హ్యాట్రిక్‌ మిస్సయ్యా… చాలా బాధపడ్డా
రాజేంద్రప్రసాద్‌తో ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్‌’, శ్రీకాంత్‌తో ‘దొంగ రాస్కెల్‌’’, నరేష్‌తో ‘పెళ్లి కొడుకు’, ఇంకా ‘పెళ్లి నీకు శుభం నాకు’ అన్నీ మంచి పేరు తెచ్చాయి. తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేశాను. ‘మిస్టర్‌ పెళ్లాం’ విషయంలో నేను చాలా బాధపడ్డాను. నేను చేయాల్సిన సినిమా అది. బాపు-రమణలు కూడా నేనే నటించాలని చాలా ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. ఏదేమైనా, మరో మంచి ఆర్టిస్ట్‌ ఆ సినిమాలో నటించింది. నేను చేసిన దాని కన్నా ఆమని చేసినందుకు ఎక్కువ సంతోషపడుతున్నాను కానీ, కొన్ని పాలిటిక్స్‌ వల్ల ఆ సినిమాలో నేను చేయలేకపోయానన్నది కొంచెం బాధనిపించింది. ఈ మూవీ కూడా నేను చేసుంటే బాపుగారితో హ్యాట్రిక్‌ అయ్యేది. ఇండస్ర్టీలో నన్ను బాగా బాధపెట్టిన విషయమిది. బాపుగారితో ‘పెళ్లి పుస్తకం’, ‘పెళ్లి కొడుకు’, ‘కవి సార్వభౌమ’, ‘రాధాగోపాలం’ చేశాను. నేను హీరోయిన్‌గా నటించిన ఆఖరు సినిమా ‘దొంగ రాస్కెల్‌’.
వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కాలేదు…
మంచి పీక్‌ టైంలో ఉండగానే నాకు పెళ్లి అయిపోయింది. మావారి పేరు దేవానంద్‌. ఇండస్ర్టీలో దివ్యవాణి అంటే మంచి ఆర్టిస్ట్‌గా పేరు, మా పద్ధతులు, ఇంట్లో పెరిగిన పరిస్థితులు గురించి తెలుసు. పైగా నాపై ఒక్క రూమర్‌ కూడా లేదు. కాబట్టి సినిమా జీవితం మా వ్యక్తిగత జీవితానికి ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. ఒక బాబు కిరణ్‌ కాంత్‌, ఒక పాప కారుణ్యదేవి. బాబు ఇంజినీరింగ్‌, పాప టెన్త్‌ చదువుతున్నారు. మా వారు నా సినిమాలు చూసినప్పుడు సింపుల్‌గా బాగుంది అంటారంతే. పెళ్లి తరువాత నటించకూడదని షరతులేమి పెట్టలేదు. ఆ తరువాత కూడా నేను నటించాను. ‘కలవారికోడలు’, ‘పుత్తడి బొమ్మ’ సీరియల్స్‌ చేశాను. సినిమాలైతే బాపుగారు తీసిన ‘రాధాగోపాలం’ చేశాను. ఆఖరుగా ‘వీర’లో నటించాను. అందులో కడప అమ్మాయి పాత్ర నాది. ఓ సందర్భంలో
చోటాకె.నాయుడుగారు చెప్పారు – ‘పరుచూరి బ్రదర్స్‌ ఈ సినిమా చూసి బాపు బొమ్మ ఇలా కూడా ఉంటుందా’ అని అడిగారని. బాపు బొమ్మ కత్తిపట్టడం అంటే వింతే కదా మరి.
నిజమైన ఆర్టిస్ట్‌కి ఆ భావన ఎప్పుడూ ఉంటుంది…
టీవీలో నా సినిమాలు చూసినప్పుడు ఇంకాస్త బాగా చేస్తే బాగుంటుదని అనిపిస్తుంటుంది. చెప్పింది చెప్పినట్టు చేయడమే తప్ప, ఇంకేమి తెలియని వయసు అది. ఇప్పుడు చూస్తుంటే, ఇంకా బాగా చేసుండొచ్చు కదా అని అనిపిస్తుంది. నిజమైన ఆర్టిస్ట్‌కి ఈ భావన ఎప్పుడూ ఉంటుంది. ‘రాధాగోపాలం’లోనే తీసుకోండి, బాపు బొమ్మగా అంత పేరు తెచ్చుకున్న నేను, ఈ సినిమాలో వేణుమాధవ్‌కి జోడీగా కాసులమ్మ పాత్ర చేశాను. చాలామంది అన్నారు ‘కాస్త స్లిమ్‌ అయ్యి, మీరు, శ్రీకాంత్‌కి జంటగా చేస్తే ఇంకా బాగుండేది’ అని పెద్ద పెద్ద వాళ్లు ఫోన్‌ చేశారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చూపున్న పాపులర్ దర్శకుడు బాల చందర్ -మరియు విస్మృత మనీషి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముగ్గురు కలల బేహారులు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రపంచీకరణలో తెలుగు కథా సాహిత్యం

ప్రపంచీకరణలో తెలుగు కథా సాహిత్యం

  • – బానోత్ అనితబాయి, 9441680713
  • 22/12/2014
TAGS:

చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, ఉపాధి కోల్పోతున్న కుల వృత్తుల గురించి వ్యాఖ్యానించిన సాహిత్యం తెలుగులో విస్తృతంగా వచ్చింది. ప్రపంచీకరణ, అభివృద్ధీకరణ, నగరీకరణ తెచ్చిపెట్టే సమస్యలకుతోడు ప్రాజెక్టుల కింద భూములను తక్కువ ధరకు కొనుక్కుని వలసవాదులు తెలంగాణలో స్థిరపడ్డారు. దాంతో తెలంగాణ ప్రజలు వారి భుక్తినుండి, తరతరాల వ్యవసాయ కృషినుంచి, గ్రామాల నుండి మూలాల నుంచి దూరమై నైజాం పాలనకన్నా భయంకరమైన భూసమస్యను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ సంపదలను దోచుకొని తెలంగాణను వలస భూమిగా మారుస్తున్నారనే ఆవేదనను కథల్లో వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా పులుగు శ్రీనివాస్ ‘సంకర విత్తులు’, పి.చంద్ ‘్భ నిర్వాసితులు’, సుజాతారెడ్డి ‘గుడిసెలు గుడిసెలు’ కథలను ప్రత్యేకించి చెప్పవచ్చు.
ప్రపంచీకరణ వల్ల వ్యక్తికీ, సమూహానికి మధ్య ఒక కృత్రిమమైన దూరం ఏర్పడుతోంది. దాన్ని జయించడానికి చైతన్యవంతుడైన వ్యక్తి కొన్ని ప్రత్యామ్నాయాల్ని వెతుక్కోక తప్పదు. అది అనివార్యత. ఆ అనే్వషణకు ప్రధానమైన సాధనం స్థానికత. ఈ నేపథ్యంలో కాలువ మల్లయ్య కథలు రాసారు. నూతన వ్యవసాయిక, సాంకేతిక విధానాలు, పరిణామాలు, ఫలితాలు వస్తువుగా కలిగిన కథ ఇది. కుల వృత్తుల మూలాలను, వాటి విచ్ఛినాన్ని వాటిలో వచ్చిన ఆధునికీకరణను ఈ ‘పరారుూకరణ’ ఆవిష్కరించింది.
ప్రపంచీకరణ క్రమంలో గ్రామాలను, గ్రామ సంపదలను అందులో భాగంగా రైతు జీవితాన్ని ఆక్రమించుకొంటూ, మింగేస్తూ బహుళజాతి సంస్థలు విస్తరిస్తూ బలపడే క్రమాన్ని స్వామి రాసిన ‘తెల్లదయ్యం’ కథ సమర్థవంతంగా చిత్రించింది. కుల వృత్తులు అంతరిస్తూ జీవితాలలో తెచ్చే సంక్షోభాన్ని పెద్దింటి అశోక్‌కుమార్ తన కథలలో చిత్రించారు. ‘తెగిన బంధాలు’ కథలో పెండ్లిళ్ళ పద్ధతులు మారటంవలన కూరాడు కుండలకు, పోలు ముంతలకు పెళ్ళితంతులో స్థానం లేకుండాపోవటం అది కుమ్మరికి ఇంతకుముందున్న ప్రాధాన్యతను అభావం చేయటం, ఒక్క కుమ్మరులే కాదు డబ్బు పెట్టుబడి, వ్యాపారీకరణల ప్రాధాన్యతలో అభివృద్ధిచెందిన కొత్త పెండ్లి తీరులో చాకలి, మంగలి, మాదిగ మొదలైన అన్ని కులాల వాళ్ళూ ఉపాంతీకరించబడటం చిత్రితమయ్యాయి.
కాగుబొత్త కథ కుమ్మరి జీవన విషాదాన్ని చిత్రించిన కథ. జాతరలో చలివేంద్రం పెట్టడానికి మట్టికాగులు చేసే పని తండ్రి చేపడితే నీటి ప్యాకెట్లను అమ్ముకొనే కాంట్రాక్టు పట్టాడు కొడుకు. బతుకుతెరువు పాకులాటలో తండ్రీ కొడుకుల సంబంధాలు నిలబడనివే అయినాయి. నీళ్ళను ముల్లెగట్టి అమ్మే వ్యాపారం వచ్చి కాగు బొత్తకు స్థానం లేకుండా చేసిన క్రమంలో ఉన్న హింస ఈ కథ వివరిస్తుంది. వ్యాపార సంస్కృతి గ్రామీణ సహజ వనరులను కొల్లగొట్టే ప్రమాదం ఎంతగా ఉందో ‘పేగు ముడి’ కథలో అశోక్‌కుమార్ సూచించారు. ‘కీలుబొమ్మలు’ కథలో ప్రపంచీకరణ క్రమంలో కార్పొరేట్ వ్యవసాయ విధానం గ్రామాలలోకి చొచ్చుకొని వస్తూ రైతుల, కూలీల జీవితంలో నింపుతున్న సంక్షోభాన్ని ప్రతిఫలించింది.
కాలువ మల్లయ్య రాసిన కథలు ఒకవైపు నూతన ఆర్థిక విధానాల కారణంగా గ్రామీణ వ్యవసాయిక జీవితంలో వచ్చిన సంక్షోభాన్ని, మరొకవైపు పారిశ్రామిక విధానాలలో వస్తున్న మార్పులను చిత్రించాయి. ‘నేల తల్లి’లో వ్యవసాయం గిట్టుబాటుకాక, పెట్టుబడులకు అప్పులు తేలేక, మార్కెట్ తనకు అనుకూలంగా లేక, వ్యవసాయం వదులుకోలేక రైతు పడే వేదనను చిత్రించింది. పారిశ్రామికీకరణం, ప్రపంచీకరణం, యాంత్రీకరణం, వ్యాపారీకరణం మొదలైన దుష్టశక్తులు పల్లె-పట్టణ ప్రజాజీవితాల్లో చేసిన గాయాలను గూర్చి ఎంతో ఆవేదన చెందుతూ తెలంగాణ కథకులు అద్భుతమైన కథలందించారు.
ఈ కథల్లో మట్టివాసనలు మాయమవుతున్న తీరు, గ్రామ స్వరూప స్వభావాలు, వృత్తులు నశించిపోతూ పనిముట్లు మూలన పడేయాల్సి వచ్చి బాధపడే తీరు, భూములు అన్యాక్రాంతం కావడం, జానపద కళలు అడుగంటిపోవడం, వలసలు అనివార్యం కావడం, ఫ్యాక్టరీల మూసివేతతో బతుకుదెరువు కోల్పోయిన దీనస్థితికి దిగజారి మనోవేదన చెందుతూ, ఆత్మహత్యల పర్వంతో వాస్తవ జీవిత గాథలను అక్షరీకరించడం కనిపిస్తుంది. రెండవ తరం రచయితలు కథలు రాసేనాటికి రాయలసీమలో చెప్పుకోదగ్గ మార్పులు చాలానే వచ్చాయి. స్కూళ్ళు, కాలేజీలు బహుళ సంఖ్యలో పెరిగాయి. సెకండరీ స్థాయివరకూ ఉచిత విద్య లభించటంవల్ల మధ్యతరగతికి విద్య అందుబాటులోకి వచ్చింది. పల్లెపల్లెకూ రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. కపిల మోటల స్థానంలో కరెంటింజన్లు వచ్చాయి. కొంత కాలం గడిచేసరికి గొట్టపు బావులు వచ్చాయి. ఇంతకుముందు శ్రమను పెట్టుబడిగా మార్చి పంటలు పండించే రైతులు ఇప్పుడు డబ్బును పెట్టుబడిగా చేసి వ్యవసాయం చేయటం వల్ల క్రమంగా చితికిపోతున్నారు. ఓట్ల రాజకీయాల జోరు క్రమంగా పెరిగింది. ఓట్లకోసం రాజకీయ నాయకులు అమాయకపు పల్లెల్ని రెండువర్గాలుగా చీల్చటం ప్రారంభించారు. కులం మునుపెన్నడూ లేనంతగా పడగ విప్పింది. ఫ్యాక్షన్ పెరిగింది.
రాయలసీమ రైతుకు పండే పంటలు అంతంతమాత్రం. తీరా దాన్ని అమ్మబోతే ఎలాంటి మోసానికి, దోపిడీకి గురౌతున్నాడో తెలియజెప్పే కథలు రచయితలు రాసారు. శాంతి నారాయణ రాసిన ‘దళారీ’, సింగమనేని నారాయణ రాసిన ‘అడుసు’లాంటి కథలు ఇందుకు మంచి ఉదాహరణలు. అంతేకాదు ఈ నేపథ్యం పలు సందర్భాల్లో ఉత్తరాంధ్రకు చెందిన గ్రామీణ, సెమీ, అర్బన్, గిరిజన్ ప్రాంతాలకు చెందినది కావడంతో స్థానిక ముద్ర ఆయా కథలకు మరికొంత ప్రత్యేకతను సమకూర్చింది. అవాంఛనీయ యంత్ర నాగరికతలో చేతి వృత్తులను వెలివేస్తున్న పల్లెలు, ఈ హృదయ విదారక దృశ్యాలన్నీ ‘్భమి పుండు’, ‘తిరుగుడమ్మి’, ‘నీటి ముల్లు’, ‘ఏటి పాట’, ‘వలస పక్షి’ కథల్లో ఆవిష్కరించారు గౌరునాయుడు.
వృత్తులు నశించి ప్రత్యామ్నాయం లేని బతుకుతో జనం విలవిలలాడుతున్నారు. కొన్ని సంస్కృతులు, భాషలు కనుమరుగయ్యే పరిస్థితులొస్తున్నాయి. మానవతా విలువలు మృగ్యమవుతున్నాయి. సేవాభావం నశించి స్వార్థం పెరిగిపోతుంది. డబ్బుకు ప్రాముఖ్యం ఎక్కువై రక్తసంబంధాలను కూడా నశింపచేస్తుంది. మనుషుల మధ్య, జాతుల మధ్య, ప్రాంతాల మధ్య వైరుధ్యాలు ఎక్కువవుతున్నాయి. ‘మానవుణ్ణి అమానవుడిగ మార్చే పెట్టుబడిదారి వ్యవస్థ పరిణామ రూపం సామ్రాజ్యవాదం, దాని అంతిమ దశ ప్రపంచీకరణ.’ పెరుగుతున్న ప్రపంచీకరణలో పెరుగుతున్న డబ్బు అవసరాలు, ప్రాధాన్యత, వృత్తి పనివాళ్ళ జీవితాలలో వస్తున్న సంక్షోభం వీటికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి ఆవిష్కరించటంలో తెలుగు కథకులు సఫలీకృతులవుతూ రచయితలుగా తమ సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తున్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంటి ముందు గొబ్బెమ్మలు -బామ్మగారి రంగ వల్లులు, హరిదాసు చిందులు ముందే వచ్చిన సంక్రాంతి శోభ -28-12-14

మా ఇంటి ముందు గొబ్బెమ్మలు -బామ్మగారి రంగ వల్లులు, హరిదాసు చిందులు  ముందే వచ్చిన సంక్రాంతి శోభ -28-12-14
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఏకత్వంలో భిన్నత్వం.. ఆధునిక భాషాశాస్త్రం

ఏకత్వంలో భిన్నత్వం.. ఆధునిక భాషాశాస్త్రం

  • – సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి
  • 22/12/2014
TAGS:

చదువుకున్న వాళ్లు మాట్లాడే భాషకూ, చదువుకొనని వాళ్లు మాట్లాడే భాషకూ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందువల్ల? చదువుకొననివాళ్లు మాట్లాడేభాష వారి వారి ప్రాంతీయ మాండలిక భాష రూపంలో ఉంటుంది. చదువుకున్నవాళ్ల భాష దాదాపు 80 శాతం సంస్కృత పదాలతోనే నిండి ఉంటుంది. అందువల్లనే ఆ వ్యత్యాసం. చదువుకున్న వారి భాషను ‘శిష్ట వ్యవహార భాష’, లేక ‘ప్రమాణ భాష’ అంటారు. చదువుకోని వారి భాషను ‘జానపద భాష’ లేక ‘మాండలిక భాష’ అంటారు.
‘ప్రమాణ భాష’కు ముఖ్యంగా ఆరు లక్షణాలు కానవస్తాయి. 1) సమాజంలోని ఎక్కువ మందికి- నగరాలలో గ్రామాలలో నివసించే చదువుకున్న వారికీ, చదువుకొనని వారికీ అనగా చదువుకొనక పోయినా చదువుకున్న వారు అనుసరించే వారికీ అత్యధిక శాతం ప్రజలకు ‘ప్రమాణ భాష’ ఆమోదయోగ్యంగా ఉంటుంది. 2) ప్రమాణ భాష నేర్చుకొనడమే విద్యావంతుల ప్రధాన అర్హతగా, లక్ష్యంగా గుర్తింపబడుతున్నది. అందువల్లనే విద్యాబోధన అంతా ప్రమాణ భాషలలోనే జరుగుతుంది. 3) జానపదాలు, మాండలికాల ప్రయోగం కంటె ప్రమాణ భాషా ప్రయోగానికే వ్యాప్తి ఎక్కువ. ఉపన్యాసాలు, కవిత్వాలు,వచన రచనలు, వార్తాపత్రికలు, సినిమాలు, రేడియో, టెలివిజన్ మొదలైన విజ్ఞాన వ్యాపక సాధనాలన్నీ ప్రమాణ భాషనే వాడతాయి. 4) విద్యావంతుల సాంస్కృతిక, వైజ్ఞానిక ఐకమత్యానికి సంకేతంగా ప్రమాణ భాష గొప్ప పాత్ర నిర్వహిస్తుంది. ప్రజల ఐకమత్యానికి సంకేతం ప్రమాణ భాష అయితే వాళ్లను విడదీయడానికి దోహదం చేసేవిగా ప్రాంతాలకు, వర్గ మాండలికాలు తమ పాత్రలను నిర్వహిస్తాయి. 5) ప్రమాణ భాష ప్రాథమికంగా ఏదో ఒక ప్రాంతంలో ఉండి హెచ్చుగా చదువుకున్న వారి వాడుక భాష ఆధారంగా ఏర్పడి దానిలో కొద్దికొద్దిగా జానపదాలను, మాండలికాలనూ కలుపుకుంటూ వ్యాప్తం అవుతుంది. 6) కొన్ని భాషల్లో ప్రాచీన కావ్య భాషనే ప్రమాణ భాషగా వ్యవహరించడం జరుగుతుంది. అట్టి సందర్భాలలో మాండలికాల ప్రభావం ప్రమాణ భాషపై హెచ్చుగా ఉండదు.
నాలుగు మండలాలుగా తెలుగు ప్రజల విభజన
తెలుగు భాషలో నాలుగు మండలాలను గుర్తించడానికి వీలు కలిగిందనీ, ఒకటి- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు గల ‘పూర్వమండల’మనీ, రెండు- రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు గల ‘దక్షిణ మండలమ’నీ మూడు- తెలంగాణా, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో కోస్తా, రాయలసీమలను ఆనుకొని ఉన్న తాలుకాలు తప్ప మిగతా ప్రాంతంగల ‘ఉత్తర మండలం’ అనీ 4 ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు గల ‘మధ్య మండలమనీ’ – సామాజిక భాషా శాస్త్ర పితామహుడైన భద్రిరాజు కృష్ణమూర్తిగారికి వృత్తి పదకోశాల నిర్మాణంలో సహాయకుడుగా వ్యవహరించిన డాక్టర్ పొరటి దక్షిణమూర్తి తెలియజేశారు. ఈ నాలుగు మండలాలలోనూ వివిధ వృత్తులవారు వాడే తెలుగు పదాలలో కొన్ని తీవ్ర వ్యత్యాసాలూ, కొన్ని స్వల్ప వ్యత్యాసాలూ కూడా ఉన్నాయి. అయితే ఈ వేర్వేరు పదాలకు అన్నింటికీ వౌలికమైన అర్థాలిచ్చే వౌలిక మూలాధార సంస్కృత పదాలు ఉండడం భాషా శాస్త్ర పరిశోధనలు, అధ్యయనంలో ఉత్సాహం కలవారు అందరూ గమనించదగిన విషయం.
అన్ని తెలుగు పదాలకూ వేద సంస్కృత మూలాలు
‘నాగలి’ అనే పదం, రెండు మండలాల్లో ‘నాగలి’ అనే వాడుకలో ఉండగా ఒక మండలంలో మాత్రం ‘నాగేలి’ అని వాడుకలో ఉంది. ఈ పదాలకు సంస్కృత మూలం మామూలుగా వాడుకలో ఉన్న సంస్కృత పదం ‘హలం’ కాదు, కాజాలదు. కాని మామూలుగా వాడుకలో లేని సంస్కృత పదం ఒకటి ఉన్నది. ‘లాంగలి’, లాంగల అని, ‘ఈ ‘లాంగల’ అనే సంస్కృత పదం చదువురానివారి వాడుకలో ‘నాగలి’గా వాడుకలోనికి వచ్చిందని మనం ఊహించలేమా? ‘మోటబావి’లోని ‘మోట’ అనే పదం కూడా మరో రెండు మండలాల్లో వాడుకలో ఉంది. ఒక మండలంలో మాత్రం ‘కపిల’ అనే పదం వాడుకలో ఉంది.
మాండలికాలకు మూలం ప్రాచీన ద్రావిడ భాషలు
ఇలా అన్ని మాండలిక పదాలకూ వౌలిక రూపాలైన వేద సంస్కృత పదాలు కొద్ది శ్రమచేసి పరిశీలిస్తే ఎవ్వరికైనా తప్పక లభిస్తాయి. కాని ‘ఈ మాండలిక పదాల మూల రూపాలు వేద సంస్కృత పదాలు కాదు. ద్రావిడ పదాలు మాత్రమే వాటి మూల రూపాలు. అట్టి ప్రాచీన ద్రావిడ భాష సమగ్ర రూపాన్ని కనుగొనడానికే మేమిప్పుడు కృషిచేస్తున్నాం’ అంటున్నారు కొందరు మహానుభావులు. సూర్యోదయాన్ని చూడడానికి తూర్పు దిశగా పయనించడానికి బదులు పడమటి వైపుగా ఎంతో ఉత్సాహంతో, ఉద్రేకంతో, ఉద్వేగంతో అడుగులు వేస్తూ-. దాన్ని పురోగమనం అంటారా? ‘తిరోగమనం’ అంటారా? విజ్ఞులే గ్రహిస్తారు. ఇలా దక్షిణదేశాలన్నిటిలోకీ మొట్టమొదటగా భారతదేశంలో, అందునా ఆంధ్ర ప్రదేశాలు తెలుగు భాషలో వృత్తిపదకోశాలు తయారుచేసి- చూశారా? ఈ ద్రవిడ భాషలలో ఎంత వైవిధ్యం ఉన్నదో? ఇంతటి సమగ్రమూ, నిర్దుష్టమూ అయిన ద్రావిడ భాషా చరిత్ర రాయడానికి అనాగరిక భాషా సామగ్రి ఎంత అవసరమో గ్రహిస్తున్నారా? అని ఒకప్పుడు సామాజిక భాషా శాస్త్ర పితామహులు భద్రిరాజు కృష్ణమూర్తి అనడం ఆశ్చర్యం కలించక మానదు. ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం పరిశీలింవవలసి యున్నది. అదేమిటంటే- అసలు ‘శాస్త్రం’ అంటే ఏమిటి? ‘శాస్త్రం’ ప్రయోజనం ఏమిటి? అని. సృష్టిలోని మానవ జీవితంలోని వివిధ విషయాల పరిణామక్రమాన్ని యధాతథంగా తెలియపరుస్తూ, ‘ఈ క్రమమే, ఈ విజ్ఞానమే అనుసరణీయం’ అని శాసించేది ‘శాస్త్రం’. ఇలా శాసించడం వలన ప్రయోజనం ఏమిటి?
శాస్త్ర ప్రయోజనం భిన్నత్వంలో ఏకత్వం
ఇలా శాసించడం వలన, అనగా శాస్త్రం వలన ప్రయోజనం ఏమిటి?- అంటే- భిన్నత్వంలో ఏకత్వాన్ని సందర్శింపజేయడం.. తద్వారా ప్రతి మనిషి మనస్సునకూ ఏకాగ్రతను లభింపజేసి- తద్వారా అమంద ఆనందానుభూతిని కలిగించి జన్మచరితార్థం అయిందనే సంతృప్తిని కలిగించడం. మనస్సు ఏకాగ్రమై ఉండడమే ఆనందానికి ప్రతీక. మనస్సు పరిపరివిధాలుగా సంచరిస్తూ ఉండడమే అన్నిరకాలైన ఆందోళనలకు దుఃఖానికీ కారణం.
ఏకత్వంలో భిన్నత్వం సృష్టించే వారు ఏం చెయ్యాలి?
చదువుకున్న వాళ్లందరూ మాట్లాడే ‘ప్రామాణిక భాష’లో 80 శాతం సంస్కృత పదాలు, 20 శాతం మాత్రమే మాండలికాలూ ఉండగా మనం మాట్లాడుతున్న, వ్రాస్తున్న భాష అంతా- ‘్భష’ అనే పదంతో సహా ‘సంస్కృతమే’ అయి ఉండగా- ‘సంస్కృతం’ ఈ భాషలకు మూలం కాదు- ఈ ద్రావిడ భాషలన్నింటికీ మూలమైన ‘మూల ద్రావిడ భాష’ ఎక్కడ ఏ ప్రాంతంలో విశేషంగా వాడుకలో ఉందో పరిశోధించి ప్రజల ముందు ఉంచాల్సి ఉన్నది. ఈ ద్రావిడ భాషలకూ, ఆర్యల భాష, వేద భాష దేశ భాష అయిన సంస్కృతానికీ ఎక్కడా ఏ సంబంధమూ లేదు’ అంటూ తన భాషలోనే తన మాటల్లోనే 80 శాతం సంస్కృత పదాలను ఉపయోగిస్తూ ప్రకటించడం- వితండవాదం తిరోగమన వాదం కాక మరేవౌతుంది? ఇలా తిరోగమన దిశగా భాషా శాస్త్ర ప్రస్థానం జరుగుతుంది. అవాక్కులై చూస్తూ ఊరుకుండేవారిని ఏమని ప్రశంసించాలో అర్థం కావడంలేదు. తాటాకుల చప్పుళ్లకు కుందేళ్లు బెదరవులే అని దీని అర్థమా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్షరాలలో ఒధిగిన వ్యధార్థ కథలు

TAGS:

కథా వార్షిక – 2012
మధురాంతకం రాజారాం
సాహిత్య సంస్థ
వెల: రూ.60/-
ప్రతులకు: డా.ఎం.నరేంద్ర
15-54/1, శ్రీ పద్మావతినగర్,
తిరుపతి-2.
మరియు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హవుస్ అన్ని బ్రాంచీలు

ఆధునిక సమాజం ముసుగులో ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని కథలుగా చిత్రిస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పే సంకలనమే ‘కథా వార్షిక- 2012’ మానవ జీవితాల్లోని పలురకాల కోణాల్ని ఇది బహిరంగంగా వ్యక్తపరుస్తుంది. ఈ లోతుపాతుల్ని తెలుసుకుని వీటిలోని కష్టనష్టాల తడిని పలకరించాలంటే ఒక్కసారి మనసు చూపుతో చుట్టిరావాల్సిందే!
తర్కబద్ధమైన హేతువాదానికి మానవీయ కోణాన్ని కర్తవ్య నిర్వహణ బాధ్యతారూపంలో ప్రకటించిన కథలాంటి.. జీవితం కథ ’దేవుణ్ణి అటకాయించిన మనిషి’ దీని రచయిత మెహర్ గొప్ప ఆశను కలిగిస్తుంది.
బహుళజాతి సంస్థ తమ పునాదులను పటిష్టం చేసుకోవడానికి భారతదేశంలోని ఆంధ్రరాష్ట్రంలో నాగరాజనే వ్యాపార విషయాల ఇన్‌చార్జి వేసిన పథకానికి, గ్రామస్థాయిలోని సామాన్య ఉమ్మడి ప్రతినిధి తిప్పణ్ణ చేతిలో ఏవిధంగా పరాభవం చెందాడో చాటి చెప్పేదే ‘ఒక దళారీ పరాభవం’ కథ. జి.ఉమామహేశ్వర్ రాసిన ఈ కథ సామ్రాజ్యవాదంలో భాగంగా ప్రపంచీకరణ పేరుతో జరుగుతున్న మోసానికి నిలువెత్తు దర్పణంలా నిలుస్తుంది.
‘గోమేజ్ ఎప్పుడొస్తాడో’ కథను వేలూరి వెంకటేశ్వరరావు రాసారు. అమెరికా నేపథ్యంలో రాసిన ఈ కథ గోమేజ్ లోపలి మనిషిని పరిచయం చేసి మనిషితనానికి సంబంధించిన ఒక ఆశను మనలో మిగిల్చిపోతుంది.
కథాంశానికి వస్తే-ఇంటి బయట ఉన్న లాన్‌ని కొయ్యడానికి గోమేజ్‌ని బేరమాడుకుంటారు సుజాత-కేథరిన్‌లు. గోమేజ్‌కు తోడుగా మార్సిలినోను తెచ్చుకుని ఆడుతుండగా మోవర్ పల్టీకొట్టి గోమేజ్‌కు గాయమై రక్తస్రావం కావడంతో హాస్పటల్‌లో జాయిన్ చేస్తుంది సుజాత. కానీ అతనక్కడినుండి పారిపోతాడు. వెతుక్కుని వెళ్లినా ప్రయోజనం కనిపించక ఆశవదులుకుంటుందామె. కొన్ని రోజుల తరువాత ఒక ఉత్తరాన్ని చదువుతుంటే-గోమేజ్ మాటలు గుర్తుకొచ్చి మనసు తడితో కంటనీరు పెట్టుకోవడంతో ఈ కథ ముగుస్తుంది. గొప్ప మానవతా దృక్పథం తొణికిసలాడి చెరగని ముద్ర వేస్తుందిది.
‘కాళాపు కథ’ గొప్ప శిల్ప వైవిధ్యంతో కొనసాగుతుంది. దీని రచయిత్రి మన్నం సింధుమాధురి.
‘కలాపు’ అని పిలువబడే ‘బిసివిని’ గౌడుతోపాటు అనేక మంది అనుభవిస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. ఈ క్రమంలో ఓ కొడుకు పుట్టాక, వాడు పెరిగి పెద్దవాడై అనుకోని రీతిలో గౌడు మిత్రుణ్ణి చంపి పారిపోతాడు. కొన్నాళ్లకి కాటి పాపడితో కలాపు లేచిపోయిందనే పుకారు గౌడుద్వారా లేస్తుంది. జోగిని వృత్తిలో ఉండే వారి జీవితాల్ని, ఎదురైన చేదనుభవాల్ని చాలా ఆర్ద్రంగా, విషాదభరితంగా ఈ కథ రూపుకడుతుంది.
మంచి కథాకథనంతో ఆద్యంతం రక్తికట్టించే కథ ‘కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్లు’. విమల రాసిన ఈ కథలో ఒకనాటి జ్ఞాపకాల సంఘటనను నెమరేసుకుని దాని మూలాలు వెతుకులాట కనిపిస్తుంది.
ఇతివృత్తానికొస్తే..ఉద్యోగరీత్యా కొనే్నళ్ల క్రితం ఆమె పనిచేసిన ప్రాంతంలో ఎన్నికల గందరగోళ స్థితిలో, ఉద్యమకారులు తిరుగాడుతుండగా- కొంతమంది కుర్రకారు వేర్వేరు బాధ్యతలతో గుంపులుగా విడిపోతారు. అందులో తిరుపతి, మాధవులు ముఖ్యులు. మాధవ ప్రేమించిన అమ్మాయి జ్యోతి. వాళ్ల పెద్దలు అంగీకరించరు వాళ్ల ప్రేమను. కానీ ఈలోగా అప్రయత్నంగా పోలీసు కాల్పుల్లో కుర్రాళ్లిద్దరు మృతి చెందుతారు. ఇవన్నీ పెళ్లిలో కలుసుకున్న ఆమెతో జ్యోతి భోజన సమయంలో కలుసుకుని గతాన్ని తలుచుకుని బాధపడుతుంది. అందులో భాగమే ఒకనాటి నక్షత్రకాంతి, అవ్యక్తానంద స్థితికి వెదుకులాటకి దారి తీయిస్తుంది. విషాదరేఖలు పురివిప్పి ఆర్ద్రపూరితమైన ముగింపునిస్తాయి.
ఒక ప్రధాన పాత్రతో కథను నడిపిస్తునే మధ్యమధ్యలో శివాని, బసంతి లాంటి చిన్నచిన్న పాత్రలతో జ్ఞాపకాల మధ్య అనే్వషిస్తుంటే అసంపూర్ణ జీవితానికి నిర్లిప్తత, పశ్చాత్తాప భావన వెదుకులాట వెంటాడుతాయి ‘వాంగ్మూలం’ కథలో. వీటికి కొసమెరుపుగా ఒక ఆత్మహత్య మరణ వాంఛతో ఊపిరాడని తనాన్ని మిగుల్చుతుంది ఇందులో. చాలా వైవిధ్యపూరితమైన కథనం కనిపిస్తుంది. శిల్పరహస్యం కూడా కొత్తగా అనిపిస్తుంది. స్వాతికుమార్ దీనిని రాసిన రచయిత్రి.
అంటరానితనం కేంద్రంగా శ్రమ జీవన ప్రాధాన్యతను వివరించి చెప్పిన కథ ‘కాకికి కడివెడు పిచ్చిక్కి పిడికెడు’ కథ. స.వెం.రమేశ్ రాసిన శైలి సరళమైంది. సున్నితమైంది. కాకమ్మకు అమ్మను, పిచ్చుకమ్మకు మంగమ్మను ప్రతీకగా చేసి ఇద్దరు తల్లుల బిడ్డలతో నాలుగు తరాల మనుషుల చరిత్రను చిత్రించిన తీరు అబ్బురపరుస్తుంది. అందర్నీ చదివింపచేస్తుంది.
‘కథలు లేని కాలం’ కథను రాసిన రచయిత్రి ఓల్గా. ఎనిమిదేళ్లు పెంచిన మనుమరాలు అనన్య తిరిగి ఎనిమిదేళ్ల తరువాత అమెరికానుండి తిరిగి వస్తుంది. గతంలో అమ్మమ్మ చేత కథలు చెప్పించుకోవడానికి అలవాటు పడిన ఆ పిల్లకి, కొనే్నళ్ల తర్వాత కొత్తగా కథలు మార్చి చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. అనన్యకి అమ్మమ్మైన సుమిత్ర ప్రేమించి పెళ్లి చేసుకుని పల్లె జీవితంలో రంగారావుతో స్థిరపడిపోవడాన్ని ఇష్టపడని కూతురు శ్రావణి, కొనే్నళ్లకు బాగా చదువుకుని వేరొకతనిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది. అలా శ్రావణికి పుట్టిన కూతురు అనన్యతోనే ఈ కథంతా నడుస్తుంది. కథన చిత్రణలో విలక్షణమైన కొత్త పార్శ్వాలను తడిమి చూపారు. ఇందులో రచయిత్రి ఓల్గా ప్రత్యేక ముద్ర తప్పక కనిపిస్తుంది.
‘దావత్’ కథ మహమద్ ఖదీర్‌బాబు శిల్ప నిర్మాణ పద్ధతిని కొత్తకోణంలో పాఠకులకు పరిచయం చేస్తుంది. ఆడ ముస్లిం పెళ్లింట జరిగిన భోజన కార్యక్రమంలో భాగంగా తిండి విషయంలో తలెత్తిన చిన్న తగాదా చివరికి పరిస్థితిని ఏ స్థాయికి దిగజారుస్తుందో తెలియజెప్పే కథ ఇది. మగపెళ్లి వాళ్ల పెత్తనం అన్నింటా ఆధిపత్య ధోరణి కలిగించి అస్లాం లాంటి తండ్రుల పాలిట ఎలా శాపంగా మారుతుందో ఇది వివరిస్తుంది. చాలా సహజంగా సాగి జీవన సత్యాన్ని ఆవిష్కరింపచేస్తుంది.
ఇలా వస్తు వైవిధ్యం పుష్కలంగా కలిగిన ఈ కథలు జీవన సంఘర్షణలను ఎత్తి చూపడమే కాకుండా, అందులోని కరుణ రసాత్మక దృశ్యాలను ఆకర్షీకరించి ఆలోచింపచేస్తాయి. డా.వి.చంద్రశేఖరరావుగారు ఒక కథా సమయంలో పేరుతో ఈ కథలపై ఇచ్చిన విశే్లషణలు సమగ్రంగా, సందర్భానుసారంగా మానవతా పరిమళాలను అద్ది ఈ కథావార్షికకు నిండుదనాన్ని చేకూర్చాయి. ఇందులోని తొమ్మిది జీవన చిత్రాల్ని ప్రతిబింబించి సాహిత్య లోకానికి కొత్తదారులు తెరలు తెరిచాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రుద్రవీణపై కోటి రాగాలు ప్రతులకు: డా.జలంధర్‌రెడ్డి,

రుద్రవీణపై కోటి రాగాలు
ప్రతులకు: డా.జలంధర్‌రెడ్డి,
ఇంటి నెం.12-13-336,
ప్లాట్ నెం.465,
వీధి నెం.2, తార్నాక,
సికింద్రాబాదు- 500 017.
మొబైల్.9848292715
వెల: రూ.200/-; పుటలు: 230.

డా.జలంధరరెడ్డి మహాకవి దాశరథి గురించి పెద్దఎత్తున సదస్సు నిర్వహించి ఆ ప్రసంగ పత్రాలతో ఒక బృహగ్రంథాన్ని వెలువరించారు. పాత పత్రికల్లో వచ్చిన వ్యాసాలన్నింటిని ఎంతో శ్రమకోర్చి సేకరించి 800 పుటల మరో గ్రంథాన్ని ప్రకటించారు. ఈ రెండు పుస్తకాలు దాశరథిని గురించి మాట్లాడే వారందరికీ ప్రధాన ఆధార గ్రంథాలుగా నేడు ఉపయోగపడుతున్నాయి. జలంధరరెడ్డి అం తటితో ఆగక రుద్రవీణపై కోటి రాగాలు పేరుతో దాశరథికి 81 మంది కవులతో కవిత్వ నీరాజనాన్ని సమర్పించారు.
దాశరథీ! మనోజ్ఞ కవితాశరధీ! శరదిందు చంద్రికా
పేశల కావ్యఖండముల పండిన నీ కలమందునన్ మహో
గ్రాశనిపాతముల్ వెలయునౌర! మహేశుని కంటిలో సుధా
రాశి తరంగముల్ కటు హలాహల కీలలు పొంగినట్లుగా.
(పుట.27).
-అన్న డా.సి.నారాయణరెడ్డి ‘‘జలపాతం’’ అంకిత పద్యాలు ఈ గ్రంథానికే మకుటాయమానం. నారాయణరెడ్డి దాశరథిని అగ్రజునిలాగ భావించారు. ‘‘అన్నలు లేని చింత హృదయాంతికమందు జనింపకుండా చేసి తమ్ముడాయని మనస్సుమముల్ విరబూయ’’ సినారెను సంభావించిన వ్యక్తి దాశరథి.
మద్దూరి రామమూర్తి, ఆశావాది ప్రకాశరావు, ఉన్నత జ్యోతివాసు, రామడుగు వెంకటేశ్వరశర్మ, ఎన్.యాదగిరిశర్మ లాంటి వారి పద్యాలు. టి.వీ. భాస్కరాచారి, వేదాటి రఘుపతి లాంటి వారి గేయాలు, అనిసెట్టి రజిత, దర్భశయనం శ్రీనివాసాచార్య, గిరిజా మనోహరబాబు, తిరునగరి లాంటి వారి వచన కవితలు అలరిస్తాయి. దాశరథి పట్ల ప్రశంసోక్తులు పలకడం, ఆయన పుస్తకాల పేర్లు వచ్చేలా రాయడం, ఆయన కవితా పంక్తులను కూ ర్చడం లాంటి వ్యూహాలను కవులు అనుసరించారు.
‘‘వీధిలో నడుస్తుంటే కనిపించనంతటివాడు, కవిగా వీధిలోకి వస్తే శృంగాయమానంగా కనిపించే ధీరు డు’’అంటారు కనపర్తి రామచంద్రాచార్యులు (పుట. 182). ‘‘ప్రాచీన అర్వాచీన కవిత్వానికి వారధి ఒళ్ళంతా కవిత్వం, మనసంతా కవిత్వం అన్ని రసాలను గుప్పించి మెప్పించడం అతని తత్వం’’ (పుట.199) అంటూ జి.వెంకటేశ్వర్లు దాశరథిని ప్రస్తుతించారు.
రుధిర సంధ్యల్లోని భానుడు
నెత్తురు కక్కుతున్న వేళ
ఉషస్సుల్లేని నిశీధిలో చంద్రుడు
అశ్రువులు రాలుస్తున్నాడు
మోదుగుపూలు రక్తం పూసుకొని
అరుణకాంతులను వెదజల్లుతున్న వేళ
ఇటు వసంతము లేక కోకిలలు
ఆర్తనాదాలతో రోదిస్తున్నాయి
పాషాణ హృదయ పారావతాలు
కిక్కురు మనకుండా మిన్నకున్నాయి. (పుట 133)
-అంటూ గడ్డం మోహన్‌రావు రాసిన కవిత కమనీయంగా సాగుతుంది.
తెలుగు తేజముతోడ వెలుగురేఖలు జిమ్ము
కవి దాశరథి- తెలంగాణ యింట
అగ్నిధారను పోసి అశ్రుధారను ఆపె
గద! దాశరథి- తెలంగాణ కంట
బీడు బుర్రలలోన స్వేచ్ఛాన్నముల నివ్వ
గల దాశరథి- తెలంగాణ పంట
జన్మజన్మల బూజు జాడించి దులిపిన
ఘన దాశరథి- తెలంగాణ జంట
ఇల్లు చక్కదిద్ది కళ్ల కలత దీర్చి
సాగుచేయు రైతు జతగ నిల్చు
రణనినాది దాశరథి కృష్ణమాచారి
నవ్యకవితకు నిధి భవ్య సుకవి.(పుట 79) అంటున్న సల్ల విజయ్‌కుమార్ ఇట్లాగే తన రచనాభ్యాసాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో మంచికవి కాగలడన్న ఆశను రేకెత్తిస్తున్నారు.
దాశరథి ఆస్థాన కవిగా నియమితులయ్యారంటే- అదేదో ఆ దాయం ఉండే ఉద్యోగం కాదు. సంవత్సరానికి ఆరువేల రూపాయల గౌరవ పారితోషికమట. అంటే నెలకు ఐదువందల రూపాయలు అన్నమాట. ఆస్థాన కవి నియామకం ఉత్తర్వును ఈ గ్రంథంలో పొందుపర్చడంవల్ల చరిత్రకు మేలుచేసిన వారయ్యారు. భవిష్యత్తరాలు దాశరథి పట్ల ఏవేవో ఊహించుకోకుండా రక్షింపబడ్డాడు.
సర్వేపల్లి రాధాకృష్ణ, ఇందిరాగాంధీ, బూర్గుల రామకృష్ణరావు, జలగం వెంగళరావు, మదర్ థెరీసా, నీలం సంజీవరెడ్డి లాంటి నేతలతో, జాషువా, సినారె, దేవులపల్లి లాంటి సమకాలీన కవులతో దాశరథి దిగిన ఫొటోలు, ఆకాశవాణిలో పనిచేసినప్పటి ఫొటోలు అందంగా అదనంగా ఉన్నాయి. ఈ చిత్రాలను ఎక్కడో ఒకచోట ఇలా పొందుపరచకపోతే అవి కాలగర్భంలో కలిసిపోయేవి. దాశరథి లాంటి మహనీయుడికి ఎంత నివాళి అర్పించినా తక్కువేనన్నది వాస్తవం. దాశరధి సాహిత్యాన్ని చదవడమే ఆయనకు నిజమైన నివాళి అన్నది మరింత వాస్తవం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వాత్సల్య సేవ

ఎంత వాత్సల్యం!

 ఆడపిల్ల పుట్టిందని కొందరు చెత్తకుండీలో పడేస్తున్నారు. అంగవైకల్యంతో జన్మించిన పసికందులను రైల్వే ట్రాక్‌లు, రోడ్ల పక్కన పడేసి వదిలించుకుంటున్నారు. ఇలా ఎంతో మంది ఆడపిల్లలుగా పుట్టిన పాపానికి అనాధలు కాక తప్పడంలేదు.
తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఇలాంటి పిల్లలను శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని జనహిత వాత్సల్య సేవాసంస్థ అమ్మగా నిలుస్తోంది. వారికి ఓనమాల నుంచి ఉన్నత చదువులు చదివించి.. పునర్జన్మను ప్రసాదిస్తోంది. అనాధ పిల్లలకు అమ్మగా నిలిచిన వాత్సల్య సేవాసంస్థ గురించే ఈ కథనం..
అప్పుడే తల్లి గర్భం నుంచి పుట్టి కళ్లు కూడా తెరవని మూడు రోజుల పసికందును ఎవరో ఆసుపత్రి బయట అర్ధరాత్రి వదిలేసి వెళ్లిపోయారు. ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ పసికూనను ఆసుపత్రి సిబ్బంది చూశారు. చిన్నారిని దగ్గరకు వెళ్లి పరిశీలించగా పుట్టుకతోనే చేతి, కాళ్ల వేళ్లు అతుక్కుని ఉన్నాయి. ఒక కన్ను లేదు. మరొక కన్ను సగం మాత్రమే కనిపిస్తోంది. అయితే పుట్టిన బిడ్డ అంగవైకల్యమని ఆ తల్లిదండ్రులు వదిలేసి వెళ్లారని ఆసుపత్రి సిబ్బంది ఓ నిర్ధారణకు వచ్చింది. ఈ విషయాన్ని వాత్సల్య సేవా సంస్థకు సమాచారం అందించారు. వెంటనే వారు ఆ బిడ్డను తీసుకెళ్లారు. ఆ చిన్నారికి సావిత్రి అని పేరు పెట్టారు. గత ఎనిమిదేళ్ల నుంచి ఆలనాపాలనా ఆ సంస్థనే చూస్తోందిప్పుడు. అంతే కాదు త్వరలో సావిత్రి చేతులకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా సుమారు 110 మంది పిల్లలకు వాత్సల్య సేవాసంస్థ ఆశ్రయం ఇస్తోంది.
అనాధలకు ఆశ్రయం ఇచ్చేందుకు 1989లో నెల్లూరులోని కొండాయపాళెం రోడ్డు దగ్గర వాత్సల్య సేవా సంస్థకు వేదాంతం సంఘమేశ్వరశాసి్త్ర పునాది వేశారు. నెమ్మదిగా ఎకరా స్థలంలో వసతి, పాఠశాల భవనాలతో పాటు వృద్దాశ్రమం కూడా ఏర్పాటు చేశారాయన.
 

అన్నీ తామై..
అమ్మా, నాన్నకు దూరమై అనాధలైన చిన్నారులకు చక్కటి జీవితాన్ని అందించగల శక్తి ఒక విద్యకే ఉంది. అందుకే వారికి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు వాత్సల్య ప్రాంగణంలోనే విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ బడిలో చుట్టుపక్కల గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులకు తక్కువ ఫీజులు చెల్లించి చదువుకునే అవకాశం కల్పించారు. చదువుతో పాటు కంప్యూటర్‌ విద్య, ఆటపాటలు, కుట్లు, అల్లికలు, విష్ణు సహస్రనామ పారాయణం, యోగా, ధ్యానం లాంటి అంశాలలోనూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. వాత్సల్యలో చదువుకున్న విద్యార్థుల్లో ఎందరో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్నతస్థానాలకు వెళ్లడం విశేషం. తల్లిదండ్రులు ఒక ప్రమాదంలో మరణించడంతో 9వ తరగతిలో ఉన్నప్పుడు తమ్ముడిని తీసుకుని కార్తీక్‌ అనే ఓ బాలుడు వాత్సల్యకు వచ్చాడు. పై చుదువులు చదివించి ఇప్పుడు అహ్మదాబాద్‌లోని ఐసిఎస్‌ గ్రూపులో డేటాసెంటర్‌ ఆపరేషన్‌ మేనేజర్‌గా పని చేస్తూ ఏడాదికి రూ.6లక్షలు సంపాదిస్తున్నాడతను. తమ్ముడు ప్రస్తుతం వాత్సల్యలో ఉంటూ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు.
దాతల ఔదార్యమే కొండంత అండ….
దాతల సహాయంతోనే జనహిత వాత్సల్య సేవాసంస్థ ముందుకు వెళుతుంది. మనం చేసేది మంచి పనైతే దానికి నలుగురు తోడవుతారంటారు. అలాగే వాత్సల్య సేవలు కూడా ఎందరికో స్పూర్తినిచ్చాయి. తమ వంతు సహాయం చేస్తామంటూ దాతలు ముందుకు వస్తున్నారు. ప్రతి నెల సంస్థకు, నిర్వహణకు రూ.6 నుంచి రూ.8లక్షల వరకు ఖర్చవుతోంది. అందులో ప్రతీ పైసా దాతల నుంచే వచ్చినవే! హైదరాబాద్‌కు చెందిన ఎంసికెఎస్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఫుడ్‌ ఫర్‌ హ్యాండ్లీ సంస్థ ఏడాదిలో 11 నెలలు రూ.40వేల వరకు అందిస్తుంది. పాఠశాలకు రూ.5.5లక్షల విలువ చేసే వ్యానును అందజేసింది. చెన్నూరు వెంకటేశ్వరరెడ్డి అనే వ్యాపారి ఏటా రూ.3లక్షలు విరాళంగా అందజేస్తారు. ఇలా ఎంతో మంది మనసున్న మానవమూర్తులు ముందుకు వచ్చి ఆ అనాధ పిల్లలకు మేమున్నామంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గత రెండేళ్ల కిందట ఎంపీ నిధుల నుంచి వృత్తి విద్య శిక్షణ కేంద్రానికి రూ.10 లక్షలు కేటాయించారు. అనాధ పిల్లలే కాదు, సంస్థలో 30 మందికి పైగానే అనాధ వృద్ధులు ఉన్నారు. వాత్సల్య సేవాసంస్థ విద్యాసంస్థలన్నింటిని సాంబశివరావు చూస్తున్నారు. పిల్లలను ఆణిముత్యాలుగా తయారు చేయడమే ఆయన లక్ష్యం.
శాసి్త్ర స్ఫూర్తితోనే నడుపుతున్నాం..
వాత్సల్య సేవాసంస్థ సేవలు ఆ సంస్థ వ్యవస్థాపకులు వేదాంత సంఘమేశ్వరశాసి్త్రకి దక్కాలి. గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచవరం అగ్రహారంలో జన్మించిన శాసి్త్ర రాషీ్ట్రయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యకర్తగా పని చేసేవారు. ఒకసారి ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడు రైల్వేస్టేషన్‌లో ఉన్న అనాధ పిల్లలను చూసి చలించిపోయారు. స్పందించి ఊరుకోలేదు. వాత్సల్య సేవాసంస్థను నిర్మించారు. కొన్నాళ్ల కిందటే ఆయన కాలధర్మం చేశారు. శాసి్త్ర స్ఫూర్తితోనే ఇంతమంది పిల్లలను తీర్చిదిద్దగలుగుతున్నాము.
– సామంతుల గోపాల్‌రెడ్డి, వాత్సల్య సేవాసంస్థ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment